త్వరలో రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిని కలుస్తాం | President, Union Home Minister meet coming Soon | Sakshi
Sakshi News home page

త్వరలో రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిని కలుస్తాం

Mar 13 2016 11:58 PM | Updated on Aug 8 2018 6:12 PM

త్వరలో రాష్ట్రపతి,  కేంద్ర హోం మంత్రిని కలుస్తాం - Sakshi

త్వరలో రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిని కలుస్తాం

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను

జేఎన్‌యూ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షురాలు షెహ్ల రషీద్
 

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్నట్లు ఆ వర్సిటీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు షెహ్ల రషీద్ షోరా పేర్కొన్నారు. నగరానికి వచ్చిన ఆమె ఆదివారం లామకాన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దాదాపు రెండు నెలలుగా వర్సిటీలో చేసుకుంటున్న పరిణామాలపై వారిపై మాట్లాడేందుకు వర్సిటీ విద్యార్థులతో కలిసి వెళ్తామని చెప్పారు.

ఇప్పటికే హోంమంత్రితో సమావేశం కావాలని అనుమతి కోరినట్లు వెల్లడించారు. తనతోపాటు వర్సిటీ విద్యార్థులపై ఆర్‌ఎస్‌ఎస్ కుట్రపూరిత ప్రచారం చేస్తోంద ని ఆరోపించారు.  ‘అఫ్జల్‌గురు ఉరితీత ఘటనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంబేద్కర్‌వాదులంతా ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే రాజీవ్ గాంధీ హత్య, మరే ఇతర వ్యక్తులపైనా అటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి’ అని ఫిబ్రవరి 9 రాత్రి వర్సిటీలో ఏం జరిగిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement