హండ్రెడ్‌ డేస్‌ పక్కా! | Director Bhadran to return after a gap of ten years | Sakshi
Sakshi News home page

హండ్రెడ్‌ డేస్‌ పక్కా!

Oct 30 2017 6:07 AM | Updated on Oct 30 2017 6:07 AM

Director Bhadran to return after a gap of ten years

యస్‌... ‘హండ్రెడ్‌ డేస్‌ పక్కా’ అంటున్నారు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌! ఏ సినిమా? అంటే... పేరు పెట్టలేదింకా! అంటే... షూటింగ్‌ స్టార్ట్‌ చేయలేదులెండి! సెట్స్‌పైకి వెళ్లకముందే సినిమాపై అంత నమ్మకమా? అంటే... ఎవరైనా కథపై నమ్మకంతో సినిమా స్టార్ట్‌ చేస్తారు కదా! అయితే... ఆయన చెప్పేది సినిమా ఎన్ని రోజులు ఆడుతుందనేది కాదు, షూటింగ్‌ డేస్‌ గురించి! మలయాళంలో భద్రన్‌ అనే దర్శకుడు ఉన్నారు.

ఆయన పన్నెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తే, ఏడింటిలో మోహన్‌లాల్‌ హీరోగా నటించారు. అంటే... ఈ హీరో, దర్శకుడి మధ్య ఎంత అండర్‌స్టాండింగ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. 10 ఇయర్స్‌ గ్యాప్‌ తర్వాత భద్రన్‌ మెగాఫోన్‌ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాలో మోహన్‌లాల్‌ ట్రావెలర్‌గా మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు భాషలు మాట్లాడుతూ కనిపిస్తారట.

రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ... అన్నీ ఉంటాయట! మోహన్‌లాల్‌తో పాటు తమిళ నటుడు శరత్‌కుమార్, నటి రమ్యకృష్ణలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కథ రాశారట! వాళ్లిద్దరూ కీలక పాత్రల్లో నటించనున్నారు. రమ్యకృష్ణ, శరత్‌కుమార్‌ నటిస్తుండటంతో తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాను డబ్బింగ్‌ చేస్తారేమో. వెయిట్‌ అండ్‌ సీ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement