Shobhana
-
జస్ట్ బ్రేక్... అంతే!
మనసుకి నచ్చిన కథ వచ్చే వరకూ కొందరు స్టార్స్ ఖాళీగా ఉంటారు తప్ప ఏ సినిమా పడితే అది చేయరు. కొందరికి నచ్చిన కథ వచ్చినా ఆరోగ్యం బాగా లేక ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వేరే వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొందరు బ్రేక్ తీసుకుంటారు. కారణాలు ఏమైనా ఈ మధ్య కొందరు స్టార్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత కెమెరా ముందుకి వచ్చి, ఆ తారామణులు చేస్తున్న, చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో లేడీ సూపర్ స్టార్‌గా నిలిచిపోయారు నటి విజయశాంతి. ‘నాయుడమ్మ’ (2006) సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లారామె. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.ప్రోఫెసర్ భారతి పాత్రలో తనదైన నటనను, భావోద్వేగాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఓ సినిమా కమిట్ అయ్యారు. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నారామె. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైజయంతీ ఐపీఎస్ అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఈ నెల 24న విజయశాంతి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె పాత్ర తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైజయంతీ ఐపీఎస్. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యునిఫామ్కి ΄ûరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం. మేమే తన సైన్యం’ అంటూ విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ⇒ తెలుగులో జేజమ్మగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు అనుష్క. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. 2018లో విడుదలైన ‘భాగమతి’ మూవీ తర్వాత ‘నిశ్శబ్దం’ (2020)లో కథానాయికగా నటించారు. ఈ రెండు చిత్రాలకు మధ్య ‘సైరా’లో అతిథి పాత్ర చేశారు. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చేశారు. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి కొత్త చిత్రాలు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఆమె ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో అంగీకరించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ‘ఘాటీ’ని తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ⇒ ‘ఛాతీ మీద చటాకు మాంసం లేదు నువ్వు పెద్ద రౌడీవా?, రేయ్.. నీకంటే పెద్ద రౌడీరా నేను.. ముందు నాతో కొట్లాడు.. సిద్ధిపేటలో అడుగు చాందినీ గురించి చెబుతారు’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నభా నటేశ్ చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకుల మనసుల్లో లోతుగా గుచ్చుకున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ.ఆ తర్వాత ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్’ వంటి మూవీల్లో నటించారు. కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ‘ఇస్మార్ట్ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్నారు నభా. ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె దాదాపు మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభూ’లో హీరోయిన్గా నటిస్తున్నారు నభా. ⇒ మలయాళ తార మమతా మోహన్‌దాస్ తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘యమదొంగ’(2007). ఈ చిత్రంలో ‘చంపేస్తాన్రా రేయ్.. ఆగండ్రా.. రేయ్ యాడికి పోతార్రా.. ఏదో ఒకరోజు దొరకాల.. నెల్లూరు ట్రంకు రోడ్డులో గుడ్డలూడదీసి తంతాను నాయాల్లారా..’ అంటూ ‘యమదొంగ’లో మమతా మోహన్‌దాస్ చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారామె.నాగార్జున హీరోగా నటించిన ‘కేడీ (2009) తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ‘రుద్రంగి’ (2023) చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు మమతా మోహన్‌దాస్. ఇటీవల ఆమె నటించిన ‘మహారాజ’ (విజయ్ సేతుపతి హీరో) సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ⇒ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభన. కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలందరికీ జోడీగా నటించారామె. ప్రత్యేకించి కార్తీ హీరోగా నటించిన ‘అభినందన’ (1988) సినిమాలో ఆమె నటన అద్భుతం. ఇక ‘సూర్య పుత్రులు’ (1997) తర్వాత దాదాపు పదేళ్లు తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె మోహన్‌బాబు, విష్ణు మంచు నటించిన ‘గేమ్’ (2006) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో దాదాపు పద్దినిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. ఈ చిత్రంలో శంబాల రాజ్యానికి చెందిన నాయకురాలు మరియంగా తనదైన నటనతో ఆకట్టుకున్నారామె. ఈ చిత్రం ఈ గురువారం (మే 27) విడుదలైంది. -
ఇరవయ్యేళ్ల తర్వాత యాభైఆరవ చిత్రంలో...
మాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ హిట్ పెయిర్ మోహన్‌లాల్, శోభనల జోడీ రిపీట్ కానుంది. మోహన్‌లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో భాగమైనట్లుగా సోషల్ మీడియాలో శోభన ఓ వీడియో షేర్ చేశారు. ‘‘మోహన్‌లాల్‌గారి ఈ 360వ సినిమాలో నేను నటించనున్నాను. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శోభన. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’లో తొలిసారి కలిసి నటించారు మోహన్‌లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ ‘మణిచిత్ర తాళు’ (ఈ సినిమా ఆధారంగానే ‘చంద్రముఖి’ తీశారు), ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’లో మెహన్‌లాల్, శోభన లీడ్ రోల్స్‌లో నటించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్, శోభన కలిసి నటించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. 2009లో వచ్చిన మలయాళ చిత్రం ‘సాగర్ ఆలియాస్ జాకీ రీలోడెడ్’లో మోహన్‌లాల్ హీరోగా నటించగా, శోభన ఓ అతిథి పాత్ర చేశారు. -
32 ఏళ్ల తర్వాత స్టార్ హీరోయిన్‌తో రజనీకాంత్ సినిమా
దళపతి చిత్రం కాంబో రిపీట్ కానుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, మమ్ము ట్టి, అరవిందస్వామి కలిసి నటించిన చిత్రం దళపతి. ఇందులో శోభన కథానాయకిగా నటించారు. 1988లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ విషయం పక్కన పెడితే నటుడు రజనీకాంత్ ప్రస్తుతం వేటైయాన్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితా బచ్చన్, యువ నటి దుషార విజయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కాగా చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసింది. దీనికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా దీనికి 'కళుగు' అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ చిత్రం టైటిల్, టీజర్‌ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు లోకేష్ ఇంతకుముందు చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో రజనీకాంత్ సరసన సీనియర్ నటి, నృత్య కళాకారిణి శోభన నటించనున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. వీరిద్దరు కలిసి నటించిన దళపతి చిత్రం 1988లో విడుదలైన విషయం గమనార్హం. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజమెంతా అన్నది తెలియాల్సి ఉంది. -
బెంగళూరును గెలిపించిన శోభన
బెంగళూరు: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా శోభన ఆశ (5/22) నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయం దిశగా వెళుతున్న యూపీ వారియర్స్‌ను శోభన తన అద్భుత బౌలింగ్‌తో బ్రేక్ వేసింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో యూపీని ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రిచా ఘోష్ (37 బంతుల్లో 62; 12 ఫోర్లు), సబ్బినేని మేఘన (44 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. కెపె్టన్ స్మృతి మంధాన (13), సోఫీ డివైన్ (1), ఎలైస్ పెరీ (8) విఫలమయ్యారు. యూపీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు 42 పరుగులే చేయగలిగింది. అనంతరం యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్వేత సెహ్రావత్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సరికి యూపీ స్కోరు 126/3. గెలుపు కోసం 24 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితి. అయితే శోభన జోరుకు 17వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి జట్టు తడబాటుకు గురైంది. తర్వాతి 2 ఓవర్లలో 19 పరుగులు రాబట్టి గెలుపుపై యూపీ ఆశలు పెంచుకుంది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, తొలి 5 బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ తరహాలోనే ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా...దీప్తి శర్మ 2 పరుగులే తీయగలిగింది. -
శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా
సినియర్ నటి, ప్రముక భరతనాట్య కళాకారిణి శోభన ఇంట్లో చోరీ జరిగింది. ఈమె చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్ శ్రీనివాసకాలనీలో తల్లితో కలిసి ఉంటుంది. రెండస్తుల భవనంలో పైభాగంలో వీరు నివశిస్తూ, కింది భాగంలో డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. కాగా వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి పరిచర్యలు కోసం కడలూరు జిల్లా, కొట్టుమన్నార్ కోవిల్‌కు చెందిన విజయ అనే మహిళను పనికి చేర్చుకున్నారు శోభన. (ఇదీ చదవండి: వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల.. దుస్తులు తొలగించి ఆపై..) కాగా గత కొద్దిరోజులుగా తల్లి డబ్బు చోరీకి గురవుతున్న విషయాన్ని శోభన గుర్తించారు. వారి ఇంటికి ఇతరులెవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో పనిమనిషి విజయను ఆమె ప్రశ్నించింది. ఆమె తనకేమీ తెలియదని బుకాయించింది. దీంతో శోభన స్థానిక తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పనిమనిషి విజయను అదుపులోకి తీసుకుని విచారించారు. (ఇదీ చదవండి: తమ్ముడిని పక్కన పెట్టిసిన సూర్య.. అసలు ప్లాన్ ఇదేనా?) గత మార్చి నెల నుంచి రూ.41 వేల వరకు దొంగలించినట్లు అంగీకరించింది. డబ్బును కారు డ్రైవర్ మురుగన్ ద్వారా కూతురికి గూగుల్ పే చేసినట్లు చెప్పింది. పేదరికం కారణంగానే దొంగతనం చేశానని, తనను పని నుంచి తప్పించవద్దని, పోలీసుల ద్వారా శోభనను వేడుకుంది. దీంతో ఆమైపె కేసు నమోదు చేయొద్దని పోలీసులకు చెప్పిన శోభన పనిమనిషిని పనిలో నుంచి తీయకుండా ఆమె చోరీ చేసిన రూ.41 వేలను తన జీతంలో కట్ చేయనున్నట్లు పోలీసులకు తెలిపారు. మరోసారి ఇలాంటి పనులు చేయద్దని, డబ్బు అవసరం అయితే తనను అడగాలని పని మనిషికి శోభన సూచించిందట. దీంతో శోభన తీసుకున్న నిర్ణయాన్ని తన ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. తప్పులు ఎవరైన చేస్తారు. ఒక అవకాశం ఇచ్చి చూడటంలో తప్పులేదని వారు తెలుపుతున్నారు. -
శోభన కామినేని ఓటు గల్లంతు
సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లి నియోజకవర్గం విజయనగర్‌కాలనీలో నివాసం ఉండే అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ శోభన కామినేని ఓటు గల్లంతయింది. పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆమె ఓటు వేసేందుకు నగరానికి వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్లాక అక్కడ తన ఓటు తొలగించినట్లు తెలుసుకొని నివ్వెరపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటు ఇప్పుడెలా పోయిందంటూ ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ పౌరురాలినైన తనకు ఇది ఎంతో విచారకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దేశ పౌరురాలిని కాదా ? నాకు ఓటు ముఖ్యం కాదా ? అంటూ ప్రశ్నించారు. ఓటు వేశాననే సంతృప్తి కోసం చాలెంజ్ ఓటు వేయవచ్చునని సిబ్బంది చెప్పారని, లెక్కింపునకు నోచుకోని ఓటెందుకని ఆమె ప్రశ్నించారు. బీఎల్ఓపై వేటు.. శోభన కామినేని ఓటు తొలగింపునకు బాధ్యుడైన బీఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్)గా విధులు నిర్వహిస్తున్న హెల్త్ విభాగం ఉద్యోగి ఓం ప్రకాశ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నరేందర్‌రెడ్డిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెహదీపట్న ం సర్కిల్లోని విజయనగర్‌కాలనీ పోలింగ్‌బూత్ 49లో శోభన కామినేనికి చట్టవిరుద్ధంగా రెండు ఓట్లున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ రెండింటిలో ఒకదాన్ని తొలగించాల్సిందిగా సహాయ ఎన్నికల అధికారి బీఎల్ఓను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత 7ఏ నోటీసులు లిఖితపూర్వకంగా జారీ చేయకుండా శోభనకు చెందిన రెండు ఓట్లను బీఎల్ఓ తొలగించారు. చెక్ చేయకుండానే రెండు ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఎన్నికల ప్రక్రియలో శిక్షణ వ్యవహారాల నోడల్ ఆఫీసర్‌గా ఉన్న జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ శశికిరణాచారిని నియమించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఉపాసన శోభన ఓటు గల్లంతుపై ఆమె కుమార్తె ప్రము ఖ హీరో రామ్‌చరణ్ తేజ్ భార్య ఉపాసన ట్విట్టర్ వేదికగా స్పందిచారు. పది రోజుల క్రితం ఓటరు జాబితాలో ఉన్న తన తల్లి పేరు ఇప్పుడు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. తన తల్లి కూడా ప్రభుత్వానికి పన్ను కడు తోందని, భారత పౌరురాలిగా ఆమెకు విలువ లేదా? అంటూ ఘాటుగా స్పందించారు. -
నాట్యం.. ఆమె లైఫ్ పార్ట్నర్!
జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక తపన ఉంటుంది. ఆ తపన.. ఆ ప్యాషన్.. ఒక్కోసారి సప్తపదిని కూడా మరిపించేస్తుంది. అలాంటి తపన, ప్యాషన్.. అనురక్తి, అనుశక్తి అయిన నాట్యాన్ని వివాహం చేసుకున్నారు శోభన! నాట్యం.. ఆమె లైఫ్ పార్ట్నర్. లైఫ్.. ఆమె నాట్యానికి.. ఏడడుగుల సోపానం.. శోభాయమానం. ♦ జీవితంలో చాలా ఉంటాయి. అప్పుడు సినిమా ఓ భాగం మాత్రమే అనిపిస్తుంది. డ్యాన్స్ అనేది కూడా కెరీరే కదా. ♦ క్లాసికల్, రొమాంటిక్ సాంగ్ అనేది ఉండదు. ఉండేదల్లా ‘కాన్సెప్ట్’ మాత్రమే. దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఆర్టిస్టులు చేయాలి. ♦ పాతికేళ్లలో చెంగు చెంగున దూకుతూ డ్యాన్స్ చేసినట్లు 50 ఏళ్లలోనూ చేయగలిగితే గ్రేటే. కానీ అది అసాధ్యం. ♦ పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటారు, చేసుకోకపోతే ఉండలేరు అని రూల్ ఏం లేదు. ఇది కరెక్ట్, ఇది తప్పు అని ఉండదు. ♦ మగపిల్లవాడికి తన తండ్రే రోల్ మోడల్. అందుకే తండ్రి తీరు బాగుండాలి. పిల్లలకు ఆ తండ్రి ఒక మంచి ఉదాహరణ అవ్వాలి. ♦ సినిమా మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈ ఇండస్ట్రీ గురించి బయటకు తెలుస్తుంది. కానీ వేరే చోట కూడా వేధింపులు ఉంటాయి. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకలా? శోభన: నేను సినిమాలు మానేయలేదు. జీవితంలో చాలా ఉంటాయి. అప్పుడు సినిమా ఓ భాగం మాత్రమే అనిపిస్తుంది. డ్యాన్స్ అనేది కూడా కెరీరే కదా. ‘కళార్పణ’ పేరుతో నాకో డ్యాన్స్ స్కూల్ ఉంది. సమయమంతా దాంతో సరిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సినిమాలను ప్రదర్శించాలనే ఆశయంతో నెలకొల్పిన ‘జాదూజ్ సెంటర్’కి సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. అన్ని ప్రాంతాలకూ వెళతారా? అన్నింటికీ వెళ్లాలంటే కుదరదు. కొన్ని గ్రామాలకు వెళ్లాలనుకుంటున్నాను. నిజానికి ‘జాదూజ్’ ప్లాన్ చేసినప్పుడు నేను దీన్ని ఓ వ్యాపారంలానే భావించాను. చిన్న చిన్న ఊళ్లల్లో సినిమాలు చూపించడంతో పాటు అక్కడే కేఫ్‌లు, టిఫిన్ సెంటర్స్ ఏర్పాటు చేసి, వారికి ఓ మంచి ఫీల్‌ని కలిగించే అవకాశం ఉంది. చిన్న ఊళ్లకు కూడా మాల్స్ లాంటివి తీసుకువెళ్లొచ్చనే ఉద్దేశంతో ‘జాదూజ్’లో భాగమయ్యాను. పైగా నేను స్వయంగా అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. నా ఆలోచనలను ఆచరణలోకి తీసుకు రావడానికి ఓ టీమ్ ఉంది. మీరు మంచి నటి, నాట్య కళాకారిణి. అందరి మనసుల్లో నటిగానే గుర్తుండిపోవాలనుకుంటారా? నృత్య కళాకారిణిగానా? ఈ రెంటికీ వ్యత్యాసం చెప్పమంటే చెప్పలేను. నాకు రెండూ ఇష్టమే. ఒకప్పటి నటీమణులు వైజయంతి మాల, హేమ మాలిని, మా అత్తయ్య పద్మినీగార్లను తీసుకుందాం. వీళ్లు మంచి క్లాసికల్ డ్యాన్సర్స్. అద్భుతమైన ఆర్టిస్టులు కూడా. సినిమాల్లో వాళ్లు ఎన్నో క్లాసికల్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేశారు. ప్రేక్షకులు వీళ్లను మంచి నటీమణులుగానూ, నృత్య కళాకారిణులుగానూ ఆమోదించారు. నన్నూ అలానే గుర్తుంచుకుంటారని అనిపిస్తోంది. మీ అత్తయ్యలు పద్మినీ, రాగిణి, లలితగార్లను ‘ట్రివాంకూర్ సిస్టర్స్’ అనేవారు. వాళ్లు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని, సినిమాల్లోకి వచ్చారు. మీరూ అంతే. క్లాసికల్ అనేది ట్రెడిషనల్ ఆర్ట్.. సినిమా డిఫరెంట్ కదా? వేరే వేరు అనుకుంటే వేరు అనిపిస్తుంది. రెండూ వేరు కాదు. అత్తయ్యల్లానే నేనూ క్లాసికల్ నేర్చుకున్నాను. వాళ్లలానే సినిమాల్లోకి వచ్చాను. రెండూ ఆర్ట్సే. మొదట్లో మ్యాథ్స్ ఉండేది. ఆ తర్వాత దాంతో పాటు జ్యామెంటరీ, అల్జీబ్రా అని కొత్త కొత్తవి వచ్చాయి. సబ్జెక్ట్స్ పెరుగుతున్నాయి. కళ కూడా అంతే. రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. ఎన్ని రూపాలుగా వచ్చినా మనం ఫైనల్‌గా ‘కళ’ అనే అంటాం కదా. నాట్యం అనేది ఒక కళ అనుకుంటే సినిమా కూడా కళే. ‘రుద్రవీణ’ లో ‘లలిత ప్రియ కమలం..’ పాట క్లాసికల్ టచ్‌తో ఉంటుంది. సినిమాల్లో చేసిన రొమాంటిక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్.. దేన్ని బాగా ఎంజాయ్ చేశారు? ‘ఇదే ఇష్టం’ అంటే కళకు న్యాయం జరగదు. ఏదైనా కళే కదా. మన సామర్థ్యం మేరకు ఆ ఆర్ట్‌ని పరిపూర్ణంగా చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. క్లాసికల్, రొమాంటిక్ సాంగ్ అనేది ఉండదు. ఉండేదల్లా ‘కాన్సెప్ట్’ మాత్రమే. ఆ కాన్సెప్ట్ బాగా రావాలంటే నటీనటులు బాగా చేస్తే సరిపోదు. డైరెక్టర్, కెమెరామేన్ బాగా క్యాప్చర్ చేయాలి. (‘రుద్రవీణ’లో... , ‘అభినందన’లో... ) బేసిక్‌గా మీరు క్లాసికల్ డ్యాన్సర్ కాబట్టి సినిమాల్లో వచ్చే మాస్ సాంగ్స్‌పై మీ ఒపీనియన్? క్లాసికల్ మ్యూజిక్ ఇష్టపడేవారికి మాస్ కూడా నచ్చుతుంది. క్లాస్ అయినా మాస్ అయినా... రెండూ మ్యూజిక్కే కదా. అందుకని మాస్ సాంగ్స్‌ని తక్కువ చేసి మాట్లాడలేం. ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో నటిగా మీ ప్రతిభ మొత్తం చూపించడానికి స్కోప్ దక్కిందా? అలా ఫుల్ స్కిల్ ఉపయోగించి చేసింది ఏదీ లేదు. అలాంటì పాత్ర రాలేదని కాదు. టాలెంట్‌కి కొలమానం ఉండదు. మలయాళంలో ‘మణిచిత్ర తాళ్, తెలుగులో ‘రుద్రవీణ’ వంటి మంచి సినిమాలు చేశాను. అలాంటి మంచి సినిమాల్లోనూ భాగం అయ్యే అవకాశం దక్కడం నా భాగ్యం. ఎందుకంటే మనం మాత్రమే బాగుండి, మనం బాగా యాక్ట్ చేస్తే సరిపోదు. సినిమా కూడా బాగుండాలి. అలా బాగున్న సినిమాలు ఎన్నో చేశాను. పాతికేళ్లలో ఉన్నంత ఎనర్జిటిక్‌గా 40 ఏళ్లలో ఉండలేం. పాతికేళ్లలో డ్యాన్స్ చేసినట్లుగా ఆ తర్వాత కూడా చేసేంత సామర్థ్యం ఉంటుందా? ఉండకపోవచ్చు. ఎందుకంటే డ్యాన్స్ అనేది ఫిజికల్ ఆర్టే కదా. పాతికేళ్లలో చెంగు చెంగున దూకుతూ డ్యాన్స్ చేసినట్లు 50 ఏళ్లలోనూ చేయగలిగితే గ్రేటే. కానీ అది అసాధ్యం. అయితే కొన్నేళ్లుగా ప్రేక్షకులు ఆ పెర్ఫార్మెన్స్కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి అదే ‘గ్రేస్’ ఉండాలనుకుంటారు. అది తప్పు కాదు. కళాకారులు కూడా ఎప్పుడూ ఆడియన్స్‌ని శాటిస్ఫై చేయడానికే కృషి చేస్తుంటారు. డ్యాన్స్ అనేది మంచి ఎక్స్‌ర్‌సైజ్. బహుశా మీ ఫిజిక్ బాగుండటానికి ఈ ఎక్సర్సైజ్ మెయిన్ రీజన్ అనుకోవచ్చా? అది కొంతవరకూ నిజమే. మిగతాది మనం ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మైండ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేనేం చేస్తున్నానో చెప్పాననుకోండి.. అది మీ శరీర తత్వానికి సరిపడక పోవచ్చు. ముందు మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎలా తినాలి? ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి? అనే విషయాలను ప్లాన్ చేసుకోవాలి. అతిగా తినకూడదు. ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు. పంచదార తియ్యగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి హాని. మీరు రోజూ ఎన్ని గంటలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు? నాలుగు గంటలు ప్రాక్టీస్ చేస్తా. అది కూడా ఉదయం. 4 గంటలు డ్యాన్స్ చేయగల సామర్థ్యం ఉంటుందా? ఇప్పటికిప్పుడు మొదలుపెడితే కష్టమే. చిన్నప్పటినుంచి చేస్తున్నాను కాబట్టి నాలుగు గంటలనేది నాకు పెద్ద విషయం కాదు. అంతసేపు చేస్తున్నాను కాబట్టే ఈరోజు నేనిక్కడ ఉన్నాను. సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు అంటూ ఇటీవల ఫీమేల్ ఆర్టిస్టులు బయటికి చెబుతున్నారు. ఇండస్ట్రీలో మీకలాంటి అనుభవాలేమైనా? నాకు బాధపడే పరిస్థితులు ఎదురు కాలేదు. అందుకని ఇండస్ట్రీ మీద సదభిప్రాయం ఉంది. సినిమా మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈ ఇండస్ట్రీ గురించి బయటకు తెలుస్తుంది. కానీ వేరే చోట కూడా వేధింపులు ఉంటాయి. ఆడవాళ్లను వేధించేది ఎవరు? మగవాళ్లు. వాళ్ల ప్రవర్తన బాగుంటే వేధింపులు ఉండవు. కొందరి ప్రవర్తన బాగా లేకపోవడానికి కారణం ఏమిటంటారు? మగపిల్లవాడికి తన తండ్రే రోల్ మోడల్. అందుకే తండ్రి తీరు బాగుండాలి. పిల్లలకు ఆ తండ్రి ఒక మంచి ఉదాహరణ అవ్వాలి. అలాగే ‘ఆడపిల్లలేగా’ అని తోడబుట్టినవాళ్లను మగపిల్లవాడు చులకనగా చూస్తే.. రేపు భార్య మీద కూడా ఆ ఫీలింగే ఉంటుంది. స్కూల్ వాతావరణం బాగుండాలి. ఇంటి నుంచి బయటికెళ్లాక ఆ పిల్లాడేం చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సినిమాల ప్రభావం యువతపై ఉంటుందా? రోడ్ సైడ్ రోమియో లాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు ‘ఇలా ఉండటం కామన్’ అనుకునే ప్రభావం ఉంది. ఆ పాత్ర ఆ అబ్బాయి క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఏ విషయంలో అయినా మంచిని తీసుకోవాలి. సినిమాలు కాకపోతే చెడు ఇంకో చోట కనిపిస్తుంది. దానికి ఎట్రాక్ట్ అవ్వకుండా ఉండాల్సిన బాధ్యత మనదే. అందుకే సినిమాలు ఓ సమస్య కానే కాదు. మామూలుగా మగపిల్లాడికి 10, 11 ఏళ్లు వచ్చాక ‘ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు’ అని చెబుతుంటారు. కానీ 3, 4 ఏళ్ల వయసు నుంచే ఆడవాళ్ల దగ్గర ఎంత బాగా బిహేవ్ చేయాలో నేర్పించాలి. ఇప్పుడు సమాజంలో వేధింపులు పెరిగాయి కాబట్టి, బహుశా మగపిల్లవాడు పుట్టినప్పటి నుంచే చెప్పడం మొదలుపెట్టాలేమో! మీరు పెట్టుకునే నగలన్నీ బాగుంటాయి.. మంచి టేస్ట్ ఉందనిపిస్తోంది? నగలంటే ఇష్టం. కంటికి నచ్చేవాటికే ప్రాధాన్యం ఇవ్వకుండా నాకు నప్పేవాటిని సెలెక్ట్ చేసుకుంటాను. చీరలైనా అంతే. మీకు ఎవరు ఇన్స్పిరేషన్? మంచి విషయాలు చెప్పే అందరూ ఇన్స్పిరేషనే. పర్టిక్యులర్‌గా అంటే నా భరత నాట్యం గురువులు చిత్రా విశ్వేశ్వరన్, పద్మా సుబ్రహ్మణ్యంగార్లు చాలా విషయాల్లో నాకు ఆదర్శం. మీరు నిర్వహిస్తున్న డ్యాన్స్ స్కూల్ ‘కళార్పణ’లో మీరూ డ్యాన్స్ నేర్పిస్తుంటారా? ఒకప్పుడు నేర్పించేదాన్ని. ఇప్పుడు తగ్గించేశాను. స్టేజ్ షోలు చేసినప్పుడు అక్కడికక్కడే ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకోవడం ఎలా అనిపిస్తుంది? మన జాబ్ సిన్సియర్‌గా చేయాలనే థాట్‌తో స్టేజ్ మీదకి వెళతాం. అభినందనలతో పాటు చాలాసార్లు విమర్శలు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి ఆ విమర్శల్లో నిజం ఉండొచ్చు. ఆర్ట్ గురించి తెలియక చేసిన కామెంట్స్ కూడా ఉంటాయి. అయినా విమర్శలను పట్టించుకుంటాను. ఇప్పుడు బాగానే చేశాం అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ నెక్ట్స్ టైమ్ ఇంకా బాగా చేయాలని అనుకుంటాను. మణిరత్నం ‘రావణ్’లో ఐశ్వర్యా రాయ్ చేసిన ఓ పాటకు కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఆ అనుభవం గురించి? నిజానికి మణిరత్నంగారు కొరియోగ్రాఫర్ లేకుండానే సాంగ్ తీయగలరు. ఆ సినిమాకి అడిగారు కాబట్టి చేశాను. కొరియోగ్రాఫర్ చెప్పింది ఆర్టిస్ట్ ఈజీగా అర్థం చేసుకుంటే పని సులువు అవుతుంది. ఐశ్వర్యా రాయ్‌కి మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. ఆమె ఉత్సాహం, ప్రతిభ నన్ను మోటివేట్ చేశాయి. నేను ఓ నటిని అనే విషయాన్ని మరచిపోయి కొరియోగ్రాఫర్‌గా ఆ సెట్స్‌లోకి అడుగుపెట్టాను. అదొక కొత్త ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ... ఆడవాళ్లు ఒంటరిగా బతకడం కష్టం కాబట్టి పెళ్లి చేసుకోవాలంటారు. మీది సోలో లైఫ్ కాబట్టి సమస్యలేమైనా? పెళ్లెందుకు చేసుకోలేదు? పెళ్లెందుకు చేసుకోలేదనేది నా వ్యక్తిగత విషయం. దాని గురించి మాట్లాడదలచుకోలేదు. అయితే పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటారు, చేసుకోకపోతే ఉండలేరు అని రూల్ ఏం లేదు. ఇది కరెక్ట్, ఇది తప్పు అని ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అందరి అనుభవాలు ఒకలా ఉండవు. లైఫ్ స్పెషాలిటీ అదే. -
నచ్చితే మళ్లీ నటిస్తా..
సాక్షి, సిటీబ్యూరో : ‘శోభనా చంద్రకుమార్’ అంటే తెలియని వారు ఉండొచ్చు కానీ.. ‘శోభన’ అంటే తెలియని సినీ ప్రేమికులు అరుదే. దాదాపు 230 సినిమాల్లో నటించి, అన్ని భాషల సినీ ప్రేక్షకులకూ చిరపరిచితమైన నిన్నటి తరం నటి శోభన.. ఇప్పుడు మాత్రం సంప్రదాయ కళాభిమానులకు అభిమాన నృత్యకారిణి. సినీ కెరీర్‌కు విరామమిచ్చి సంప్రదాయ నృత్యంలో పేరు మోసిన ట్రావెన్కోర్ సిస్టర్స్ వంశ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ మేటి నటీ నర్తకి నృత్యానికి నగరంలోనూ ఆదరణ అధికమే. నగరానికి చెందిన ఎన్జీఓ వికేర్ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 7 గంటలకు శిల్పకళావేదికలో సరికొత్త శైలిలో ‘ట్రాన్స్–డ్యాన్సింగ్ డ్రమ్స్’ పేరిట నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సినిమాకు దూరం కాలేదు.. ఒక మంచి స్క్రిప్ట్‌తో ఎవరైనా సంప్రదిస్తే నటించడానికి అభ్యంతరం లేదు. అయితే దాన్నుంచి నేనేమైనా నేర్చుకునేది ఉంటుందా? అది నన్ను అభిమానించే ప్రేక్షకులను నిరాశపరచకుండా ఉంటుందా? ఇవన్నీ మన చేతుల్లో లేని విషయాలు కదా! అయితే సినిమాకు నేను పూర్తిగా మాత్రం దూరం కాలేదు. ఏదో రకంగా నా ప్రయాణం దానితో ముడిపడే సాగుతోంది. నేనూ స్క్రిప్ట్స్ రాస్తాను.. వింటాను. వాటి గురించి ఇతరులతో చర్చిస్తుంటాను. ప్రస్తుత సినిమాలపై.. నాకు ప్రస్తుతం సినిమాలు చూసే సమయం లేదు. ఇది కాస్త చికాకు తెప్పించేదే. అయితే కొచ్చిలో ఉన్న నా మేనల్లుడిని తరచుగా సిని మాల గురించి, సృజనశీలుర గురించిన విశేషాలు చెప్పమని అడుగుతుంటా. అయితే ఒకటి చెప్పగలను.. ప్రస్తుత తరం నటన ఒక కేటగిరీకి పరిమితమైంది కాదు. కొంత మంది సీనియర్ ఆర్టిస్టులను తమకు పునాదిగా మలచుకుంటుంటే కొందరు తమను తామే మోటివేట్ చేసుకుంటున్నారు. డ్యాన్సింగ్ డ్రమ్స్’ గురించి.. ప్రేక్షకులు ఎప్పుడూ నేను సృజనాత్మకంగా ఏం అందిస్తానా అని ఎదురు చూస్తుంటారు. నాకు తెలిసిన అన్ని మాధ్యమాలను మేళవించి ‘డ్యాన్సింగ్ డ్రమ్స్’ను నేను సృష్టించాను. అందుకే దీన్ని ట్రాన్స్ అంటున్నాను. నా గత ప్రదర్శనలు మాయా రావణ్, కృష్ణా.. కోసం ఏడాది పాటు పరిశోధించాల్సి వచ్చింది. అలాగే ఈ ట్రాన్స్–డ్యాన్సింగ్ డ్రమ్స్ కూడా ఎంతో మధనం నుంచి పుట్టిందే. ఇది రికార్డెడ్ ట్రాక్స్ కన్నా ఎక్కువగా ప్రత్యక్ష వాయిద్యాల మీద ఆధారపడుతుంది. ‘తవ్లి’ అనే వాయిద్యంతో పాటు ఇతర ఇన్స్ట్రుమెంట్స్ మీద ఐదేళ్లు పనిచేశా. నేటి మోడ్రన్.. రేపటి ట్రెడిషన్.. ఇండియన్ క్లాసికల్‌ని ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌ని దీని కోసం మేళవింపు ఎందుకనే ప్రశ్నకు నా సమాధానం.. ఇప్పుడు ఏదైతే ఆధునికం అంటున్నామో కొన్ని తరాల తర్వాత అదే సంప్రదాయం అవుతుందనేది పరిశోధకులు కూడా అంగీకరించిన విషయం. ఆ ఆలోచనే ‘ట్రాన్స్’కు నేపథ్యం. కవిత్వం, హిందూ పురాణ కథలు, లైవ్–ప్రీ రికార్డెడ్ మ్యూజిక్, శివ, విష్ణు అవతారాలు.. వెరసి ఈ ప్రదర్శన గంటన్నర పాటు సాగుతుంది. నృత్యంతో పాటు కళాకారులు డ్రమ్స్ కూడా పలకిస్తుంటారు. ప్రస్తుతం ట్రాన్స్ వరల్డ్ టూర్లో భాగంగా కెనడా, నార్త్ అమెరికా పూర్తి చేసుకున్నా. మన దేశంలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తర్వాత అక్టోబరులో వైజాగ్‌లో ట్రాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. కళ అంటే సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అద్భుత ప్రదర్శన. తదుపరి ప్రాజెక్ట్ ప్రస్తుతం ఔత్సాహికులు, చిన్నారుల కోసం చెన్నైలో ‘కళార్పణ’ నృత్య పాఠశాల నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. సీనియర్ నృత్యకళాకారుల కోసం భరతనాట్యంలో బాచిలర్స్, మాస్టర్స్ ప్రోగ్రామ్ ప్రారంభించాలని అనుకుంటున్నాను. -
పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ నటి శోభన!
తమిళసినిమా: సాధారణంగా సినిమా హీరోయిన్లు యుక్త వయసులో పెళ్లి చేసుకోవడం అన్నది అరుదనే చెప్పాలి. అతిలోకసుందిరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి కూడా 40 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నారు. ఇక నటి శోభన అంతకు మించి అన్నట్లుగా 47 ఏళ్లు అంటే ప్రౌఢ వయసుల్లో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. నిజానికి నటన, నృత్యం పేరు, డబ్బు లాంటివన్నీ శోభన చిన్న తనంలోనే వరించేశాయి. ఒక్క పెళ్లి మినహా. 1970లో కేరళ, తిరువనంతపురంలో పుట్టిన శోభన బాల్యవయసులోనే నటిగా తెరంగేట్రం చేశారు. తమిళంలో ఎనక్కుల్ ఒరువన్ చిత్రం ద్వారా కమలహాసన్‌కు జంటగా కథానాయకిగా పరిచయమైన శోభన, ఆ తరువాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ చిత్రాల్లో నటించి.. బహుభాషా నటిగా ప్రాచుర్యం పొందారు. సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించిన శోభన ఎందుకనో పెళ్లిపై దృష్టి సారించలేదు. స్థానిక అడయార్‌లో శిష్య స్కూల్ పేరుతో నాట్య పాఠశాలను నెలకొల్పి అధిక సమయాన్ని నృత్య శిక్షణలోనే గడిపేస్తున్నారు. నృత్య ప్రదర్శనలపై ఎక్కువ మక్కువ చూపుతున్న శోభన 2001లో అనంతనారాయణి అనే పాపను దత్తత తీసుకున్నారు. అలా పెళ్లి చేసుకోరాదని భావించిన శోభన అనూహ్యంగా ఇప్పుడు తనకు ఒక తోడును వెతుక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన చిరకాల స్నేహితుడైన ఒక వ్యక్తితో మూడుముళ్లకు సిద్ధం అవుతున్నట్లు పత్రికల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ కథనాలను నటి శోభన ఖండించలేదు, అలాగనీ పెళ్లిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆమె సన్నిహితులు మాత్రం శోభన త్వరలో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. -
నృత్య శోభితం..
– ఆకట్టుకున్న సినీ నటి శోభన భరత నాట్యం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓర్వకల్లు రాక్ గార్డెన్స్‌లో జరుగుతున్న పున్నమి ఉత్సవాల్లో రెండో రోజు శనివారం.. సినీ నటి శోభన భరతనాట్యం ఆకట్టుకుంది. ఆమె నాట్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె చేసిన నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆద్భుత భరతనాట్య ప్రదర్శనను ఇచ్చిన పద్మశ్రీ శోభన, ఆమె బృందాన్ని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సన్మానించారు. కేతవరం ఆదిమానవులు మెమొంటోను అందజేశారు. ‘‘ఓర్వకల్లు ప్రజలు మంచివారు, ఇక్కడి భాష మంచిది.. ఇక్కడ నాట్యం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శోభన చెప్పడంతో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. -
మోసకారి బతుకు నుంచి బయటపడేసే
నాటి సినిమా దివాకరం (రాజేంద్రప్రసాద్)కు అబద్ధం చెప్పడం అంటే వాటర్ సిప్ చేసినంత వీజీ. ఒకపూట బ్రేక్‌ఫాస్ట్, రెండు పూటల భోజనానికి బదులు అతడు అబద్ధాలనే భోంచేసి రాత్రిపూట హాయిగా స్లీప్ చేస్తూ ఉంటాడు. వృత్తికి వీడియోగ్రాఫర్. కాని బతికేది నాలిక మీదే. విజయనగరంలో ఏదో పెళ్లుంటే రాజమండ్రి నుంచి వెళ్లి అక్కడ భువనేశ్వరి (శోభన)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి త్వరలోనే రాజమండ్రికి ట్రాన్స్ఫర్ మీద రానుందని తెలిసి ఆ వచ్చేలోపు వీడియో లైబ్రరీ పెట్టి షైన్ అయిపోదామని అబద్ధాల రేసులో రన్నింగ్ మొదలెడతాడు. రైల్వే కాలనీలో ఉండే సినిమా పిచ్చి దమయంతికి ‘మీరో పదివేలు ఇస్తే పది రూపాయల వడ్డీ వేసి తిరిగిచ్చేస్తాను... అంతేకాదు లైఫ్‌లాంగ్ నా వీడియో లైబ్రరీలోని క్యాసెట్లన్నీ ఫ్రీగా ఇస్తానని’ కోతలు కోసి పదివేలు నొక్కుతాడు. ఇంకో ఆడపడుచు భాగ్యం (జయలలిత)ను ‘నువ్వు పదివేలివ్వకపోతే ఫలానా అరవ రాజన్‌తో నీకున్న కనెక్షన్‌ను పబ్లిక్ చేసేస్తాను’ అని బ్లాక్మెయిల్ చేసి అక్కడా ఒక పదివేలు నొక్కుతాడు. టికెట్ కలెక్టర్ చిన్నారావు (మల్లికార్జునరావు)కు ఆ భాగ్యం మీద మనసుందని తెలిసి ‘మీకెందుకు నాకొదిలిపెట్టండి సెట్ చేస్తాను కదా’ అని బొంకి ‘ఆ భాగ్యం తన చంటోడికి మామిడిపిందెల బంగారు మొలతాడు చేయించుకుంటుందట... మరి మీరేదైనా...’ అంటూ అతని దగ్గర ఒక పద్నాలుగు వేలు నొక్కుతాడు. ఇక ఎలాగూ ఎగ్గొట్టాలని డిసైడ్ అయిన యాభై వేల చీటీని ముప్పై అయిదు వేలకు పాడి ఆ డబ్బునూ తీసుకుంటాడు. ఇక వాళ్లనూ వీళ్లనూ ఇలాగే టోకరా ఇచ్చి మొత్తం మీద వీడియో లైబ్రరీ తెరుస్తాడు. ఆ షాపులో కూడా అన్నీ మోసాలే. ‘షోలే’ అడిగితే ‘జ్వాల’ ఇస్తాడు. అదేమిటంటే ‘తెలుగులో తీశారని’ మస్కా వేస్తాడు. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అడిగితే పాత ‘జగదేకవీరుని కథ’ అంట గడుతుంటాడు. కూచుంటే అబద్ధం. లేస్తే మోసం. బతుకంతా దరిద్రం. ఇది రాజమండ్రి వచ్చిన భువనేశ్వరి గమనించింది. ప్రేమ అంటూ తనవెంట పడుతున్న దివాకరంను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించి అతడిని ఒక ప్రమాదకరమైన ఒప్పందంలోకి దించుతుంది. అదేమిటంటే ఒక నెలంతా ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా అన్నీ నిజాలే చెప్పి బతకడం. ‘ప్రాణం పోయినా సరే అబద్ధం చెప్పకూడదు. ఇవాళ మార్చి ఒకటి. ఇవాళ్టి నుంచి ముప్పై రోజులు. ఈ వ్రతం సక్సెస్‌ఫుల్‌గా ముగిస్తే ఏప్రిల్ 1న నీకు విడుదల. నా ప్రేమ ఒప్పుకోలు’ అని చెప్తుంది. దివాకరం బతుకు అబద్ధం కాని భువనేశ్వరి మీద అతడి ప్రేమ అబద్ధం కాదు. అందుకని అతడా పందేన్ని స్వీకరిస్తాడు. నిజాలు చెప్పడానికి నడుం తువ్వాలుతో బిగిస్తాడు. సూర్యుడు ఎప్పుడూ తూర్పునే ఉదయించాలి. పడమర ఉదయిస్తే అల్లకల్లోలం జరిగిపోతుంది. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు అబద్ధాలే చెప్పాలి. నిజాలు చెప్పడం మొదలుపెడితే బతుకు బస్టాండ్ అవుతుంది. చెప్పేవాడిది కాదు. ఎదుటివాడిది. అతడి నిజాలకు మొదటగా బలైంది చిన్నారావు. భాగ్యంతో కనెక్షన్ కోసం అతడు ట్రై చేస్తున్నాడని ఆ కనెక్షన్ కుదిరితే ఇప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరు పెళ్లాలకు ఎండ్రిన్ ఇచ్చి చంపాలని ప్లాన్ చేశాడని, అంతేకాదు... భాగ్యంతో పెళ్లయ్యాక ఆమె పరాయి మగాడి వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గుండు కొట్టించి మూల కూచోపెట్టే పన్నాగం పన్నాడని దివాకరం తన నిజాల వ్రతంలో భాగంగా భాగ్యంకు చెప్పేశాడు. ఆమె అతణ్ణి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసింది. ఈ సంగతి ఇద్దరు భార్యలకు తెలిసి పతిదేవుడని కూడా వగచకుండా చావబాదారు. ఆ అంకం అలా అయ్యిందా... కాలనీలో పెద్ద రౌడీగా ఉన్న కొండబాబు గురించి చీటీలేసే వై.విజయ, సాక్షి రంగారావు నానా తిట్లు తిట్టుకుంటూ ఉంటారు. ‘అవి నిజం కండలు కావని, చంకల కింద సెగ్గడ్డలు లేచాయని, అతడివి దొడ్డికాళ్లని, కట్‌డ్రాయర్ కట్ అయ్యి అలా నడుస్తున్నాడనీ’ అన్నింటికి మించి ‘అతడి భార్య జట్కా అహమద్‌తో రాత్రిళ్లు సెకండ్‌షోలకు చెక్కేస్తుంటుందని’ తిట్టుకుంటూ ఉంటారు. ఇవి విని దివాకరం తన నిజాలలో భాగంగా కొండబాబుకు చేరవేస్తాడు. అంతే. ఆ తిట్టుకున్నవాళ్లంతా తాటలూడి కింద పడతారు. ఇలాగే దివాకరం నిజాల వల్ల కాలనీ అంతా కకావికలం అయిపోతూ ఉంటుంది. ఎంత ప్రమాదం వచ్చినా ఎన్ని ఉత్పాతాలు సంభవించినా దివాకరం ఒక్క అబద్ధం కూడా చెప్పడు ప్రేమ కోసం. కాని క్లయిమాక్స్‌కు వచ్చేసరికి ఒక నేరం తనను పెంచిన తల్లి మీదకు వెళ్లే ప్రమాదం ఉందని తెలిసి కావాలని అబద్ధం చెబుతాడు. ఆ ఒక్క అబద్ధం చెప్పినందుకు అతడు పందెం ఓడిపోయినట్టే. కాని మంచి కారణం కోసం అబద్ధం చెప్పినందుకు భువనేశ్వరి అతణ్ణి క్షమిస్తుంది. అతడి ప్రేమను అంగీకరిస్తుంది. అబద్ధాలతో సాధించలేని ప్రేమను నిజాలతో దక్కించుకుని దివాకరం ఒక ఇంటివాడవుతాడు. కథ ముగుస్తుంది. వాళ్ల లైఫ్ మూడు క్యాసెట్లు ఆరు వీడియోలుగా హాయిగా గడిచిపోతుంది. ‘ఏప్రిల్ 1 విడుదల’ 1991లో వచ్చింది. ఇది ‘హరిశ్చంద్రుడు అబద్ధమాడితే’ (రచన: కోలపల్లి ఈశ్వరరావు, ఎం.ఐ.కిషన్) అనే ఒక నవలలోని చిన్న పాయింట్ ఆధారంగా దర్శకుడు వంశీ బ్రిలియంట్‌గా రాసుకున్న కథ. రాజేంద్రప్రసాద్ చెలరేగిపోయి నటించిన కథ. పాత్రలన్నీ సహజ వాతావరణంలో సహజ ప్రవర్తనలతో సహజ నుడికారంతో అద్భుతంగా ఆకట్టుకున్న కథ. అబద్ధాలు అందరం ఏదో ఒక సందర్భంలో ఆడతాం. కాని మామూలు నిజాలు కూడా మాట్లాడలేని పరిస్థితి మనందరిలో ఉంటుంది. అటువంటిది ఒక నెలపాటు కఠినమైన నిజాలు కూడా మాట్లాడే పందెం హీరో హీరోయిన్ల మధ్య పడటమే ఈ సినిమాలో ఆసక్తి కలిగించే అంశం. దీని స్క్రీన్ ప్లే ఏదైనా యూనివర్సిటీలో పాఠ్యాంశంగా పెట్టదగ్గ స్థాయిలో ఉంటుంది. ఆద్యంతం నవ్వించే ఈ సినిమా చివరలో సీరియస్‌గా టర్న్ అయ్యి భయోద్విగ్నత కలిగిస్తుంది. ఈ సినిమా చూసినవాళ్లెవరైనా నిజాలు చెప్పాలని అనుకోరు కాని దివాకరంలా అబద్ధపు బతుకు నుంచి విముక్తం కావాలని మాత్రం అనుకుంటారు. అది ఈ కథ విజయం. ఇది సాధించిన మంచి ఫలితం. దర్శకుడు వంశీకి జేజేలు. మన తర్వాతే హాలీవుడ్లో.... ఏప్రిల్ 1 విడుదల 1991లో వచ్చింది. కాని అదే కథాంశాన్ని పోలి హాలీవుడ్లో ‘లయర్ లయర్’ అనే సినిమా 1997లో వచ్చింది. అందులో హీరో లాయర్. కాని అతడు కూడా హటాత్తుగా నిజాలు మాట్లాడటం మొదలెడతాడు. ఆ విధంగా చూస్తే మనవాళ్లు హాలీవుడ్ స్థాయిలో వారి కంటే ముందు కథను ఆలోచించినట్టు. గ్రేట్ కదూ. కడుపుబ్బ నవ్వించే... సన్నివేశాలు... ‘ఏప్రిల్1 విడుదల’లో అడుగడుగునా నవ్వించే సన్నివేశాలు ఉంటాయి. పెంటకుప్పల మీద పడి ఉన్న టీవీని కళ్లు చిదంబరం రాజేంద్రప్రసాద్‌కు అప్పగిస్తే దాన్నతడు ‘దుబాయ్ టీవీ’ అని సాక్షి రంగారావుకు అమ్మేస్తాడు. దానిని ఆన్ చేస్తే ఢామ్మని పేలి అందరి ముఖాలు నల్లగా మారతాయి. వీడియో లైబ్రరీ ఓపెనింగ్ కూడా వెరైటీగా ఉంటుంది. అందరూ రిబ్బన్ కట్ చేయిస్తే ఇందులో పెద్ద దుంగను పెట్టి రంపంతో కోసి ఓపెనింగ్ చేయమంటారు. ఆ రోజుల్లో దూరదర్శన్‌లో వచ్చే మూగచెవిటి వార్తలను ఇమిటేట్ చేస్తూ రాజేంద్రప్రసాద్ శోభనకు రాసే వీడియో ప్రేమలేఖ కూడా హైలైటే. ఎల్.బి.శ్రీరామ్ మాటలు ఏప్రిల్ 1 విడుదల సినిమాకు ఎల్.బి.శ్రీరామ్ రాసిన మాటలు చాలా ప్లస్ అయ్యాయి. అయితే నటుడు కృష్ణభగవాన్ కూడా ఈ మాటల్లో సాయం అందించారని, కొన్ని డైలాగులు రాశారని కథనం. ఈ సినిమాలో వీళ్లిద్దరూ యాక్ట్ చేసినా అప్పట్లో జనానికి వీరు పట్టలేదు కాని ఆ తర్వాతి కాలంలో ఎల్.బి.శ్రీరామ్, కృష్ణభగవాన్ ప్రసిద్ధ కమెడియన్లుగా మారారు. ఇక ఇళయరాజా చేసిన పాటల్లో ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’, ‘ఒంపుల వైఖరి సొంపుల మాదిరి’ హిట్ అయ్యాయి. – కె -
అమ్మా..ఈ నరకం నాకొద్దు
భర్త వేధింపులు భరించలేను సూసైడ్ నోట్ రాసి వివాహిత ఆత్మహత్య మదనపల్లె : మదనపల్లెలో ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. మదనపల్లె పట్టణం దిగువకమ్మపల్లెకు చెందిన రామ్మూర్తి, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె శోభన(25) ఎంఏ బీఈడీ చదివింది. 2012 ఆగస్టు 12న పుంగనూరు మండలం చెర్లోపల్లికి చెందిన మల్లికార్జునతో ఈమెకు వివాహం చేశారు. అప్పట్లో రూ.3 లక్షల నగదు, కొంత బంగారా న్ని కట్నంగా ఇచ్చారు. అప్పట్లో మల్లికార్జున సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ నమ్మించాడు. తర్వాత ఇక్కడే కంప్యూటర్ షాపు పెట్టివ్వాలని డిమాండ్ చేశాడు. కూతురు కళ్ల ముందే ఉంటుందని ఆ దంపతులు స్థానికంగా ఒక కంప్యూటర్ షాపు పెట్టించారు. వారం తిరక్కనే షాపును అమ్మేసి హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని వెళ్లిపోయాడు. అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వేధించేవాడు. రెండేళ్ల కిందట అతనిపై వరకట్న వేధింపు కేసు కూడా నమోదైంది. అప్పట్లో రాజీ పడిన ఇతను మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. రెండు రోజుల క్రితం రూ.1 లక్ష నగదు, కొంత బంగారు తేవాలని గొడవ చేశాడు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె లేఖ రాసి ఇంట్లోనే ఉరి వేసుకుంది. దగ్గరుంటావనుకుంటే దూరమైపోయావా తల్లీ..అంటూ శోభన తల్లి లక్ష్మిదేవి కన్నీటిపర్యంతమైంది. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
కిస్ అన్నది వ్యక్తిగత విషయం :శోభన
పిల్లల మనోభావాలతో ఆడుకోకండి ⇒నాకెలాంటి డ్రీమ్ రోల్స్ లేవు ⇒నటిగా ఎదగడానికి నృతం సహకరిస్తుంది. ⇒కిస్ అన్నది వ్యక్తిగత విషయం ⇒ఏ తల్లిదండ్రులు కూడా తమ కూతురును ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పరనుకుంటా! ⇒‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి, నాట్యకారిణి శోభన సాక్షి,బెంగళూరు : అచ్చమైన అందానికి ప్రతిబింబంలా కనిపించే ముద్దుగుమ్మ, కేరళలో పుట్టి పెరిగినా అచ్చంగా పదహారణాల తెలుగింటి అమ్మాయిలా కనిపించే అందాల భరిణె, మంచి నటిగానే కాదు మరెంతో మంచి నాట్యకారిణిగా కూడా ప్రపంచానికి సుపరిచితురాలే. ఈ వర్ణనంతా బహుభాషా నటి, నాట్యకారిణి శోభన గురించే. అవును అనాధ చిన్నారుల కోసం తాను నిర్వహించనున్న ఓ కార్యక్రమం కోసం నగరానికి వచ్చిన శోభన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అనాథల సహాయార్థం 20న ‘శోభన’ నృత్య రూపకం తల్లిదండ్రులను కోల్పోన పిల్లలు, ఆప్తుల నుంచి దూరంగా ఉంటున్న వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ‘విశ్రాంతి’ స్వచ్ఛంద సంస్థకు చేయూత నందించడానికి బహు భాషనటి, ప్రముఖ నర్తకి శోభన ముందుకు వచ్చారు. స్వయంగా రూపకల్పన చేసిన ‘సమాధిన’ నృత్యరూపకాన్ని ఇక్కడి చౌడయ్యమెమోరియల్ హాల్లో ఈనెల 20న ప్రదర్శించనున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు సాగే ఈ నృత్యరూపంలో వివిధ మత గ్రంథాల నుంచి తీసుకున్న శాంతి సందేశాలను ప్రదర్శించనున్నారు. సాక్షి: బహుభాష నటిగా పేరొందిన మీకు ఏ భాషలో నటించడం సులభం? శోభన: ఒక నటిగా అన్ని భాషలూ నాకు సమానమే, ఎ క్కువ సినిమాలు చేసే అవకాశం తెలుగులో కలిగింది. అదే విధంగా కన్నడ,తమిళ భాషల సినిమాలు కూడా నాకు మంచి నటిగా గుర్తింపును అందించాయి. అయితే నా మాతృభాష అయిన మళయాళంలో నటించడం సులభంగా అనిపిస్తుంది. సాక్షి: మీరు నటిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతారా? నృత్యకారిణిగానా? శోభన: రెండూ వేటికవే విభిన్నమైనవి. సితార దేవి నుంచి నా స్నేహితురాలైన భానుప్రియను నటిగా గుర్తిస్తారా లేదా నృత్యకారిణిగా గుర్తిస్తారా అంటే మీరేం చెప్పగలుగుతారు? మంచి నటిగా ఎదిగేందుకు నృత్యం సహకరిస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సాక్షి: మీకున్న డ్రీమ్ రోల్ ఏంటి? శోభన: డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. నాకు ఇచ్చిన ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించడం మాత్రమే నాకు తెలుసు. ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ నా డ్రీమ్ రోల్స్ అనే చెబుతాను. సాక్షి: ఎవరితోనైనా కలిసి నటించలేకపోయానన్న భాద ఉందా? శోభన: అలాంటిదేమీ లేదు. మణిరత్నం, భాగ్యరాజ్, రాఘవేంద్ర రావు వంటి హేమాహేమీల దర్శకత్వంలో చాలా మంది గొప్ప నటులతో నేను నటించాను. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆ సినిమాల విజయంలో నా వంతు పాత్ర ఉందని గర్వపడుతుంటాను. సాక్షి: ఇంతకాలంగా నృత్యాలను ప్రదర్శిస్తున్నారు? ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఏంటి? శోభన: ఇప్పటి ప్రేక్షకులు చాలా తెలివైన వారు, వేదికపై నృత్యం చేస్తున్న వారిని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు. చిన్న తప్పును కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ప్రదర్శన ఇస్తున్న నాట్యకారిణి నుండి తమకు ఎటువంటి భావాలు కావాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. అలాంటా ప్రదర్శనలకే వస్తున్నారు. సాక్షి: శ్రీ కృష్ణుడి తత్వాలపై ఎక్కువ నృత్యరూపకాలు రూపొందిస్తుంటరనేది ప్రేక్షకుల అభిప్రాయం. దీనికి ఏమంటారు? శోభన: అటువంటి దేమీ లేదు. అన్ని మతాలకు, అందరి దేవుళ్లకు సంబంధించిన నృత్యరూపకాలు నాకు ఇష్టమే. అయితే కృష్ణుడి నృత్యరూపకాల వల్ల నాకు ఎక్కువ పేరు రావడం వల్ల మీకు అలా అనిపిస్తోంది. సాక్షి: ప్రస్తుతం వస్తున్న రియాలిటీ షోలపై మీ అభిప్రాయం ఏమిటి? శోభన: చిన్నారుల్లో ఇష్టం, ప్రతిభ ఉండి వారు నాట్యం, సంగీతం వంటి కలలు నేర్చుకుంటే ఫర్వాలేదు, అంతేకానీ తమ పిల్లలు టీవీల్లో కనిపించడంతో పాటు వారి ద్వారా తమకు పేరు రావాలనే కోరికతో కొంతమంది తల్లిదండ్రులు చిన్నారులపై బలవంతంగా ఈ తరహా రియాలిటీ షోలకు తీసుకొస్తున్నారు. తద్వారా చిన్నారులపై మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇక చానల్స్ కూడా పిల్లల భావోద్వేగాలతో తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇది నా స్వ అనుభవం.్ఙఒక డ్యాన్స్ షో ఫైనల్స్‌లో 24 ఏళ్ల యువకుడికి, 9ఏళ్ల అబ్బాయికి పోటీ పెట్టారు. ఇందులో 24ఏళ్ల యువకుడు గెలిచాడు. అంతే తొమ్మిదేళ్ల అబ్బాయి తన భావోద్వేగాలను ఆపుకోలేక కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతను శారీరకంగా, మానసికంగా కూడా కుంగిపోయాడు. ఇక షోలోని న్యాయనిర్ణేతలకు సైతం ఎక్కువ డ్రామాను పండిస్తూ, టీఆర్పీని పెంచే విధంగా భావోద్వేగాలను పలికించాలని చెబుతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. అందుకే నేను రియాల్టి షోలకు ఎక్కువగా న్యాయనిర్ణేతగా వెళ్లను. సాక్షి: మోరల్ పోలిసింగ్‌కు నిరసిస్తూ కేరళాలో ప్రాణం పోసుకున్న కిస్ ఆఫ్ లవ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని పై మీ కామెంట్? శోభన: ముద్ద అన్నది వ్యక్తిగతమైన విషయం. ‘చాలా మంది బయటికి బహిరంగంగా కిస్ ఆఫ్ లవ్ సాధారణ విషయమని చెబుతుంటారు. అయితే వ్యక్తిగతంగా వస్తే తమ కూతురు కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొనడానికి ఎంతమాత్రం అంగీకరించరు.’ అనేది నా అభిప్రాయం. అయినా ఈ విషయం మంచి ఈ వి షయం మంచిది కాదు అని చెప్పడానికి మనం ఎవరం చెప్పండి. కొంతమందికి మంచి అనిపిం చేంది మరొకొందరికి స మంజసం కాకపోవచ్చు.