కరాటేలో పింక్ బెల్ట్ లేదు. కాని నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క అమ్మాయి, మహిళపింక్ బెల్ట్ కలిగి ఉండాలని
అంటుంది అపర్ణ రజావత్.ఆగ్రాతో మొదలుపెట్టి దేశంలో లక్షలాది మందికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్న ఈ మార్షల్ ఆర్టిస్ట్ అమెరికన్ డాక్యుమెంటరీ మేకర్ జాన్‌మెక్రిటెను ఆమెపై డాక్యుమెంటరీ చేసేలా స్ఫూర్తినిచ్చింది.
‘పింక్ బెల్ట్’ ఇప్పుడు వివిధ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందుతోంది. మీకుందా పింక్ బెల్ట్?
కరాటేలో పింక్ బెల్ట్ లేదు. వైట్, ఆరంజ్, బ్లూ, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లాక్ బెల్ట్‌లు ఉంటాయి. తర్వాతి రోజుల్లో కొన్ని కరాటే స్కూల్స్‌లో పింక్ బెల్ట్‌ను కూడా మొదలు పెట్టారు. ఇది వైట్ నుంచి ఎల్లో మధ్య స్థాయిలో ఉంటుంది. ‘ఏ స్థాయిలోదైనా ప్రతి స్త్రీకి ఆత్మరక్షణ విద్య తెలిసి ఉండాలి’ అంటుంది అపర్ణ రజావత్. ‘మన దేశంలో అబ్బాయిలు అమ్మాయిలు సమానం కాదని చిన్నప్పటి నుంచి మెదడులో వేస్తారు. ఇప్పటికీ కూడా ‘బేటీ బచావో బేటీ పఢావో’ అంటున్నాం. ఎవరైనా కాపాడే వస్తువా స్త్రీ అంటే? ఇది కాదు నేర్పాల్సింది... కొడుకుకు సంస్కారం నేర్పండి... నేర్వకపోతే దండించండి... ఇది కదా నేర్పాలి’ అని ప్రశ్నిస్తుందామె.
అన్నయ్యల మీద తిరగబడి...
అపర్ణ అవడానికి రాజస్థాన్ క్షత్రియ పుత్రిక అయినా తండ్రి ఉద్యోగరీత్యా ఆగ్రాలో పెరిగింది. నలుగురు అక్కచెల్లెళ్లు, ఇద్దరు అన్నయ్యలు. చిన్నప్పటి నుంచి తల ఒంచుకుని ఉండటం అపర్ణకు ఇష్టం లేదు. ఎదురు చెప్పేది. దాంతో అన్నయ్యలు ఆమెను దారిలో పెట్టాలని తరచూ గద్దించేవారు. అప్పుడు అపర్ణకు ఈ అన్నయ్యలను ఎదిరించాలంటే నేను ఏదో ఒక యుద్ధవిద్య నేర్వాలి అనుకుంది. అలా ఎనిమిది పదేళ్ల వయసులోనే కరాటేలో చేరింది.
రాజ్‌పుత్‌ల ఇళ్లల్లో ఆడపిల్లల్ని అలా కరాటే నేర్పించడానికి పంపడం మర్యాద తక్కువ. అందుకని డ్రాయింగ్ క్లాస్‌కు వెళుతున్నానని చెప్పి వెళ్లేది. తల్లి ఇందుకు సహకరించింది. అలా నేర్చుకున్న కరాటేతో 12వ ఏట తన కంటే సీనియర్ బెల్ట్ ఉన్న అమ్మాయిని ఓడించడంతో పేపర్‌లో వార్త వచ్చింది. దాంతో ఇంట్లో తెలిసి గగ్గోలు రేగింది. ఆ తర్వాత తండ్రి ఆమె సామర్థ్యాన్ని గ్రహించి కరాటేలో ప్రోత్సహించాడు. ‘కరాటేలో తొలి ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చిన భారతీయ మహిళను నేనే’ అంటుంది అపర్ణ.
నిర్భయ ఘటన తర్వాత...
చదువుకున్నాక అమెరికాలో ఉంటూ ట్రావెల్ ఏజెంట్‌గా పని చేస్తున్న అపర్ణను 2012లో నిర్భయ ఘటన కలచి వేసింది. ఆ సమయంలో అమెరికాలో ఆమె సహోద్యోగులు ‘మీ ఇండియాలో ఇలాగే ఉంటుందా?’ అని అడగడం మరీ అన్యాయంగా అనిపించింది. ‘నా వంతుగా ఏం చేయగలను’ అనుకున్నప్పుడు ఆమెకు తట్టిన సమాధానం స్వీయ రక్షణలో వీలైనంతమందికి శిక్షణ ఇవ్వడం. ఆ ఆలోచనతోనే 2016లో ఇండియా వచ్చి ఆగ్రాలో ‘పింక్‌బెల్ట్ మిషన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం రెండుమూడు రోజుల వర్క్‌షాప్‌ల ద్వారా స్త్రీలకు కనీస ప్రతిఘటన విద్యలు నేర్పి పింక్ బెల్ట్‌ను బహూకరించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెంచడమే పింక్‌బెల్ట్ మిషన్ లక్ష్యం.
ఆత్మరక్షణ ఈ స్త్రీలకు అక్కర్లేదా?
‘ఆత్మరక్షణ గురించి స్త్రీలకు చాలా అ΄ోహలు ఉన్నాయి. ఆ అ΄ోహలను తీర్చాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ.
అపోహ: వయసు నలభై దాటేసింది. బలహీన పడి΄ోయాను. కరాటే నేర్చుకోవాలా?
వాస్తవం: కరాటే ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు. తాయ్‌చిలాంటి విద్యనైతే 80 ఏళ్ల తర్వాత కూడా నేర్చుకోవచ్చు.
అపోహ: నేను ఇంటి బయటకే వెళ్లను. నాకు ఆత్మరక్షణ విద్య ఎందుకు?
వాస్తవం: స్త్రీలపై దాడులు జరిగేది ఇళ్లలోనే. అదీ అయినవాళ్ల చేతుల్లోనే. ఇంట్లో ఉన్నత మాత్రాన రక్షణ ఉన్నట్టు కాదు.
అపోహ: నేను మంచి ఆఫీస్‌లో పని చేస్తాను. నా కొలిగ్స్ మర్యాదస్తులు.
వాస్తవం: మీరు ఎక్కడ పని చేసినా మీకు ప్రమాదం ΄÷ంచే ఉంటుంది. ΄ార్కింగ్ ఏరియాలో మీ మీద దాడి జరిగితే?
అపోహ: నేను రెచ్చగొట్టే దుస్తులు వేసుకోను. నా జోలికి ఎవరూ రారు.
వాస్తవం మీరు ఎలాంటి దుస్తులు ధరించినా దాడి జరిగే అవకాశం ఉంది. అత్యాచారం లైంగిక చర్య మాత్రమే కాదు... ఆధిపత్య నిరూపణ కోసం చేసే చర్య కూడా.
అపోహ: ఆడవాళ్లు ఎంత నేర్చినా మగవారితో సమానం అవుతారా?
వాస్తవం ఆత్మరక్షణ విద్య నేర్చుకునేది మగవారి బలంతో సమానం అని చెప్పడానికి కాదు. ప్రమాదం జరిగినప్పుడు మెదడు మొద్దుబారి లొంగి΄ోకుండా ఫైట్‌బ్యాక్ చేసే సన్నద్ధత కోసం.ఆ లక్ష్యంతో ఇప్పటికి అపర్ణ ఇండియాలోని నాలుగైదు రాష్ట్రాల్లో ఇప్పటికి 2 లక్షల మంది అమ్మాయిలు, మహిళలకు వర్క్‌షాప్‌ల ద్వారా ఆత్మరక్షణ నేర్పింది. దీని కోసం ఫుల్‌టైమ్ మాస్టర్స్‌ను తీర్చిదిద్దింది. అమెరికాలోని భారతీయుల కోసం కూడా ఈ శిక్షణ కొనసాగిస్తోంది.
డాక్యుమెంటరీ నిర్మాణం
అపర్ణ రజావత్ కృషి గురించి దేశ విదేశాల పత్రికలు రాశాయి. అలా ఆమె కథ హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు మెక్‌క్రయిట్ ఆమెను పిలిచి ఏకంగా సినిమాయే తీస్తానని చె΄్పాడు. కాని వాస్తవిక స్ఫూర్తి అందరికీ అందాలంటే డాక్యుమెంటరీ చాలని కోరింది అపర్ణ. అలా ‘పింక్ బెల్ట్’ పేరుతో 79 నిమిషాల డాక్యుమెంటరీ తయారయ్యి ప్రస్తుతం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతోంది. షికాగో, న్యూబరీ పోర్ట్, జైపూర్ ఫెస్టివల్స్‌లో పింక్ బెల్ట్ హర్షధ్వానాలు అందుకుంది. యూట్యూబ్‌లో దీని ట్రైలర్ తాజాగా విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment