ఢిల్లీని తాకిన ముద్దుల పోరాటం! | 'Kiss of Love' Scuffle between RSS workers, protesters in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీని తాకిన ముద్దుల పోరాటం!

Published Sun, Nov 9 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

ఢిల్లీని తాకిన ముద్దుల పోరాటం!

ఢిల్లీని తాకిన ముద్దుల పోరాటం!

న్యూఢిల్లీ/కొచ్చి: మొన్న కిస్ ఆఫ్ లవ్... నిన్న హగ్ ఆఫ్ లవ్... కేరళలోని కొచ్చి విద్యార్థులు నైతిక పోలీసింగ్ (నైతిక నియమావళి పేరుతో ఆంక్షలు)ను వ్యతిరేకిస్తూ తలపెట్టిన నిరసనలు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయ వాదులు వీరికి అడ్డు తగులుతుండడంతో ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీస్తోంది.

సంప్రదాయ వాదులు తమ యత్నాలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ‘కిస్ ఆఫ్ లవ్’ మద్దతు దారులు కొందరు శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు.

ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సుమారు 60 మంది విద్యార్థులు జందేవాలన్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం వరకు ప్రదర్శనగా రాగా రెండంచెల బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. వీరికి దీటుగా హిందూసేన కూడా అదే సమయంలో మరో ప్రదర్శన తలపెట్టగా వారి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. మరోవైపు కిస్ ఆఫ్ లవ్‌కు మద్దతు ప్రకటిస్తూ కొచ్చిలోని మహారాజా కాలేజీ విద్యార్థులు ‘హగ్ ఆఫ్ లవ్’ కార్యక్రమం నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement