నేను చెప్పేది మీరంతా వినాలి! | Mohanlal Thudarum Movie Telugu Trailer Launch | Sakshi
Sakshi News home page

నేను చెప్పేది మీరంతా వినాలి!

Published Thu, Apr 24 2025 6:02 AM | Last Updated on Thu, Apr 24 2025 6:02 AM

Mohanlal Thudarum Movie Telugu Trailer Launch

మోహన్ లాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తుడరుమ్‌’. తరుణ్‌ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన హీరోయిన్ గా నటించారు. ఎం. రంజిత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. కాగా, దీపా ఆర్ట్స్‌పై పి. శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ చిత్రాన్ని ఈ నెల 26న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

 ‘ఆ గడ్డాన్ని ముట్టుకుంటే చేయి నరికేస్తా..., అన్నా.. మీరు ఇలా గడ్డం తడుముకుంటూ అయ్యోపాపం అని తిరిగితే ఎలా.., హేయ్‌.. ఈ గడ్డం ఉంటే ఎవరికిరా..ప్రాబ్లమ్‌.., ఓరేయ్‌ ఎందరో మహానుభావులు ఎక్కిన బండిరా ఇది.., ఈ కారు కోసం నువ్వు ఫ్యాన్‌లా ఈ స్టేషన్  చుట్టూ తిరుగుతూనే ఉండాలి, ఇక నేను చెప్పేది మీరంతా వినాలి!’ వంటి డైలాగ్స్‌ ‘తుడరుమ్‌’ ట్రైలర్‌లో ఉన్నాయి. ఓ ట్యాక్సీ డ్రైవర్‌ కుటుంబం, అతని కారు ΄ోలీస్‌స్టేషన్ లో చిక్కుకోవడం, ఆ తర్వాత వచ్చే సంఘటనల సమాహారంగా ఈ మూవీ ఉండబోతున్నట్లుగా ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. మణియంపిల్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్‌ అలీ, ఫర్హాన్‌ ఫాజిల్‌ , థామస్‌ మాథ్యూ, షైజో ఆదిమాలి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జేక్స్‌ బిజోయ్‌ స్వరకర్త. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement