Ramya Kirshna
-
‘అమ్మ’ పాత్రకు భారీ రెమ్యూనరేషన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు జయ జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చేందుకు ముందుకువస్తున్నారు. ఇప్పటికే నిత్య మీనన్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను ప్రకటించారు. సినిమాగానే కాక వెబ్ సిరీస్‌గానూ అమ్మ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటించనున్నారు. ఈ పాత్రలో నటించేందుకు రమ్యకృష్ణ భారీగా రెమ్యూనరేషన్ అందుకోనున్నారట. బాహుబలి తరువాత రమ్యకృష్ణ రేంజ్ తారా స్థాయికి చేరింది. ఈ బయోపిక్ వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉండటంతో రమ్యకృష్ణ భారీ పారితోషికం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో జయలలిత సినీ నటిగా ఉన్న సమయంలో వచ్చే సన్నివేశాల్లో యువ కథానాయిక ఆ పాత్రలో కనిపించనున్నారు. మూడు సీజన్లుగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌ను తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. -
హండ్రెడ్ డేస్ పక్కా!
యస్... ‘హండ్రెడ్ డేస్ పక్కా’ అంటున్నారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్! ఏ సినిమా? అంటే... పేరు పెట్టలేదింకా! అంటే... షూటింగ్ స్టార్ట్ చేయలేదులెండి! సెట్స్‌పైకి వెళ్లకముందే సినిమాపై అంత నమ్మకమా? అంటే... ఎవరైనా కథపై నమ్మకంతో సినిమా స్టార్ట్ చేస్తారు కదా! అయితే... ఆయన చెప్పేది సినిమా ఎన్ని రోజులు ఆడుతుందనేది కాదు, షూటింగ్ డేస్ గురించి! మలయాళంలో భద్రన్ అనే దర్శకుడు ఉన్నారు. ఆయన పన్నెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తే, ఏడింటిలో మోహన్‌లాల్ హీరోగా నటించారు. అంటే... ఈ హీరో, దర్శకుడి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత భద్రన్ మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ ట్రావెలర్‌గా మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు భాషలు మాట్లాడుతూ కనిపిస్తారట. రోడ్ ట్రిప్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ... అన్నీ ఉంటాయట! మోహన్‌లాల్‌తో పాటు తమిళ నటుడు శరత్‌కుమార్, నటి రమ్యకృష్ణలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కథ రాశారట! వాళ్లిద్దరూ కీలక పాత్రల్లో నటించనున్నారు. రమ్యకృష్ణ, శరత్‌కుమార్ నటిస్తుండటంతో తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాను డబ్బింగ్ చేస్తారేమో. వెయిట్ అండ్ సీ!! -
బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..!
-
బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..!
బాహుబలి 2 రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన స్టిల్స్, సీన్స్ హడావిడి మొదలైంది. లీకువీరులు సినిమా రిలీజ్‌కు ముందే బాహుబలి 2కు సంబంధించిన సీన్స్‌ను సోషల్ మీడియాలో పెట్టేశారు. అయితే వీటిలో బాహుబలి ఇంటర్వెల్ సీన్ అంటూ సర్క్యూలేట్ అవుతున్న వీడియో ఒకటి ఆసక్తికరంగా మారింది. శివగామి గెటప్ లో రమ్యకృష్ణ కనిపిస్తున్న ఈ వీడియో ఏడాది కింద టీవీలలో వచ్చిన ఓ యాడ్‌కు సంబంధించిందని తెలిసి ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. బాహుబలి తొలిభాగం ఫీవర్ నడుస్తున్న సమయంలో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పాత ఈ వీడియోనే బాహుబలి 2 ఇంటర్వల్ సీన్ లీక్ అంటూ సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.