న్యూఢిల్లీ: ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మైనర్ బాలిక జేఎన్‌యూ క్యాంపస్ లో గత కొన్నేళ్లుగా ఓ ప్రొఫెసర్ ఇంట్లో పనిచేస్తోంది.
ఆ బాలికను సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేశారు. దూరంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తిరిగి వర్సిటీ ప్రాంగణంలోనే వదిలి వెళ్లారు. ముందు ప్రైవేటు ఆస్పత్రికి ఆ బాలికను తరలించి అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. 'ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్' (పోస్కో) చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదుచేశారు.
జేఎన్యూలో కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
Published Tue, Jan 19 2016 7:44 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement