
‘నీలాగ నాకు పది చేతులు లేవు’ అనే డైలాగ్ ఇక ముందు వినిపించవచ్చు. జపాన్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ టోక్యో’ కు చెందిన ప్రొఫెసర్ మసహకో ఇనామి నేతృత్వంలోని పరిశోధక బృందం ‘జీజై ఆర్మ్స్’ పేరుతో వేరబుల్ రోబో ఆర్మ్స్‌ను తయారు చేసింది. డ్యాన్స్‌లాంటి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ వరకు ఈ రోబో ఆర్మ్స్ ఉపయోగపడతాయి.
‘జీజై’ అంటే జపనీస్‌లో స్వాతంత్య్రం, స్వయంప్రతిపత్తి అని అర్థం. యసునరి అనే రచయిత రాసిన ఒక కథ చదివిన తరువాత ప్రొఫెసర్ మసహకో ఇనామికి ‘వేరబుల్ ఆర్మ్స్’ ఐడియా వచ్చింది. ‘జీజై ఆర్మ్స్’కు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అయింది