Autonomy
-
ఇచ్చట రెక్కలు అద్దెకు ఇవ్వబడును
‘నీలాగ నాకు పది చేతులు లేవు’ అనే డైలాగ్ ఇక ముందు వినిపించవచ్చు. జపాన్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ టోక్యో’ కు చెందిన ప్రొఫెసర్ మసహకో ఇనామి నేతృత్వంలోని పరిశోధక బృందం ‘జీజై ఆర్మ్స్’ పేరుతో వేరబుల్ రోబో ఆర్మ్స్ను తయారు చేసింది. డ్యాన్స్లాంటి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ వరకు ఈ రోబో ఆర్మ్స్ ఉపయోగపడతాయి. ‘జీజై’ అంటే జపనీస్‌లో స్వాతంత్య్రం, స్వయంప్రతిపత్తి అని అర్థం. యసునరి అనే రచయిత రాసిన ఒక కథ చదివిన తరువాత ప్రొఫెసర్ మసహకో ఇనామికి ‘వేరబుల్ ఆర్మ్స్’ ఐడియా వచ్చింది. ‘జీజై ఆర్మ్స్’కు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అయింది -
కశ్మీర్ కథ ఎటు..?
జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు (ఆగస్టు 5, 2019) తర్వాత మంచుకొండల్లో రాజకీయ వేడి రాజుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు కశ్మీర్ రాజకీయ పార్టీ నేతలతో అఖిలపక్ష సమావేశం జరగనుంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టడానికి ఏయే పార్టీలు సహకరిస్తాయో, ఎవరెవరు వ్యతిరేకిస్తూ వేర్పాటువాద చిచ్చు రగులుస్తారో తెలుసుకోవడానికి... ఈ సమావేశాన్ని కేంద్రం వేసిన తొలి అడుగుగా భావిస్తున్నారు. కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అందరితో కలుపుకొని పోయేలా నిర్వహించడం కోసమే ప్రధాని ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టుగా ప్రధాని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఎజెండా ఏమిటి? జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా గత ఏడాది స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో హమీ ఇచ్చారు. రాష్ట్ర హోదా కల్పించి ఎన్నికలకు వెళ్లాలంటే దాని కంటే ముందుగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. జమ్మూకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ చట్టం– 2019 కశ్మీర్ అసెంబ్లీ బలాన్ని 107 నుంచి 114కి పెంచింది. ఇందులో 24 సీట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందినవి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఏడు నియోజకవర్గాల సరిహద్దులు, జనాభా, భౌగోళిక స్వరూపంపై సమగ్ర నివేదిక కోసం నియోజకవర్గాల పునర్విభజన కమిటీకి బాధ్యతలు అప్పగించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన్ ప్రకాశ్ దేశాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల్లో విస్తరిస్తే అభివృద్ధికి ఆటంకాలు ఉంటాయని అభిప్రాయపడినట్టు సమాచారం. అందుకే నియోజకవర్గాల పునర్విభజనపై తొలుత అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే సమయం వచ్చినప్పుడు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచనగా ఉంది. రాజకీయ చిత్రం జమ్మూకి అనుకూలంగా మారుతుందా? నియోజకవర్గాల పునర్విభజనతో జమ్మూ ప్రాంతానికి అనుకూలంగా రాజకీయాలు మారే అవకాశాలున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి జమ్మూలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. ఇన్నాళ్లూ కశ్మీర్‌కు చెందిన నాయకుల ఆధిపత్యం వల్ల జమ్మూ అభివృద్ధిపై వివక్ష ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జమ్మూలో అసెంబ్లీ స్థానాలు పెరగడం వల్ల బీజేపీ రాజకీయంగా బలపడుతుందని, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ ముఫ్తీ కుటుంబాల హవాకు తెరపడి వేర్పాటువాద శక్తులు బలహీనంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలోని 37 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 25 స్థానాలను కొల్లగొట్టింది. ఈ ప్రాంతంలో సీట్లు పెరిగితే రాజకీయంగా బలపడాలనే ఆలోచనలో కేంద్రంలోని అధికార బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘జమ్మూకశ్మీర్ మొత్తం జనాభాలో 55% కశ్మీర్లో ఉంటే సీట్లు 53% ఉన్నాయి. అదే జమ్మూలో జనాభా 43% ఉంటే సీట్లు 42.5% ఉన్నాయి. విస్తీర్ణంలో కశ్మీర్లో కంటే జమ్మూలో నియోజకవర్గాలు చాలా పెద్దవి. మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గరకి నాయకులు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే కేంద్రం కట్టుబడి ఉంది. అందరి ఆమోదంతో అభివృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టింది’’ అని కశ్మీర్ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎందుకింత ప్రాధాన్యం? పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో బీజేపీ ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించింది. అప్పట్నుంచి కశ్మీర్ కేంద్ర పాలనలోనే ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను విడదీస్తూ... రెండు ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ... జమ్మూకశ్మీర్ పునర్యవస్థీకరణ చట్టానికి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. మళ్లీ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటే కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేసి, పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. జూలైలో వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కశ్మీర్ కథకి ప్రజాస్వామ్యబద్ధమైన ముగింపు ఇవ్వడానికే అఖిలపక్షాన్ని పిలవడంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత తొలిసారి ఒక రాజకీయ ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టడం, నెలల తరబడి నిర్బంధంలో ఉంచిన నాయకుల్ని సమావేశానికి పిలవడంతో ఈ సమావేశంలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి నెలకొంది. విపక్షాలు ఏమంటున్నాయి ? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కశ్మీర్‌కు చెందిన 14 మంది నాయకులకు ఆహ్వానం పంపితే ప్రతీ ఒక్కరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తిరిగి కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలంటూ ఏర్పాటైన ఏడు పార్టీల కూటమి గుప్కర్ అలయెన్స్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించింది. గత ఏడాది జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో మొత్తం 278 స్థానాల్లో గుప్కర్ కూటమి 110 స్థానాలను గెలుచుకొని బీజేపీకి గట్టి సవాల్ విసిరింది. బీజేపీ 75 స్థానాలకు పరిమితం కాగా, ఏకంగా 50 సీట్లలో స్వతంత్రులు నెగ్గారు. ఇప్పుడు ఆ కూటమి నేతలు సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఈ తరహా సమావేశాలకు దూరంగా ఉండే నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అఖిలపక్ష సమావేశానికి రానుంది. జమ్ము కశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్య ప్రధాని దృష్టికి తీసుకురావడమే తమ లక్ష్యమని, ప్రత్యేకంగా ఎజెండా అంటూ తమకేమీ లేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున ఆహ్వానం అందుకున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సంపూర్ణ రాష్ట్ర హోదాయే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
బ్యాంకులకు పూర్తి స్వయం ప్రతిపత్తి!
న్యూఢిల్లీ: మెరుగైన సామర్థ్యం, వ్యవస్థీకృత పటిష్టత వంటి అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత స్వయం ప్రతిపత్తి అవసరమని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) సూచించింది. బీపీ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్ టైమ్ డైరెక్టర్ల నియామక అత్యున్నత సంస్థ– బీబీబీ, మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. బ్యాంకింగ్ రుణ వ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో పేర్కొంది. రుణ వ్యయాలు మరింత తగ్గాలని, రుణ ఆమోదం, కేటాయింపులు, పంపిణీల విషయంలో బ్యాంకింగ్ సామర్థ్యం మెరుగుపడాలని సూచించింది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు ఉండాలని పేర్కొంది. మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలంలో ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాంకింగ్ హోల్‌టైమ్ డైరెక్టర్ల నియామకాలు జరిగాయని నివేదిక పేర్కొంటూ, సకాలంలో బీబీబీ ఇచ్చిన సిఫారసులు దీనికి కారణమని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్‌టైమ్ డైరెక్టర్లు అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకాలకు తగిన సిఫారసులు చేయడానికి నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారులతో బీబీబీ ఏర్పాటుకు 2016లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డ్ డైరెక్టర్లతో చర్చించి, విలీనాలు సహా బ్యాంకింగ్ రంగ పురోగతికి తగిన వ్యూహ రూపకల్పనలోనూ బీబీబీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. -
6 విద్యా సంస్థలకు కిరీటం
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదా కల్పించింది. ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను కేంద్రం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించింది. ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ (ఈఈసీ).. తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ ప్రకటించింది. టాప్ 100లో ఒక్క వర్సిటీ లేదు ‘ఐవోఈ దేశానికి ఎంతో ముఖ్యం. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 వర్సిటీల్లో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు. కనీసం టాప్ 200లో నిలవలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఐఓఈ హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్ యూనివర్సిటీలు, 27 టాప్ ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ సంస్థలు ఉన్నాయి. ఇంకా స్థాపించని సంస్థకు ఐఈవోనా? రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఇంకా స్థాపించనేలేదనీ, ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కాదని జియో ఇన్స్టిట్యూట్కు ఐఈవో హోదా ఎలా ఇచ్చా రని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జియో ఇన్స్టిట్యూట్ అనే విద్యా సంస్థ ఒకటి రాబోతోందని ప్రపంచానికి తెలిసిందే సోమవారమని అంటున్నారు. ‘జియో ఇన్స్టిట్యూట్కు క్యాంపస్ లేదు. వెబ్సైట్ లేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ లేదా ప్రైవేట్ రంగంలోని అశోక వర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థలనెన్నింటినో కాదని ఐఈవో హోదా జియోకు ఎలా దక్కింది?’ అని పలువురు విద్యావేత్తలు సహా అనేక మంది ట్వీటర్లో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను ప్రశ్నించారు. అయితే జియోకు ఐఈవో హోదా ఇవ్వడాన్ని యూజీసీ సమర్థించుకుంది. గ్రీన్‌ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో జియోకు ఆ హోదా ఇచ్చామనీ, ఈ కేటగిరీ కింద మొత్తం 11 సంస్థలు దరఖాస్తు చేసుకోగా జియోను అవకాశం వరించిందని యూజీసీ పేర్కొంది. -
ఆ వర్సిటీలను ప్రైవేటుపరం చేయం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతోపాటు దేశంలోని పలు వర్సిటీలను ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే వాటికి స్వయంప్రతిపత్తి హోదా కల్పించామనడం సరికాదని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ విద్యా సంస్థల్లో ఫీజులు పెంచబోమని, వీటికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న దేశంలోని 60 విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అటానమస్ హోదా కల్పించింది. వీటిలో 5 సెంట్రల్ వర్సిటీలు కాగా 21 స్టేట్ వర్సిటీలున్నాయి. అటానమస్ హోదా కారణంగా ఆయా వర్సిటీలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. -
ఎందుకీ వృథా చర్చ!
ఎంతో లోతుగా చర్చించి, అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవా ల్సిన ప్రధానాంశాలన్నీ మన దేశంలో ఎన్నికల సీజన్లో ప్రస్తావనకొస్తాయి. అసలు విషయాన్ని వదిలి భావోద్వేగాల చుట్టూ పరిభ్రమిస్తాయి. ఎన్నికలు పూర్తికాగానే అటకెక్కుతాయి. మరో ఎన్నికల సంరంభం వరకూ వాటిని ప్రస్తావించే వారూ ఉండరు... పరిష్కరించేవారూ ఉండరు. కశ్మీర్ స్వయంప్రతిపత్తి అంశం ఇప్పుడ లాంటి భావోద్వేగాల్లోనే చిక్కుకుంది. పర్యవసానంగా దాని అర్ధం, పరమార్ధం మారిపోయింది. కశ్మీర్లో అధిక సంఖ్యాకులు ఆ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి ఉండా లనుకుంటున్నారని, ‘ఆజాదీ’(స్వాతంత్య్రం) అంటే వారి దృష్టిలో స్వయంప్రతిపత్తే నని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన ప్రకట నతో ఈ తేనెతుట్టె కదిలింది. ఆదివారం బెంగళూరులో ఒక సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ‘నిన్నటిదాకా అధికారంలో ఉన్నవారు ఇవాళ కశ్మీర్ స్వాతం త్య్రాన్ని కోరేవారితో స్వరం కలిపార’నడమే కాదు... మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న జవాన్లను కాంగ్రెస్ అవమానపరిచిందని వ్యాఖ్యానించారు. నవం బర్ 9,14 తేదీల్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి రెండూ సరిహద్దు రాష్ట్రాలు. చిదంబరం ప్రకటన ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఏం కొంప ముంచుతుందోనని కాంగ్రెస్ వణికిపోయింది. అందుకే నరేంద్రమోదీ వేలెత్తిచూపక ముందే రంగంలోకి దిగింది. ‘నష్ట నివారణ’ చర్యలు మొదలెట్టింది. ఆయన అభి ప్రాయాలతో పార్టీకి ఏకీభావం లేదంటూ వివరణనిచ్చుకుంది. నిజానికి ‘స్వయంప్రతిపత్తి’ అన్నది అంత ప్రమాదకరమైన మాటే అయితే... దేశానికి హాని కలిగించేదైతే మన రాజ్యాంగ నిర్మాతలు దాని జోలికి పోయేవారు కాదు. రాజ్యాంగంలో చేర్చి ఉండేవారే కాదు. జమ్మూ–కశ్మీర్ స్వయంప్రతిపత్తికి వీలు కల్పిస్తున్న 370వ అధికరణ రాజ్యాంగంలో చేరడానికి చారిత్రక కారణాలు న్నాయి. కశ్మీర్ ప్రాంతాన్ని దాని పాలకుడు హరిసింగ్ 1947 అక్టోబర్‌లో భారత్‌లో విలీనం చేసినప్పుడు ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఆ అధి కరణ వచ్చింది. దాని ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు మినహా మిగిలిన అంశాల్లో కేంద్ర శాసనాధికారాలకు జమ్మూ–కశ్మీర్లో పరిమితులుం టాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో దేన్నయినా తాత్కాలికంగా వర్తింజేసినా, రాష్ట్ర రాజ్యాంగసభ పరిశీలించి ధ్రువీకరించాకే పూర్తి స్థాయిలో అమలవుతుంది. రాష్ట్రా నికి ఏ ఏ అంశాల్లో అధికారాలుండాలో రాజ్యాంగసభ నిర్ణయిస్తుంది. అలాగే రాజ్యాంగంలోని ఏ అధికరణ అవసరమో కూడా అది నిర్ధారిస్తుంది. అలాగే 370వ అధికరణ ఉనికిలో ఉండటం అవసరమో, కాదో...ఉంచితే దానికి ఎలాంటి సవర ణలు అవసరమో ఆ సభ సిఫార్సు చేయాలి కూడా. కానీ 1951 అక్టోబర్‌లో ఏర్పా టైన రాష్ట్ర రాజ్యాంగ సభ 370వ అధికరణ సంగతి తేల్చకుండానే 1956లో రద్ద యింది. కనుకనే మొదట్లో తాత్కాలికమనుకున్న 370వ అధికరణ రాజ్యాంగంలో శాశ్వతంగా ఉండిపోయింది. జమ్మూ–కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిస్తున్న ఈ అధికరణను రద్దు చేయాలని బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. తమకు సొంతంగా మెజారిటీ లభిస్తే ఆ అధికరణను రద్దు చేస్తామని బీజేపీ ఎన్నడో చెప్పింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ విషయంలో తన అభిప్రాయాన్ని కొంత సవరించుకుంది. అధికరణ రద్దుపై సంబంధిత పక్షాలతో చర్చించి ఒప్పిస్తామని తెలిపింది. అయితే రెండేళ్లక్రితం జమ్మూ–కశ్మీర్లో పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కుదిరిన ఉమ్మడి ఎజెండా మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించింది. ఆ విషయంలో ఇప్పటికీ బీజేపీ వైఖరి మారలేదు. అలాంటపుడు స్వయంప్రతిపత్తి అంశం లేవనెత్తితే ఇంత హడా వుడి దేనికి? అటు కాంగ్రెస్‌దీ ఇదే తంతు. ఈ అంశాన్ని చర్చకు లాగిన చిదంబరం పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో కీలక శాఖలు చూశారు. ఆ సమయంలోనూ జమ్మూ–కశ్మీర్లో ఆందోళనలు చెలరేగాయి. ఉద్రిక్త తలు ఏర్పడ్డాయి. కానీ అప్పట్లో చిదంబరానికి స్వయంప్రతిపత్తి అంశం గుర్తుకు రాలేదు. దాన్ని తమ ప్రభుత్వమే నీరుగారుస్తున్నదని ఆనాడు తెలియలేదు. మన రాజ్యాంగం భారత రిపబ్లిక్‌ను ‘రాష్ట్రాల సమాఖ్య’గా గుర్తించింది. కేంద్రం అధికారాలేమిటో, రాష్ట్రాలకుండే అధికారాలేమిటో, ఇద్దరికీ ఉమ్మడిగా ఉండే అధికా రాలేమిటో నిర్దేశించే మూడు వేర్వేరు జాబితాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్రాలు స్వశక్తితో ఎదగడానికి, అభివృద్ధి సాధించడానికి వాటికి కొన్ని అధికా రాలుండటం అవసరం. ప్రతిదీ న్యూఢిల్లీలో నిర్ణయించి అమలు చేయాలనుకుంటే ఇంత విశాలమైన దేశంలో కుదరని పని. అయితే దురదృష్టమేమంటే రాష్ట్రాల అధికారాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. కాస్త హెచ్చుతగ్గులతో అవి మున్సిపాలిటీల స్థాయికి దిగజారాయి. ఉన్న వనరులేమిటో... సాధించవలసిన లక్ష్యాలేమిటో... తీర్చవలసిన అవసరాలేమిటో... అమలు చేయాల్సిన పథకాలే మిటో నిర్ణయించుకుని అభివృద్ధిలో దూసుకుపోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి దానికీ కేంద్రంవైపు చూడాల్సివస్తోంది. నిధుల కొరతతో సతమతం కావాల్సి వస్తోంది. ఈమధ్యే అమల్లోకొచ్చిన జీఎస్టీ విషయంలో రాష్ట్రాల అభ్యంతరం ప్రధానంగా అదే. ఆదాయం గణనీయంగా పడిపోయిందని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు గగ్గోలు పెడుతున్నారు. 370వ అధికరణ ద్వారా జమ్మూ–కశ్మీర్‌కు సమ కూడిన స్వయంప్రతిపత్తిలోని లొసుగులేమిటో, దానివల్ల దేశానికి కలుగుతున్న నష్ట మేమిటో వివరించడానికి పూనుకుంటే వినడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. అప్పుడు ఆ అధికరణను సమర్ధించేవారు తమ వాదనను వినిపిస్తారు. రాష్ట్రాలకు అసలు ఉంటున్న, ఉండాల్సిన అధికారాలపైనా చర్చ జరుగుతుంది. అందుకు పార్ల మెంటు, రాష్ట్రాల్లోని చట్టసభలతోపాటు అనేక వేదికలున్నాయి. కానీ ఎన్నికలు ముంచుకొచ్చినప్పుడు మాత్రమే వాటిని ప్రస్తావిస్తూ, ప్రజల్లో భావోద్వేగాలు పెంచి ఆనక మౌనంగా ఉండిపోవడం వల్ల ప్రయోజనమేమిటి? నాయకులు ఆలోచించాలి. -
స్వయం ప్రతిపత్తి తిరిగివ్వండి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల మనసులు గెలుచుకోవాలని కేంద్రప్రభుత్వం భావిస్తే, వెంటనే రాష్ట్రానికున్న స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ‘మేం స్వయం ప్రతిపత్తి, భారత్‌లో విలీనం పరిస్థితులపై మాట్లాడితే మమ్మల్ని దేశ ద్రోహులుగా, దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. మా విధేయతకు దక్కిన బహుమతి ఇదేనా? మేం మిమ్మల్ని(భారత్) ప్రేమతో అంగీకరించాం. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోకుండా మా సర్వస్వాన్ని లాగేసుకున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గుర్తుంచుకోండి. మీరు మనసులు గెలుచుకునేంతవరకు జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు మిమ్మల్ని అంగీకరించవు’ అని అన్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇక్కడి జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఫరూక్ మాట్లాడారు. కశ్మీర్లో సైన్యం తనపని తాను చేసుకుపోతుందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై ఫరూక్ తీవ్రంగా స్పందించారు. ‘మమ్మల్ని బలప్రయోగం ద్వారా అణచివేయవచ్చని కేంద్రం భావిస్తోంది.రావత్ గారూ.. నామాట గుర్తుంచుకోండి. మీరు ఎంతమందిని చంపినా, ఎంతమందిని అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచినా, మేం భయపడేది లేదు’ అని అన్నారు. -
ఆర్బీఐ గౌరవానికి ఢోకాలేదు..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి పై వస్తున్న ఆందోళనలపై కేంద్రం స్పందించింది. డీమానిటైజేషన్ తరువాత దేశ అత్యున్నత బ్యాంక్ ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కోల్పోతోందున్న విమర్శలపై స్పందించిన కేంద్రం...బ్యాంకు గౌరవానికి ఢోకాలేదని హామీ ఇచ్చింది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని, స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్ బీఐ ఉద్యోగులు సంఘం చేసిన ఆరోపణలు తప్పని కొట్టిపారేసిన మంత్రిత్వ శాఖ ఆర్బీఐ పూర్తి స్వయం ప్రతిపత్తిని కాపాడుతామని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజా ప్రాముఖ్యత కలిగిన వివిధ విషయాలపై చట్ట ప్రకారం తప్పనిసరి, లేదా ఇప్పటివరకు ఆచరణలో పద్ధతుల్లో ప్రభుత్వం, ఆర్ బీఐ మధ్య సంప్రదింపులు జరిగినట్టు పేర్కొంది. వీటిని స్వయంప్రతిపత్తి ఉల్లంఘన గా తీసుకోకూడదని వివరణ ఇచ్చింది. కాగా నోట్ల రద్దు తరువాత ఆర్ బీఐ వ్యవహారాల్లో కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటోందని పేర్కొంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరమ్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కి ఒక లేఖ రాశారు. కేంద్రం అనవసర జోక్యాన్ని తాము అవమానంగా భావిస్తున్నామని ఘాటుగా విమర్శించారు. కరెన్సీ మేనేజ్మెంట్ పూర్తిగా ఆర్బీఐ పరిధిలోదని.. దీని కోసం ప్రభుత్వం ఆర్థిక శాఖకు చెందిన అధికారిని నియమించడం అనవసర జోక్యమని పేర్కొంది. 1935 నుంచి ఆర్బీఐ కరెన్సీ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోందని, ఈ విషయంలో ఆర్థిక శాఖ జోక్యం శోచనీయమైందని.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులు వెల్లడించారు. అలాగే ఆర్బీఐ పనితీరుపై ముగ్గురు మాజీ గవర్నర్లు మన్మోహన్సింగ్, వైవీ రెడ్డి, బిమల్ జలాన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
కేంద్రానికి నితీశ్ ఘాటు లేఖ
పట్నా: కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘాటు పదాలతో లేఖ రాశారు. నలంద విశ్వవిద్యాలయం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని, దాని నిబంధనల్లో మార్పులు చేయవద్దని అన్నారు. అలా చేయడమంటే వర్సిటీకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని తగ్గించడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. వర్సిటీలోని పాలక కమిటీ విషయంలో తనను సంప్రదించకుండానే మార్పులు చేశారని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుందని పేర్కొంటూ వైస్ ఛాన్సలర్ జార్జ్ యో తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు నితీశ్ లేఖ రాశారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో వర్సిటీ వీసీని కచ్చితంగా సంప్రదించాలని, కానీ అలా జరగలేదని, ఈ చర్య వర్సిటీ స్వతంత్ర ప్రతిపత్తి హోదాను సంకటంలో పడేసే పరిస్థితి అని అందులో ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ నిబంధనల ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోకూడదని, దీని వెనుక ప్రధాని నరేంద్రమోదీ హస్తం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీ గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటివి జరగకుండా చూడాలంటూ నితీశ్ విజ్ఞప్తి చేశారు. -
ఎంఎన్‌జే ఆసుపత్రికి స్వయంప్రతిపత్తి
► నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సర్కార్ నిర్ణయ ► మాసబ్‌ట్యాంక్ సమీపంలో ఐదెకరాల్లో విస్తరణకు పచ్చజెండా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న కేన్సర్ నియంత్రణకుగాను వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక మెహిదీ నవాజ్ జంగ్(ఎంఎన్‌జే) కేన్సర్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచాలని, దానికి పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. నిమ్స్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్ల అది కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్స్‌లాగే ఎంఎన్‌జేను కూడా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. స్వయంప్రతిపత్తి వల్ల ఆసుపత్రి డెరైక్టర్ అధికారాల మేరకు అవసరమైనప్పుడు పోస్టులను భర్తీ చేసుకోవచ్చు. వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పెత్తనం పోతుంది. యూనివర్సిటీలాగా దీన్ని తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది. ఆంకాలజీలో ఎండీ, ఎంఎస్ కోర్సులను ప్రత్యేకంగా నెలకొల్పుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి సొంత కోర్సులకూ రూపకల్పన చేసుకోవచ్చు. కేన్సర్‌పై ప్రత్యేక పరిశోధనాకేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదెకరాల్లో విస్తరణ.. ఎంఎన్‌జే ఆసుపత్రి విస్తరణ కోసం మాసబ్‌ట్యాంక్ పరిధిలోని ఐటీఐ, నర్సింగ్ కాలేజీల కు చెందిన ఐదెకరాల స్థలాన్ని దానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలంలో ప్రత్యేకంగా పది బ్లాక్‌లను నిర్మిస్తారు. అం దులో ఒకటి ప్రత్యేకంగా మహిళలకు కేటాయిస్తారు. కేన్సర్ వైద్య విద్య కోసం మరో బ్లాక్ ఉంటుంది. అత్యాధునిక వైద్య విద్య తరగతి గదులనూ నిర్మిస్తారు. ఎంఎన్‌జేకు రాష్ట్ర బడ్జెట్లో రూ.28 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. స్వయంప్రతిపత్తి వస్తే రూ.50 కోట్ల బడ్జెట్ పెరిగే అవకాశముంది. కేంద్రం నుంచి ప్రతీ ఏడాది రూ.70 కోట్ల మేరకు గ్రాంట్లు విడుదలవుతాయి. పడకల సంఖ్య 250 నుంచి 500 పెంచుకునేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మరోవైపు 100 వైద్య, ఇతర పారామెడికల్ పోస్టులు మం జూరు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ కేన్సర్ కేంద్రంగా, రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు కీలకంగా ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి రోజూ 500 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్షమంది రోగులు ఫాలోఅప్ వైద్యానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వయంప్రతిపత్తి, విస్తరణ వల్ల ఎంఎన్‌జే స్వరూపమే మారిపోతుందని ఆ సంస్థ డెరైక్టర్ డాక్టర్ జయలత ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. -
జీఎస్టీతో శాశ్వత నష్టమే..
న్యూఢిల్లీః గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. 29 డిమాండ్లతో కూడిన మెమోరాండంను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను సైతం ఆమె ప్రధానికి వివరించారు. తమిళనాడుకు తగినంత ఆర్థికసాయాన్ని కూడ అందించాలని ఈ సందర్భంలో ఆమె కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. దేశం కల్పించాలనుకుంటున్న ఏకీకృత పన్ను విధానం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ ప్రభావం భారీ శాశ్వత నష్టాన్ని కలుగజేస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమిళనాడు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు జీఎస్టీ విషయంలో మద్దతు పలుకుతున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్తుండగా, అదే విషయాన్ని జయలలిత ప్రధాని మోదీవద్ద ప్రస్తావించడం ప్రత్యేకతను సంతరించుకుంది.