స్వరాజ్య స్ఫూర్తి..గణతంత్ర దీప్తి | Sphurtiganatantra brightness of Independence | Sakshi
Sakshi News home page

స్వరాజ్య స్ఫూర్తి..గణతంత్ర దీప్తి

Published Mon, Jan 26 2015 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

స్వరాజ్య స్ఫూర్తి..గణతంత్ర దీప్తి

స్వరాజ్య స్ఫూర్తి..గణతంత్ర దీప్తి

అనంతపురం కల్చరల్ : భారతావని దాస్యశృంఖలాలను ఛేదించి భరతమాతకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించిన ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దేశానికి దిశాదర్శనం చేసేందుకు జాతీయనాయకులు ఎంతో శ్రమించి సర్వోత్కృష్టమైన రాజ్యాంగాన్ని  రూపొందించారు.  1950 జనవరి 26న అధికారికంగా దీనికి శ్రీకారం చుట్టారు.
 
అహింసే నాటి ఆయుధం..
త్యాగం, శాంతి, నిస్వార్థం.. దేశభక్తే ఆనాటి ప్రధాన ఆయుధంగా తెల్లవారిని తరిమికొట్టిన ఆనాటి దేశభక్తులలో అనంత వాసులు తమదైన పాత్రను పోషించి భరతమాత సంకెళను తెంచడంలో తోడ్పడ్డారు. నాటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచినవారి మనోగతాలు ఇలా...

అప్పటి నిజాయితీ కనపడదు  
 స్వాతంత్ర పోరాటంలో ప్రతి పౌరుడూ తమ వంతు పాత్ర పోషించారు. ప్రత్యక్షంగా పోరా డి, జైళ్లకు వెళ్ళిన వారిని మాత్రమే స్వాతంత్య్ర సమర యోధులుగా గుర్తిస్తున్నారు.  ఆనాడు దేశంలోని ప్రతి వ్యక్తి భరత మాత ధాస్య శృంఖలాలను తెంచడానికి నిరుపమాన త్యా గాన్ని చేశారు. అనంత వాసులు ఆనాటి కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు, నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి తదితరులున్నారు.  వారిని చూసిన కళ్లతో ఇప్పటి రాజకీయ నాయకులను చూడలేకపోతున్నాం.
 - పెద్ద కొండప్ప (95), అనంతపురం
 
దేశభక్తిని నింపే కార్యక్రమాలు చేపట్టాలి
అనేక మంది త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్రం స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 1952లో స్వాతంత్య్రానికి గుర్తుగా నగరంలో ఏర్పాటు చేసిన సభకు విచ్చేసిన అప్పటి ప్రధాని నెహ్రూ కోసం స్వయంగా పీటీసీ స్టేడియం  ప్రాంతాన్ని స్వయంగా శుభ్రపరిచారు.   కల్లూరు సుబ్బారావు, ఆర్‌ఎస్ నాగేశ్వరరావు వంటి వారు తమ కుటుంబాలను కాదని దేశం కోసం తమ ఆస్తులను ధారపోశారు.  వారి ఆశయాల కోసం ఈతరం వారిలో దేశభక్తిని నింపే కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలి.
 - అబ్దుల్ సత్తార్ (85), అనంతపురం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement