నజీబ్ ఆచూకీలేకుండా పోవడంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న అతని కుటుంబసభ్యులు (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి నజీబ్ అహ్మద్ ఐసిస్ సానుభూతి పరుడంటూ ముద్ర వేసిన కొన్ని జాతీయ మీడియా సంస్థలపై అతని తల్లి ఫాతిమా నఫీస్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. తన కొడుకుపై మీడియా సంస్థలు రాసిన కథనాలను వెంటనే తొలగించాలని, మీడియా చేసిన పనికి తమ కుటుంబానికి రూ. 2.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని ఆమె తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
2016 అక్టోబర్ 14వ తేదీన నజీబ్ అహ్మద్ ఓ ఉగ్రసంస్థకు సంబంధించిన సమాచారం కోసం వెతుకుతున్నాడని ఒక మీడియా సంస్థ కథనాన్ని రాసిందని నఫీస్ పేర్కొన్నారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 16 నుంచి అహ్మద్ ఆచూకీలేకుండా పోయాడని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment