బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..! | Ramya Kirshna ad is reason for Baahubali 2 Leakage Rumours | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..!

Published Thu, Apr 27 2017 1:40 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..!

బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..!

బాహుబలి 2 రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన స్టిల్స్, సీన్స్ హడావిడి మొదలైంది. లీకువీరులు సినిమా రిలీజ్కు ముందే బాహుబలి 2కు సంబంధించిన సీన్స్ను సోషల్ మీడియాలో పెట్టేశారు. అయితే వీటిలో బాహుబలి ఇంటర్వెల్ సీన్ అంటూ సర్క్యూలేట్ అవుతున్న వీడియో ఒకటి ఆసక్తికరంగా మారింది.

శివగామి గెటప్ లో రమ్యకృష్ణ కనిపిస్తున్న ఈ వీడియో ఏడాది కింద టీవీలలో వచ్చిన ఓ యాడ్కు సంబంధించిందని తెలిసి ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. బాహుబలి తొలిభాగం ఫీవర్ నడుస్తున్న సమయంలో ఆ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు పాత ఈ వీడియోనే బాహుబలి 2 ఇంటర్వల్ సీన్ లీక్ అంటూ సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement