నృత్య శోభితం..
నృత్య శోభితం..
Published Sat, Jun 10 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
– ఆకట్టుకున్న సినీ నటి శోభన భరత నాట్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓర్వకల్లు రాక్ గార్డెన్స్‌లో జరుగుతున్న పున్నమి ఉత్సవాల్లో రెండో రోజు శనివారం.. సినీ నటి శోభన భరతనాట్యం ఆకట్టుకుంది. ఆమె నాట్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె చేసిన నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆద్భుత భరతనాట్య ప్రదర్శనను ఇచ్చిన పద్మశ్రీ శోభన, ఆమె బృందాన్ని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సన్మానించారు. కేతవరం ఆదిమానవులు మెమొంటోను అందజేశారు. ‘‘ఓర్వకల్లు ప్రజలు మంచివారు, ఇక్కడి భాష మంచిది.. ఇక్కడ నాట్యం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శోభన చెప్పడంతో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.
Advertisement
Advertisement