అది నా తప్పే.. చింతిస్తున్నాను: రాజమౌళి | Baahubali director SS Rajamouli REACTS to Sridevi's statement over Sivagami controversy | Sakshi
Sakshi News home page

అది నా తప్పే.. చింతిస్తున్నాను: రాజమౌళి

Published Sat, Jul 8 2017 9:32 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

అది నా తప్పే.. చింతిస్తున్నాను: రాజమౌళి - Sakshi

అది నా తప్పే.. చింతిస్తున్నాను: రాజమౌళి

ముంబై: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అందరికి తెలిసిన విషయమే. చిత్రంలోని ఒక్కొక్క పాత్రకు ఊపిరిపోసిన నటీనటులపై కూడా ప్రశంసల జల్లు కురిశాయి. అలాంటి పాత్రల్లో ముఖ్యమైనది శివగామి. అయితే ఈ పాత్రకు తొలుత శ్రీదేవిని తీసుకోవాలని రాజమౌళి భావించిన సంగతి తెలిసిందే.

ఆమె పలు డిమాండ్లు చేయడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని ఓ సందర్భంలో రాజమౌళి వ్యాఖ్యానించారు. దీనిపై తన తాజా చిత్రం ‘మామ్‌’ ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి స్పందించారు. తానేమీ ప్రత్యేకమైన డిమాండ్లు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ ఇంటర్వూలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. జరిగిన దానికి చింతిస్తున్నట్లు చెప్పారని ఆంగ్ల వెబ్‌సైట్‌ ఒకటి పేర్కొంది. అయితే ఇంటర్వూలో ఏ మీడియా సంస్ధ తీసుకుందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

ఆ అంశాన్ని బహిరంగ వేదికపై బయటపెట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అది తప్పేనని.. దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. నటి శ్రీదేవి అంటే తనకు అపారమైన గౌరవముందని చెప్పారు. ‘మామ్‌’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి మాట్లాడుతూ.. రాజమౌళి అలా అన్నారంటే తాను నమ్మలేకపోతున్నానని.. వాస్తవానికి తాను బాహుబలి చిత్రానికి ఎలాంటి డిమాండ్లు చేయలేదని చెప్పారు. ‘బాహుబలి’ గతమని.. దానిపై ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని.. తాను గతంలోనూ ఎన్నో పాత్రలు వద్దనుకున్నానని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement