సినియర్ నటి, ప్రముక భరతనాట్య కళాకారిణి శోభన ఇంట్లో చోరీ జరిగింది. ఈమె చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్ శ్రీనివాసకాలనీలో తల్లితో కలిసి ఉంటుంది. రెండస్తుల భవనంలో పైభాగంలో వీరు నివశిస్తూ, కింది భాగంలో డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. కాగా వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి పరిచర్యలు కోసం కడలూరు జిల్లా, కొట్టుమన్నార్ కోవిల్‌కు చెందిన విజయ అనే మహిళను పనికి చేర్చుకున్నారు శోభన.
(ఇదీ చదవండి: వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల.. దుస్తులు తొలగించి ఆపై..)
కాగా గత కొద్దిరోజులుగా తల్లి డబ్బు చోరీకి గురవుతున్న విషయాన్ని శోభన గుర్తించారు. వారి ఇంటికి ఇతరులెవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో పనిమనిషి విజయను ఆమె ప్రశ్నించింది. ఆమె తనకేమీ తెలియదని బుకాయించింది. దీంతో శోభన స్థానిక తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పనిమనిషి విజయను అదుపులోకి తీసుకుని విచారించారు.
(ఇదీ చదవండి: తమ్ముడిని పక్కన పెట్టిసిన సూర్య.. అసలు ప్లాన్ ఇదేనా?)
గత మార్చి నెల నుంచి రూ.41 వేల వరకు దొంగలించినట్లు అంగీకరించింది. డబ్బును కారు డ్రైవర్ మురుగన్ ద్వారా కూతురికి గూగుల్ పే చేసినట్లు చెప్పింది. పేదరికం కారణంగానే దొంగతనం చేశానని, తనను పని నుంచి తప్పించవద్దని, పోలీసుల ద్వారా శోభనను వేడుకుంది. దీంతో ఆమైపె కేసు నమోదు చేయొద్దని పోలీసులకు చెప్పిన శోభన పనిమనిషిని పనిలో నుంచి తీయకుండా ఆమె చోరీ చేసిన రూ.41 వేలను తన జీతంలో కట్ చేయనున్నట్లు పోలీసులకు తెలిపారు. మరోసారి ఇలాంటి పనులు చేయద్దని, డబ్బు అవసరం అయితే తనను అడగాలని పని మనిషికి శోభన సూచించిందట. దీంతో శోభన తీసుకున్న నిర్ణయాన్ని తన ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. తప్పులు ఎవరైన చేస్తారు. ఒక అవకాశం ఇచ్చి చూడటంలో తప్పులేదని వారు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment