పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ నటి శోభన! | senior actress shobhana ready to marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ నటి శోభన!

Published Sat, Jun 17 2017 8:00 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ నటి శోభన!

పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ నటి శోభన!

తమిళసినిమా: సాధారణంగా సినిమా హీరోయిన్లు యుక్త వయసులో పెళ్లి చేసుకోవడం అన్నది అరుదనే చెప్పాలి. అతిలోకసుందిరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి కూడా 40 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నారు. ఇక నటి శోభన అంతకు మించి అన్నట్లుగా 47 ఏళ్లు అంటే ప్రౌఢ వయసుల్లో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. నిజానికి నటన, నృత్యం పేరు, డబ్బు లాంటివన్నీ శోభన చిన్న తనంలోనే వరించేశాయి. ఒక్క పెళ్లి మినహా. 1970లో కేరళ, తిరువనంతపురంలో పుట్టిన శోభన బాల్యవయసులోనే నటిగా తెరంగేట్రం చేశారు.

తమిళంలో ఎనక్కుల్‌ ఒరువన్‌ చిత్రం ద్వారా కమలహాసన్‌కు జంటగా కథానాయకిగా పరిచయమైన శోభన, ఆ తరువాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ చిత్రాల్లో నటించి.. బహుభాషా నటిగా ప్రాచుర్యం పొందారు. సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించిన శోభన ఎందుకనో పెళ్లిపై దృష్టి సారించలేదు. స్థానిక అడయార్‌లో శిష్య స్కూల్‌ పేరుతో నాట్య పాఠశాలను నెలకొల్పి అధిక సమయాన్ని నృత్య శిక్షణలోనే గడిపేస్తున్నారు.

నృత్య ప్రదర్శనలపై ఎక్కువ మక్కువ చూపుతున్న శోభన 2001లో అనంతనారాయణి అనే పాపను దత్తత తీసుకున్నారు. అలా పెళ్లి చేసుకోరాదని భావించిన శోభన అనూహ్యంగా ఇప్పుడు తనకు ఒక తోడును వెతుక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన చిరకాల స్నేహితుడైన ఒక వ్యక్తితో మూడుముళ్లకు సిద్ధం అవుతున్నట్లు పత్రికల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ కథనాలను నటి శోభన ఖండించలేదు, అలాగనీ పెళ్లిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆమె సన్నిహితులు మాత్రం శోభన త్వరలో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement