రాతివనం మెరిసింది.. పర్యాటకం మురిసింది
రాతివనం మెరిసింది.. పర్యాటకం మురిసింది
Published Sat, Jun 10 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
- వైభవంగా ప్రారంభమైన పున్నమి ఉత్సవాలు
- ఓర్వకల్‌కు గుర్తింపు తెస్తామన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
- జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తానన్న మంత్రి అఖిల ప్రియ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓర్వకల్ సమీపంలోని రాక్‌గార్డెన్స్ పున్నమి ఉత్సవాలు–2017 అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మిరుగొట్లుగొలిపే కాంతిలో అందంగా తయారైన రాక్‌గార్డెన్స్‌లో అహ్లాదకరమైన వాతావరణంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఎద్దులు, నాగలి పూజతో ఉత్సవాలకు మంత్రులు కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిల ప్రియ శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతూ దేశంలోనే మొదటిసారిగా పున్నమి ఉత్సవాలకుసిద్ధమవడం కర్నూలుకు గర్వకారణమన్నారు.
మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ..పర్యాటక శాఖ మంత్రిగా ఉండి పున్నమి ఉత్సవాలను జరుపుతుండడంతో ఎంతో సంతోషకంగా ఉందన్నారు. ఓర్వకల్‌లోని పలు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఐడీసీ చైర్మన్‌కేఈ ప్రభాకర్, శాలివాహన కుమ్మర కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
స్టెమ్ డ్యాన్స్ అనేది జీవితమని బెంగుళూరుకు చెందిన మధు నాటరాజ్ వివరించారు.అనంతరం తన నాట్య కళా సమితిలో శిక్షణ పొందిన నటులతో స్టెమ్ డ్యాన్స్ నృత్యం చేయించారు. త్రీడీ స్క్రీన్ ఎదుట కదిలే నాటరాజుల చిత్రాల వలే వారు చేసిన నృత్యాలు చూపురులను ఆకట్టుకున్నాయి. ఇండియన్ ఐడల్–2017గా నిలిచిన విశాఖపట్నానికి చెందిన రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జబర్దస్ ఫేమ్ చమక్‌చంద్ర వేసిన స్టెమ్ డ్యాన్స్, నవ్వుల హరివిల్లులో భాగంగా నవ్వులు పూయించడం ఆకట్టుకున్నాయి. త్రీడీ ప్రింటుతో సమీపంలోని రాక్‌గార్డెన్స్ కొండలపై లేజర్ కిరణాలతో వేసిన వీడియో ఆకట్టుకుంది. పున్నమి ఉత్సవాలను కెమెరాల్లో బంధించేందుకు పర్యాటక శాఖ డ్రోన్, క్రేన్ కెమరాలను వాడింది. అంతేకాక ప్యారచూట్ ద్వారా ఉత్సవాల ప్రారంభ సమయంలో పువ్వులను చల్లించారు.
Advertisement