కిస్ అన్నది వ్యక్తిగత విషయం :శోభన | Shobhana perform dance show for orphans | Sakshi
Sakshi News home page

కిస్ అన్నది వ్యక్తిగత విషయం :శోభన

Published Wed, Dec 10 2014 5:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

కిస్ అన్నది వ్యక్తిగత విషయం :శోభన

కిస్ అన్నది వ్యక్తిగత విషయం :శోభన

పిల్లల మనోభావాలతో ఆడుకోకండి

నాకెలాంటి డ్రీమ్ రోల్స్ లేవు
నటిగా ఎదగడానికి నృతం సహకరిస్తుంది.
కిస్ అన్నది వ్యక్తిగత విషయం
ఏ తల్లిదండ్రులు కూడా తమ కూతురును ‘కిస్ ఆఫ్ లవ్’  కార్యక్రమంలో పాల్గొనమని చెప్పరనుకుంటా!
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి, నాట్యకారిణి శోభన


సాక్షి,బెంగళూరు : అచ్చమైన అందానికి ప్రతిబింబంలా కనిపించే ముద్దుగుమ్మ, కేరళలో పుట్టి పెరిగినా అచ్చంగా పదహారణాల తెలుగింటి అమ్మాయిలా కనిపించే అందాల భరిణె, మంచి నటిగానే కాదు మరెంతో మంచి నాట్యకారిణిగా కూడా ప్రపంచానికి సుపరిచితురాలే. ఈ వర్ణనంతా బహుభాషా నటి, నాట్యకారిణి శోభన గురించే. అవును అనాధ చిన్నారుల కోసం తాను  నిర్వహించనున్న ఓ కార్యక్రమం కోసం నగరానికి వచ్చిన శోభన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
అనాథల సహాయార్థం 20న ‘శోభన’ నృత్య రూపకం
తల్లిదండ్రులను కోల్పోన పిల్లలు, ఆప్తుల నుంచి దూరంగా ఉంటున్న వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ‘విశ్రాంతి’ స్వచ్ఛంద సంస్థకు చేయూత నందించడానికి బహు భాషనటి, ప్రముఖ నర్తకి శోభన ముందుకు వచ్చారు. స్వయంగా రూపకల్పన చేసిన ‘సమాధిన’ నృత్యరూపకాన్ని ఇక్కడి చౌడయ్యమెమోరియల్ హాల్‌లో ఈనెల 20న ప్రదర్శించనున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు సాగే ఈ నృత్యరూపంలో వివిధ మత గ్రంథాల నుంచి తీసుకున్న శాంతి సందేశాలను ప్రదర్శించనున్నారు.
 
సాక్షి: బహుభాష నటిగా పేరొందిన మీకు ఏ భాషలో నటించడం సులభం?

శోభన: ఒక నటిగా అన్ని భాషలూ నాకు సమానమే, ఎ క్కువ సినిమాలు చేసే అవకాశం తెలుగులో కలిగింది. అదే విధంగా కన్నడ,తమిళ భాషల సినిమాలు కూడా నాకు మంచి నటిగా గుర్తింపును అందించాయి. అయితే నా మాతృభాష అయిన మళయాళంలో నటించడం సులభంగా అనిపిస్తుంది.

సాక్షి: మీరు నటిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతారా? నృత్యకారిణిగానా?

శోభన: రెండూ వేటికవే విభిన్నమైనవి. సితార దేవి నుంచి నా స్నేహితురాలైన భానుప్రియను నటిగా గుర్తిస్తారా లేదా నృత్యకారిణిగా గుర్తిస్తారా అంటే మీరేం చెప్పగలుగుతారు? మంచి నటిగా ఎదిగేందుకు నృత్యం సహకరిస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

సాక్షి: మీకున్న డ్రీమ్ రోల్ ఏంటి?

శోభన: డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. నాకు ఇచ్చిన ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించడం మాత్రమే నాకు తెలుసు. ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ నా డ్రీమ్ రోల్స్ అనే చెబుతాను.

సాక్షి: ఎవరితోనైనా కలిసి నటించలేకపోయానన్న భాద ఉందా?

శోభన: అలాంటిదేమీ లేదు. మణిరత్నం, భాగ్యరాజ్, రాఘవేంద్ర రావు వంటి హేమాహేమీల దర్శకత్వంలో చాలా మంది గొప్ప నటులతో నేను నటించాను. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆ సినిమాల విజయంలో నా వంతు పాత్ర ఉందని గర్వపడుతుంటాను.

సాక్షి: ఇంతకాలంగా నృత్యాలను ప్రదర్శిస్తున్నారు? ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఏంటి?

శోభన: ఇప్పటి ప్రేక్షకులు చాలా తెలివైన వారు, వేదికపై నృత్యం చేస్తున్న వారిని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు. చిన్న తప్పును కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ప్రదర్శన ఇస్తున్న నాట్యకారిణి నుండి తమకు ఎటువంటి భావాలు కావాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. అలాంటా ప్రదర్శనలకే వస్తున్నారు.

సాక్షి: శ్రీ కృష్ణుడి తత్వాలపై ఎక్కువ నృత్యరూపకాలు రూపొందిస్తుంటరనేది ప్రేక్షకుల అభిప్రాయం. దీనికి ఏమంటారు?

శోభన: అటువంటి దేమీ లేదు. అన్ని మతాలకు, అందరి దేవుళ్లకు సంబంధించిన నృత్యరూపకాలు నాకు ఇష్టమే. అయితే కృష్ణుడి నృత్యరూపకాల వల్ల నాకు ఎక్కువ పేరు రావడం వల్ల మీకు అలా అనిపిస్తోంది.

సాక్షి: ప్రస్తుతం వస్తున్న రియాలిటీ షోలపై మీ అభిప్రాయం ఏమిటి?

శోభన: చిన్నారుల్లో ఇష్టం, ప్రతిభ ఉండి వారు నాట్యం, సంగీతం వంటి కలలు నేర్చుకుంటే ఫర్వాలేదు, అంతేకానీ తమ పిల్లలు టీవీల్లో కనిపించడంతో పాటు వారి ద్వారా తమకు పేరు రావాలనే కోరికతో కొంతమంది తల్లిదండ్రులు చిన్నారులపై బలవంతంగా ఈ తరహా రియాలిటీ షోలకు తీసుకొస్తున్నారు. తద్వారా చిన్నారులపై మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోంది.

ఇక చానల్స్ కూడా పిల్లల భావోద్వేగాలతో తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇది నా స్వ అనుభవం.్ఙఒక డ్యాన్స్ షో ఫైనల్స్‌లో 24 ఏళ్ల యువకుడికి, 9ఏళ్ల అబ్బాయికి పోటీ పెట్టారు. ఇందులో 24ఏళ్ల యువకుడు గెలిచాడు. అంతే తొమ్మిదేళ్ల అబ్బాయి తన భావోద్వేగాలను ఆపుకోలేక కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతను శారీరకంగా, మానసికంగా కూడా కుంగిపోయాడు.

ఇక షోలోని న్యాయనిర్ణేతలకు సైతం ఎక్కువ డ్రామాను పండిస్తూ, టీఆర్‌పీని పెంచే విధంగా భావోద్వేగాలను పలికించాలని చెబుతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. అందుకే నేను రియాల్టి షోలకు ఎక్కువగా న్యాయనిర్ణేతగా వెళ్లను.

సాక్షి: మోరల్ పోలిసింగ్‌కు నిరసిస్తూ కేరళాలో ప్రాణం పోసుకున్న కిస్ ఆఫ్ లవ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని పై మీ కామెంట్?

శోభన: ముద్ద అన్నది వ్యక్తిగతమైన విషయం. ‘చాలా మంది బయటికి బహిరంగంగా కిస్ ఆఫ్ లవ్ సాధారణ విషయమని చెబుతుంటారు. అయితే వ్యక్తిగతంగా వస్తే తమ కూతురు కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొనడానికి ఎంతమాత్రం అంగీకరించరు.’ అనేది నా అభిప్రాయం. అయినా ఈ విషయం మంచి ఈ వి షయం మంచిది కాదు అని చెప్పడానికి మనం ఎవరం చెప్పండి. కొంతమందికి మంచి అనిపిం చేంది మరొకొందరికి స మంజసం కాకపోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement