Jawaharlal Nehru University
-
సాంకేతిక విద్యకు చికిత్స అవసరం
సాక్షి, హైదరాబాద్: సాంకేతికవిద్యలో గుణాత్మక మార్పు అవసరమని అఖిల భారత ఉప కులప తుల సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. మార్కె ట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాలను వెతుక్కునేవాళ్లు కాదని, వ్యవస్థను మార్చేవాళ్లు కావాలని ఆకాంక్షిం చారు. శుక్రవారం ఇక్కడ హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ‘ఆఫరింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్’అనే అంశంపై అఖిల భారత విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో సియంట్ సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ భారత పారిశ్రామిక అవసరాలకు తగ్గరీతిలో నిపుణులు కన్పించడం లేదని, ఏటా 21 లక్షలమంది ఇంజ నీర్లు పట్టాలతో వర్సిటీల నుంచి బయటకొస్తున్నా, వారిలో కేవలం 15.3 శాతం మందికే నేటి అవసరా లకు తగ్గ నైపుణ్యం ఉంటోందని అన్నారు. 2026 నాటికి దేశంలో సాంకేతిక ఉపాధి అవకాశాలు దాదాపు 75 లక్షలకు చేరే వీలుందని, కానీ, ఈ స్థాయిలో నిపుణులు లభించడం కష్టమనే అభిప్రా యం వ్యక్తం చేశారు. స్వయంసమృద్ధిని కోరుకుం టున్న భారత్‌లో ఇంజనీరింగ్ విద్యస్థాయి నుంచే స్టార్టప్స్‌ను, ఇంక్యుబేటర్స్‌ను తయారు చేయాలని, ఈ గురుతర బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసు కోవాలని సూచించారు. ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి కూడా చిన్నపాటి గ్రామస్థాయి ఉపాధి కోసం వెంపర్లాడటం దురదృష్టకరమన్నారు. గత కొన్నాళ్ళుగా ఉన్నతవిద్యలో, మహిళల భాగస్వా మ్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సిం హారెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా సాంకేతికవిద్యను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదు స్టార్టప్స్ ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదుగురు స్టార్టప్స్‌ను తయారు చేయగలిగితే దేశ జీడీపీలోనే ఉజ్వలమార్పు కన్పిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్లల్లో అనేక మంది గ్రాడ్యుయేట్ స్థాయి వాళ్లే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీంద్ర, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ప్రొఫెసర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
మే 15 నాటికి 38,220 మరణాలు?
దేశంలో కరోనా బాధితుల మరణాలు, కేసులు భారీగా పెరగనున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి ప్రముఖ సంస్థలు. మే 15వ తేదీ నాటి కల్లా కరోనా వైరస్‌తో మరణించే వారి సంఖ్య 38,220కు చేరుకుంటుందని, మొత్తం కేసులు 30 లక్షలకు చేరుకోనుందని ఇవి అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం ఉంటాయని లెక్కలు తేల్చాయి. ఇప్పటి వరకు ఇటలీ, న్యూయార్క్‌ల్లో కరోనా మరణాలు, కేసులపై వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయని తెలిపాయి. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు), ఐఐటీ బోంబే, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ(పుణె)ఈ మేరకు ‘కోవిడ్–19 మెడ్ ఇన్వెంటరీ’ పేరుతో ఈ అంచనాలు రూపొందించాయి. -
పోలీసుల సమక్షంలోనే ఆ ‘దాడి’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లపై ఆదివారం దుండగులు జరిపిన దాడి పోలీసుల సమక్షంలోనే జరిగిందని, అయినప్పటికీ దాన్ని ఆపేందుకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ దాడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను చూస్తే స్పష్టం అవుతోంది. దుండగులలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించక పోవడం ఆశ్చర్యం. ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం ‘గుర్తుతెలియని వ్యక్తుల’ పేరిట హిందీలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ కథనం ప్రకారం ‘పెరియార్ హాస్టల్ వద్ద కొంతమంది విద్యార్థులు గుమిగూడారని, వారు ఇతరులు కొడుతున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆదివారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో క్యాంపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద పోలీసు సబ్ ఇనిస్పెక్టర్‌కు సమాచారం అందింది. ఎఫ్ఐఆర్ కోసం ఫిర్యాదు చేసిన వసంత్‌కుంజ్ నార్త్ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, మరి కొంతమంది పోలీసులు పెరియార్ హాస్టల్ వద్దకు వెళ్లగా అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి కర్రలతో విద్యార్థులను కొడుతూ కనిపించారు. పోలీసులను చూడగానే వారు అక్కడి నుంచి పారిపోయారు. సాయంత్రం ఏడు గంటలకు సబర్మతి హాస్టల్లోకి కొంత మంది దుండగులు ప్రవేశించి కొడుతున్నారని పోలీసు ఇన్స్పెక్టర్కు సమాచారం అందింది. ఆయన వెంటనే ఫిర్యాదు చేసిన పోలీసు అధికారిని, తన సిబ్బందిని తీసుకొని సబర్మతి హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి వ్యక్తులు కర్రలతో విద్యార్థులను బాదడం కనిపించింది. వారిని మైకులో హెచ్చరించడంతో ఎక్కడి వారక్కడ వెళ్లిపోయారు. అదే సమయంలో క్యాంపస్‌లో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందిగా క్యాంపస్ అధికారుల నుంచి విజ్ఞప్తి అందడంతో అదనపు బలగాలను పోలీసులు పిలిపించారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లారు’ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత కొంతకాలంగా క్యాంపస్ ఆవరణలో పోలీసు పికెట్ ఉంటోంది. ఆ రోజు 3.45 గంటల ప్రాంతంలోనే 50–60 మంది ముసుగు దుండగులను వారు చూసినప్పుడు వారు ఎందుకు స్పందించలేదు? సాయంత్రం కూడా వారు మళ్లీ కనిపించినప్పుడు వారిలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? మొదట్లోనే అదనపు బలగాల కోసం వారు ఎందుకు కోరలేదు? దుండగులు 3.45 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు స్వైర విహారం చేసిన క్యాంపస్ అధికారులు ఎందుకు సకాలంలో స్పందించలేదు? అసులు దాడి జరిగినప్పుడు క్యాంపస్‌లో ఎంత మంది పోలీసులు ఉన్నారు? అదనపు బలగాల్లో ఎంత మంది, ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు కొత్తగా దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులైన కనుక్కుంటారేమో చూడాలి! చదవండి: ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది జేఎన్‌యూలో దీపిక జేఎన్‌యూ : ఆ పోస్టర్లున్న గదులవైపు వెళ్లలేదు..! ‘జేఎన్‌యూ దాడి మా పనే’ అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్ లేదు: కేంద్ర మంత్రి జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..! -
జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌పై దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్‌పై సోమవారం ఢిల్లీలో హత్యాయత్నం జరిగింది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఖలీద్‌పై గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఖలీద్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. యునైటెడ్ అగినెస్ట్ హేట్ సంస్థ సోమవారం మూకహత్యలకు వ్యతిరేకంగా ఖౌఫ్ సే ఆజాదీ(భయం నుంచి విముక్తి)పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్, ప్రొఫెసర్ అపూర్వానంద్, రోహిత్ వేముల తల్లి రాధిక, ఖలీద్ హాజరయ్యారు. కాల్పుల ఘటనపై ఖలీద్ స్పందిస్తూ.. ‘మధ్యాహ్నం 2.30 గంటలకు బయట టీ తాగి సమావేశం దగ్గరకు తిరిగివస్తున్నాను. ఇంతలో వెనుక నుంచి బలంగా తోసేశారు. నేను కిందపడగానే తుపాకీ తీసి కాల్చేందుకు ప్రయత్నించాడు. దీంతో నేను అక్కడ్నుంచి పరిగెత్తా. చివరికి అతను ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు’ అని తెలిపారు. -
లైంగిక వేధింపులు: బుక్కైన మరో ప్రొఫెసర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల కేసు నమోదవ్వగా.. తాజాగా మరో ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది. ప్రొఫెసర్ అజయ్‌కుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ సైన్స్ విద్యార్థిని ఒకరు ఆరోపించారు. ఈ మేరకు ఆమె వసంత్‌కుంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసులు సదరు ప్రొఫెసర్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది విద్యార్థినులు ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదుచేశారు. ఈ వ్యవహారంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. కానీ, మరునాడే అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. -
నజీబ్ తల్లి పరువు నష్టం దావా
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి నజీబ్ అహ్మద్ ఐసిస్ సానుభూతి పరుడంటూ ముద్ర వేసిన కొన్ని జాతీయ మీడియా సంస్థలపై అతని తల్లి ఫాతిమా నఫీస్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. తన కొడుకుపై మీడియా సంస్థలు రాసిన కథనాలను వెంటనే తొలగించాలని, మీడియా చేసిన పనికి తమ కుటుంబానికి రూ. 2.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని ఆమె తన పిటీషన్లో పేర్కొన్నారు. 2016 అక్టోబర్ 14వ తేదీన నజీబ్ అహ్మద్ ఓ ఉగ్రసంస్థకు సంబంధించిన సమాచారం కోసం వెతుకుతున్నాడని ఒక మీడియా సంస్థ కథనాన్ని రాసిందని నఫీస్ పేర్కొన్నారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 16 నుంచి అహ్మద్ ఆచూకీలేకుండా పోయాడని అన్నారు. -
ఆ వర్సిటీలను ప్రైవేటుపరం చేయం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతోపాటు దేశంలోని పలు వర్సిటీలను ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే వాటికి స్వయంప్రతిపత్తి హోదా కల్పించామనడం సరికాదని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ విద్యా సంస్థల్లో ఫీజులు పెంచబోమని, వీటికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న దేశంలోని 60 విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అటానమస్ హోదా కల్పించింది. వీటిలో 5 సెంట్రల్ వర్సిటీలు కాగా 21 స్టేట్ వర్సిటీలున్నాయి. అటానమస్ హోదా కారణంగా ఆయా వర్సిటీలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. -
వర్శిటీలో 3 వేల కండోమ్‌లు కనుగొన్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ మరోసారి వర్శిటీ అధికారులు, బీజేపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టాడు. విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యమై చాలా రోజులు కావస్తున్నా అతని ఆచూకీ కనుకోలేదని విమర్శించాడు. అయితే జేఎన్‌యూలో ఎన్ని కండోమ్‌లు ఉన్నాయో తెలుసుకోగలిగారంటూ ఎద్దేవా చేశాడు. దేశద్రోహం కేసులో అరెస్టయి జైలుకెళ్లి వచ్చిన కన్హయ్య ‘ఫ్రమ్ బిహార్ టు తిహార్’ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కన్హయ్య వర్శిటీ అధికారులు, బీజేపీ నేతల తీరును ఎండగట్టాడు. ‘జేఎన్‌యూలో రోజుకు 3 వేల బీర్లు, 2 వేల మద్యం బాటిళ్లు, 10 వేల సిగరెట్లు, 4 వేల బీడీలు, 50 వేల లెగ్ పీసులు, 2 వేల చిప్స్ పాకెట్లు, 3 వేల కండోమ్‌లు, 500 అబార్షన్ ఇంజెక్షన్లు వాడుతారు’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కన్హయ్య ప్రస్తావించాడు. అక్టోబర్ 14న వర్శిటీ హాస్టల్లో జరిగిన గొడవ తర్వాత నజీబ్ అహ్మద్ అదృశ్యమయ్యాడని, అధికారులు ఇప్పటి వరకూ ఆచూకీ తెలుసుకోలేకపోయారని విమర్శించాడు. నజీబ్ అదృశ్య ఘటనపై విద్యార్థులు నిరసన తెలియజేశారు. -
త్వరలో రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిని కలుస్తాం
జేఎన్‌యూ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షురాలు షెహ్ల రషీద్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్నట్లు ఆ వర్సిటీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు షెహ్ల రషీద్ షోరా పేర్కొన్నారు. నగరానికి వచ్చిన ఆమె ఆదివారం లామకాన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దాదాపు రెండు నెలలుగా వర్సిటీలో చేసుకుంటున్న పరిణామాలపై వారిపై మాట్లాడేందుకు వర్సిటీ విద్యార్థులతో కలిసి వెళ్తామని చెప్పారు. ఇప్పటికే హోంమంత్రితో సమావేశం కావాలని అనుమతి కోరినట్లు వెల్లడించారు. తనతోపాటు వర్సిటీ విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ కుట్రపూరిత ప్రచారం చేస్తోంద ని ఆరోపించారు. ‘అఫ్జల్‌గురు ఉరితీత ఘటనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంబేద్కర్‌వాదులంతా ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే రాజీవ్ గాంధీ హత్య, మరే ఇతర వ్యక్తులపైనా అటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి’ అని ఫిబ్రవరి 9 రాత్రి వర్సిటీలో ఏం జరిగిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. -
'జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు అవ్వరు'
మథుర: రాజద్రోహం కేసులో అరెస్టయి రెండు రోజుల కింద విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఖండించారు. హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తనకు ఆదర్శమని చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ తప్పుబట్టారు. జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు కానే కాదని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుమ్ మెమన్ ఉరితీతను వేముల రోహిత్ వ్యతిరేకించాడు. ఆ సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేములను తనకు ఆదర్శప్రాయుడిగా విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఎలా ఎంచుకుంటాడన్నారు. రోహిత్ దారిలోనే కన్హయ్య నడిచాడు. అతడిలాగానే పార్లమెంట్ దాడులకు పాల్పడ్డ కేసులో నిందితుడు అఫ్జల్ గురు ఉరితీత అంశాన్ని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ వర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించాడని మంత్రి వీకే సింగ్ గుర్తుచేశారు. ఆరు నెలల తాత్కాలిక బెయిల్ పై కన్హయ్య కుమార్ విడుదలయ్యాక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వర్సిటీలో ఈవెంట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. -
'ప్రధాని ఇంకా సొంత రాష్ట్రం మోజులోనే ఉన్నారు'
ముంబై: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ గుజరాత్ పైనే ఇష్టంతో ఉన్నారని, ఆయన దేశం మొత్తానికి ప్రధానిగా కనపించడం లేదంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. జాతీయత, జాతి అంటూ బీజేపీ ఇచ్చే సర్టిఫికెట్లు ఎవ్వరికీ అవసరం లేవని అభిప్రాయపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదంలో కేంద్ర జోక్యం అనవసరమని సూచించారు. సర్టిఫికెట్లు ఇవ్వకూడదంటూ బీజేపీ నేతలకు ఆయన సూచించారు. జేఎన్‌యూలో జరిగిన అంశంపై మరింత దుమారం రేపాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోకూడదని, ఇది ఏబీవీపీ కి మార్గం ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుందన్నారు. ఎవరు జాతీయవాది.. ఎవరు జాతి వ్యతిరేకులో బీజేపీ తేల్చాల్సిన గత్యంతరం లేదంటూ విమర్శించారు. ముంబైలో ఈ నెలలో జరిగిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ.. కార్యక్రమాల నిర్వహణపైనే బీజేపీ దృష్టిపెట్టిందని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి పనులు ముందుగు సాగలేదని.. ప్రతి రెండు నెలలకు ప్రధాని ఓ కార్యక్రమం అంటూ ప్రజలు ముందుకు వస్తారని రాజ్ ఠాక్రే విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం ఏంటో అర్ధం కావడం లేదని, ఢిల్లీలో జరపకుండా ఈ వేడుకలు ముంబైలో ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. -
కొత్త వివాదంలోకి జేఎన్‌యూ వీసీ
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. యూనివర్సిటీలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయగా.. అసలు పోలీసులు విశ్వవిద్యాలయంలోకి ఎలా ప్రవేశించారనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. వైస్ ఛాన్సలర్ ఎం జగదీశ్ కుమారే స్వయంగా పోలీసులను ఆహ్వానించాడని, వారిని క్యాంపస్ లోకి అనుమతించాడని తాజాగా ఓ లేఖ బయటపడింది. అయితే, అంతకుముందు వీసీ కుమార్ మాట్లాడుతూ అసలు తాను పోలీసులకు అనుమతి ఇవ్వనే లేదని చెప్పిన నేపథ్యంలో ఈ లేఖ స్వయంగా ఆయనే పోలీసులకు రాసినట్లు తాజాగా బయటపడటం కొంత ఆసక్తిని కలిగిస్తోంది. వీసీ ఏవో నిజాలు దాచిపెడుతున్నారని యూనివర్సిటీలోని పలువురు విద్యార్థినాయకులు, నాన్ టీచింగ్, టీచింగ్ స్టాఫ్‌లలో కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నెల 9న క్యాంపస్‌లోకి పోలీసులకు అనుమతిస్తూ ఆయన స్వయంగా సంతకం చేసిన లేఖ ఒకటి తాజాగా బయటపడింది. ఆరోజే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. -
'గాడ్సే వారసులనుంచి దేశభక్తి మాకొద్దు'
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశ భక్తి గురించి తాము గాడ్సే వారసుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలకు ప్రతిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి జాతీయ భావాలకు, జాతీయ భావాలను వ్యతిరేకించే వాళ్లకు మధ్య తేడా తెలియడం లేదని, దేశభక్తి గురించి ఆయనకేం తెలియదని అమిత్ షా అన్నారు. దీనిపై స్పందించిన రణ్ దీప్ తాము దేశ భక్తి గురించి ఎన్డీయే వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా ఎన్డీయే పేరును ప్రస్తావించకుండా 'ఎవరు మహాత్ముని సిద్ధాంతాన్ని చంపేశారో, ఎవరు నాధురాం గాడ్సే వారుసులో వారి వద్ద నుంచి మేం దేశ భక్తి నిర్వచనాన్ని తెలుసుకోవాలనుకోవడం లేదు' అని ఆయన అన్నారు. -
'అసలు ఈతరం పిల్లలకు ఏమైంది?'
మీరట్: జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో జరుగుతున్న ఘటనలు దేశ ద్రోహ చర్యలని, పాకిస్థాన్‌కు, అఫ్జల్ గురూకు మద్దతుగా నినాదాలు చేసిన వారిపై దేశద్రోహ కేసులు నమోదు చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే డిమాండ్ చేశారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మీరట్‌లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన దేవాలయంలాంటి విద్యాలయంలో విద్య నేర్చుకుంటూ ఈ తరం పిల్లలు దేశానికి విరుద్ధమైన నినాదాలు ఎలా చేస్తున్నారా అని తామంతా ఆశ్చర్యపోతున్నామని అన్నారు. జేఎన్‌యూ ఆందోళనల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాది లష్కరే తోయిబా అధ్యక్షుడు హఫీజ్ సయీద్ హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ధుమారం రేగిన నేపథ్యంలో దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో అత్యవసర పాలన విధించి దేశం మొత్తాన్ని జైలులో బంధించిన కాంగ్రెస్ పార్టీ నేడు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. దేశానికి ఎదురవుతున్న సమస్యలను సవాలు తీసుకుని సేవ చేసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని స్వయం సేవక్ లకు చెప్పారు. హిందూ అంటే మతం కాదని ఒక జీవన విధానం అని అన్నారు. ప్రపంచమంతా సామరస్యం వెల్లివిరియాలని వసుదైక కుటుంబంగా మారాలని ఆకాక్షించారు. -
'విద్యార్థుల డిబార్ సరికాదు'
న్యూఢిల్లీ: ఎనిమిదిమంది విద్యార్థులను ఎలాంటి విచారణ చేపట్టకుండానే జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) డిబార్ చేయడంపట్ల యూనివర్సిటీ బోధేనేతర సిబ్బంది(నాన్ టీచింగ్ స్టాప్) తప్పుబట్టింది. కనీసం విచారణ కూడా చేయకుండా విద్యార్థులను చదువుకు దూరం చేయడం భావ్యం కాదని వారు పేర్కొన్నారు. జేఎన్‌యూ ఆవరణలో ఈ నెల 9న దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ ఎనిమిది మంది విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు డిబార్ చేశారు. ఇదిలా ఉండగా, ఆ విద్యార్థులపై అలాంటి చర్యలు సరైనవేనంటూ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టాఫ్ అసోసియేషన్(జే ఎన్యూఎస్ఏ), జవహర్లాల్ నెహ్రూ ఆఫీసర్స్ అపోసియేషన్ పేర్కొన్నాయి. -
రోల్‌మోడల్‌గా తయారుచేస్తా
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జేఎన్‌యూ నూతన వీసీ జగదీశ్‌కుమార్ ♦ యూనివర్సిటీ పరిశోధనల్లో నాణ్యత తగ్గుతోంది ♦ దీన్ని అధిగమించడానికే నా ప్రథమ ప్రాధాన్యం ♦ వర్సిటీలు ఉద్యోగాల సృష్టికర్తలను తయారు చేయాలి ♦ కనీసం ఐదేళ్లకోసారి సిలబస్‌లో మార్పులు జరగాలి సాక్షి ప్రతినిధి, నల్లగొండ:దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)ని రోల్‌మోడల్‌గా తయారు చేసేందుకు కృషి చేస్తానని ఆ యూనివర్సిటీ నూతన వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. వర్సిటీల్లో జరుగుతున్న పరిశోధనల్లో నాణ్యత తగ్గిపోతోందని, దాన్ని అధిగమించేందుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానన్నారు. స్వామి వివేకానందుని బోధనలు తనకు ఆదర్శమని..దేశ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం ఉండాలన్న ఆయన స్ఫూర్తితోనే ముందుకెళుతున్నానని చెప్పారు. జేఎన్‌యూ వీసీగా నియమితులైన నేపథ్యంలో జగదీశ్ కుమార్ ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి ఫోన్లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలివీ.. సాక్షి: జేఎన్‌యూ వీసీగా ఎంపికైనందుకు కంగ్రాట్స్ సార్.. మీ నేపథ్యం ఏమిటి? జగదీశ్‌కుమార్: మాది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. నేను ఆరో తరగతి వరకు ఊర్లోనే చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదువుకుని ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించాను. నా మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ అన్నీ అక్కడే పూర్తయ్యాయి. ఆ తర్వాత పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చాను. 1995లో ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యో గం లభించింది. ప్రస్తుతం ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఇప్పుడు జేఎన్‌యూ వీసీగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు మా అమ్మే స్ఫూర్తి. ఆమె స్కూల్ చదువు కూడా చదువుకోలేదు. కానీ చదువుకున్న వారి కన్నా ఎక్కువ పరిజ్ఞానం ఉంది. నేను ఈ స్థాయికి వచ్చానంటే ఆమే కారణం. ఇప్పటికీ ఆమె సలహాలు తీసుకుంటా. సాక్షి: పరిశోధనలకు నెలవైన విశ్వవిద్యాలయాల్లో నైతిక విలువలు లేకుండా పోతున్నాయని, పరిశోధనల్లో ఆశించిన నాణ్యత ఉండట్లేదన్న అపవాదు ఉంది. మీ అభిప్రాయమేంటి? జగదీశ్‌కుమార్: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోని విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో నాణ్యత తగ్గిపోతున్న మాట వాస్తవమే. విశ్వవిద్యాలయాల పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా, దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు ఇప్పించేవిగా ఉండాలి. జేఎన్‌యూలో అలాంటి పరిశోధనలకు చాలా అవకాశాలున్నాయి. వైస్‌చాన్సలర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటా. అయితే ఈ మార్పు రెండు, మూడు నెలల్లో సాధ్యమయ్యే పనికాదు. చాలా శ్రమించాలి. జేఎన్ యూ పరిశోధనల్లో నాణ్యత లోపాన్ని అధిగమించడమే నా ప్రథమ ప్రాధాన్యతగా పనిచేస్తా. సాక్షి: దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి ఏటా 2 లక్షలకుపైగా రీసెర్చ్ డాక్యుమెంట్లు వస్తున్నాయి. కానీ పరిశోధనల ఫలితాలు సామాన్య ప్రజలకు అందుబాటులోనికి రావడం లేదన్న దానిపై మీరేమంటారు? జగదీశ్‌కుమార్: పరిశోధనల్లో నాణ్యత ఉన్నప్పుడే వాటి ఫలితాలు క్షేత్రస్థాయికి వెళతాయి. అయితే జేఎన్‌యూ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో అందరికీ ప్రవేశాలు సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతిభను పూర్తిస్థాయిలో వెలికి తీయలేం. ప్రతిభ అనేది కేవలం నగరాలు, చదువుకున్న కుటుంబాలకే పరిమితం కాదనేది గుర్తించాలి. దేశాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం సాధ్యపడడం లేదు. అందరికీ విద్య, నాణ్యమైన సిలబస్‌ను ఉచితంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగాలి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల నుంచి ఉద్యోగార్థులను తయారు చేయాలన్న ఆలోచన నుంచి బయటపడాలి. ఉద్యోగాల సృష్టికర్తలను విశ్వవిద్యాలయాల నుంచి పంపాలి. ఇది యూనివర్సిటీల నుంచే సాధ్యమవుతుంది. ఆ దిశలో జేఎన్‌యూ పయనించేలా ప్రయత్నిస్తా. యూనివర్సిటీల్లో చదువు అంటే అక్కడే హాస్టళ్లలో ఉండి చదువుకోవడమనే అభిప్రాయం నుంచి యువత బయటపడాలి. ముఖ్యంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుని అందరికీ జేఎన్‌యూ పాఠాలు, సిలబస్ ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే కృషి చేయాలన్నది నా ఉద్దేశం. అవసరమైతే ఆన్లైన్ వీడియో పాఠాలు కూడా చెప్పిస్తా. జేఎన్‌యూలో దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ముఖ్యంగా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు ప్రవేశాలు లభించేలా ప్రయత్నిస్తా. సాక్షి: ఆక్స్ఫర్డ్ లాంటి వర్సిటీలు మూక్స్ పేరుతో సమాజానికి ఉపయోగపడేలా ఆఫర్ చేస్తున్న కోర్సులు మనకెప్పుడు అందుబాటులోకి వస్తాయి? జగదీశ్‌కుమార్: ఆ తరహా కోర్సులు ఇప్పటికే మన దేశంలో ఐఐటీల్లో ప్రారంభమయ్యాయి. మిగిలిన దేశాల విశ్వవిద్యాలయాలు, ఐటీ విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేస్తాయి. కానీ మన దేశంలో ఐఐటీలు, యూనివర్సిటీలకు సమన్వయం లేదు. అలాంటి సమన్వయం మనకు అవసరం. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు అభిప్రాయాలను పంచుకుని పనిచేస్తేనే సత్ఫలితాలు సాధ్యమవుతాయి. నేను ఆ దిశగా పనిచేయాలనుకుంటున్నా. సాక్షి: దేశంలోని వర్సిటీల్లో 10 ఏళ్లకు కూడా సిలబస్ మారని పరిస్థితులున్నాయి. దీనిపై ఏమంటారు? జగదీశ్‌కుమార్: కరిక్యులమ్ రివిజన్ అనేది శాస్త్రీయంగా ఉండాలి. దేశ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని సిలబస్‌ను ఉన్నతీకరిస్తుండాలి. కనీసం ఐదేళ్లకోసారి అయినా సిలబస్ అప్‌గ్రేడ్ కావాలి. మన విశ్వవిద్యాలయాల్లో అలాంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీలను దేశానికి అన్వయింపజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ అంశాలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి జేఎన్‌యూను రోల్‌మోడల్ చేయాలనేదే నా తపన. హెచ్‌సీయూ ఘటన దురదృష్టకరం సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య..ఆ తర్వాతి ఘటనల పరిణామాలను మీరెలా చేస్తారు? జగదీశ్‌కుమార్: హెచ్‌సీయూ ఘటన చాలా దురదృష్టకరమైనది. దీని గురించి నేను మాట్లాడను కానీ.. విద్యార్థుల సంక్షేమమే వీసీల ప్రధాన బాధ్యత అనేది నా ఉద్దేశం. చావు, పుట్టుకలను మనం ఆపలేం కానీ.. వాటిని నివారించే ప్రయత్నం చేయాలి. నేను జేఎన్‌యూకి వెళ్లాక విద్యార్థులతో మమేకమవుతా. వారి సమస్యలపై చర్చిస్తా.. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తా. -
జేఎన్‌యూ వీసీగా తెలుగు వ్యక్తి
* నల్లగొండ జిల్లా వాసి జగదీశ్‌కు కుమార్‌కు పట్టం * వర్సిటీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ) వైస్ చాన్స్‌లర్ గా నల్లగొండ జిల్లాకు చెందిన ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. జగదీశ్ కుమార్ త్వరలో నియమితులు కానున్నారు. అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల విజిటర్ అయిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పంపించిన 4 పేర్ల జాబితా నుంచి జగదీశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రముఖ శాస్త్రవేత్త వీఎస్ చౌహాన్, జేఎన్‌యూ లోని అప్లైడ్ హ్యూమన్ జెనెటిక్స్ నేషనల్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఆరెన్కే బమేజాయ్, జేఎన్‌యూ భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన రామకృష్ణ రామస్వామి పేర్లు జాబితాలో ఉన్నాయి. జెఎన్యూ ప్రస్తుత వైస్‌చాన్స్‌లర్ సుధీర్ కుమార్ పదవీకాలం ఈ నెల 27తో ముగుస్తుంది. ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జగదీశ్ కుమార్ నల్లగొండ జిల్లాలోని మామిడాల గ్రామంలో జన్మించారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లో సభ్యులుగా కూడా ఆయన కొనసాగుతున్నారు. వివిధ ఐఐటీలలో పని చేసిన విశేష అనుభవం ఉన్న జగదీశ్ కుమార్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్టీచింగ్ను కూడా అందుకున్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీ ఐఐటీ, జేఎన్‌యూల మధ్య సహకారంతో రెండు సంస్థల బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ విద్యతో పాటు హ్యుమానిటీస్ కూడా చాలా ప్రధానమైనవని.. ఈ రెండూ కలిసి ముందుకు సాగాలని ఆయన అన్నారు. ‘‘జేఎన్‌యూ ఒక విశిష్టమైన సంస్థ. దీని పరిధిలో భాషలు, అంతర్జాతీయ విద్య, న్యాయశాస్త్రం వంటి వివిధ కోర్సులను బోధించే సంస్థలతో పాటు పాఠశాలలు కూడా ఉన్నాయి. వీటిని బలోపేతం చేయటం నా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు. -
జేఎన్‌యూలో కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మైనర్ బాలిక జేఎన్‌యూ క్యాంపస్ లో గత కొన్నేళ్లుగా ఓ ప్రొఫెసర్ ఇంట్లో పనిచేస్తోంది. ఆ బాలికను సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేశారు. దూరంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తిరిగి వర్సిటీ ప్రాంగణంలోనే వదిలి వెళ్లారు. ముందు ప్రైవేటు ఆస్పత్రికి ఆ బాలికను తరలించి అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. 'ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్' (పోస్కో) చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదుచేశారు. -
‘విద్రోహి’ జీవితం.. విద్యార్థులకే అంకితం
న్యూఢిల్లీ: విద్యార్థుల కోసం, వారి హక్కుల కోసం మూడు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పోరాటం చేసిన గుండె అలసిపోయి ఆగిపోయింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఓ చెట్టును ఆవాసం చేసుకుని యూనివర్సిటీ యాజమాన్య పోకడలను అధిక్షేపించిన స్వరం మూగబోయింది. సామాజిక రుగ్మతలపై అలుపెరుగకుండా చేసిన యుద్ధం అర్ధంతరంగా ముగిసిపోయింది. యూనివర్సిటీ ప్రాంగణంలోనూ.. దాని బయటా విద్యార్థుల ఉద్యమాలకు బాసటగా నిలిచిన ఆ శ్వాస నిలిచిపోయింది. శ్వాస కలం పేరు విద్రోహి.. ఆ గొంతుక అసలు పేరు రమాశంకర్ యాదవ్.. ఏ చెట్టునైతే ఆయన నివాసం చేసుకున్నారో.. ఆ చెట్టు నీడనే తుది శ్వాస విడిచారు. 58 ఏళ్ల వయసులోనే విద్యార్థి లోకాన్ని.. వారికి తానిచ్చిన ఉద్యమస్ఫూర్తిని వదిలేసి కన్నుమూశారు. ఉత్తర్రపదేశ్‌లో 1957లో జన్మించిన యాదవ్ 1980లో జేఎన్‌యూలో ఎంఏ హిందీలో చేరారు. చేరిన రోజు నుంచే విద్యార్థి ఉద్యమాలో్ల చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనల బాట పట్టిస్తున్నారంటూ యాజమాన్యం ఆయన్ని 1983లో తాత్కాలికంగా క్యాంపస్ నుంచి సస్పెండ్ చేసినా ఆయన క్యాంపస్‌ను వీడిపోలేదు. అక్కడే ఓ చెట్టు కింద భీష్మించుకుని కూచున్నారు. మంగళవారం ఆయన మరణించేంత వరకూ ఆ చెట్టు నీడనే ఉండిపోయారు. బలవంతంగా ఆయన్ను యూనివర్సిటీ నుంచి పంపించాలని చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. విద్యార్థులిచ్చే కాఫీ, ప్లేట్ మీల్స్తోనే కాలం గడిపారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని ఆందోళనల్లో క్రియాశీల పాత్ర పోషించారు. ఏనాడూ అక్షర బద్ధం చేయని తన కవిత్వం వినిపించారు. విద్యార్థులకు ప్రేమాస్పదుడిగా మారారు. క్యాంపస్ యాజమాన్యం 2010లో సెక్యూరిటీ ద్వారా ఆయన్ని క్యాంపస్ నుంచి బయటకు పంపించటంతో, అధికార విద్యార్థి సంఘం దీనికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించింది. రెండు వారాలపాటు క్యాంపస్ మూతపడింది. ఫలితంగా యాదవ్‌ను మళ్లీ క్యాంపస్‌లోకి అనుమతించారు. అప్పటివరకు విద్యార్థుల దయాదాక్షిణ్యాలతో బతికిన యాదవ్‌కు క్యాంటిన్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఉచిత టీ, భోజన సదుపాయాలను కల్పించాల్సి వచ్చింది.. చలికాలం కోసం గొంగళ్లు ఇచ్చారు. వర్షాకాలంలో పడుకునేందుకు విద్యార్థి సంఘం ఆఫీస్‌లో వెసులుబాటు కల్పించారు. గ్వాలియర్‌కు చెందిన నితిన్ పమ్నాని 2011లో ఆయనపై ‘మై తుమ్హారా కవి హూ’ అనే శీర్షికతో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఆ డాక్యుమెంటరీకి అవార్డు కూడా వచ్చింది. క్యాంపస్ విద్యార్థులు బుధవారం సంతాప సభ ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన లేకున్నా ఆయన కవిత్వం పంక్తులు తమ చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయని విద్యార్థి నాయకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
హంపి వర్సిటీకి ఉన్నత స్థానం
ఘనంగా హంపి కన్నడ వర్సిటీ స్నాతకోత్సవం హాజరైన గ వర్నర్ వాజుభాయి రూడాభాయి వాలా ముగ్గురికి నాడోజ బిరుదు ప్రదానం హొస్పేట : విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తలపించేలా అత్యంత సుందరంగా హంపి విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమని న్యూఢిల్లీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, కవి హెచ్ఎస్ శివప్రకాష్ అన్నారు. ఆయన శుక్రవారం హంపి కన్నడ విశ్వవిద్యాలయంలోని నవరంగ బయలు మందిరంలో ఏర్పాటు చేసిన 23వ స్నాతకోత్సవాన్ని ప్రారంభించి, మాట్లాడారు. హంపి కన్నడ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. కన్నడ భాషాభివృద్ధి కోసం హంపి కన్నడ విశ్వవిద్యాలయం నిరంతరంగా కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. ఆంగ్ల భాషపై వ్యామోహానికి లోనై మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. వెనకటి రోజుల్లో కన్నా నేటి రోజుల్లో ఆంగ్ల భాషపై వ్యామోహం మరింతగా పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేని వారు వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత ఉద్యోగాలు, అధిక సంపాదన పొందాలన్నా ఆంగ్ల భాష మాధ్యమంలో చదివిన వారికే ప్రాధాన్యత లభిస్తోందన్నారు. సమాజంలో ఈ పద్ధతి మారాలన్నారు. అన్ని రంగాల్లో కన్నా విద్యారంగాన్నికి ప్రత్యేక స్థానం ఉందని విద్యారంగం మరింత అభివృద్ధి చెందాలన్నారు. కన్నడ భాషా సంస్కృతులను కాపాడే బాధ్యత ప్రతి కన్నడిగులపై ఉందన్నారు. హంపి కన్నడ విశ్వవిద్యాలయం ప్రాధ్యాపకులు మరెన్నో ఉత్తమ పరిశోధనలను చేపట్టి సమాజానికి ఉత్తమ గ్రంథాలను వెలుగులోకి తేవాలని కోరారు. అనంతరం రాష్ట్రంలోని కన్నడ సాహిత్య రంగంతోపాటు ఇతర రంగాలలో ఉత్తమ సేవలందించిన డాక్టర్ పీఎస్.శంకర్, ఎస్ఆర్.రామస్వామి, ప్రొఫెసర్ ఎంహెచ్ కృష్ణయ్యలకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయి రూఢా భాయి వాలా చేతులు మీదుగా విశ్వవిద్యాలయం గౌరవ నాడోజ బిరుదులను ప్రదానం చేశారు. అదే విధంగా విద్యార్థులకు డిలిట్, పీహెచ్డీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా హంపి కన్నడ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ హెచ్‌సీ బోరలింగయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ విజయ్ పూణచ్చ తంబండ, సిండికేట్ సభ్యులు, ప్రాధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఢిల్లీని తాకిన ముద్దుల పోరాటం!
న్యూఢిల్లీ/కొచ్చి: మొన్న కిస్ ఆఫ్ లవ్... నిన్న హగ్ ఆఫ్ లవ్... కేరళలోని కొచ్చి విద్యార్థులు నైతిక పోలీసింగ్ (నైతిక నియమావళి పేరుతో ఆంక్షలు)ను వ్యతిరేకిస్తూ తలపెట్టిన నిరసనలు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయ వాదులు వీరికి అడ్డు తగులుతుండడంతో ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీస్తోంది. సంప్రదాయ వాదులు తమ యత్నాలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ‘కిస్ ఆఫ్ లవ్’ మద్దతు దారులు కొందరు శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సుమారు 60 మంది విద్యార్థులు జందేవాలన్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యాలయం వరకు ప్రదర్శనగా రాగా రెండంచెల బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. వీరికి దీటుగా హిందూసేన కూడా అదే సమయంలో మరో ప్రదర్శన తలపెట్టగా వారి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. మరోవైపు కిస్ ఆఫ్ లవ్‌కు మద్దతు ప్రకటిస్తూ కొచ్చిలోని మహారాజా కాలేజీ విద్యార్థులు ‘హగ్ ఆఫ్ లవ్’ కార్యక్రమం నిర్వహించారు. -
ఆసియా టాప్ 100 వర్సిటీల్లో భారత్‌కు చోటు
లండన్: ఆసియాలోని యూనివర్సిటీల ర్యాంకింగ్‌లలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది. 2014 సంవత్సరానికి సంబంధించి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మేగజైన్ గురువారం విడుదల చేసిన టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో భారత్‌లోని పది విద్యాసంస్థలకు చోటు లభించింది. 2013లో ఈ జాబితాలో కేవలం మూడింటికి మాత్రమే చోటు లభించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 10కి పెరిగింది. ఈ జాబితాలో చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీకి 32వ స్థానం లభించింది. అలాగే ఖరగ్‌పూర్‌లోని ఐఐటీకి 45, కాన్పూర్ ఐఐటీకి 55వ ర్యాంకులు వచ్చాయి. ఢిల్లీ, రూర్కీ ఐఐటీలకు సంయుక్తంగా 59వ ర్యాంకు లభించింది. గువాహటి, మద్రాస్ ఐఐటీలు 74, 76 స్థానాల్లో నిలిచాయి. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిటీకూడా 76వ ర్యాంకు వచ్చింది. అలీగఢ్ ముస్లిం వర్సిటీకి 80, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి 90వ స్థానం దక్కింది. ఇదిలా ఉండగా 20 విద్యాసంస్థలతో జపాన్ ఈ జాబితాలో అగ్రభాగంలో ఉంది. -
భారత్‌లో 10 ప్రపంచస్థాయి యూనివర్సిటీలు
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ టాప్ 100 ర్యాంకుల ప్రకటన లండన్: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో భారత్‌లోని పది యూనివర్సిటీలకు చోటు లభించింది. జాబితాలో పంజాబ్ యూనివర్సిటీ 13వ స్థానంలో, ఐఐటీ ఖరగ్‌పూర్ (30), ఐఐటీ కాన్పూర్(34)వ స్థానాల్లో నిలవగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 37వ స్థానంలో నిలిచాయి. ఐఐటీ గువాహటి 46, ఐఐటీ మద్రాస్, జాదవ్‌పూర్ యూనివర్సిటీలు 47, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 50, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 57 స్థానాలను దక్కించుకున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్), మరో 17 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రపంచస్థాయి యూనివర్సిటీలపై తొలిసారి సర్వే చేసిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ఈ మేరకు ర్యాంకులను ప్రకటించింది. ఈ టాప్ 100 వర్సిటీల జాబితాలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. చైనాలోని పెకింగ్, త్సింగ్వా యూనివర్సిటీలు మొదటి, రెండో స్థానంలో నిలవగా.. ఆ దేశంలోని 44 యూనివర్సిటీలు టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. బోధన, పరిశోధన, నాలెడ్జి ట్రాన్స్ఫర్, అంతర్జాతీయ దృక్పథం వంటి 13 అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. భారత్‌లో 20 యూనివర్సిటీలు మాత్రమే తమ సమాచారాన్ని అందజేయడంతో ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పరిశీలించలేదు. పాకిస్థాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లోని ఒక్క యూనివర్సిటీకి కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు. -
లైంగిక వేధింపులపై నిర్లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విశ్వవిద్యాయాల్లో ఒకటైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో మహిళలకు స్వేచ్ఛాయుత, సురక్షిత వాతావరణం కరువయింది. గతంలో ఓ యువకుడు తరగతి గదిలోనే విద్యార్థినిపై గొడ్డలితో దాడి చేసినప్పటికీ యాజమాన్యం భద్రతపై పెద్దగా దృష్టి సారించలేదు. తాము లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు 53 శాతం మంది విద్యార్థులు సెం టర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అండ్ సెంటర్ ఆఫ్ జర్మన్ స్టడీస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో వెల్లడించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో నిర్వహించిన ఈ సర్వే ప్రశ్నావళికి 529 మంది విద్యార్థినులు స్పందించారు. తాము ‘సహచరులు/ప్రేమికుడితో ఇబ్బందులు’ ఎదుర్కొన్నట్టు ప్రతి ఐదుగురిలో ఒక విద్యార్థిని పేర్కొంది. అప్పుడప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామని దాదాపు 53 శాతం మంది వెల్లడించారు. గతంలో ఒక విద్యార్థిని జేఎన్‌యూలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మనస్తాపం కలిగించినట్టు 96 శాతం మంది పేర్కొన్నారు. అయితే జేఎన్‌యూలో సురక్షిత వాతావరణం ఎందుకు కరువవుతోందనే ప్రశ్నకు చాలా జవాబులు వినిపిస్తున్నాయి. సోషల్ మెడిసిన్‌లో ఎంఫిల్ చేస్తున్న ఒక విద్యార్థి స్పందిస్తూ ‘సర్వే ఫలితాలను నేను కూడా విశ్వసిస్తున్నాను. గత కొన్నేళ్లుగా జేఎన్‌యూ క్యాంపస్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బయటి వ్యక్తులు సులువుగా క్యాంపస్‌లోకి చొరబడుతున్నారు. వారి చూపులు కూడా ఏదోలా ఉంటాయి. జూనియర్లూ అనుచితంగా ప్రవర్తిస్తుంటారు’ అని ఆమె వివరించారు. లైంగిక వేధింపుల నిరోధానికి జేఎన్‌యూ ఏర్పాటు చేసిన కమిటీ పనితీరుపైనా ఆమె పెదవి విరిచారు. జూనియర్లకు కౌన్సెలింగ్ ఇవ్వకపోవడంతో వారు ఇక్కడికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. జేఎన్‌యూ స్వేచ్ఛాస్ఫూర్తిని జూనియర్లు అర్థం చేసుకోవడం లేదని వినయ్ కుమార్ అనే పీహెచ్డీ విద్యార్థి అభిప్రాయపడ్డాడు. ‘గత ఐదేళ్లుగా నేను క్యాంపస్‌లో ఉంటున్నా. ఇక్కడి వాతావరణం క్రమంగా మారుతోంది. ప్రతి ఒక్కరూ పైచేయి కోసం ప్రయత్నించేవారే! ఫలితంగా విద్యార్థినీవిద్యార్థుల మధ్య అంతరం పెరుగుతోంది. మనది ఇప్పటికీ పితృస్వామ్య వ్యవస్థే కాబట్టి ఇక్కడ కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు’ అని ఆయన వివరించారు. సహచరులు/ప్రేమించిన వాళ్లతో ఇబ్బందిపడే విద్యార్థినుల గురించి ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనల్లో విద్యార్థిని బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తే తప్ప ఏమీ చేయలేమన్నారు. మగవారిలో ఇప్పటికీ పితృస్వామ్య భావన బలంగా ఉండడమే ఈ సమస్యకు కారణమని విశ్లేషించారు. సర్వే ఫలితాలపై ప్రొఫెసర్ ఆయేషా కిద్వాయ్ స్పందిస్తూ నిజాలు ఎలా ఉన్నా యూనివర్సిటీ అంగీకరిస్తుందని స్పష్టం చేశారు. సురక్షిత వాతావరణం కల్పించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికే అమల్లో ఉన్న లైంగిక వేధింపుల కమిటీని బలోపేతం చేయడానికి బదులు, కొత్త దానిని ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ఫలితాలు ఉండబోవని విద్యార్థులు అంటున్నారు. -
ఒకే రోజు రెండు ఎన్నికలు
న్యూఢిల్లీ: నగరంలోని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ప్రాంగణాలు ఈ నెల 13వ తేదీన విద్యార్థి సంఘాల ఎన్నికలకు వేదికలు కానున్నాయి. కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ, ఆర్ఎస్ఎస్ మద్దతు కలిగిన బీజేపీ అనుబంధ ఏబీవీపీలు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల బరిలోకి దిగాయి. ఎన్నికల తేదీ అధికారికంగా ప్రకటించకముందే ఈ రెండు పార్టీలు ఎన్నికల ప్రచార బరిలోకి దూకాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం డీయూ విశ్వవిద్యాలయ ప్రాంగణం నిండా ఇరు పార్టీలు విచ్చలవిడిగా పోస్టర్లు అంటించాయి. ఈ ఎన్నికలను విశ్వవిద్యాలయ యాజమాన్యమే నిర్వహిస్తున్నప్పటికీ ఎన్ఎస్యూఐ, ఏబీవీపీల మధ్య అనేక పర్యాయాలు ఘర్షణలు జరిగాయని, కొంతమంది గాయపడినట్టు తెలియవచ్చింది. ఇక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవి కోసం 12 మంది, ఇక కార్యదర్శి పదవికోసం 17, సంయుక్త కార్యదర్శి పదవి కోసం పది మంది పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ వాణిని ఓటర్లను వినిపించేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం అన్ని అవకాశాలు కల్పించింది. కమ్యూనిటీ రేడియో, వెబ్సైట్లను వినియోగించుకునేందుకు అనుమతించింది. అంతేకాకుండా విద్యార్థులు తమ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ డీయూ ఎన్నికల ఇన్చార్జి ఓ లేఖ కూడా రాశారు. ‘పెద్దసంఖ్యలో మీరంతా ఈ ఎన్నికల్లో పాల్గొనాలని, ఎటువంటి భయమూ లేకుండా ఓటు వేయాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఇక అభ్యర్థులను ఎన్నుకునే విషయానికి సంబంధించి మీకు సరైన ప్రాతినిధ్యం ఎవరు వహించగలుగుతారనే విషయాన్ని ఆలోచించండి. అదేవిధంగా విశ్వవిద్యాలయం నిర్ణాయక సమావేశాల్లోనూ అదే స్థాయిలో ఎవరు వ్యవహరించగలుగుతారనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇక జవహర్లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) విషయానికొస్తే విద్యార్థులే ఎన్నికలను నిర్వహించుకుంటారు. వామపక్ష విద్యార్థి సంఘాలు ఆదినుంచి ఈ ధోరణిని అవలంబించాయి. జేఎన్‌యూ అధ్యక్ష పదవికి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక ఉపాధ్యక్ష పదవికి ఐదుగురు, ప్రధాన కార్యదర్శి పదవికి ఆరుగురు, సంయుక్త ప్రధాన కార్యదర్శి పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలోకి దిగారు. జేఎన్‌యూ ఎన్నికల బరిలో గే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల బరిలోకి దిగినవారిలో వివిధ రకాల వ్యక్తుల సమ్మేళనం కలగలిసి ఉంది. ఎంఫిల్ చదువుతున్న గుంజన్ ప్రియ అనే విద్యార్థిని పోటీ పడుతుండగా ఆమె తరఫున ఆమె కుమార్తె శ్రుతి ప్రచారం చేస్తోంది. భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్) తరఫున గుంజన్ బరిలోకి దిగింది. దీంతో తల్లి తరఫున ప్రచార భారం నెత్తికెత్తుకున్న శ్రుతి తన అమ్మకు ఓటు వేయాలంటూ విద్యార్థులందరినీ అభ్యర్థిస్తోంది. ఇందుకు సంబంధించి కరపత్రాలను వారికి అందజేసిన అనంతరం లాల్‌సలామ్ కూడా చెబుతోంది. కాగా ఇదే పతాకం కింద ప్రధాన కార్యదర్శి పదవికి గౌరబ్ ఘోష్ అనే గే కూడా పోటీపడుతున్నారు. ఈ సందర్భంగా గౌరబ్ మాట్లాడుతూ ‘లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ) సమాజానికి చెందినవారిని కూడా జేఎన్‌యూకి చెందిన విద్యార్థులు అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి వివక్ష ఉండకూడదని, సమానత్వం ఉండాలనేదే నా డిమాండ్’ అని ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన గౌరబ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల బరిలో కజకిస్థాన్‌కు చెందిన మెట్బెకోవ్ ఝస్సులాన్ కూడా పోటీ చేస్తున్నాడు. ఝస్సులాన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు. తాను మధ్యవర్తిగా నియమించుకున్న నవీన్ సర్కారు సహాయంతో ఓటర్లతో సంభాషిస్తున్నాడు. అనేక బంగారు పతకాలను సొంతం చేసుకున్న ఝస్సులాన్ ప్రస్తుతం జేఎన్‌యూలో ఆర్థికశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. జనతాదళ్ (యూ) తరఫున బరిలోకి దిగాడు.