independence
-
ఫైటింగేల్ ఆఫ్ ఇండియా..! ఆ ముగ్గురే..
కోకిల పాడుతుందని అంటారు. మరి, కోకిల పాటలు వింటుందా? 1949 మార్చి 1 రాత్రి సరోజినీ నాయుడు తనకు చికిత్స చేస్తున్న నర్సును పిలిచి పాట పాడమని కోరారని అంటారు. ఆ పాటే ఆమెను నిద్రపుచ్చిందట! సరోజినిని గాంధీజీ ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ అన్నారు. సరోజిని ఎప్పుడైనా పాటలు కూడా పాడారేమో! గాంధీజీ అన్నది మాత్రం ఆమె కవిత్వం గురించి! ఆ కవిత్వంలోని భావయుక్తమైన లాలిత్యం ఆయనకు ఉద్యమ పోరాట గానంలా అనిపించి ఉండాలి. అలాగైతే ఆమెను ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు.సరోజినీ నాయుడుకి, ఈ ఏడాదికి ఒక ‘చారిత్రకత’ ఉంది. అలాగే ఈ యేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి, సరోజినీ నాయుడి ఆశయానికి ఒక ‘సారూప్యం’ ఉంది. ఇక నేడైతే (2, మార్చి) సరోజినీ నాయుడు ఈ లోకానికి ‘వీడ్కోలు’ చెప్పిన రోజు. రాజకీయ కార్యకర్తగా, మహిళా హక్కుల ఉద్యమ నేతగా, అంతిమ క్షణాల వరకు జీవితాన్ని ప్రేమించిన మనిషిగా ఆమె నుంచి స్ఫూర్తిగా తీసుకోవలసినవి ఈ మూడు సందర్భాలూ! చారిత్రకత (1925–2025)ఈ ఏడాది డిసెంబర్ 28కి, భారత జాతీయ కాంగ్రెస్‌కు 140 ఏళ్లు నిండుతాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1925లో అధ్యక్షురాలయ్యారు సరోజినీ నాయుడు. స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న భారత జాతీయ కాంగ్రెస్‌కు అప్పటివరకు ఒక భారతీయ మహిళ అధ్యక్షురాలిగా లేరు. తొలి మహిళా అధ్యక్షురాలు అనీబిసెంట్ (1917) అయితే, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఆ తర్వాత నెల్లీ సేన్‌గుప్తా (1933) అధ్యక్షురాలయ్యారు. మొత్తం మీద స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులు అయింది ముగ్గురే మహిళలు.సరోజినీ నాయుడుకు ముందరి ఏడాది 1924లో మహాత్మా గాంధీ జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరి మధ్య వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరి మధ్య ముప్పై ఏళ్ల స్నేహం. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ఇద్దరిదీ దాదాపుగా సమానమైన భాగస్వామ్యం. గాంధీజీని తొలిసారిగా 1914లో లండన్‌లో చూశారు సరోజిని. తనే ఆయన్ని వెదుక్కుంటూ వెళ్లి కలిశారు. ఆయన్ని చూసీ చూడగానే ఆమెకు నవ్వొచ్చింది. ‘‘బక్కపల్చని మనిషి, నున్నటి గుండు. నేల మీద కూర్చొని.. చిదిపిన టమాటా ముక్కలు, ఆలివ్ నూనె కలిపి తింటూ కనిపించారు. ఒక ఉద్యమ నాయకుడు ఇలా వినోదాత్మకంగా కనిపించడంతో పగలబడి నవ్వాను..’’ అని సరోజిని ఆ తర్వాత ఒక చోట రాసుకున్నారు. తనను చూసి ఆమె నవ్వగానే : ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను నవ్వుతూ పలకరించారు గాంధీజీ! అప్పటికే ఈ జాతీయవాద ఉద్యమ యువ నాయకురాలి గురించి ఆయన విని ఉన్నారు. 1917 తర్వాత ఆమె గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు. సారూప్యం (1930 ఉప్పు సత్యాగ్రహం–2025 విమెన్స్ డే థీమ్)ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్.. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ : రైట్స్. ఈక్వాలిటీ. ఎంపవర్ మెంట్ (మహిళలు, బాలికలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత). ఈ థీమ్‌కు, జాతీయవాద ఉద్యమంతో సమాంతరంగా సరోజినీ నాయుడు నడిపిన మహిళా హక్కుల పోరాటానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. సరోజిని కవయిత్రి. స్త్రీవిద్యను ప్రోత్సహించే క్రమంలో ఆమె మంచి వక్తగా కూడా అవతరించారు. ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం.. రెండూ, మహిళా ఉద్యమానికి పదును పెట్టాయి. విద్యతోనే హక్కులు, సమానత్వం, సాధికారత సిద్ధిస్తాయని ఆమె ప్రబోధించారు. మహిళల చురుకైన సహకారం లేకుండా జాతీయవాద ఉద్యమం ముందుకు సాగలేదని ధైర్యంగా గాంధీజీకే చెప్పారు! ఇందుకొక ఉదాహరణ : ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన గాంధీజీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతున్నారు. ఈలోపు సరోజినీ నాయుడు నాయకత్వంలో కొందరు మహిళలు ఆ ఊరేగింపులోకి వచ్చి చేరారు! అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏమిటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న. వీడ్కోలు (2, మార్చి 1949)దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆమె ఉత్తరప్రదేశ్ (నాటి యునైటెడ్ ప్రావిన్సెస్) గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌గా ఉండగానే 1949లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ ముందు రోజు రాత్రి ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. తీవ్రమైన తలనొప్పి. ఉపశమన చికిత్స చేశారు. ఆ కొద్ది సేపటికే కుప్పకూలి పోయారు. మర్నాడు కన్నుమూశారు. మరణానంతరం గోమతి నది ఒడ్డున సరోజిని అంత్యక్రియలు జరిగాయి. ‘‘జీవితం ఒక పాట. పాడండి. జీవితం ఒక ఆట. ఆడండి. జీవితం ఒక సవాలు. ఎదుర్కొండి. జీవితం ఒక కల. నిజం చేసుకోండి. జీవితం ఒక త్యాగం. అర్పించండి. జీవితం ఒక ప్రేమ. ఆస్వాదించండి..’’ అంటారు సరోజిని. అయితే వీటన్నిటికీ కూడా పోరాట పటిమ అవసరం అని కూడా తన కవితల్లో చెబుతారు ఈ ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా. (చదవండి: నెస్ట్..ఆర్కిటెక్చర్లో బెస్ట్..!) -
ఐదున్నర దశాబ్దాల శ్రమ
భారత్‌కు స్వాతంత్య్రం తథ్యమని రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులు తేల్చేశాయి. స్వాతంత్య్ర సమరం మాదిరిగానే రాజ్యాంగ నిర్మాణం కూడా ఒక సుదీర్ఘ ప్రయాణం. అది ఉత్తేజకరమైనది కూడా. స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే రాజ్యాంగ రచన నిర్ణయం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ రచన ఆరంభమయింది.భారత్‌కు రాజ్యాంగం ఇవ్వాలన్న ఆలోచన 1895 నాటి ‘రాజ్యాంగ బిల్లు’లో కనిపిస్తుంది. ఆపై ఐదున్నర దశాబ్దాల తరువాతే భారత్‌కు రాజ్యాంగం అవతరించింది. దేశం గణతంత్ర రాజ్యమైంది. కాబట్టి మన రాజ్యాంగ రచనకు 130 ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. దీనినే ‘స్వరాజ్ బిల్’ అని అంటారు. బ్రిటిష్ ఇండియాలో జాతీయవాదం పదునెక్కుతున్న తరుణంలో ఇలాంటి ప్రయత్నం జరిగింది. ఇంతకీ భారత రాజ్యాంగ బిల్లు 1895 రూపకర్తలు ఎవరో తెలియదు. అనీబిసెంట్ అంచనా ప్రకారం ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాలగంగాధర తిలక్ కావచ్చు. అయితే, బ్రిటిష్ ఇండియా మనకు రాజ్యాంగం ఇవ్వలేదు. స్వతంత్ర భారతంలోనే అది సాధ్యమైంది. అనీబిసెంట్ 1925లో, సైమన్ కమిషన్ 1928లో వచ్చి వెళ్లిన తరువాత మోతీలాల్, జవహర్లాల్, తేజ్‌బహదూర్ సప్రూ సంఘం రాజ్యాంగం అందించేందుకు (నెహ్రూ నివేదిక) ప్రయత్నించింది.1919 భారత ప్రభుత్వ చట్టం ఫలితాలను పరిశీలించి, రాజ్యాంగ సంస్కరణలను తీసుకురావడానికి నియమించినదే సైమన్ కమిషన్ (1928). ఇది భారతీయులను దారుణంగా పరిహాసం చేసింది. భారతదేశ రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేయడానికి ఏడుగురు సభ్యులను ఇంగ్లండ్ నియమించింది. ఇందులో ఒక్క భారతీయుడు లేరు. ఫలితమే ‘సైమన్ ! గో బ్యాక్’ ఉద్యమం. తరువాత బ్రిటిష్ ప్రభుత్వ సవాలు మేరకు మోతీలాల్ నాయకత్వంలో అధినివేశ ప్రతిపత్తిని కోరుతూ (కామన్వెల్త్లో ఉంటూనే కొంత స్వయం అధికారం ఉండడం), రాజ్యాంగాన్ని కోరుతూ ఒక వినతిపత్రం తయారు చేశారు. 1909, 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు రాజ్యాంగ నిర్మాణానికి సోపానాలుగా ఉపకరించాయి. 1895 రాజ్యాంగ బిల్లు తరువాత దాదాపు నలభయ్యేళ్లకు 1934లో ఎం.ఎన్ . రాయ్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఈ ఆలోచనను 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించినా, ఆరేళ్ల తరువాతే అది కార్యరూపం దాల్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే ఈ పరిణామం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగ రచనకు ప్రయత్నం ఆరంభమయింది. ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌లో ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. మొదట 389 మంది సభ్యులు పరిషత్‌లో ఉన్నారు. అఖండ భారత్ పరిధితో జరిగే రాజ్యాంగ రచనను ముస్లింలకు ప్రత్యేక దేశం కోరుకున్న ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ఆ సంస్థ సభ్యులు పరిషత్‌ను బహిష్కరించారు. తరువాత దేశ విభజన జరిగింది. ఫలితంగా పరిషత్ సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. వీరిలో 229 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. 70 మంది స్వదేశీ సంస్థానాలు నియమించిన వారు ఉన్నారు. మొదట పరిషత్ తాత్కాలిక చైర్మన్ గా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తరువాత డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా హరీంద్రకుమార్ ముఖర్జీ, ముసాయిదా సంఘం అధ్యక్షుడిగా డా. బి.ఆర్. అంబేడ్కర్, రాజ్యాంగ వ్యవహారాల సలహాదారుగా బెనెగళ్ నరసింగరావు ఎన్నికయ్యారు.1946 డిసెంబర్ 9న పరిషత్ మొదటి సమావేశం జరిగింది. రెండేళ్ల పదకొండు నెలల పదిహేడు రోజులు పరిషత్ పని చేసింది. మొత్తం సమావేశాలు 11. ఇందుకైన ఖర్చు రూ. 64 లక్షలు. 22 అధ్యాయాలతో, 395 అధికరణలతో రాజ్యాంగం ఆవిర్భవించింది. 1950 జనవరి 24న ‘జనగణ మన’ను జాతీయ గీతంగా స్వీకరించారు. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం వెనుక అక్షరాలా ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉంది.1946 డిసెంబర్ 13న పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు లాంఛనంగా ఉపక్రమించింది. పరిషత్ లక్ష్యాలను నిర్దేశించే తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. రాజ్యాంగం ప్రధాన ధ్యేయం భారత్‌ను సర్వసత్తాక స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించడం. 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మొదటి సమావేశం తరువాత రాజ్యాంగంలో ఏయే అంశాలు ఉండాలో పరిశీలించడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక హక్కులు, మైనారిటీల వ్యవహారాల సలహా సంఘం, కేంద్ర అధికారాల నిర్ణాయక సంఘం వంటివి! అవన్నీ వాటి నివేదికలను 1947 ఏప్రిల్, ఆగస్ట్ నెలల మధ్య సమర్పించాయి. అన్ని అంశాల మీద 1947 ఆగస్ట్ 30న చర్చ ముగిసింది. ఈ సంఘాలు ఇచ్చిన నివేదికలు, వాటిపై జరిగిన చర్చల సారాంశం అధారంగా రాజ్యాంగ పరిషత్ సలహాదారు బి.ఎన్ .రావ్ ఒక ముసాయిదాను తయారు చేశారు. 1947 అక్టోబర్‌లో ఈ పని పూర్తి చేసి, రాజ్యాంగ ముసాయిదా సంఘానికి సమర్పించారు. దీనిపై ముసాయిదా సంఘం నెలల తరబడి చర్చించి, తుది ముసాయిదాను రూపొందించి, 1948 ఫిబ్రవరి 21 నాటికి రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌కు సమర్పించింది.తరువాత తుది ముసాయిదాను అచ్చు వేయించి ప్రజలకు, మేధావులకు అందుబాటులో ఉంచారు. చాలా వ్యాఖ్యలు, విమర్శలు, సలహాలు, సూచనలు వచ్చాయి. వీటన్నింటినీ కేంద్ర, ప్రాంత రాజ్యాంగ కమిటీలు పరిశీలించాయి. వీటి మీద 1948 అక్టోబర్ 23, 24, 27 తేదీలలో పరిషత్ చర్చలు జరిపింది. తరువాత 1948 అక్టోబర్ 26న ముసాయిదాను మరోసారి ముద్రించారు. ముసాయిదా మీద రెండోసారి కూడా 1949 అక్టోబర్ 17 వరకు చర్చ జరిగింది. ఈ దశలోనే రాజ్యాంగ సవరణకు చాలా సూచనలు వచ్చాయి. కానీ వాటిలో ఎక్కువ సవరణలను పరిషత్ తిరస్కరించింది. స్వీకరించిన కొన్ని సూచనలు, సవరణల కోసం మళ్లీ చర్చలు జరిపారు. సవరించిన కొత్త రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 3న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి అందించారు. అంతిమంగా 1949 నవంబర్ 14న రాజ్యాంగ పరిషత్ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. తరువాత 1949 నవంబర్ 26న మూడోసారి కూడా చదవడం, చర్చించడం పూర్తి చేశారు. అంతకు ముందే రాజ్యాంగ ఆమోదం కోసం డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పరిషత్ ఆమోదించింది. ఆమోదం పొందిన రాజ్యాంగం మీద 1950 జనవరి 24న సభ్యులంతా సంతకాలు చేశారు. రెండు రోజుల తరువాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.అయితే, భారత రాజ్యాంగం సుదీర్ఘం, న్యాయవాదుల స్వర్గం అంటూ ప్రతికూల వ్యాఖ్య వచ్చింది. ఆ వ్యాఖ్య చేసినవాడు ఐవర్ జెన్నింగ్స్. ఏడుగురు సభ్యులతో 1947 ఆగస్ట్ 29న ముసాయిదా సంఘాన్ని ఎన్నుకున్నారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. కానీ సంఘం అధ్యక్షునిగా నెహ్రూ జెన్నింగ్స్‌ను ప్రతిపాదించారు. చివరికి గాంధీజీ అభిప్రాయం మేరకు అంబేడ్కర్ చైర్మన్ అయ్యారు. ఒకటి వాస్తవం. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత్ ఐక్యంగా పురోగమించడానికి అంతస్సూత్రంగా పనిచేస్తున్నది భారత రాజ్యాంగమే!-డాక్టర్ గోపరాజు నారాయణరావు -
పింక్ బెల్ట్ గురించి తెలుసా? మీకుందా? కరాటేలో కాదు!
కరాటేలో పింక్ బెల్ట్ లేదు. కాని నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క అమ్మాయి, మహిళపింక్ బెల్ట్ కలిగి ఉండాలని అంటుంది అపర్ణ రజావత్.ఆగ్రాతో మొదలుపెట్టి దేశంలో లక్షలాది మందికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్న ఈ మార్షల్ ఆర్టిస్ట్ అమెరికన్ డాక్యుమెంటరీ మేకర్ జాన్మెక్రిటెను ఆమెపై డాక్యుమెంటరీ చేసేలా స్ఫూర్తినిచ్చింది.‘పింక్ బెల్ట్’ ఇప్పుడు వివిధ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందుతోంది. మీకుందా పింక్ బెల్ట్?కరాటేలో పింక్ బెల్ట్ లేదు. వైట్, ఆరంజ్, బ్లూ, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లాక్ బెల్ట్‌లు ఉంటాయి. తర్వాతి రోజుల్లో కొన్ని కరాటే స్కూల్స్‌లో పింక్ బెల్ట్‌ను కూడా మొదలు పెట్టారు. ఇది వైట్ నుంచి ఎల్లో మధ్య స్థాయిలో ఉంటుంది. ‘ఏ స్థాయిలోదైనా ప్రతి స్త్రీకి ఆత్మరక్షణ విద్య తెలిసి ఉండాలి’ అంటుంది అపర్ణ రజావత్. ‘మన దేశంలో అబ్బాయిలు అమ్మాయిలు సమానం కాదని చిన్నప్పటి నుంచి మెదడులో వేస్తారు. ఇప్పటికీ కూడా ‘బేటీ బచావో బేటీ పఢావో’ అంటున్నాం. ఎవరైనా కాపాడే వస్తువా స్త్రీ అంటే? ఇది కాదు నేర్పాల్సింది... కొడుకుకు సంస్కారం నేర్పండి... నేర్వకపోతే దండించండి... ఇది కదా నేర్పాలి’ అని ప్రశ్నిస్తుందామె.అన్నయ్యల మీద తిరగబడి...అపర్ణ అవడానికి రాజస్థాన్ క్షత్రియ పుత్రిక అయినా తండ్రి ఉద్యోగరీత్యా ఆగ్రాలో పెరిగింది. నలుగురు అక్కచెల్లెళ్లు, ఇద్దరు అన్నయ్యలు. చిన్నప్పటి నుంచి తల ఒంచుకుని ఉండటం అపర్ణకు ఇష్టం లేదు. ఎదురు చెప్పేది. దాంతో అన్నయ్యలు ఆమెను దారిలో పెట్టాలని తరచూ గద్దించేవారు. అప్పుడు అపర్ణకు ఈ అన్నయ్యలను ఎదిరించాలంటే నేను ఏదో ఒక యుద్ధవిద్య నేర్వాలి అనుకుంది. అలా ఎనిమిది పదేళ్ల వయసులోనే కరాటేలో చేరింది. రాజ్‌పుత్‌ల ఇళ్లల్లో ఆడపిల్లల్ని అలా కరాటే నేర్పించడానికి పంపడం మర్యాద తక్కువ. అందుకని డ్రాయింగ్ క్లాస్‌కు వెళుతున్నానని చెప్పి వెళ్లేది. తల్లి ఇందుకు సహకరించింది. అలా నేర్చుకున్న కరాటేతో 12వ ఏట తన కంటే సీనియర్ బెల్ట్ ఉన్న అమ్మాయిని ఓడించడంతో పేపర్లో వార్త వచ్చింది. దాంతో ఇంట్లో తెలిసి గగ్గోలు రేగింది. ఆ తర్వాత తండ్రి ఆమె సామర్థ్యాన్ని గ్రహించి కరాటేలో ప్రోత్సహించాడు. ‘కరాటేలో తొలి ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చిన భారతీయ మహిళను నేనే’ అంటుంది అపర్ణ.నిర్భయ ఘటన తర్వాత...చదువుకున్నాక అమెరికాలో ఉంటూ ట్రావెల్ ఏజెంట్‌గా పని చేస్తున్న అపర్ణను 2012లో నిర్భయ ఘటన కలచి వేసింది. ఆ సమయంలో అమెరికాలో ఆమె సహోద్యోగులు ‘మీ ఇండియాలో ఇలాగే ఉంటుందా?’ అని అడగడం మరీ అన్యాయంగా అనిపించింది. ‘నా వంతుగా ఏం చేయగలను’ అనుకున్నప్పుడు ఆమెకు తట్టిన సమాధానం స్వీయ రక్షణలో వీలైనంతమందికి శిక్షణ ఇవ్వడం. ఆ ఆలోచనతోనే 2016లో ఇండియా వచ్చి ఆగ్రాలో ‘పింక్‌బెల్ట్ మిషన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం రెండుమూడు రోజుల వర్క్‌షాప్‌ల ద్వారా స్త్రీలకు కనీస ప్రతిఘటన విద్యలు నేర్పి పింక్ బెల్ట్‌ను బహూకరించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెంచడమే పింక్‌బెల్ట్ మిషన్ లక్ష్యం.ఆత్మరక్షణ ఈ స్త్రీలకు అక్కర్లేదా?‘ఆత్మరక్షణ గురించి స్త్రీలకు చాలా అ΄ోహలు ఉన్నాయి. ఆ అ΄ోహలను తీర్చాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ.అపోహ: వయసు నలభై దాటేసింది. బలహీన పడి΄ోయాను. కరాటే నేర్చుకోవాలా?వాస్తవం: కరాటే ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు. తాయ్చిలాంటి విద్యనైతే 80 ఏళ్ల తర్వాత కూడా నేర్చుకోవచ్చు.అపోహ: నేను ఇంటి బయటకే వెళ్లను. నాకు ఆత్మరక్షణ విద్య ఎందుకు?వాస్తవం: స్త్రీలపై దాడులు జరిగేది ఇళ్లలోనే. అదీ అయినవాళ్ల చేతుల్లోనే. ఇంట్లో ఉన్నత మాత్రాన రక్షణ ఉన్నట్టు కాదు.అపోహ: నేను మంచి ఆఫీస్‌లో పని చేస్తాను. నా కొలిగ్స్ మర్యాదస్తులు.వాస్తవం: మీరు ఎక్కడ పని చేసినా మీకు ప్రమాదం ΄÷ంచే ఉంటుంది. ΄ార్కింగ్ ఏరియాలో మీ మీద దాడి జరిగితే?అపోహ: నేను రెచ్చగొట్టే దుస్తులు వేసుకోను. నా జోలికి ఎవరూ రారు.వాస్తవం మీరు ఎలాంటి దుస్తులు ధరించినా దాడి జరిగే అవకాశం ఉంది. అత్యాచారం లైంగిక చర్య మాత్రమే కాదు... ఆధిపత్య నిరూపణ కోసం చేసే చర్య కూడా.అపోహ: ఆడవాళ్లు ఎంత నేర్చినా మగవారితో సమానం అవుతారా?వాస్తవం ఆత్మరక్షణ విద్య నేర్చుకునేది మగవారి బలంతో సమానం అని చెప్పడానికి కాదు. ప్రమాదం జరిగినప్పుడు మెదడు మొద్దుబారి లొంగి΄ోకుండా ఫైట్‌బ్యాక్ చేసే సన్నద్ధత కోసం.ఆ లక్ష్యంతో ఇప్పటికి అపర్ణ ఇండియాలోని నాలుగైదు రాష్ట్రాల్లో ఇప్పటికి 2 లక్షల మంది అమ్మాయిలు, మహిళలకు వర్క్‌షాప్‌ల ద్వారా ఆత్మరక్షణ నేర్పింది. దీని కోసం ఫుల్‌టైమ్ మాస్టర్స్‌ను తీర్చిదిద్దింది. అమెరికాలోని భారతీయుల కోసం కూడా ఈ శిక్షణ కొనసాగిస్తోంది.డాక్యుమెంటరీ నిర్మాణంఅపర్ణ రజావత్ కృషి గురించి దేశ విదేశాల పత్రికలు రాశాయి. అలా ఆమె కథ హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు మెక్క్రయిట్ ఆమెను పిలిచి ఏకంగా సినిమాయే తీస్తానని చె΄్పాడు. కాని వాస్తవిక స్ఫూర్తి అందరికీ అందాలంటే డాక్యుమెంటరీ చాలని కోరింది అపర్ణ. అలా ‘పింక్ బెల్ట్’ పేరుతో 79 నిమిషాల డాక్యుమెంటరీ తయారయ్యి ప్రస్తుతం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతోంది. షికాగో, న్యూబరీ పోర్ట్, జైపూర్ ఫెస్టివల్స్‌లో పింక్ బెల్ట్ హర్షధ్వానాలు అందుకుంది. యూట్యూబ్‌లో దీని ట్రైలర్ తాజాగా విడుదలైంది. -
పంద్రాగస్టు: తెలుసుకోవలసిన 10 విషయాలు
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తిక అంశాలు..1. స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోఖాలీలో ఉన్నారు. అక్కడ హిందువులు- ముస్లింల మధ్య నెలకొన్న మతపరమైన హింసను నియంత్రించేందుకు నిరాహార దీక్ష చేపట్టారు.2. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని తెలియగానే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లు మహాత్మా గాంధీకి ఒక లేఖ పంపారు. ఆ లేఖలో ‘ఆగస్టు 15వ తేదీ మన దేశ తొలి స్వాతంత్య్ర దినోత్సవం. జాతిపితగా ఉత్సవాల్లో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి’ అని రాశారు.3. అయితే దీనికి సమాధానంగా గాంధీజీ ‘కలకత్తాలో హిందువులు- ముస్లిములు పరస్పరం ఘర్షణ పడుతున్నప్పుడు నేను సంబరాలు చేసుకోవడానికి ఎలా వస్తాను? ఈ అల్లర్లను అదుపు చేయడానికి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను’ అంటూ ఒక లేఖ ద్వారా సమాధానం పంపారు.4. ఆగస్ట్ 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాడ్జ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుండి జవహర్లాల్ నెహ్రూ ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అనే చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అప్పటికి నెహ్రూ ప్రధాని కాలేదు. ప్రపంచం మొత్తం ఈ ప్రసంగాన్ని విన్నది.5. ఆగస్ట్ 15, 1947న లార్డ్ మౌంట్ బాటన్ తన కార్యాలయంలో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ తన మంత్రివర్గం జాబితాను అతనికి అందించారు. తరువాత ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ గార్డెన్లో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.6. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారత ప్రధాని ఎర్రకోట నుండి జెండాను ఎగురవేస్తారు. కానీ ఇది ఆగస్ట్ 15, 1947 న జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ పరిశోధనా పత్రంలోని వివరాల ప్రకారం నెహ్రూ 1947 ఆగస్టు 16న ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు.7. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రెస్ సెక్రటరీ క్యాంప్‌బెల్ జాన్సన్ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోయిన రెండవ వార్షికోత్సవం ఆగస్టు 15న జరగబోతోంది. ఆ రోజున భారతదేశానికి విముక్తి కల్పించడానికి బ్రిటీషర్లు నిర్ణయం తీసుకున్నారు.8. భారతదేశం- పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ 1947, ఆగస్టు 15 నాటికి నిర్ణయం కాలేదు. ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్ ప్రకటన ద్వారా దీనిని నిర్ణయించారు.9. భారతదేశం 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం పొందింది. కానీ జాతీయ గీతం రూపొందలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే ‘జన గణ మన’ రాశారు. ఈ జాతీయ గీతానికి 1950లో రూపకల్పన జరిగింది.10. ఆగస్టు 15న మరో మూడు దేశాలకు కూడా స్వాతంత్య్రం లభించింది. దక్షిణ కొరియాకు 1945 ఆగష్టు 15న జపాన్ నుండి స్వాతంత్య్రం లభించింది. బహ్రెయిన్ 1971 ఆగష్టు 15న బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 1960, ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందింది. -
10 వేల మందికి క్షమాభిక్ష!
బ్యాంకాక్: మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 వేల మందికి క్షమాభిక్ష ప్రకటించింది. జైళ్ల నుంచి విడుదలయ్యే వారిలో సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ ఖైదీలున్నదీ లేనిదీ వెల్లడి కాలేదు. 9,652 మంది ఖైదీలను క్షమాభిక్ష ద్వారా విడుదల చేస్తామంటూ దేశ మిలటరీ కౌన్సిల్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హెలయింగ్ తెలిపినట్లు ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అయితే, పదవీచ్యుత నేత అంగ్ సాన్ సుకీ(78) పేరు ఈ జాబితాలో ఉన్న సూచనల్లేవని పరిశీలకులు అంటున్నారు. ఆమ్నెస్టీ పొందిన వారిలో 114 మంది విదేశీయులు సైతం ఉన్నారు. ఖైదీల విడుదల గురువారం మొదలై కొన్ని రోజులపాటు సాగుతుందని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆర్మీ 25 వేల మందికి పైగా నిర్బంధించినట్లు చెబుతున్నారు. ఇవి చదవండి: వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు -
Justice Sanjay Kishan Kaul: సహనశీలత తగ్గుతోంది
న్యూఢిల్లీ: ఎదుటి వారి అభిప్రాయాల పట్ల ప్రజలు సహనం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో నేడు సహనశీలత స్థాయిలు తగ్గుతూండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ధైర్యం కలిగి ఉండటం చాలా కీలకమైన అంశమన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడే బాధ్యత బార్ అసోసియేషన్‌దేనని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్ల 10 నెలలపాటు బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ ఎస్కే కౌల్ ఈ నెల 25న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టుకు ఈ నెల 18 నుంచి వచ్చే జనవరి 2వ తేదీ వరకు శీతాకాల సెలవులు. దీంతో, శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో సమావేశమైన వీడ్కోలు ధర్మాసనంలో జస్టిస్ కౌల్ మాట్లాడారు. ‘సర్వోన్నత న్యాయస్థానం నిర్భయంగా న్యాయాన్ని అందించిన న్యాయ దేవాలయం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలి’అని ఆయన ఆకాంక్షించారు. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్.. జస్టిస్ కౌల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘70ల్లో నేనూ జస్టిస్ కౌల్ కలిసి కాలేజీకి వెళ్లాం. పుట్టస్వామి గోపత్యా హక్కు కేసు, వైవాహిక సమానత్వ కేసు, తాజాగా ఆరి్టకల్ 370 కేసు..ఇలా పలు కేసుల్లో ఇరువురం కలిసి ఇదే వేదికపై నుంచి తీర్పులు వెలువరించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కేనంటూ తీర్పు వెలువరించిన తొమ్మిదిమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ కౌల్ కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దును సమరి్థస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఉన్నారు. 1958లో జని్మంచిన కౌల్ 1982లో ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. 1999లో సీనియర్ న్యాయవాది గుర్తింపు పొందారు. 2001లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జీగా, 2003లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. 2013లో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2014లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. -
ఆ నలుగురు..నాటి హైదరాబాద్ సంస్థానంలో కీలకం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్..భారతదేశంలోనే అతిపెద్ద సంస్థానం. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషల సమ్మేళనంతో ఓ వెలుగు వెలిగింది. 1724లో నిజాం ఉల్‌ముల్క్ స్వతంత్రుడిగా ప్రకటించుకొని నిజాంపాలనకు శ్రీకారం చుట్టగా, 1948 వరకూ ఆయన వారసులు పరిపాలించారు. అయితే 1947 తర్వాత హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచాలని నిజాం ఆర్మీ ఛీప్ ఇద్రూస్, పాకిస్తాన్లో కలపాలని నిజాం పెంచి పోషించిన రజాకార్ల చీఫ్ ఖాసీం రజ్వీ చూస్తే...సంస్థానంలో రైతుకూలీ రాజ్యం కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి పావులు కదిపారు. చేయి దాటిపోయే పరిస్థితి రావడంతో భారత సైన్యాలు జనరల్ జయంత్‌నాథ్ చౌదరి ఆధ్వర్యంలో అపరేషన్ పోలోతో 1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశాయి. నిజాం ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఇద్రూస్, ఖాసీం రజ్వీలు, పడగొట్టేందుకు జయంత్‌నాథ్, నారాయణరెడ్డి ఆధ్వర్యంలోని సేనలు కారణమయ్యాయి. ఆపరేషన్.. హైదరాబాద్ భారతదేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్యం వస్తే ..హైదరాబాద్ సంస్థానం నిజాం రజకార్ల ఆగడాలతో అట్టుడికిపోయింది. నిజాం రాజు ఉస్మాన్ తాను స్వతంత్ర దేశంగానే ఉండాలని కోరుకోగా, అది కుదరకపోతే పాకిస్తాన్‌తో విలీనం కోసం చేస్తున్న ఎత్తుగడలను భారత ప్రభుత్వం పసిగట్టి 1948, సెప్టెంబర్ 13న మిలటరీ ఆపరేషన్‌ను మొదలుపెట్టి కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసింది. 16వ తేదీ నాటికి వాస్తవ పరిస్థితి నిజాంకు అర్థమైంది. 2,727 మంది రజాకార్లను భారత సైన్యాలు హతమార్చగా, మరో 4వేల మందిని బంధీలుగా పట్టుకున్నాయి. పరిస్థితిని గమనించిన నిజాం చీఫ్ ఇద్రూస్ లొంగిపోవాలని చేసిన సూచన మేరకు ఆ రోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ రేడియో స్టేషన్‌కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరుసటి రోజు అంటే..సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశం మేరకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సెతం దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. రైతాంగ సేనాని.. రావి ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక సిరాతో లిఖించిన రైతుకూలీల పోరాటాన్ని ముందుకు నడిపిన సేనాని రావి నారాయణరెడ్డి. రజాకార్లు, నిజాం సామంతులైన దేశ్‌ముఖ్‌ల ఆగడాలను ఎదుర్కొ నేందుకు సాయుధ పోరాటానికి ఝంగ్ సైరన్ ఊదారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మెజారి టీ ప్రాంతాల్లో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడి సమాంతర పాలన సాగించారు. ఒక దశంలో కమ్యూనిస్టులు సంస్థానమంతా విస్తరిస్తారన్న వార్తల నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అమలు చేసింది. రైతాంగ పోరాటమే లేకపోతే హైదరాబాద్ సంస్థానం భారతదేశ గుండెల మీద కుంపటిలా తయారయ్యేది. కశ్మీర్‌లా నిత్యం రావణకాష్టం రగిలించేది..సాయుధ పోరాటం దేశ స్వతంత్ర, సమైక్యతకు కారణమైందని రావి తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆపరేషన్ పోలో.. జయంత్‌నాథ్ ‘తక్కువ రక్తపాతంతో మన విజయయాత్ర ముందుకు వెళ్లాలి. శత్రువు వ్యూహం మేరకు మన ప్రతివ్యూహం ఉండాలి. మనం చేస్తున్న ఆపరేషన్ భూభాగంతోపాటు మనుషుల్ని కలిపేదిగా ఉండాలి’ అంటూ తన సైన్యాలకు దిశా నిర్దేశనం చేసిన ఆపరేషన్ పోలో చీఫ్ జయంత్‌నాథ్ చౌదరి ఆధ్వర్యంలో జాతీయ పతాకం తొలిసారిగా ఇక్కడ రెపరెపలాడింది. జయంత్ 1928లో సైన్యంలో చేరి 1966లో ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఉద్యోగ విరమణ చేశారు. హైదరాబాద్ సంస్థానంపై ఐదురోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేసిన జయంత్ హైదరాబాద్ స్టేట్‌కు తొలి మిలటరీ గవర్నర్‌గా కూడా పనిచేశారు. బెంగాల్లో పుట్టిన జయంత్, కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన డబ్ల్యూసీ బెనర్జీ మనువడే. చౌదరి అత్యున్నత సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. పాకిస్తాన్ కోసం.. రజ్వీ ఖాసీం రజ్వీ..పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్ లోని లక్నో. లా చదివి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. తన సమీప బంధువు నిజాం ఆర్మీలో ఉండటంతో అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. 1944లో ఇతెహైదూల్ ముస్లిమీన్ వ్యవస్థాపకుడు బహుదూర్‌యార్ ఝంగ్ మరణంతో ఆ సంస్థ బాధ్యతలు తీసు కొని తన ఆస్తులన్నీ సంస్థ పేరుతో రాసిచ్చాడు. నిజాం రాజును దైవాంశ సంభూతుడిగా అభివర్ణిస్తూ సిద్ధిఖీ యే దక్కన్‌గా రెచ్చిపోయి రజాకార్ల సంస్థ ఏర్పాటు చేసి నిజాం రాజ్యంలో రక్తపుటేరులు పారించారు. 1948 సెప్టెంబర్ 17న అరెస్ట్ అయ్యి 1957 వరకు జైలు జీవితం గడిìపాడు. విడుదల చేస్తే తాను పాకిస్తాన్లో తలదాచుకుంటానన్న షరతుతో కరాచీ వెళ్లిపోయాడు. 1970 జనవరి 15న చని పోయాడు. రజ్వీ వారసులు ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. స్వతంత్ర రాజ్యం కోసం.. ఇద్రూస్ ఇండియా ఆర్మీ చీఫ్‌గా కూడా పనిచేసే సామ ర్థ్యం ఉందంటూ బ్రిటి ష్ వైస్రాయ్ లార్డ్ వేవెల్ హైదరాబాద్ స్టేట్ ఫోర్స్ చీఫ్ సయ్యద్ అహ్మద్ ఈఎల్ ఇద్రూస్‌ను ప్రశంసించాడు. నిజమే మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు నమ్మిన బంటుగా హైదరాబాద్ స్టేట్ ఫోర్స్‌కు సుదీర్ఘకాలం కమాండర్ ఇన్ చీఫ్‌గా పనిచేశాడు. ఇద్రూస్ పూర్వీకులు యెమన్ నుంచి వచ్చి నిజాం సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇద్రూస్1913లో హైదరా బాద్ స్టేట్ ఆర్మీలో చేరి 1948 వరకు కొనసా గారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో బ్రిటిష్ మిత్రదేశాలకు మద్దతుగా హైదరాబాద్ లాన్సర్స్ తరఫున పాలస్తీనాతో పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. భారత్‌కు స్వాతంత్య్రం రాగానే, హైదరాబాద్ స్టేట్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే లక్ష్యంతో యూరప్ వెళ్లి అత్యాధునిక ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసే యత్నం చేసి విఫలమయ్యాడు. ఆపరేషన్ పోలో చీఫ్ జేఎన్.చౌదరి సమక్షంలో లొంగిపోయే కొన్ని క్షణాల ముందు ‘‘ ఇది జీవితంలో ఒక ఆట, మేం చేయాల్సింది అంతా చేశాం’’ అంటూ అంతర్జాతీయ జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ తమ లొంగుబాటు ప్రకటించారు. అయితే నిజాం ప్రధానమంత్రి లాయక్ అలీని గృహ నిర్బంధం నుంచి తప్పించిన కేసులో ఇద్రూస్ అరెస్ట్ అయ్యి విడుదలయ్యారు. కుటుంబసభ్యులంతా పాకిస్తాన్లో స్థిరపడగా, ఇద్రూస్ మాత్రం బెంగళూరులో చిన్నగదిలో చివరి రోజులు గడిపాడు. అనారోగ్య సమస్యలతో 1962లో చనిపోయారు. -
గాంధీ మార్గంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణంగా, గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని.. ఆ ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉందని మహాత్మా గాంధీ పదే పదే చెప్పేవారని.. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ౖగ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా.. వ్యవసాయం మొదలుకొని, పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధి దాకా.. గిరిజనులు, దళితులు, మైనారిటీల నుంచి అగ్రవర్ణ పేదలదాకా అందరికీ, అన్ని అంశాలకు సమప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అందుకే ఈ రోజు తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. గత ఏడాది ఆగస్టు 8న ప్రారంభించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ముగింపునిచ్చింది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేది. టీఆర్ఎస్ను స్థాపించినపుడు అహింసాయుతంగా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను స్పష్టంగా ప్రకటించాను. ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాను.ఆ నేపథ్యంలోంచి వచ్చినదే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన. స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందన్న ప్రబుద్ధుల్లాంటి కొందరు తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారు. వారంతా తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చిత్రమేమిటంటే.. అలా అన్న వాళ్లే ఈరోజు మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటైన ఈ పదేళ్లలోనే అద్భుత పురోగతి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశానికే దిక్సూచి అనే స్థాయికి ఎదిగింది. స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణంగా.. స్వాతంత్య్ర సమర యోధుల ఆశయాల వెలుగులోనే అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలకు వేదికగా నిలుస్తున్నది. ౖగాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది.ఈ అభివృద్ధి నమూనాను ఇదేవిధంగా కొనసాగిస్తూ, సకల జనులకూ ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్య్రోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నిజం చేద్దాం. జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగంలో నిలుపుదాం..’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సమర యోధుల ఆశయాలనుచాటేలా..: సీఎస్ శాంతికుమారి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్త యిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు వజ్రోత్సవాలను నిర్వహించిందని సీఎస్ శాంతికుమారి చెప్పారు. సమరయోధుల ఆశయాలను ప్రస్తుత తరానికి చాటì చెప్పేలా విభిన్న కార్యక్రమాలు నిర్వహించామని.. రాష్ట్రవ్యాప్తంగా సినిమా ధియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించామని, దాదాపు 30 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు ప్రధాన లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచాయని అమె అన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాఘవాచారి బ్రదర్స్ నిర్వహించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ గానంతో సంగీత విభావరి ప్రారంభమైంది. ‘ఇదిగో భద్రాద్రి.. అదిగో చూడండి’ ఆలాపనతోపాటు ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలూ’ అంటూ సాగిన త్యాగరాజ కీర్తన ఆకట్టుకున్నాయి. సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘భారతీయ భావన’ నాట్య రూపకంలో.. కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టం, ఒడిస్సీతోపాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన అలరించింది. ఆయాచితం నటేశ్వర శర్మ రాసిన ‘తెలంగాణ అవతరణం తొలిపొద్దు నవకిరణం.. భరత మాత ఆభరణం’ అంటూ సాగిన నృత్య ప్రదర్శన రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక్కో ప్రభుత్వ కార్యక్రమాన్ని వర్ణిస్తూ సాగింది. అనంతరం ‘సింఫనీ ఆఫ్ ఫ్రీడం’ పేరిట పలు వాయిద్యాలతో సాగిన జూగల్బందీ.. తర్వాత మంజుల రామస్వామి బృందం ప్రదర్శించిన ‘వజ్రోత్సవ హారతి’ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన సీఎం కేసీఆర్.. చాలా బాగున్నాయంటూ కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను శుక్రవారం హెచ్ఐసీసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరై.. జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గాంధీ సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. గాంధీ సూచనలతో భారత రాజ్యాంగం రూపకల్పన జరిగిందని తెలిపారు. గాంధీ మతోన్మాద శక్తుల చేతిలో దుర్మరణం చెందడం ఎంతో బాధాకరమని సీఎం అన్నారు. ఆయన మార్గంలోనే తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని తెలిపారు. అహింసా మార్గంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని చెప్పారు. తెలంగాణకు సహకరించని వాళ్ళు నేడు తెలంగాణ ఉద్యమ పాఠాలు చెప్తున్నారని విమర్శించారు. చదవండి: బీఆర్ఎస్లో రసవత్తర రాజకీయం.. కందులకు కవిత అభయహస్తం! -
ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకల్లేవ్!
దేశం మొత్తం(ఆ రాష్ట్రం మినహాయించి) అంగరంగ వైభవంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. కానీ, పరిస్థితులు ఆ రాష్ట్రాన్ని జెండా పండుగకు దూరంగా ఉంచేశాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని కుంభవృష్టితో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సైతం మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రమాద ఘటనల్లో 55 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై తన ప్రసంగంలో ఈ అంశాన్ని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. ఊహించని స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని చెప్పారు. బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విపత్తు నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు. Visual of Pandoh Himachal Pradesh right now pic.twitter.com/KQ2Tn9sz9B — Go Himachal (@GoHimachal_) August 14, 2023 రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు జరిగాయని సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలాన్, సిమ్లా, మండి, హమిర్పూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన విపత్తు నిర్వహణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంఢీగర్-సిమ్లా జాతీయ రహదారితో సహా ప్రధాన రహదారులు మూతపడ్డాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో విపత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొదట ఏడుగురు మరణించారు. శివమందిర్ కూలిపోయిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోచోట కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 17 మంది కాపాడామని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు. That has happened in #Himachal to build a 4 Lane road the Govt. Bulldoze houses, shops, bussiness establishment in the name of development but In this Himalayan Ranges. But now Nature is taking revenge. The Roads are crumbling down. Location NH 5 , Solan India pic.twitter.com/hQii08aoTl — Ravi Rana (@RaviRRana) August 11, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
ఆగస్టు 15: ఆమె... దేశంలో సగం ఎప్పుడు!?
స్వాతంత్య్ర దినోత్సవం దేశ ఔన్నత్యాన్ని మాట్లాడుతుంది. దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తుంది. కాని దేశంలో సగమైన స్త్రీలు సంపూర్ణ స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పొందవలసే వుంది. ఏనాడైతే స్త్రీల పట్ల సురక్షితమైన, సంస్కారవంతమైన ప్రవర్తనను ఈ సమాజం చూపుతుందో అప్పుడే స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టు. అప్పుడే దేశ ఔన్నత్యం ఇనుమడించినట్టు. ‘ఆకాశంలో సగం’లాగా దేశంలో సగం ఇంకెప్పుడు? నేడు ఆగస్టు 15న ఎర్రకోట మీద జెండా ఎగుర వేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు సహకారం అందిస్తారు. మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్ కౌర్ పతాకావిష్కరణ సమయంలో ప్రధానితో పాటుగా ఉండి జెండా వందనం సమర్పిస్తారు. ఈ విశేష ఘట్టంలో ఇద్దరు మహిళలకు ఈ విధంగా చోటు దక్కడం సంతోషపడాల్సిన సంగతి. 76 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్త్రీల స్థితిగతుల్లో వచ్చిన పురోభివృద్ధికి ఇదీ ఒక సంకేతమే. నాటి నుంచి నేటి వరకు విద్య, ఉపాధి, ఉద్యోగం, సైన్యం, పాలనా యంత్రాంగం, శాసన వ్యవస్థ... వీటిల్లో స్త్రీలకు గణనీయంగా స్థానం దక్కింది. ప్రాముఖ్యం లభించింది. అయితే అంతమాత్రాన స్త్రీలు సంపూర్ణంగా స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నారా అనేది ప్రశ్న. స్త్రీల త్యాగం దాస్య భారతంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో స్త్రీలు పాల్గొన్నారు. అన్నింటికి మించి పురుషులు దేశం కోసం ప్రాణాలు అర్పించినా, జైళ్ల పాలైనా స్త్రీలు ధైర్యంగా ఇళ్లు నడిపి కష్టాలను ఈదారు. దేశ విభజన సమయంలో తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. అంతెందుకు 1930 నాటికి దేశ వ్యాప్తంగా 30 వేల మంది స్త్రీలు స్వాతంత్య్ర పోరాటంలో ఏదో విధాన జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్త్రీల పోరాటం చాలామటుకు చరిత్రలో నమోదు కాకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడిప్పుడే నాటి వీర వనితల గాధలు వెలికి వస్తున్నాయి. ఇంత పోరాటం, త్యాగం చేసి స్త్రీల భాగస్వామ్యంతో తెచ్చుకున్న స్వాతంత్య్రంలో స్త్రీలు నిజంగా సంతోషంగా ఉన్నారా? సురక్షితం కాని దేశం ‘ఒక స్త్రీ అర్ధరాత్రి క్షేమంగా నడిచి వెళ్లినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ ఏ ముహూర్తంలో అన్నారో కాని అలాంటి స్థితి నేటికీ రాకపోగా నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఎన్ని చట్టాలు చేసినా, శిక్షలు తెచ్చినా స్త్రీలను గౌరవించాలి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని మెజారిటీ సమాజం అనుకోవడం లేదు. ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే భావన సమాజంలో ఆది కాలం నుంచి చొప్పించి ఉండటం వల్ల స్త్రీ చేసే ప్రతి పనిలో తప్పు ఎంచడం, అదుపు చేయడం, చులకనగా చూడటం, వివక్ష చూపడం, దండించడం ఆనవాయితీగా మారింది. పిల్లల పెంపకం దశ నుంచే స్త్రీలను గౌరవించడం నేర్పించడం లేదు. ఇంట్లో అమ్మాయిని ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా పెంచడం వల్ల ఈ అబ్బాయిలు ‘సమాజం’గా మారి స్త్రీ పాలిట బెడదగా మారుతున్నారు. తమ మాటకు ఎటువంటి తిరస్కారం చెప్పినా పురుషుడు శిక్షించేవాడై స్త్రీని చంపేందుకు వెనుకాడటం లేదు. స్త్రీకి ఒక అభిప్రాయం కలిగి ఉండే స్వాతంత్య్రం ఆమెకు ఎందుకు ఇవ్వడం లేదు? స్త్రీలను ప్రేమ, మర్యాద, గౌరవాలతో కుటుంబం చూసుకోవాలి. అప్పుడు ఆ మర్యాద, గౌరవాలు సమాజంలోకి ఆటోమేటిక్‌గా వస్తాయి. కుటుంబం స్త్రీకి ఎలా రక్షణ ఇస్తుందో సమాజం కూడా స్త్రీకి అలా రక్షణ ఇవ్వాలనే పౌర శిక్షణ, సంస్కారం అవసరం. పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా కుటుంబం, సమాజం, దేశం కోసం గొప్పగా ఆలోచించగలరు. వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చి చూస్తే తెలుస్తుంది. అటువంటి వేకువలోకి దేశం ఉదయించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోరుకుందాం. -
Inspiration is freedom: స్ఫూర్తిదాయకం స్వాతంత్య్రం
ఏ దేశానికైనా ప్రధానంగా ఉండాల్సింది స్వాతంత్య్రం. ప్రపంచంలో పలుదేశాలు ఏదో సందర్భంలో ఇతర దేశాల పాలనకు లోబడి అటుపైన స్వాతంత్య్రాన్ని సాధించు కున్నవే. స్వాతంత్య్రాన్ని సాధించుకున్న దినాన్ని ఉత్సవ దినంగా ప్రతి దేశమూ జరుపుకుంటూ ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమే. ‘దేశానికి రూపకల్పన చేసేది ఏది? ఎత్తైన నిర్మాణాలు, భవనాల గోపురాలతో ఉండే గొప్ప నగరాలు కాదు; విశాలమైన ఓడరేవులు కాదు, కాదు; మనుషులు, గొప్ప మనుషులు’ అని ఒక గ్రీక్ చాటువును ఆధారంగా తీసుకుని ఇంగ్లిష్ కవి విలిఅమ్ జోన్స్ చెప్పారు. ఆ మాటల్ని తీసుకుని గురజాడ అప్పారావు ‘దేశమంటే మట్టికాదోయ్ /దేశమంటే మనుషులోయ్’ అని చెప్పారు. ఔను, దేశం అంటే మనుషులే. ‘నువ్వు నీ దేశాన్ని ప్రేమించు’ అని ఇంగ్లిష్ కవి ఆల్ఫెడ్ టెన్నిసన్ అన్నారు. ఆ మాటల్ని తీసుకునే గురజాడ అప్పారావు ‘దేశమును ప్రేమించుమన్నా‘ అని అన్నారు. దేశాన్ని ప్రేమించడం దేశ ప్రజల్ని ప్రేమించడం ఔతుంది; దేశప్రజల్ని ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం ఔతుంది. దేశాన్ని ప్రేమించలేనివాళ్లు దేశ పౌరులుగా ఉండేందుకు ఎంతమాత్రమూ అర్హులు అవరు; వాళ్లు దేశానికి హానికరం ఔతారు. ‘నితాంత స్వాతంత్య్రమ్ము వెల్లి విరియు స్వర్గాన/నా మాతృదేశమును మేలుకొన నిమ్ము ప్రభూ’ ఈ మాటల్లో పలికిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావం మాతృదేశం, దేశ స్వాతంత్య్రం ఆవశ్యకత నూ, ప్రాముఖ్యతనూ ఘోషిస్తూ ఉంది. విదేశీ ఆక్రమణ దారుల క్రూరమైన, భయానకమైన పాలనలో పెనుబాధను అనుభవించి, లెక్కలేనంత సంపదను కోల్పోయి, ఎన్నిటినో వదులుకున్న మనదేశం వందల సంవత్సరాల పరపీడన నుండి విముక్తమై 75 యేళ్లుగా స్వాతంత్య్రాన్ని శ్వాసిస్తోంది. మనం ఇవాళ స్వతంత్ర దేశంలో ఉన్నాం; మన దేశంలో మనం మనదేశ పౌరులుగా ఉన్నాం. ఈ దేశం మనది; ఈ మనదేశం మన సంతతికి పదిలంగా అందాలి. ఈ చింతన మనల్ని నడిపించే ఆశయమై మనలో, మనతో సర్వదా, సర్వథా ఉండాలి. ‘నువ్వు, నీ దేశం నీకు ఏం చేస్తుంది అని అడిగే రాజకీయవాదివా? లేకపోతే నువ్వు, నీ దేశానికి ఏం చెయ్యగలను అని ఆడిగే పట్టుదల ఉన్నవాడివా? మొదటి ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు పరాన్నజీవివైన పురుగువి, రెండవ ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు ఎడారిలో ఉద్యానవనంవి’ అని ఖలీల్ జిబ్రాన్ మాటలు మన మెదళ్లను కదిలించాలి; మనదేశానికి మనం ఉద్యానవనాలం అవ్వాలి. ‘జంబూద్వీపే వైవస్వత మన్వంతరే భరతఖండే... ‘ఇలా ఆలయాల్లో సంకల్పం చెప్పడం మనకు తెలిసిందే. ఈ సంకల్పం చెప్పడం కాశ్మీర్ నుండీ కన్యాకుమారి వరకూ ఉండే ఆలయాల్లో ఉంది. ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోనూ ఉండే ఆలయాల్లోనూ ఉండేది. దీని ద్వారా భరతఖండం సాంస్కృతికంగా ఒకటే అన్న సత్యం విశదం ఔతోంది. 2,000 ఏళ్లకు పూర్వందైన తమిళ్ సాహిత్యం పుఱనానూఱులో ఉత్తరాన హిమాలయాల నుండీ దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్న దేశం ఇది అని చెప్పబడింది. దీని ద్వారా ఎప్పటి నుండో భారతం భౌగోళికంగా ఒకటే అన్న సత్యం అవగతం ఔతోంది. 2,300 యేళ్ల క్రితంనాటి గ్రీక్ చరిత్రకారుడు మెగస్తనీస్ హిమాలయం నుండీ దక్షిణాన కడలి వరకు ‘ఇండికా’ అని గుర్తించాడు. అవగాహనారాహిత్యంతో కొందరు మనదేశం అసలు ఒక దేశమే కాదని, మరొకటని మనలో దేశవ్యతిరేక భావ అనలాన్ని రగిలిస్తూ ఉంటారు. ఆ అనలాన్ని చదువుతోనూ, విజ్ఞతతోనూ మనం ఆర్పేసుకోవాలి. ‘నా తల్లీ, తండ్రీ సంతోషంగా ఉన్నది ఈ దేశంలోనే’ అనీ, ‘తియ్యనైన ఊపిరినిచ్చి కని, పెంచి అనుగ్రహించింది ఈ దేశమే’ అని అన్నారు తమిళ్ మహాకవి సుబ్రమణియ బారతి. ఆయన జాతీయతా సమైక్యతను కాంక్షిస్తూ ‘కాశి నగర పండితుల ప్రసంగాన్ని కంచిలో వినడానికి ఒక పరికరాన్ని చేద్దాం’ అనీ అన్నారు. జాతీయతా సమైక్యత ఆపై సమగ్రత దేశానికి ముమ్మాటికీ ముఖ్యం. ‘వందేమాతరం జయ వందేమాతరం; ఆర్యభూమిలో నారీమణులూ, నరసూర్యులూ చేసే వీరనినాదం వందేమాతరం’ అనీ, ‘వందేమాతరం అందాం; మా దేశమాతను పూజిస్తాం అందాం’ అనీ నినదించారు సుబ్రమణియ బారతి. మనదేశాన్ని ప్రేమిస్తూ ఉందాం, మనదేశాన్ని పూజిస్తూ ఉందాం, మనం దేశభక్తులుగా మసలుతూ ఉందాం. దేశభక్తితో, భారతీయతతో బతుకుతూ ఉందాం. భారతీయులమై మనసారా, నోరారా అందాం, అంటూ ఉందాం ‘వందేమాతరం’. ‘దేశవాసులు అందరికీ జాతీయతా భావం ఉండాలి. జాతీయతా భావం లేకపోవడం క్షంతవ్యం కాదు. జాతీయతా వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అనేవి భయంకరమైన మానసికవ్యాధులు. అవి ఉండకూడదు. జాతీయత–దేశ విద్వేషవాదం నుండి మనల్ని, మనదేశాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి’ ‘భారత(ప్ర)దేశం... ‘భా’ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’ అనీ, ‘రత’ అంటే అంకితమైన, అసక్తి కల అనీ అర్థాలు. భగవంతుడు కాంతిరూపుడు. ‘భారతం’ అంటే ‘భగవంతుడికి అంకితమైంది’ లేదా ‘భగవంతుడిపై ఆసక్తి కలది’ అని అర్థం. ఈ అర్థాన్ని మనం ఆకళింపు చేసుకుందాం‘ – రోచిష్మాన్ -
అరచేతిలో స్వతంత్రం
ఒక్కోసారి చేతిలో ఖాళీ ఉంటుంది. కానీ ఆ ఖాళీకి సార్థకత తెచ్చేలా చేయగలిగిందేమీ తోచదు. అప్పుడు ఆడుకోవడానికి ఆన్లైన్ అనేది మంచి గేమ్. అందరినీ వ్యసనపరులను చేసే ఆన్లైన్ గేమ్స్ గురించి కాదు; ఆన్లైన్తోనే ఆడుకోవడం! దీనికి గూగుల్, వికీపీడియా, యూట్యూబ్, ట్విట్టర్ లాంటివన్నీ పనిముట్లు. ఒకదాన్లోంచి ఇంకోదాన్లోకి గెంతుతూ, కొత్త విషయాలకు ద్వారాలు తెరుచుకుంటూ వెళ్లడం సరదాగా ఉంటుంది. మామూలుగా అయితే ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి గ్రంథాలయాలను చుట్టేయాలి. అంత శ్రమ లేకుండా మన అరచేతిలోనే ఆ భాండాగారం ఉంది. ఎక్కడినుంచి మొదలు పెట్టాలనే సమస్య అయితే ఉంటుంది. ఇది వ్యక్తిగత ఎంపిక. ఉదాహరణకు ప్రపంచ సినిమాను ఇష్టపడే ఏ స్నేహితుడో ఈ పేరును డ్రాప్ చేసివుంటాడని అనుకుందాం: ‘హిరోషిమా మాన్ అమౌర్’. ఈ ఒక్క హింటు మీదే ఎన్నో విషయాలు పోగేయవచ్చు. హిరోషిమా అంటే అర్థమౌతోంది; తర్వాతి పదాలు? గూగుల్ ఎందుకుంది? మాన్ అంటే ఫ్రెంచ్‌లో ‘నా’. అమౌర్ అంటే ప్రేమ. రెండో ప్రపంచ యుద్ధపు బీభత్సాన్ని చిత్రించిన సినిమా ఇది. కానీ ఆ బీభత్సం కథాకాలానికి సుదూర గతం. యుద్ధం మనుషుల మనసుల్లో ఎంత లోతైన గాయాలను చేసిందో జ్ఞాపకాల తలపోత ద్వారా చెప్పిన సినిమా. దీర్ఘ కవిత లాంటి సినిమా. పేరులేని అతడు, ఆమె జరిపే ఏకాంత సంభాషణ. ఇదంతా సినిమా చూస్తే అర్థమౌతుంది. సినిమాకు బయటి సంగతులు? ప్రపంచ సినిమా గతిని మార్చిన ‘న్యూ ఫ్రెంచ్ వేవ్’కు ఈ సినిమా ఒక శక్తిమంతమైన చేర్పు. 1959లో వచ్చింది. ఈ వేవ్‌లో శిఖరంగా చెప్పే ‘బ్రెత్లెస్’ కంటే ఏడాది ముందే విడుదలైందని తెలియడం అదనపు విశేషం. ఇదొక ఫ్రెంచ్–జపనీస్ ఉమ్మడి నిర్మాణం. తగినట్టుగానే ‘ఆమె’ ఫ్రెంచ్ నటి, ‘అతడు’ జపనీస్ నటుడు. ఎమాన్యుయెల్ రివా, ఎయిజీ ఒకాడా. వీళ్ల విశేషాలేమిటి? రివా సరిగ్గా తొంభై ఏళ్లు బతికి 2017లో చనిపోయింది. ఆమె కవయిత్రి, ఫొటోగ్రాఫర్. ఇంకా చాంటెయూజ్. అంటే బార్ లేదా స్టేజ్ మీద పాడే నైట్‌క్లబ్ సింగర్. వీటన్నింటికంటే ఆకట్టుకునే విశేషం, ఆమె మరో సుప్రసిద్ధ సినిమా– ‘అమౌర్’. రెండిట్లోనూ ప్రేమ ఉంది చూశారా? అది విదేశీ భాషా చిత్రం విభాగంలో 2012లో ఆస్కార్ గెలుచుకున్న ఫ్రెంచ్ సినిమా. ఈమెను ఇక్కడ వదిలేసి ‘అతడి’ దగ్గరికి వెళ్తే– ఓహో! ఈ ఎయిజీ ఒకాడా 1964లో వచ్చిన జపనీస్ కల్ట్ సినిమా ‘వుమన్ ఇన్ ద డ్యూన్స్’లో హీరోనట! అందుకేనా ఆ రెండింట్లోనూ ఒకే రకమైన మగటిమి నవ్వు ఉంటుంది! ఇలాంటి నవ్వు బహుశా యూకియో మిషిమా ఇష్టపడతాడు. ఈయనెందుకు వచ్చాడు మధ్యలో? అదే 1960ల్లో ఆయన్ని సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరిస్తుందనుకున్నారు. కండలు తీరి మంచి దేహదారుఢ్యంతో ఉండే మిషిమా వేషధారణ, జీవనశైలి ఒక యోధుడిని తలపించేది. జపనీస్ సాహిత్యం ‘సుకుమార హృదయ’ సంబంధి అనీ, దాన్ని తాను ‘మగటిమి’ దిశగా లాక్కెళ్తున్నాననీ అనేవాడు. ఇంతకీ మనం దర్శకుడి గురించి వాకబు చేయనేలేదు. ఆయన పేరును ఫ్రెంచ్ ఉచ్చారణలో అలె రెనీ అనాలట. ఈ రెనీకి సంబంధించిన విశేషాలేమిటి? 1922లో జన్మించాడు. అంటే పోయినేడాదే శతజయంతి ఉత్సవాలు ముగిశాయి. దీనికంటే ముఖ్యమైనది, ప్రపంచ మేటి డాక్యుమెంటరీల్లో ఒకటిగా చెప్పే ‘నైట్ అండ్ ఫాగ్’కు దర్శకత్వం వహించడం! 1956లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో శవాల గుట్టలుగా మిగిలిన యూదుల దయనీయ గాథను కడుపులో తిప్పేంత దగ్గరగా చూపుతుంది. ఏ హేతువుకూ అందని దుర్మార్గం దాని పరాకాష్ఠకు చేరినప్పుడు మనిషనేవాడు కేవలం శవాల గుట్టల్లో కొన్ని గుర్తుపట్టని ఎముకలుగా మాత్రమే మిగిలిపోయే అత్యున్నత విషాదాన్ని చిత్రిస్తుంది. దర్శకుడిని వదిలేసి, ఆ సినిమాకు రచయితగా ఎవరు చేశారో చూద్దాం. మార్గ్యూరైట్ డురాస్. ఈమె ఫ్రెంచ్ రచయిత్రి. ‘ఫిడెలిటీ’(పాతివ్రత్య) భావాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నావిడ అని తెలియడం ఈమెకు సంబంధించి కొట్టొచ్చినట్టు కనబడే విశేషం. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆ జాబితాలో ఏమైనా ఉండనీ, ‘ఇండియన్ సాంగ్’ అనే పేరున్న సినిమాకు దర్శకత్వం వహించారని తెలియడం భారతీయ మెదడును ఆకర్షిస్తుంది. ఆమె భావాలకు తగినట్టే భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి భార్య తాలూకు వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. గొప్ప సినిమా ఏం కాదని విమర్శకులు చెబుతున్నారు, కానీ దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఎటూ ఆటను హిరోషిమాతో మొదలుపెట్టాం కాబట్టి, మళ్లీ అక్కడికే వద్దాం. ఆ మహా విషాదాన్ని గుర్తుచేస్తూ ఇటీవలే ‘ఒపెన్‌హైమర్’ సినిమా వచ్చింది. అణుబాంబు పితగా అపఖ్యాతి పొందిన రాబర్ట్ ఒపెన్‌హైమర్ నేతృత్వంలో తయారు చేసిన బాంబులనే హిరోషిమా, నాగసాకి నగరాల మీద వరుసగా 1945 ఆగస్ట్ 6, 9 తేదీల్లో వదిలింది అమెరికా. మరింత ఘోర చేదు వాస్తవం ఏమిటంటే, జపాన్ను లొంగదీసుకోవడం కోసం అమెరికా ఈ బాంబులు వేయలేదు; అప్పటికే జపాన్ ఓటమి అంచున ఉంది. కేవలం తన అణుపాటవ శక్తిని ప్రపంచానికి చాటడం కోసం ఈ బాంబుల్ని జారవిడిచింది. దీనివల్ల సుమారు మూడున్నర లక్షల మంది క్షణాల్లో బూడిదయ్యారు. లక్షల మంది ఏళ్లకేళ్లు దాని పర్యవసానాలు అనుభవించారు. మూలమూలల్లోని సమాచారం ఎవరికైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండటమే ఈ ఆధునిక కాలంలో నిజమైన స్వతంత్రం. ఆ ఉన్న సమాచారంతో ఏం చేస్తామనేది మన వివేకం! -
గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!
Gold rates1947-2023 భారతీయులకు బంగారం అంటే లక్ష్మదేవి అంత ప్రీతి. చిన్నా పెద్దా తేడా లేకుండా భారతీయులు అందరూ పసిడి ప్రియులే. ఒక విధంగా చెప్పాలంటే పుత్తడి భారతీయ సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లు అయినా, పండగొచ్చినా, పబ్బమొచ్చినా, బంగారం ఒక భాగం కావాల్సిందే. అంతేకాదు భూమి, పొలంతోపాటు, భారతీయులు బంగారాన్ని 'సురక్షితమైన' పెట్టుబడిగా పరిగణిస్తారు. అందుకే గోల్డ్ వినియోగంలో చైనా తరువాత ఇండియా నిలుస్తోంది. బంగారం దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయితే 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బంగారం ధరల ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం! 1964లో బంగారం అతిపెద్ద పతనం ఇండిపెండెన్స్ తరువాత మొదలైన బంగారం ధర పెరుగుదల అలా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. కేవలం 1942లో క్విట్ ఇండియా సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.రూ.88.62 రెట్టింపు అయింది. ఇక తరువాత తగ్గడం అన్న మాట లేకుండా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే. 1947లో బంగారం ధర రూ. 88.62 అంటే అప్పట్లో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు 10 కిలోల బంగారం ధర కంటే ఎక్కువ ధర ఉండేది. కేవలం 5 సంవత్సరాల క్రితం అంటే 1942లో బంగారం ధర 10 గ్రాములకు రూ.44 ఉండేది. 1950 - 60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది. 1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర 184కి చేరింది. ఇది 1980లో రూ.1,330గా మారి 1990 నాటికి రూ.3,200 దాటింది. 2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది. 2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటి 2000-2010 మధ్య బంగారం రేటు పరుగులు పెట్టింది. రూ 4,400 నుండి 18,500 వరకు పెరిగింది. ఆ తరువాతి దశాబ్దంలో కూడా ధరలు రెండింతలు పెరిగాయి. 2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720. 2023లో రూ. 60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్ చేసింది. 2023లో పసిడి ధర హెచ్చుతగ్గులకు లోనైంది. అయితే 2022తో పోలిస్తే బంగారం ధరలు ఆల్‌టైం హైంకి చేరాయి.తొలి ఆరు నెలల్లో, ధరలు దాదాపు రూ.3,000 పెరిగాయి, దాదాపు 6.5శాతం లాభాన్ని చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ ఫెడ్ రేటు పెరుగుదల, ద్రవ్యోల్బణం బంగారం ధరలు పెరగడంలో పాత్రను పోషించాయి. బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల ఈక్విటీ మార్కెట్ సంవత్సరం ప్రారంభంలో నష్టపోయినా దలాల్ స్ట్రీట్‌లో గత రెండు నెలలుగా వరుసగా రికార్డు స్థాయిలు నమోదవుతున్నాయి. బంగారం ధరను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? పెట్టుబడి పరంగా బంగారం అత్యంత నమ్మదగిన ఎంపిక గోల్డ్. ప్రపంచ మార్కెట్లలో కదలిక కూడా బంగారం విలువను నిర్ణయిస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర పెరగడం, తగ్గడం దేశీయంగా ప్రభావం చూపుతుంది. భౌగోళిక, రాజకీయ అంశాలే కాకుండా, ఆర్థికమాంద్య పరిస్థితులు, ప్రభుత్వ విధానం కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. డాలరు, బంగారం , ద్రవ్యోల్బణం ఒకదానికొటి భిన్న దశలో కదులుతాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం తగ్గుతుంది. దిగుమతి ఎక్కడ నుంచి? స్విట్జర్లాండ్ నుంచి దాదాపు సగం బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. 2021-22లో మొత్తం బంగారం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ వాటా 45.8శాతం. స్విట్జర్లాండ్ బంగారం కోసం అతిపెద్ద రవాణా కేంద్రం. అక్కడి అత్యుత్తమ శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసిన బంగారం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతోంది. బంగారంలో దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో నష్టాలను తగ్గించే డైవర్సిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే చాలా కష్ట సమయాల్లో తక్షణం అక్కరకు వచ్చే ముఖ్యమైన ఎసెట్. స్టాక్ మార్కెట్లలో ఈక్విటీలలో నష్టాలొచ్చినా బంగరం మాత్రం మెరుస్తూనే ఉంటుంది. గోల్డ్ రేటు హిస్టరీ 1947 -రూ. 88.62 1964 -రూ. 63.25 1970 -రూ. 184 1975 -రూ.540 1980 -రూ.1,333 1985 - రూ.2,130 1990 - రూ.3,200 1995 - రూ.4,680 2000 - రూ.4,400 2005 - రూ.7,000 2010 - రూ.18,500 2015 - రూ.26,343 2016 - రూ.28,623 2017 - రూ.29,667 2018 - రూ.31,438 2019 - రూ.35,220 2020 - రూ.48,651 2021 - రూ.48,720 2022 - రూ.52,670 2023 - రూ.61,080 -
ఇచ్చట రెక్కలు అద్దెకు ఇవ్వబడును
‘నీలాగ నాకు పది చేతులు లేవు’ అనే డైలాగ్ ఇక ముందు వినిపించవచ్చు. జపాన్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ టోక్యో’ కు చెందిన ప్రొఫెసర్ మసహకో ఇనామి నేతృత్వంలోని పరిశోధక బృందం ‘జీజై ఆర్మ్స్’ పేరుతో వేరబుల్ రోబో ఆర్మ్స్ను తయారు చేసింది. డ్యాన్స్లాంటి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ వరకు ఈ రోబో ఆర్మ్స్ ఉపయోగపడతాయి. ‘జీజై’ అంటే జపనీస్‌లో స్వాతంత్య్రం, స్వయంప్రతిపత్తి అని అర్థం. యసునరి అనే రచయిత రాసిన ఒక కథ చదివిన తరువాత ప్రొఫెసర్ మసహకో ఇనామికి ‘వేరబుల్ ఆర్మ్స్’ ఐడియా వచ్చింది. ‘జీజై ఆర్మ్స్’కు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అయింది -
చైనా నుంచి తైవాన్ను కాపాడుతాం
బీజింగ్: తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం పునరుద్ఘాటించారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పష్టం చేశారు. చైనా ఆక్రమణ నుంచి అమెరికా బలగాలు, ప్రజలు తైవాన్ను రక్షిస్తారని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రానికి సంబంధించి తైవాన్ ప్రజలే సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. స్వతంత్రంగా ఉండాలంటూ వారిని మేం ప్రోత్సహించం’ అని అన్నారు. తైవాన్ అంశం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ విధానమని అనంతరం వైట్‌హౌస్ అనంతరం పేర్కొంది. ఈ విషయంలో తమ వైఖరి యథాతథమని తెలిపింది. అయితే, తైవాన్ విషయంలో సైనిక జోక్యంపై స్పందించలేదు. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవలి తైవాన్ సందర్శనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ ప్రాంతంపైకి క్షిపణులను ప్రయోగించడం, యుద్ధ విమానాలను మోహరించడం తదితర చర్యలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో బైడెన్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దశాబ్దాలుగా ఒకే చైనా విధానాన్ని అనుసరిస్తున్న అమెరికా తైవాన్‌తో అధికారికంగా సంబంధాలు కొనసాగించడం లేదు. బైడెన్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. -
చైనా కక్ష పూరిత చర్య.. ఆంక్షల మోత!
చైనా: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన చైనాకి తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. ఆఖరికి అమెరికా దిగొచ్చి కేవలం తమ డెమెక్రెటిక్ కాంగ్రెస్ సభ్యుల పర్యటన అని చైనాని బుజ్జగింపు ప్రయత్నం చేసింది. అయినా ససేమిరా అంటూ తైవాన్‌పై పదే పదే ద్వేషపూరిత చర్యలకు దిగుతోంది చైనా. అదీగాక ఆది నుంచి ప్రజాస్వామ్యయుతంగా స్వయంపాలనలో ఉన్న తైవాన్ సార్వభౌమాధికారాన్ని తిరస్కరిస్తూ వస్తోంది చైనా. ప్రస్తుతం ఈ యూఎస్ అత్యన్నతాధికారి నాన్సీ పర్యటనతో తీవ్ర ఆగ్రహోజ్వాలతో రగలిపోతుంది చైనా. అందులో భాగంగా చైనా తాజగా ఏడుగురు తైవాన్ అధికారులపై ఆంక్షలు విధించింది. వారంతా తైవాన్ స్వాతంత్య్రానికి మద్ధతిచ్చినందుకే చైనా ఈ ఆంక్షలు విధించింది. ఈ మేరకు చైనా అంక్షలు విధించిన తైవాన్ వ్యవహారాల కార్యాలయం అధికారుల్లో వాషింగ్టన్‌లోని తైవాన్ రాయబారి హ్సియావో బిఖిమ్ , తైవాన్ జాతీయ భద్రతా మండలి సెక్రటరీ జనరల్ వెల్లింగ్టన్ కూ ఉన్నారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. అంతేగాక తైవాన్ అధికార రాజకీయ పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల పై కూడా ఆంక్షలు విధించింది. దీంతో ఆయా అధికారులంతా హాంకాంగ్, మకావులను పర్యటించలేరని తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు ఆయా సంస్థల పెట్టుబడు దారులు కూడా చైనాలో లాభం పొందేందుకు కూడా అనుమతించదని స్పష్టం చేశారు. ఈ ఏడుగురు అధికారుల తోపాటు అదనంగా మరో ముగ్గురు అధికారులు తైవాన్ ప్రీమియర్ సుత్సెంగ్ చాంగ్, విదేశాంగ మంత్రి జోసెఫ్ వు, పార్లమెంట్ స్పీకర్ సికున్ల పై కూడా ఆంక్షలు విధించినట్లు తైవాన్ పేర్కొంది. (చదవండి: తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం) -
వజ్రోత్సవాల్లో భాగంగా సీసీసీ వద్ద 5కె రన్ (ఫొటోలు)
-
‘టిల్లు’ సాంగ్‌కు డ్యాన్స్ అదరగొట్టిన సీపీ సీవీ ఆనంద్, మంత్రులు
హైదరాబాద్: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం 5కే రన్ నిర్వహించారు. సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ 5కే రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, సీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు. డ్యాన్స్ అదరగొట్టిన సీపీ సీవీ ఆనంద్, మంత్రులు దీనిలో భాగంగా టీజే టిల్లు సినిమా సాంగ్‌కు సీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు. బీట్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మాల్గుడి మహాశయుడు: ఆర్.కె.నారాయణ్
మన దేశానికి గర్వ కారణంగా నిలిచిన భారతీయ ఆంగ్ల కథా సాహిత్యానికి పునాదులు వేసిన వైతాళికులు రాసిపురం కృష్ణస్వామి నారాయణ్! ఆయన 1906లో మద్రాసులోని ఒక సంప్రదాయ కుటుంబంలో ఎనిమిదవ సంతానంగా జన్మించారు. ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ ఆయన పెద్దన్నయ్య. ఆర్. కె. నారాయణ్ చిన్నతనం నుంచి కౌమార దశకు వచ్చేవరకు అమ్మమ్మ ఇంటి దగ్గరే పెరిగారు. మైసూరులో ఆయన తండ్రి మహారాజా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమితులైనప్పుడు నారాయణ్ మళ్లీ తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నారు. చదువుకుంటున్నప్పుడు ఆయన ధ్యాస చదువు మీద ఉండేది కాదు. ఇంగ్లిష్ పాఠ్య పుస్తకం చదవడానికి చాలా విసుగనిపించడంతో చదవక, చదవలేక.. నారాయణ్ కళాశాల ప్రవేశ పరీక్షలో తప్పారు. తరువాత మళ్లీ ఎలాగో ప్రవేశ పరీక్ష రాసి మైసూరు విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. నారాయణ్ కథా రచయితగా తన జీవితాన్ని 1935లో ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ అనే కథతో మొదలుపెట్టారు. ‘మాల్గుడి’ అనే ఊహా పట్టణం ఆయన తలపుల్లో రూపుదిద్దుకుని ఆయన నవలలకు నేపథ్యమైంది. ది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ది ఇంగ్లిష్ టీచర్, మిస్టర్ సంపత్, ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ది వెండర్ ఆఫ్ స్వీట్స్, ది పెయింటర్ ఆఫ్ సైన్స్, ఎ టైగర్ ఫర్ మాల్గుడి పేరుతో వెలువడిన నారాయణ్ రచనలు భారతీయ ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని సంపాదించుకున్నాయి. స్వామి అండ్ ఫ్రెండ్స్‌ను అచ్చు వేయడానికి మొదట నారాయణ్‌కు ప్రచురణకర్తలు లభించలేదు. రాత ప్రతిని ఆయన గ్రాహమ్ గ్రీన్‌కు చూపించారు. ఆయన దానిని చదివి, హృదయపూర్వకంగా ప్రశంసించి, దానిని ప్రచురించడానికి ఏర్పాట్లు చేశారు. ఇ.ఎం.పార్స్టర్, సోమర్ సెట్ మామ్ల మాదిరిగా నారాయణ్‌కు కూడా గ్రీన్ ఆరాధకుడిగా మారిపోయారు. విషాదం, హాస్యం మేళవిస్తూ ఆయన రాసే కథలు సహజంగానే ఆబాలగోపాలన్ని ఆకట్టుకున్నాయి. ఆయన జీవితానుభవాలనే ఇతివృత్తాలుగా చేసుకుని కథల్ని సృష్టించారు. 1958లో ది గైడ్‌కు ఆయనకు సాహిత్య అకాడెమీ అవార్డు లభించగా, 1980లో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఆయనను ఎ.సి.బెన్సన్ అవార్డుతో సత్కరించింది. ఒక్కమాటలో.. సులభమైన భాష, శైలితో ఆర్.కె.నారాయణ్ రాసిన విషాద, హాస్య రచనలు ఆంగ్ల సాహిత్యంలో భారతీయ కథలకు కని విని ఎరుగని విధంగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. – అంజూ సెహ్గల్ గుప్తా, ‘ఇగ్నో’ ప్రొఫెసర్ -
న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతను కాపాడుకోవాలి
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను అన్ని స్థాయిల్లోనూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతల పరిరక్షణ, ప్రచారం అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు, జిల్లా కోర్టుల పని తీరుపైనే భారత న్యాయ వ్యవస్థ ఔన్నత్యం ఆధారపడి ఉందని, ఆ కోర్టులు ఇచ్చే తీర్పుల ద్వారా లక్షలాది మందికి ఈ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎన్ఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన, ప్రచార కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన కోర్టులు ఇచ్చే తీర్పులు సమాజంపై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయని, సంక్షేమ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఎంతో కీలకమైనదని ఉద్ఘాటించారు. ‘‘ట్రయల్ కోర్టు, జిల్లా కోర్టుల పనితీరును ఆధారంగా చేసుకొని భారత న్యాయవ్యవస్థపై లక్షలాది మంది అంచనాలు ఏర్పాటు చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో కోర్టులు బలోపేతమైతేనే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటవుతుంది. అందుకే న్యాయ వ్యవస్థ స్వతంత్రం, సమగ్రతలను కాపాడుకోవడానికి మించి దేనికి ప్రాధాన్యం లేదు’’ అని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను ఉద్దేశించి తొలిసారిగా ముఖాముఖి మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ ‘‘రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతల్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తించాలి. అప్పుడే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. కింద కోర్టులు ఇచ్చిన తీర్పులు సామాజికంగా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఆ తీర్పులు అందరికీ అర్థమయ్యేలా సులభమైన భాషలో స్పష్టంగా ఉండాలి’’ అని ఉద్బోధించారు. -
మరోసారి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియో వైరల్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలమైన 1947 నాటి దేశ స్వాతంత్య్రాన్ని ఆమె ‘భిక్ష’గా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో సర్కార్ కొలువుతీరిన 2014 ఏడాదిలోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావించాలని ఆమె వ్యాఖ్యానించారు. ఒక ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో కంగన మాట్లాడిన వీడియోను పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.‘ 1947లో దేశం స్వాతంత్య్రం పొందలేదు. అది కేవలం ఒక భిక్ష. మనందరికి 2014లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చింది. ఆనాడు భిక్షగా పొందిన దానిని మనం స్వాతంత్య్రంగా ఎలా భావిస్తాం?. దేశాన్ని కాంగ్రెస్‌కు వదిలేసి బ్రిటిషర్లు వెళ్లిపోయారు. బ్రిటిషర్ల పాలనకు మరో కొనసాగింపు రూపమే కాంగ్రెస్’ అని ఆ వీడియోలో ఉంది. ‘1857లోనే మనం తొలిసారిగా స్వాతంత్య్రం కోసం ఐక్యంగా పోరాడాం. కానీ ఆ ఉద్యమాన్ని బ్రిటిషర్లు అణిచివేశారు. దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిషర్లు ‘స్వాతంత్య్రం’ అనే దానిని గాంధీజీ భిక్ష పాత్రలో వేశారు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. వెల్లువలా విమర్శలు కంగన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్, శివసేన ఇలా పార్టీలకతీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. దేశద్రోహం సెక్షన్ల కింద కంగనపై కేసు నమోదుచేయాలని ఆప్ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రీతి శర్మ మీనన్ ముంబై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దేశప్రజలందరికీ కంగన బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు. ‘ గాంధీజీ, భగత్‌సింగ్, నేతాజీ లాంటి త్యాగధనులను అవమానించిన కంగన నుంచి పద్మశ్రీని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే కేంద్రం ఇలాంటి మరెంతో మందిని ప్రోత్సహిస్తోందని భావించాల్సిందే’ అని ఆయన అన్నారు. ‘కంగన మాటలను దేశద్రోహంగా భావించాలా? లేక పిచ్చిపట్టి మాట్లాడుతోంది అనుకోవాలా?. ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలను మనం కేవలం ఖండించి వదిలేస్తే సరిపోదు’ అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆగ్రహంగా మాట్లాడారు. कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार। इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z — Varun Gandhi (@varungandhi80) November 11, 2021 How Dare she insult Our Martyrs like this .. What a SHAMEFUL COMMENT ‼️ Just PATHETIC ‼️‼️ pic.twitter.com/sF59i7Or2e — Aarti (@aartic02) November 10, 2021 .@AamAadmiParty member @PreetiSMenon filed a complaint with the @MumbaiPolice against actor #KanganaRanaut for her recent remarks on India's freedom struggle on a news channel. pic.twitter.com/ZiYgs1sd5x — Silverscreen.in (@silverscreenin) November 11, 2021 -
Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా?
పంజ్‌షీర్.. కొద్ది రోజులుగా ఈ పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. చుట్టూ పర్వతాలే కోట గోడలా రక్షణనిస్తున్న ఆ లోయవైపు ఇన్నాళ్లూ ఎవరూ కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇప్పుడు తాలిబన్లు ఆ లోయపై పట్టు బిగించాలని చూస్తూ ఉంటే మరోవైపు తాలిబన్ వ్యతిరేక శక్తులు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఎందుకీ లోయపై తాలిబన్లకు అంత మక్కువ? అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో హిందుకుష్ పర్వత సానువుల్లో పంజ్‌షీర్ లోయ ఉంది. దీనిని అయిదు సింహాల లోయ అని కూడా పిలుస్తారు. ఈ లోయకి ఆ పర్వతాలే రక్షణ కవచాల్లా నిలుస్తాయి. ఈ లోయలోకి వెళ్లాలంటే పంజ్‌షీర్ నది వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ఇరుకైన రహదారి మాత్రమే మార్గం. అందుకే అక్కడి స్థానికులకు ఈ లోయను కాపాడుకోవడం అత్యంత సులభంగా మారింది. భౌగోళికంగా చూస్తే అఫ్గాన్‌తో సంబంధం లేనట్టుగానే ఉంటుంది కానీ దేశంలో ఉన్న 34 ప్రావిన్స్‌లలో పంజ్‌షీర్ కూడా ఒకటి. చారిత్రకంగా చూస్తే పలుమార్లు నిర్ణయాత్మక పాత్రని పోషించింది. మొదట్నుంచి ఎవరికీ తలవంచకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈ లోయపై ఆధిపత్యం సాధించడానికి తాలిబన్లు ఈసారి తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. పోరాటాల గడ్డ పంజ్‌షీర్ అంటే అహ్మద్ షా మసూద్ గురించి చెప్పుకోవాలి. 1953 సంవత్సరంలో ఈ లోయలో జన్మించిన మసూద్ తనకంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్లాం మత శక్తులతో తనలో చివరి ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూ వచ్చారు. పంజ్‌షీర్ లోయ స్వతంత్రతని కాపాడారు. 1980 దశకంలో అఫ్గాన్‌ను సోవియెట్ యూనియన్ దురాక్రమణ చేసినప్పుడు, 1990 నాటి అంతర్యుద్ధం సమయంలో, తాలిబన్లు దేశాన్ని పాలించిన 1996–2001 మధ్య కాలంలో కానీ ఈ లోయ ఎప్పుడూ ఎవరి వశం కాలేదంటే మసూద్ పోరాట పటిమే కారణం. ఆ లోయలో లక్షా 50 వేల మంది వరకు నివసిస్తారు. వారంతా తాజిక్ తెగకు చెందిన వారు. మరోవైపు పాస్తూన్ తెగ వారు ఎక్కువగా తాలిబన్ ముఠాలో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మçసూద్ శక్తియుక్తులతో వారు ఆ లోయవైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. పంజ్‌షీర్ లోయతో పాటు చైనా, తజికిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య పాకిస్తాన్ వరకు ఆయన ప్రభావమే ఉండేది. మసూద్‌కి సంప్రదాయ ఇస్లామ్ భావాలు ఉన్నప్పటికీ సమాజంలో మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని ఆరాటపడేవారు. అయితే మసూద్ గ్రూప్ సభ్యులే ఎక్కువగా మానహక్కుల్ని హరించారన్న విమర్శలు ఉన్నాయి. 2001లో మసూద్‌ని అల్‌ఖాయిదా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ లోయను నడిపిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మద్‌లు కూడా ఆయనకు సహకరిస్తూ లోయను కాపాడుతున్నారు. పచ్చల లోయ ఈ లోయలో ఎక్కువగా ఎమరాల్డ్ (పచ్చలు) లభిస్తాయి. ఇప్పటివరకు ఇంకా తవ్వకం చేపట్టని ఎన్నో పచ్చల గనులు ఉన్నాయి. అవే ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరు. అమెరికా నాటో దళాలు స్వాదీనంలో అఫ్గాన్ ఉన్నప్పుడు ఈ లోయలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. అఫ్గాన్‌లో ఇంధనానికి ఒక హబ్‌గా మారింది. ఎన్నో జలవిద్యుత్ ఆనకట్టల్ని ఈ లోయలో నిర్మించారు. విద్యుత్‌లో స్వయంసమృద్ధిని సాధించిన ప్రాంతం ఇదొక్కటే. పచ్చల గనులతో ఆర్థికంగా పటిష్టంగా ఉండడంతో తాలిబన్లు ఈ లోయని ఆక్రమించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. పంజ్‌షీర్‌కు ఎదురయ్యే సవాళ్లేంటి ? పంజ్‌షీర్‌లో పచ్చలు, వెండి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆహారం, వైద్యం అవసరాల కోసం అఫ్గాన్‌లో ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పదు. ప్రస్తుతం ఈ లోయ చుట్టూ తాలిబన్లు తమ కమాండర్లను మోహరించారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరా నిలిపివేశారు. అయితే ఆ లోయలో వచ్చే చలికాలం వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించే ఆ లోయ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా కనిపిస్తోంది. పంజ్‌షీర్‌పై పూటకొక రకమైన వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీట్ కానిస్టేబుల్‌దే కీలక పాత్ర
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వాతంత్య్రం, ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ అత్యంత కీలకమైనవని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పోలీస్ వ్యవస్థకు వీటితో ప్రత్యక్ష సంబంధం ఉంటుందన్నారు. స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను నిరంతరం మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలీసు వ్యవస్థలో కింది స్థాయిలో ఉండే బీట్ కానిస్టేబుల్ ప్రజలను రక్షించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని కొనియాడారు. శనివారం బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్, డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్‌డీ) 51వ వ్యవస్థాపక దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలు అదుపులో లేకపోతే ప్రజాస్వామ్యం విజయవంతం కాబోదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యం అనేది మనకు సహజసిద్ధమైందని వ్యాఖ్యానించారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ నేరుగా శాంతి భద్రతలతో ముడిపడి ఉంటుందన్నారు. -
మనం అమరవీరుల ఆశయాలను సాధించామా?
-
భారత్‌తో వాణిజ్యం ఇప్పట్లో లేనట్టే
ఇస్లామాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించలేమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతులు చేసుకోవాలంటూ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ(ఈసీసీ) చేసిన సిఫారసుల అమలును వాయిదా వేశారు. కేబినెట్ సహచరులతో చర్చించాక ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాన్ పత్రిక తెలిపింది. భారత్‌తో ఇప్పట్లో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం కుదరదని వాణిజ్య శాఖకు, ఆర్థిక బృందానికి ఇమ్రాన్ తెలిపారు. దుస్తులు, చక్కెరను తక్కువ ధరకి దిగుమతి చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలన్నారు. పాక్ ఆర్థిక, వాణిజ్య రంగాలను బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్న ఈసీసీ కొన్ని వేల ప్రతిపాదనలు పరిశీలించాక భారత్ నుంచి పత్తి, దుస్తులు, చక్కెర దిగుమతి చేసుకోవాలంటూ సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల్ని ఆమోదించడానికి కేబినెట్‌కు పంపింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదంటూ పాకిస్తాన్ కేబినెట్ ఆ సిఫారసుల్ని తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ 2019లో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆ దేశంతో ఏ రకమైన సంబంధాలు పునరుద్ధరించబోమని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెప్పారు. మరోవైపు భారత్ కూడా అంతే గట్టిగా పాక్‌కు వార్నింగ్‌లు ఇచ్చింది. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర సంస్థల్ని కట్టడి చేసే వరకు తాము కూడా ఎలాంటి బంధాల్ని కొనసాగించమని భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత ఏడాది కరోనా సంక్షోభం సమయంలో భారత్ నుంచి దిగుమతయ్యే మందులు, వాటి తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై ఉన్న ఆంక్షల్ని పాక్ ఎత్తేసింది. -
కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి
శ్రీనగర్: స్వతంత్ర ప్రతిపత్తిని తిరిగి సాధించడమే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నాటికి ముందు పరిస్థితిని జమ్మూకశ్మీర్‌లో పునరుద్ధరించాలనీ, దీనిపై సంబంధిత పక్షాలన్నిటితో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. గురువారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన ఈ భేటీకి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోనె, పీపుల్స్ మూవ్‌వెంట్ నేత జావెద్ మిర్, సీపీఎం నేత యూసఫ్ తారిగామి హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్’గా తమ కూటమికి పేరు పెట్టామన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్లకున్న ప్రత్యేక హోదాతోపాటు, కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని సాధించుకుంటామన్నారు. తమ కూటమి భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే వెల్లడిస్తామన్నారు. జేకేపీసీసీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
ఘనంగా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
ఈ ప్రపంచం అంతులేని చెరసాల!
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత విడుదలైన సినిమాల్లో ఇది ఒకటి. రక్తి నుంచి విరక్తి వైపు పయనించి... జీవితసత్యాలను సామాన్యులు కూడా పాడుకునేలా చేసిన ప్రజాకవి గురించి తీసిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... అప్పుడే ఇంట్లోకి వచ్చారు రెడ్డిగారు.వదినగారు దిగులుగా కనిపించడం చూసి...‘‘ఏమైంది వదినా?’’ అని అడిగారు నెమ్మదిగా.‘‘నాగహారం కనిపించడం లేదు. నిన్న పొద్దున కూడా పూజ చేశాను. ఈ పూట పూజ చేద్దామని తెరిస్తే లేదు’’ అన్నది ఆమె బాధగా.‘‘నేను తీసుకుపోయిన వదినా’’ అన్నారు ఆయన తలవంచుకొని.‘‘ఆ... దానితో నీకేం పనివచ్చింది?’’ ఆశ్చర్యంగా అడిగింది వదిన.‘‘మోహనాంగి కావాలంటేనూ...’’ అన్నారు ఆయన వినీవినిపించనట్లుగా.ఆమె గుండెలో రాయిపడ్డట్లయింది...‘‘ఎంత పనిచేశావయ్యా! ఆ హారాన్ని ఎవరో మహాశక్తులు ఇచ్చారని తెలుసునే. మనగౌరవం,మన సిరిసంపదలు దాని ప్రసాదమేనని తరతరాలుగా నమ్ముతున్నాము. నా మాంగల్యంతో సమానంగా భావించి పూజిస్తున్నానే. ఆ హారాన్ని ఇంత చులకన చేస్తారా? ఈ సంగతి మీ అన్నగారు వింటే ఎంత బాధపడతారో ఆలోచించావా? ఏ అనర్థాలు రాకముందే హారం మన ఇంటికి చేర్చు’’ అన్నది ఆమె ఆందోళనగా.చేసిందంతా చేసి...‘‘నా చేతుల్లో ఏముంది?’’ అన్నట్లుగా చూశారు రెడ్డిగారు. అభిరామయ్య రెడ్డిగారి మనసు మార్చే ప్రయత్నంలో ఉన్నాడు...‘‘ఇప్పటికైనా మేలుకో. ఎంతసేపూ ఇదితే అదితే అని పీల్చిపిప్పి చేయడమేగానీ వాళ్లు నీ కష్టనష్టాలు విచారిస్తారా? సమ్మోహనంలో పడి నీ కుటుంబ గౌరవానికి ఎంత అపకారం చేస్తున్నావు? ఇంగితం లేని వాళ్లు తెమ్మంటే మాత్రం మీరైనా వెనకా ముందు ఆలోచించవద్దా? మీరు పెళ్లీపేరంటం చేసుకొని సుఖంగా ఉండండి’’ తనకు తోచిన రీతిలో హితబోధ చేశాడు అభిరామయ్య.‘‘ఆ సావాసం చాలించడం నువ్వు చెప్పినంత సులభం కాదు. ఇది వేదాంతులకు అర్థం కాదు. ఆలోచిద్దాం’’ అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు రెడ్డిగారు.‘‘ఆలోచించడానికి ఏముంది! ఇచ్చినట్లే తీసుకురావచ్చు కదా!’’ అన్నాడు అభిరామయ్య.మళ్లీ ఏదో సాకు చెప్పారు రెడ్డిగారు!‘‘తీతువు కూసింది! నరుడు తప్పులు చేస్తుంటేనారాయణుడు ఇట్లాగు అడ్డుపడుతుంటే...సరే మన ప్రయత్నం మనం చేద్దాం. పైన జై సీతారామ్’’ వేదాంత ధోరణిలో అన్నాడు అభిరామయ్య. రెడ్డిగారు ఇంట్లో కనిపించడం లేదనే వార్త చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోయింది. ‘‘చిన్నరెడ్డిగారు వారి ఇంట్లో కనిపించడం లేదు. చెప్పులైనా వేసుకుపోలేదు. ఎప్పుడు పోయినారో ఎక్కడికి పోయినారో’’ ‘‘అమ్మాయిగారు పోయింది మొదలు మాటా పలుకూ లేకుండా గదిలో ఒంటరిగా కూర్చున్నారు. దగ్గరకు పోదామని పలకరిద్దామన్నా భయమేసింది. ఉన్నట్టుండి తెల్లవారే వరకు ఇంట్లో లేరు.’’అంటూ బాధ పడింది రెడ్డిగారి వదిన.‘‘అభిరామయ్య దగ్గర ఉన్నారేమో...’’ అన్నారెవరో.కానీ అక్కడ కూడా లేరు.అభిరామయ్య రెడ్డిగారిని వెదుక్కుంటూ వెళ్లాడు.ఒకచోట ఆశ్చర్యంగా ఆగాడు.... రెడ్డిగారు కనిపించారు!‘‘ఇదేమిటంటీ రెడ్డిగారు ఈ కసువులో ఈ మట్టిలో కూర్చున్నారే!’’ అన్నాడు అభిరామయ్య.‘‘ఏనాటికైనా మట్టిలో కలిసిపోయేదేగా ఈ శరీరం. ఇక్కడ కూర్చుంటే అవమానమా అభిరామయ్యా’’ నిర్వేదంగా అన్నారు రెడ్డిగారు.‘‘ఏంమాటలండీ ఇవి. మీరు కనబడటం లేదని అందరూ కంగారు పడుతున్నారు. ఇంటికి పోదం రండి’’ అని బతిమిలాడాడు అభిరామయ్య.‘‘ఇల్లు ఎవరిది? వాకిలి ఎవరిది అభిరామా? నా ఇల్లు... నా చిన్నాయన అని కలవరించిన జ్యోతి చివరికి నన్ను, నా ఇంటిని విడిచిపోలేదా? ఇప్పుడు ఆమె ఎక్కడుందో తెలుసునా అభిరామా?’’ తారస్థాయికి చేరిన వైరాగ్యంలోనుంచి మాట్లాడుతున్నారు రెడ్డిగారు.‘‘ఇది వరకు పోయిన వాళ్లందరూ ఎక్కడికి పోయినారో ఆమె అక్కడికే పోయింది. కాలం తీరితే అందరం పోవాల్సిన వాళ్లమేగా. అన్నీ తెలిసి కూడా మీరుపామరత్వంలో పడితే...’’ రెడ్డిగారికి జీవితసత్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు అభిరామయ్య.‘‘పామరత్వంలో పడటం లేదు అభిరామా... దాని నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాను’’శూన్యంలోకి చూస్తూ అన్నారు రెడ్డిగారు. మళ్లీ ఏం గుర్తొచ్చిందో...‘‘తమను కన్నవారు తాము కన్నవారు తమ కళ్ల ముందే చచ్చి మాయమవుతుంటే తాను మాత్రం శాశ్వతం అని పాతర్లాడుతున్నాడు. ఏదో నాటికి చావు తప్పదని తెలిసి కూడా పామరత్వంలో పడి ఆ విషయాన్ని మరిచిపోతున్నాడు. కానీ నేను ఎంత ప్రయత్నించినా చావు మరుపు రావడం లేదు అభిరామా’’ అన్నారు కళ్లనీళ్లతో రెడ్డిగారు.‘‘ఎప్పుడో చావు తప్పదని ఈనాడు ఉరిపెట్టుకోవడం పిరికితనమే కాని పురుషధర్మమా? చేతులారా అన్నగారిని చెరసాల పాలుజేసి విడిపించే దారి చూడకుండా విరక్తులై కూర్చోవడం ధర్మమా?’’ కాస్త గట్టిగాఅన్నాడు అభిరామయ్య.‘‘నేను బందిని కాకపోతే కదా ఇతరులను విడిపించడానికి! ఈ ప్రపంచం అంతులేని చెరసాల. ఎవరి స్వేచ్ఛ వారు సంపాదించుకోవాల్సిందేగానీ ఇతరులు ఇస్తారనుకోవడం వెర్రి కాదా అభిరామా!’’ మళ్లీ వేదాంతంలోకి దిగారు రెడ్డిగారు.‘‘అహోరాత్రాలు కష్టపడి సాధించిన ఆ బంగారం ఈనగాచి నక్కలపాలు జేసినట్లు అనుభవించే సమయానికి ఈ ఖర్మ ఏమిటండీ!’’ బాధగా అన్నాడు అభిరామయ్య.‘‘అనుభవించడానికి ఇంకేముంది అభిరామా! ప్రపంచంలో ఉన్న ఈ బంగారమంతా చనిపోయిన నా జ్యోతిని తేగలదా!’’ కన్నీటి సముద్రంలో నుంచి మాట్లాడుతున్నారు రెడ్డిగారు. -
ఆర్థిక వ్యవస్థకు ‘డైమండ్’ మెరుపు!
న్యూఢిల్లీ: భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయ్యేనాటికి ఆర్థికవ్యవస్థను మరింతగా ఉరకలెత్తించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దేశ జీడీపీని 9–10% చొప్పున పరుగులు పెట్టిస్తూ 2022–23కి ఎకానమీని 4 లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని నీతిఆయోగ్ రూపొందించింది. ‘‘స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా 75’’ పేరిట ఒక విజన్ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. 2022 నాటికి భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు(వజ్రోత్సవం) కానుంది. ఈ విశిష్ట సందర్భాన్ని గర్వంగా మలుచుకునేందుకు, అగ్రదేశాల సరసన భారత్‌ను నిలబెట్టేందుకు ఇప్పటినుంచే తగిన అడుగులు వేయాలని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. ఇందుకోసం పలు వృద్ధి వ్యూహాలను విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో దాదాపు 800 మందితో సంప్రదింపుల అనంతరం ఈ నివేదికను రూపొందించడం జరిగింది. అధిక వృద్ధి సాధనకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన 41 రంగాల గుర్తించి, వీటిపై తీసుకోవాల్సిన విస్తృత చర్యలను ఇందులో సూచించారు. జీడీపీ జోరు కీలకం... దేశ ఎకానమీని విస్తృతపరిచేందుకు జీడీపీని పరుగులు పెట్టించాలని విజన్ డాక్యుమెంట్ పేర్కొంది. ముందుగా వచ్చే ఐదేళ్లు (2018–23) 8–9 శాతం జీడీపీ సాధించాలని తెలిపింది. దీంతో ప్రస్తుతం 2.7 లక్షలకోట్ల డాలర్లున్న దేశ ఎకానమీ 2022–23 నాటికి 4 లక్షల కోట్ల డాలర్లకు ఎదుగుతుందని వివరించింది. ఇదే జరిగితే 2022–23 కల్లా 9–10 శాతం వేగంతో వృద్ధి సాధ్యమవుతుందని, దీనివల్ల 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకుతుందని తెలిపింది. కేవలం గణాంకాల్లో కాకుండా జీడీపీ వృద్ధి సమ్మిళితంగా, స్థిరంగా ఉండాలని సూచించింది. గతేడాది భారత్ 6.7 శాతం వృద్ధి నమోదు చేసింది. జీడీపీ పరుగుతో పాటు దేశ పెట్టుబడి రేటు (గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్) పెరగాలని తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో 29 శాతమున్న జీఎఫ్‌సీఎఫ్ 2022 నాటికి 36 శాతానికి పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అల్పాదాయ దశ నుంచి దేశ జనాభా క్రమంగా అధికాదాయాల దిశగా కదులుతున్నారని, ఈ క్రమంలో ప్రస్తుతం 1,700 డాలర్లున్న తలసరి ఆదాయం 2022–23 నాటికి 3,000 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. రైతులు ఇక అగ్రిప్రెన్యూర్స్..! ప్రస్తుతం ఇండియా ఆర్థిక పరివర్తన చివరి దశలో ఉందని విజన్ డాక్యుమెంట్ తెలిపింది. ప్రాథమిక రంగంపై ఎక్కువగా ఆధారపడ్డ దేశం కాబట్టి రైతులను పరిపుష్టం చేయాలని సూచించింది. సాగు రైతులను ‘అగ్రిప్రెన్యూర్లు’గా (సాగుతో పాటు సరైన మార్కెటింగ్ చేసుకోగల వ్యక్తులు) తీర్చిదిద్దాలని తెలిపింది. ఇందుకోసం ఇ–నామ్స్ విస్తరణ, ఏపీఎంసీ చట్టాన్ని ఏపీఎల్ఎం చట్టంగా మార్చడం, జాతీయ ఏకీకృత మార్కెట్ ఏర్పాటు, సరళీకృత ఎగుమతుల వ్యవస్థ ఏర్పాటు తదితర చర్యలు చేపట్టాలని తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, ఆయుష్మాన్ భారతి, ప్రధాన మంత్రి జన ఆరోగ్య అభియాన్, స్వచ్ఛ భారత్ పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను డాక్యుమెంట్ వివరించింది. శ్రామిక శక్తిలో మహిళలవాటాను పెంచాలని, కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు, సామాజిక భద్రతా ఛత్రం కిందకు మరిం తమందిని తీసుకురావాలని, ప్రస్తుత కార్మిక చట్టాలను సరళీకరించాలని, శిక్షణావ్యవస్థను మెరుగుపరచాలని సూచించింది. రుణమాఫీపరిష్కారం కాదు! రైతు కష్టాలు తీర్చేందుకు రుణమాఫీ సరైన పరిష్కారం కాదని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. రుణమాఫీ కేవలం కొంతమంది సాగుదారులకు మాత్రమే లబ్ధి చేస్తుందని, సాగు సంక్షోభాల నివారణకు మార్గం చూపదని ‘భారత్ న్యూ విజన్ డాక్యుమెంట్’ఆవిష్కరణ సందర్భంగా నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. సాగు శాస్త్రవేత్త రమేశ్ చాంద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పేద రాష్ట్రాల్లో కేవలం 10– 15 శాతం రైతులు మాత్రమే సంస్థాగత పరపతి పొందుతున్నారని, మిగిలినవారికి మాఫీతో ప్రయోజనం ఉండదని వివరించారు. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉన్నప్పుడు అందరికీ వర్తించేలా మాఫీ పథకం అసాధ్యమని, దీనికి బదులు సాగు సంస్కరణలకు యత్నించే రాష్ట్రాలకు ఆర్థికసాయం అందించడం ఉత్తమమని సలహా ఇచ్చారు. ఇంకా ఏం చెప్పిందంటే! వివాదాల పరిష్కారానికి ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరిట ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటు. 2022–23 నాటికి డిజిటల్ డివైడ్‌ను తొలగించి, అన్ని రాష్ట్రాల్లో పూర్తి డిజిటల్ అనుసంధానత ఏర్పాటు చేయడం, 100 శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించడం. డిస్కమ్‌ల ప్రైవేటైజేషన్, స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటు, దేశమంతా 100% విద్యుత్ సరఫరాకు చర్యలు. కార్మికులకు సంబంధించి సమగ్ర సమాచారం ఎల్ఎంఐఎస్ (లేబర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ఏర్పాటు చేయడం.భారత్‌కు విచ్చేసే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను మరింత పెంపొందించాలని సూచించింది. అంతర్జాతీయ పర్యాటకంలో భారత వాటాను వచ్చే ఐదేళ్లలో 1.18 శాతం నుంచి 3 శాతానికి పెంచాలని నిర్దేశించింది. 2022–23 నాటికి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను 88 లక్షల నుంచి 1.2 కోట్లకు పెంచాలని సూచించింది. రైల్వేల అభ్యున్నతికి టిక్కెట్ ధరలు, సబ్సిడీల నియంత్రణ, ఆస్తులను విక్రయించడం అవసరమని సూచించింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా ధరల నమూనాను రూపొందించుకోవాలని, మౌలికవసతుల కల్పనను వేగవంతం చేయాలని, రైళ్ల సరాసరి వేగాలను మెరుగుపరచాలని తెలిపింది. మాటలు కాదు... చేతలు కావాలి: జైట్లీ పేదరికాన్ని నిర్మూలించాలంటే బలమైన సంస్కరణలు కావాలని, కేవలం నినాదాలతో పేదరికం మటుమాయం కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విపక్షాలకు చురకలంటించారు. స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా ః 75 ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమాటలు వినడానికి బాగుంటాయని, కానీ వాటితో ప్రయోజనం లేదని క్రమంగా ప్రజలు గ్రహిస్తారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చాక వేగంగా ఎదిగేందుకు పలు అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదని ఆయన పరోక్షంగా గత ప్రభుత్వాలను విమర్శించారు. కానీ ప్రస్తుతం భారత్ దూసుకుపోయేందుకు తగిన సమయం వచ్చిందన్నారు. -
ఇంటి పేరు స్వేచ్ఛ
రాణీ లక్ష్మీబాయి నడిచిన నేల ఝాన్సీకి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది, ఆ అడవి. ఊర్చాహా అడవులంటారు. ఆ అడవి గుండా సతార్ నది ప్రవహిస్తూ ఉంటుంది. 1920 దశకం నాటి మాట... ఆ నది ఒడ్డునే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం దగ్గరగానే ఒక కుటీరం నిర్మించుకుని ఉండేవాడాయన. పేరు హరిశంకర్ బ్రహ్మచారి. ఆంజనేయస్వామికి వీరభక్తుడు. ఆ అడవులకు దగ్గరగా ఉన్న గ్రామం ధిమార్‌పురా, దాని చుట్టుపక్కల ఉన్న పల్లెలలోని పిల్లలకు ఆయన చదువు చెప్పేవాడు. కానీ వారెవరికీ తెలియకుండా మరొక పని కూడా చేసేవారు. కొండలలో తుపాకీ పేల్చడం నేర్చుకునేవాడాయన. అలాగే జబువా ప్రాంతంలో ఉన్న భిల్లుల దగ్గర విలువిద్య కూడా నేర్చుకునేవారు. ధిమార్‌పురా పేరును స్వాతంత్య్రం వచ్చిన తరువాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆజాద్పురా అని మార్చింది. ఆ హరిశంకర్ బ్రహ్మచారి జ్ఞాపకార్థమే ఆ ఊరి పేరు అలా మార్చారు. ఆయన ఎవరో కాదు, భారత స్వాతంత్య్రోద్యమ పోరాటంలో మహోన్నతంగా కనిపించే చంద్రశేఖర్ ఆజాద్. జలియన్‌వాలా బాగ్ దురంతం ఆనాటి పలువురు యువకులని ‘రక్తానికి రక్తం’ అన్న సిద్ధాంతం గురించి ఆలోచించేటట్టు చేసింది. మూడేళ్ల తరువాత జరిగిన మరొక పరిణామం కూడా ఎందరో భారతీయ యువకులను అదే ఆలోచన వైపు అనూహ్యంగా నెట్టివేసింది. గాంధీజీ 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని చౌరీచౌరా ఉదంతంతో ఆయనే హఠాత్తుగా నిలిపివేశారు. శాంతియుతంగా ఉద్యమం నిర్వహించగలిగినంత మానసిక సంస్కారం భారతీయులకు లేదని ప్రకటించి, చౌరీచౌరాలో మరణించిన పోలీసుల ఆత్మశాంతి కోసం నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ వైఖరే నాటి యువతరాన్ని కొత్త పుంతలు తొక్కేటట్టు చేసింది. జలియన్‌వాలాబాగ్ ఉదంతం గురించి విన్న తరువాత విప్లవోద్యమం వైపు ఆకర్షితుడైన చంద్రశేఖర్ ఆజాద్, మొదట్లో గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనాలని దృఢంగా ఆకాంక్షించారు. కానీ అ విప్లవ విధాత జీవితంలో అదొక చిన్న ఘట్టం. చిన్న దశ. నిజం చెప్పాలంటే ఆజాద్ అంతరంగమే ఒక విప్లవజ్వాల. బ్రిటిష్ జాతి మీద ద్వేషంతో ఆయన హృదయం దహించుకుపోతూ ఉండేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన తన పదిహేనవ ఏటనే తీవ్రవాదం వైపు మొగ్గారు. కానీ సహాయ నిరాకరణ ఉద్యమం ఆరంభంలో అందుకు అనుకూలంగా కొన్ని ఊరేగింపులు జరిగాయి. వారణాసిలో జరిగిన అలాంటి ప్రదర్శనలో పాల్గొన్న ఆజాద్‌ను పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశపెడితే న్యాయాధీశుడు అడిగాడు, ‘నీ పేరు?’ అని. మీసాలు కూడా సరిగా లేని ఆ కుర్రాడు చెప్పిన సమాధానానికి బహుశా ఆ నాయ్యా«ధీశుడు అదిరిపడి ఉండాలి. ఆ సమాధానమే– ‘నా పేరు స్వేచ్ఛ’ (ఆజాద్). నీ తండ్రి పేరేమిటి అంటే, ‘స్వాతంత్య్రం’ అన్నాడు. న్యాయమూర్తి 15 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. అప్పటి నుంచి ఆజాద్ ఆయన ఇంటిపేరయింది. ‘నీ రక్తం సలసల మరగకపోతే నీ నరాలలో ప్రవహిస్తున్నది నీరే అనుకోవాలి...’ అని ఆనాటి పరిస్థితిని చూసి ఆజాద్ భావించారు. జలియన్‌వాలాబాగ్ దురంతం గురించి తెలిసిన తరువాత రక్తం మండక తప్పదు కూడా. చంద్రశేఖర్ (తివారీ) ఆజాద్ (జూలై 23, 1906– ఫిబ్రవరి 27, 1931) ప్రస్తుత మధ్య ప్రదేశ్‌లోని భవ్రాలో పుట్టారు. వారి స్వస్థలం ఉత్తర పరగణాలలోని (ఉత్తరప్రదేశ్) బదర్కా గ్రామం. తండ్రి పండిట్ సీతారామ్ తివారీ, తల్లి జగరాణీదేవి. తల్లి పట్టుదల మేరకు చంద్రశేఖర్ ఆజాద్ సంస్కృత విద్య కోసం కాశీ విద్యాపీఠంలో చేరేందుకు వారణాసి వెళ్లారు. సంస్కృత విద్య వారి ఇంటి సంప్రదాయం. ఆయన మొదట హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) కార్యకలాపాలలో పాల్గొనడం ప్రారంభించారు. ఈ సంస్థను 1924లో రామ్‌ప్రసాద్ బిస్మిల్, యోగేశ్చంద్ర ఛటర్జీ, శచీంద్రనాథ్ సన్యాల్, శచీంద్రనాథ్ బక్షీ, నరేంద్ర మోహన్ సేన్, ప్రతుల్ గంగూలీ బెంగాల్‌లోని బోలాచాంగ్ అనే గ్రామంలో ఆరంభించారు. ప్రణవేశ్ ఛటర్జీ అనే ఉద్యమకారుడి సాయంతో ఆజాద్ రామ్‌ప్రసాద్‌ను కలుసుకుని, హెచ్ఆర్ఏలో సభ్యుడయ్యారు. భారతదేశంలోని ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్య గణతంత్ర దేశంగా నిర్మించడం ఈ సంస్థ ఆశయం. ఈ ఆశయ సాధనలో మొదటి మెట్టు బ్రిటిష్ పాలనను నిర్మూలించడమే. ఇందుకు సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మారు.అందుకు అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతావని సోషలిస్టు దేశంగా ఉండాలని వారు ఆనాడే స్వప్నించడం ఒక అద్భుతం. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ వీరికి ప్రేరణ అని ఒక వాదన ఉంది. అలాగే హెచ్ఆర్ఏ ఆనాడు బెంగాల్లో ఎంతో తీవ్రంగా పనిచేసిన తీవ్ర జాతీయ వాద రహస్య సంస్థ అనుశీలన సమితికి అనుబంధ సంస్థే. గదర్ పార్టీ తరువాత బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిన సంస్థలలో ఇది కూడా ఒకటి. సహాయ నిరాకరణోద్యమాన్ని రద్దు చేస్తూ గాంధీజీ తీసుకున్న నిర్ణయం ఒక శరాఘాతం కాగా, ఆయన అహింస చాలామంది యువకులకు నిరుత్సాహం కలిగించింది. అలాంటి ఒక సందిగ్ధ దశలో జనించినదే హెచ్ఆర్ఏ. బ్రిటిష్‌జాతి వంటి ఒక నిరంకుశ సమూహం నుంచి స్వాతంత్య్రం పొందాలంటే అహింసా పథంలో సాగితే ఎంతమాత్రం సాధ్యంకాదని నమ్మినవారంతా తీవ్రవాద కార్యకలాపాలను ఆశ్రయించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకోవడం ఒక్కటే వారికి కావాలి. బ్రిటిష్ జాతి నుంచి భారతదేశాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విముక్తం చేయడం వారి ఆశయం. అది సాయుధ పోరుతోనే సాధ్యమని కూడా వారు నమ్మారు. పైగా నాటి ప్రపంచంలో చాలాచోట్ల ర్యాడికల్ ఉద్యమాలు కూడా వీరికి ప్రేరణ ఇచ్చాయి. తన ఉద్యమానికి ఆయుధాలు సమకూర్చుకోవడానికి అవసరమైన నిధుల కోసం హెచ్ఆర్ఏ చేసిన ఒక ప్రయత్నం చరిత్రలో నిలిచిపోయింది. అదే కకోరి రైలు దోపిడీ. దీనినే కకోరి కుట్ర కేసుగా చెబుతారు. ఆగస్టు 9, 1925న ఈ ఘటన జరిగింది. షాజహాన్‌పూర్ నుంచి లక్నో వచ్చే ఎనిమిదో నెంబర్ డౌన్ రైలులో రూ. 8,000 తీసుకువెళుతున్న సంగతి వీరికి తెలిసింది. ఈ డబ్బును లూటీ చేయడానికి పథకం పన్నారు. ఈ పథకాన్ని రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్, శచీంద్ర బక్షీ, కేశబ్ చక్రవర్తి, మన్మథ్‌నాథ్ గుప్తా, మురారీలాల్ (అసలు పేరు మురళీలాల్ ఖన్నా), ముకుందీలాల్ (ముకుందీలాల్ గుప్తా), భన్వరీలాల్ అమలు చేశారు. ఆ రైలు లక్నోకు సమీపంలోని కకోరీ చేరగానే చైన్ లాగి, గార్డును బెదిరించి అతడి కేబిన్‌లో ఉన్న డబ్బును తీసుకుని వారు అదృశ్యమయ్యారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఒక ప్రయాణికుడు చనిపోయాడు. దీనితో లూటీ, హత్య కింద కేసు నమోదు చేసి, బ్రిటిష్ ప్రభుత్వం అక్షరాలా హెచ్ఆర్ఏ సభ్యుల కోసం పరమ క్రూరంగా వేట సాగించింది. కకోరి కేసులో దేశమంతా వెతికి మొత్తం నలభయ్ మందిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత వారిలో పదిహేను మందిని వదిలి పెట్టారు. రామ్‌ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్‌సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి, అష్ఫఖుల్లాఖాన్లకు న్యాయస్థానం ఉరి శిక్ష వేసింది. కొందరికి అండమాన్ ప్రవాసం విధించారు. ఇంకొందరకి యావజ్జీవం విధించారు. కానీ ఆజాద్‌తో పాటు ఇంకొందరు దొరకలేదు. ఆ తరువాత హెచ్ఆర్ఏ చెల్లాచెదరయిపోయింది. అప్పుడే ఆజాద్ ఆ సంస్థనే హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ పేరుతో పునరుద్ధరించారు. ఎన్నో కష్టాలు, అనేక ప్రయత్నాల తరువాత ఆజాద్ కాన్పూరును తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. 1928 నాటికి ఇది సాధ్యమైంది. అక్కడ ఉండగానే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, గణేశ్ శంకర్ విద్యార్థి వంటివారు ఆయన మార్గదర్శకత్వంలో నడిచారు. దీని తరువాత సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్న లాలా లజపతిరాయ్ మీద లాఠీని ప్రయోగించమని ఆదేశించిన స్కాట్‌ను హత్య చేయాలని హెచ్ఎస్ఆర్ఏ నిర్ణయించింది. భగత్‌సింగ్ తదితరులతో కలసి ఆజాద్ కూడా పాల్గొన్నారు. లాహోర్‌లో అతడిని హత్య చేయదలచుకుని స్కాట్ ఉన్నాడని భావించిన వాహనం మీద బాంబు విసిరారు. కానీ అందులో స్కాట్ లేడు. కానీ సాండర్స్ అనే మరొక పోలీసు అధికారి ఉన్నాడు. అతడు చనిపోయాడు. అంతకు ముందే వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలును పేల్చివేయడానికి కూడా ఆజాద్ నాయకత్వంలో ఒక ప్రయత్నం జరిగింది. 1931 ఫిబ్రవరిలో ఆజాద్ సీతాపూర్ కారాగారానికి వెళ్లారు. కకోరి కుట్ర కేసులో ఉన్నవారితో పాటు, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను విడిపించడం గురించి గణేశ్‌శంకర్ విద్యార్థితో మాట్లాడడానికి వెళ్లారాయన.గణేశ్‌శంకర్ ఒక సలహా ఇచ్చారు. త్వరలోనే జరగబోయే గాంధీ–ఇర్విన్ చర్చలలో ఈ అంశం గురించి గాంధీ ద్వారా ఒత్తిడి తేవాలి. ఆ విషయం పండిట్ నెహ్రూ ద్వారా గాంధీకి చెప్పించాలి. ఇది గణేశ్ శంకర్ సలహా.ఆ మేరకే ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం అలహాబాద్ వెళ్లి ఆనందభవన్లో నెహ్రూను ఆజాద్ కలుసుకున్నారు. ఆజాద్ ప్రతిపాదనను నెహ్రూ అంగీకరించలేదు. అంతేకాదు, ఆనందభవన్ నుంచి వెంటనే వెళ్లిపొమ్మని కూడా చెప్పాడు. ఉగ్రుడైన ఆజాద్ అల్ఫ్రెడ్ పార్క్‌కు సైకిల్ మీద వచ్చారు. ఒక చెట్టు కింద తన సహచరులలో ఒకడైన సుఖదేవ్రాజ్తో (భగత్‌సింగ్‌తో కలసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు వేసిన సుఖదేవ్ కాదు) చర్చిస్తున్నారు. ఆజాద్ అక్కడ ఉన్న సంగతి పోలీసులకు ఎవరో సమాచారం అందించారు. మొదట పోలీస్ సూపరింటెండెంట్ బిశ్వేశ్వర్సింగ్, ఎస్ఎస్పి (సీఐడీ) నాట్ బోవర్ పార్కులోకి చొరబడ్డారు. ఆజాద్ కేసి తర్జని చూపుతూ బిశ్వేశ్వర్కి ఏదో చెబుతుండగానే ఆజాద్ గమనించారు. తన జేబులోని రివాల్వర్ తీసి కాల్చారు. సరిగ్గా గుండు వెళ్లి బోవర్ కుడి మణికట్టులో దిగింది. దీనితో బిశ్వేశ్వర్ తిట్లు లంఘించుకున్నాడు. దీనితో అతడి నోటి కేసి గురి పెట్టి మళ్లీ కాల్చాడు ఆజాద్. అతడి పళ్లు పగిలిపోయాయి. అయితే అంతలోనే అక్కడికి బలగాలు చేరుకుని చుట్టూ మోహరించడం కనిపించింది. కాల్పులు మొదలయ్యాయి. ఒక గుండు వచ్చి ఆజాద్ తొడలో దిగిపోయింది. కదలడం సాధ్యంకానంత గాయం. వెంటనే సుఖదేవ్రాజ్ను తప్పించుకోమని చెప్పి, అతడు తప్పించుకున్న సంగతి రూఢి అయిన తరువాత రివాల్వర్ కణతకు పెట్టుకుని కాల్చుకున్నాడాయన. తూటాలతో పోరాడతాం కానీ పోలీసులకు పట్టుబడే ప్రశ్నే లేదంటూ ఉద్యమకారునిగా జీవితం ఆరంభించిన నాడే ప్రతిజ్ఞ చేసిన ఆజాద్ అదే విధంగా పోలీసులు తనను సమీపిస్తుండగానే బలవన్మరణానికి పాల్పడ్డారు. స్వేచ్ఛను ఇంటి పేరు చేసుకోగలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు మరే దేశ చరిత్రలో అయినా కనిపిస్తాడా? - డా. గోపరాజు నారాయణరావు -
స్వరాజ్యాన్ని సంపూర్ణం చేసినవాడు....
భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే క్రమంలో ఎన్నో చర్చలు జరిగాయి. ‘స్వరాజ్యం గురించి చర్చలంటూ జరిగితే ఇకపై అందులో పాల్గొనేవి భారత జాతీయ కాంగ్రెస్, బ్రిటిష్ ప్రభుత్వాలలే కాదు. మూడో పక్షం కూడా ఉంది– అది ముస్లిం లీగ్’ అన్నాడు జిన్నా. నిజానికి ముస్లింలీగ్ వైఖరి, పెచ్చరిల్లిన మత హింస, అది అంతర్యుద్ధానికి దారి తీస్తుందన్న అనుమానాలు నాటి చాలా పరిణామాలను ప్రభావితం చేశాయి, తొందరపెట్టాయి. స్వాతంత్య్రం, దేశ విభజన అంశాల మీద ప్రతిష్టంభన ఏర్పడడానికి కారణం కూడా అవే. ఈ దశలోనే కాంగ్రెస్, లీగ్, ప్రభుత్వంతో పాటు నాలుగో భాగస్వామి ఉందన్న సంగతి ఇంగ్లిష్ జాతి మహా మేధస్సుకు తట్టింది. ఆ భాగస్వామి – స్వదేశీ సంస్థానాలు. ఆఖరి వైస్రాయ్ మౌంట్‌బాటన్ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన చర్చలలో నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ, బల్దేవ్సింగ్; జిన్నా, లియాఖత్ అలీ ఖాన్, నిష్తార్ వంటివారు ఉన్నారు (గాంధీజీ పాత్ర తక్కువే). అంతకు ముందు తేజ్ బహదూర్ సప్రూ, మోతీలాల్ వంటివారు చర్చలలో పాల్గొనేవారు. వీరందరితో పాటు మరొక పేరు కూడా చరిత్రలో ప్రముఖంగా ఉండాలని అనిపిస్తుంది. ఆయన వీపీ మేనన్. భారత్, పాకిస్తాన్ పేరుతో స్వతంత్ర ప్రతిపత్తి కల రెండు భూభాగాలుగా అఖండ∙భారత్‌ను విభజించడమే ప్రతిష్టంభనకు పరిష్కారమని మౌంట్‌బాటన్‌కు, నెహ్రూకు చెప్పినవారే మేనన్. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అఖండ భారత్‌ను ఖండఖండాలుగా చీల్చి వెళ్లాలని అనుకుంది. 562 స్వదేశీ సంస్థానాలకు సంపూర్ణ స్వాతంత్య్రం ఇస్తూ, భారత్, పాక్‌లను ఏర్పాటు చేస్తూ విభజన ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఇదెంత ఘోర తప్పిదమో మేనన్‌కు తెలుసు. సంస్థానాలను స్వాతంత్య్రం వచ్చే నాటికే భారత్‌లో అంతర్భాగం చేస్తేనే ఆ చారిత్రక తప్పిదాన్ని సవరించగలమని మొదట గుర్తించినదీ ఆయనే. పటేల్ చొరవ, మేనన్ చాకచక్యం వల్ల మూడు మినహా మిగిలిన సంస్థానాలన్నీ భారత్‌లో విలీనమైనాయి. ఇదే జరగకపోతే, 562 సంస్థానాలతో రాజకీయ ఏకత్వం లేక ఈ దేశం తల్లడిల్లేది. అవి కొనసాగి ఉంటే ఎన్ని అంతర్యుద్ధాలు జరిగి ఉండేవో! ఎన్ని దేశాలు జోక్యం చేసుకునేవో! సాంస్కృతిక ఏకత్వాన్ని రాజకీయ ఏకత్వంతో పరిపూర్ణం చేయాలన్న స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాన్ని అలా పటేల్, మేనన్ గౌరవించారు. దేశాన్ని అంతర్యుద్ధం బెడద నుంచి బారి నుంచి రక్షించారు. వాపాళ్ పంగుణ్ణి మేనన్ (సెప్టెంబర్ 30, 1893–డిసెంబర్ 31, 1965) కేరళలోని కోథాకురస్సి (మలబార్) అనే గ్రామంలో పుట్టారు. ఒక బంధువు సాయంతో 1914లో సిమ్లా వెళ్లి ప్రభుత్వోద్యోగంలో చేరారు. అది కూడా హోం శాఖలో సహాయకునిగా. తరువాత సంస్కరణల విభాగానికి పంపించారు. చివరి ముగ్గురు వైస్రాయ్‌లు లిన్లిత్గో (1936–1943), వేవెల్ (1943–1947), మౌంట్‌బాటన్ (1947–1948) దగ్గర ఆయన రాజకీయ సంస్కరణల కమిషనర్‌గా పనిచేశారు. ఆ ముగ్గురూ మేనన్ మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. 1942లో సంస్కరణల కమిషనర్ హెచ్‌వి హడ్సన్ వెళ్లిపోయిన తరువాత ఆ పదవిలో భారతీయుడిని నియమించడానికి ఇంగ్లండ్ మీనమేషాలు లెక్కపెట్టింది. కానీ లిన్లిత్గో మేనన్‌ను ఆ పదవికి ఎంపిక చేశారు. స్వాతంత్య్రం గురించి, భారత్‌కు చెందిన ఇతర అంశాలను చర్చించడానికి వేవెల్ ఇంగ్లండ్ వెళ్లినప్పుడల్లా మేనన్‌ను తీసుకువెళ్లేవాడు. మౌంట్‌బాటన్ మేనన్‌ను రాజ్యాంగ సలహాదారుగా నియమించారు. మౌంట్‌బాటన్ సొంత బృందంలో మేనన్ ఒక్కరే భారతీయుడు. మిగిలిన ఇస్మే, కాంప్‌బెల్ వంటి వారందరినీ ఆయన ఇంగ్లండ్ నుంచి తెచ్చుకున్నారు. సిమ్లా సమావేశాల (1945–46)కు మేనన్ సహాయ కార్యదర్శి. మౌంట్‌బాటన్, మేనన్ చర్చించుకునే సమయంలో సంస్థానాలకు స్వాతంత్య్రం ఇవ్వాలన్న మాట వచ్చింది. దీనితో మేనన్ అదే మీ అభిప్రాయమైతే నేను పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఇది తెలిసిన ఎడ్వినా మౌంట్‌బాటన్ కలగచేసుకుని మేనన్‌ను వారించారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం ఆ మహా చారిత్రక తప్పిదం చేసింది. అందులో శ్వేతజాతికి లెక్కకు మించి దురుద్దేశాలు ఉన్నాయి. 1947 ఆగస్టులో స్వాతంత్య్రం వస్తుందనగానే, జూన్ నుంచే పటేల్, మేనన్ సంస్థానాల విలీనం పని ఆరంభించారు. కశ్మీర్‌ది ఒక రకం సమస్య. నిజాం పాక్ వైపు మొగ్గాడు. తన దూతని పాక్‌కు పంపాడు. తిరువాన్కూర్కు స్వతంత్రంగా ఉండాలని ఆశ. ఇది ఫ్రాన్స్‌లో రాయబారిని నియమించేసింది. జునాగఢ్ (గుజరాత్) నవాబు పాక్‌లో చేరతానన్నాడు. తిరుగుబాటు వచ్చింది. తరువాత భారత్‌లో విలీనం చేశారు. జో«ద్‌పూర్ రాజా కూడా పాక్‌లో చేరతానన్నాడు. అతడిని కూడా లొంగదీశారు. కశ్మీర్ అంశాన్ని నెహ్రూ తన చేతుల్లోకి తీసుకున్నారు. నిజాం వివాదాన్ని కూడా నెహ్రూ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలికి నివేదించాలనే అనుకున్నారు. అక్కడి పరిస్థితులను చక్క దిద్దడానికి సైన్యాన్ని పంపించాలన్న సర్దార్ పటేల్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితులలో ఒకే ఒక్క లేఖ నెహ్రూ చేతనే వాళ్లకి (రజాకార్లకి) గుణపాఠం చెప్పాల్సిందే అనిపించేటట్టు చేసింది. ఈ ఘట్టం మొత్తం ఎం కె కె నాయర్ (ఐఏఎస్ అధికారి) రాసిన (మలయాళంలో రాశారు. తరువాత ఆంగ్లంలోకి వచ్చింది) ‘ది స్టోరీ ఆఫ్ యాన్ ఎరా టోల్డ్ వితౌట్ ఇల్ విల్’ పుస్తకంలో ఉంది. బీజేపీ అగ్రనేత ఎల్‌కె అడ్వాణీ దీనిని కష్టపడి సేకరించి తన బ్లాగ్‌లో వివరించారు (నవంబర్ 5, 2013). ఇక్కడ తెలుస్తుంది– మేనన్ ముగ్గురు వైస్రాయ్‌ల దగ్గర పని చేసినా తన జాతీయతా భావాన్ని ఎంత పదిలంగా ఉంచుకున్నారో! నాయర్ ఇలా రాశారు: ‘ఏప్రిల్ 30, 1948న హైదరాబాద్ నుంచి మొత్తం భారత సైన్యం వైదొలగింది. తరువాత రజ్వి, రజాకార్లు సకల నీతినియమాలకు స్వస్తి పలికి సంస్థానమంతా స్వైర విహారం చేశారు. మౌంట్‌బాటన్ నిష్క్రమించడÆ , రాజాజీ గవర్నర్ జనరల్ కావడం అప్పుడే జరిగాయి. నెహ్రూ, పటేల్, రాజాజీలకు హైదరాబాద్ పరిస్థితి పూర్తిగా తెలుసు. నిజాం విపరీత ధోరణులకి స్వస్తి పలకాలంటే సైన్యాన్ని పంపించాల్సిందేనని పటేల్ నమ్మకం. అప్పటికే నిజాం పాకిస్తాన్‌కు తన దూతను పంపించాడు. లండన్ బ్యాంకులోని తన ప్రభుత్వ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో నగదు కూడా బదలీ చేయించాడు. సర్దార్ పటేల్ ఈ విషయాలన్నీ మంత్రిమండలి సమావేశంలో ప్రస్తావించి, హైదరాబాద్‌లో సాగుతున్న భీతావహ పాలనకు అంతం పలకడానికి సైన్యాన్ని పంపించాలని కోరారు. సాధారణంగా నెమ్మదిగా, ప్రశాంతంగా, అంతర్జాతీయ మర్యాదలు పాటిస్తూ మాట్లాడే నెహ్రూ అవన్నీ విడిచి పెట్టేసి, ‘మీరొక పూర్తి మతతత్వవాది. మీ సిఫారసులను నేను ఏనాటికీ ఆమోదించను’ అన్నారు. పటేల్ ఏ భావమూ వ్యక్తం చేయకుండానే వెళ్లిపోయారు.’ హైదరాబాద్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దీనికి ఒక పరిష్కారం చూడడంతో పాటు, నెహ్రూ, పటేల్ నడుమ సయోధ్యను కూడా సాధించాలని రాజాజీ భావించారు. రాజాజీ మొదట మేనన్తోనే సంప్రతించారు. సైన్యం సిద్ధంగానే ఉందనీ, ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే హైదరాబాద్‌కు బయలుదేరగలదని సమాచారం ఇచ్చారు మేనన్. నెహ్రూ, పటేల్ ఇద్దరినీ మరునాడు వైస్రాయ్ హౌస్‌కు (నేటి రాష్ట్రపతి భవన్) రావలసిందని రాజాజీ ఆహ్వానించారు. మేనన్‌ను కూడా ఆహ్వానించారు. మేనన్ రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరుతుండగా హోం శాఖ కార్యదర్శి బచ్ వచ్చి ఒక లేఖ ఇచ్చాడు. అది బ్రిటిష్ హైకమిషనర్ ఇచ్చినది. దానిని నేరుగా రాజాజీకి ఇచ్చారు మేనన్. ఇద్దరూ చూశారు. లేఖను తన దగ్గరే పెట్టుకున్నారు రాజాజీ. సమావేశంలో రాజాజీ నిజాం సంస్థానం పరిస్థితిని వివరించారు. దేశ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నెహ్రూ తనదైన శైలిలో అలా చేస్తే అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని బరువైన మాటలతో చెప్పారు. అప్పుడే మేనన్ తెచ్చిన లేఖను నెహ్రూ ముందు పెట్టారు రాజాజీ. నెహ్రూ ముఖం కందగడ్డ అయింది. బట్టతల మీద నరాలు ఉబ్బాయి, కోపం వల్ల. కుర్చీలో నుంచి లేచి, ఎదురుగా బల్లను గుద్ది ‘ఒక్క క్షణం కూడా వృథా చేయవద్దు. వాళ్లకి గుణపాఠం చెప్పాల్సిందే’ అని అరిచారు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏం ఉంది? అప్పటికి రెండురోజుల క్రితమే ఆ సంస్థానంలో పనిచేసే ఇద్దరు క్రైస్తవ సన్యాసినుల మీద రజాకార్లు లైంగిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఒక కాన్వెంట్లో పనిచేస్తున్న ఆ నన్స్ డబ్బయ్ ఏళ్లవాళ్లు. ఇందుకు బ్రిటిష్ హై కమిషనర్ నిరసన ప్రకటిస్తూ రాసిన లేఖ అది. పథకం ప్రకారం సైన్యాన్ని పంపించవలసిందని కమాండర్ ఇన్ చీఫ్‌కు సమాచారం ఇవ్వమని ఆ క్షణంలోనే రాజాజీ మేనన్‌ను ఆదేశించారు. కథ ఇక్కడితో అయిపోలేదు. అప్పటికి భారత్‌కు, పాక్‌కు ఇంగ్లిష్ సైనిక కమాండర్లే ఉన్నారు. పైగా సమాచారం చేరవేసుకునేవాళ్లు. అలాంటి వాళ్లు ఉండగా ఈ ‘ఆపరేషన్’ (పోలో) ఎలా? అప్పుడు భారత కమాండర్ బూషర్. పాక్ సైన్యాధిపతికి కూడా అక్కడి రాజకీయ నాయకుల వలెనే భారత నేతలంటే పగ. మేనన్ ఆదేశం గురించి బూషెర్ రాజేంద్ర సింగ్‌కు చెప్పారు. రాజేంద్రసింగ్ జనరల్ చౌదరికి తెలియచేశారు. మూడు రోజులే సమయం. ఆ మరునాటి రాత్రే బూషెర్ పాక్ కమాండర్‌తో మాట్లాడాడు. ఆ మరునాడు ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయని అడుగుతూ మేనన్ బూషెర్ గదికి వెళ్లారు. ఏర్పాట్ల గురించి చెప్పబోయాడు బూషెర్. ‘అవన్నీ నాకు తెలుసు, నేను వచ్చింది అవి తెలుసుకోవడానికి కూడా కాదు. ఒకమాట చెప్పు. నిన్న రాత్రి నీవు పాక్ కమాండర్‌తో మాట్లాడావు కదా!’ అని నేరుగా అడిగారు మేనన్. బూషెర్ ముఖం పాలిపోయింది. ‘మేనన్! మిత్రులు వాళ్లలో వాళ్లు మాట్లాడుకోకూడదని చెప్పదలిచావా?’ అన్నాడు బూషెర్. ‘దానిని మిత్రుల మధ్య సంభాషణే అంటారా?’ మేనన్ తిరిగి అడిగారు. ‘అయితే శంకిస్తున్నావా?’ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అన్నాడు బూషెర్. ‘మరి.. ఫ్రెంచ్‌లో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది?’ రెట్టించారు మేనన్. ‘ ఇంతకీ ఆ సంభాషణ మిత్రుల మధ్య మాటా మంతి అనే అంటావా?’ అడిగారు మేనన్. ‘అదే!’ అన్నాడు గడుసుగా బూషర్. అప్పుడే ఒక పత్రాన్ని తీసి బూషెర్కి ఇచ్చారు మేనన్. ఆ ఇద్దరు ఫ్రెంచ్‌లో జరిపిన సంభాషణకి ఆంగ్లానువాదమది. ఇదీ అసలు సంభాషణ:బూషెర్: ఈ రాత్రికి హైదరాబాద్ మీద దాడి మొదలవుతోంది. ఎక్కువ రోజులేమీ తీసుకోదు. ఏదైనా చేయాలనుకుంటే సరైన పద్ధతిలో చేయండి!’ పాకిస్తాన్ కమాండర్: కృతజ్ఞతలు. ఇది లియాఖత్ అలీఖాన్‌కి చేరవేస్తాను. జిన్నా తుది క్షణాలు లెక్కిస్తున్నారు.....అప్పుడు భేషజమంతా విడిచి పెట్టి, ‘నేను తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు వీపీ!’ అన్నాడు చెమటలు పట్టేసిన బూషెర్. బూషెర్ దగ్గర నుంచి ఒక పత్రం వెంటనే తీసుకున్నారు మేనన్. ‘వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నాను. దీనిని వెంటనే ఆమోదించవలసింది.’ అంటే రాజీనామా. వెంటనే జనరల్ కరియప్ప భారత సైనిక దళాల ప్రధానాధికారి అయ్యారు. సంస్థానాల విలీనంలో ఇలాంటి ఎన్నో సామదానభేద దండోపాయాలను మేనన్ ప్రయోగించారు. భారత రాజ్యాంగం, సంస్థానాల విలీనం, రాజకీయ సంస్కరణల మీద తనకున్న లోతైన అవగాహనతో మేనన్ చాలా రచనలు చేశారు. వాటిలో ‘టాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా’, ‘ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్’, యాన్ ఔట్‌లైన్ ఆఫ్ ఇండియన్ కానిస్టిట్యూషనల్ హిస్టరీ’ పుస్తకాలు ఇప్పటికీ విలువను కోల్పోకుండా ఉన్నాయి. స్వాతంత్య్రం రావడానికి ముందే ఇంతటి నిర్మాణాత్మకమైన పని చేసిన మేనన్ పటేల్ మరణంతోనే ఒక్కసారిగా తెరమరుగైపోయారు. - డా. గోపరాజు నారాయణరావు -
ఈ దేశపటం.. పటేల్ ఆత్మ
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అకుంఠిత దీక్షతో సంస్థానాలను విలీనం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను (అక్టోబర్ 31, 1875–డిసెంబర్ 16, 1950) ‘ఇండియన్ బిస్మార్క్’గా పిలవడం మొదలయింది. అలాగే సర్దార్‌ను కూడా ఉక్కుమనిషి అనే పిలవడం పరిపాటి. పటేల్ గొప్ప భూమిపుత్రుడు. గుజరాత్‌లోని నాదియాడ్లో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. తండ్రి జవేర్భాయ్ పటేల్, మొదట ఝాన్సీ సంస్థానంలో సైనికుడు. తరువాత రైతు. తల్లి లాడ్‌బాయ్. దైవభక్తురాలు. వల్లభ్‌భాయ్ తన తండ్రితో కలసి పొలంలో దిగి పని చేసినవారు. చిత్రం ఏమిటంటే ఆయన తన 22వ ఏట మెట్రిక్ ఉత్తీర్ణులయ్యారు. మరో పదేళ్లకు 1910లో ఇంగ్లండ్ వెళ్లారు. పటేల్ టెంపుల్ టౌన్లో బారెట్లాలో చేరారు. అదే సంవత్సరం ఇన్నర్ టెంపుల్ ఇన్‌లో బారెట్లాలో చేరారు మరొక భారతీయుడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ. కానీ వయసులో ఇద్దరికీ ఎంతో తేడా. పటేల్ పెట్లాండ్, నాదియాడ్, బోర్సాద్ల నుంచి వస్తే, నెహ్రూ హేరో, కేంబ్రిడ్జ్లలో చదివి ఇన్నర్ టెంపుల్ వెళ్లారు. పటేల్ 26 మాసాల కోర్సును 20 మాసాలలోనే పూర్తి చేశారు. అన్ని పరీక్షలు ఒకేసారి ఉత్తీర్ణుడైనందుకు ఇచ్చే 50 పౌండ్ల బహుమానం కూడా అందుకున్నారు. 1913లో భారత్‌కు తిరిగి వచ్చి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కానీ ఆ రోజుల్లో బొంబాయి బారిస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండేది. తను బొంబాయి ప్రెసిడెన్సీ వాడే అయినా బొంబాయిని ఆయన ఎంచుకోలేదు. తన స్వస్థలం గుజరాత్‌లోనే అహమ్మదాబాద్‌ను ఎంచుకున్నారు. గోధ్రా, బోర్సాద్లలో కూడా పనిచేశారు. 1916కే చాలా ఖరీదైన న్యాయవాదిగా అవతరించారు. గాంధీజీకి కుడిభుజం అనదగిన పటేల్ తొలి రోజులలో ఆయన సిద్ధాంతాల పట్ల ఎలాంటి మక్కువ చూపలేదు. 1915లో గాంధీజీ అహమ్మదాబాద్ వచ్చారు. కొచ్రాబ్‌లో ఆశ్రమాన్ని నెలకొల్పారు. చాలామంది యువ లాయర్లతో పాటు, ఇతరులు కూడా ఆయన చుట్టూ ఉండేవారు. అహింస, గాంధీజీ చెప్పే జీవన విధానం ఇవన్నీ పటేల్‌ను అప్పుడు ఆకర్షించలేకపోయాయి. కానీ ఒక మిత్రుని సలహా మేరకు మొత్తానికి గాంధీని చూడడానికి వెళ్లారు పటేల్. అంత సాన్నిహిత్యం అనుభవించినా కూడా పటేల్ వెంటనే గాంధీని అనుసరించలేదు. 1916లో గుజరాత్ సభ, అంటే జాతీయ కాంగ్రెస్ గుజరాత్ శాఖ– బాంబే ప్రెసిడెన్సీ కాంగ్రెస్ సభలు నిర్వహించింది. అతివాదులు, మితవాదులు చాలాకాలం తరువాత ఆ వేదిక మీద పక్కపక్కనే ఆసీనులయ్యారు. గుజరాత్‌కు చెందినవానిగా మహమ్మద్ అలీ జిన్నా ఆ సభలకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సభలు కూడా పటేల్‌ను కదిలించలేదు. చరిత్రాత్మకం అని అంతా చెబుతున్న లక్నో సమావేశాలకు కూడా పటేల్ వెళ్లారు. నచ్చలేదు. ఆఖరికి 1917లో ఆ శుభ ముహూర్తం వచ్చింది. గుజరాత్ సభ మరోసారి ప్రెసిడెన్సీ స్థాయి సమావేశాలు నిర్వహించింది. ఇంగ్లిష్‌లో కాకుండా, మాతృభాషలో అంటే గుజరాతీలో ఉపన్యసించవలసిందిగా గాంధీజీ వక్తలను కోరారు. జిన్నాకు ఇంగ్లిష్ తప్ప తన మాతృభాష గుజరాతీ కూడా రాదు. విఠల్‌భాయ్ పటేల్ (సర్దార్ అన్నగారు) గుజరాతీలో తడబడుతూ మాట్లాడారు. ఇదే తొలిసారిగా గాంధీగారి పట్ల పటేల్‌కు గౌరవ భావాన్ని కలిగించింది. అంటే గాంధీజీ అహింసా సిద్ధాంతం కాదు, ఆయన పోరాట పంథా కాదు... గుజరాతీ మీద, మాతృభాషల మీద గాంధీజీ ప్రకటించిన గౌరవమర్యాదలే పటేల్‌ను కదిలించాయి. మరి ఆయన గొప్ప భూమిపుత్రుడు కాదా! పటేల్ ఇంగ్లండ్‌లో చదువుతున్నప్పుడు కూడా భారతీయులను ఏమన్నా అంటే సహించేవారు కాదు. స్వరాజ్య ఉద్యమం అనేక పాయలతో సాగింది. అందులో రైతాంగ పోరాటాలు కూడా భాగమే. గాంధీ తొలిదశలో రైతాంగ ఉద్యమాలే నడిపారు. తరువాత పూర్తి స్థాయి రాజకీయోద్యమం వైపు మొగ్గారు. పటేల్ ప్రయాణం కూడా అలా సాగిందే. ఇది కూడా గాంధీ పట్ల పటేల్ గౌరవాన్ని పెంచింది. ఆగస్టు 15, 1947న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ ఘడియలు గర్వించదగినవా? అంతకు ముందు దాదాపు సంవత్సరం పాటు భారతభూమి నెత్తురుతో తడియని రోజు లేదంటే అతిశయోక్తి లేదు. ముస్లింలీగ్ ఆవేశం ముందు గాంధీజీ అహింస కకావికలైంది. దేశంగా రెండుగా చీలిపోవడం అతి పెద్ద విషాదం. ముస్లింలీగ్ రక్తదాహం ఫలితమే అది. అహింసాయు పంథాలో స్వరాజ్యం సాధించిన దేశమన్న కీర్తి కిరణం మాటున ఈ రక్తపాతం అప్పటికి కనుమరుగైంది. కానీ తరువాత తెలిసింది– అధికార మార్పిడి సమయంలో మరే ఇతర దేశంలోను ఇంతటి రక్తపాతం జరగలేదన్న వాస్తవం. అప్పటిదాకా ఉక్కుపాదంతో భారతదేశాన్ని తమ అధీనంలో ఉంచుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఇంతటి హింసను, రక్తపాతాన్ని, దోపిడీని, లూటీని, మానభంగాలను మౌన ప్రేక్షకునిగా వీక్షించింది. ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలో భారత తాత్కాలిక ప్రభుత్వంలో సర్దార్ పటేల్ హోంశాఖను నిర్వహిస్తున్నారు. నెహ్రూ ప్రధాని. పైగా ప్రధాని పదవికి నెహ్రూ కంటే పటేల్ పట్లే పార్టీలో ఎక్కువ మొగ్గు ఉండేది. గాంధీ మాటను బట్టి పటేల్ ప్రధాని పదవి పోటీ నుంచి వెనక్కు తగ్గారు. నిరాశ పడలేదు. పైగా స్వతంత్ర భారతం పట్ల తనకున్న బాధ్యతను భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేటంత గొప్పగా నిర్వర్తించారు. ఆ కర్తవ్యమే – సంస్థానాల విలీనం. ఆనాడు దేశంలో 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఇవి ఈ దేశంలో అంతర్భాగాలైనప్పటికీ పూర్తి స్వాతంత్య్రం ఇచ్చింది మౌంట్‌బాటన్ విభజన ప్రణాళిక. అది కూడా ఎలాంటి స్వాతంత్య్రం? ఇటు భారత్‌లో విలీనమయ్యే స్వేచ్ఛ, అటు పాకిస్తాన్లో చేరే వెసులుబాటు కూడా 1947, జూన్ 3 నాటి ఆ విభజన ప్రణాళిక కట్టబెట్టింది. సాంస్కృతిక ఏకత్వంతో పాటు రాజకీయ ఏకత్వం కూడా సాధించాలనీ, పాలనాపరంగా ఒకే ఛత్రం కింద దేశం ఉండాలన్న స్వరాజ్య సమరయోధుల ఆశలకి భంగపాటు కలిగించే నిర్ణయమది. నిజంగానే స్వాతంత్య్రం పోరాట స్ఫూర్తిని కాపాడడానికి స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన తొలి కార్యక్రమం సంస్థానాల విలీనం. ఆ పని పటేల్ చేశారు. విలీనాల చరిత్రను గుర్తు చేసుకునే సమయంలో పటేల్‌తో పాటే మరో మహోన్నత వ్యక్తిని కూడా తలుచుకోవాలి. ఆయన వీపీ మేనన్. 1947లో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వంలో పటేల్ హోంమంత్రి, ఉపప్రధాని. వీటితో పాటు సంస్థానాల విలీనం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆయన చేతికి వచ్చింది. గాంధీ, నెహ్రూల అభిమతం కూడా ఇదే. ఆఖరి ఆంగ్ల వైస్రాయ్ మౌంట్‌బాటన్ కూడా కొంచెం సహకరించాడు. తాత్కాలిక ప్రభుత్వమే ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. మౌంట్‌బాటన్ రాజ్యాంగ వ్యవహారాల కార్యదర్శి వాప్పాళ పంగుణ్ణి మేనన్ (వీపీ మేనన్)ను పటేల్ ఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ ఇద్దరూ కలసి 99 శాతం సంస్థానాల విలీనం పనిని పూర్తి చేశారు. మిగిలిన ఒకటి కశ్మీర్. ఆ పనిని నెహ్రూ తీసుకున్నారు. ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ అంటే కశ్మీర్ సమస్యే. వీపీ మేనన్ దూరదృష్టి, పటేల్ జాతీయ దృక్పథం ఆ ఇద్దరిని 1947 జూలై నుంచే సంస్థానాల విలీనం కృషిని ఆగమేఘాల మీద ఆరంభించేటట్టు చేశాయి. సంస్థానాలకు స్వేచ్ఛను ఇవ్వడంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద ప్రణాళికే ఉంది. ఇన్ని సంస్థానాలకు స్వేచ్ఛనిస్తే దేశ ఏకత్వం ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే, దేశంలో 48 శాతం భూభాగం సంస్థానాల కిందే ఉంది. 28 శాతం జనాభా వాటిలో ఉండేది. ఇన్ని సంస్థానాలకు స్వేచ్ఛ కొనసాగి ఉంటే ఏం జరిగేదో చెప్పనక్కరలేదు. నిజానికి సంస్థానాధీశులలో అ«ధికులు బ్రిటిష్ జాతికీ, ప్రభుత్వానికీ కూడా తొత్తులే. వారిలో కొందరి వైఖరి అప్పుడే స్వాతంత్య్రం తెచ్చుకున్న భారత్ ఉనికికే ప్రమాదకరంగా పరిణిమిస్తున్న సంకే తాలు కూడా వెలువడడం మొదలయింది. హైదరాబాద్, జో«ద్‌పూర్, జునాఘడ్ సంస్థానాలు పాకిస్తాన్లో కలవడానికి సిద్ధమయినాయి. సంస్థానాల విలీనం కోసం పటేల్ సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించారు. వాటిని మూడు వ్యూహాలుగా అమలు చేయించారాయన. మొదటిగా రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవహారాలను వదులుకోవలసందని సంస్థానాధీశులను కోరారు. ఈ మూడు వదులుకుంటే సంస్థాలన్నీ భారత రాజ్యాంగం పరిధికి లోబడినట్టే. కాబట్టి అది రాజకీయ ఐక్యతలో తొలి మెట్టు కాగలదని పటేల్ భావించారు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వంతో గతంలో సంస్థానాలు చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోమని ఆయన సలహా ఇచ్చారు. దీనితో సంస్థానాలకు ఉన్న కొన్ని అధికారాలు రద్దయిపోతాయి. మూడోది అంతిమ అస్త్రం. యూనియనైజేషన్, డెమాక్రటైజేషన్ పేరుతో సంస్థానాలను విలీనం చేయడమే. కొందరిని భరణాలు ఎరవేసి లొంగదీసుకున్నారు. తిరువాన్కూర్, హైదరాబాద్, జో«ద్‌పూర్, జునాగఢ్, భోపాల్, కశ్మీర్ సంస్థానాధీశులు మొదట మొండికేసినా తరువాత తమ సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. గ్వాలియర్, బరోడా, పటియాలా వంటి సంస్థానాలు పటేల్ పిలుపునకు వెంటనే స్పందించి విలీనానికి అంగీకరించాయి. నయానో భయానో ఇంకొందరిని లొంగదీశారు. 1947 ఆగస్టు 15వ తేదీకే చాలా సంస్థానాలను పటేల్ భారత్ యూనియన్‌లోకి తెచ్చారు. అంటే రెండు నెలల వ్యవధిలోనే. మధ్య భారతంలోని పిప్లోడా సంస్థానాధీశుడు కూడా మొదట బెట్టు చేసి 1948 మార్చిలో భారత యూనియన్‌లో విలీనం చేశాడు. జునాగఢ్‌లో ప్రజలు తిరుగుబాటు చేశారు. తరువాత ప్లెబిసైట్ ద్వారా సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానం మీద పోలీసు చర్య అవసరమైంది. ఇది సెప్టెంబర్ 17, 1948న భారత్‌లో విలీనమైంది. కశ్మీర్ ఉదంతం వీటికి భిన్నమైంది. పాకిస్తాన్ సైనికులు చొచ్చుకు వచ్చిన నేపథ్యంలో భారత్‌లో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థానం పాలకుడు హరిసింగ్ ప్రకటించారు. సమస్యను నెహ్రూ ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్లారు. ఈ సమస్యను ఐక్య రాజ్యసమితికి తీసుకువెళ్లడం పటేల్‌కు ఇష్టమే లేదు. వీటితో పాటు లక్షద్వీప్‌ను స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్ నౌకాదళం చేసిన యత్నాన్ని కూడా పటేల్ మన నౌకాదళాన్ని పంపించి భగ్నం చేశారు. దేశ సరిహద్దు విషయంలో కూడా పటేల్‌కు ఉన్న దృష్టి విశేషమైనది. వాస్తవికమైనది. దేశ సార్వభౌమాధికారం సరిహద్దులను, భూభాగాన్ని రక్షించుకోవడం ద్వారా వ్యక్తం కావాలి. పటేల్ అదే చేశారు. భారత్, చైనా సంబంధాల గురించి పరిశోధించిన జాన్ డబ్లు్య గార్వెర్, ‘‘భారత్ పరిస్థితిని పటిష్టం చేయడానికి వాస్తవికమైన అంచనాలతో పటేల్ ఎన్నో సలహాలు ఇచ్చారు. సరిహద్దులలో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. భారత సైన్యం సామర్థ్యం పెంచాలన్నారు. ఈశాన్య ప్రాంతాలను భారత్‌లో విలీనం చేయవలసిన అవసరం గురించి చెప్పారు’’ అని పేర్కొన్నారు. కశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్య రాజ్యసమితికి తీసుకువెళ్లడం పటేల్‌కు సమ్మతం కాదని రాసినది కూడా గార్వెరే. పటేల్ అంటే ఈ దేశ పటానికి పరిపూర్ణతను, సంపూర్ణ రూపాన్ని సాధించిన రాజనీతిజ్ఞుడు. ఈ దేశం అంతర్యుద్ధాలకు చిరునామాగా మారిపోకుండా కాపాడినవారు పటేల్. భారతదేశ పటంలో ఐక్యమైన రాష్ట్రాలతో పాటు, వాటి వెనుక ఒక అంతస్సూత్రంలా పటేల్ ఆత్మ కూడా దర్శనమిస్తూ ఉంటుంది. - డా. గోపరాజు నారాయణరావు -
స్వాతంత్య్రం వద్దన్న న్యూ కెలడోనియా
-
మాకు స్వాతంత్య్రం వద్దు!
నౌమీ: పసిఫిక్ సముద్రంలోని న్యూ కెలడోనియా దీవుల వాసులు ఫ్రాన్స్ దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం జరిగిన రెఫరెండంలో మొత్తం 2.69 లక్షల జనాభాలో అర్హులైన 1.75 లక్షల మంది పాల్గొన్నారు. మొత్తం ఓటింగ్‌లో 70 శాతం లెక్కింపు పూర్తి కాగా అందులో 59.5 శాతం మంది స్వాతంత్య్రం వద్దు, ఫ్రాన్స్‌తోనే ఉంటామంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఈ ఫలితాలు 1853లో ఫ్రాన్స్ వలస ప్రాంతంగా మారిన తర్వాత అక్కడ సెటిలైన శ్వేత జాతీయులు, స్థానిక కనాక్ ప్రజల మధ్య వైషమ్యాలను మరింత పెంచే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1998లో రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో 70 మంది చనిపోయారు. ఆ తర్వాతే న్యూ కెలడోనియాకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు, రెఫరెండం నిర్వహించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం స్వాతంత్య్రం కావాలా వద్దా అనే విషయంపై 2022లో మరోసారి రెఫరెండం నిర్వహించాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి దాదాపు 18వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలోని ఈ సుందరమైన దీవులు ఫ్రాన్స్‌కు వ్యూహాత్మకంగా కీలకమైనవి. ప్రపంచంలోని నికెల్ నిల్వల్లో 25 శాతం ఇక్కడే ఉన్నాయి. నికెల్‌ను ముఖ్యమైన ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీలో వినియోగిస్తుంటారు. -
దేశబంధు
‘తాను సమర్పించుకునే కానుక ద్వారానే మనిషి తనను తాను ఆవిష్కరించుకుంటాడు. చిత్తరంజన్ దాస్ తన సోదర భారతీయుల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ కార్యక్రమం అంటూ ఏదీ కానుకగా ఇవ్వలేదు. ఒక మహోన్నత ఆకాంక్షలోని అమృతోపమానమైన సృజనాత్మక శక్తి త్యాగం రూపం సంతరించుకుంటే, చిత్తరంజన్‌దాస్ జీవితం అలాంటి త్యాగానికి ప్రతిరూపంగా మాత్రం కనిపిస్తుంది.’దేశబంధు చిత్తరంజన్‌దాస్ గురించి విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ అన్న మాటలివి. గాంధీ రాకకు పూర్వం మేధస్సు, జ్ఞానం కలగలసిన మహోన్నతులు భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా ఉండేవారు. అలాంటివారిలో చిత్తరంజన్‌దాస్ (నవంబర్ 5, 1870–జూన్ 16, 1925) ఒకరు. గాంధీ రాక తరువాత జాతీయ కాంగ్రెస్ సాధారణ ప్రజలకు చేరువైంది. ఈ రెండు దశల ఉద్యమంలోనూ దాస్ ప్రముఖంగానే కనిపిస్తారు. భువనమోహన్దాస్, నిస్తరిణీదేవిల కుమారుడు దాస్. అఖండ భారత్‌లో ఢాకా సమీపంలోని విక్రమపురిలో ఆయన జన్మించారు. వైద్యం ఆ కుటుంబంలో వంశపారంపర్యంగా వచ్చేది. కానీ భువనమోహన్ న్యాయవాది. చిత్తరంజన్ కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో పట్టభద్రుడైన తరువాత ఐసీఎస్ పరీక్ష కోసం 1890లో ఇంగ్లండ్ వెళ్లారు. ఆ పరీక్షలో సఫలం కాలేక, న్యాయశాస్త్రం చదివి 1893లో భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన నివాసం కలకత్తాయే. ఆ హైకోర్టులోనే ఆయన అద్భుతమైన బారిస్టర్‌గా ఖ్యాతి గడించారు. మిగిలిన నాయకుల మాదిరిగా కాకుండా దాస్ చాలా ఆలస్యంగా, అంటే 1910 దశకంలోనే భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన రాజకీయంగా చురుకుగా ఉన్నది 1917–1925 మధ్యనే కూడా. దాస్ సామాజిక, రాజకీయ, కుటుంబ నేపథ్యం ఎంతో వైవిధ్యమైనది. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల గురించి దాస్‌కు పూర్తిగా తెలుసు. అయినా ఎందుకు ఆ సంస్థ వెంట నడవలేదో అంతుపట్టదు. పైగా ఆ రోజులలో దాస్ అంటే యువతరంలో ఎంతో ఆకర్షణ ఉండేది. గొప్ప వక్త, కవి, రచయిత, పత్రికా రచయిత, ప్రఖ్యాతి గాంచిన బారిస్టర్. దాస్ విద్యార్థిగా ఉండగా స్టూడెంట్స్ అసోసియేషన్‌లో సభ్యులు. ఆ సంఘం తరపున ఒకసారి సురేంద్రనాథ్ బెనర్జీ పిలిపించి ఉపన్యాసం ఇప్పించారు. ఈ సంఘటన భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన మరుసటి సంవత్సరమే జరిగింది. అయినా దాస్ కాంగ్రెస్‌కు కాకుండా, సురేంద్రనాథ్‌కు భక్తుడయ్యారు. ఆయన కుటుంబం బ్రహ్మ సమాజాన్ని అవలంబించేది. భారతీయ మూలాలను విశేషంగా గౌరవిస్తూ, ఆధునిక ప్రపంచానికి తగ్గట్టు భారతీయ సమాజాన్ని నడిపించడమే బ్రహ్మ సమాజ సభ్యుల ఆశయంగా ఉండేది. దాస్ కూడా ప్రాచీన భారతీయ విలువలుగా ప్రసిద్ధి పొందినవాటిని గౌరవిస్తూ, వాటి పునాదిగానే ఆధునిక భారతావనిని కలగన్నాడని అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంతో బలంగా ప్రభావితమైనవారు చిత్తరంజన్ దాస్. చాలామంది వంగదేశీయులలో తీవ్రమైన మార్పు తెచ్చినట్టే, బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం చిత్తరంజన్‌లో కూడా తాత్వికమైన, రాజకీయమైన మార్పును తెచ్చింది. మొదటి నుంచి బిపిన్‌చంద్రపాల్ ఆశయాలను అభిమానించిన దాస్ వందేమాతరం ఉద్యమంలో అతివాదుల వైపే సహజంగా మొగ్గారు. మరొక పరిణామం కూడా ఉంది. అది ఆయన జీవితాన్నే మార్చి వేసింది. 1907వ సంవత్సరంలో ఆయన అలీపూర్ బాంబు కుట్ర కేసు వాదించారు. అందులో ప్రధాన నిందితుడు అరవింద్ ఘోష్. అప్పటికే బిపిన్‌పాల్, ఘోష్ కలసి స్థాపించిన ‘వందేమాతరం’ పత్రికకు దాస్ కూడా తనవంతు సాయం చేశారు. నిజానికి అంతకు ముందే స్వాతంత్య్ర సమరయోధులు బ్రహ్మ బందోపాధ్యాయ, బిపిన్ పాల్ల మీద మోపిన కేసును వాదించి ఉద్యమకారుల కేసులు వాదించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. కానీ అలీపూర్ బాంబు కుట్ర కేసు ఆయన పేరును భారతదేశమంతటా స్మరించుకునేటట్టు చేసింది. వందేమాతరం ఉద్యమం సమయంలో కింగ్స్‌ఫర్డ్ అనే కలెక్టర్ అకృత్యాలు దారుణంగా ఉండేవి. కలకత్తా చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ కూడా అతడే. సుశీలాసేన్ అనే కుర్రవాడు వందేమాతరం అని నినాదం ఇచ్చినందుకు కింగ్స్‌ఫోర్డ్ పేకబెత్తంతో చావగొట్టించాడు. ఈ సమాచారం విప్లవకారులను కలచివేసింది. ఇక పత్రికా సంపాదకులపైన కూడా అతడు కక్షకట్టాడు. కింగ్స్‌ఫోర్డ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని వారంతా భావించారు. ముఖ్యంగా అనుశీలన సమితి సభ్యులు ఇందుకు పథక రచన చేశారు. కింగ్స్‌ఫోర్డ్ కలకత్తా నుంచి ముజఫర్‌పూర్‌కు బదిలీ అయి వెళ్లిన తరువాత అతని హత్యకు విప్లవకారులు పథకం వేసుకున్నారు. 1908 ఏప్రిల్ 30 రాత్రి ఇంగ్లిష్‌వాళ్ల క్లబ్బు నుంచి అతడు ఇంటికి వెళుతున్నాడని భావించి ఒక కోచ్ మీద బాంబు విసిరారు. కానీ అందులో అతడు లేడు. దానిలోపల ఉన్న ఇద్దరు ఆంగ్ల మహిళలు మరణించారు. ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్ ఆ బాంబు విసిరారు. దీనినే మానిక్‌తొల్ల బాంబు కుట్ర కేసు అని కూడా అంటారు. ఖుదీరామ్‌కు ఉరిశిక్ష పడింది. తాను ఇద్దరు మహిళలను నిష్కారణంగా చంపానన్న బాధే అతడిని పోలీసులకు దొరికిపోయేటట్టు చేసింది. చాకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది అనుశీలన సమితి చేసింది. సమితితో అరవింద్ ఘోష్‌కు సన్నిహిత సంబంధం ఉండేది. దీనితో ఆయన కూడా అరెస్టయ్యారు. అరవిందుని మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు.అలీపూర్‌లో విచారణ జరిగింది. గొప్ప మేధావిగా పేర్గాంచిన అరవింద్‌ఘోష్ కేసు వాదించడానికి మొదట కొంత నిధిని సేకరించారు. బీఎన్ చక్రవర్తి, కేఎన్ చౌధురి మొదట వాదించారు. చిత్రంగా డబ్బులు అయిపోగానే కేసు అయోమయంలో పడింది. వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి స్థితిలో దాస్ ముందుకు వచ్చి కేసు వాదించారు. పైగా చాలా ఖర్చు ఆయనే భరించారు. మొత్తానికి అరవిందుడు నిర్దోషిగా తేలాడు. కానీ అదే కేసులో నిందితుడు బరీంద్రకుమార్‌కు ఉరిశిక్ష పడింది. ఈయన అరవిందుని సోదరుడే. ఇంకొక నిందితుడు ఉల్హాస్‌కుమార్‌కు కూడా మరణదండన విధించారు. ఈ కేసును దాస్ అప్పీలు చేసి ఆ ఇద్దరి మరణ దండనను యావజ్జీవ కారాగారవాసంగా మార్పించగలిగారు. ఈ కేసులో దాస్ చూపించిన ప్రతిభ భారతీయులనే కాదు, యూరోపియన్ న్యాయ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. అనుశీలన సమితి సభ్యుల మీద నమోదైన మరో కేసు ఢక్కా కుట్ర కేసు. అనుశీలన సమితి వ్యవస్థాపకులలో ఒకరైన పులీన్ బిహారీ దాస్, మరో 36 మందిపై కేసు నమోదైంది. వీరందరినీ కూడా చిత్తరంజన్‌దాస్ విడుదల చేయించగలిగారు. 11 మందికి మాత్రమే శిక్ష పడింది. తరువాతి కేసు ఢిల్లీ కుట్ర కేసు. ఇది 1913లో జరిగింది. 1912 డిసెంబర్లో లార్డ్ హార్డింజ్ వైస్రాయ్గా వచ్చాడు. ఇతడి గౌరవార్థం ఏర్పాటు చేసిన ఊరేగింపు జరిగింది. అప్పుడే అతడు ప్రయాణిస్తున్న వాహనం మీద బాంబు పడింది. త్రుటిలో తప్పి వెనుక ఉన్న రక్షకభటుడి మీద పడి పేలింది. అతడు మరణించాడు. హార్డింజ్ కూడా చిన్న దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. అమీర్‌చంద్, అవ«ద్ బిహారీ, బాలముకుంద్, బసంత్‌కుమార్ బిశ్వాస్ అనే యువకులను అరెస్టు చేశారు. కానీ పథక రచనలో కీలకంగా వ్యవహరించిన రాస్బిహారీ బోస్ తప్పించుకున్నాడు. తరువాత జపాన్ వెళ్లిపోయాడు. చిత్తరంజన్ ఈ కేసును కూడా వాదించి వారిని విడిపించారు. అందుకోసం ఆయన కలకత్తా నుంచి ఢిల్లీ వెళ్లేవారు. రవింద్ ఘోష్, లాలా లజపతిరాయ్, బిపిన్‌పాల్, బాలగంగాధర తిలక్ వంటివారు భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేసినవారే. కానీ మితవాదుల ధోరణి వారికి నచ్చేది కాదు. జాతీయ దృక్పథంతో, ఒక క్రమశిక్షణ కోసం ఆ సంస్థతో కలసి కొంత కాలం నడిచారు. తరువాత వేరయ్యారు. లేదా విభేదిస్తూ అందులోనే కొనసాగారు. చిత్తరంజన్ కూడా అంతే. పైగా ఇప్పుడు పేర్కొన్న ఆ మహనీయులంతా దాస్ సన్నిహితులే కూడా. జలియన్‌వాలా బాగ్ ఉదంతంలో డయ్యర్‌నీ, ఓడ్వయ్యర్‌నీ బోను ఎక్కించాలని తీవ్రంగా శ్రమించినవారిలో చిత్తరంజన్ ఒకరు. ఆ మారణ హోమం దాస్‌ను కలచివేసినట్టు కనిపిస్తుంది. 1919 ఏప్రిల్ 13న ఆ దుర్ఘటన జరిగింది. జనరల్ డయ్యర్ పాశవిక చర్య మీద విచారణ జరపవలసిందని భారతీయులు పట్టుపట్టారు. దీని ఫలితమే హంటర్ కమిషన్. ఇందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. వారు చిమన్లాల్ సెటల్వాడ్, జగత్ నారాయణ్. కమిటీ ముందుకు వచ్చిన సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అధికారం దాస్‌కు అప్పగించారు. కానీ ఇందుకు పంజాబ్ ప్రభుత్వం అంగీకరించలేదు. జలియన్ వాలాబాగ్ పరిణామాలలో భాగంగా అరెస్టయిన ముగ్గురికి హంటర్ ఎదుట సాక్ష్యం ఇచ్చే అవకాశం ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. కనీసం పంజాబ్ ప్రాంత నాయకుల అభిప్రాయాలను తీసుకోవాలని దాస్‌తో పాటు మోతీలాల్ కూడా కోరారు. ఇందుకు కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో హంటర్ కమిషన్‌ను కాంగ్రెస్ బహిష్కరించింది. అప్పుడే గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్ ఒక కమిటీని నియమించింది. 1,700 మందిని కలసి సేకరించిన సాక్ష్యాలను బట్టి 1,200 మంది మరణించారని తేలింది. 3,600 మంది గాయపడ్డారని వెల్లడైంది. కానీ ప్రభుత్వం చెప్పిన మృతులు 370. 1922లో గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనాలని దాస్ నిర్ణయించుకున్నారు. బెంగాల్ ప్రాంతంలో ఆ ఉద్యమానికి అవసరమైన సన్నాహాలలో నిమగ్నమయ్యారు కూడా. నిజానికి జలియన్ వాలా బాగ్ ఉదంతం తరువాతనే ఆయన న్యాయవాద వృత్తిని వీడారు. ఇప్పుడు పూర్తిగా దూరమయ్యారు. కానీ చౌరీచౌరా ఉదంతం తరువాత గాంధీ ఏకపక్షంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం దాస్‌కు నచ్చలేదు. ‘బార్డోలీలో తలపెట్టిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేయడానికి ఏదైనా బలవత్తరమైన కారణం ఉండవచ్చు. కానీ బెంగాల్లో ప్రభుత్వాన్ని స్తంభింపచేయడానికి ఉద్దేశించిన స్వచ్ఛంద సేవకుల కార్యక్రమాన్ని నిలిపివేయడం అసమంజసం. ఈ విధంగా మహాత్ముడు పొరపాటు చేయడం ఇది రెండోసారి’ అని దాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1922 నాటి గయ జాతీయ కాంగ్రెస్ సభలకు ఆయన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. శాసన మండళ్లను బహిష్కరించడం సరికాదన్నదే ముందు నుంచీ దాస్ వాదన. ఆ వాదన అక్కడ వీగిపోయింది. దాస్ కాంగ్రెస్‌కు రాజీనామా ఇచ్చారు. తరువాత స్వరాజ్ పార్టీ స్థాపించారు. గ్రామాలకు పునర్వైభవం తీసుకురావడం, అక్కడ స్వయం పాలన ఏర్పాటు చేయడం దాస్ కలల్లో ముఖ్యమైనది. అంటే వాటిని పునర్నిర్మించాలి. సహకార వ్యవస్థను ఏర్పాటు చేసి, కుటీర పరిశ్రమలను నెలకొల్పి స్వయం సమృద్ధంగా ఉంచాలని ఆయన భావించారు. అలాగే గాంధీజీతో కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ జాతీయ విద్యను, దాని అవసరాన్ని దాస్ సరిగానే గుర్తించారు. తాను ఏర్పాటు చేసిన జాతీయ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా నేతాజీ బోస్‌ను దాస్ నియమించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. చిత్తరంజన్ దాస్ జీవితానికి మరొక కోణం కూడా ఉంది. అది సృజనాత్మక రచనలు. మలంచా, మాల అనే గేయాల సంపుటాలు ఆయనవే. వీటికి బెంగాలీ సాహిత్యంలో ఎంతో ఖ్యాతి ఉంది. సాగర్ సంగీత్, అంతర్యామి, కిశోర్–కిశోరి ఆయన ఇతర రచనలు. ఒక అకుంఠిత కృషి తరువాత తీవ్రంగా అలసిపోయిన దాస్ విశ్రాంతి కోసం డార్జిలింగ్ వెళ్లారు. అక్కడే ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయం కలకత్తాకు వచ్చినప్పుడు దాదాపు మూడులక్షల మంది హాజరయ్యారు. టాగోర్ చెప్పినట్టు చిత్తరంజన్ త్యాగశీలతను జాతికి నేర్పారు. అందుకే ఆయన దేశబంధు. డా. గోపరాజు నారాయణరావు -
స్వాతంత్య్రోద్యమ కేసరి
‘అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యాయి. 1928లో జేమ్స్ ఏ స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు ఉన్నతాధికారి విచక్షణ రహితంగా కొట్టిన లాఠీ దెబ్బలతో కన్నుమూసిన లాలా లజపతిరాయ్ ఆ క్షణంలో మరొక శాపం కూడా ఇచ్చారు. ‘ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి.’ లాల్ పాల్ బాల్ త్రయంలో ఒకరిగా భారతదేశ చరిత్రలో లజపతిరాయ్‌కి ఖ్యాతి ఉంది. లాల్ అంటే లజపతిరాయ్. బెంగాల్ విభజన సమయంలో ఆ మహానుభావులు ముగ్గురూ జాతిని కదిలించిన తీరును బట్టి అలా పిలవడం పరిపాటి. కానీ లజపతిరాయ్‌కి అంతకు మించిన ఘనత ఎంతో ఉంది. ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. లజపతిరాయ్ ఉద్యమకారుడు. అతివాదుల వైపు మొగ్గినవారాయన. గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త. కార్మికోద్యమ నిర్మాత. ముస్లింల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయనది సంకుచిత దృష్టి కాదనీ, దూరదృష్టి అనీ ఓ ముగింపునకు రాక తప్పదు. 1946, 1947 రక్తపాతం, ఇతర రాజకీయ పరిణామాల సమయంలో చాలామంది నాటి నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకి లజపతిరాయ్ అప్పుడు చెప్పిన మాటలు ఆసరా అయ్యాయనిపిస్తాయి కూడా. లజపతిరాయ్ (జనవరి 28, 1865– నవంబర్ 17, 1928) పంజాబ్‌లోని దుఢికె అనే చోట పుట్టారు. తండ్రి రాధాకిషన్, తల్లి గులాబ్‌దేవి. రాధాకిషన్ ఉర్దూ, పర్షియన్ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. చాలామంది బిడ్డల మీద తండ్రి ప్రభావం ఉన్నట్టే, చిన్నారి లజపతిరాయ్ మీద రాధాకిషన్ ప్రభావమే ఉండేది. అంటే ఇస్లాం ప్రభావమే. రాధాకిషన్ సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్‌కు వీరాభిమాని. అహమ్మద్ ఖాన్ భారతీయ ముస్లిం సమాజ సంస్కరణకి తోడ్పడిన వారు. అయితే ఆ సంస్కరణ ఇస్లాం పరిధిని దాటని సంస్కరణ. ముస్లింలు జాతీయ కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.ఇంగ్లిష్ జాతి భారత్‌ను వీడిపోయిందంటే భారతీయ ముస్లింలు హిందువుల పాలన కిందకి రావలసి వస్తుందంటూ ప్రచారం ఆరంభించినవారిలో ఆయన కూడా ఒకరు. ఆయన అభిప్రాయాలను, రచనలను రాధాకిషన్ అభిమానించేవారు. అందుకే మతం మారకపోయినా ఇస్లాంను ఆరాధిస్తూ ఉండేవారు. తండ్రి ప్రభావమే బాల లజపతిరాయ్ మీద ఉంది. తల్లి గులాబ్‌దేవి మీద సిక్కు మత ప్రభావం ఉండేది. ఇలా రెండు వేర్వేరు మతాల ప్రభావాల మధ్యన హిందువుగానే ఎదిగినవారు లజపతి. తండ్రి ఎక్కడికి బదలీ అయితే అక్కడే లజపతిరాయ్ ప్రాథమిక విద్య సాగింది. ఇదంతా పంజాబ్, లాహోర్, నేటి హరియాణా ప్రాంతాలలో సాగింది. 1880లో ఆయన లాహోర్‌లోని ప్రభుత్వం న్యాయ కళాశాలలో చేరారు. ఇక్కడే లాలా హన్స్‌రాజ్, పండిత్ గురుదత్‌లతో పరిచయం ఏర్పడింది. వీరంతా అప్పటికే ఆర్య సమాజ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పుడప్పుడే లజపతిరాయ్‌కి ఆర్య సమాజ్ మీద ఆసక్తి ఏర్పడుతోంది. కానీ ఆయన 1881లో బ్రహ్మ సమాజ్‌లో చేరారు. అందుకు కారణం తన తండ్రి ఆప్తమిత్రుడు పండిత్ శివనారాయణ్ అగ్నిహోత్రి. అటు మిత్రుల ద్వారా ఆర్య సమాజ్ ప్రభావం, ఇటు అగ్నిహోత్రి ద్వారా బ్రహ్మ సమాజ్ ప్రభావం కలసి లజపతిరాయ్ మీద ఉన్న ఇస్లాం ప్రభావాన్ని పలచబారేలా చేశాయి. బ్రహ్మ సమాజ్‌లో ఉన్న మూడు వర్గాలు, వాటి వివాదాలు లజపతిని పూర్తిగా ఆర్యసమాజ్ వైపు తిరిగిపోయేటట్టు చేశాయి. కానీ తండ్రి దయానంద బోధనలను ఇష్టపడేవారు కాదు. అయినప్పటికీ ఆర్య సమాజ్ను లజపతిరాయ్ ఎన్నుకున్నారు. నిజానికి తాను ఆర్య సమాజ్ను అభిమానించినది అందులో కనిపించే మత సంస్కరణ, మత కోణాల నుంచి కాదనీ, అది ప్రబోధించిన జాతీయ దృక్పథంతోనే అనీ ఒక సందర్భలో చెప్పుకున్నారు కూడా. 1886లో ఆయన ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ సంవత్సరమే ఎంతో ప్రతిష్టాత్మకమైన దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను కూడా స్థాపించారు. లాహోర్‌లో ఆరంభమైన ఈ పాఠశాల ఉద్దేశం సంప్రదాయక భారతీయ విద్యా వ్యాప్తి. ఆ సమయంలోనే హిస్సార్, లాహోర్లలో లజపతిరాయ్ మంచి న్యాయవాదిగా కూడా పేర్గాంచారు. బాగా ఆర్జించారు. సామాజిక సేవ కోసం లాహోర్‌లోనే 20వ శతాబ్దం ఆరంభంలో భారతజాతి పునర్నిర్మాణ ఉద్దేశంతో ఆయనే సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని నెలకొల్పారు. ఆర్య సమాజ్, దయానంద బోధనలు లపజతిరాయ్‌లో అంత త్వరగా, అంత పెద్ద మార్పును తెచ్చాయి. లజపతిరాయ్ రాజకీయ చింతన పూర్తిగా దయానంద, ఆర్య సమాజ్ ఆశయాలకు అనుగుణంగా ఎదిగినట్టు కనిపిస్తుంది. మొదట ఆయన ఇటలీ ఏకీకరణ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డీలను ఆరాధించారు. మితవాదుల నాయకత్వంలో సాగుతున్న జాతీయ కాంగ్రెస్ పోరాటంలో జాతీయ ప్రయోజనాలు పక్కకి జరిగిపోతున్నాయని ఆనాడు అభిప్రాయపడిన వారిలో లజపతిరాయ్ ఒకరు. మొదట హిందువులు ఐక్యమై, తరువాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నది కూడా ఆయన అభిప్రాయంగా ఉండేది. తరువాతి కాలాలలో హిందూమహాసభకు, మదన్మోహన మాలవీయకు దగ్గర కావడానికి దోహదం చేసినవి కూడా ఈ అభిప్రాయాలే. 1897లో ఆయన ఆరంభించిన హిందూ రిలీఫ్ మూవ్‌మెంట్‌ను చూసినా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. కరువు కాటకాలకు బాధితులైన భారతీయులను ఆదుకోవడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నిస్సహాయిలుగా ఉండిపోతున్న భారతీయులు క్రైస్తవ మిషనరీల అదుపులోకి పోకుండా చూడడమే ఈ ఉద్యమం ఆశయం. మత సంస్కరణలు, వాటి లోతుపాతుల గురించి లజపతి ముందు నుంచి బాగా ఆలోచించారు. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం కోణం నుంచి ఆయన భారతదేశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. అయినాగానీ, భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం, అందుకు సంబంధించిన ఆర్భాటాలేవీ కూడా లజపతిరాయ్‌కి పెద్దగా తెలియవు. ఆయన ప్లీడర్ చదువు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం ముందు జాతీయ కాంగ్రెస్ బొంబాయిలో ఆవిర్భవించింది. అప్పుడు లజపతిరాయ్ తండ్రి రోహ్తక్లో పని చేస్తున్నారు. తండ్రి దగ్గరే లజపతి రాయ్ ఉండేవారు. న్యాయవాద వృత్తిని ప్రారంభించిన రెండేళ్ల తరువాత 1888, 89 సంవత్సరాలలో ఆయన మొదటిసారి అలహాబాద్, బొంబాయిలలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు. హిస్సార్ నుంచి వెళ్లిన నలుగురు ప్రతినిధుల బృందంలో ఆయన కూడా ఒకరు. అందుకు లజపతిరాయ్ చాలా గర్వించారు కూడా. కానీ ఆయనకు కాంగ్రెస్ పోరాట పంథా గొప్పగా అనిపించలేదు. బొంబాయి సభలు ఆయనను నిరాశ పరిచనట్టు కూడా అనిపిస్తుంది. ‘కాంగ్రెస్ నాయకులు దేశ ప్రయోజనాల కంటే తమ కీర్తిప్రతిష్టలకే ఎM ్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అలా అని ఆయన కాంగ్రెస్‌కూ, ఆ సంస్ధ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యమానికీ దూరం కాలేదు. బెంగాల్ విభజనోద్యమానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్రే ఇందుకు నిదర్శనం. బెంగాల్ విభజనోద్యమం అంటే, గాంధీజీ రాక మునుపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో బెంగాల్ నుంచి అరవింద్ ఘోష్, బిపిన్‌చంద్ర పాల్, మహరాష్ట్ర నుంచి బాలగంగాధర్ తిలక్, పంజాబ్ నుంచి లాలాజీ కీలక నేతలుగా అవతరించారు. ఇంకా రవీంద్రనాథ్ టాగోర్, చిత్తరంజన్‌దాస్, సోదరి నివేదిత వంటివారు ఎందరో ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైనది. ఇందులో ఎక్కువ పాత్ర లజపతిరాయ్‌దే. స్వదేశీ ఉద్యమంలో భాగమే జాతీయ విద్య. జాతీయ కళాశాలల ఏర్పాటు కూడా అందులో భాగమే. అలా లజపతిరాయ్ లాహోర్‌లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. అందులోనే భగత్‌సింగ్ చదువుకున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం సాగుతూ ఉండగానే పంజాబ్‌లో భూశాసన చట్టం అమలులోకి వచ్చింది. 1907లో ప్రభుత్వం రుద్దిన ఈ చట్టం ప్రకారం పంట పొలాలకు ఉపయోగించుకునే నీటికి చేయవలసిన చెల్లింపులు పెరిగాయి. ల్యాండ్ రెవెన్యూ పెంపు పేరుతో రైతులను వేధించడం మొదలైంది. ఈ భూశాసనానికి వ్యతిరేకంగా ఇండియన్ పేట్రియాట్స్ అసోసియేషన్ ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ సంస్థ నాయకుడు అజిత్ సింగ్. ఈయన భగత్‌సింగ్ పినతండ్రి. ఈ ఉద్యమనేతగా అజిత్‌సింగ్ పేరు వినపడినప్పటికీ వెన్నెముక లజపతిరాయేనని అంటారు. ఆ సంస్థ సభ ఎక్కడ జరిగినా వక్త లజపతిరాయే. దీనితో లజపతిరాయ్‌నీ, అజిత్‌సింగ్‌నీ ప్రభుత్వం ప్రవాస శిక్ష విధించి మాండలేకు పంపింది. బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపకుండానే ఇంతటి కఠిన శిక్ష విధించింది. దీనితో ఇంగ్లండ్ పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో గందరగోళం జరిగింది. విధిలేక భారత్‌లోని బ్రిటిష్ ప్రభువులు ఆ ఇద్దరినీ విడుదల చేశారు. 1913లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలు భారతీయుల దుస్థితిని విదేశాలలో ప్రచారం చేయడానికి ఇద్దరు ప్రతినిధులను ఎన్నుకున్నది. ఆ ఇద్దరు లజపతిరాయ్, మహమ్మదలీ జిన్నా. 1914లో లజపతిరాయ్ న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి పూర్తిగా స్వాతంత్య్రోద్యమంలోకి దూకారు. ఆ సంవత్సరమే ఇంగ్లండ్ వెళ్లి అక్కడ అనేక సభలలో ప్రసంగించారు. అక్కడ నుంచి అమెరికా వెళ్లారు. అక్కడ ఉండగానే మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఆరేళ్ల వరకు భారత్ తిరిగి రావడానికి అనుమతి దొరకలేదు. అమెరికాలో ఉండగానే ఆయన కొన్ని రచనలు చేశారు. రచయితగా కూడా లజపతిరాయ్ కృషి చెప్పుకోదగినది. ఆర్యసమాజ్, యంగ్ ఇండియా, నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, అన్‌హ్యాపీ ఇండియా, ది స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్, భారత్‌కు ఇంగ్లండ్ రుణం వంటి పుస్తకాలు రాశారాయన. తన అభిమాన హీరోలు జోసెఫ్ మ్యాజినీ, గారిబాల్డి, దయానంద సరస్వతిల జీవిత చరిత్రలు కూడా లజపతిరాయ్ రాశారు. 1919లో మొత్తానికి లాల్జీ భారతదేశానికి తిరిగి రావడానికి అనుమతి దొరికింది. ఆ మరుసటి సంవత్సరమే వచ్చారు. అప్పటికి భారత రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది. గాంధీ యుగం ఆరంభమైంది. అయితే గాంధీజీ ఉద్యమాలన్నింటినీ లజపతిరాయ్ సమర్థించలేదు.ఉదాహరణకి శాసనోల్లంఘన. అప్పుడే జరిగిన జలియన్‌వాలా దురంతానికి నిరసనగా లజపతిరాయ్ పంజాబ్ అంతటా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ గాంధీకీ, మహమ్మదలీ జిన్నాకీ మధ్య పోటీ పెరిగిపోయింది. అంటే హిందువులు, ముస్లింలు, భారత స్వాతంత్య్రోద్యమం అనే అంశం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్న కాలమంది. నిజానికి భారతీయ ముస్లింలు, స్వాతంత్య్రం సమరం అనే అంశం మీద లజపతిరాయ్‌కి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన వాటిని దాచుకోలేదు కూడా. డిసెంబర్ 14, 1923న ‘ది ట్రిబ్యూన్’ పత్రికకు ఆయన రాసిన వ్యాసం ఇందుకు నిదర్శనం. అందులో లజపతిరాయ్, ‘హిందువులు, ముస్లింలు కలసి బ్రిటిష్ వారి మీద పోరాడడంలో అనేక సమస్యలున్నాయనీ, ముస్లిం ఇండియా, హిందూ స్టేట్ ఇండియాగా విభజించాల’ని ప్రతిపాదించారు. 1927లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. అందులో ఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా ఉద్యమం ఆరంభమైంది. ఇందులోనూ లాల్జీ కీలక పాత్ర వహించారు. సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలంటూ పంజాబ్ అసెంబ్లీలో ఆయన పెట్టిన తీర్మానం కూడా కొద్ది తేడాతోనే అయినా గెలిచింది. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అక్టోబర్ 30, 1928న ఆ కమిషన్ లాహోర్ వచ్చింది. గాంధీజీ ఆశయం మేరకే అయినా లాల్జీ కూడా అహింసతో, మౌనంగా సైమన్ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా మౌనంగా ఉద్యమిస్తున్న వారిపైన కూడా లాఠీ చార్జికి ఆదేశించాడు పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాట్. తను స్వయంగా లాల్జీ మీద దాడి చేశాడు. లాల్జీ ఛాతీ మీద స్కాట్ కొట్టిన లాఠీ దెబ్బలు చాలా తీవ్రమైనవి. ఆ దెబ్బలతోనే లాల్జీ నవంబర్ 17న చనిపోయారు. ఇందుకు చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్ తదితరులు ప్రతీకారం తీసుకోవాలని కోరుకున్నారు. కానీ స్కాట్‌ని చంపాలని అనుకుని జాన్ పి. సాండర్స్ అనే మరొక అధికారిని కాల్చి చంపారు. లజపతిరాయ్ ఆలోచనా విధానంలో మార్పులు ఎలా ఉన్నా ఆయన ప్రధానంగా మానవతావాది. అందుకు ఈ ఉల్లేఖనే సాక్ష్యం. ‘భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను. పసివాళ్లకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య..’ - ∙డా. గోపరాజు నారాయణరావు -
భరతమాతకు జేజేలు... బంగరు తల్లికి జేజేలు
దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఎందరి త్యాగాల ఫలితంగానో బానిసత్వపు సంకెళ్లు తెంచుకున్న భారతమాతకు దేశ ప్రజలంతా జేజేలు పలికారు. అయితే కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో మాత్రం భారతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజించారు. తరువాతి కాలంలో ఆలయాన్ని నిర్మించారు. నిత్యం భరతమాతకు పూజలు చేయడం, ఏటా జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భరతమాతకు ఇలా ఓ ఆలయాన్ని నిర్మించి దాదాపు డెబ్భై ఏళ్లయింది. వివరాల్లోకి వెళితే బిచ్కుంద మండల కేంద్రంలో బుర్రి గంగారాం, అల్లి పోశెట్టి, మంగలి రామన్న, హకీం నారాయణ తదితరులు మంచి స్నేహితులే కాదు, దేశభక్తులు కూడా. వీరు తమ గ్రామంలో భరతమాత విగ్రహం పెట్టాలని భావించి స్వయంగా సిమెంటుతో విగ్రహాన్ని రూపొందించి 1949లో గ్రామంలో ప్రతిష్టించారు. చిన్న కుటీరం ఏర్పాటు చేశారు. కుటీరం పక్కనే ఉన్న మార్కండేయ విగ్రహాలను అక్కడే ప్రతిష్టించారు. అరుదైన విగ్రహాలు కావడంతో భక్తులు నిత్యం పూజలు చేసేవారు. అది చూసి కొందరు ఔత్సాహికులు, దాతలు ముందుకు వచ్చి మార్కండేయ ఆలయం, భరతమాత ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. 1982లో భరతమాత, మార్కండేయ ఆలయాలు నిర్మించారు. కొత్తగా విగ్రహాలను సుందరంగా తయారు చేయించి ప్రతిష్టించారు. విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారని ఆలయ సమీపంలో నివసించే పరమేశ్వర్ ‘సాక్షి’కి తెలిపారు. దేశభక్తితోనే ఆలయ నిర్మాణం జరిగిందని వివరించారు. ఆలయంలో నిత్యం పూజలు... మార్కండేయ మందిరంతోపాటు భరతమాత మందిరంలో నిత్యం పూజలు నిర్వహిస్తారు. గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు. ఆలయ పూజారి నిత్యం ఆలయాన్ని శుభ్రం చేసి అర్చనలు చేస్తారు. ఏటా భరతమాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ఉయ్యాల సేవ, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. బిచ్కుందలో భరతమాత ఆలయం ఉందని తెలిసిన దూర ప్రాంతాల ప్రజలు సైతం అMý్కడికి వచ్చి వెళుతుంటారు. గ్రామస్తులు చాలా మంది ఆలయానికి నిత్యం వెళ్లి పూజలు చేస్తారు. కొందరు స్వాతంత్య్ర దినోత్సవం రోజున, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
గదర్ పార్టీ 105వ వార్షికోత్సవం
ఎస్టోరియా: దేశ స్వాతంత్య్రం కోసం సాయుధ పోరుబాటను ఎంచుకున్న గదర్ పార్టీ 105వ వ్యవస్థాపక దినోత్సవం అమెరికాలో జరిగింది. 1913వ సంవత్సరంలో ఓరెగాన్ రాష్ట్రంలోని ఎస్టోరియా పట్టణంలో గదర్ పార్టీ ఏర్పడింది. అప్పట్లో పట్టణంలోని కలప డిపోలో కార్మికులుగా పనిచేసే 74 మంది భారతీయులు, ముఖ్యంగా సిక్కులు సమావేశమై పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఆ భవనానికి సమీపంలోనే ఉన్న పార్కులో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గదర్ మెమోరియల్ ఫౌండేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలతోపాటు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా నుంచి కూడా వందలాది మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త బహదూర్ సింగ్ గదర్ మెమోరియల్ ఫౌండేషన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్ పాలనపై గదర్ పార్టీ సాగించిన సాయుధ పోరు విజయవంతం కానప్పటికీ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక అధ్యాయంగా నిలిచిపోయింది. -
చట్టసభల్లో స్వతంత్రులేరీ ?
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రాభవాన్ని క్రమక్రమంగా కోల్పోతున్నారు. ఒక ఎన్నికల నుంచి మరో ఎన్నికలకు వచ్చే సరికి గెలిచే ఇండిపెండెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అటు లోక్‌సభ ఎన్నికల్లో, ఇటు శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రుల సీట్లతో పాటు వారి ఓట్ల శాతం కూడా క్షీణిస్తోంది. ఇటీవల కర్ణాటకలో 222 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఇండిపెండెంట్ గెలుపొందాడు. ఆరు దశాబ్దాలకు పైబడిన ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యల్పం.. 2013 శాసనసభలో 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. 2018 ఎన్నికల్లో ఈ ఎనిమిది మంది కూడా ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థుల చేతుల్లో ఓటమి చవి చూశారు. ఒక సిట్టింగ్ ఇండిపెండెంట్ మాత్రం మరో స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడాడు. కర్ణాటకలో పోటీచేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులు సీట్లతో పాటు ఓట్ల వాటా కూడా గణనీయంగా కోల్పోయారు. మొత్తం 1,129 మంది స్వతంత్రుల ఓట్ల వాటా ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ అంటే 3.9 శాతంగా నమోదైంది. గత ఎన్నికల్లో స్వతంత్రుల ఓట్లవాటాతో పోల్చితే ఇది సగం మాత్రమేనని కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను బట్టి తెలుస్తోంది. 1957లో కర్ణాటక మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది స్వతంత్రులు గెలిచారు. 1967లో జరిగిన ఆ రాష్ట్ర మూడో ఎన్నికల్లో అత్యధికంగా 41 మంది విజయం సాధించారు. మొత్తం 331 ఇండిపెండెంట్లు పోటీచేయగా, వారి ఓట్లవాటా కూడా అత్యధికంగా 28 శాతంగా నమోదైంది. అయితే క్రమేణా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, వారికొచ్చే ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. గెలిచే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా దిగజారింది. ఇది ఒక్క కర్ణాటకకే పరిమితం కాలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయపార్టీల అధిపత్యం (జాతీయ, ప్రాంతీయపార్టీలు) పెరుగుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా స్వతంత్రులకు రాజకీయ అవకాశాలు సన్నగిల్లుతున్నాయని రాజకీయపరిశీలకులు అంచనా వేస్తున్నారు. 11 రాష్ట్రాల్లో అతి తక్కువగా ఇండిపెండెంట్లు... ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాల శాసనసభల్లో స్వతంత్రుల సీట్ల వాటా తక్కువగా నమోదు కాగా...22 రాష్ట్రాల అసెంబ్లీలలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓట్ల వాటా అత్యల్పంగా రికార్డయిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, బిహార్, అస్సాం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి అతి తక్కువ మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అదేవిధంగా రాజస్థాన్, జమ్మూ, కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, సిక్కిం, మిజోరాం, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు అభ్యర్థుల ఓట్ల వాటా గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుత లోక్‌సభలో ముచ్చటగా ముగ్గురే... ప్రస్తుత లోక్‌సభలో కేవలం ముగ్గురే ఇండిపెండెంట్ ఎంపీలున్నారు. 1991లో జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక స్వతంత్ర ఎంపీ గెలుపొందాడు. అప్పటి నుంచి (1991) ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా ఉంటోంది. 1957లో జరిగిన రెండో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది ఎంపీలు ఏ పార్టీకి చెందనివారు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్ధులు అత్యధికంగా 19.3 శాతం ఓట్ల వాటాను సాధించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిపెండెంట్‌గా గెలుపొందడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాన్ని స్వతంత్ర ఎన్నికల పర్యవేక్షణ సంస్థ ప్రజాస్వామిక సంస్కరణల సంఘం(ఏడీఆర్) వ్యవస్థాపకుడు జగదీప్ చొక్కార్ వెలిబుచ్చారు. రాజకీయపార్టీల అభ్యర్థులకు అందుబాటులో ఉన్నన్ని వనరులు ఇండిపెండెంట్లకు లేక పోవడమే ప్రధాన కారణం. వీరిమధ్య వనరులకు సంబంధించిన అంతరం చాలా ఎక్కువగా ఉంటోంది. ఎన్నికల్లో చేస్తున్న వ్యయం కూడా గణనీయంగా పెరగడంతో స్వతంత్రులుగా పోటీ చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. పోటీ చేసిన వారిలోనూ గెలిచే వారి సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. ఈ విధంగా రాజకీయ వ్యవస్థపై రాజకీయపార్టీల పట్టు పెరుగుతోంది అని ఆయన పేర్కొన్నారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గ్రామాలను చీకట్లో ఉంచింది మీరు కాదా?
సింద్రి: ధనికుల కోసమే ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చీకట్లలో మగ్గుతున్న 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, వాటిలో ధనిక ప్రజలు నివసిస్తున్నారా? అని ఘాటుగా ప్రశ్నించారు. జార్ఖండ్‌లోని సింద్రిలో శుక్రవారం ఐదు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాక మోదీ ప్రసంగించారు. ఓటుబ్యాంకు రాజకీయాల్లో పీకలదాకా మునిగిపోయిన నామ్‌దార్(వంశపారంపర్య) పార్టీకి సాధారణ కార్మికుల బాధలు పట్టడంలేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. విద్యుత్ సౌకర్యంలేని సుమారు 4 కోట్ల కుటుంబాల (ఒక్క జార్ఖండ్‌లోనే 25 లక్షలు)కు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
70ఏళ్ల తర్వాత ఆ ఊళ్లో వెలుగులు..
అమ్రావతి, మహారాష్ట్ర : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మన దేశంలో విద్యుత్ వెలుగులకు నోచుకోని గ్రామాలెన్నో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి గ్రామానికి విద్యుత్ అందించే లక్ష్యంతో ‘ప్రధాన మంత్రి సహజ్ బిజ్లి హర్ ఘర్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం ద్వారా మహారాష్ట్రలోని అమ్రావతి సమీపంలో ఉన్న బులుమ్‌గవ్‌హన్ అనే గిరిజన గ్రామంలో విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. దీంతో ఆ గిరిజన గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. బులుమ్‌గవ్‌హన్ గ్రామంలో 589 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరికి రోడ్లు, విద్యుత్తు, వైద్యం వంటి కనీస సదుపాయాలూ అందుబాటులో లేవు. తాజాగా ప్రభుత్వ యంత్రాంగం, గ్రామస్థులు కలసి సమష్టిగా కృషి చేసి, విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తేగలిగారు. దీంతో గ్రామస్తులంతా సంబరాలు చేసుకుంటున్నారు. కరెంటు లేక తమ పిల్లలు ఇన్ని రోజులు చదువుకోలేదని ఇక ఆ బాధ లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. -
తొలి స్వాతంత్య్ర పతాక
‘చూడండి! స్వతంత్ర భారత పతాకం ఆవిర్భవించింది. దేశ ప్రతిష్టను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన భారతీయ యువకుల నెత్తురుతో పునీతమైన జెండా. ఆ జెండా సాక్షిగా ప్రపంచ స్వేచ్ఛా ప్రియులందరినీ నేను వేడుకుంటున్నాను, ఈ పోరాటానికి చేయూతనివ్వండి!’ఇంత విశ్వాసం నిండిన గొంతు, ఇంతటి ఆత్మ స్థైర్యం నిండిన గుండె, ఒకే కలని అన్ని దశాబ్దాల పాటు భద్రంగా దాచుకున్న కళ్లు బహుశా ప్రపంచ చరిత్రలోనే మనకు తారసపడవు. మేడమ్ భికాజీ రుస్తోంజీ కామాకే ఆ ఖ్యాతి దక్కుతుంది. అది మేడమ్ కామా గొంతు. 1907లో ఎక్కడో జర్మనీలో ప్రపంచ విప్లవ యోధులు, మహా రచయితలు, మేధావులు పాల్గొన్న సభలో మేడమ్ కామా ఆ పిలుపునిచ్చారు. ఆమె స్వప్నం సాకారమై నలభై ఏళ్ల తరువాత భారతదేశం మీద స్వతంత్ర పతాకం రెపరెపలాడింది. పరాయి పాలనలోని ౖ§ð న్యం భారతీయుల గుండెను తడుతున్న కాలమది. అలాంటి సమయంలో మేడమ్ కామా (సెప్టెంబర్ 24,1861–ఆగస్ట్ 13,1936) పుట్టారు. తండ్రి సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్. బొంబాయిలోనే కోటీశ్వరులనదగ్గ పార్శీల కుటుంబం వారిది. పారిశ్రామికవేత్తల వర్గం. నాటి చాలామంది పార్శీల మాదిరిగానే కామా కూడా ఇంగ్లిష్ విద్యను అభ్యసించారు. పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనం నుంచి ఆమెలో ఒక తిరుగుబాటు తత్వం ప్రస్ఫుటంగా ఉండేది. పైగా తిరుగులేని జాతీయవాది. జాతీయవాదం పునాదిగా ఉండే రాజకీయాలంటే అపారమైన ఆసక్తి. ఆమె జాతీయవాదం ఎంత గాఢమైనదంటే అందుకోసం ఆమె వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు. 1885లో ఆమె రుస్తోంజీ కేఆర్ కామాను వివాహం చేసుకున్నారు. రుస్తోంజీ కామా పూర్తిగా ఆంగ్లేయ పక్షపాతి. వారి సంస్కృతి అంటే మోజు. వారి ఆలోచనలే ఆయనకు శిరోధార్యం. భారతదేశానికి ఆంగ్లేయులు చేసిన మేలు అసాధారణమైనదని రుస్తోంజీ వాదన. భికాజీ కామా ఇందుకు పూర్తి విరుద్ధం. అణచివేత, దోపిడీ ఆంగ్ల జాతి మౌలిక లక్షణమని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఫలితం–ఆ దంపతులు విడిపోయారు. అప్పటికే భికాజీ కామా సమాజ సేవకురాలిగా మారిపోయారు. కానీ తన పేరులో నుంచి భర్త పేరును ఆమె తొలగించలేదు. 1890లో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో బ్యుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబలింది. అదొక భయంకరమైన అంటువ్యాధి. ఒళ్లంతా బొబ్బలతో నరకయాతన అనుభవిస్తూ కొన్ని గంటలలోనే వ్యాధిగ్రస్థులు చనిపోయేవారు. ఒక్క బొంబాయి నగరంలోనే ఆ మహమ్మారికి 22 వేల మంది మరణించారు. వ్యాధి సోకిన వారికి మేడమ్ కామా రాత్రీపగలూ సేవలు చేశారు. ఆ వ్యాధి ఆమెకు కూడా సోకింది. కానీ అతికష్టం మీద బతికారు. అప్పుడే పూర్తిగా కోలుకోవడానికి యూరప్ వెళ్లవలసిందని వైద్యులు సూచించారు. అలా ఆమె 1902లో ఇంగ్లండ్ చేరుకున్నారు. అనుకున్నట్టే అక్కడ భికాజీ కామా కోలుకున్నారు. ఆమె అక్కడ కాలు పెట్టే సమయానికి బ్రిటిష్ వ్యతిరేక తీవ్ర జాతీయవాదులకు లండన్ కేంద్రంగా ఉండేది. లాలా హరదయాళ్, శ్యాంజీ కృష్ణవర్మ, వినాయక్ దామోదర్ సావర్కర్ అక్కడే పనిచేసేవారు. వారితో పరిచయం కలిగింది. ఆంగ్ల జాత్యహంకారం గురించి హైడ్ పార్క్‌లో ఉపన్యాసాలు ఇచ్చేవారామె. అప్పటికి భారత జాతీయ కాంగ్రెస్ మితవాద నాయకుడు దాదాభాయ్ నౌరోజీ అక్కడే ఉన్నారు. ఆయన బ్రిటిష్ పార్లమెంట్‌కు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు (తరువాత పోటీ చేసి నెగ్గారు). అప్పుడు ఆయనకు కార్యదర్శిగా భికాజీ పనిచేశారు. బ్రిటిష్ దోపిడీ సంస్కృతి మీద ఆ ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. ఇద్దరూ పార్శీలే. తరువాత ఆమె స్వదేశానికి రావాలని ప్రయత్నించారు. భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు ఆమె నిరాకరించి లండన్, పారిస్ నగరాలలోనే స్థిరపడ్డారు. అక్కడే ఉండి బ్రిటిష్ వ్యతిరేకోద్యమం చేస్తున్న సంస్థలకు ఆర్థిక సాయం అందించేవారు. భారత స్వాతంత్య్రోద్యమ సాహిత్యాన్ని వెలువరించేవారు. ఇంగ్లిష్ పాలనలో భారతీయులు పడుతున్న ఇక్కట్లు, దేశంలో నశించిన హక్కులు వంటి వాటి గురించి భికాజీ కామా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు. సింగ్ రేవాభాయ్ రాణా, మంచేర్షా బుర్జోర్జీ గోద్రెజ్, మేడమ్ కామా కలసి పారిస్ ఇండియన్ సొసైటీ స్థాపించారు. ‘వందేమాతరం’, ‘తల్వార్’ అనే పత్రికలను నడిపారు. ఏది చేసినా దేశ స్వాతంత్య్రమే ఆమె లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తయితే, భారత జాతికి తొలిసారిగా ఒక ఉమ్మడి పతాకాన్ని తయారు చేసిన ఘనత మేడమ్ కామాకే దక్కుతుంది. మూడు రంగులతో–ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులతో ఆమె పతాకాన్ని తయారు చేశారు. ఆకుపచ్చ రంగు మీద కొన్ని కలువలను చిత్రించారు. పసుపు రంగు మీద ‘వందేమాతరం’ అని రాయించారు. కింద ఎరుపు రంగు భాగంలో సూర్యచంద్రులను చిత్రించారు. ఇవి హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకలు. ఇవన్నీ భారతీయతకీ, హిందూ ముస్లిం ఐక్యతకీ, త్యాగనిరతకీ ప్రతీకలే. ఈ పతాకాన్ని ఆమె ఆగస్టు 22, 1907న జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో ఎగురవేశారు. ఆ సందర్భం ప్రపంచ చరిత్రలోనే గొప్పది. అది అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశం. లెనిన్ కూడా అందులో పాల్గొన్నారు. ఆసియా దేశాలలో సమానత్వం, స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆ సభ నుంచి ఆమె నినదించారు. ఆ వేదిక మీద నుంచే తొలిసారి భారతీయ పతాకం ఆమె ఎగురవేశారు. అక్కడ నుంచే ఆమె అమెరికా వెళ్లారు. ఆ తరువాత ఈజిప్ట్ వెళ్లారు. భారత స్వాతంత్య్రోద్యమంతో పాటు, మహిళల హక్కుల గురించి కూడా ఆమె ప్రచారం చేశారు. ఈజిప్ట్‌లో కామా ఆ కాలంలోనే వేసిన ప్రశ్న ఒక అద్భుతం. ‘మిగిలిన సగం ఈజిప్ట్ ఎక్కడ? ఇక్కడ నేను పురుషులని మాత్రమే చూస్తున్నాను. కానీ వీరు దేశంలో సగమే. తల్లులు ఎక్కడ ఉన్నారు? చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు? ఉయ్యాలలు ఊపిన చేతులు మనుషులను కూడా అంటే జాతిని తయారు చేస్తాయన్న సంగతి విస్మరించరాదు’ అన్నారామె. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కామా నిర్వహించిన పాత్ర అసాధారణమైనది. యుద్ధాన్ని ఆసరా చేసుకుని వలసలలోని ప్రజలు తిరుగుబాటు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కానీ భారతదేశంలో ఆంగ్లేయులకు మద్దతు దొరికింది. ‘మీరు ఎవరి కోసం పోరాడతారు? భారతీయులకు సంకెళ్లు వేసినవాళ్ల తరఫున పోరాడతారా?’ అని నిలదీశారు కామా. భారతదేశంలో గాంధీజీకీ, అనిబీసెంట్, జిన్నా, తిలక్ శిబిరానికీ మధ్య ఇదే విషయం మీద విభేదాలు ఉన్నాయి. గాంధీజీ యుద్ధంలో ఉన్న ఆంగ్లేయులకు మద్దతు ఇవ్వాలని గుజరాత్లో ప్రతి గ్రామం తిరిగి ప్రచారం చేశారు. తిలక్ శిబిరం స్వయంప్రతిపత్తి గురించి చెప్పి, భారతీయ సైన్యాన్ని ఉపయోగించుకోవాలని హోమ్‌రూల్ లీగ్ తరఫున ఉద్యమించింది. విదేశాలలో ఉన్న భారతీయ ఉద్యమకారులు గ్రేట్‌వార్ కాలంలో చెల్లాచెదురై పోయారు. అందుకు కారణం– అప్పటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇంగ్లండ్, ఫ్రాన్స్ యుద్ధంతో ఏకమయ్యాయి. దీనితో ఫ్రాన్స్‌లో ఆశ్రయం పొందుతున్న బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమకారులకు నీడ కరువైంది. ఇంగ్లండ్‌లో కూడా వేట మొదలైంది. పారిస్‌లోని భికాజీ కామా గృహం గదర్ వీరులకు, ఇతర భారతీయ తీవ్ర జాతీయవాదులకు నిలయంగా ఉండేది. వినాయక్ దామోదర్ సావర్కర్ రచన ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం–1857’ను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అప్పుడు నాసిక్ కలెక్టర్ జాక్సన్ హత్య కేసును సావర్కర్ ఎదుర్కొంటున్నారు. నాసిక్‌లోనే ఒక నాటకం చూస్తున్న జాక్సన్ అనంత్ కన్హేరీ అనే యువకుడు కాల్చి చంపాడు. ఇది సావర్కర్ కుట్ర అని ప్రభుత్వ ఆరోపణ. ఆ కేసులోనే ఆయనను లండన్‌లో అరెస్టు చేసి, భారత్‌కు తీసుకు వెళుతుండగా, మార్సెల్స్ రేవులో తప్పించాలని మేడమ్ కామా, వీవీఎస్ అయ్యర్ పథకం వేశారు. అనుకున్నట్టే ఓడ పాయఖానా రంధ్రం నుంచి వీర సావర్కర్ సముద్రంలోకి జారిపోయి, మార్సెల్స్ రేవులోకి ఈదుకు వచ్చారు. కానీ కామా, అయ్యర్ రావడం కొన్ని నిమిషాలు ఆలస్యమైంది. ఇంతలోనే ఫ్రాన్స్ పోలీసులను తప్పించి, ఇంగ్లిష్ భద్రతా సిబ్బంది సావర్కర్‌ను పట్టుకుని తీసుకుపోయింది. ఇండియాలో సావర్కర్‌ను అండమాన్ జైలులో పెట్టారు. రెండు జీవితకాలాల శిక్ష విధించారు. ఆయనను విడుదల చేయించడానికి కామా బ్రిటన్, ఫ్రాన్స్ దౌత్య కార్యాలయాల చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు. నిరంతర ప్రయాణాలు, నిరంతర ఉద్యమంతో భికాజీ ఆరోగ్యం దెబ్బ తిన్నది. 1935లో ఆమెకు పక్షవాతం సోకింది. ఒకసారి గుండెపోటు వచ్చినా బయటపడింది. అప్పుడు మళ్లీ భారతదేశం వెళ్లిపోవాలన్న కోరికను వ్యక్తం చేశారామె. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్న నమ్మకంతో ఆంగ్ల ప్రభుత్వం అనుమతించింది. స్వదేశానికి చేరుకున్న తొమ్మిది మాసాలకే ఆగస్టు 13, 1936న ఆ విప్లవ మహిళ తుది శ్వాస విడిచారు. కొందరు పేర్కొన్నట్టు ఆమె ‘భారత విప్లవోద్యమ మాత.’భికాజీ రాజనీతిజ్ఞత విశిష్టమైనది. తీవ్ర జాతీయవాదులు, భారత జాతీయ కాంగ్రెస్‌తో మమేకమైన నౌరోజీ వంటి మహనీయులు–ఈ రెండు శిబిరాల ఉద్దేశం, లక్ష్యం భారత స్వాతంత్య్రమేనన్న వాస్తవాన్ని తొలిసారిగా గుర్తించినవారిలో మొదటిగా గుర్తుకు వచ్చే వ్యక్తి భికాజీ కామా. కానీ స్వదేశంలో మితవాద కాంగ్రెస్ నాయకులు ఈ విధమైన ఆలోచనకే సుదూరంగా ఉండిపోయారు. దీని ఫలితమే దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో కొన్ని చోట్ల శూన్యం కనిపిస్తుంది. పరాయి గడ్డ మీద అంతకాలం ఉద్యమించడం దాదాపు ఆమెకు మాత్రమే సాధ్యమైంది. మేడమ్ కామా పరాయి గడ్డ మీద ఉండి స్వతంత్ర భారతదేశం కోసం అద్భుతమైన ఉద్యమం సాగించారు. ఆమె రూపొందించిన పతాకాన్ని ఇందులాల్ యాగ్నిక్ అనే గుజరాత్ ప్రాంత సోషలిస్టు ఉద్యమకారుడు స్వదేశానికి చేర్చాడు. కానీ ఆమె త్యాగనిరతి గాధ ఇప్పటికీ స్వదేశానికి చేరలేదు. స్వాతంత్య్రానికి ముందు ఉన్న 37 ఏళ్ల విప్లవ జీవితం, స్వతంత్ర భారతదేశ చరిత్ర పుస్తకాలలో తగిన స్థానం కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పటికైనా నెరవేరుతుందా? డా. గోపరాజు నారాయణరావు -
స్వాతంత్య్రమే.. సాధికారత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రోజులు మారాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు సాధించలేనిదంటూ ఏమీ లేదు. కాస్త ప్రోత్సహిస్తే చాలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. అసాధ్యమనుకున్న వాటిని సాధ్యం చేసి చూపిస్తున్నారు. అయితే పురుషాధిక్య సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక రకంగా వివక్ష ఉంటోంది. అందుకే మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలగాలి. ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా ఎదిగినప్పుడే సాధికారత దిశగా అడుగులు పడతాయి’ అని అంటున్నారు జిల్లా పోలీస్‌బాస్ డాక్టర్ బి.అనురాధ. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో తన అనుభవాలు, సమాజంలో అమ్మాయిల పట్ల చోటు చేసుకుంటున్న వివక్షతో పాటు మహిళా సాధికారతపై ఎస్పీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లోనే... అందుకే వారికి సెల్యూట్ చేస్తా.. నేను ఒక ఆడపిల్లగా పుట్టినా కొన్ని విషయాల్లో చాలా లక్కీ అనే చెప్పాలి. కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలకు సరైన చదువులు చెప్పించకుండా ఇంటి వద్దే ఉంచడం... తొందరగా పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకోవడం చిన్నప్పుడే చేశాను. కానీ నా విషయంలో అలా జరగలేదు. అందుకే పదే పదే చెబుతుంటా.. మా అమ్మనాన్న కమల, జగన్‌మోహన్‌రెడ్డిలే నాకు స్పూర్తి ప్రదాతలని. ఎందుకంటే అమ్మాయిలుగా ఇసుమంత వివక్ష చూపకుండా సమానంగా చూశారు. మేం మొత్తం నలుగురు సంతానం. నాకు అన్న, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అందరినీ కూడా క్రమశిక్షణతో పెంచారు. మా అమ్మనాన్నలు విద్యావంతులు కావడంతో అందరికీ ఉన్నత విద్య చెప్పించడంతో పాటు సమాన అవకాశాలు కల్పించారు. ఇప్పుడు అన్నయ్య యూకేలో డాక్టర్, తమ్ముడు ఇంజనీర్‌గా, చెల్లెలు ఢిల్లీలోని జేఎన్‌యూ నుంచి ఎల్ఎల్ఎంలో బంగారు పతకం సాధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తోంది. ఇక నేను ఈ రోజు జిల్లా పోలీసు బాస్‌గా నిలబడగలిగానంటే అందుకు కారణం మా తల్లిదండ్రులే. అందుకే వారికి సెల్యూట్ చేస్తా. పెళ్లి తర్వాత భర్త శ్రావణ్‌కుమార్‌రెడ్డి కూడా ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. నిత్యం తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పోలీసు జాబ్‌ను కుటుంబ సభ్యుల సహకారంతో సులువుగా నెగ్గుకొస్తున్నా. సర్వీస్‌లో చాలా చూస్తున్నా.. సర్వీస్‌లో భాగంగా ఆడవారిపై జరిగే వివక్షను చూస్తున్నా. ప్రస్తుతమంటే కాలం మారింది కానీ... గతంలో అమ్మాయిలపై ఒక రకమైన వివక్ష ఉండేది. అబ్బాయిలను ఒక రకంగా... అమ్మాయిలను ఒక విధంగా చూడటంతో పాటు అవకాశాల విషయంలో కూడా వివక్ష చూపేవారు. ఇప్పటికీ కొందరు అబ్బాయిలను గుర్తింపు పొందిన మంచి స్కూళ్లలో, అమ్మాయిలను మామూలు స్కూళ్లలలో చదివిస్తున్నారు. చిన్నప్పటి నుంచి చోటు చేసుకుంటున్న ఇలాంటి వాటి వల్ల సమాజంలో ఒక రకమైన భావన ఏర్పడుతోంది. అందుకే ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కుటుంబ వ్యవస్థలో మార్పురావాలి. అప్పుడే కాస్తయినా అమ్మాయిల విషయంలో వివక్ష తగ్గుతుంది. అప్పుడే పెళ్లంటే ఏం తెలుస్తుంది? ఇప్పటికీ మన గ్రామీణ వ్యవస్థలో అమ్మాయిలను భారంగా భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసి పంపించాలనే ఆలోచనలోనే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. ఎందుకంటే 18 ఏళ్లకే పెళ్లి చేస్తే వారికి ఏం తెలుస్తుంది? అప్పుడప్పుడే సమాజం, మనుషులను అర్థం చేసుకునే వయస్సు. అలాంటప్పుడు పెళ్లి చేస్తే జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? సమాజం పట్ల కనీస అవగాహన అవసరం. అమ్మాయిలు కూడా ధైర్యంతో అడుగు ముందుకు వేయాలి. పోరాట పటిమ అలవరుచుకోవాలి. ముఖ్యంగా ఆర్థికంగా నిలబడగలిగే శక్తి రావాలి. అలాగైతేనే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు. చట్టం గురించి తెలియకే అలా.. చాలా మంది అమ్మాయిలకు చట్టం గురించి తెలియడం లేదు. టీనేజ్‌లో ఆకర్షణకు లోనై ప్రేమ పేరుతో చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కనీస వయస్సు రాకుండానే జరుగుతున్న పెళ్లిళ్లు చాలా ఉన్నాయి. తెలిసీ తెలియని వయస్సులో పెళ్లి చేసుకోవడం.. తర్వాతి క్రమంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మా వద్దకు వచ్చే చాలా కేసులు ఇలానే ఉంటాయి. ఇలాంటి కేసులను సున్నితంగా డీల్ చేస్తాం. సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇటీవలి కాలంలో మా పోలీసు శాఖ తరఫున ఏయే చట్టాలు ఏవిధంగా ఉపయోగపడుతాయనే అంశంపై స్కూళ్లు, కాలేజీల్లో సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కళాజాత బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. తాట తీస్తా... అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించిన సహించేది లేదు. చట్టప్రకారం వారి తాట తీస్తాం. ప్రస్తుతం మా షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాలేజీలతో పాటు పబ్లిక్ ప్లేస్‌ల వద్ద మా సభ్యులు మఫ్టీలో ఉండి పర్యవేక్షిస్తుంటారు. ఎవరైన తిక్కతిక్క నక్రాలు చేస్తే ఆధారాలు సేకరించి స్టేషన్‌కు పట్టుకొస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. అయినా రెండో సారి పట్టుబడితే మా ట్రీట్మెంట్ చూపిస్తాం. అంతేకాదు మహిళా ఉద్యోగుల పట్ల కూడా సహచర ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తిస్తున్న సందర్భా లు కూడా చోటు చేసుకుంటున్నాయి. వారిపై నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఆ ఫీలింగ్ ఇప్పటికీ ఉంది.. ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించలేక పోతున్నాననే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. నేను చేస్తున్నది పోలీస్ జాబ్. ఈ వృత్తిలో రాత్రి, పగలు తేడా ఉండదు. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. పిల్లలు చిన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ నేను ఎంతో ఇష్టంగా సాధించుకున్న పోలీసు జాబ్‌కు న్యాయం చేయాల నే భావనలో మనస్సు లోకి వచ్చేది. నా పరిస్థితిని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం పిల్లలు సుజీత్‌రెడ్డి, ధరణిరెడ్డి ఇద్దరూ మెడిసిన్ చదువుతున్నారు. అయితే కొన్ని సందర్భా ల్లో ఇబ్బందికరంగా ఫీలయ్యే దాన్ని. చాలా దగ్గరి బంధువుల ఫంక్షన్లకు కూ డా హాజరయ్యే పరిస్థితి ఉండేది కాదు. అందుకే బంధువులు.. ఏ ఫంక్షన్‌కు హాజరు కావు.. అని పదేపదే అంటుంటా రు. కానీ నా వృత్తి ద్వారా పది మందికి న్యాయం జరుగుతుండటంతో అవన్నీ మర్చిపోతుంటా. -
‘అమ్మ’కు విముక్తి కలిగించేందుకు...
సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళామణులదీ విశేషపాత్ర. వారిలో కొందరు తమకే సొంతమైన ధీరత్వంతో చరిత్రకెక్కారు. భూమాత‘అమ్మ’ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించేందుకు తమ వంతు కృషి చేసిన కొందరు మహిళా మూర్తులను మరోసారి స్మరిద్దాం.. తరిద్దాం.. జై భరతనారీ.. ఝాన్సీ లక్ష్మీబాయి భారతీయ స్త్రీ అంటే ధైర్యానికి ప్రతీక అని చాటి చెప్పిన ధీర వనిత. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ’ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ప్రకటించిన వీరనారి. కొడుకును వీపున కట్టుకుని పోరాడుతూ అతివ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీ మూర్తి. బేగం హజ్రత్ మహల్(1820-1879) అవధ్ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్ మహల్ భర్త నవాబ్ వాజిద్ అలీ షా మరణానంతరం పాలనా బాధ్యతలు స్వీకరించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, తన అనుచరులతో కలిసి లక్నోను ఆక్రమించుకున్నారు. కొడుకు బిజ్రిస్ కాద్రాను అవధ్‌కు రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటీష్ అధికారుల కుయుక్తుల ముందు ఓడిపోయి, బహిష్కరణకు గురై కలకత్తాకు వెళ్లిపోయారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆలయాలు, మసీదులు కూల్చివేసి ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిచ్చిన రాణిగా అందరి దృష్టి ఆకర్షించారు. 1857- 1859 జాతీయ విముక్తి తిరుగుబాటుకు బేగం నాయకత్వం వహించారని కార్ల్ మార్క్స్, తన పుస్తకంలో పేర్కొన్నారు. మేడమ్ బికాజీ కామా(1861-1936) పార్శీ వర్గానికి చెందినవారు. 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి ప్రబలించినపుడు ఆమెకు వ్యాధి సోకినప్పటికీ ఇతరులకు సాయం చేశారు. మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. స్వాతంత్ర్యోద్యమానికై జీవితాన్ని ధారపోశారు. దాదాబాయ్ నౌరోజీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో శ్యామ్ కృష్ణ వర్మ స్థాపించిన ‘ఇండియన్ హోమ్‌రూల్ సొసైటీ’కి మద్ధతుగా నిలిచారు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సామాజిక సదస్సులో పాల్గొని భారత జెండాను ప్రదర్శించారు. భారత ఉపఖండం కరువును జయించిన తీరును వివరించారు. మానవ హక్కులకై, సమానత్వం సాధించుటకై కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1935లో యూరప్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. సరోజిని నాయుడు భారత కోకిలగా సుప్రసిద్ధురాలైన సరోజిని నాయుడు గవర్నర్ పదవి నిర్వహించిన తొలి భారతీయ మహిళ. స్వతంత్ర పోరాటంలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. గొప్ప కవయిత్రి కూడా. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ‘ఖైజర్-ఎ-హింద్’ పతకంతో సత్కరించింది. కస్తూర్బా గాంధీ భారత జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగానే కాకుండా రాజకీయవేత్తగా, పౌర హక్కులకై పోరాడిన మహిళగా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గుర్తింపు పొందారు. కుటుంబ బాధ్యత తీసుకుని గాంధీజీకి అండగా నిలిచారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ ఆవశ్యకతతో పాటు, విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. విజయ లక్ష్మీ పండిట్(1900-1990) సంపన్న కుటుంబంలో జన్మించిన విజయ లక్ష్మీ పండిట్ భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పండిట్ జవహర్ లాల్ సోదరి. కేబినెట్ పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. స్థానిక స్వయం ప్రభుత్వ, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్ తరపున మాస్కో, వాషింగ్ట్‌న్, లండన్ మహిళా రాయబారిగా పనిచేశారు. సుచేతా కృపలానీ(1908-1974) స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా(ఉత్తర్ ప్రదేశ్) చరిత్ర సృష్టించారు. కమలా నెహ్రూ(1899-1936) జవహర్లాల్ నెహ్రూ భార్య. సహాయ నిరాకరణోద్యమంలో మహిళా బృందాలను సంఘటితపరుస్తూ, విదేశీ దుస్తులు, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. భర్త హాజరుకాని సమావేశాలకు ఆయన తరపున వెళ్లి ఉపన్యసించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనీబిసెంట్(1857-1933) భారతదేశం స్వతంత్రంగా మారాలని ఆకాక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్‌కు చెందిన వారు. బాలగంగాధర్ తిలక్‌తో కలిసి ‘హోం రూల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. అరుణా అసఫ్ అలీ(1909-1996) భారత రత్న అవార్డు గ్రహీత. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (1909-1981) తెలుగు వనిత దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గాంధీజీ అనుచరురాలిగా సుప్రసిద్ధులు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉన్న సమయంలో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించారు. దీని ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. -సుష్మారెడ్డి యాళ్ళ -
కుదురులేని భర్తతో.... ఎదురీదడమూ... స్వాతంత్య్ర సంగ్రామమే!
ఆమె పేరు దీపాలి ఘోష్. ప్రేమను పంచే ఆమె మనసు, కష్టాలను ఎదుర్కొనగలిగే ఆమె ధైర్యం, ఒంటరిగా ఉన్నా ఎటువంటి మచ్చ పడకుండా గడిపిన ఆమె నిజాయితీ... ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచేలా చేశాయి. ఈ కథ స్వాతంత్య్రానికి పూర్వం ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌లో ఒక మారుమూల ప్రాంతం. ఆమె వయసు నాలుగు సంవత్సరాలు. తల్లి మరణించింది. తండ్రి మరో వివాహం చేసుకోలేదు. అత్యంత సంపన్నురాలైన తన సోదరికి పిల్లను అప్పచెప్పాడు. మేనత్త ఆమెను రాకుమార్తెలా పెంచింది. అయినా తన తోటివారు తల్లిదండ్రులతో సంతోషంగా ఆడుకుంటుంటే, ఆ పసి హృదయానికి తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేవారు. అలాగే పెరిగి పెద్దదైంది. ఆమె చాలా తెలివైనది, అందమైనది. వంద గ్రామాలకు అధిపతి అయిన ఒక జమీందారుతో ఆమెకు 14వ ఏటే 1945లో వివాహం జరిగింది. ఏ లోటూ లేకుండా జీవితం హాయిగా సాగింది. భర్తకు ఉద్యోగం ఇప్పించింది! రెండో ప్రపంచం ముగుస్తున్న ఆ కాలంలో.. బెంగాల్... తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్‌గా చీలిపోయింది. సంపన్నులందరూ తక్కువ ధనంతో పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ఆమె కూడా భర్తతో కలిసి కలకత్తా నగరం చేరుకుంది. అయితే గత వైభవం లేకపోవడంతో జీవితం దుర్భరంగా మారింది. సంపద పోయినా భర్తలో జమీందారీతనం పోలేదు. ఒక్క పైసా కూడా సంపాదించకుండా, ఆమె మీద అజమాయిషీ చేయడం ప్రారంభించాడు. ఆమె ఎంతో కష్టం మీద భర్తకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం వేయించింది. చేరిన కొద్ది రోజులకే ఆ ఉద్యోగం మానేశాడు. అప్పటికే వారికి ఐదుగురు సంతానం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మామగారు షాపు పెట్టించాడు కూతురి కష్టాల్ని కళ్లారా చూస్తున్న ఆమె తండ్రి... తాను దాచుకున్న సొమ్ములన్నీ అమ్మేసి, అల్లుడికి ఒక పెద్ద షాపు ఇచ్చాడు. అది కూడా నిలబెట్టుకోలేకపోయాడు భర్త. డబ్బు లేకుండా ఐదుగురు పిల్లల్ని ఎలా పెంచాలా అనే ఆలోచనతో ఆమెకు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు. భర్తను ఎలాగో ఒప్పించి ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగంలో చేర్పించింది. అక్కడ కూడా ఉద్యోగం మానేసి, ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ప్రారంభించాడు. ఇక ఆమె ధైర్యం చేయక తప్పలేదు. తాను ఉద్యోగం చేస్తానని తేల్చి చెప్పేసింది. అతడికి ఆ మాటలు నచ్చలేదు. విడాకులు ఇచ్చేస్తానని బెదిరించాడు. ఆమె అంగీకరించింది. ఇద్దరూ విడిపోయారు. ఐదుగురు పిల్లలతో ఆమె ఘజియాబాద్‌లో ఒక చిన్న ఇంట్లోకి మారింది. విడాకులు ఒడ్డుకు చేర్చాయి ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేది. డబ్బు కోసం మైళ్ల కొలదీ దూరం నడిచేది. పని నుంచి ఇంటికి వచ్చాక, ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పేది. ఒక్కోసారి పిల్లలంతా భోజనం చేశాక, తనకు మిగిలేది కాదు. నిద్రకు కూడా దూరమైపోయింది. ఒక రాకుమార్తెలా పెరిగి, ఒక రాజకుమారుడిని పెండ్లాడి, అవసరాలు తీరడం కోసం రెండు ఉద్యోగాలు చేయడమంటే విధి పగ పట్టడమే కదా!రోజూ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉండేది. పనులన్నీ ఒంటరిగా చక్కబెట్టుకోవడం కష్టమని అర్థం చేసుకుంది. ఇంటి పనులు, చదువుకోవడం అన్నీ వారికి వారే చేసుకునేలా పిల్లలకు నేర్పింది. ఆమెలేదు.. ఆదర్శం ఉంది పిల్లల్ని పెంచడం కోసమే తన జీవితాన్ని అంకితం చేసింది. వచ్చిన ఆదాయంతో జాగ్రత్తగా జీవించడం అలవాటు చేసుకుంది. పిల్లల్ని వృద్ధిలోకి తీసుకువచ్చింది. నేడు పిల్లలంతా పెద్దవారయ్యారు, అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అందరూ మంచి హోదాలో ఉన్నారు. అయితే అవన్నీ చూడటానికి ఇప్పుడు ఆమె లేదు. నిద్రాహారాలు లేకుండా పనిచేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి, కన్ను మూసింది. (మనవరాలు సైనీ బెనర్జీ పాల్ ఈ విషయాలన్నీ ఇటీవలే వెల్లడించారు) -
స్వాతంత్య్రం వద్దు.. అభివృద్ధి కావాలి
కోల్‌కతా: చైనా నుంచి టిబెట్ స్వాతంత్య్రాన్ని ఆశించడం లేదని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి మాత్రం కోరుకుంటుందని చెప్పారు. గురువారం ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై మేం భవిష్యత్తు కోసం ఆలోచించాలి’ అని అన్నారు. చైనా, టిబెట్ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా.. సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చైనాతోనే ఉండాలని టిబెటన్లు కోరుకుంటున్నారని, అందువల్ల స్వాతంత్య్రాన్ని కాకుండా మరింత అభివృద్ధి ఆశిస్తున్నామని దలైలామా వెల్లడించారు. అదే సమయంలో టిబెటన్ల సంస్కృతి, వారసత్వాన్ని చైనా తప్పనిసరిగా గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు. ‘టిబెట్‌కు ప్రత్యేక సంస్కృతి, భాషలు ఉన్నాయి. చైనా ప్రజలు వారి దేశాన్ని ప్రేమిస్తారు. మేం మా దేశాన్ని ప్రేమిస్తాం’ అని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా చైనా ఎంతో మారిపోయిందని, ప్రపంచంతో సాగడం వల్ల గతంతో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకూ మారిపోయిందన్నారు. భారతీయులు బద్ధకస్తులు చైనీయులతో పోలిస్తే భారతీయులు బద్ధకస్తులని దలైలామా పేర్కొన్నారు. అయితే భారత్ అత్యంత నిలకడైన దేశమని, ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషించే సత్తా ఉందని చెప్పారు. భారత్‌లోని పరమత సహన స్ఫూర్తిని ఆయన కొనియాడారు. భారత్, చైనాలు హిందీ–చీనీ భాయ్ భాయ్ స్ఫూర్తితో సాగాలని సూచించారు. భారతీయుల నవ్వు స్వచ్ఛమైనదని, చైనా అధికారులు కృత్రిమంగా నవ్వడంలో నిపుణులని దలైలామా నవ్వుతూ చెప్పారు. -
కలసి ఉంటే నష్టపోతున్నాం
సాక్షి నాలెడ్జ్ సెంటర్: సాధారణంగా వెనుకబడిన, దోపిడీకి గురయ్యే ప్రాంతాల ప్రజలే తమకు ప్రత్యేక రాష్ట్రం/దేశం కావాలంటూ ఉద్యమిస్తుంటారు. ఐరోపా ఖండంలోని పలుదేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బాగా అభివృద్ధిచెందిన, సంపన్న ప్రాంతాల ప్రజలే విడిపోవాలని కోరుకుంటున్నారనడానికి తాజా ఉదాహరణ కేటలోనియా. ఇలాంటి ప్రాంతాలు మరికొన్ని ఉన్నాయి. స్పెయిన్‌లో ఇటలీకి ఆనుకుని, మధ్యధరా సముద్రతీరంలో ఉన్న కేటలోనియా విస్తీర్ణం 32 వేల చదరపు కిలోమీటర్లు. స్పెయిన్‌లో అంతర్భాగంగా ఉండి నష్టపోతున్నామన్న భావన నుంచే కేటలోనియాలో ప్రజాస్వామిక స్వాతంత్య్ర కాంక్ష పుట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరిపి, స్వాతంత్య్రం ప్రకటించుకుని కేటలోనియా సంచలనం సృష్టించింది. కేటలాన్ భాష ప్రాచుర్యంలో ఉన్న ఈ ప్రాంత జనాభా 76 లక్షలు. స్పెయిన్ సైనిక నియంత జనరల్ ఫ్రాంకో పాలనలో కేటలాన్ భాష వినియోగంపై నిషేధం విధించారు. ఆ తర్వాత స్పానిష్ను కేటలాన్లపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. అయినా ప్రత్యేక భాష, సంస్కృతుల కారణంగా 20వ శతాబ్దంలో కేటలోనియాకు మళ్లీ స్వయంప్రతిపత్తి లభించింది. కేటలోనియాను స్పెయిన్ దోపిడీ చేస్తోందనేది స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న ప్రజల నినాదాల్లో ఒకటి. మొత్తం స్పెయిన్ జనాభాలో కేటలోనియా ప్రజలు 16 శాతం. ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎనలేని అభివృద్ది సాధించింది. ఆటోమొబైల్స్, రసాయన, ఆహార ఉత్పత్తులు, తయారీ, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితర రంగాల్లో కేటలోనియా స్పెయిన్ కన్నా ఎంతో ముందుంది. కేటలోనియా నుంచి పన్నుల రూపంలో స్పెయిన్ కేంద్ర సర్కారు భారీగా సొమ్ము సేకరిస్తోంది. అందులో స్వల్ప మొత్తాన్ని మాత్రమే స్వయంప్రతిపత్తి కలిగిన ఈ ప్రాంతంపై తిరిగి ఖర్చుచేస్తోంది. స్పెయిన్‌లో అంతర్భాగంగా ఉండి ఇలా నష్టపోయేకంటే వేరుగా ఉండి మరింత అభివృద్ధి చెందడమే మేలని కేటలాన్లు నమ్ముతున్నారు. అదీగాక, అమెరికా, ఐరోపాలోని మహానగరాలకు దీటైన బార్సిలోనా కూడా కేటలోనియాలోనే ఉంది. 1.2 లక్షల కోట్ల డాలర్ల స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు వాటా కేటలోనియా నుంచే వస్తోంది. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతుల్లో కేటలోనియా వాటా 25 శాతం. మిగతా దేశాల్లోనూ! కేటలోనియా తరహా స్వాతంత్య్ర కాంక్షతో ఉన్న ప్రాంతాలు యూరప్‌లో మరికొన్ని ఉన్నాయి. యూరోపియన్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యాలయం(బ్రసెల్స్) ఉన్న బెల్జియంలోని ఫ్లాండర్స్ ప్రాంతంలోనూ ప్రత్యేక దేశం డిమాండ్ వినిపిస్తోంది. జర్మనీలోని బవేరియా రాష్ట్రం స్వతంత్ర దేశంగా మారితే పది అగ్రగామి ఈయూ దేశాలను అధిగమిస్తుందని అక్కడి(బవేరియా) ప్రభుత్వమే చెబుతోంది. బవేరియా పార్టీ నాయకత్వాన స్వాతంత్య్రం కోసం డిమాండ్ ఉంది. ఇటలీలో మహానగరాలు మిలన్, వెనిస్‌లు ఉన్న లొంబార్డీ, వెనెటో ప్రాంతాలు కూడా స్వాతంత్య్రం కోసం జనాభిప్రాయసేకరణ జరపాలని తీర్మానించాయి. కమ్యూనిస్టుల పాలనలో చెకొస్లోవేకియాగా అనేక దశాబ్దాలు కొనసాగిన దేశంలోని సంపన్న ప్రాంతం కూడా చెక్ రిపబ్లిక్‌గా వేరుపడింది. అమెరికాలో పెద్ద, సంపన్న రాష్ట్రాలైన కేలిఫోర్నియా, టెక్సస్‌లో కూడా వేర్పాటు డిమాండ్లు ముందుకొస్తున్నాయి. బాగా వెనుకబడిన అల్పసంఖ్యాకవర్గాలు జాతి వివక్షను కారణంగా చూపి ‘వేర్పాటు’ డిమాండ్లు చేస్తాయనేది సాధారణ నమ్మకం. -
స్పెయిన్ గుప్పిట్లోకి కాటలోనియా
మాడ్రిడ్: ఐరోపా దేశం స్పెయిన్‌లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న మరుసటి రోజే కాటలోనియాను స్పెయిన్ తన ప్రత్యక్ష పాలనలోకి తీసుకుంది. వేర్పాటువాదులకు సహకరిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాటలోనియా పోలీస్ చీఫ్ జోసెఫ్ లూయిస్ త్రాపెరోపై శనివారం వేటుపడింది. స్పెయిన్ నుంచి విడిపోవడానికి అక్టోబర్ 1న కాటలోనియా నిర్వహించిన రెఫరెండాన్ని అడ్డుకోవాలన్న కోర్టు ఆదేశాలను త్రాపెరో బేఖాతరు చేశారని స్పెయిన్ ప్రభుత్వం ఆరోపించింది. కాటలోనియా విద్య, ఆరోగ్యం, పోలీసు, సివిల్ సర్వీసెస్ తదితర సేవలన్నీ స్పెయిన్ అధీనంలోకి వెళ్తాయి. -
మాదీ ఇక స్వతంత్ర దేశం!
బార్సిలోనా: స్పెయిన్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ కాటలోనియా చేస్తున్న ఉద్యమం పతాక స్థాయికి చేరింది. స్వాతంత్య్రానికే మొగ్గు చూపుతూ జరిగిన రిఫరెండానికి కొనసాగింపుగా స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి శుక్రవారం బార్సిలోనాలోని కాటలోనియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘గణతంత్ర స్వతంత్ర దేశంగా కాటలోనియాను ప్రకటిస్తున్నాం’ అనే ఆ తీర్మానానికి అనుకూలంగా 70 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓటేశారు. ఆ నిర్ణయం చట్టబద్ధం కాదని, అమలుకు వీలుకాదని స్పెయిన్ తేల్చిచెప్పింది. కాటలోనియాపై ప్రత్యక్ష పాలన విధించేలా ప్రధాని రజోయ్‌కి అధికారాలను అప్పగిస్తూ స్పెయిన్ సెనెట్ తీర్మానం చేసింది. ఐక్య స్పెయిన్‌కే యూరోపియన్ యూనియన్, అమెరికాలు మద్ధతు ప్రకటించాయి. కాటలోనియా పార్లమెంట్‌ను రద్దు చేసి, డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు. కాటలోనియా పార్లమెంటభవనం బయట ఉదయం నుంచే వేలాది మంది స్వాతంత్య్ర మద్దతుదారులు గుమిగూడారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఓటింగ్‌లో పాల్గొనడానికి ప్రతిపక్షం నిరాకరిస్తూ వాకౌట్ చేసింది. అయినా మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటేయడంతో కాటలోనియాను స్వతంత్ర రిపబ్లిక్ దేశంగా ప్రకటించేందుకు ఉద్దేశించిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ ఫలితం ప్రకటించిన వెంటనే కాటలోనియన్లు సంబరాలు చేసుకున్నారు. స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ఇటీవల నిర్వహించిన రెఫరెండంలో 90 శాతం మంది అనుకూలంగా ఓటేసిన సంగతి తెలిసిందే. దీని ఫలితం ఆధారంగానే స్వతంత్ర దేశం ప్రకటించుకుంటామని వేర్పాటువాద నాయకుడు ప్యూగ్డెమోంట్ స్పెయిన్ ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించారు. స్పెయిన్‌లో పాక్షిక స్వతంత్ర హోదా ఉన్న కాటలోనియాలో 16 శాతం ప్రజలు నివసిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు ఆ ప్రాంతానిదే. తమ వ్యవహారాల్లో స్పెయిన్ జోక్యాన్ని నిరసిస్తున్న కాటలోనియా వాసులు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తమ గళాన్ని పెంచారు. తమ ప్రాంతానికి పూర్తి స్వాతంత్య్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. వేర్పాటువాదుల ప్రయత్నా లను అణచివేయడానికి స్పెయిన్ ఏ మార్గాన్నీ వదలడం లేదు. దేశంలో రాజకీయ అస్థిరతకు ప్రధాన కారణం వేర్పాటువాదులేనని ప్రధాని ఆరోపిస్తున్నారు. -
కేటలోనియా సర్కారు రద్దుకు స్పెయిన్ నిర్ణయం
మాడ్రిడ్: కేటలోనియా వేర్పాటువాద ప్రభుత్వాన్ని రద్దుచేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. వేర్పాటువాద నేతలు స్వాతంత్య్రం ప్రకటించకుండా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. శనివారం అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించిన ప్రధాని మేరియానో రాజోయ్ కేటలోనియా ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కేటలోనియన్ పార్లమెంటును రద్దుచేసేందుకు తనకు సంపూర్ణ అధికారాలివ్వాలని స్పెయిన్ సెనెట్‌ను ఆయన కోరారు. సెనెట్‌లో రాజోయ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పాపులర్ పార్టీకి మెజారిటీ ఉంది. -
స్వాతంత్య్రం దిశగా కాటలోనియా!
బార్సిలోనా: స్పెయిన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. రాజు ఫెలిప్–6 ఆదేశాలను బేఖాతరు చేస్తూ త్వరలోనే స్వాతంత్య్రం ప్రకటించుకుంటామని కాటలోనియా నాయకులు బుధవారం తేల్చి చెప్పారు. మరోవైపు, దేశద్రోహం ఆరోపణలపై కాటలన్ వేర్పాటువాద నాయకులు, పోలీసులపై కోర్టులు విచారణను ముమ్మరం చేశాయి. స్పెయిన్ జాతీయ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన రాజు ఫెలిప్–6, కాటలోనియాకు స్వతంత్ర హోదానివ్వడం అప్రజాస్వామికమని పేర్కొనడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల మధ్య సామరస్యం నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. కాటలన్ నాయకులు బాధ్యతారాహిత్యంతో దేశ, ప్రాంత ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి చేటుచేస్తున్నారని విమర్శించారు. రాజు ప్రకటనపై కాటలన్ నాయకులు మండిపడ్డారు. కాగా, ఈ వారం చివరన లేదా వచ్చే వారం ప్రారంభంలో కాటలన్కు అక్కడి ప్రభుత్వం స్వాతంత్య్రం ప్రకటిస్తుందని వేర్పాటువాద నాయకుడు కార్లెస్ పుయిగ్డెమంట్ చెప్పారు. రెఫరెండం ఓట్ల లెక్కింపు పూర్తి కావొచ్చిందని కాటలన్ ప్రభుత్వ ప్రతినిధి జోర్డి తురుల్ వెల్లడించారు. -
పేదల సంక్షేమమే థ్యేయం
మంత్రి కిమిడి కాకినాడ రూరల్: దేశం, రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళావెంకటరావు ఉద్ఘాటించారు. మంగళవారం ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ మైదానంలో ఏర్పాటు చేసిన 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. విడిపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రజలు ఎంతో సహకరిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సహకరించి రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో నడిపించడానికి సహకరించాలని కిమిడి కోరారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు., 90 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురువేసి జెండా వందనం చేశారు. ఏఆర్ ఫ్లటూన్, ఎన్సీసీ తదితర దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రిజర్వు దళాలు ప్రదర్శించిన సంప్రదాయ కవాతును తిలకించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ ద్వారా 4,828 మహిళా సంఘాలకు రూ. 124 కోట్లు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి ద్వారా 2017 మంది సభ్యులకు రూ.25 కోట్ల 22 లక్షల మొత్తాన్ని రుణాలుగా మంత్రి అందించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజీ, సబ్సిడీ కలిపి 25 యూనిట్లకు రూ.42 కోట్ల 67 లక్షలు, ఎన్ఎస్ఎఫ్డీసీ ఆరు యూనిట్లకు రూ. 14 కోట్లు లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ద్వారా 10 ట్రై సైకిళ్లు, ఆరు వీల్ చైర్లు, ఏడుగురికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా కోటి రూపాయలు విలువైన ఒక్కొక్కటి రూ. 10 లక్షలు విలువ గల 10 స్కార్పియో, టాటా జిస్ట్ తదితర వాహనాలను 9 మంది ఎస్సీ, ఒకటి ఎస్టీ లబ్ధిదారులకు అందించారు. సాంఘిక సంక్షేమ శాఖ చే కులాంతర వివాహాలు చేసుకున్న 84 జంటలకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున రూ. 42 లక్షలు అందజేశారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు... విద్యాశాఖచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. వీరిలో ప్రగతి ఇంగ్లిషు మీడియం స్కూల్ విద్యార్థులచే ప్రదర్శించిన స్వాగతం, స్వాగతం పాటకు, సెయింట్ అన్స్ గరల్స్ హైస్కూల్ విద్యార్థులచే ప్రదర్శించిన నృత్య రూపకం, ఆదిత్యా ఇంగ్లిషు మీడియం, శ్రీనగర్ విద్యార్థులచే ప్రదర్శించిన నృత్య రూపకాలకు మంత్రి కిమిడి జ్ఞాపికలను అందజేశారు. శకటాల ప్రదర్శన... శకటాల ప్రదర్శనలో దేవాదాయశాఖ అన్నవరం, వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ, విద్యాశాఖ–సర్వశిక్షా అభియాన్, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ–ఎస్సీ కార్పొరేషన్, సమీకృత గిరిజనాభివృద్ధి, పర్యాటక, మత్స్య, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డీఆర్డీఏ, వెలుగు శాఖలు నిర్వహించే కార్యక్రమాల అంశాలతో శకటాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిచారు. పౌర సరఫరాల శకటానికి ప్రథమ స్థానం, వ్యవసాయశాఖకు ద్వితీయ, అటవీశాఖకు తృతీయ బహుమతిని మంత్రి కిమిడి, జాయింట్ కలెక్టర్ మల్లికార్జునలు అందజేశారు. మార్చ్ ఫాస్ట్‌లో ఏఆర్ ప్లటూన్ మొదటి స్థానం, ఎన్సీసీ బాలికల విభాగానికి రెండో, బాలుర విభాగానికి మూడో స్థానం లభించిందిం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు చోడేపల్లి హనుమంతరావును మంత్రి కిమిడి, కలెక్టర్ కార్తికేయమిశ్రా, ఎస్సీ విశాల్గున్నిలు సన్మానించారు. స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి... జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, డ్వామా, విద్యాశాఖ తదితర శాఖలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి కళా సందర్శించి తిలకించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జేసీ ఎ.మల్లికార్జున, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఆర్ఓ ఎం.జితేంద్ర, ఆర్డీఓ ఎల్.రఘుబాబు, స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యుడు ఎన్. శ్రీనివాస్‌లతోపాటు వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
71 వసంతాల స్వాతంత్ర్యం
-
ఫస్టు.. పంద్రాగస్టు
నిర్మల్‌రూరల్: నాలుగు శతాబ్ధాల చరిత్ర కలిగిన నిర్మల్ ప్రాంతం సాహసోపేతమైన వీరుల చరిత్రకు.. వారి అసమాన త్యాగాలకు సజీవ సాక్ష్యం. ఆంగ్లేయ, నిజాం రాజులను ముప్పతిప్పలు పెట్టి, గొలుసుకట్టు చెరువుల నీళ్లు తాగించిన ఘనత ఇక్కడి వీరులది. తమ వద్ద అధునాతన ఆయుధాలు లేకున్నా, శక్తియుక్తులతో శత్రువులను హడలెత్తించిన ధీరులు వారు. 1857లో జరిగిన ప్రథమసంగ్రామంలోనే నిర్మల్ ప్రాంతం పాల్గొంది. 1860లో వెలుగులోకి వచ్చిన ధీరుడు రాంజీగోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీగోండు చెల్లాచెదురుగా ఉన్న ఈ ప్రాంతవాసులందరినీ ఏకం చేశాడు. పరాయి దేశం నుంచి వచ్చి భరతమాతను బంధించిన ఆంగ్లేయులపై పోరాడాలని పిలుపునిచ్చాడు. అడవుల్లోకీ చొచ్చుకు వస్తున్న ఆంగ్లేయులను దొంగదెబ్బ తీయాలని సమరశంఖం మోగించాడు. స్థానిక హైదరాబాద్ పాలకులకూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చాడు. ఇందుకు గోదావరి తీరంలో.. చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. వీటిని కేంద్రంగా చేసుకుని ఆంగ్లేయులపై నెలల తరబడి పోరు సాగించాడు. అప్పటి నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం, ఆంగ్లేయ బలగాలు దాడులకు పాల్పడ్డాయి. వాళ్లను రాంజీగోండు సైన్యం వీరోచితంగా ఎదుర్కొంది. తమవద్ద బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలూ ఉన్నా కొరకరాని కొయ్యగా రాంజీగోండు మారడంతో శత్రువులు దొంగదెబ్బ తీశారు. రాంజీగోండుతో సహా వెయ్యిమంది వీరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న నిర్మల్ నుంచి ఎల్లపెల్లికి వెళ్లే మార్గంలో గల మహా మర్రిచెట్టుకు ఈ వెయ్యిమంది వీరులను ఉరితీశారు. మాతృభూమి కోసం పోరాడిన వీరులు చిరునవ్వులతోనే ఉరికొయ్యలను ముద్దాడారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర కనీసం బయటకు రాలేదు. ఈ మధ్యే రాంజీగోండు పేరిట నిర్మల్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మ్యూజియం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సమరయోధుల సంఘటిత పోరు ప్రథమ స్వాతంత్ర పోరాటంలో రాంజీగోండు ప్రజలను ఏకం చేస్తే.. మలి పోరులో ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు సంఘటితంగా పరాయిపాలనపై పోరు జరిపారు. అప్పటి నిర్మల్ పంచాయతీ సమితి పరిధిలో గోపిడి గంగారెడ్డి, గణపతి, బాపూరావు, బోరేగాం గజన్న, లాలు పటేల్, ఎ.రాజన్న, పోశెట్టి, గంగాధర్, శివన్న, గంగారాం, విఠల్‌రావు, జమునాలాల్, వెంకోబరావు, చిన్న నర్సింహులు, లింగారెడ్డి, సుందర్రాజ్, ఎల్లయ్య, గంగాధర్‌గుప్తా.. ఇలా ఎంతోమంది సమరయోధులు ముందుండి పోరాడారు. అప్పట్లో నిజాం పాలనను ఎదుర్కొనేందుకు నిర్మల్ ప్రాంతంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో పోరాటాలను చేపట్టారు. ఇప్పటికీ స్థానిక నాయిడివాడ రాంరావ్బాగ్లో ఆర్యసమాజ్ మందిరం ఉంది. దీని కేంద్రంగా సమరయోధులు పోరాటాలకు రూపకల్పన చేసేవారు. నైజాం, ఆంగ్లేయుల అణచివేతలో భాగంగా ఎంతోమంది సమరయోధులు నెలల తరబడి జైళ్లకు వెళ్లారు. ఇక్కడి నుంచి వీరిని మహారాష్ట్రలోని నాందేడ్, చంద్రాపూర్, ఔరంగాబాద్ తదితర దూర ప్రాంత జైళ్లకు పంపించేవారు. ఇలాంటి నిర్బంధాలను ఎన్నో ఎదుర్కొన్నా వెరువకుండా తమ పోరు సాగించారు. అప్పట్లోనే తమ వద్ద చిన్న పిస్టళ్లను, మందుగుండును వెంట ఉంచుకునేవారు. దేశానికి 1947 ఆగస్టు 15నే స్వాతంత్య్రం సిద్ధించినా నిజాం పాలనలోనే మన ప్రాంత చీకట్లు మాత్రం తొలగలేదు. ఈ దశలో ఓవైపు రజాకార్ల దౌర్జన్యాలూ పెరిగిపోయాయి. వారిని ఎదుర్కొంటూ స్వాతంత్య్రం వచ్చే వరకు ఆనాటి మన సమరయోధులు అసమాన పోరు సల్పారు. వారి పోరాటాలకు గుర్తుగా జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వారి పేర్లతో స్తూపాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలి వేడుక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గతేడాది దసరా పండుగ(అక్టోబర్ 11) రోజున నిర్మల్ నూతన జిల్లాగా ఏర్పడింది. గతంలో నిర్మల్ రెవెన్యూ డివిజన్లో ఉన్న 13 మండలాలతో పాటు నూతనంగా ఏర్పడ్డ బాసర, నర్సాపూర్(జి), నిర్మల్ రూరల్, సోన్, పెంబి, దస్తూరాబాద్లతో కలిపి మొత్తం 19 మండలాలతో జిల్లా ఆవిర్భవించింది. ఈ ఏడాది జనవరి 26న జిల్లా తొలి గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ ఇలంబరిది తొలిసారి జెండాను ఎగురవేశారు. ఇప్పుడు నూతన జిల్లా ఆగస్టు 15న తొలి పంద్రాగస్టు పండుగను జరుపుకోనుంది. ఏర్పాట్లు పూర్తి తొలి స్వాతంత్య్ర దిన వేడుకలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశారు. మైదానంలో రంగుల జెండాలతో పాటు వేదిక, అధికారులు, అతిథులు కూర్చునే గ్యాలరీలనూ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. పోలీసులు పరేడ్ చేసేందుకు కావల్సిన లైనింగ్స్ వేశారు. ఇక వివిధ శాఖల శకటాల ప్రదర్శన కోసం వాహనాలను ముస్తాబు చేశారు. జిల్లాకేంద్రంలో తొలి స్వాతంత్ర దినోత్సవ జెండాను రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎగురవేయనున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. -
జనస్వామ్యం జిందాబాద్
వర్తమాన భారతం ► ఇలాంటి పండగ రోజు ఏ దేశమైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది. ►1947లో స్వాతంత్య్రం సిద్ధించాక భారతదేశానికి వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది. ►అలాంటి ప్రగతిని సాధించిన భారతావనినే ప్రపంచం తిరిగి తిరిగి చూస్తోంది. ►మన సామాన్యులు సామాన్యులు కారు. ►అసామాన్య పురోభివృద్ధి గలవారు. దీక్ష గలవారు. కీర్తి సాధకులు. ►స్వరాజ్య సప్తతి గుండెల్లో నింపిన ఊపిరితో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకానికి సలాం. ►70 ఏళ్ల జనస్వామ్యానికి జిందాబాద్. శతాబ్దాలపాటు పరాయిపాలనలో కొనసాగిన భారతదేశం 1947లో స్వాతంత్య్రం పొంది 70 ఏళ్లపాటు ప్రజాస్వామ్యదేశంగా మనుగడ సాగించడం మానవాళి చరిత్రలోనే ఒక మహత్తర విజయం. ఎందుకంటే వలసపాలన నుంచి బయటపడిన ఎన్నో దేశాలు ప్రజాతంత్ర మార్గంలో ప్రయాణం ప్రారంభించినప్పటికీ ఎక్కువకాలం ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగలేకపోయాయి. వాటి రాజ్యాంగాలు రద్దయ్యాయి. ఎన్నికైన ప్రభుత్వాలు సైనిక తిరుగుబాట్ల ఫలితంగా పతనమయ్యాయి. అక్కడ నియంతృత్వ ప్రభుత్వాలు రూపుదాల్చి పాతుకుపోయాయి. ప్రజాస్వామ్యం కన్నా నియంతృత్వమే మెరుగనే భావన కూడా ఆ దేశాల ప్రజల మనసుల్లో ఎంతోకొంత మేర బలపడింది. అందుకు భిన్నంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం బలపడుతూ, పాశ్చాత్య ప్రజాతంత్ర సమాజాల సరసన సమానంగా నిలబడింది. ప్రపంచంలోనే అతి పెద్ద సుదృఢ ప్రజాస్వామ్యంగా మన్ననలందుకుంటోంది. ఇదంతా తేలికగా సాధ్యమవలేదు. గత 70 ఏళ్ల కాలంలో భారతదేశం పలు విషమ పరిస్థితులను ఎదుర్కొంది. అంతర్గత తిరుగుబాటు నెపంతో 1975లో దేశంలో అత్యయికస్థితిని దేశంలో విధించింది నాటి ప్రభుత్వం. స్వతంత్ర సిక్కుదేశం కోసం అకాలీ తీవ్రవాదులు చేసిన ఉద్యమం, పర్యవసానంగా జరిగిన హింసాకాండ దేశసమగ్రతను ప్రశ్నార్థకం చేశాయి. పంజాబ్ కల్లోలం తర్వాత ప్రధాని ఇందిరాగాంధీని కాల్చిచంపారు. మండల్ రిజర్వేషన్ అంశం, మందిర్ వివాదం దేశాన్ని తీవ్ర సంక్షోభంలో పడవేశాయి. ఐరోపా సోషలిస్ట్రాజ్యాల పతనానంతరం ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చిన స్వేచ్ఛా విపణివాదానికి అనుకూలంగా దేశ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించాల్సివచ్చింది. ఈ విజయాలకు ప్రధాన కారణం ప్రజాస్వామ్య రాజకీయ పరిపాలనా చట్రం. శాంతిభద్రతలు, ప్రజాభిప్రాయం, ప్రజాసంక్షేమం, వ్యక్తిస్వేచ్ఛలు, ఆర్థికప్రగతి తదితర అంశాల్లో వేటికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? అవి ఏ పాళ్లలో ఉండాలి? అనే విషయాలను భారతప్రజలకు నేర్పింది ప్రజాస్వామ్యం. సామాజిక న్యాయానికి రిజర్వేషన్లు! సామాజికంగా వెనుకబడిన కులాలవారు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో తగినంత ప్రాతినిధ్యం పొందడానికి రిజర్వేషన్లు దోహదం చేస్తున్నాయి. పెరిగిన విద్యావకాశాలు, భూసంస్కరణలు, కులవృత్తులు వదలి నచ్చిన వృత్తులు చేపట్టగలిగే అవకాశాలు పెరగడం, రాజకీయ వికేంద్రీకరణ మొదలైన అంశాలు సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, నూతన లౌకిక పునాదుల మీద నిలబెట్టడానికి, సామాజిక పరిపుష్టతకూ దారితీశాయి. అత్యున్నత రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవుల్లో నేడు సామాన్య సామాజిక, కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేతలు ఉండడం భారత ప్రజాస్వామ్య విజయపథానికి సంకేతం. అలాగే, కమ్యూనిస్ట్‌పార్టీలు ఎన్నికల ద్వారా అధికారంలోకి రావడం, ప్రభుత్వాలు నడపడం, పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రముఖపాత్ర నిర్వహించడం ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే జరిగింది. నేటికీ కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు బలంగానే కొనసాగుతున్నాయి. హిందూ సాంస్కృతిక జాతీయవాదం పేరుతో బలపడిన భారతీయజనతా పార్టీ కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాక తన భావజాల తీవ్రతను క్రమేపీ తగ్గించుకుంది. పలు సామాజికవర్గాలను కలుపుకోగలిగింది. ఇతర పార్టీలతో జతకట్టింది. అలాగే, కులం, మతం, ప్రాంతం వంటి అస్థిత్వాల ఆధారంగా ఏర్పడిన పార్టీలు అధికారం చేపట్టాక తమ భావజాలంలోని చిక్కదనాన్ని తగ్గించుకున్నాయి. ఇంకా ఇతరులను కలుపుకుపోయే పంథాను అలవరుచుకున్నాయి. ఇవన్నీ భారత ప్రజాస్వామ్య విజయాలే. భారత ప్రజాస్వామ్య ప్రయోగం, విజయం ప్రపంచదేశాలకు కూడా కొన్ని సకారాత్మక సందేశాలు అందించాయి. స్వాతంత్య్రా నంతరం భారతదేశంలో ప్రజాస్వామ్యం సాధ్యమా? అని రాజకీయ పండితులు తర్జనభర్జనలు చేశారు. ఇండియాలో ప్రజాస్వామ్యం నిలబడుతుందా? స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్లకే భారత ప్రజలు తమ దేశాన్ని గణతంత్ర ప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నారు. భారత ప్రజాతంత్రవ్యవస్థ పనిచేయడం మొదలైన కొద్ది కాలానికే మళ్లీ రాజనీతి పండితులు ‘ఇండియాలో ప్రజాస్వామ్యం నిలబడి, పరిఢవిల్లుతుందా?’ అని అనుమానాలు వ్యక్తంచేశారు. భారత ప్రజాతంత్ర వ్యవస్థ తన అంతర్గత వైరుధ్యాలతోనే కుప్పకూలిపోతుందని కూడా వారు జోస్యం చెప్పారు. ఈ రాజనీతికోవిదుల సంశయాలు, జోస్యం తప్పని భారతప్రజాస్వామ్యం నిరూపించింది. ఈ డెబ్బయేళ్లలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. హింసాయుత ఆందోళనలు పుట్టుకొచ్చాయి. వేర్పాటువాద ఉద్యమాలు జరిగాయి. ఈ సమస్యలను బలప్రయోగం –సర్దుబాటు అనే సూత్రం ఆధారంగా భారత్ చాలా వరకు పరిష్కరించగలిగింది. ఒక ప్రాంతం అశాంతితో అట్టుడికిపోతున్నా, మిగతా దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను నడుపుకుపోవడం ప్రజలకు అలవాటయింది. అయితే, భారత ప్రజాస్వామ్యమంతా బ్రహ్మాండంగా ఉందనలేం. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకుంటాం. 70 సంవత్సరాలపాటు ప్రజాతంత్ర ప్రక్రియ, ప్రభుత్వాలు విజయవంతంగా కొనసాగుతున్నాయనుకుంటాం. అయితే, ఒక మేలైన ప్రజాస్వామ్యం ఇండియాలో ఉందని చెప్పడానికి ధైర్యం చాలదు. ఇటీవల పెచ్చుపెరిగిన కొన్ని రాజకీయధోరణులు భారతదేశానికి రాజకీయపరంగా పెద్ద సవాళ్లుగా మారాయి. ప్రజాస్వామ్యానికి మూడు సవాళ్లు మొదటిది రాజకీయ అవినీతి. రాజకీయాలను, ప్రభుత్వాధికారాన్ని సంపదను పోగుచేసుకునేందుకు మార్గంగా చూడడం చాలామంది రాజకీయనాయకులకు అలవాటు మారింది. ఒక్కొక్కరు పదో ఇరవయ్యో కోట్లు కాదు, వందల కోట్లు కాదు, వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు నిత్యం మనం రాజకీయనాయకుల నుంచే వింటున్నాం. రాజకీయపక్షాలను స్థాపించినవారు వాటిని తమ సొంత ఎస్టేట్లుగా పరిగణించడం సహజమయింది. రెండో సవాలు వారసత్వ రాజకీయాలు. రాజకీయ అధికారాన్ని సొంతాస్తిలా పిల్లలకు బదలాయించడం తమ హక్కుగా అధినాయకులు భావిస్తున్నారు. తాము ఎలాగైనా అధికారంలోకి రావాలని పిల్లలూ, కుటుంబసభ్యులూ శత విధాలా ప్రయత్నిస్తున్నారు. రాజనీతి పరిభాషకు భారత ప్రజాస్వామ్యం ఓ కొత్త మాటను జోడించింది. దాని పేరే ‘అనువంశిక ప్రజాస్వామ్యం’ లేదా వారసత్వ ప్రజాస్వామ్యం. ఇక మూడో సమస్య అధికార కేంద్రీకరణ. అధికారాన్ని కేవలం ఒక చోట కేంద్రీకరించడమేకాదు, ఒక వ్యక్తి చేతిలో పూర్తి అధికారం నిక్షిప్తం చేయడం. అంటే కేంద్రీకృత అధికారాన్ని ఒక బృందానికో, కమిటీకో కాకుండా వ్యక్తిపరం చేయడం. ఈ రకమైన ఏకవ్యక్తి నిరంకుశ పాలనను చాలా వరకు రాజకీయపక్షాల్లో, ప్రభుత్వాల్లో చూస్తున్నాం. ప్రజాతంత్ర ప్రభుత్వాలను ఏకచ్ఛత్రాధిపత్యం నెరపే అధినాయకులు నడపడం భారత ప్రజాస్వామ్య వైచిత్రి. సర్వత్రా ఇవే ధోరణులు! ఈ ధోరణులు చాలా పార్టీల్లో, అనేక ప్రభుత్వాల్లో దాదాపు అన్ని స్థాయిల్లో మనం చూస్తున్నాం. రాజకీయ అవినీతి, అనువంశిక పాలన, నిరంకుశ అధినాయకత్వం అనే మూడింటికి అంతర్గత అవినాభావ సంబంధముంది. బహుశా సామాజిక వెనుకబాటుతనం, విద్యలేమి, విస్తృత పేదరికం కలగలసి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ విపరీత ధోరణులకు దారితీసి ఉండొచ్చు. ఈ పరిస్థితిని అధిగమించి ఒక మేలైన, అర్థవంతమైన, సారవంతమైన ప్రజాస్వామ్యవ్యవస్థను ఏర్పరచుకోవడమెలా? అనేదే భారతప్రజల ముందున్న పెద్ద సవాలు. భారత ప్రజాస్వామ్యం గత 70 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలను అధిగమించి ముందుకు సాగింది. అదేవిధంగా రాబోయేకాలంలో కూడా భారత ప్రజాస్వామ్యం సవాళ్లను అధగమించి మరింత పరిపుష్టమై ముందుకు సాగుతుందని ఆశిద్దాం. – కొండవీటి చిన్నయసూరి ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం -
ప్రమాదంలో స్వాతంత్య్ర ఫలాలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్టు 15కి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ 70 ఏళ్ల కాలంలో దేశం సమస్యల సుడిగుండంలో ప్రయాణం చేస్తూనే, ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ నిలకడగా స్థిరత్వం, వృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. మన దేశం ఎందుకు స్వాతంత్య్రం కోల్పోయింది? స్వాతంత్య్ర సాధనలో మనం ఏం కోల్పోయాం అనే అంశాలను సమీక్షించుకుని అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంపైనే మన స్వాతంత్య్ర రక్షణ ఆధారపడి ఉంది. మనదేశం గత వెయ్యేళ్లుగా ఇస్లామిక్ సామ్రాజ్యవాదంపై ఎంతో ఘర్షణ పడింది. ఆ రోజుల్లో దేశంలో శక్తిమంతమైన రాజ్యాలున్నా, శక్తిమంతమైన సామ్రాజ్యాలు లేని కారణంగా మనం ఎంతో నష్టపోయాం. ఆ పెనుదెబ్బనుంచి మనం ఇప్పటికీ కోలుకోలేదనే చెప్పాలి. ఆ తర్వాత ఇస్లామ్ పాలన బలహీనపడుతూ, పాశ్చాత్య ప్రాబల్యం పెరుగుతూ వచ్చి మరో 200 ఏళ్లు దేశం బానిసత్వంలో మగ్గింది. 1857లో ఈస్టిండియా కంపెనీపై జరిగిన పోరాటంలో దేశంలోని హిందువులు, ముస్లింలు కలసి పోరాడారు. అదో అరుదైన సంఘటన. అయితే ఆ సమరంలో రాజకీయంగా ఓడిపోయాం కానీ మత మార్పిడిపై నైతిక విజయం సాధించాం. బ్రిటిష్ రాణి స్వయంగా వచ్చి మీ మతపరమైన విషయాల్లో మేం జోక్యం చేసుకోం అని ప్రకటించింది. తదుపరి కాలంలో అదే స్ఫూర్తితో ఈ దేశంలో స్వాతంత్య్ర పోరాటం జరిగి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం పొందాం.. కానీ దేశం ముక్కలైంది. ఈస్టిండియా పాలనలోని భారత్‌ని 1857 తర్వాత బ్రిటిష్ పార్లమెంటు నేరుగా పాలించడంతో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల ప్రక్రియ చోటుచేసుకుంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర పోరాటానికి మహాత్మాగాంధీ నాయకత్వం వహించిన తర్వాత కాంగ్రెస్ కూడా ఎన్నికలలో పోటీ చేయడం మొదలైంది. ఆ కాలంలోనే రష్యాలో కమ్యూనిస్టు విప్లవం భారతీయ నేతలను ప్రభావితం చేసింది. అలా దేశంలోకి కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రవేశించింది. మరోవైపు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూనే.. ఈ దేశంలో ఇస్లామిక్ సామ్రాజ్యవాద శక్తులు ఆధిపత్యం కోసం చేసిన పోరాటం చివరకు దేశాన్నే ముక్కలు చేసింది. కానీ నేడు ఇస్లామ్ సామ్రాజ్యవాదం నేడు ప్రపంచాధిపత్యం కోసమే పోరాటం చేస్తోంది. దేశంలో జరుగుతున్న పలు సైద్ధాంతిక ఘర్షణలకు తెర దించకపోతే మన స్వాతంత్య్రమే అస్థిరమైపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఏం చేస్తున్నామనేది మౌలిక ప్రశ్న. సామాజికంగా కూడా మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాం. మన మేధావులే మన దేశ విషయాలపై అపోహలూ, విద్వేషమూ నిర్మాణం చేస్తున్నారు. ఆ పనిలో కొంత విజయం కూడా సాధించారు. ఈ మధ్య నేనొక కార్యక్రమంలో మాట్లాడుతూ మన ధర్మశాస్త్రాలలోని రెండు మంచి విషయాలు ప్రస్తావించాను. సభానంతరం కొందరు నన్ను ‘మన ధర్మశాస్త్రాలను మీరు సమర్థిస్తారా?’ అని అడిగారు. దానికి నేను ‘మంచి విషయాలు ఎక్క డున్నా గ్రహించాలి, మీకేమైనా అభ్యంతరమా? అన్నాను. ఖురాన్, బైబిల్, దాస్క్యాపిటల్ నుంచి మంచి గ్రహించటంలో లేని అభ్యంతరం మన ధర్మశాస్త్రాల నుంచి గ్రహించటంలో ఎందుకు?’ అని కూడా అడిగాను. దీనిని విశ్లేషిస్తే ‘మనలో మనమే సవాళ్లు విసురుకుంటూ విడిపోతున్నాం’ అనేది అర్థమవుతుంది. ఈ విషయం మనం ఎంత త్వరగా గ్రహిస్తే దేశానికి అంత మంచిది. ఈ అంతర ఘర్షణ సమసిపోయినప్పుడే మన దేశ స్వాతంత్య్రం స్థిరమౌతుంది. స్వాతంత్య్రం నాటి నుంచి మన దేశంలో సామాజిక సమత కోసం విశేష ప్రయత్నం జరుగుతున్నది. శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రజలు మిగతా సమాజంతో పాటుగా ఎదగటానికి అటు ప్రభుత్వం, ఇటు సమాజం, కొన్ని స్వచ్ఛంద సంస్థలూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆ విషయంలో కొంత విజయం కూడా సాధించాం. కానీ మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రాజకీయ స్వలాభం. మన రాజకీయ నేతలు వారి రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని మరింతగా విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థితి మారితే సామాజిక ఐక్యతకు అడ్డంకి తొలగిపోతుంది. ఈ 70 ఏళ్లలో మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకు పోతోంది. మన శక్తియుక్తులను ఈ రోజు ప్రపంచం విస్మరించే స్థితిలో లేదు. అలాగే మన విదేశీ సంబంధాలు ఎంతో మెరుగయ్యాయి. పైగా మనకు మానవ వనరుల లోటు లేదు. కానీ వాటిని సక్రమంగా వినియోగించుకోలేక పోవడమే సమస్య. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు మన ఆర్థిక పరిస్థితులను వేగంగా మార్చాయి. కానీ వాటివల్ల దేశంలో ఆర్థిక అసమానతలు పోటీ పడి పెరుగుతున్నాయి. దేశంలోని ఆరు లక్షలకుపైగా గ్రామాల ప్రగతే దేశ ప్రగతి. కానీ చాలా గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. మనకు స్వాతంత్య్రం లభించిన సమయంలో ‘ఈ దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది. గ్రామ స్వరాజ్యం ఇంకా రావలసి ఉంది. వేల సంవత్సరాలుగా మన గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. నేడు అవి పతన స్థితిలో ఉన్నాయి. ఇది మారాలి’ అన్నారు మహాత్మాగాంధీ. దేశ రక్షణతో సహా అన్ని అంశాల్లో స్వావలంబన సాధ్యమైనప్పుడే భారత్ ప్రపంచంలో గౌరవనీయ స్థానం పొందుతుంది. రాంపల్లి మల్లికార్జునరావు, సామాజిక కార్యకర్త మొబైల్ : 95022 30095 -
‘తైవాన్ ఎప్పటికీ మాదే’
బీజింగ్: మెయిన్‌లాండ్, తైవాన్ ఎప్పటికీ తమలో అంతర్భాగమేనని చైనా స్పష్టం చేసింది. తైవాన్‌కు ప్రత్యేక స్వాతంత్ర్యం ఎప్పటికీ ఇవ్వలేమని తేల్చిపారేసింది. ఎప్పటికీ తైవాన్ చైనా రిపబ్లిక్లో భాగమేనని పునరుద్ఘాటించింది. 1992లో కుదిరిన ఏకాభిప్రాయానికే తాము కట్టుబడి ఉంటామని, అది ఒకే చైనా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందని గుర్తు చేసింది. శాంతియుతంగా వాతావరణంతో తిరిగి తైవాన్ను తమలో కలుపుకొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొంది. ఈ విషయంలో చాలా నిజాయితీగా పనిచేస్తామని, ప్రత్యేక తైవాన్ వాదులకు తాము మద్దతివ్వబోమని, మరింకేవిధమైన రూపానికి కూడా తాము అనుమతించబోమని తైవాన్ వ్యవహారాల అధికారిక ప్రతినిధి మా జియాగాంగ్ చెప్పారు. -
'స్వాతంత్ర్యం ఇచ్చేందుకు మేం ఒప్పుకోం'
న్యూయార్క్: బెలూచిస్తాన్ స్వాతంత్ర్యానికి తాము ఒప్పుకోబోమని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్ సమైక్యతను తాము గౌరవిస్తామని అమెరికా సహాయ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఓ మీడియా సమావేశంలో చెప్పారు. బెలూచిస్తాన్ ప్రాంతంలో సామాన్యుల హక్కులను కాలరాస్తూ హింసాత్మక చర్యలకు పాక్ బలగాలు పాల్పడుతున్న నేపథ్యంలో అటు అక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా బెలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం అవసరం అని డిమాండ్ పెరుగుతుంది కదా..! దీనిని మీరెలా సమర్థిస్తారు అని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. 'పాక్ దేశ సమైక్యతను, కలిసి ఉండటాన్ని అమెరికా ప్రభుత్వం ఎప్పటికీ గౌరవిస్తుంది. బెలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని మేం ఏ మాత్రం అంగీకరించం' అని ఆయన అన్నారు. ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్రమోదీ బెలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అమెరికా వైఖరిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. -
నిత్య గాయాల బలూచ్!
పాక్ పాలనలో నలుగుతున్న విలీన ప్రాంతం స్వేచ్ఛ కోసం ఏడు దశాబ్దాలుగా పోరాటం న్యూఢిల్లీ: బలూచిస్తాన్..! భారత్, పాకిస్తాన్ల తాజా మాటల యుద్ధంలో నలుగుతున్న పేరు. కశ్మీర్‌పై పాక్ దుష్టపన్నాగాలను దునుమాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పంద్రాగస్టు ప్రసంగంలో బలూచ్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలో హక్కుల ఉల్లంఘనను ప్రస్తావించడంతో బలూచ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బలూచ్ వివాదం పూర్వాపరాల గురించి.. తెలిసింది తక్కువ.. భారత్‌కు కశ్మీర్‌లా బలూచ్ పాక్‌కు సమస్యాత్మక ప్రాంతం. అయితే ఇది కశ్మీర్‌లా అంతర్జాతీయ దష్టిని ఆకర్షించలేదు. పాక్ సమయం దొరికినప్పుడల్లా కశ్మీర్లో హక్కుల ఉల్లంఘన గురించి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుండడం తెలిసిందే. చీకటి బిలంగా(బ్లాక్ హోల్), జర్నలిస్టులకు నిషిద్ధ ప్రాంతంగా పేరొందిన బలూచ్‌లోని ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం సాగిస్తున్న పోరాటం గురించి, వారిపై పాక్ బలగాల, పంజాబీ వర్గీయుల దమనకాండ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. వనరుల నెలవు.. బంగారం, రాగి వంటి ఖనిజాలు, చమురు వనరులకు నెలవైన బలూచ్ వాస్తవానికి భారత ఉపఖండంలో భాగం కానే కాదు. భారత్, పాక్‌లకంటే అఫ్గానిస్తాన్, ఇరాన్‌లతోనే ఆ ప్రాంతానికి సారూప్యాలు ఎక్కువ. విస్తీర్ణంలో పాక్‌లో 40 శాతంగా ఉన్నా ఆ దేశ జనాభాలో 4 శాతమే(1.3 కోట్ల మంది) అక్కడ ఉంది. పాక్‌లో అతి పెద్ద రాష్ట్రం కూడా బలూచిస్తానే. పాక్ ఆదాయంలో అధిక భాగం అక్కడి వనరుల నుంచే వస్తోంది. పాక్‌లో విలీనం ఇలా.. 1947లో భారత విభజనతో ఏర్పడిన పాక్.. బలూచ్‌ను తనలో కలుపుకోవడానికి నానా యత్నాలూ చేసింది. బలూచ్‌లోని లాస్బెలా, ఖరాన్, మక్రాన్ సంస్థానాలు పాక్‌లో విలీనం కాగా, కలాత్ మాత్రం విడిగా ఉండిపోయింది. పాక్‌లో కలవాలని చివరి బలూచ్ స్వతంత్ర పాలకుడైన కలాత్ రాజు మీర్ అహ్మద్ యార్ ఖాన్‌తో పాక్ తొలి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా బలవంతంగా ఒప్పందం చేయించుకున్నాడని అంటారు. రక్షణ, విదేశాంగ వ్యవహారాలు వంటి వాటిపై పాక్‌కు, బలూచ్‌కు మధ్య తాత్కాలిక ఒప్పందమొకటి ఆనాడు కుదిరింది. అయితే 1948, మార్చి 26న యార్ ఖాన్ బలూచ్‌ను పాక్‌లో విలీనం చేసేందుకు ఒప్పుకున్నట్లు పాక్ సర్కారు ప్రకటించింది. తర్వాత సైనిక ఆపరేషన్‌తో బలూచ్‌ను విలీనం చేసుకుంది. అప్పట్నుంచి స్థానికులపై దారుణమైన అణచివేత కొనసాగుతూనే ఉంది. హింస, రక్తపాతం, హక్కుల నిరాకరణ నిత్యకత్యాలైపోయాయి. స్వాతంత్య్రం కోసం ఎలుగెత్తిన గొంతుకలను బలగాలు నొక్కేస్తున్నాయి. అక్కడి విలువైన ఖనిజ వనరులను పాక్ సంపన్న వర్గాలు, ప్రభుత్వం దోచుకుంటున్నాయి. దీనికి నిరసనగా బలూచీలు 1948 నుంచి ఐదుసార్లు(1948, 1958, 1962–63, 1977–78, 2003) చిన్నపాటి సాయుధ తిరుగుబాట్లు చేశారు. అయితే పాక్ ప్రభుత్వం ఉక్కుపాదంతో వాటిని అణచేసింది. గత పదేళ్లలో 2 లక్షల మంది బలూచీలు హత్యకు గురయ్యారని, 25 వేల మంది ఆచూకీ లేకుండా పోయారని బలూచ్ ఉద్యమ నేత నయేలా ఖాద్రీ చెప్పారు. -
ఎందరో ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్య్రం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగానే మనం స్వాతంత్య్ర ఫలాలు అనుభవించగలుగుతున్నామని ముస్లిం మత పెద్ద గవర్నమెంట్ ఖాజీ సయ్యద్ సలీం బాష ఖాద్రి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో సల్పిన స్వాతంత్య్ర సమరంలో ముస్లింల పాత్ర కీలకమన్నారు. మొట్టమొదటిసారిగా నగర ముస్లింలు, మతపెద్దలు, మౌల్వీలు స్థానిక రాజ్‌విహార్ సెంటర్లో జాతీయ జెండా ఎగురవేశారు. సర్వమానవాళి సుఖం కోసం దువా చేశారు. అతిథులుగా వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఎస్సీ, మైనారిటీ సెల్ల రాష్ట్ర కార్యదర్శులు మద్దయ్య, రహ్మాన్‌తో పాటు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో నోబుల్ సర్వీసెస్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, మౌల్వీలు మౌలానా జుబేర్ అహ్మద్ ఖాన్ రషాది, మౌలానా జాకిర్ అహ్మద్ రషాది, మౌలానా సులేమాన్ నద్వి తదితరులు పాల్గొన్నారు. -
ఎందరో ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్య్రం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగానే మనం స్వాతంత్య్ర ఫలాలు అనుభవించగలుగుతున్నామని ముస్లిం మత పెద్ద గవర్నమెంట్ ఖాజీ సయ్యద్ సలీం బాష ఖాద్రి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో సల్పిన స్వాతంత్య్ర సమరంలో ముస్లింల పాత్ర కీలకమన్నారు. మొట్టమొదటిసారిగా నగర ముస్లింలు, మతపెద్దలు, మౌల్వీలు స్థానిక రాజ్‌విహార్ సెంటర్లో జాతీయ జెండా ఎగురవేశారు. సర్వమానవాళి సుఖం కోసం దువా చేశారు. అతిథులుగా వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఎస్సీ, మైనారిటీ సెల్ల రాష్ట్ర కార్యదర్శులు మద్దయ్య, రహ్మాన్‌తో పాటు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో నోబుల్ సర్వీసెస్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, మౌల్వీలు మౌలానా జుబేర్ అహ్మద్ ఖాన్ రషాది, మౌలానా జాకిర్ అహ్మద్ రషాది, మౌలానా సులేమాన్ నద్వి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి స్వాతంత్య్రం రాలేదు
– ప్రతి పనికీ లంచం – అడుగడుగునా అవినీతి – పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ యాదమరి : 70 ఏళ్ల క్రితం దేశానికి మాత్రమే స్వాతంత్య్రం వచ్చిందని, ఆంధ్ర రాష్ట్రానికి రాలేదని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. యాదమరి ఎంపీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నపని కూడా లంచం లేనిదే కావడం లేదన్నారు. అందుకే వనరులు ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదన్నారు. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు డిజిటల్ ఫొటోలు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా పుష్కరాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, అయినా సౌకర్యాలు సరిగా లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధి అంతా ప్రకటనలకే పరిమితమైందని, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు నిజాలు తెలుసుకుని బుద్ధి చెప్పే రోజు ముందు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు ఉషా, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు ధనంజయరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ శంకర్ నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహర్, కో–ఆప్షన్ సభ్యులు ముస్తఫా పాల్గొన్నారు. -
భారతావనిపై వెలుగుల సంతకం
దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందిన విద్యుత్ రంగం - సంస్కరణలు, విప్లవాత్మక మార్పులతో ముందడుగు * చీకటి నుంచి మిగులు విద్యుత్‌కు ప్రస్థానం ఫసియొద్దీన్ - సాక్షి, హైదరాబాద్ : ఏ దేశ అభివృద్ధిలోనైనా విద్యుత్ రంగం పాత్రఅత్యంత కీలకం. మన దేశంలోనూ స్వాతంత్య్రం అనంతరం విద్యుత్ రంగం గణనీయ పురోగతిని సాధించింది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌వాళ్లు ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ను అమలు చేశారు. దాని ప్రకారం ప్రైవేటు సంస్థలు విద్యుత్ పంపిణీ లెసైన్స్ తీసుకుని వ్యాపారం చేసేవి. అవి ప్రధానంగా పట్టణ ప్రాంతాలకే విద్యుత్‌ను సరఫరా చేసేవి. స్వాతంత్య్రం అనంతరం విద్యుత్ సరఫరా చట్టం-1948 అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో విద్యుత్ రంగాన్ని చేర్చారు. 1950లో ప్రణాళికబద్ధ అభివృద్ధి ప్రారంభమైన నాటి నుంచి విద్యుత్‌కు ప్రభుత్వాలు ప్రధాన పీటవేశాయి. 1959-61 మధ్య అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ బోర్డులు(ఎస్ఈబీ) ఏర్పాటయ్యాయి. 1947లో దేశ విద్యుదుత్పత్తి సామర్థ్యం 1,362 మెగావాట్లు మాత్రమే కాగా.. ప్రస్తుతం 3,03,083 మెగావాట్లకు పెరిగింది. థర్మల్, జల విద్యుత్ ప్రాజెక్టులే ప్రధాన విద్యుత్ వనరులు. 1950 వరకు దేశంలోని విద్యుత్ ప్లాంట్లలో 63 శాతం ప్రైవేటు రంగానివే కాగా.. అనంతరం ప్రభుత్వ రంగంలో విద్యుదుత్పత్తి పెరిగింది. విద్యుత్ రంగంలోకి కేంద్రం 1975 వరకు విద్యుత్ రంగంలో కేంద్రం పాత్ర పెద్దగా లేదు. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ రంగం వెనుకబడిపోవడంతో ఐదో పంచవర్ష ప్రణాళిక (1974-79) నుంచి కేంద్రం కలుగజేసుకుని.. భారీ ఎత్తున విద్యుదుత్పత్తి, సరఫరా ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో 1975లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)లను నెలకొల్పింది. ఈశాన్య భారతంలో నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ఈఈపీసీఓ)ను 1976లో ఏర్పాటు చేసింది. అయితే కేంద్రం ఉత్పత్తి చేసే విద్యుత్‌ను స్థానిక రాష్ట్రాలకే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలకు కేటాయించేందుకు కేంద్రం గాడ్గిల్ ఫార్ములాను అనుసరించింది. అంతర్రాష్ట విద్యుత్ లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. మళ్లీ ప్రైవేటు పెట్టుబడులు 90వ దశకం వరకు కేంద్ర, రాష్ట్రాల ఆధ్వర్యంలోనే విద్యుత్ రంగ అభివృద్ధి జరిగింది. అయితే సరళీకరణలో భాగంగా విద్యుత్ రంగంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యుత్ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ద్వారా ఫాస్ట్‌ట్రాక్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం తొలిసారిగా 8 ప్రైవేటు సంస్థలకు కేంద్రం అనుమతిచ్చింది. స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యుత్ విక్రయించేందుకు ఈ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే కేంద్రం గ్యారెంటీ ఇచ్చినా.. ఆ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాల విద్యుత్ బోర్డులను సంస్కరించాలన్న డిమాండ్లు వచ్చాయి. సంస్కరణల బాటలో 1995లో తొలిసారిగా ఒడిశా ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల చట్టాన్ని తీసుకురాగా.. తర్వాత హరియాణా, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలు అనుసరించాయి. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ అవసరాల కోసం విద్యుత్ బోర్డులను జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా మూడు ముక్కలు చేశాయి. రెండో అంశం డిస్కంల ప్రైవేటీకరణకాగా.. ఒక్క ఒడిశా మాత్రమే ప్రైవేటీకరించింది. మూడో అంశమైన స్వతంత్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని 8 రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్టాల్లో మాత్రం బోర్డులే కొనసాగాయి. అయితే కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో విద్యుత్ టారిఫ్ నిర్ధారణ, ఇతర నిర్ణయాలపై సమీక్ష కోసం కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసింది. గతంలో అమల్లో ఉన్న మూడు విద్యుత్ చట్టాల స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ని అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్లలో ఓపెన్ యాక్సెస్ విధానం అమల్లోకి వచ్చింది. ట్రాన్స్‌కో పాత్ర కేవలం సరఫరాకు పరిమితమైంది. త్వరలో ప్రైవేటు డిస్కంలు ఇటీవల కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్టం (సవరణ)-2014 బిల్లు ఆమోదం పొందితే విద్యుత్ రంగం రూపురేఖలు మారిపోనున్నాయి. దాని ప్రకారం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్‌ను డిస్ట్రిబ్యూషన్, సప్లై అని మళ్లీ రెండు విభాగాలుగా విడగొడతారు. విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ డిస్కంల ఆధీనంలో ఉంచి... వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు మాత్రం ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తారు. ఆ ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ కొని.. వినియోగదారులకు సరఫరా చేస్తాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ బ్రిటన్ తరహా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అమల్లోకి ఉంది. ఇంకా 6 కోట్ల జనాభా చీకట్లోనే! దేశంలో విద్యుత్ రంగం ఇంతగా అభివృద్ధి చెందినా.. ఏకంగా మిగులు విద్యుత్‌ను కూడా సాధించినా... ఇంకా దాదాపు 6 కోట్ల మందికిపైగా చీకట్లోనే మగ్గుతున్నారు. ఓ వైపు విద్యుత్ డిమాండ్ తగ్గి విద్యుదుత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా మారుతుండగా... మరోవైపు విద్యుత్ సరఫరా లేక మారుమూల ప్రాంతాల ప్రజలు అల్లాడుతున్నారు. తగిన సామర్థ్యంతో విద్యుత్ సరఫరా నెట్వర్క్ (గ్రిడ్) అందుబాటులో లేకపోవడం, మారుమూల, అటవీ ప్రాంతాలు కావడం.. అత్యల్ప జనాభా ఉన్న చోట్లకు విద్యుత్ లైన్ల ఏర్పాటుకు భారీ వ్యయమయ్యే అవకాశముండడం వంటివి దీనికి కారణంగా చెప్పవచ్చు. గణాంకాల్లో విద్యుత్ రంగం విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం: 3,03,083 మెగావాట్లు థర్మల్ ప్రాజెక్టుల సామర్థ్యం: 2,11,670 మెగావాట్లు జల విద్యుత్ ప్రాజెక్టులు: 42,783 మెగావాట్లు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు: 42,849 మెగావాట్లు 2014-15లో వార్షిక విద్యుదుత్పత్తి 1,272,000 గిగావాట్/అవర్ (జీడబ్ల్యూహెచ్) 2013లో జపాన్, రష్యా తర్వాత విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే మూడో స్థానంలో భారత్ నిలిచింది. ప్రపంచ విద్యుదుత్పత్తిలో 4.8 శాతం మన దేశంలోనే జరుగుతోంది. 1950లో 15 యూనిట్లుగా ఉన్న వార్షిక జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 2014-15లో 746 యూనిట్లకు పెరిగింది. విద్యుత్ వినియోగంలో వ్యవసాయం వాటా 18.45 శాతం 2016-17లో విద్యుత్ డిమాండ్ 12,14,642 మిలియన్ యూనిట్లుకాగా... 12,27,895 మిలియన్ యూనిట్ల లభ్యత ఉంది. డిమాండ్‌తో పోల్చితే 1.1 శాతం మిగులును సాధించింది. 2016 ఏప్రిల్ నాటికి దేశం 5,780 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రాలను కలిగి ఉంది. 2014-15లో 37,835 మిలియన్ యూనిట్ల అణు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తారాపూర్‌లో రెండు బాయిలింగ్ రియాక్టర్ల నిర్మాణం కోసం 1964లో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా దేశంలో అణు విద్యుత్ అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దేశంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం 2016 మార్చి నాటికి 6,763 మెగావాట్లు, పవన విద్యుత్ సామర్థ్యం 26866 మెగావాట్లు కాగా... 2022 నాటికి సౌర విద్యుత్‌ను 1,00,000 మెగావాట్లకు, పవన విద్యుత్‌ను 60,000 మెగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. -
హేరామ్!
‘మహాత్మ’ గాంధీ (78), భారత జాతిపిత పూర్తిపేరు : మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ జననం : 2 అక్టోబర్ 1869 జన్మస్థలం : పోర్బందర్ (గుజరాత్) తల్లిదండ్రులు : కరమ్‌చంద్ గాంధీ, పుత్లీబాయ్ తోబుట్టువులు : లక్ష్మీదాస్, గోకిబెన్ కర్సన్దాస్ చదువు : న్యాయశాస్త్రం భార్య : కస్తూర్బా (వివాహం: 1883 మే) సంతానం : హరిలాల్, మణిలాల్, రామ్‌దాస్, దేవదాస్ ఒక అతివాది తన దారికి అడ్డమని చెప్పి పిస్తోలు తీసి దండం పెడుతూనే మహాత్మాగాంధీని గుండెల్లో కాల్చాడు! అలా చేసినవాడిపై ఆగ్రహించాలి. ‘ఎందుకిలా చేశావ్’ అని అరవాలి. కానీ గాంధీజీ అహింసావాది. చనిపోతూ కూడా అతడిని ద్వేషించలేదు. ‘హే రామ్!’ అంటూ ఒరిగిపోయారు. ఇది 1948 జనవరి 30న జరిగిన ఘాతుకం. ఇప్పుడు మళ్లీ అదే అతివాదం... 2016 ఆగస్టు 5న దారికి అడ్డంగా ఉందని చెప్పి మహాత్మాగాంధీ ప్రతిమను కాళ్లూ చేతులు విరగ్గొట్టి ఏట్లో పడేసింది! 69 ఏళ్ల క్రితం ఒక అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వచ్చింది. 69 ఏళ్ల తర్వాత మరో అర్ధరాత్రి పాలకవాదం మనకు తలవంపులు తెచ్చింది. ఆనాటిది.. ఎ ప్రైడ్ఫుల్ మిడ్నైట్. ఈనాటిది.. ఎ షేమ్‌ఫుల్ మిడ్నైట్. గాంధీజీకి జరిగిన ఈ ఘోర అవమానానికి ప్రాయశ్చిత్తంగా, ప్రక్షాళనగా... ఈ స్వాతంత్య్ర దినోత్సవాన.. ఆయన జీవితచరిత్రను మళ్లీ ఒకసారి మననం చేసుకుందాం. 1947. ఆగస్టు 14-15. అర్ధరాత్రి. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది! నెహ్రూ మాట్లాడుతున్నారు పార్లమెంటు హాల్లో. కొద్ది క్షణాల్లో ఆగస్టు 15 రాబోతుండగా... ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ మొదలైంది. తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రసంగం.. ట్రిస్ట్ విత్ డెస్టినీ. తల్లి కునుకు తీస్తున్నప్పుడు మేల్కొని కేరింతలు కొడుతున్న బిడ్డను కనిపెట్టుకుని ఉండే రెప్పలకు ఆహ్వానం అన్నారు నెహ్రూ. గాంధీజీ అక్కడ లేరు! వగచిన యుగం అంతరించి, జాతి ఆత్మ వికసించిన ఈ నడిరేయిలో మళ్లీ ఒక ఒట్టుపెట్టుకుందాం.. యావత్ మానవాళి క్షేమం కోసం కట్టుబడి ఉంటామని.. అన్నారు నెహ్రూ. గాంధీజీ అక్కడ లేరు! ఈ తొలి క్షణాలలో మన భావాలు జాతిపిత బాపూజీని అభిషేకించాలి. భారతీయాత్మకు బాహ్య స్వరూపమైన బాపూజీ మనకొక సందేశం... అన్నారు నెహ్రూ. గాంధీజీ అక్కడ లేరు. సమరయోధుడు, శాంతి యోధుడు.. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముడు.. దేశ ఆవిర్భావ క్షణాలలో ఢిల్లీలో లేకుండా ఎక్కడ ఉన్నట్లు? కలకత్తాలో! హిందూ ముస్లింల మధ్య రాజుకున్న మత కలహాల జ్వాలల్ని చల్లార్చే కర్తవ్య దీక్షలో నిమగ్నమై ఉన్నారు ఆయన! స్వాతంత్య్రాన్ని ఆస్వాదించడం కన్నా, శాంతి సామరస్యాలను పునరుద్ధరించడం ముఖ్యం అని భావించారు బాపూజీ. ఇలాంటి వ్యక్తి ఉంటారా?! ఇవాళ భారత స్వాతంత్య్ర దినం. 70వ ఇండిపెండెన్స్ డే. 68 ఏళ్ల క్రితం బాపూజీ తన 78వ యేట ఒక అతివాది పేల్చిన బులెట్లకు నేలకొరిగారు. స్వతంత్ర భారతదేశపు తొలి ఉలికిపాటు అది. గాంధీ హత్య వార్త వినగానే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ - ‘ఇంతటి మహావ్యక్తి ఈ భూమి మీద నడిచాడా! మన మధ్య జీవించాడా అని భావితరాల వారు ఆశ్చర్యపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఆయన జీవితమే... ఆయన సందేశం దేశ విభజనకు ముందు, తర్వాత... దేశంలో చెలరేగిన మత కలహాలు గాంధీజీని ఎంతో అశాంతికి గురి చేశాయి. స్వాతంత్య్రానికి ముందు ఏడాది 1946లో ఆయన హిందూ ముస్లిం అల్లర్లలో శాంతి పునఃస్థాపనకు కలకత్తాలో పాదయాత్ర చేస్తున్నారు. ‘బెంగాలీ ప్రజలకు సందేశం ఇవ్వండి’ అని పాత్రికేయులు అడిగారు. ఆరోజు గాంధీజీ మౌనవ్రతం. ఒక పలక మీద బెంగాలీ లిపిలో ‘అమార్ జీబనీ అమార్ బానీ’ అని రాశారు. ‘నా జీవితమే నా సందేశం’ అని దాని అర్థం. సత్యం, అహింస అనే ఆదర్శాలను ఆయుధాలుగా చేసుకున్న మహనీయుని జీవితం కేవలం సందేశం మాత్రమే అవుతుందా? దిక్సూచి కూడా అయింది. అగ్రరాజ్యాలు సైతం నేడు గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నాయి! ఇరవై ఏళ్ల దక్షిణాఫ్రికా ఉద్యమం గాంధీజీ జీవితానికి ఉద్యమ స్వరూపం తప్ప మరో రూపం లేదు. వేరే రూపు రేఖలూ లేవు. ఈ భారతీయుడి జీవితం ఇంగ్లండ్‌లో మొదలైంది. దక్షిణాఫ్రికాలో పదును తేలింది. భారత్‌లో కదం తొక్కింది. సముద్రయానం హిందువులకు నిషిద్ధం. నిషేధాన్ని ధిక్కరించి ‘లా’ చదవడం కోసం 1888లో ఇంగ్లండు వెళ్లారు గాంధీజీ! మూడేళ్లు లండన్‌లో ఉండి వచ్చారు. ముంబైలో ‘లా’ ప్రాక్టీస్ పెట్టారు. 1893లో దక్షిణాఫ్రికాలో ఒక భారతీయ ముస్లిం కంపెనీ దావాలో వాదించడానికి జూనియర్ లాయర్‌గా వెళ్లే అవకాశం వస్తే డర్బన్ బయల్దేరి వెళ్లారు. అలా వెళ్లడం వెళ్లడం దక్షిణాఫ్రికాలో 21 ఏళ్లు (1893-1914) గడిపారు. దక్షిణాఫ్రికాలో అనుభవాలు, అవమానాలు, పరాజయాలు ఆయన్ని ఓ ఉద్యమ శిల్పంలా చెక్కాయి! ముప్పై ఏళ్ల స్వదేశీ ఉద్యమం 1914లో దక్షిణాఫ్రికా నుంచి తిరుగు ప్రయాణమై, మధ్యలో కొన్నాళ్లు లండన్‌లో ఉండి, అక్కడ ఆరోగ్యం క్షీణించడంతో 1915లో గాంధీజీ ఇండియా చేరుకునే నాటికి.. ఇక్కడ స్వాతంత్య్ర కాంక్ష ఉద్ధృత రూపం దాలుస్తూ ఉంది. గాంధీజీ ఏడాది పాటు దేశమంతా తిరిగారు. మొదట శాంతి నికేతన్ వెళ్లి ఠాగూర్ని కలుసుకున్నారు. తర్వాత గుజరాత్ వచ్చారు. అహ్మాదాబాద్‌లో సబర్మతీ నదీ తీరాన ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. ఇండియాలో కూడా దక్షిణాఫ్రికాలోని పరిస్థితులే! తెల్లవాళ్లు, నల్లవాళ్లు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు. ప్రభుత్వంపై ఉద్యమకారుల ఆగ్రహాలు! బీహార్‌లోని చంపారన్ జిల్లాలో నీలిమందు పండించే పేద రైతుల పట్ల తెల్లజాతి యజమానులు అనుసరిస్తున్న దోపిడి విధానంపై ప్రతిఘటనతో 1917లో భారత్‌లో మొదలైన గాంధీజీ ఉద్యమ జీవితం.. రౌలత్ చట్టం, జలియన్‌వాలా బాగ్ ఉదంతం, సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమం, చౌరాచౌరీ ఘటన, సంపూర్ణ స్వరాజ్య తీర్మానం, ఉప్పు సత్యాగ్రహం, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆమరణ నిరాహార దీక్ష .. వంటి వాటితో 1932 నాటికి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన అధ్యాయం అయింది! 1933లో గాంధీజీ సబర్మతి నుంచి మహారాష్ట్రలోని వార్ధా వచ్చి అక్కడ సేవాగ్రాం పేరుతో ఆశ్రమం నెలకొల్పారు. అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. హరిజన్ వార పత్రిక స్థాపించారు. హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఖాదీ ఉద్యమం ప్రారంభించారు. తర్వాత రాజకీయ ఉద్యమం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అప్పటికి గాంధీజీ వయసు 77 ఏళ్లు. 1917 నుంచి 1947 వరకు 30 ఏళ్లు గాంధీజీ ఉద్యమ జీవితం గడిపారు. మౌంట్ బాటన్ ప్లాన్ 1945 నాటికి బ్రిటిష్ ప్రభుత్వానికీ, భారత జాతీయ కాంగ్రెస్‌కు మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ‘మౌంట్‌బాటన్ ప్లాన్’ తయారైంది. ఆ ప్రకారం 1947లో బ్రిటిష్ ఇండియా విభజన జరిగి ఇండియా, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు మత ప్రాతిపదికన ఏర్పాటయ్యాయి. అయితే విభజనకు ముందు, తర్వాత కూడా కొన్ని నెలల పాటు రెండు ప్రాంతాలలో మతకల్లోలం చెలరేగింది. గాంధీజీ ఈ విభజనను వ్యతిరేకించారు. కల్లోలాన్ని చల్లబరిచేందుకు ఆయన కలకత్తా, ఢిల్లీలలో నిరాహార దీక్షలు చేపట్టారు కూడా. అటు, ఇటు.. ప్రజలు, ప్రభుత్వాలు సద్దుమణిగే సమయంలో మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. గాంధీజీ మరణం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మహాత్ముడికి మరణం అనేది ఉంటుందా?! ఉండదు. మానవాళి గాంధీమార్గంలో నడుస్తున్నంత కాలం ఏ తరంలోనైనా మహాత్ముడు జీవించి ఉన్నట్లే. మహాత్మాగాంధీ - మరికొన్ని విశేషాలు గాంధీజీ పేరు ఐదుసార్లు నామినేట్ అయినా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు! గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పౌరహక్కుల ఉద్యమం నాలుగు ఖండాలకు, 12 దేశాలకు విస్తరించింది! గాంధీజీ అంతిమ యాత్ర 8 కి.మీ. పొడవున సాగింది! గాంధీ ఏ దేశానికి వ్యతిరేకంగా పోరాడారో ఆ దేశమైన బ్రిటన్ ఆయన చనిపోయిన 21 ఏళ్ల తర్వాత ఆయన గౌరవార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. గాంధీజీ తన ఉద్యమ జీవిత కాలం మొత్తం మీద రోజుకు 18 కిలోమీటర్ల చొప్పున నడవడమో ప్రయాణించడమో చేశారు. అది ప్రపంచాన్ని రెండుసార్లు చుట్టి వచ్చినంత దూరం. బోయర్ యుద్ధంలో గాంధీజీ డచ్చివాళ్లపై పోరాడుతున్న బ్రిటన్‌కు మద్దతుగా క్షతగాత్రులకు సేవలు అందించారు. అప్పుడే ఆయనలో అహింసా బీజాలు నాటుకున్నాయి. టాల్‌స్టాయ్, ఐన్‌స్టీన్, హిట్లర్ వంటి ప్రసిద్ధులతో గాంధీజీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఆపిల్ కంపెనీ సీఈవో, స్టీవ్ జాబ్స్ గాంధీజీ అభిమాని. అచ్చు గాంధీజీ ధరించిన గుండ్రటి కళ్లజోడు లాంటివే ఆయన స్మృత్యర్థం జాబ్స్ వాడేవారు. గాంధీజీ ఇంగ్లిష్ మాట తీరు ఐరిష్ యాసతో ఉండేది. బాల్యంలో ఒక ఐరిష్ టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవడమే అందుకు కారణం. దేశంలో 50కి పైగా ప్రధాన రహదారులు, విదేశాలలో దాదాపు 50 వరకు రోడ్లు గాంధీజీ పేరు మీద ఉన్నాయి. జాతి వివక్షకు వ్యతిరేకంగా గాంధీజీ తన అహింసా ఉద్యమ ప్రచారానికి ఫుట్‌బాల్ ఆటను ప్రోత్సహించారు. దక్షిణాఫ్రికాలో ఫుట్‌బాల్ క్లబ్బుల స్థాపనకు చొరవ చూపారు. జాతిపిత జలసమాధి! విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో అధికారులు నీళ్లల్లో పడేసిన గాంధీ విగ్రహాన్ని వెతికి బుడమేరు కాలువ నుంచి బయటకు తీస్తున్న దృశ్యం. -
అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే..
అత్యాచారాల బారి నుంచి బయటపడ్డప్పుడే మహిళలకు పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు అని నటి తాప్సీ వ్యాఖ్యానించారు. బోల్డ్ నటీమణుల్లో ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఒకరు. తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నాయకిగా గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం హిందీ చిత్రాల పైనే పూర్తి దృష్టి సారిస్తున్నారు. మహిళల స్వాతంత్య్రం గురించి ఆ బ్యూటీ ఒక భేటీలో పేర్కొంటూ ఒక మహిళ ఎప్పుడైతే అర్ధరాత్రి ఒంటరిగా నడవ గలుగుతుందో అప్పుడే స్త్రీలకు పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు అని బాబూజీ అన్న విషయం తెలిసిందేనన్నారు. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నిర్భయను కిరాతక గుంపు నాశనం చేసిన సంఘటనను మరిచిపోగలమా? అన్నారు. ఎక్కడ చూసినా మహిళా అరాచకాలేనన్నారు. మానభంగాలకు గురవుతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు లేని ఇండియాను చూడాలని ఆశపడుతున్నట్లు నటుడు అమితాబ్‌బచ్చన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఆశ తనకూ ఉందన్నారు. అత్యాచారాల బారి నుంచి బయట పడిన ప్పుడే మహిళలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు అని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలన్నారు. తాను పింక్ అనే హిందీ చిత్రంలో మానభంగానికి గురైన యువతిగా నటించాన ని చెప్పారు. ఆ పాత్రలో నటించినప్పుడు మానభంగానికి గురయ్యే మహిళలు ఎంత కష్టపడతారన్నది అర్థమైందన్నారు. తాను షూటింగ్లో ఏడ్చేశానని, ఇది షూటింగే కదా అని యూనిట్ వర్గాలు సముదాయించారని తెలిపారు. మహిళలు రక్షించబడాలి, గౌరవించబడాలి అని అన్నారు. పింక్ చిత్రం చూసిన వారు అత్యాచారానికి గురైన ఒక స్త్రీ మనోవేదనను అర్థం చేసుకుంటారని, ఇలాంటి అత్యాచారాలు తగ్గుతాయనే అభిప్రాయాన్ని తాప్సీ వ్యక్తం చేశారు. -
సర్వం సిద్ధం
రేపు ‘అనంత’లో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు హాజరుకానున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన అధికారులు భద్రత, కార్యక్రమ నిర్వహణపై గుబులు రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లా కేంద్రంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియాన్ని (పీటీసీ మైదానం) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రస్థాయి వేడుకలు జిల్లా చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తుండడంతో అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్టేడియాన్ని శనివారం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు రోజుల పాటు స్టేడియంలోకి బయటి వ్యక్తులకు అనుమతి లేదు. పరిసర ప్రాంతాల్లోనూ ప్రత్యేక ఆంక్షలు విధించారు. నేటి (ఆదివారం) నుంచి మరుసటి రోజు వేడుకలు ముగిసేదాకా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఫ్లైఓవర్ నుంచి పీటీసీ మీదుగా లక్ష్మీనగర్, రాంనగర్ మార్గంలో రాకపోకలు నిషేధిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు అటు నుంచి అటే రాంనగర్ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. వాహన తనిఖీలు, ఇంటింటా సర్వేలను పోలీస్ అధికారులు వేగవంతం చేశారు. పరేడ్, సాంస్కతిక∙బందాలు రిహార్సల్స్‌లో నిమగ్నమయ్యాయి. శకటాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. అధికారుల్లో గుబులు ఏర్పాట్లన్నీ తక్కువ సమయంలోనే అధికారులు పూర్తి చేశారు. ఇందుకోసం ఇప్పటి వరకూ రూ. 2.70 కోట్లు వెచ్చించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. వేడుకలు జరుగుతున్నంత సేపూ భద్రత, నిర్వహణపై అధికారుల్లో గుబులు మొదలైంది. జిల్లా నుంచి దాదాపు 2,500 మంది పోలీసులను, కొందరు రెవెన్యూ, ఇతర ప్రభుత్వశాఖల అధికారులను కష్ణా పుష్కరాలకు పంపారు. దీంతో పంద్రాగస్టు రోజున భద్రత, నిర్వహణ ఎలా ఉంటుందనే టెన్షన్ అందరిలోనూ మొదలైంది. కేవలం 1,500 మందితోనే బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఆంక్షలు అవసరానికి మించి విధిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నగరంలోకి ప్రవేశించే బళ్లారి బైపాస్‌రోడ్డు, కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డు, రుద్రంపేట నుంచి పీటీసీ వైపు వచ్చే లక్ష్మీనగర్రోడ్డు, కోర్టు రోడ్డు, టవర్‌క్లాక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో స్వాతంత్య్ర వేడుకలు చూసేందుకు వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో వాహనాలు నిలబెట్టి స్టేడియానికి నడుచుకుని రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. -
సెంట్రల్ బ్యాంకుల స్వేచ్ఛను మీరే కాపాడాలి : రాజన్
న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యాంకుల స్వాతంత్ర్యాన్ని కచ్చితంగా ప్రభుత్వాలే పరిరక్షించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు సాధించడానికి ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోవాలన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు పెంపు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు ఎలాంటి సాక్ష్యాలు లేని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయని రాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. బ్రెగ్జిట్ పరిణామ క్రమంలో బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్ ఎదుర్కొన్న దాడులు, పెరిఫీరియల్ ఆర్థికవ్యవస్థను స్థిరీకరించే సమయంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఇంటరెస్ట్-రేట్ గైడ్ లైన్స్ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు ఎదుర్కొన్న అటాక్స్‌ను ఆయన గుర్తుచేశారు. ఆయా సెంట్రల్ బ్యాంకులు తమ భూభాగ పరిధిలోనే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాయని ముంబైలోని ప్రెస్ స్టేట్మెంట్లో రాజన్ వ్యాఖ్యానించారు. సాక్ష్యాలు లేని ఇలాంటి నిందారోపణలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు దృష్టిసారించాలని, సెంట్రల్ బ్యాంకుల స్వేచ్ఛను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలను వృద్ధి బాటలో నడిపించడానికి సెంట్రల్ బ్యాంకులు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటాయని.. సెంట్రల్ బ్యాంకులపై ఎలాంటి ఆధారాలు లేని విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. కాగ, భారత సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌గా రాజన్ రెండోసారి కొనసాగింపుపై, బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యం స్వామి నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ గా ఆయన పదవీ కాలం ఈ సెప్టెంబర్‌లో ముగియనున్న నేపథ్యంలో ఈ కామెంట్లు చేయడం గమనార్హం. -
నేడు 9 అక్టోబర్, 1962
బుగాండా టు ఉగాండా స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిష్ ఉక్కుచెర నుంచి బయటికి వచ్చిన ఉగాండా స్వాతంత్య్రదేశంగా స్వేచ్ఛాపతకాన్ని ఎగరేసింది. 1894కు ముందు... ఉగాండా అనేది అనామక ప్రాంతం. ‘ఈ ప్రాంతాన్ని కాపాడడానికి వచ్చిన రక్షకులం మేము’ అంది బ్రిటన్. చరిత్ర మాత్రం ఈ సత్యాన్ని పెద్దగా ధ్రువీకరించలేదు. ఏది ఏమైనా... ఒక స్వాతంత్య్ర దేశంగా స్వేచ్ఛావాయువుల రుచి చూసిన ఈ ప్రాంతం- ‘హో! ఉగండా... ల్యాండ్ ఆఫ్ బ్యూటీ’ అని జాతీయగీతం పాడుకుంది. పచ్చని కొండల అందాలు, తేయాకు తోటల ఘుమ ఘుమలు... ఉగాండా ఒక అద్భుత చిత్ర దృశ్యం. ‘బుగాండా రాజ్యం’ నుంచి ‘ఉగాండా’ పేరు వచ్చింది. దేశపాలకులు ‘ల్యాండ్ ఆఫ్ బ్యూటీ’ విశేషణంతోనే సంతృప్తిపడకుండా ఉండి ఉంటే, దేశ అభివృద్ధి కోసం కష్టపడి ముందస్తు ప్రణాళికలు వేసుకొని ఉంటే... ప్రపంచంలోని పేద దేశాలలో ఉగాండా ఒకటయ్యేది కాదు. సరే, ఈ ఆర్థిక పేదరికం మాట ఎలా ఉన్నా... ప్రకృతి సంపద, సాంస్కృతిక, పురా చారిత్రక సంపద... ఆ దేశాన్ని సంపద్వంతం చేస్తూనే ఉన్నాయి. -
అర్ధరాత్రే ముహూర్తం ఎందుకు?!
మనదేశానికి 1947 ఆగస్టు 14వ తేదీ చివరి ఘడియల్లో, 15 తేదీ ప్రారంభ ఘడియల్లో స్వాతంత్య్రం వచ్చింది. అంటే ఆ అర్ధరాత్రి బ్రిటిష్ నుండి మనదేశానికి అధికార బదిలీ జరిగింది. మన రాజ్యాంగ అసెంబ్లీ మన పాలనాధికారాన్ని స్వీకరించింది. మరి ఇదంతా ఆ అర్ధరాత్రే ఎందుకు జరిగినట్లు? 14వ తేదీన కాని, 15వ తేదీ ఉదయం కాని ఎందుకు జరగన ట్లు అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఇలా జరగటం వెనుక చాలా ఆసక్తికరమైన వ్యవహారం చోటుచేసుకుంది. 1947 ఆగస్టు 15న భారతీయులకు అధికార బదిలీ జరుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే భారతీయులకు అందునా హిందువులకు విశ్వాసాలు, నమ్మకాలు ఎక్కువ. గ్రహాలస్థితిగతులు మానవజీవితంపై ప్రభావం చూపుతాయనే బలమైన విశ్వాసం మరీ ఎక్కువ. అందుకే ప్రతి శుభకార్యానికి ముందేకాక కొన్నింటి ప్రారంభాలకు, రాకపోకలకు కూడా శుభఘడియల కోసం తిథి, నక్షత్రాలు చూస్తుంటారు. ఇలాంటి నమ్మకాలున్న ఢిల్లీలోని ఆనాటి కొందరు జాతీయ నాయకులకు ఆగస్టు 15 మంచిదేనా అని తెలుసుకోవాలనిపించింది. వెంటనే అక్కడి పండితులను సంప్రదించారు. ఆగస్టు 15 శుక్రవారం చతుర్ధశి. పైగా రాత్రి ఏడున్నర గంటల తరువాత అమావాస్య కనుక ఆ రోజు మంచిది కాదని పండితులు స్పష్టం చేశారు. 14వ తేదీ ఎంతో శుభదినమని తెలిపారు. ఆ తరువాత 17వ తేదీ మంచిదన్నారు. దీంతో ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఆ ప్రముఖులకు అంతుపట్టలేదు. పోనీ 14వ తేదీనే అధికార మార్పిడి జరిపిద్దామా అంటే ఆ రోజు లార్డ్ మౌంట్‌బాటన్ కరాచీలో పాకిస్తాన్‌కు అధికార మార్పిడి కార్యక్రమంలో ఉంటారు. ఆ రోజు రాత్రికి కాని ఆయన ఢిల్లీకి బయలుదేరరు. పైగా ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రమని బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ఈ సంకట స్థితిపై తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలో ప్రముఖ చరిత్రకారుడు, మలయాళ పండితుడు, హిందూమతాచారాలు, సాంప్రదాయాలపై విస్తృతమైన, లోతైన పరిజ్ఞానం కలిగిన కె.ఎం.పణిక్కర్ ఒక పరిష్కారం సూచించారు. పణిక్కర్ పరిష్కారం ప్రకారం రాజ్యాంగ సభ 14వ తేదీ రాత్రి 11 గంటలకు సమావేశమవుతుంది. సరిగ్గా 12 గంటలు కొట్టగానే బ్రిటిష్ ప్రభుత్వం నుండి అధికారాన్ని స్వీకరిస్తుంది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన ట్లు ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్ర ప్రదానం చేసినట్లవుతుంది. అధికార మార్పిడి జరిగే ఆ ఘడియలు గ్రహస్థితులను సంతృప్తి కలిగించేవి, బ్రిటిష్ ప్రభుత్వానికి తేదీలను మార్చాల్సిన అవసరం లేనివి కావటంతో ఆ పరిష్కారం అందరికి ఆమోదయోగ్యమైంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషమేమిటంటే శుభ దినాన ఏర్పడిన పాకిస్తాన్ ఆ తరువాత 20 ఏళ్లకు రెండుదేశాలుగా విడిపోవడం. రాజ్యాంగ సభలో చర్చించకుండానే మౌంట్‌బాటన్ నియామకం! అంతకుముందు 1947 జులై 31వ తేదీన రాజ్యాంగ నిర్ణయ సభలో 1947 ఆగష్టు 14వ తేదీ అర్ధరాత్రి జరగనున్న కార్యక్రమంపై సభాధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటన చేశారు. ఆ రాత్రి 12గంటల సమయానికి ముందు సభానాయకుడు జవహర్లాల్ నెహ్రూ వైస్రాయ్ భవనానికి వెళ్లి భారత గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ నియామక సిఫారసును తెలియజేసి ఆమోదించవలసిందిగా లార్డ్ మౌంట్‌బాటన్‌ను కోరతారని ఆ ప్రకటనలో తెలియజేశారు. ఆ తరువాత కొద్ది క్షణాలకు మహావీర్ త్యాగి అనే సభ్యుడు లేచి మౌంట్‌బాటన్‌కు గవర్నర్ హోదా గురించి ఈ సభ ఏనాడూ చర్చించలేదని, ఆయన భారత గవర్నర్ జనరల్ కావడాన్ని ఏనాడూ సభ అంగీకరించడం కానీ, ఆ మేరకు సభ తీర్మానం ఆమోదించడం కానీ చేయనందున ఆయనను గవర్నర్ జనరల్‌గా ఈ సభ ఆహ్వానించాలని కోరడం నుండి సభను మినహాయించాలని కోరారు. అందుకు ఈ విషయాన్ని ఒక తీర్మాన రూపంలో సభ ముందుంచుతానని సభాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలుపగా చాలామంది సభ్యులు లేచి వద్దు, వద్దంటూ ఆ విషయం అధ్యక్షుని నిర్ణయానుసారమే జరగాలని కోరారు. ఆ విధంగా రాజ్యాంగ నిర్ణయసభలో చర్చ, అంగీకారం, తీర్మానం లేకుండానే భారత గవర్నర్ జనర ల్గా లార్డ్ మౌంట్‌బాటన్ పదవీ స్వీకారం చేశారు. అధికార బదిలీ జరిగిన తీరు ఇక 1947 ఆగష్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నుండి భారత్ అధికార బదిలీలు జరిగిన కార్యక్రమ తీరు ఇలా ఉంది. ఆ రాత్రి 11 గంటలకు రాజ్యాంగ నిర్ణయ సభ సమావేశం ప్రారంభమయింది. సభాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ ప్రసంగించారు. ఆ తరువాత అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కొట్టగానే అధికార బదిలీ జరిగినట్లుగా సభ్యులంతా చేయవలసిన ప్రతిజ్ఞాపాఠంపై సభా నాయకుడు జవహర్లాల్ నెహ్రూ తీర్మానం ప్రతిపాదించారు. దానిని సభాధ్యక్షుడు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. మరికొన్ని క్ష ణాలలో 12గంటలు కొట్టగానే సభాధ్యక్షునితో సహా సభ్యులంతా నిల్చుని అధ్యక్షుడు ప్రతిజ్ఞాపాఠంలోని ఒక్కో వాక్యాన్ని చదవుతుండగా సభ్యులు దానిని హిందీ, ఇంగ్లీషులలో పునరుచ్ఛాటన చేశారు. ఆ తరువాత భారత పరిపాలనాధికారాన్ని రాజ్యాంగ నిర్ణయ సభ స్వీకరించింది. అలాగే ఆగష్టు 15నుండి భారత గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ ఉండాలన్న సిఫారసును సభ ఆమోదించింది. ఈ విషయాన్ని మౌంట్‌బాటన్‌కు సభానాయకుడు నెహ్రూ తెలియపరుస్తారని సభాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. మరుక్షణం సభకు భారత జాతీయ పతాకాన్ని హన్స్మెహతా సమర్పించారు. అలాగే ఈ అధికార బదిలీని పురస్కరించుకుని భారత్‌లోని చైనా రాయబారి డాక్టర్ చిన్ ల్యున్ లో రచించిన గేయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా సభ ఆమోదించింది. ఆ తరువాత ‘సారే జహాసే అఛ్ఛా హిందుస్తాన్ హమారా’ గేయంలోని మొదటి కొన్ని పంక్తులను, జనగణమనలోని ప్రారంభ వాక్యాలను సుచేతాకృపలానీ ఆలాపించారు. ఆ వెంటనే సభ 15వ తేదీ ఉదయం 10గంటలకు వాయిదా పడింది. ఇదీ ఆ రాత్రి మనకు అధికార బదిలీ జరిగిన తీరు. - కె.ఎస్.ఎన్. ప్రసాద్ అర్ధరాత్రి అధికారం... ఉదయం పతాకావిష్కరణ 15వ తేదీ ఉదయం 10గంటలకు గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ రాజ్యాంగ నిర్ణయ సభా ప్రవేశం చేశారు. సమావేశం ప్రారంభమవగానే భారత స్వాతంత్య్రం సందర్భంగా వివిధ దేశాధిపతులు, ప్రభుత్వాధినేతల నుండి శుభ సందేశాలు వినిపించారు. గవర్నర్ జనరల్, సభాధ్యక్షుల ప్రసంగాలు పూర్తయ్యాక సభా భవనం (నేటి పార్లమెంట్ భవనం)పై భారత జాతీయ పతాక ఆవిష్కరణకు గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ సంకేతమిచ్చారు. మరుక్షణమే తుపాకీలు పేల్చిన శబ్దం వినిపించింది. ఆ వెంటనే పార్లమెంట్ భవనంపై జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. సభ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. ఇదీ మన స్వతంత్ర భారత పాలనాధికారం మొదలైన తీరు. ఆదిలోనే హంసపాదు ఈ సందర్భంగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గుర్తు చేసుకోవాల్సి ఉంది. 14వ తేదీ అర్ధరాత్రి వైస్రాయ్ భవనానికి నెహ్రూ వె ళ్లి భారత గవర్నర్ జనరల్‌గా నియామక సిఫారసును మౌంట్‌బాటన్‌కు తెలియజేశారు. ఆ తరువాత తన మంత్రిమండలి సభ్యుల పేర్లున్న జాబితా గల ఒక కవర్‌ను ఆయనకు నెహ్రూ అందజేశారు. సందర్శకులంతా వెళ్లాక మౌంట్‌బాటన్ ఆ కవర్‌ను విప్పగా అందులో ఏమీ లేదు! వట్టి ఖాళీ కవర్ దర్శనమిచ్చి ఆయనను ఆశ్చర్యపరిచింది. ఆ కవర్‌ను సిద్ధం చేసినవారెవరో అందులో జాబితా పత్రాన్ని పెట్టడం మర్చిపోయారు. ఇదొక తమాషా సంఘటనలా అనిపించినా ఆదిలోనే హంసపాదు అన్న చందంగా నెహ్రూ గారి హయాం ప్రారంభమైంది. -
రైతన్నకు స్వాతంత్య్రం ఎప్పుడు?
- వ్యాపారం కోసమే భూ సేకరణ - ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి: నేటి పాలకుల తీరుతో రైతులకు స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని పేరుతో ఇప్పటికే వేల ఎకరాల భూమిని సమీకరించిన ప్రభుత్వానికి ఇప్పడు మళ్లీ సేకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. గతంలో తాము చెప్పినట్లుగా భూముల సేకరణ రాజధాని కోసం కాదని... వ్యాపారం కోసమేనన్న సంగతి రుజువైందన్నారు. మంత్రి నారాయణ తాను ఇష్టానుసారం ప్రకటనలు చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేసి సమీకరణలో తీసుకునే ఎత్తుగడ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. భూసమీకరణపై రైతులు కోర్టుకు వెళ్లగా కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఆ రైతుల నుంచి భూ సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని పెద్దలకు కోర్టు తీర్పులు అంటే గౌరవం లేదని, రైతుల మనోభావాలతో పని లేదన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇప్పటివరకు రాజధానిలో భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఎక్కడ భూములు ఇస్తారో చెప్పలేదని, రైతు కూలీలు, కౌలు రైతులు పనులు లేక పస్తులతో విలవిలలాడుతున్నారన్నారు. రైతులకు వైఎస్సార్సీపీ అండగా వుండి కడదాకా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. -
పిల్లలకు దేశభక్తి కధలు
‘మం చి’ ఎ జెండా దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మంచివోయ్... అనే కొత్త పాఠానికి ఎంతోమంది గురువులు. వాళ్ల కథలే... మచ్చుకు ఇవి కొన్ని. మన పిల్లలకు స్ఫూర్తినివ్వాలని... నిజమైన స్వాతంత్య్రం స్వార్థం నుంచి విముక్తేనని... అందమైన స్వేచ్ఛ... పంచుకోవడంలో ఉందని... దేశం కోసం పోరాటం కిసాన్లు, జవాన్లే కాదు... ఇన్సాన్లు కూడా చెయ్యొచ్చని చెప్పడానికే... ఈ మంచి కథలు. మంచితనం ఎంత నలిగితే అంత మంచిది. ఎంత అరిగితే అంత మంచిది. రేపటి భారతదేశానికి రెపరెపలాడే ఊపిరే మన ‘మంచి’ పిల్లలు. మంచితనానికి గులామ్ అవడమే దేశభక్తికి సలామ్ కొట్టడం. చిన బాలశిక్ష పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో బాబర్ అలీ అప్పట్లో తొమ్మిదేళ్ల చిన్నారి. స్కూలు నుంచి వస్తున్నప్పుడు పొలాల్లో పనులు చేసే తన ఈడు పిల్లలను గమనించాడు. వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. సొంతగా స్కూలు పెట్టాడు. తాను స్కూలు నుంచి రాగానే, ఆ పిల్లలను పోగేసి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. తన ఇంట్లో జామచెట్టు కింద పెట్టిన ఆ స్కూలు నిర్వహణ కోసం పాకెట్ మనీ ఖర్చు చేసేవాడు. పన్నెండేళ్ల కిందట మొదలైన ఆ స్కూలులో ఇప్పుడు 300 మంది చదువుకుంటున్నారు. ఆ స్కూలులో ఫస్ట్‌బ్యాచ్ విద్యార్థుల్లో ఆరుగురు ఇప్పుడు అందులోనే పాఠాలు చెబుతున్నారు. ‘చిన బాలశిక్ష’ను బోధించిన బాబర్ అలీకి జైహింద్ చెబుదాం. ఆపద్బాంధవులు... ఆ టీటీఈలు! ఆగస్టు 4... మంగళవారం అర్ధరాత్రి. మధ్యప్రదేశ్‌లో వంతెన దాటుతున్న రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో పట్టాలు తప్పాయి. ఈ సమాచారం తెలియగానే ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వద్ద కలకలం రేగింది. ప్రమాదం పాలైన రెండు రైళ్లలో ఒకటైన కామాయని ఎక్స్‌ప్రెస్ మంగళవారం మధ్యాహ్నమే ఎల్టీటీ నుంచి బయలుదేరి వెళ్లింది. రెండో రైలు జనతా ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం అక్కడకు చేరాల్సి ఉంది. ఆ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి క్షేమ సమాచారం కోసం వారి బంధువులంతా ఎల్టీటీ వద్దకు వెల్లువెత్తారు. పరిస్థితి గమనించిన ఇద్దరు టీటీఈలు..ఏకే సిన్హా, ఆర్.శర్మ అప్పటికప్పుడే తాత్కాలిక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబరు ద్వారా వందలాది ఫోన్‌కాల్స్‌కు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. డ్యూటీ టైమ్ తర్వాత వాళ్లిద్దరూ ఇళ్లకు వెళ్లిపోవచ్చు. కానీ, బాధ్యత ఎరిగిన వారిద్దరూ రోజంతా చేసిన పని చాలామందికి ఊరటనిచ్చింది. బాధ్యత ఎరిగిన ఈ భారతీయులిద్దరికీ సలాం చేద్దాం. ప్రాణం పోసిన ప్రయాణం ప్రయాణంలో తారసపడిన స్నేహితుడు శ్రీకుమార్‌కు ప్రాణాన్నే పోశాడు. శ్రీకుమార్ కేరళలోని పుదుక్కొడతు గ్రామంలో ఎరువుల వ్యాపారి. నాలుగేళ్లుగా లివర్ సిరోసిస్‌తో బాధపడుతూ కాలేయ దాత కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో అనుకోకుండా ఒక బస్సు ప్రయాణంలో అజీజ్ దేవుడిలా తారసపడ్డాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ, శ్రీకుమార్‌కు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేశాడు. జూలై 15న సర్జరీ తర్వాత శ్రీకుమార్ కొత్తగా ప్రాణం పోసుకున్నాడు. ‘ప్రాణ’మైత్రికి ఆదర్శంగా నిలిచిన అజీజ్‌కు సలాం చేద్దాం. మెడిసిన్ బాబా జిందాబాద్..! ఢిల్లీలో ఓంకార్‌నాథ్ శర్మను స్థానికులంతా ‘మెడిసిన్ బాబా’గా పిలుచుకుంటారు. బ్లడ్‌బ్యాంకులో టెక్నీషియన్‌గా పనిచేసి, రిటైరైన ఓంకార్‌నాథ్ వయసు ఇప్పుడు 79 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన రోజూ ఇంటింటికీ తిరిగి, వాడగా మిగిలిపోయిన మందులను అడిగి తెచ్చుకుంటాడు. వాటిలో కాలంచెల్లిన వాటిని తీసేసి, పనికొచ్చే మందులను వాటిని కొనుక్కోలేని నిరుపేదలకు ఉచితంగా పంచిపెడుతుంటాడు. పేద రోగులకు తనవంతుగా నిస్వార్థసేవ చేస్తున్న ఈ ‘మెడిసిన్ బాబా’కు జిందాబాద్ చెబుదాం. ఫ్లైయింగ్ వాకర్స్ తమిళనాడులోని తిరుచ్చి దగ్గర్లోని మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద బాలిక స్వాతి. బాగా చదువుకుని ప్లస్‌టూలో మంచి మార్కులు సాధించిన మెరిట్ స్టూడెంట్. ఆగస్టు 8న ఆమెకు కోయంబత్తూరులో తమిళనాడు అగ్రికల్చరల్ వర్సిటీలోని అణ్ణా అరంగమ్లో అడ్మిషన్ కౌన్సెలింగ్. అయితే, పొరపాటున ఆమె, ఆమె తల్లి చెన్నైలోని అణ్ణా వర్సిటీకి చేరుకున్నారు. క్యాంపస్‌లో అడ్రస్ వెదుక్కుంటున్న తల్లీకూతుళ్లను గమనించారు అక్కడి వాకర్స్. జరిగిన పొరపాటును అర్థం చేసుకున్నారు. వెంటనే డబ్బులు సేకరించి, కోయంబత్తూరుకు టికెట్టు కొని, స్వాతిని, ఆమె తల్లిని విమానంలో పంపారు. ఈలోగా ఫలహారం పెట్టించారు. అగ్రికల్చరల్ వర్సిటీకి ఫోన్‌చేసి, ఆమెకు అదనపు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. వాకర్స్ చలవతో స్వాతి బీటెక్‌లో అడ్మిషన్ సాధించింది. అనూహ్య సాయానికి స్వాతి, ఆమె తల్లిదండ్రులు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. త్వరలోనే చెన్నైకి వెళ్లి, తమకు సాయం చేసిన వాకర్లకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా, విమానం టికెట్ల డబ్బులు తిరిగి ఇచ్చేసి రావాలనుకుంటున్నారు. స్వాతిని ఆదుకున్న వాకర్లు సిసలైన భారతీయులు.. వారికి జేజేలు పలుకుదాం. జగమంత కుటుంబం ఆమెది! బాల్య వివాహంతో బాధలు పడి, నిండు గర్భిణిగా రోడ్డున పడ్డ మహిళ సింధుతాయ్ నష్కల్ (67). మహారాష్ట్రకు చెందిన ఆమె జీవితంలో లెక్కలేనన్ని కష్టాలు అనుభవించింది. అయితే, ఇప్పుడామె అనాథ బాలలకు అమ్మ. ఇప్పటి వరకు ఆమె ఆశ్రయంలో దాదాపు 1400 మంది పెరిగి పెద్దయ్యారు. వాళ్లలో కొందరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఎదిగారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఐదువందలకు పైగా అవార్డులు వచ్చాయి. ఊరూరా తిరుగుతూ, ఉపన్యాసాలు ఇస్తూ, వాటి ద్వారా వచ్చే డబ్బుతోనే ఆమె అనాథ బాలల ఆలనా పాలనా చూసుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన భర్త క్షమించమని అడిగితే, పెద్దమనసుతో మన్నించింది. జగమంత కుటుంబం కలిగిన ఈ అమ్మకు వందనాలు పలుకుదాం. నిజాయితీకి గౌరవం హైదరాబాద్‌లో స్పెషల్‌బ్రాంచ్ కానిస్టేబుల్ గేదెల నారాయణరావు. విధి నిర్వహణలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న యశోదా ఆస్పత్రి వైద్యుడి పాస్‌పోర్టు పత్రాల తనిఖీకి వెళ్లారు. షరా‘మామూలు’గా ఆ వైద్యుడు వెయ్యిరూపాయలు ఇవ్వబోయారు. నారాయణరావు సున్నితంగా తిరస్కరించారు. కానిస్టేబుల్ నిజాయితీని ఆ వైద్యుడు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. మర్నాడే సీఎం స్వయంగా నారాయణరావును పిలిపించుకుని, ప్రశంసించడమే కాకుండా, అవార్డు అందజేశారు. నిజాయితీకి దక్కే గౌరవం ఇచ్చే సంతృప్తికి ఏదీ సాటిరాదు. చెక్కు చెదరని నిజాయితీ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొండేటి సతీష్ బుధవారం కరీంనగర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుకు ఆటోలో వెళుతున్నాడు. తోవలో చిగురుమామిడి శివార్లలో గాలికి కొట్టుకుపోతున్న ఒక బ్యాంకు చెక్కును గమనించాడు. వెంటనే ఆటో దిగి, చెక్కు చేతిలోకి తీసుకున్నాడు. చెక్కుపై ఖాతాదారు దేవారపు సుధాకర్‌రెడ్డి పేరు కనిపించింది. ఇ.వెంకటయ్య అనే వ్యక్తి పేరిట ఆ చెక్కు రూ. 2 లక్షలకు రాసి ఉంది. వెంటనే ఈ విషయాన్ని నగర పంచాయతీ చైర్మన్‌కు చెప్పి, ఆ చెక్కును పోలీసులకు అందజేశాడు సతీష్. పోలీసులు అతడిని అభినందించారు. త్రివర్ణచక్రం నడిపే భయ్యా ఒంగోలులో కన్నెదారి కోటేశ్వరరావు ఆటోడ్రైవర్. ఈ ఏడాది మార్చి 4న ఒక మహిళ అతడి ఆటో ఎక్కింది. గమ్యానికి చేరుకున్నాక ఆటో దిగిన మహిళ, ఆటోలో తన బ్యాగు మరచిపోయింది. ఆ బ్యాగులో దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి. బ్యాగులో నగలను గమనించిన కోటేశ్వరరావు, వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి ఆ బ్యాగును అప్పగించాడు. పోలీసుల ద్వారా అది సురక్షితంగా సొంతదారుకు చేరింది. కళ్లు చెదిరే బంగారు నగలు కళ్ల ముందు ఉన్నా, నిజాయితీని చాటుకున్న ఈ ఆటోడ్రైవర్ సిసలైన భారతీయుడు. అవును కదా! -
అశ్రునివాళి
ప్రభుత్వ లాంఛనాలతో భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలు స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం గాంధీజీతో కాలు కదిపిన మహాయోగి.. తెలంగాణ శిఖరం.. మూడు తరాల వారధి.. అన్యాయంపై అగ్గిపిడుగైన నిప్పురవ్వ.. దేశ్‌ముఖ్ ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన ధీశాలి.. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ‘తెలంగాణ’ సాధన కోసం పోరాడిన ఓరుగల్లు ముద్దుబిడ్డ.. తెలంగాణ కోసం పోరు సల్పిన స్ఫూర్తి ప్రదాత.. ఆయనే తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి.. ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.. సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయూత్ర జరిగింది.. జన్మదినానికి ఐదు రోజుల ముందే నింగికేగడం విషాదంలో నింపింది.. ‘‘అమర్ రహే తెలంగాణ గాంధీ కృష్ణమూర్తి.. జోహార్ తెలంగాణ గాంధీ..’’ అని భూపతికి ఆప్తులు, బంధువులు, ప్రజాప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు.. - వరంగల్ అర్బన్ -
స్వరాజ్య స్ఫూర్తి..గణతంత్ర దీప్తి
అనంతపురం కల్చరల్ : భారతావని దాస్యశృంఖలాలను ఛేదించి భరతమాతకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించిన ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దేశానికి దిశాదర్శనం చేసేందుకు జాతీయనాయకులు ఎంతో శ్రమించి సర్వోత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. 1950 జనవరి 26న అధికారికంగా దీనికి శ్రీకారం చుట్టారు. అహింసే నాటి ఆయుధం.. త్యాగం, శాంతి, నిస్వార్థం.. దేశభక్తే ఆనాటి ప్రధాన ఆయుధంగా తెల్లవారిని తరిమికొట్టిన ఆనాటి దేశభక్తులలో అనంత వాసులు తమదైన పాత్రను పోషించి భరతమాత సంకెళను తెంచడంలో తోడ్పడ్డారు. నాటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచినవారి మనోగతాలు ఇలా... అప్పటి నిజాయితీ కనపడదు స్వాతంత్ర పోరాటంలో ప్రతి పౌరుడూ తమ వంతు పాత్ర పోషించారు. ప్రత్యక్షంగా పోరా డి, జైళ్లకు వెళ్ళిన వారిని మాత్రమే స్వాతంత్య్ర సమర యోధులుగా గుర్తిస్తున్నారు. ఆనాడు దేశంలోని ప్రతి వ్యక్తి భరత మాత ధాస్య శృంఖలాలను తెంచడానికి నిరుపమాన త్యా గాన్ని చేశారు. అనంత వాసులు ఆనాటి కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు, నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి తదితరులున్నారు. వారిని చూసిన కళ్లతో ఇప్పటి రాజకీయ నాయకులను చూడలేకపోతున్నాం. - పెద్ద కొండప్ప (95), అనంతపురం దేశభక్తిని నింపే కార్యక్రమాలు చేపట్టాలి అనేక మంది త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్రం స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 1952లో స్వాతంత్య్రానికి గుర్తుగా నగరంలో ఏర్పాటు చేసిన సభకు విచ్చేసిన అప్పటి ప్రధాని నెహ్రూ కోసం స్వయంగా పీటీసీ స్టేడియం ప్రాంతాన్ని స్వయంగా శుభ్రపరిచారు. కల్లూరు సుబ్బారావు, ఆర్ఎస్ నాగేశ్వరరావు వంటి వారు తమ కుటుంబాలను కాదని దేశం కోసం తమ ఆస్తులను ధారపోశారు. వారి ఆశయాల కోసం ఈతరం వారిలో దేశభక్తిని నింపే కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలి. - అబ్దుల్ సత్తార్ (85), అనంతపురం -
మహాత్మా... మన్నించు
పలమనేరు: ఓ వైపు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఎటుచూసినా వేడుకలు జరుపుకుంటున్నాం. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతీయ నాయకులను గౌరవిస్తున్నాం. పారిశుధ్యంపై స్వచ్చభారత్ పేరిట ప్రభుత్వం విసృ్తత ప్రచారం చేస్తోంది. ప్రజలు ఉత్తమ పౌరులుగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. అలాంటిది ఓ వ్యక్తి పలమనేరులోని సబ్‌జైలు గోడపై చిత్రీకరించినన మహాత్మగాంధీ బొమ్మపై మూత్రవిసర్జన చేస్తుండగా ఎవరో సెల్ఫోన్లో ఈ దృశ్యాన్ని బంధించారు. అంతటితో ఆగక దీన్ని ఫేస్బుక్లో పెట్టారు. ఆ దృశ్యాన్ని చూసిన నెటిజన్ల నుంచి వందలాది నిరసన సందేశాలు వ్యక్తం అయ్యాయి. జాతిరత్నాల చిత్రాలు కొన్ని అనువైన ప్రదేశాల్లో మాత్రమే చిత్రీకరించడం సబబు అనే విషయాన్ని అధికారులు గుర్తించడం సముచితం. -
విభజన వద్దు.. సమైక్యమే ముద్దు!
స్వాతంత్ర్యం కావాలా.. యూకేలోనే కలిసుంటారా అని అడిగితే స్కాట్లండ్ వాసులు సమైక్యానికే మొగ్గు చూపారు. దేశమంతా ఒక్కటిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తీర్పునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి స్కాట్లండ్ మొత్తమ్మీద 55.30 శాతం మంది వ్యతిరేకంగాను, 44.70 శాతం మంది అనుకూలంగాను స్పందించారు. అయితే.. స్కాట్లండ్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా, వద్దా అన్న విషయంలో రెఫరెండం నిర్వహించడం ఇది తొలిసారి ఏమీ కాదు. 1707 నుంచి యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా ఉన్న స్కాట్లండ్‌లో ఇంతకుముందు కూడా రెండుసార్లు ఇదే అంశం గురించి రెఫరెండంలు జరిగాయి. అప్పుడు కూడా తాము సమైక్యంగానే ఉంటామని అక్కడి ప్రజలు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తీర్పు వచ్చింది. ఆండీ ముర్రే లాంటి టెన్నిస్ స్టార్లు, చివరకు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కూడా ఓటింగ్ జరగడానికి ముందు ప్రజలకు విజ్ఞప్తులు చేశారు. ముర్రే అయితే నేరుగా సమైక్యానికే ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఎలిజబెత్ రాణి మాత్రం మీకు మంచి చేసే నిర్ణయానికి ఓటేయండి అంటూ నర్మగర్భంగా చెప్పారు. అది కూడా స్కాట్లండ్ వాసుల మీద కొంతవరకు పనిచేసింది. మొత్తం 84.48 శాతం ఓట్లు పోలయ్యాయి. బ్రిటన్ ఎన్నికల కమిషన్ ఈ రెఫరెండంను పర్యవేక్షించింది. ఇకవేళ ఈ రెఫరెండంలోనే విభజనకు అనుకూలంగా తీర్పు వస్తే.. 2016 మార్చి 24వ తేదీన స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా అవతరించేది. ఈ నిర్ణయాన్ని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తదితరులు ప్రశంసించారు. నాలుగు జాతులతో కూడిన ఒక్క దేశంగానే ఉండటానికి స్కాట్లండ్ వాసుల తీర్పు ఎంతో మేలు చేసిందని ఆయన అన్నారు. We have heard the voice of Scotland and now the millions of voices of England must also be heard. #IndyRef — David Cameron (@David_Cameron) September 19, 2014 -
బ్రిటన్ సమైక్యతకు ఢోకా లేనట్లే!
-
ఏడు చోట్ల వ్యతిరేకం, ఒకచోట ఓకే....
గ్లాస్గో : స్కాంట్లాండ్లో రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. యూకే నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై 32 జిల్లాల్లో ఈ రిఫరెండం జరుగుతోంది. ఇప్పటివరకూ ఏడు జిల్లాల్లో తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఫలితాలు రాగా, ఒక్క జిల్లాలో మాత్రం అనుకూలంగా ఫలితం వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. కాగా కలిసుండేందుకే మొగ్గు: అతి స్వల్ప మెజారిటీతో బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనే విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. 'యుగవ్' చేసిన ప్రీ ఎలక్షన్ సర్వేలో 52% మంది యూకేలో భాగంగానే ఉండాలని, 48% మంది స్వతంత్రదేశంగా ఉండాలని స్పష్టం చేశారు. విడిపోవడం ఎందుకు? బ్రిటన్, స్కాట్లాండ్ దేశాల మధ్య అసమానతలు, స్కాట్లాండ్లో 4 దశాబ్దాల కిత్రం భారీగా బయటపడిన ఆయిల్ నిల్వలు.. ఇవి స్వతంత్రత వైపు స్కాట్ ప్రజలు ఆలోచించేలా చేశాయి. ఆర్థిక, ఆరోగ్య, సంక్షేమ రంగాల్లో బ్రిటన్ ప్రభుత్వం చూపిన వివక్ష, ప్రబలిన నిరుద్యోగం.. స్కాట్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను మరింత పెంచాయి. ఇరాక్, అఫ్గానిస్తాన్లల్లో బ్రిటన్ యుద్ధాల్లో పాల్గొనడం కూడా స్కాట్ వాసులకు ఇష్టంలేదు. అణ్వాయుధ రేసులో యూకే ఉండటాన్ని వారు వ్యతిరేకించారు. యూకే చమురు ఉత్పత్తుల్లో దాదాపు 90% స్కాట్లాండ్ నుంచే వస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో తమకు వనరుల కేటాయింపు లేకపోవడం స్కాట్ ప్రజలను ఆలోచింపజేసింది. చమురు నిల్వలు, ఇతర సహజ వనరులతో స్వతంత్రదేశంగా మరింత అభివృద్ధిని సాధించగలమని సాల్మండ్ వంటి నేతలు వివరిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి. కలసి సాగడం ఎందుకు? విడిపోతే ఎదురుకానున్న కష్టనష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బ్రిటన్ అనుకూల వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని, అది మొత్తంగా యూరోప్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు వివరిస్తున్నారు. కొత్త దేశంగా ఏర్పడితే స్కాట్లాండ్ కొత్త కరెన్సీకి ఎదురయ్యే కష్టాలనూ ప్రస్తావిస్తున్నారు. చమురు నిల్వల విషయం మినహాయిస్తే.. మిగతా రంగాల్లో బ్రిటన్ సహకారం స్కాట్లాండ్కు అవసరమని వాదిస్తున్నారు. -
మాకు స్వాతంత్ర్యం వద్దు: స్కాట్లండ్ తొలి ఫలితం
యూకే నుంచి విడిపోయి స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా అవతరించాలా వద్దా అని నిర్వహించిన రిఫరెండంలో తొలి ఫలితం వచ్చింది. మూడు రాష్ట్రాలు దేశ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. క్లాక్ మన్నన్ షైర్ అనే రాష్ట్రం తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఓటు వేసింది. ఇక్కడ రికార్డు స్థాయిలో 89% ఓటింగ్ నమోదైంది. మొత్తం ఓటేసిన వాళ్లలో 53.8% మంది స్వాతంత్ర్యం వద్దని, 46.2% మంది కావాలని కోరుకున్నారు. దాంతో ఆ రాష్ట్రం స్వాతంత్ర్యం వద్దనే చెప్పినట్లయింది. అలాగే ఆర్క్‌నీ అనే మరో రాష్ట్రం కూడా స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా అవతరించకూడదనే చెప్పింది. ఇక్కడ మెజారిటీ మరింత ఎక్కువగా ఉంది. స్వాతంత్ర్యం వద్దని 67% మంది చెప్పగా, కావాలని కేవలం 33% మందే చెప్పారు. షెట్లాండ్ రాష్ట్రం కూడా స్వాతంత్ర్యం వద్దని తేల్చింది. ఇక్కడ 63.7% మంది వద్దనగా 36.3% మంది స్వాతంత్ర్యం కావాలన్నారు. ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలోనే రెఫరెండం నిర్వహించడం గమనార్హం. స్కాట్లండ్ లో మొత్తం 32 రాష్ట్రాలున్నాయి. వీటన్నింటి ఫలితాలు ఇలా విడివిడిగా వస్తాయి. వాటిలో మెజారిటీ ఫలితం ఏదైతే దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు అత్యధిక సంఖ్యలో రిఫరెండంలో పాల్గొని తమ ఓట్లు వేయడం గమనార్హం. డూండీ అనే రాష్ట్రంలో 90% పోలింగ్ నమోదైంది. మొత్తానికి స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటూ ప్రదర్శనలు చేస్తున్న వారికి మాత్రం తొలి రెండు ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. -
రుణమాఫీ అవసరం రానప్పుడే నిజమైన స్వాతంత్య్రం
* రైతులకు ఇస్తున్న రుణాలపై వ్యవసాయ మంత్రి పోచారం వ్యాఖ్య * ‘సిగ్గుపోతుంది ఏం చెప్పుకోవాలో’ అని వ్యవసాయ వర్సిటీపై విమర్శ సాక్షి, హైదరాబాద్: ‘రైతులకు రుణమాఫీ అవసరం రావొద్దు.. అప్పుడే నిజమైన స్వాతంత్య్రం పొందినట్లు. రైతులకు ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు ఇచ్చామని ప్రభుత్వాలు చెప్పుకుం టున్నాయి. అది గొప్పకాదు. రైతుకు అప్పు అవసరంలేకుండా చేయడమే గొప్ప. అప్పుడే రైతు ఎదిగినట్లు’ అని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సీడ్స్‌మెన్ అసోసియేషన్ గురువారం నిర్వహించిన 19 వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతూ ‘మాది మేం చెప్పుకుంటే సిగ్గుపోతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా కొత్త వం గడాలు బయటకు రావడం లేదు. అందులోనే ఉండిపోతున్నాయి’ అని విమర్శించారు. రైతు కు లాభసాటిగా ఉండే విత్తనాలను ఉత్పత్తి చే యాలని విత్తన కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. 23న మహారాష్ట్రకు పోచారం మహారాష్ట్రలో చెరకు, స్ట్రాబెర్రీ పంటల సాగును పరిశీలించేందుకు ఈ నెల 23 నుంచి రెండ్రోజులపాటు మహారాష్ట్రలో పర్యటిస్తామని మం త్రి పోచారం గురువారం విలేకరులకు చె ప్పారు. నిజామాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఎకరాకు 30 టన్నుల చెరకు పండిస్తుండగా పుణే, నాసిక్‌లలో 110 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. మహారాష్ట్రలో సాగును అధ్యయనం చేసేందుకు 4 బస్సుల్లో రైతులను అక్కడకు తీసుకెళ్తున్నామన్నారు. అలాగే పుణే సమీపంలోని మహాబళేశ్వరం వద్ద స్ట్రాబెర్రి సాగు చేస్తున్నారని దాన్ని కూడా అధ్యయనం చేసి వస్తామన్నారు. కొత్త రుణాలిప్పించేందుకు కృషి ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో రైతులకు కొత్త రుణాలు ఇప్పించేందుకు బ్యాంకులను ఒప్పించే యత్నం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తన ఆధ్వర్యంలో రుణమాఫీపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.