ఆ వర్సిటీలను ప్రైవేటుపరం చేయం | Autonomy In No Way A Step Towards Privatisation; Will Enhance Global Standing Of Our Institutions | Sakshi
Sakshi News home page

ఆ వర్సిటీలను ప్రైవేటుపరం చేయం

Published Mon, Mar 26 2018 3:05 AM | Last Updated on Mon, Mar 26 2018 3:05 AM

Autonomy In No Way A Step Towards Privatisation; Will Enhance Global Standing Of Our Institutions - Sakshi

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీతోపాటు దేశంలోని పలు వర్సిటీలను ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే వాటికి స్వయంప్రతిపత్తి హోదా కల్పించామనడం సరికాదని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. ఈ విద్యా సంస్థల్లో ఫీజులు పెంచబోమని,  వీటికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న దేశంలోని 60 విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ అటానమస్‌ హోదా కల్పించింది. వీటిలో 5 సెంట్రల్‌ వర్సిటీలు కాగా 21 స్టేట్‌ వర్సిటీలున్నాయి. అటానమస్‌ హోదా కారణంగా ఆయా వర్సిటీలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement