![Another JNU professor booked for molestation - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/14/girl-shadow.jpg.webp?itok=TGRdFgcn)
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల కేసు నమోదవ్వగా.. తాజాగా మరో ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది. ప్రొఫెసర్ అజయ్‌కుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ సైన్స్ విద్యార్థిని ఒకరు ఆరోపించారు. ఈ మేరకు ఆమె వసంత్‌కుంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసులు సదరు ప్రొఫెసర్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొద్దిరోజుల కిందట జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది విద్యార్థినులు ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదుచేశారు. ఈ వ్యవహారంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. కానీ, మరునాడే అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment