punnami
-
మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపించే నెలరేడు!
ప్రకృతి తీరుతెన్నులను చురుకుగా పరిశీలించే స్వభావం కలవారికి ఎవరికయినా, కలువపూలు వెన్నెలలో వికసిస్తాయనీ, మనిషి మనసుకూ చందమామకూ సంబంధం ఉంటుందనీ మరొకరు చెప్పవలసిన పని ఉండదు. పున్నమి చంద్రుడిని చూస్తే... సముద్రమే పట్టరాని ఆవేశంతో పొంగిపోతుంది. మనిషి మనసూ అంతే. ‘రసమయ జగతిని ఉసిగొలిపే తన మిసమిస’తో నెలరేడు మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపిస్తాడు. మనసు పని తీరును తీవ్రతరం చేస్తాడు. కోరిన దిశలో మరింత వేగంగా నడిపిస్తాడు. భోగులను భోగంవైపూ, యోగులను యోగంవైపూ, భావుకులను భావ తీవ్రతవైపూ, ప్రేమికులను ప్రేమ జ్వరం దిశగానూ, భక్తులను అనన్య భక్తి మార్గంలోనూ నడుపుతాడు. ‘చంద్రమా మనసో జాతంః’ చంద్రుడు విరాట్ పురుషుని మనసు నుండి సృష్టి అయినవాడు అని వేదం. అందుకే కాబోలు మనసుకు పున్నమి చంద్రుడంటే అంత వెర్రి ఆకర్షణ.అందునా, కార్తీక పూర్ణిమ మరీ అందమైంది. అసలే శరదృతువు. ఆపైన రాతిరి. ఆ పైన పున్నమి. పున్నమి అంటే మామూలు పున్నమి కాదు. పుచ్చ పూవు వెన్నెలల పున్నమి. మనసు చురుకుగా చిందులు వేస్తూ పరవశంతో, రెట్టింపు ఉత్సాహంతో విజృంభించి విహరించే సమయం.అయితే చిత్త నది ‘ఉభయతో వాహిని’ అన్నారు. అది ‘కల్యాణం’ (శుభం) దిశగానూ ప్రవహించగలదు. వినాశం దిశగానూ ప్రవహించ గలదు. మనస్సు యజమానిగా ఉండి, ఇంద్రియాలను నియంత్రిస్తే, చిత్త నది సరయిన దిశలో ప్రవహించేందుకు అవి సాయపడతాయి. ఇంద్రి యాలు లాక్కెళ్ళినట్టు, మనసు వెళితే ప్రవాహం వినాశం దిశ పడుతుంది.చదవండి: కార్తీక పూర్ణమి విశిష్టత.. త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారు?చిత్త నదిని ‘కల్యాణం’ దిశగా మళ్ళించే ప్రయత్నాలకు పున్నమి దినాలు అనువైనవనీ, పున్నములలో కార్తీక పూర్ణిమ ఉత్తమోత్తమమనీ భారతీయ సంప్రదాయం. ఈ పుణ్య దినాన చేసిన నదీస్నానాలకూ, తులసి పూజలకూ, జపతప దాన యజ్ఞ హోమాది కర్మలకూ ఫలితాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని నమ్మిక. ప్రాకృతిక కారణాలవల్ల ఈ పర్వదినాన, మనసు మరింత శ్రద్ధా, శుద్ధీ నిలుపుకొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈనాడు చేసే ఉపవాసాలూ, శివారాధనలూ, ప్రత్యేక దీపారాధనలూ, దీపదానాలూ, ఆలయాలలో ఆకాశ దీప నమస్కారాలూ, జ్వాలా తోరణ దర్శనాలూ వంటి పర్వదిన విధులు, సత్ఫలాలు కాంక్షించే సజ్జనులకు పెద్దలు చూపిన మార్గం.కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
పున్నమి భవనానికి ఆధ్యాత్మిక హంగులు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలోని పున్నమి భవనం (హరిత హోటల్) ఆధ్యాత్మిక సొబగులతో త్వరలోనే భక్తులను ఆకర్షించనుంది. దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు ‘రీ ఎలివేషన్’పనులు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2001 ఫిబ్రవరి 4న అప్పటి టూరిజం శాఖ మంత్రి పెద్దిరెడ్డి.. పున్నమి గెస్ట్‌హౌజ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం యాదాద్రీశుడి హుండీ లెక్కింపునకు దీనినే వినియోగిస్తున్నారు. ప్రధానాలయం అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ పలుమార్లు ఈ హోటల్లోనే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. హోటల్‌ను సైతం ఆధ్యాత్మిక రూపాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో గతనెల 18న యాదాద్రి పర్యటనకు వచ్చిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఇందుకు సంబంధించిన నమూనాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, కలెక్టర్ పమేలా సత్పతి, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పలు నమూనాలను సీఎం వద్దకు తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ఫైనల్ చేసిన నేపథ్యంలో ఈఓ గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆచార్యులు, అధికారులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ‘రీ ఎలివేషన్’పనులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు ఆహ్లాదపరిచే గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయనున్నారు. -
నృత్య శోభితం..
– ఆకట్టుకున్న సినీ నటి శోభన భరత నాట్యం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓర్వకల్లు రాక్ గార్డెన్స్‌లో జరుగుతున్న పున్నమి ఉత్సవాల్లో రెండో రోజు శనివారం.. సినీ నటి శోభన భరతనాట్యం ఆకట్టుకుంది. ఆమె నాట్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె చేసిన నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆద్భుత భరతనాట్య ప్రదర్శనను ఇచ్చిన పద్మశ్రీ శోభన, ఆమె బృందాన్ని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సన్మానించారు. కేతవరం ఆదిమానవులు మెమొంటోను అందజేశారు. ‘‘ఓర్వకల్లు ప్రజలు మంచివారు, ఇక్కడి భాష మంచిది.. ఇక్కడ నాట్యం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శోభన చెప్పడంతో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. -
రాతివనం మెరిసింది.. పర్యాటకం మురిసింది
- వైభవంగా ప్రారంభమైన పున్నమి ఉత్సవాలు - ఓర్వకల్‌కు గుర్తింపు తెస్తామన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి - జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తానన్న మంత్రి అఖిల ప్రియ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓర్వకల్ సమీపంలోని రాక్‌గార్డెన్స్ పున్నమి ఉత్సవాలు–2017 అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మిరుగొట్లుగొలిపే కాంతిలో అందంగా తయారైన రాక్‌గార్డెన్స్‌లో అహ్లాదకరమైన వాతావరణంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఎద్దులు, నాగలి పూజతో ఉత్సవాలకు మంత్రులు కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిల ప్రియ శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతూ దేశంలోనే మొదటిసారిగా పున్నమి ఉత్సవాలకుసిద్ధమవడం కర్నూలుకు గర్వకారణమన్నారు. మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ..పర్యాటక శాఖ మంత్రిగా ఉండి పున్నమి ఉత్సవాలను జరుపుతుండడంతో ఎంతో సంతోషకంగా ఉందన్నారు. ఓర్వకల్‌లోని పలు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఐడీసీ చైర్మన్కేఈ ప్రభాకర్, శాలివాహన కుమ్మర కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్టెమ్ డ్యాన్స్ అనేది జీవితమని బెంగుళూరుకు చెందిన మధు నాటరాజ్ వివరించారు.అనంతరం తన నాట్య కళా సమితిలో శిక్షణ పొందిన నటులతో స్టెమ్ డ్యాన్స్ నృత్యం చేయించారు. త్రీడీ స్క్రీన్ ఎదుట కదిలే నాటరాజుల చిత్రాల వలే వారు చేసిన నృత్యాలు చూపురులను ఆకట్టుకున్నాయి. ఇండియన్ ఐడల్–2017గా నిలిచిన విశాఖపట్నానికి చెందిన రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జబర్దస్ ఫేమ్ చమక్‌చంద్ర వేసిన స్టెమ్ డ్యాన్స్, నవ్వుల హరివిల్లులో భాగంగా నవ్వులు పూయించడం ఆకట్టుకున్నాయి. త్రీడీ ప్రింటుతో సమీపంలోని రాక్‌గార్డెన్స్ కొండలపై లేజర్ కిరణాలతో వేసిన వీడియో ఆకట్టుకుంది. పున్నమి ఉత్సవాలను కెమెరాల్లో బంధించేందుకు పర్యాటక శాఖ డ్రోన్, క్రేన్ కెమరాలను వాడింది. అంతేకాక ప్యారచూట్ ద్వారా ఉత్సవాల ప్రారంభ సమయంలో పువ్వులను చల్లించారు.