Kiss of Love
-
మళ్లీ ‘కిస్ ఆఫ్ లవ్’
కొచ్చి: కేరళలో మరోసారి ‘కిస్ ఆఫ్ లవ్’ ఆందోళనకు రంగం సిద్ధమైంది. మహిళా దినోత్సవం నాడు కొచ్చిలో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని స్వేచ్ఛావాదులు పిలుపునిచ్చారు. కొచ్చి మెరైన్ డ్రైవ్ మైదానంలో గురువారం సాయంత్రం ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. యువ జంటలపై శివసేన కార్యకర్తలు చేసిన దాడులకు నిరసనగా ఈ ఆందోళనకు దిగుతున్నట్టు ప్రకటించారు. మెరైన్ డ్రైవ్ మైదానానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కోజికోడ్ లోని ఓ హోటల్ లో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడులకు వ్యతిరేకంగా 2014లో ‘కిస్ ఆఫ్ లవ్’ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, కొచ్చి మోరల్ పోలీసింగ్ ఘటనలో కొచ్చి సెంట్రల్ సబ్-ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశారు. ఎనిమిది మంది పోలీసులను ఆర్మెడ్ రిజర్వుడు పోలీసు క్యాంపుకు బదిలీ చేశారు. మోరల్ పోలీసింగ్ ఘటనను కొచ్చి మేయర్ సౌమిని జైన్ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. -
సెక్స్ రాకెట్ కేసులో 'కిస్ ఆఫ్ లవ్' నిర్వాహకుల అరెస్ట్
తిరువనంతపురం: 'కిస్ ఆఫ్ లవ్' ఉద్యమ నిర్వాహకుడు రాహుల్ పశుపలన్, ఆయన భార్య రేష్మీ ఆర్ నాయర్ సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయ్యారు. బుధవారం కేరళ పోలీసులు రాహుల్ దంపతులతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు. కేరళ వ్యాప్తంగా ఆన్లైన్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు కేసు నమోదు చేశారు. ప్రేమికులపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ రాహుల్ 'కిస్ ఆఫ్ లవ్' ఉద్యమాన్ని లేవదీశాడు. దేశంలోని మెట్రో నగరాలకు ఇది విస్తరించింది. కేరళలోని కోజికోడ్‌లో ప్రేమ జంటలున్న ఓ కాఫీ షాపును కొందరు ధ్వంసం చేయడంతో కిస్ ఆఫ్ లవ్ ఉద్యమం ప్రారంభమైంది. జంటలు బహిరంగంగా ముద్దుపెట్టుకోవడాన్ని కిస్ ఆఫ్ లవ్ ప్రోత్సహించడం వివాదాస్పదంగా మారింది. -
కిస్ అన్నది వ్యక్తిగత విషయం :శోభన
పిల్లల మనోభావాలతో ఆడుకోకండి ⇒నాకెలాంటి డ్రీమ్ రోల్స్ లేవు ⇒నటిగా ఎదగడానికి నృతం సహకరిస్తుంది. ⇒కిస్ అన్నది వ్యక్తిగత విషయం ⇒ఏ తల్లిదండ్రులు కూడా తమ కూతురును ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పరనుకుంటా! ⇒‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి, నాట్యకారిణి శోభన సాక్షి,బెంగళూరు : అచ్చమైన అందానికి ప్రతిబింబంలా కనిపించే ముద్దుగుమ్మ, కేరళలో పుట్టి పెరిగినా అచ్చంగా పదహారణాల తెలుగింటి అమ్మాయిలా కనిపించే అందాల భరిణె, మంచి నటిగానే కాదు మరెంతో మంచి నాట్యకారిణిగా కూడా ప్రపంచానికి సుపరిచితురాలే. ఈ వర్ణనంతా బహుభాషా నటి, నాట్యకారిణి శోభన గురించే. అవును అనాధ చిన్నారుల కోసం తాను నిర్వహించనున్న ఓ కార్యక్రమం కోసం నగరానికి వచ్చిన శోభన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అనాథల సహాయార్థం 20న ‘శోభన’ నృత్య రూపకం తల్లిదండ్రులను కోల్పోన పిల్లలు, ఆప్తుల నుంచి దూరంగా ఉంటున్న వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ‘విశ్రాంతి’ స్వచ్ఛంద సంస్థకు చేయూత నందించడానికి బహు భాషనటి, ప్రముఖ నర్తకి శోభన ముందుకు వచ్చారు. స్వయంగా రూపకల్పన చేసిన ‘సమాధిన’ నృత్యరూపకాన్ని ఇక్కడి చౌడయ్యమెమోరియల్ హాల్లో ఈనెల 20న ప్రదర్శించనున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు సాగే ఈ నృత్యరూపంలో వివిధ మత గ్రంథాల నుంచి తీసుకున్న శాంతి సందేశాలను ప్రదర్శించనున్నారు. సాక్షి: బహుభాష నటిగా పేరొందిన మీకు ఏ భాషలో నటించడం సులభం? శోభన: ఒక నటిగా అన్ని భాషలూ నాకు సమానమే, ఎ క్కువ సినిమాలు చేసే అవకాశం తెలుగులో కలిగింది. అదే విధంగా కన్నడ,తమిళ భాషల సినిమాలు కూడా నాకు మంచి నటిగా గుర్తింపును అందించాయి. అయితే నా మాతృభాష అయిన మళయాళంలో నటించడం సులభంగా అనిపిస్తుంది. సాక్షి: మీరు నటిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతారా? నృత్యకారిణిగానా? శోభన: రెండూ వేటికవే విభిన్నమైనవి. సితార దేవి నుంచి నా స్నేహితురాలైన భానుప్రియను నటిగా గుర్తిస్తారా లేదా నృత్యకారిణిగా గుర్తిస్తారా అంటే మీరేం చెప్పగలుగుతారు? మంచి నటిగా ఎదిగేందుకు నృత్యం సహకరిస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సాక్షి: మీకున్న డ్రీమ్ రోల్ ఏంటి? శోభన: డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. నాకు ఇచ్చిన ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించడం మాత్రమే నాకు తెలుసు. ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ నా డ్రీమ్ రోల్స్ అనే చెబుతాను. సాక్షి: ఎవరితోనైనా కలిసి నటించలేకపోయానన్న భాద ఉందా? శోభన: అలాంటిదేమీ లేదు. మణిరత్నం, భాగ్యరాజ్, రాఘవేంద్ర రావు వంటి హేమాహేమీల దర్శకత్వంలో చాలా మంది గొప్ప నటులతో నేను నటించాను. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆ సినిమాల విజయంలో నా వంతు పాత్ర ఉందని గర్వపడుతుంటాను. సాక్షి: ఇంతకాలంగా నృత్యాలను ప్రదర్శిస్తున్నారు? ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఏంటి? శోభన: ఇప్పటి ప్రేక్షకులు చాలా తెలివైన వారు, వేదికపై నృత్యం చేస్తున్న వారిని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు. చిన్న తప్పును కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ప్రదర్శన ఇస్తున్న నాట్యకారిణి నుండి తమకు ఎటువంటి భావాలు కావాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. అలాంటా ప్రదర్శనలకే వస్తున్నారు. సాక్షి: శ్రీ కృష్ణుడి తత్వాలపై ఎక్కువ నృత్యరూపకాలు రూపొందిస్తుంటరనేది ప్రేక్షకుల అభిప్రాయం. దీనికి ఏమంటారు? శోభన: అటువంటి దేమీ లేదు. అన్ని మతాలకు, అందరి దేవుళ్లకు సంబంధించిన నృత్యరూపకాలు నాకు ఇష్టమే. అయితే కృష్ణుడి నృత్యరూపకాల వల్ల నాకు ఎక్కువ పేరు రావడం వల్ల మీకు అలా అనిపిస్తోంది. సాక్షి: ప్రస్తుతం వస్తున్న రియాలిటీ షోలపై మీ అభిప్రాయం ఏమిటి? శోభన: చిన్నారుల్లో ఇష్టం, ప్రతిభ ఉండి వారు నాట్యం, సంగీతం వంటి కలలు నేర్చుకుంటే ఫర్వాలేదు, అంతేకానీ తమ పిల్లలు టీవీల్లో కనిపించడంతో పాటు వారి ద్వారా తమకు పేరు రావాలనే కోరికతో కొంతమంది తల్లిదండ్రులు చిన్నారులపై బలవంతంగా ఈ తరహా రియాలిటీ షోలకు తీసుకొస్తున్నారు. తద్వారా చిన్నారులపై మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇక చానల్స్ కూడా పిల్లల భావోద్వేగాలతో తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇది నా స్వ అనుభవం.్ఙఒక డ్యాన్స్ షో ఫైనల్స్‌లో 24 ఏళ్ల యువకుడికి, 9ఏళ్ల అబ్బాయికి పోటీ పెట్టారు. ఇందులో 24ఏళ్ల యువకుడు గెలిచాడు. అంతే తొమ్మిదేళ్ల అబ్బాయి తన భావోద్వేగాలను ఆపుకోలేక కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతను శారీరకంగా, మానసికంగా కూడా కుంగిపోయాడు. ఇక షోలోని న్యాయనిర్ణేతలకు సైతం ఎక్కువ డ్రామాను పండిస్తూ, టీఆర్పీని పెంచే విధంగా భావోద్వేగాలను పలికించాలని చెబుతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. అందుకే నేను రియాల్టి షోలకు ఎక్కువగా న్యాయనిర్ణేతగా వెళ్లను. సాక్షి: మోరల్ పోలిసింగ్‌కు నిరసిస్తూ కేరళాలో ప్రాణం పోసుకున్న కిస్ ఆఫ్ లవ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని పై మీ కామెంట్? శోభన: ముద్ద అన్నది వ్యక్తిగతమైన విషయం. ‘చాలా మంది బయటికి బహిరంగంగా కిస్ ఆఫ్ లవ్ సాధారణ విషయమని చెబుతుంటారు. అయితే వ్యక్తిగతంగా వస్తే తమ కూతురు కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొనడానికి ఎంతమాత్రం అంగీకరించరు.’ అనేది నా అభిప్రాయం. అయినా ఈ విషయం మంచి ఈ వి షయం మంచిది కాదు అని చెప్పడానికి మనం ఎవరం చెప్పండి. కొంతమందికి మంచి అనిపిం చేంది మరొకొందరికి స మంజసం కాకపోవచ్చు. -
ముద్దు పెట్టుకుంటే....
బెంగళూరు: నగరంలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు అధికారులు హెచ్చరించారు. చట్టాలను వ్యతిరేకించి ఎవరైనాఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తమ పని తాము చేసుకుని వెళ్తామని నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ హెచ్చరించారు. మోరల్ పోలీస్గిరికి వ్యతిరేకంగా ఆదివారం బెంగళూరులోని టౌన్‌హాల్ వద్ద కొంతమంది యువతీయువకులు 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం నిర్వహించదలిచిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు అనుమతి ఇచ్చేది లేదని నగర పోలీసులు తేల్చిచెప్పిన నేపథ్యంలో నిర్వాహకుల్లో ఇద్దరు శనివారం సాయంత్రం కమిషనర్ ఎం.ఎన్రెడ్డిని నేరుగా కలుసుకుని కార్యక్రమానికి అనుమతించాల్సిందిగా కోరారు. కార్యక్రమం వల్ల శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగదని వారు తెలిపారు. పరిశీలించి అనుమతి ఇచ్చే విషయం ఆలోచిస్తామని కమిషనర్ వారికి తెలిపారు. దాంతో ఆదివారం జరగాల్సిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం వాయిదా పడింది. అయినా టౌన్‌హాల్ దగ్గర ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. -
‘కిస్ ఆఫ్ లవ్’ వాయిదా!
బెంగళూరు: వివాదాస్పద ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం వాయిదా పడనుంది. మోరల్ పోలీస్గిరికి వ్యతిరేకంగా ఆదివారం బెంగళూరులోని టౌన్‌హాల్ వద్ద కొంతమంది యువత నిర్వహించదలిచిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు అనుమతి ఇచ్చేది లేదని నగర పోలీసులు తేల్చిచెప్పిన నేపథ్యంలో నిర్వాహకుల్లో ఇద్దరు శనివారం సాయంత్రం కమిషనర్ ఎం.ఎన్రెడ్డిని నేరుగా కలుసుకుని కార్యక్రమానికి అనుమతించాల్సిందిగా కోరారు. కార్యక్రమం వల్ల శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగదని వారు తెలిపారు. పరిశీలించి అనుమతి ఇచ్చే విషయం ఆలోచిస్తామని కమిషనర్ వారికి తెలిపారు. దీంతో ఆదివారం జరగాల్సిన కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం. -
గాడిదలు కాసేందుకు వెళ్లావా..
ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన మంత్రి సూరకె వ్యతిరేకిస్తూ నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలు అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన మంత్రి బెంగళూరు: ‘ఇక్కడ గొడవ జరుగుతుంటే ఎక్కడి వెళ్లావ్.. గాడిదలు కాసేందుకు వెళ్లావా..?’ అంటూ రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె ఓ ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించారు. వివరాలు... మంత్రి వినయ్‌కుమార్ సూరకె హావేరి ప్రాంతంలో బుధవారం పర్యటించారు. ఆయన పర్యటనను నిరసిస్తూ స్థానిక బీజేపీ నేతలు నల్లజెండాలతో ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ‘కిస్ ఆఫ్ లవ్’ అనుమతికి సంబంధించి కొద్ది రోజుల క్రితం మంత్రి వినయ్‌కుమార్ సూరకె, ఎంపీ శోభాకరంద్లాజేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంత్రి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు ఆయన్ను ఘెరావ్ చేశారు. దీంతో మంత్రి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ స్థానిక ఎస్ఐపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘నేను నగరంలో పర్యటనలో ఉన్న విషయం మీకు తెలియదా? ఇక్కడ వీళ్లు నా పర్యటనను అడ్డుకుంటుంటే, గొడవ జరుగుతుంటే ఎక్కడికి వెళ్లావ్? గాడిదలు కాసేందుకు వెళ్లి వస్తున్నావా’ అంటూ మండిపడ్డారు. ఇందుకు ఎస్ఐ స్పందిస్తూ ‘సార్ కాస్తంత గౌరవంగా మాట్లాడండి సార్’ అనడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో బీజేపీ నేతలు మంత్రి తీరును ఖండిస్తూ మరింత పెద్దపెట్టున నినాదాలు చేయడంతో వినయ్ కుమార్ సూరకె అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రేమ జంటలకు పార్కుల్లో నో ఎంట్రీ!
కిస్ ఆఫ్ లవ్ వివాదం ప్రేమ జంటల పాలిట శాపంగా మారుతోంది. కాసేపు పార్కుల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకునేందుకు ఇక తంటాలు పడాల్సిన పరిస్థితి. పార్కుల్లో పోలీసుల నిఘా పెరగటం ఇందుకు నిరద్శనం. ఈ నిఘా కాస్త గిల్నగర్ పార్కులో మంగళవారం వివాదానికి దారి తీసింది. సాక్షి, చెన్నై:కిస్ ఆఫ్ లవ్ పేరిట కొందరు విద్యార్థులు ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. ఉత్తరాదికి పరిమితమైన బహిరంగ ప్రదేశాల్లో ముద్దుల పోటీ దక్షిణాదికి పాకింది. చెన్నై ఐఐటీ విద్యార్థులు దీన్ని ప్రారంభించారు. ఇది వివాదానికి దారి తీసింది. ఓ వైపు ఆందోళనలు సాగుతుంటే, మరో వైపు కోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. అదే సమయంలో మరికొన్ని కళాశాలల్లో విద్యార్థులు కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే పనిలో పడ్డారు. తమిళనాడులో అత్యధికంగా ్రైపైవేటు కళాశాలల్లో బయటి రాష్ట్రాల విద్యార్థులే చదువుకుంటున్నారు. దీంతో ముద్దుల పోటీ రాష్ట్రంలో చాప కింద నీరులా పాకుతోంది. కోయంబత్తూరులో నిర్వహించ తలబెట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే పనిలో పోలీసులు పడ్డారు. కిస్ ఆఫ్ లవ్...కిస్ ఆఫ్ లవ్ అన్న ఈ ప్రచారం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతుండడంతో ప్రేమ జంటల మీద అందరి దృష్టి పడింది. సాధారణంగానే కొన్ని చోట్ల అనేక జంటలు శ్రుతి మించి వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రచారం పుణ్యమా అని మరింతగా రెచ్చి పోవచ్చన్న సంకేతాలు బయల్దేరాయి. జంటలకు నో ఎంట్రీ: ఇన్నాళ్లు ఏ పార్కుల్లో బడితే ఆ పార్కుల్లో ప్రేమ జంటలు పెద్ద ఎత్తున కనిపించేవి. మెరీనా తీరంలో సాయంత్రం అయితే చాలు ప్రేమ జంటలే...జంటలు. కొన్ని జంటలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే, మరికొన్ని జంటలు సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్లి పోతుంటారుు. అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్లను ప్రశ్నించ లేని పరిస్థితి. బహిరంగ ప్రదేశాల్లో తమ ఇష్టం అని గర్జించే జంటలే అధికం. ఇక, ఈ కిస్ ఆఫ్ లవ్ పుణ్యమా అని నిజమైన ప్రేమ జంటలకు సైతం తంటాలు తప్పడం లేదు. చిన్న పిల్లల పార్కులు, వృద్ధుల వాకింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన పార్కుల్లో ఇక ప్రేమ జంటల్ని అనుమతించ కూడదన్న నిర్ణయానికి పోలీసులు వచ్చినట్టు తెలుస్తున్నది. కొన్ని జంటల తీరు పిల్లల మీద ప్రభావం చూపుతుందన్న భావనతో ఏకంగా జంటల మీద నిఘా పెట్టేందుకు సిద్ధమయ్యారు. పార్కుల్లోకి వచ్చే జంటలు అసభ్యకరంగా ప్రవ ర్తించకుండా క్లాస్ పీకేందుకు రెడీ అయ్యారు. వివాదం : చిల్డ్రన్స్ పార్కుల్లో జంటలకు అనుమతి లేదన్న అంశానికి అద్దం పట్టే ఘటన మంగళవారం గిల్ నగర్లో చోటు చేసుకుంది. జంటల్ని తరిమేందుకు పోలీసులు రావడం వివాదానికి దారి తీసింది. చెన్నై చూలై మేడు గిల్ నగర్‌లోని పార్కులో ఉదయం పోలీసులు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. అక్కడి జంటల్ని విచారించడం మొదలెట్టారు. కొందరు జంటలు పోలీసుల రాకతో పలాయనం చిత్తగించారుు. మరి కొందరు అయితే, తమకేం భయం అన్నట్టుగా అక్కడే కూర్చుండి పోయారు. కొన్ని జంటలు పోలీసుల మీద తిరగబడే యత్నం చేయడం వివాదాస్పదం అయింది. ఆ జంటల్ని విచారించే పనిలో పోలీసులు నిమగ్నం కావడంతో కాసేపు వాగ్యుద్ధం చోటు చేసుకుంది. కొందరు అయితే, ఆ జంటలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో ఇక వివాదం పెద్దది అవుతుందన్న విషయాన్ని గ్రహించి పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. దీనిపై ఆ ప్రాంత పోలీసు ఇన్చార్జ్ అధికారి ఒకరిని ప్రశ్నించగా, గిల్ నగర్ పార్కులో పిల్లలు, వృద్ధులకు మాత్రమే ప్రవేశం ఉందన్నారు. ప్రేమ జంటలకు నో ఎంట్రీ అని స్పష్టం చేశారు. కొన్ని జంటలు లోనికి వెళ్లి శ్రుతి మించి వ్యవహరిస్తున్నాయని తమకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటప్పుడు తనిఖీలు చేయాల్సిందేగా? అని ఎదురు ప్రశ్న వేయడం గమనార్హం. -
ముద్దు.. వద్దు
‘కిస్’కు అనుమతివ్వబోమని స్పష్టం చేసిన నగర పోలీసు కమిషనర్ బెంగళూరు : కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి ఎలాంటి పరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తేల్చిచెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంసృతి ప్రకారమే కాకుండా ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం బహిరంగ స్థలాలలో అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించు కోవడం నేరమని అన్నారు. ఈనెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడి టౌన్‌హాల్ దగ్గర కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని రచిత తనేజా ఇప్పటికే అర్జీ సమర్పించారని అన్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో ఎంత మంది పాల్గొంటారు.. వారు ఎక్కడి నుంచి వస్తున్నారో.. తదితర వివరాలు ఆ అర్జీలో లేవని ఎంఎన్ రెడ్డి అన్నారు. అయితే లవ్ ఆఫ్ కిస్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వ రాదని ఇప్పటికే పలు సంఘ, సంస్థలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. కేరళ, ఢిల్లీలో జరిగిన కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలకు భంగం కలగరాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కాగా, కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తామ ఎలాగైనా అడ్డుకుంటామని చట్టానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడిన శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌కు నోటీసులు జారీ చేశామని అన్నారు. కిస్ ఆఫ్ లవ్ కార్యక్రామన్ని నిర్వహించినా, ఆ సమయంలో అడ్డుకోడానికి ఎవరైనా ప్రయత్నించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా తమ పని తాము చేసుకుని వెళ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్, బెంగళూరు కేంద్ర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
ముద్దు పవిత్రం... ప్రచారమే అసభ్యం
‘కిస్ ఆఫ్ లవ్’ ఉద్యమంపై చర్చలు, వాదోపవాదాలు ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. కోర్టులు ఇలాంటి చర్యలను సమర్థించినప్పటికీ, నైతిక విలువల పరిరక్షక సేనలు ఏ మాత్రం రాజీ పడడం లేదు. బహిరంగ చుంబనాలను ఇవి ఖండిస్తున్నాయి. వాటిని నివారించే, నిరోధించే ప్రయత్నాలను చేస్తున్నాయి. సేనలతో ఇప్పుడు ఉదారవాదులు, స్త్రీవాదులు సైతం చేతులు కలిపారు. సాధారణంగా మానవ కమిషన్ల మీద, ఉమెన్ కమిషన్ల మీద మనకో అభిప్రాయం ఉంటుంది. మనుషులు ఎంత చెడ్డా, వారి హక్కులకు భంగం కలిగించే అధికారం వ్యక్తులకు గానీ, ప్రభుత్వాలకు గానీ ఉండకూడదని ఈ కమిషన్లు వాదిస్తాయని అనుకుంటాం. అయితే ఇప్పుడీ అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలి. తాజాగా కర్ణాటక మహిళా కమిషన్ ‘కిస్ ఆఫ్ లవ్’ను ‘అనాగరకమైన, ఆటవికమైన’ చర్యగా అభివర్ణించింది. ఇలాంటి ప్రదర్శనలకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై కర్ణాటక మహిళా కమిషన్ ైచె ర్ పర్సన్ మంజులా మానస ఆ రాష్ట్ర హోమ్ మంత్రి కె.జె.జార్జికి ఒక లేఖ రాశారు. అందులో ఆమె ‘కిస్ ఆఫ్ లవ్’ ప్రదర్శనలను, వాటి నిర్వాహకులను విమర్శించడానికి ఎలాంటి తడబాట్లూ ప్రదర్శించలేదు. నిక్కచ్చిగా, నిస్సంకోచంగా తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ‘‘కొన్ని ప్రవర్తనలు మనుషులకు, జంతువులకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తాయి. ఆ వ్యత్యాసాలను మనుషులు పాటించాలి. నైతిక విలువల పరిరక్షకులకు వ్యతిరేకంగా వీధులలో బహిరంగంగా వీళ్లు చేస్తున్న ముద్దుల ప్రదర్శన అర్థరహితమైనది. ఎంతో పవిత్రమైన ముద్దును వీళ్లు బజారుకీడుస్తున్నారు. ఇదొక అసభ్యకరమైన ప్రచార ధోరణి’’ అని మంజులా మానస ఆ లేఖలో రాశారు. ‘‘ఈ ధోరణిని కనుక నిరోధించకపోతే సభ్య సమాజపు పునాదులే కదిలిపోతాయి’’అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంజుల లేఖను హోమ్‌మంత్రి జార్జి, బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డికి పంపుతూనే, రాజ్యాంగం ప్రకారం సంఘ విద్రోహం కాని సంఘటనలను నిషేధించే హక్కు ప్రభుత్వానికి లేదని అంటున్నారు. మంజులా మానస ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఏమిటీ ‘కిస్ ఆఫ్ లవ్’? ఇదొక నిరసన ప్రదర్శన. ‘మోరల్ పోలీసింగ్’కి వ్యతిరేకంగా 2014 నవంబర్ 2న కొచ్చి (కేరళ)లోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ప్రారంభమయింది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలకు ఒక ఉద్యమంలా వ్యాపించింది. సామాజిక విలువల పరిరక్షకులమని చెప్పుకుంటున్న కొన్ని మత సంస్థలు, రాజకీయ పక్షాలు యువతీయువకుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా తమపై దౌర్జన్యానికీ, దాడులకు పాల్పడడాన్నే ‘మోరల్ పోలీసింగ్’గా ప్రదర్శనకారులు వ్యవహరిస్తున్నారు. మొదట ఫేస్ బుక్ ద్వారా ‘కిస్ ఆఫ్ లవ్’ ఉద్యమం ఊపిరి పోసుకుంది. మోరల్ పోలీసింగ్‌పై తమ నిరసనను వ్యక్తం చేయడానికి యువతీయువకులు ఒకర్నొకరు బహిరంగంగా ముద్దుపెట్టుకోవాలని ఫేస్బుక్లో అందిన పిలుపునకు దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే లక్షా 20 వేలకు పైగా ‘లైక్’లు వచ్చాయి! తర్వాతి సంగతి తెలిసిందే. దేశంలోని మెట్రో నగరాలలో కిస్ ఆఫ్ లవ్ ప్రదర్శనలు జరిగాయి. వీటిపై ఎప్పటిలాగే భారతీయ జనతా యువమోర్చా, విశ్వహిందూ పరిషత్, శివసేన, ఎస్.డి.పి.ఐ. (సోషల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా), భజరంగ దళ్, హిందూసేన వంటి పార్టీలు విరుచుకు పడ్డాయి. కొసమెరుపు ఏమిటంటే, బహిరంగ ప్రదేశాలలో ముద్దులు పెట్టుకోవడం అసభ్యత కాదని, అందుచేత ఈ చర్యలను నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం! -
'కిస్ ఆఫ్ లవ్'కు అనుమతి ఇచ్చేదిలేదు: పోలీసు కమిషనర్
బెంగళూరు : 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమానికి ఎలాంటి పరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తేల్చి చెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కతి ప్రకారమే కాకుండా ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం బహిరంగ స్థలాల్లో అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం నేరమని ఆయన తెలిపారు. ఈనెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడి టౌన్‌హాల్ దగ్గర 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సామాజిక కార్యకర్త రచిత తనేజా ఇప్పటికే అర్జీ సమర్పించారని అన్నారు. కాగా, కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తాము ఎలాగైనా అడ్డుకుంటామని చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసిన శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ** -
ముద్దు పెట్టుకోవడం తప్పేమీ కాదు!
‘కిస్ ఆఫ్ లవ్’... ఈ వ్యవహారం ప్రస్తుతం చాపకింద నీరులా దేశం మొత్తం వ్యాప్తి చెందుతోంది. కేరళ బీచ్‌లో నిదానంగా మొదలై ఇప్పుడో ఉద్యమంలా రూపుదాల్చుతోంది. ‘పరస్పరం ప్రేమించుకున్నప్పుడు బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తప్పుకాదు..’ అనేది ‘కిస్ ఆఫ్ లవ్’ కాన్సెప్ట్. దీనిని వ్యతిరేకించేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. కేరళ రాష్ట్రంలో ‘కిస్ ఆఫ్ లవ్’ నిర్వహించాలనుకున్నప్పుడు ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) వాళ్లు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. పోలీసులు కూడా ‘మోరల్ పోలీసింగ్’ చేస్తూ ఈ ముద్దుల పండుగను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై ఇప్పటివరకూ సినిమా సెలబ్రిటీలెవరూ స్పందించలేదు. అయితే... మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మాత్రం సామాజిక మాధ్యమం ద్వారా ‘కిస్ ఆఫ్ లవ్’కి మద్దతు పలికారు. ‘‘నచ్చిన వారిని ముద్దు పెట్టుకునే హక్కు మనకుంది. అంతే తప్ప మన ముందు ఇతరులు ముద్దు పెట్టుకోకూడదు అని నియంత్రించే హక్కు ఎవరికీ లేదు. ‘ముద్దు’ అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. దీన్ని చట్టపరిధిలోకి తీసుకురావడం తప్పు’’ అని పేర్కొన్నారు మోహన్‌లాల్. ‘మోరల్ పోలీసింగ్’పై స్పందిస్తూ- ‘‘ప్రేమను తెలియజెప్పే గొప్ప సాధనం ముద్దు. దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం. వంతెనలు కూలిపోతున్నప్పుడు, రోడ్లు గోతులుగా మారిపోతున్నప్పుడు, పసికందులు అత్యాచారాలకు గురి అవుతున్నప్పుడు, తాగే నీరు కలుషితంగా మారుతున్నప్పుడు, కన్న తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొడుతున్నప్పుడు, యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల్లో పడి ఉన్న మనిషిని పట్టించుకోకుండా ఎవరి మానాన వాళ్ల్లు పోతున్నప్పుడు.. పట్టించుకోనివాళ్ళకు ఈ బహిరంగ చుంబనం మాత్రం ఘోరంగా కనిపించటం శోచనీయం. ఇష్టం లేకపోతే తల తిప్పుకోండి. బాహాటంగా ముద్దు పెట్టుకోవడం తప్పేమీ కాదు’’ అని ఘాటుగా స్పందించారు మోహన్‌లాల్. -
కిస్..నో!
అనుమతి నిరాకరించిన పోలీసు అధికారులు! బెంగళూరు : మోరల్ పోలీసింగ్కి వ్యతిరేకంగా నగరంలో నిర్వహించ తలపెట్టిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి ఇక బ్రేక్ పడినట్లే. ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన రచితా తనేజాకు పోలీసులు తేల్చి చెప్పినట్లు సమాచారం. మోరల్ పోలీసింగ్కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో కూడా కొన్ని ప్రజా హక్కుల సంఘాలు నిర్వహించాయి. ఇక ఇందులో భాగంగానే ఉద్యాన నగరిలో సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నగరానికి చెందిన ప్రజాహక్కుల కార్యకర్త రచితా తనేజా నిర్ణయించారు. ఇతర నగరాల్లో ఈ కార్యక్రమం సందర్భంలో పోలీసులతో పాటు అనేక సంఘాలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అలాంటి పరిస్థితులు నగరంలో ఏర్పడరాదనే ఆలోచనతో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా రచితా తనేజా పోలీసు శాఖను కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణపై శ్రీరామసేన, ఆర్ఎస్ఎస్ తదితర సంఘాలతో పాటు రాజకీయ నేతలు, ఇతర వర్గాల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ఈ తరహా కార్యక్రమాలు భారతీయ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమని, ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ఎంతమాత్రం అనుమతి ఇవ్వరాదని సైతం పోలీసులకు ఫిర్యాదు అందాయి. నగరంలో కనుక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పక అడ్డుకుంటామని శ్రీరామసేన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి కనుక అనుమతి ఇస్తే నగరంలో శాంతి-భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం సైతం భావించడంతో ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని రాష్ట్ర హోం శాఖ నుంచి పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని పోలీసులు ప్రజా హక్కుల కార్యకర్త రచితా తనేజాకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. -
ముద్దు రచ్చ
ఐఐటీ విద్యార్థుల ముద్దు బాగోతం రచ్చకెక్కింది. ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇది ఏకంగా కోర్టుకు చేరింది. వ్యభిచార నేరం కింద కేసు నమోదుకు పిటిషనర్ పట్టుబట్టడంతో సైదాపేట కోర్టు విచారణకు శ్రీకారం చుట్టింది. సాక్షి, చెన్నై: దేశంలో యువతీ యువకుల మధ్య ‘కిస్ ఆఫ్ లవ్’ పోటీలు పెద్ద చర్చకే దారి తీశారుు. ఉత్తరాదిలో ఇది చాపకింద నీరులా సాగినా, దక్షిణ భారతంలోని కేరళలో సాగిన ఈ పోటీ లు వివాదాన్ని సృష్టించాయి. సంప్రదాయాన్ని మంట గలుపుతూ కేరళ యువతీ, యువకు లు కొందరు వ్యవహరించిన తీరు ఆ రాష్ట్రంలో కలకలాన్ని రేపింది. దీంతో కిస్ ఆఫ్ లవ్ అంటూ ముద్దుల్లో మునిగిన యువతీ యువకులపై కేసుల మోత మోగింది. అదే సమయంలో చెన్నై ఐఐటీ విద్యార్థుల రూపంలో కిస్ ఆఫ్ లవ్ తమిళనాడులోకి ప్రవేశించింది. గత వారం ఐఐటీ ఆవరణలో వంద జంటలు కౌగిలింతలతో ముద్దుల్లో మునిగితేలాయి. తొలుత ఓ హాల్లో రహస్యంగా ఏర్పాట్లు చేసుకుని, మీడియా కంట పడకుండా ముద్దుల్లో మునిగారు. చివరకు మీడియాకు సమాచారం అందడంతో తమకేమి భయం అన్నట్టుగా ఈ జంటల్లో కొందరు చివరకు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వివాదం : ఈ ముద్దుల వ్యవహారం పత్రికల్లో, టీవీల్లో రావడంతో వివాదం రేపింది. సంస్కృతి, సంపద్రాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలంగా ఉన్న తమిళనాడులో బహిరంగంగా ఐఐటీ యువతీ, యువకులు సాగించిన ముద్దుల తీరు రచ్చకెక్కింది. ఐఐటీ యాజమాన్యంపై, విద్యార్థులపై చర్యకు పట్టుబడుతూ ఆందోళనలు బయలుదేరాయి. ఓ వైపు పీఎంకే, మరో వైపు హిందూ మున్నని నేతృత్వంలో ఆందోళనలు సాగుతున్నాయి. పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. విచారణ పేరిట పోలీసులు ఆ ఫిర్యాదులపై ఇంత వరకు స్పందించ లేదు. సంస్కృతి సంప్రదాయాల్ని మంట గలిపే విధంగా ఐఐటీలో సాగిన ఈ వ్యవహారం, ఇతర కళాశాలలకు పాకకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. పిటిషన్ దాఖలు: ఓవైపు ఆందోళనలు సాగుతుంటే, మరో వైపు వ్యవహారం కోర్టుకు చేరింది. ఐఐటీలో కొందరు విద్యార్థులు వ్యవహరించిన తీరును దుయ్యబడుతూ సామాజిక సేవకుడు వారాహి గురువారం సైదాపేట తొమ్మిదో మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని తన పిటిషన్లో వివరించారు. తమిళనాడులో సంస్కృతి, సంప్రదాయం, భాషా పరంగా అనుసరిస్తున్న విధానాలు గుర్తు చేశారు. అయితే, ఐఐటీ విద్యార్థుల రూపంలో తమిళనాడులోని ఇతర విద్యార్థులకు పెద్ద కలంకం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఐటీలో కొందరు విద్యార్థులు వ్యవహరించిన అనాగరిక చర్యతో తమిళనాడులోని విద్యార్థినీ విద్యార్థుల గౌరవానికి భంగం కల్గిందని పేర్కొన్నారు. పత్రికల్లో, టీవీల్లో ఆ విద్యార్థుల వ్యవహారం అసభ్యకరంగా ఉందని, మరీ శ్రుతి మించి వారు వ్యవహరించిన తీరు తమిళ సంస్కృతికి మచ్చను చేకూర్చేలా ఉందన్నారు. సంప్రదాయాల్ని మంట కలిపే విధంగా విద్యార్థులు వ్యవహరిస్తుంటే, ఐఐటీ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కిస్ ఆఫ్ లవ్ పేరిట ఒకే చోట అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమికూడి అసభ్యకరంగా వ్యవహరిస్తే, అడ్డుకోవాల్సిన ఐఐటీ వర్గాలు చోద్యం చూశాయని ఆరోపించారు. విచారణకు : కేరళలో విద్యార్థులు వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసిందని తన పిటిషన్లో వారాహి గుర్తు చేశారు. అయితే, ఇక్కడ తమిళ సంస్కృతిని మంట కలిపే విధంగా వ్యవహరించిన ఐఐటీలోని కొందరు విద్యార్థులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదులు చేరాయని, కొన్ని సంఘాలు ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఐఐటీలో అసభ్యకరంగా బహిరంగంగా ముద్దుల్లో మునిగి తేలిన విద్యార్థులపై, ఐఐటీ డెరైక్టర్‌పై వ్యభిచార నేరం, భారత శిక్షాస్మృతి చట్టాల కింద కేసు నమోదు చేయాలని, ఇందుకు తగ్గ ఆదేశాలను పోలీసులకు జారీ చేయాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి శాంతి విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరపున న్యాయవాది కృష్ణమూర్తి హాజరైన వాదన విన్పించారు. తదుపరి విచారణను డిసెంబరు ఒకటో తేదీకి న్యాయమూర్తి శాంతి వాయిదా వేశారు. -
మన సంస్కృతికి విరుద్ధం
కిస్ ఆఫ్ లవ్’పై రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ బెంగళూరు : మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా నగరంలో కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలు నిర్వహించ తలపెట్టిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ వెల్లడించారు. గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకించేందుకు ‘కిస్ ఆఫ్ లవ్’ తరహా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రేమ, అభిమానం అనేవి సంస్కారం అనే పరిధిని దాటకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సంస్కారమనే హద్దులు దాటే ఎలాంటి కార్యక్రమానికైనా భారతీయ సంస్కృతిలో స్థానం లేదని, అందువల్ల ఇలాంటి కార్యక్రమాలను తాను సమర్థించబోనని పేర్కొన్నారు. ఇక పరప్పన అగ్రహార జైలులోని మహిళా ఖైదీలపై అక్కడి వార్డర్లు లైంగిక హింసకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందిస్తూ... ‘నేను ఈ విషయంపై పరప్పన అగ్రహార జైలులోని ఖైదీలను కలిసి మాట్లాడాను. వారు నాతో ఏ విషయాలైతే చెప్పారో అవే మీడియాకు సైతం వివరించాను. ఇందులో నేను సొంతంగా కల్పించినవి ఏమీ లేవు’ అని స్పష్టం చేశారు. -
బెంగళూరుకు పాకనున్న 'ముద్దుల' గోల
బెంగళూరు: మోరల్ పోలీసింగ్ (నైతిక పోలీసుగిరి)కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన 'కిస్ ఆఫ్ లవ్' ఇప్పుడు ఉద్యాన నగరి బెంగళూరును తాకనుంది. నగరంలోని కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలతో కలిసి నగరానికి చెందిన హక్కుల కార్యకర్త రచితా తనేజా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 22న నగరంలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ** -
చెన్నైకి చేరిన కిస్ ఆఫ్ లవ్
-
ఢిల్లీని తాకిన ముద్దుల పోరాటం!
న్యూఢిల్లీ/కొచ్చి: మొన్న కిస్ ఆఫ్ లవ్... నిన్న హగ్ ఆఫ్ లవ్... కేరళలోని కొచ్చి విద్యార్థులు నైతిక పోలీసింగ్ (నైతిక నియమావళి పేరుతో ఆంక్షలు)ను వ్యతిరేకిస్తూ తలపెట్టిన నిరసనలు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయ వాదులు వీరికి అడ్డు తగులుతుండడంతో ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీస్తోంది. సంప్రదాయ వాదులు తమ యత్నాలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ‘కిస్ ఆఫ్ లవ్’ మద్దతు దారులు కొందరు శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సుమారు 60 మంది విద్యార్థులు జందేవాలన్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యాలయం వరకు ప్రదర్శనగా రాగా రెండంచెల బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. వీరికి దీటుగా హిందూసేన కూడా అదే సమయంలో మరో ప్రదర్శన తలపెట్టగా వారి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. మరోవైపు కిస్ ఆఫ్ లవ్‌కు మద్దతు ప్రకటిస్తూ కొచ్చిలోని మహారాజా కాలేజీ విద్యార్థులు ‘హగ్ ఆఫ్ లవ్’ కార్యక్రమం నిర్వహించారు. -
సమాజంలో మార్పు రావాలి
అప్పుడే అత్యాచారాలను అడ్డుకోవచ్చు: కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి కిస్ ఆఫ్ లవ్‌ను కమ్యూనిస్టులే ప్రోత్సహిస్తున్నారు: ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు సాక్షి, విజయవాడ బ్యూరో: దేశంలో అత్యాచారాలు ఆగాలంటే సమాజంలో మార్పు రావాలని, ఈ మార్పు ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాల్సిన బాధ్యత అమ్మలదేనన్నారు. విజయవాడలో 2 రోజులుగా జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర స్థాయి మహిళా సమ్మేళనం ముగింపు సభలో శనివారం ఆమె ప్రసంగించారు. ఆడపిల్లలకు 18 ఏళ్ల వయసులోపు పెళ్లిళ్లు నిరోధించడం, వరకట్న నిరోధం, గృహ హింస, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి అనేక చట్టాలు అమల్లో ఉన్నా వాటిని యథేచ్ఛంగా ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఏటా 9 శాతం చొప్పున పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలకు పేదరికం కూడా మరో ప్రధాన కారణమని, పేదరిక నిర్మూలనకు జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేయాల్సివుందని అన్నారు. రాజధానికి భూ సమీకరణ వల్ల రైతులకు నష్టం జరగదని, దీనిపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందని పురందేశ్వరి చెప్పారు. సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంలో వచ్చిన భూసేకరణ చట్టం వల్ల పరిశ్రమలకు ఇబ్బందులున్నాయని, దాన్ని మార్చడానికి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మీ పిల్లలను కిస్ ఆఫ్ లవ్‌కు పంపుతారా? ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు మురళీమనోహర్ మాట్లాడుతూ.. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే సీపీఐ, సీపీఎం పార్టీలే కిస్ ఆఫ్ లవ్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆయా పార్టీల వారు తమ పిల్లలను ఇలాంటి వాటికి పుంపుతున్నారా? అని ప్రశ్నించారు. పిల్లల పెంపకంలో తల్లుల మైండ్‌సెట్ మారాలని సూచించారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థినులకు వివిధ అంశాలపై బృంద చర్చలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. సమ్మేళనంలో పాల్గొన్న వారికి తులసి మొక్కలు అందించారు. -
ముద్దు తెచ్చిన ముప్పు.. 10 మంది సస్పెన్షన్
ఒక్క ముద్దు, మరొక్క కౌగిలింత.. చివరకు సస్పెన్షన్‌కు దారితీశాయి. ఏబీవీపీకి చెందినవాళ్లు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారంటూ.. దానికి వ్యతిరేకంగా కేరళలోని కొచ్చిలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి సంఘీభావంగా 'హగ్ ఆఫ్ లవ్' అనే కార్యక్రమాన్ని కూడా కొంతమంది విద్యార్థినీ విద్యార్థినులు నిర్వహించారు. అయితే.. ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ పదిమంది విద్యార్థులను అక్కడి కాలేజి ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం విషయంలో పోలీసులు సైతం వంద వరకు కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా కాలేజి నుంచి సస్పెన్షన్ వరకు దారితీసింది. ఈ ముద్దుల వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి. -
కోల్ కతాకు పాకిన 'కిస్ ఆఫ్ లవ్'
కోల్ కతా: నైతికతపై కర్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ కేరళలోని కొచ్చిలో మొదలైన 'కిస్ ఆఫ్ లవ్' నిరసన ఇప్పడు కోల్‌కతాకు పాకింది. మోరల్ పోలీసింగ్, లింగ వివక్షకు వ్యతిరేకంగా రెండు యూనివర్సిటీల విద్యార్థులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విద్యార్థులు గురువారం ఇండియన్ కాఫీ హౌస్ ఎదురుగా గుమిగూడి 'కిస్ ఆఫ్ లవ్'కు సంఘీభావంగా ప్లకార్డులు ప్రదర్శించారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి దాదాపు 300 మంది బుధవారం సాయంత్రం జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. పరస్పరం ఆలింగనం చేసుకుని, ముద్దులు పెట్టుకుని నిరసన తెలిపారు. 'మా దేహం, మా ఆలోచన, మోరల్ పోలీసింగ్ ను ఒప్పుకోం' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ స్వేచ్ఛను అడ్డుకుంటున్నందుకు, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని విద్యార్థులు తెలిపారు. -
ఠాణాకు చేరిన ‘ముద్దు’ల రగడ!
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రగులుతున్న ‘ముద్దుల’ రగడ గచ్చిబౌలి ఠాణాకు చేరింది. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ రామబ్రహ్మం ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై సోమవారం రాత్రి కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ రమేశ్ తెలిపారు. ‘కిస్ ఆఫ్ లవ్’ పేరుతో విద్యార్థులు అశ్లీలంగా వ్యవహరించారని, క్యాంపస్ లోపలికి బయటి వ్యక్తులు ప్రవేశించారని రిజిస్ట్రార్ ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. నాలుగు రోజుల క్రితం కిస్ ఆఫ్ లవ్ యూనివర్సిటీలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంతో దీనిని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు క్యాంపస్ లోపలికి వెళ్లి నిరసన తెలిపిన విషయమూ విదితమే. ముద్దులు పెట్టుకున్న విద్యార్థులతో పాటు ఇటు క్యాంపస్ లోపలికి అక్రమంగా ప్రవేశించిన బీజేవైఎం కార్యకర్తల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు వివిధ చానళ్ల ఫుటేజీలను పరిశీలించి బాధ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇరు వర్గాలపై ఐపీసీ 297, 447 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజ నిర్ధారణ కమిటీ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ‘కిస్ ఆఫ్ లవ్’ నిర్వహించారని ఏబీవీపీ, బయటి వ్యక్తులు క్యాంపస్ లోపలికి ప్రవేశించి ప్రశాంత వాతావరణానికి భంగం కల్గించారని ఎస్ఎఫ్ఐతో పాటు ఇతర విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఘటనపై విచారణకు నిజ నిర్ధారణ కమిటీ నియమించారు. కమిటీ ఛెర్మైన్‌గా స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ డీన్ ప్రొఫెసర్ అనంత కృష్ణన్, సభ్యులుగా ఫ్రొఫెసర్లు ప్రకాశ్ బాబు, మీనా హరిహరన్, వాసంతి, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు విన్సెంట్లు ఉన్నా రు. విచారణ జరిపి 20 రోజుల్లో వీసీ రామకృష్ణ రామస్వామికి నివేదిక అందజేస్తారు. కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని సీఐ ర మేశ్ తెలిపారు. -
ముద్దుల వ్యవహారం.. వందమందిపై కేసులు!
బీజేవైఎం నేతల మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేస్తూ.. 'కిస్ ఆఫ్ లవ్' పేరిట ముద్దుల కార్యక్రమం నిర్వహించిన వంద మంది మీద కొచ్చిలో పోలీసు కేసులు నమోదయ్యాయి. కేరళలోని కొచ్చి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఆదివారం నాడు వందలాది మందితో భారీ కార్యక్రమం నిర్వహించారు. అయితే అది చట్ట విరుద్ధం అంటూ పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టారు. వాస్తవానికి ఆరోజు ముద్దుల కార్యక్రమంలో పాల్గొన్నవాళ్ల కంటే.. దాన్ని చూసేందుకు వచ్చినవాళ్లు, శివసేన లాంటి ఇతర సంస్థల సభ్యులే ఎక్కువగా కనిపించారు. అలా చూసేందుకు వచ్చినవాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టలేదు గానీ.. నిర్వాహకులు, అందులో వాస్తవంగా పాల్గొన్నవాళ్ల మీద మాత్రం కేసులు నమోదు చేశారు. చిట్ట చివరి నిమిషంలో వాళ్లు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించడంతో పోలీసులు వాళ్లను అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. -
కిస్ కీ బాతే
‘కిస్ ఆఫ్ లవ్’ కేరళలో రాజుకున్న ఈ వివాదం.. హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కేంద్రంగా నిలిచిన హోటల్‌పై దాడిని ఖండిస్తూ.. హెచ్‌సీయూలో కొందరు విద్యార్థులు నిరసన గళం వినిపిస్తున్నారు. ముద్దుతో కల్చర్‌కు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు. ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్లో ముద్దు కూడా ఓ భాగమని క్యాంపస్ కబుర్లలో ‘కిస్ కీ బాతే’ షేర్ చేసుకున్నారు. అతిరా: ‘కిస్ ఆఫ్ లవ్’ అనేది చాలా చిన్న విషయం. మోరల్ పోలీసింగ్ (నైతిక నిఘా) పేరుతో మమ్మల్ని రకరకాలుగా వేధించడంలో ఇది ఒక అంశం మాత్రమే. బయట రోడ్డుపై ఒకమ్మాయి, అబ్బాయి కలసి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్లిద్దరికీ పెళ్లి చేయడం నుంచి మొదలుపెట్టారు. ఇదిగో ఈ రోజు ముద్దు పెట్టుకోవడం పెద్ద క్రైమ్ అంటూ మా మీద దాడులు చేస్తున్నారు. అమ్మూమోహన్: సమాజంలో జరిగే అంశాలపై స్పందించే హక్కు విద్యార్థులుగా మాకుంది. కేరళలో ఒక రెస్టారెంట్లో ఓ ఇద్దరు ప్రేమికులు ముద్దు పెట్టుకునే సన్నివేశాన్ని టీవీలో చూసి మొత్తం రెస్టారెంట్‌ని ధ్వంసం చేయడం చిన్న విషయం కాదు. దాని మీద స్పందిస్తే తప్పా..? అలాగని మేమేమీ అందరినీ ముద్దు పెట్టుకోమని సలహాలు ఇవ్వడం లేదు కదా! ధీరజ్: కేరళలో జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా ఇక్కడ మేం చిన్న గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే..దానిపై పెద్ద రభస చేసి బయట మనుషులొచ్చి మాపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయం? పైగా భారతీయ కల్చర్‌ని పాడుచేస్తున్నామంటూ నిందలు వేస్తున్నారు. కేవలం ప్రేమికుల వల్లే మన కల్చర్ పాడైపోతోందని గగ్గోలు పెడుతున్నారు. అతిరా: అయినా ‘కిస్ ఆఫ్ లవ్’లో తప్పేముంది. ఆత్మీయంగా హగ్ చేసుకోవడం.. ముద్దుతో మనలోని ఎమోషన్ని ఎక్స్‌ప్రెస్ చేయడమే. మోరల్ పోలీసింగ్ పేరుతో కండిషన్లు పెట్టడం పౌరహక్కుల ఉల్లంఘన కాదంటారా! ధీరజ్: ఎగ్జాట్లీ...అతిరా. ఇదో వంక మాత్రమే. వాలెంటైన్స్ రోజున కనిపించిన ప్రేమికులందరికీ పెళ్లిళ్లు చేయాలనే పేరుతో యువతను వేధించిన సందర్భాలున్నాయి. శ్రీలత: అవును.. గొప్పగా చదవాలి. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి. ఇష్టమైతే వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు. హైఫై జీవితం గడపొచ్చు. కానీ, స్వేచ్ఛగా స్నేహం చేయకూడదు. ప్రేమించకూడదు. కోరుకున్నవాణ్ని పెళ్లి చేసుకోకూడదు. అలా చేస్తే మన కల్చర్ పాడైపోతుందంటారు. కల్చర్ అంటే ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం ఒప్పుకోవడం ఒక్కటే కాదు కదా ! మన దేశ సంస్కృతిని కాపాడటానికి ఈ ఒక్క పని చేస్తే సరిపోతుందా..? అతిరా: శ్రీలత.. మొన్నామధ్య నేను మా ఊరెళ్లాను (కేరళ). తమ్ముడు, నేనూ ఫస్ట్ షో సినిమాకి వెళితే టికెట్లు దొరకలేదు. సెకండ్ షోకి వెళ్లాం. అంతే సినిమా అయిపోయాక రిటర్న్ అవుతుంటే.. ఓ పదిమంది గ్యాంగ్ వచ్చి ‘మీరిద్దరు లవర్సే కదా!.. పదండి పెళ్లి చేస్తాం’ అంటారు. నేను షాక్. కాదురా బాబు అని బతిమాలితే వదిలారు. ఆ గ్యాంగ్‌లో ఒకరు మా తమ్ముడి ఫ్రెండ్ రిలేటివ్. వాడి నిజస్వరూపం ఏంటంటే.. ప్రతి రోజూ తాగి వెళ్లి భార్యను కొడతాడట. ఇంట్లో ఆడవాళ్లను చావగొట్టే వీళ్లు దేశంలోని అమ్మాయిలకు రక్షణ కల్పిస్తారా? అను : అయినా విద్యార్థులు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. ఇలా నడుచుకోవాలంటూ ఆంక్షలు పెట్టడానికి వీళ్లెవరు ? మమ్మల్ని ప్రశ్నించి, వేధించి నలుగురిలో హీరోలవ్వాలనే ఫీలింగ్‌తో చేస్తున్న పనులివి. వైఖరి: కేరళలోని రెస్టారెంట్ పగలగొట్టి వారి వ్యతిరేకతను నిరూపించుకున్నారు. మాపై దాడులు చేయడం, లేదంటే రోడ్లెక్కి అరవడాలు తప్ప.. మోడ్రన్ యుగంలో వచ్చే ఏ ఒక్క మార్పుని ఎవరూ ఆపలేరు. అది అయ్యే పని కాదు. సాయికుమార్: ప్రస్తుతం మా యూనివర్సిటీలో ‘కిస్ ఆఫ్ లవ్’ అనే అంశంపై కేరళ విద్యార్థులకు మద్దతుగా మిగతా అన్నిప్రాంతాల విద్యార్థులు ముందుకొచ్చి వారి అభిప్రాయాలను చెబుతున్నారు. నిజమే మోరల్ పోలీసింగ్ పేరుతో మా నడవడికను కంట్రోల్ చేయాలనుకోవడం తప్పు. రహమతుల్లా: యస్. ఈరోజు స్టూడెంట్స్ మంచేదో, చెడేదో తెలుసుకోలేని పరిస్థితిలో లేరు. స్నేహంలోనైనా, ప్రేమలోనైనా చేదు అనుభవం ఎదురైతే ఆ బాధ్యత తనదే. లేదంటే వారి తల్లిదండ్రులది. దీని కోసం ప్రత్యేకంగా ఎవరో పని చేయాల్సిన అవసరం లేదు. ‘కిస్ ఆఫ్ లవ్’ అంటే ఎవరిని ఎవరైనా ముద్దుపెట్టుకునే స్వేచ్ఛ ఉంది అని అర్థం. అది అమ్మ కావొచ్చు, అక్క కావొచ్చు, ప్రేమికురాలు కావొచ్చు, భార్య కావొచ్చు. దాన్ని ఒక భావోద్వేగంగానే చూడాలి. భువనేశ్వరి -
'కిస్ ఆఫ్ లవ్' ఫేస్ బుక్ ఖాతా హ్యాక్!
కొచ్చి:'నైతిక పో్లీసింగ్'కు నిరసనగా కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి తెరలేపిన పేస్ బుక్ బృందం సభ్యులకు మరో ఆటంకం ఎదురయ్యింది. ఆ ఖాతాలో ఉన్న మరో ఐదుగురు సభ్యుల వివరాలు హ్యాకింగ్ గురయినట్లు ఆర్గనైజేషన్ ప్రధాన సభ్యుడు రాహుల్ పసుపాలన్ మీడియాకు తెలిపాడు. దీని వెనుక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు బృంద సభ్యుడు రాహుల్ పసుపాలన్ చెప్పారు. హ్యాకింగ్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే, తమపై దాడి చేసే ఉద్దేశంతో ఆదివారం కార్యక్రమం జరిగే వేదిక వద్దకు కొందరు మారణాయుధాలతో వచ్చారని ఆరోపించారు. కోచిలోని సాగర తీరంలో కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించాలని ఈ గ్రూప్ భావించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కిస్ ఆఫ్ లవ్ కు తొంభై వేల వరకూ లైక్ లు వచ్చినట్లు రాహుల్ పసుపాలన్ స్పష్టం చేశాడు. -
‘ముద్దుల’ రగడ
వివాదాస్పదంగా కిస్ ఆఫ్ లవ్ ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐలు బాహాబాహీ క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం సెంట్రల్ యూనివర్సిటీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘కిస్ ఆఫ్ లవ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమం విద్యార్థి సంఘాల గొడవతో ఉద్రిక్తతంగా మారింది. తాజాగా కేరళలోని కాలికట్ డౌన్‌టౌన్ రెస్టారెంట్లో ఓ ప్రేమజంట బహిరంగ చుంబనం చేసుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ బజరంగ్ దళ్, హిందుత్వ సంఘాలు ఆ రెస్టారెంట్‌ను ధ్వంసం చేశాయి. దీన్ని నిరసిస్తూ కేరళలోని పలువురు కిస్ ఆఫ్ లవ్ పేరిట జంటలకు బహిరంగ చుంబన కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. కేరళలో బజరంగ్దళ్, ఏబీవీపీ, హిందుత్వ సంఘాల దాడిని ఖండిస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ప్రత్యేక కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేరళ, ఇతర రాష్ట్రాల విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ మద్దతు పలికింది. విద్యార్థులు పెదాలకు లిప్‌స్టిక్ పూసుకొని ముద్దులు పెట్టుసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు ర్యాలీగా వచ్చి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దేశ సంస్కృతిని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల మధ్య గొడవ... భారతీయ సంస్కృతిని కించపరిచేలా బహిరంగ చుంబన కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీం బీజేవైఎం నాయకులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యక్రమం జరుగుతున్న చోటుకు చేరుకుని నినాదాలు చేశారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, కేరళ, ఇతర రాష్ట్రాల విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. అనంతరం బీజేవైఎం నగర నాయకులు నినాదాలు చేస్తూ ముందుకు రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. విద్యార్థులు నిర్వహించే కార్యక్రమాలకు బయటి వ్యక్తులను ఏ విధంగా అనుమతించారని కేరళ విద్యార్థులు బైఠాయించారు. సంఘటన స్థలికి రిజిస్ట్రార్ రామబ్రహ్మం, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్ బాబు చేరుకొని ఆందోళన విరమింపజేసేందుకు యత్నించారు. చందానగర్, గచ్చిబౌలి పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడమే.. కిస్ ఆఫ్ లవ్ పేరిట కేరళలో జరిగిన కార్యక్రమాన్ని హిందుత్వ సంఘాలు నిరసన తెలపడం అవివేకం. వ్యక్తులకు స్వేచ్ఛ ఉంది. వారి హక్కును హరించేలా అడ్డుకోవాలని ఏబీవీపీ నాయకులు హెచ్‌సీయూలో ప్రయత్నించడం గర్హనీయం. -అభిరామీ, ఎంఫిల్ విద్యార్థిని చీరలు కడితేనే భారతీయులమా? జీన్స్ టీ షర్ట్ వంటి ఆధునీకత ప్రతిబింబించే దుస్తులను మహిళలు ధరించడాన్ని ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి సంఘాలు వ్యతిరేకించడం శోచనీయం. చీరలు, సంప్రదాయ దుస్తులు వేసుకుంటేనే భారతీయులమా? ఎవరి స్వేచ్ఛ వారిది. - వైఖరి, పీహెచ్డీ, పొలిటికల్ సైన్స్ విద్యార్థిని అధికారుల అండతోనే కార్యక్రమం వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ ఇతర అధికారుల అండతోనే ఇలాంటి బహిరంగ ముద్దుల కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సంస్కృతిని కించపరిచే కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. - సుశీల్ కుమార్, ఏబీవీపీ, అధ్యక్షుడు హెచ్‌సీయూ భారతీయ సంస్కృతి కాదు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంస్కృతి కాదు. ప్రైవేటు వ్యవహారాలను పబ్లిక్‌గా చేసుకుంటామంటే ఎవరూ హర్షించరు. క్యాంపస్‌లో విద్యార్థినులు ఇలా ముద్దులు పెట్టుకుంటే సమాజంపై చెడు ప్రభావం ఉంటుంది. - ప్రియదర్శి జోషీ, పీహెచ్డీ ఎకనామిక్స్ విద్యార్థి