Self Respect
-
పింక్ బెల్ట్ గురించి తెలుసా? మీకుందా? కరాటేలో కాదు!
కరాటేలో పింక్ బెల్ట్ లేదు. కాని నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క అమ్మాయి, మహిళపింక్ బెల్ట్ కలిగి ఉండాలని అంటుంది అపర్ణ రజావత్.ఆగ్రాతో మొదలుపెట్టి దేశంలో లక్షలాది మందికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్న ఈ మార్షల్ ఆర్టిస్ట్ అమెరికన్ డాక్యుమెంటరీ మేకర్ జాన్మెక్రిటెను ఆమెపై డాక్యుమెంటరీ చేసేలా స్ఫూర్తినిచ్చింది.‘పింక్ బెల్ట్’ ఇప్పుడు వివిధ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందుతోంది. మీకుందా పింక్ బెల్ట్?కరాటేలో పింక్ బెల్ట్ లేదు. వైట్, ఆరంజ్, బ్లూ, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లాక్ బెల్ట్‌లు ఉంటాయి. తర్వాతి రోజుల్లో కొన్ని కరాటే స్కూల్స్‌లో పింక్ బెల్ట్‌ను కూడా మొదలు పెట్టారు. ఇది వైట్ నుంచి ఎల్లో మధ్య స్థాయిలో ఉంటుంది. ‘ఏ స్థాయిలోదైనా ప్రతి స్త్రీకి ఆత్మరక్షణ విద్య తెలిసి ఉండాలి’ అంటుంది అపర్ణ రజావత్. ‘మన దేశంలో అబ్బాయిలు అమ్మాయిలు సమానం కాదని చిన్నప్పటి నుంచి మెదడులో వేస్తారు. ఇప్పటికీ కూడా ‘బేటీ బచావో బేటీ పఢావో’ అంటున్నాం. ఎవరైనా కాపాడే వస్తువా స్త్రీ అంటే? ఇది కాదు నేర్పాల్సింది... కొడుకుకు సంస్కారం నేర్పండి... నేర్వకపోతే దండించండి... ఇది కదా నేర్పాలి’ అని ప్రశ్నిస్తుందామె.అన్నయ్యల మీద తిరగబడి...అపర్ణ అవడానికి రాజస్థాన్ క్షత్రియ పుత్రిక అయినా తండ్రి ఉద్యోగరీత్యా ఆగ్రాలో పెరిగింది. నలుగురు అక్కచెల్లెళ్లు, ఇద్దరు అన్నయ్యలు. చిన్నప్పటి నుంచి తల ఒంచుకుని ఉండటం అపర్ణకు ఇష్టం లేదు. ఎదురు చెప్పేది. దాంతో అన్నయ్యలు ఆమెను దారిలో పెట్టాలని తరచూ గద్దించేవారు. అప్పుడు అపర్ణకు ఈ అన్నయ్యలను ఎదిరించాలంటే నేను ఏదో ఒక యుద్ధవిద్య నేర్వాలి అనుకుంది. అలా ఎనిమిది పదేళ్ల వయసులోనే కరాటేలో చేరింది. రాజ్‌పుత్‌ల ఇళ్లల్లో ఆడపిల్లల్ని అలా కరాటే నేర్పించడానికి పంపడం మర్యాద తక్కువ. అందుకని డ్రాయింగ్ క్లాస్‌కు వెళుతున్నానని చెప్పి వెళ్లేది. తల్లి ఇందుకు సహకరించింది. అలా నేర్చుకున్న కరాటేతో 12వ ఏట తన కంటే సీనియర్ బెల్ట్ ఉన్న అమ్మాయిని ఓడించడంతో పేపర్లో వార్త వచ్చింది. దాంతో ఇంట్లో తెలిసి గగ్గోలు రేగింది. ఆ తర్వాత తండ్రి ఆమె సామర్థ్యాన్ని గ్రహించి కరాటేలో ప్రోత్సహించాడు. ‘కరాటేలో తొలి ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చిన భారతీయ మహిళను నేనే’ అంటుంది అపర్ణ.నిర్భయ ఘటన తర్వాత...చదువుకున్నాక అమెరికాలో ఉంటూ ట్రావెల్ ఏజెంట్‌గా పని చేస్తున్న అపర్ణను 2012లో నిర్భయ ఘటన కలచి వేసింది. ఆ సమయంలో అమెరికాలో ఆమె సహోద్యోగులు ‘మీ ఇండియాలో ఇలాగే ఉంటుందా?’ అని అడగడం మరీ అన్యాయంగా అనిపించింది. ‘నా వంతుగా ఏం చేయగలను’ అనుకున్నప్పుడు ఆమెకు తట్టిన సమాధానం స్వీయ రక్షణలో వీలైనంతమందికి శిక్షణ ఇవ్వడం. ఆ ఆలోచనతోనే 2016లో ఇండియా వచ్చి ఆగ్రాలో ‘పింక్‌బెల్ట్ మిషన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం రెండుమూడు రోజుల వర్క్‌షాప్‌ల ద్వారా స్త్రీలకు కనీస ప్రతిఘటన విద్యలు నేర్పి పింక్ బెల్ట్‌ను బహూకరించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెంచడమే పింక్‌బెల్ట్ మిషన్ లక్ష్యం.ఆత్మరక్షణ ఈ స్త్రీలకు అక్కర్లేదా?‘ఆత్మరక్షణ గురించి స్త్రీలకు చాలా అ΄ోహలు ఉన్నాయి. ఆ అ΄ోహలను తీర్చాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ.అపోహ: వయసు నలభై దాటేసింది. బలహీన పడి΄ోయాను. కరాటే నేర్చుకోవాలా?వాస్తవం: కరాటే ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు. తాయ్చిలాంటి విద్యనైతే 80 ఏళ్ల తర్వాత కూడా నేర్చుకోవచ్చు.అపోహ: నేను ఇంటి బయటకే వెళ్లను. నాకు ఆత్మరక్షణ విద్య ఎందుకు?వాస్తవం: స్త్రీలపై దాడులు జరిగేది ఇళ్లలోనే. అదీ అయినవాళ్ల చేతుల్లోనే. ఇంట్లో ఉన్నత మాత్రాన రక్షణ ఉన్నట్టు కాదు.అపోహ: నేను మంచి ఆఫీస్‌లో పని చేస్తాను. నా కొలిగ్స్ మర్యాదస్తులు.వాస్తవం: మీరు ఎక్కడ పని చేసినా మీకు ప్రమాదం ΄÷ంచే ఉంటుంది. ΄ార్కింగ్ ఏరియాలో మీ మీద దాడి జరిగితే?అపోహ: నేను రెచ్చగొట్టే దుస్తులు వేసుకోను. నా జోలికి ఎవరూ రారు.వాస్తవం మీరు ఎలాంటి దుస్తులు ధరించినా దాడి జరిగే అవకాశం ఉంది. అత్యాచారం లైంగిక చర్య మాత్రమే కాదు... ఆధిపత్య నిరూపణ కోసం చేసే చర్య కూడా.అపోహ: ఆడవాళ్లు ఎంత నేర్చినా మగవారితో సమానం అవుతారా?వాస్తవం ఆత్మరక్షణ విద్య నేర్చుకునేది మగవారి బలంతో సమానం అని చెప్పడానికి కాదు. ప్రమాదం జరిగినప్పుడు మెదడు మొద్దుబారి లొంగి΄ోకుండా ఫైట్‌బ్యాక్ చేసే సన్నద్ధత కోసం.ఆ లక్ష్యంతో ఇప్పటికి అపర్ణ ఇండియాలోని నాలుగైదు రాష్ట్రాల్లో ఇప్పటికి 2 లక్షల మంది అమ్మాయిలు, మహిళలకు వర్క్‌షాప్‌ల ద్వారా ఆత్మరక్షణ నేర్పింది. దీని కోసం ఫుల్‌టైమ్ మాస్టర్స్‌ను తీర్చిదిద్దింది. అమెరికాలోని భారతీయుల కోసం కూడా ఈ శిక్షణ కొనసాగిస్తోంది.డాక్యుమెంటరీ నిర్మాణంఅపర్ణ రజావత్ కృషి గురించి దేశ విదేశాల పత్రికలు రాశాయి. అలా ఆమె కథ హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు మెక్క్రయిట్ ఆమెను పిలిచి ఏకంగా సినిమాయే తీస్తానని చె΄్పాడు. కాని వాస్తవిక స్ఫూర్తి అందరికీ అందాలంటే డాక్యుమెంటరీ చాలని కోరింది అపర్ణ. అలా ‘పింక్ బెల్ట్’ పేరుతో 79 నిమిషాల డాక్యుమెంటరీ తయారయ్యి ప్రస్తుతం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతోంది. షికాగో, న్యూబరీ పోర్ట్, జైపూర్ ఫెస్టివల్స్‌లో పింక్ బెల్ట్ హర్షధ్వానాలు అందుకుంది. యూట్యూబ్‌లో దీని ట్రైలర్ తాజాగా విడుదలైంది. -
మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!
‘జెండర్‌ని కాదు పితృస్వామ్య వ్యవస్థను సవాల్ చేసేలా సినిమా తీయాలనుకున్నాను’ అన్నారు చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్, దర్శకురాలు కిరణ్‌రావు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో బుధవారం జరిగిన ‘మంథన్ సమ్వాద్’ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు ఆమె. ఇటీవల ఆమె దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ భారతదేశం నుంచి ఆస్కార్‌కి అధికారికంగా నామినేట్ అయిన సందర్భంగా జెండర్ దృష్టి కోణం నుంచి ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మహిళలు తమలో అంతర్గతంగా ఉండే ఖాళీలను కనుక్కోవాలనే ఆలోచనను ‘లాపతా లేడీస్’ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నా రెండవ చిత్రం. జెండర్ తేడా లేకుండా అందరి నుంచి మంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉంది.మెరుగైన కృషిమహిళల కోసం వారి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చే విషయంలో రచనల పరంగా కొంత లోటు ఉంది. ఈ లోటు ను భర్తీ చేయడానికి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. నా మొదటి సినిమా ‘ధోబీ ఘాట్’ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ వర్క్ నెక్ట్స్ సినిమాను మరింత మెరుగ్గా మార్చింది.ఆడ–మగ .. వేరుగా చూడనుఆడవాళ్ల మానసిక వేదనలు, వారికి సంబంధించిన సమస్యలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అయితే, మగవారికి సంబంధించి నవి కూడా అంతకన్నా సెన్సిటివ్ గా ఉండటం చూస్తుంటాం. నేను ఆడ–మగ అని జెండర్ ప్రకారంగా వీళ్లు తక్కువ, వాళ్లు ఎక్కువ అని చెప్పలేను. మగవాళ్లు కూడా మహిళల కోణం నుంచి సెన్సిటివ్ విషయాలను రాయగలరు, చిత్రాలు తీయగలరు. మొన్నామధ్య వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ను స్త్రీ కోణం నుంచి పురుష దర్శకుడే మనకు పరిచయం చేశారు. నేను ఒంటరితల్లిగా మా అబ్బాయి మనోభావాలను కూడా గమనిస్తుంటాను కాబట్టి ఆడ–మగ అనే ఆలోచనతో కాకుండా మానవత్వం అనే కోణం నుంచే చూస్తాను.పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తూ! మహిళల కోణం నుంచి చూస్తే ముఖ్యంగా అమ్మాయిలకు వారి కలలను సాధించుకునే విషయంలో మన దగ్గర కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రధానమైనది పితృస్వామ్య వ్యవస్థ. ఆడపిల్ల సొంతంగా ఎదగడం కన్నా, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరుతుంది అనుకుంటారు. ఆ కోణం నుంచి ఈ ‘లాపతా లేడీస్’ కథను చూపించాం. ఇద్దరు నవ వధువులు, భర్తలతో అత్తవారింటికి రైలులో బయల్దేరుతారు. మేలి ముసుగులు నిండా కప్పుకున్న వధువులు ఒక స్టేషన్లో దిగాల్సినది మరోచోట దిగుతారు. వాళ్లిద్దరిని ఇళ్లలోని వారు వెతుకుతుంటారు. ఎవరి కంటా పడకుండా ఒక వధువు తనకై తానుగా ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచు కుంటుంది. మరొక వధువు చుట్టూ ఉన్న పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తుంది. బరువైన సామాజిక సమస్యలను ప్రస్తావించిన్పటికీ, హాస్యాన్ని కూడా జత చేయడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించాం. వివాహం చేసుకోబోయే యువతులైనా, చదువుకోవడానికి చేసే ప్రయత్నమైనా వాళ్లు ఎదుర్కొనే అనేక రకాల పరిస్థితులు, కొత్త మార్గాన్ని అన్వేషించడానికి, సమస్యలను పరిష్కరించుకునే తీరు ఆలోచింపజేస్తుంది. మహిళలు వయసు పైబడినవారయినా సరే...మగవారిపైన ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందాలి. అందుకు తగిన నైపుణ్యాలను పెంచుకోవాలి’’ అని అన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ ఫెమినిజం మెరుపు‘లాపతా లేడీస్’ అని టైటిల్ చూసి ఫెమినిజం ఫైర్ ఉంటుంది కాబోలు అనుకోలేరు. కానీ, దాని తాలూకు ఒక మెరుపు కనిపిస్తుంది. అందువల్ల మగవారి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కథనం పితృస్వామానికి విరుద్ధమే కానీ ఒక జెండర్‌కు మాత్రమే సంబంధించింది కాదు. నేను వివాహ వ్యవస్థకు అస్సలు వ్యతిరేకం కాదు. నిజానికి పెళ్లయినా, కుటుంబంలో అయినా సరే స్త్రీలు తమలోని ఖాళీలను కనుక్కొనేలా ్ర΄ోత్సహించే విధంగా ఈ కథను చెప్పాలనుకున్నాను. అంతేకానీ ఏదో భారీ విప్లవాన్ని తీసుకొచ్చి సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనుకోలేదు.’’ -
యాజ్ఞవల్క్యుడి స్వాభిమానం
అది ద్వాపరయుగం. వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజన చేశాడు. నాలుగు భాగాలనూ తన నలుగురు శిష్యులైన జైమిని, వైశంపాయనుడు, పైలుడు, సుమంతులకు అప్పగించాడు. లోకంలో వాటిని ప్రచారం చేయమని వారిని ఆదేశించాడు. వ్యాసుడి ద్వారా వైశంపాయనుడు యజుర్వేదాన్ని పొందాడు. గురువు ఆదేశం మేరకు యజుర్వేద ప్రచారం కోసం శిష్యులకు బోధించసాగాడు. వైశంపాయనుడి శిష్యులలో యాజ్ఞవల్క్యుడు మిగిలిన శిష్యులందరి కంటే చాలా తెలివైనవాడు. గురువుకు శ్రద్ధగా శుశ్రూష చేస్తూ, ఆయన వద్ద యజుర్వేదాన్ని కూలంకషంగా నేర్చుకున్నాడు. అదే కాలంలో ఒకనాడు మహర్షులందరూ మేరుపర్వతం మీద సభను ఏర్పాటు చేశారు. అన్ని రాజ్యాల్లో ఉన్న మహర్షులందరికీ వర్తమానం పంపారు. మహర్షులందరూ ఆ సభకు తప్పక రావాలని, ఎవరైనా సభకు రానట్లయితే వారికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని తీర్మానించారు. మహర్షుల సభకు రావలసినదిగా వైశంపాయనుడికి కూడా వర్తమానం అందింది. అయితే, కారణాంతరాల వల్ల ఆయన ఆ సభకు వెళ్లలేకపోయాడు. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం వైశంపాయనుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఈ పరిణామానికి వైశంపాయనుడు ఎంతగానో దిగులు చెందాడు. బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడే ఉపాయమేమిటని మహర్షులను అడిగాడు. ‘ఎవరైనా తపస్సు ధారపోస్తే బయటపడవచ్చు’ అని వారు తరుణోపాయం చెప్పారు. ఇదంతా జరిగినప్పుడు ఆశ్రమంలో యాజ్ఞవల్క్యుడు లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. గురువుకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కల్పించడానికి వైశంపాయనుడి మిగిలిన శిష్యులంతా ఆశ్రమ ప్రాంగణంలో తపస్సు ప్రారంభించారు. అదే సమయానికి యాజ్ఞవల్క్యుడు వచ్చాడు. ఆశ్రమంలో తన సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు వారంతా తపోనిష్ఠలో ఉన్నారో అతడికి అర్థంకాలేదు. నేరుగా గురువు వైశంపాయనుడి వద్దకు వెళ్లాడు. ‘గురువర్యా! నా సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉన్నారేమిటి? నేను లేనప్పుడు వారికి ఏదైనా దీక్ష ఇచ్చారా? లేదా ఏదైనా బృహత్కార్యం కోసం వారంతా తపస్సు చేస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. ‘నాయనా! మేరుపర్వతం మీద మహర్షుల సభ జరిగింది. అనివార్య కారణాల వల్ల నేను ఆ సభకు వెళ్లలేకపోయాను. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తించింది. తరుణోపాయం కోసం నేను మహర్షులనే ఆశ్రయించాను. వారు చెప్పిన తరుణోపాయం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలగాలంటే ఎవరైనా తమ తపః ఫలాన్ని నాకు ధారపోయవలసి ఉంటుంది. తపః ఫలితాన్ని నాకు ధారపోయాలనే నా శిష్యులంతా తపస్సుకు పూనుకున్నారు’ అని చెప్పాడు వైశంపాయనుడు. ‘గురువర్యా! వీళ్లంతా అల్పజ్ఞులు. వీళ్ల తపస్సు వల్ల మీకు పాపవిమోచన కలగడానికి ఎన్నాళ్లు పడుతుందో! నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీకోసం ఘోరమైన తపస్సు చేస్తాను’ అన్నాడు యాజ్ఞవల్క్యుడు. సహాధ్యాయులను అల్పజ్ఞులుగా సంబోధించిన యాజ్ఞవల్క్యుడిపై వైశంపాయనుడికి పట్టరాని కోపం వచ్చింది. ‘సాటివారిని అవమానించే నీలాంటి గర్వాంధుడితో నాకు పనిలేదు. నీలాంటి వాడికి నాకు శిష్యుడిగా ఉండే అర్హత కూడా లేదు. నేను చెప్పిన విద్యను ఇక్కడే వదిలేసి వెళ్లు’ హూంకరించాడు వైశంపాయనుడు. యాజ్ఞవల్క్యుడు స్వాభిమాని. గురువు మాటలు అతడికి అవమానంగా తోచాయి. గురువు వద్ద నేర్చుకున్న విద్యనంతా అక్కడే నల్లని నెత్తురుగా కక్కేశాడు. అతడు కక్కిన నెత్తురు కృష్ణ యజుర్వేదమైంది. ఆ నెత్తుటిని తిత్తిరి పక్షులు తిన్నాయి. తిత్తిరి పక్షులు తినేసిన నెత్తురు ఆ తర్వాత తైత్తరీయోపనిషత్తు అయింది. గురువు వద్ద నేర్చుకున్న వేదాన్నంతా కక్కేసిన యాజ్ఞవల్క్యుడు సూర్యుడి కోసం తపస్సు చేసి, ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. సూర్యుడి వద్దనే నేరుగా వేదవిద్యను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు సూర్యుడి వద్ద నేర్చుకున్నది శుక్లయజుర్వేదమైంది. ఈ వేదభాగాన్నే యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వ, మధ్యందినాదులకు బోధించాడు. యాజ్ఞవల్క్యుడు బోధించిన శుక్లయజుర్వేదం ‘వాజసనేయ సంహిత’గా ప్రసిద్ధి పొందింది. వాజః అంటే అన్నం. సని అంటే దానం. యాజ్ఞవల్క్యుడి తండ్రి నిరతాన్నదానం చేసేవాడు. అందువల్ల ఆయనకు వాజసని అనే పేరు వచ్చింది. వాజసని కొడుకు కావడం వల్ల యాజ్ఞవల్క్యుడికి వాజసనేయుడు అనే నామాంతరం ఏర్పడింది. - సాంఖ్యాయన -
రాజ్యాధికారమే లక్ష్యం కావాలి
కోరుట్ల: రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పద్మశాలీ ఆత్మగౌరవ సభలో వక్తలు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదివారం జరిగిన పద్మశాలీ ఆత్మగౌరవ యుద్ధభేరి సభకు ప్రముఖ కవి గుంటుక నరసయ్య పంతులు ప్రాంగణంగా నామకరణం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది కులబాంధవులు తరలివచ్చారు. తొలుత ముఖ్య అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ, పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిదేదీ లేదని, చట్టసభల్లో ప్రాతినిధ్యం సాధించడంపై దృష్టి పెట్టాలని కోరారు. పిల్లలు ఉన్నత చదువులు చదివి సంఘం ఐక్యతకు కృషి చేయాలన్నారు. పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రాధాన్యత సాధించేవరకూ పద్మశాలీలు విశ్రమించవద్దని కోరారు. అందరూ ఏకమై ‘మనఓటు మనకే’ నినాదంతో ముందుకు రావాలని కోరారు.కర్నూలు ఎంపీ సంజయ్ మాట్లాడుతూ, పద్మశాలీలు ఎక్కడున్నా జన్యుపరమైన సంబంధం కలుపుతుందన్నారు. ఏపీలో పద్మశాలీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఎంపీగా పార్లమెంట్లో పద్మశాలీలకు చెందిన రెండు వీవర్స్ బిల్లులు ప్రవేశపెట్టడానికి కృషి చేశానని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ, పద్మశాలీ కులశక్తి విచ్ఛిన్నం కాకుండా పోరాటం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ, రాజకీయ పార్టీ ఏదైనా పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, రాజకీయ అస్థిత్వాన్ని సాధించే దిశ గా ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాదిగా పద్మశాలీ లు తరలిరావడం అభినందనీయమన్నారు. ఆత్మ గౌరవ యుద్ధభేరి సభ కమిటీ రాష్ట్ర చైర్మన్ బసవ లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రాతి నిధ్యం ఉంటేనే పద్మశాలీల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. బీసీల్లో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్నా.. చట్టసభల్లో ఆశించిన రీతిలో ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జగిత్యాల జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకులు గజ్జెల శ్రీనివాస్, జక్కుల ప్రసాద్ పాల్గొన్నారు. -
మహనీయుల మార్గంలో నడవాలి...
నవాబుపేట: అంబేడ్కర్ జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని లింగంపల్లిలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి అయిన అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. తాను అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవి ఆయన పెట్టిన భిక్షేనని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్, జగ్జీవన్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రొఫెసర్ కాశిం మాట్లాడుతూ.. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ దేశానికి రెండు కళ్లలాంటివారన్నారు. వీరి జీవిత పాఠాలు అందరికీ స్ఫూర్తిదాయకమని స్పష్టంచేశారు. అన్ని కష్టాలను వారు అనుభవించి మనకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన మహానుభావులని కొనియాడారు. అందరూ ఆత్మ గౌరవంతో బతికేందుకు చదువే ఏకై క సాధనమని చాటిచెప్పిన మహనీయులన్నారు. జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివి దేశానికి అందరికన్నా ఎక్కువ సేవ చేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్‌రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. స్వాతంత్రోద్యమంతో పాటు దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ప్రస్తుత రిజర్వేషన్లు ఆయన ఘనతేనని తెలిపారు. ఎమ్మార్పీస్ కేవలం రిజర్వేషన్ విభజన కోసమే పుట్టలేదన్నారు. ఆరోగ్యశ్రీ, సామాజిక పింఛన్ల పెరుగుదల ఉద్య మంలో తమది కీలక పాత్ర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కడుమూరి ఆనందం,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, సర్పంచు లు సోలిసేట నర్సింలు, రత్నం,పర్మయ్య,రంగారెడ్డి, నాయకులు కళ్యాణ్‌రావ్, ఆనందం పాల్గొన్నారు. -
వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం జగన్ తప్ప ఎవ్వరూ ఇవ్వలేదు
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్రం తర్వాత వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం జగన్ తప్ప మరెవ్వరూ ఇవ్వలేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం సీఎం జగన్ వల్ల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం అనంతరం ఈమేరకు మాట్లాడారు. 'ఈరోజు పేదరిక నిర్ములన కోసం సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన ఓట్ల కోసం కాదు మార్పు కోసం పని చేస్తున్నారు. పాలన లో అవినీతి ని నిర్ములించిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. విద్య, వైద్యంలో మార్పులు గొప్ప విప్లవం. జగన్ బటన్ నొక్కుతున్నారని కొందరు హాస్యంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ బటన్ వల్లనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమం అందుతోంది.' అని ధర్మాన అన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. -
కథ: విరగని అల.. రెహమాన్, నూకాలు లేకుంటే ఏమయ్యేదో?
రివ్వుమని దూసుకొచ్చిన ఆడికారు సముద్రతీరానికి కొద్దిదూరంలో ఆగింది. కార్ డోర్ తీయడానికి డ్రైవరు రెహమాన్ వచ్చేలోపే రేవంత్ డోర్ తీసుకుని దిగాడు. ఒక అడుగు ముందుకేసి ఆగి వెనక్కి తిరిగాడు రేవంత్. రెహమాన్ ఒక్క ఉదుటన ముందుకొచ్చాడు. ‘రెహమాన్.. నువ్వు ఇంటికి వెళ్ళు’ అంటూ సముద్రం వైపు కదిలాడు. అప్పుడపుడు రేవంత్ సాయంకాలాలు సముద్రం వైపు రావడం, కాసేపు గడపడం కొత్త కాదు. ‘పర్వాలేదు సార్! వెయిట్ చేస్తా’ వినయంగా అన్నాడు ‘ఈ రోజు కాస్త ఆలస్యం అవుతుందిలే’ విప్పిన కోటు తీసి భుజమ్మీద వేసుకుంటూ రెహమాన్ మాట వినకుండా ముందుకెళ్ళాడు. రెహమాన్ తండ్రి అబ్దుల్.. రేవంత్ తండ్రి గంగాధరరావుకి డ్రైవరుగా పని చేశాడు. రేవంత్ ఇంటి దగ్గరే రెహమాన్ పెరిగాడు. కారు నేర్చుకోవడంలో అక్కడే తడబడ్డాడు. డ్రైవరుగానూ అక్కడే స్థిరపడ్డాడు. రెహమాన్ మారుమాట చెప్పకుండా వెళ్లిపోయాడు. బీచ్‌లో రేవంత్ నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. మిర్చిబండి దగ్గర, ముంత కింద పప్పు బండి ముందర జనం ఈగల్లా మూగున్నారు. రేవంత్ మనసు నిశ్శబ్దంగా నిశీధిని వెతుక్కొంటూ ప్రపంచంతో సంబంధాలు తెంచుకునేందుకు తొందర పడుతోంది. చీకటి పడుతున్నా కొద్దీ బీచ్‌లో జన సంచారం తగ్గుతోంది. అక్కడక్కడ లోకాన్ని పట్టించుకోకుండా ప్రేమలో మునిగితేలుతున్న ప్రేమికులే ఉన్నారు. అంతవరకు పొదుపుగా ఉన్న అలల ఘోష కాస్తకాస్తగా పెరుగుతోంది. మిణుకుమిణుకుమంటున్న పూరి గుడిసెల్ని అపుడప్పుడు లైట్ హౌస్ కాంతి పలకరిస్తోంది. రేవంత్ భుజం మీదున్న కోట్ తీసి ముడుచుకుని పడుకున్న ముసలి పోగుకి కప్పాడు. లేవలేని ఎముకలగూడు రెండు చేతులు జోడించి నమస్కరించింది. కాలికున్న ఖరీదైన షూ ఇసుకలోనే విడిచేశాడు. ఆలోచనలలో జీవితమ్మీద వైరాగ్యం. అడుగుల్లో అలసిపోయిన నైరాశ్యం. ఎంతోమందికి మార్గదర్శి అయిన రేవంత్.. చీకటి వైపు భారంగా కదులుతున్నాడు. ఎంతో శ్రమించి తండ్రి నిర్మించిన సామ్రాజ్యం నమ్మకద్రోహంతో ములిగిపోయిందనే నిజం ముల్లై మనసుని గుచ్చుతోంది. సిగరెట్ తీసి వెలిగించాడు. గట్టిగా దమ్ములాగాడు. సమస్యలో సతమతమైపోతున్న మెదడు నరాలకి విశ్రాంతినిచ్చే ప్రయత్నం విఫలమైంది. ఆ సిగరెట్ పెట్టెను నేలకేసి కొట్టాడు. ముందుకెళ్తున్న కొద్దీ జనం కనుమరుగు అవుతున్నారు. వెనుక రెండు కాళ్ళు అనుసరిస్తున్నాయని, జత కళ్ళు గమనిస్తున్నాయనే నిజం తెలియక ముందుకు నడుస్తున్నాడు రేవంత్. జీవితంలో లోతు తెలియని వాళ్ళు, జీవితమంటే రంగులకల అని భ్రమించే వాళ్లు, క్షణికావేశంలో జీవితాన్ని కడతేర్చుకుందుకు అక్కడకే వస్తారు. జనం మీద నమ్మకాన్ని కోల్పోయిన రేవంత్ లాంటి వాళ్ళు బతుకుమీద నిరాసక్తతతో అక్కడికే చేరుకుంటారు. ఎంతటి ధీరుడైనా మృత్యుకుహరం ముంగిట అడుగు పెడితే వణకవలసిందే. చల్లగాలిలో కూడా ఆ భయానికి రేవంత్ శరీరం చెమటతో తడిసిపోయింది. అయినా మరణించాలనే నిశ్చయంతో అడుగు ముందుకేసిన రేవంత్‌ని ఒక్క ఉదుటన వెనక్కి లాగాయి నీడలా వెంటాడుతున్న రెండు చేతులు. రేవంత్‌ను బలంగా ఒడిసిపట్టుకుని ఒడ్డుకు లాకొచ్చాడు ఆ మొరటు చేతుల మనిషి. గాలి స్వేచ్ఛగా వీస్తోంది. సముద్రం కెరటాలతో ఘోషిస్తోంది. ఆ ఇద్దరినీ చూస్తోంది. నడుముకు కట్టుకున్న రబ్బర్ ట్యూబు లోంచి నీళ్ళు తీసి తాగమని రేవంత్‌కు అందించాడు ఆ వ్యక్తి. గడగడ గుటకలేస్తూ ఆత్రంగా నీళ్ళు తాగాడు రేవంత్. అప్పుడు ఏ హోదా, అధికారం గుర్తు రాలేదు అతనికి. నోట్లోంచి మాట పెగల్లేదు. ఒక్కసారి కుదేలై భోరున పసిపిల్లడిలా ఏడ్చేశాడు. అంత దర్పంగా ఉన్న మనిషి ఏడ్చేసరికి కంగారుపడ్డాడు ఆ మొరటు మనిషి. ‘ఊరుకోండయ్యా! కట్టాలు మడిసికి రాకపోతే మానులకొత్తయా. కట్టాలు వత్తాయి, పోతాయి.. సంద్రంలో కెరటాల్లాగా. కట్టాలు వచ్చినప్పుడే దైర్నంగా ఉండాలి’ అంటూ కన్నీళ్లు తుడుచుకోడానకన్నట్టు భుజమ్మీద తువ్వాలు అందించాడు. తీసుకుని మొహం తుడుచుకోసాగాడు రేవంత్. అది పొద్దుటనుంచి చెమటతో తడిసి, మట్టికొట్టుకు పోయిన తువ్వాలు అని రేవంత్ గుర్తించలేదు. బాధని దిగమింగుకుని నిమిషం సేపు అగాడు. భయంతో పూడుకు పోయిన గొంతు సర్దుకుని ‘నువ్వెవరు? నీ పేరేంటి?’ అని అడిగాడు. ‘నూకాలండి. నా పేరు వెనుక పెద్ద కతుంది బాబు’ రేవంత్ వైపు చూడకుండానే చెప్పడం మొదలుపెట్టాడు. ‘మాయమ్మకి ఇద్దరు ఆడంగులు పుట్టారు. తర్వాత ముగ్గురు మగోళ్ళు పుట్టారు కానీ ఒక్కరు కూడా బతికి బట్టకట్టనేదు. మగెదవ కోసం మా అమ్మ, అయ్య ఎక్కని గుడిమెట్టునేదు. ఓ రేతిరి నూకాలమ్మోరు మాయమ్మ కలలో కనబడినాదట. ఆ తర్వాత నెలకే నేను మాయమ్మ కడుపులో పడ్డానని నాకు నూకాలని పేరెట్టిసినారు’ చెపుతూ చెవిలో సగం కాలిన చుట్ట తీసి నోట్లో పెట్టుకుని వెలిగించాడు. నెమ్మదిగా రేవంత్‌లో కంగారు తగ్గుతోంది. చుట్ట కాలుతున్న వైపు నోట్లో పెట్టుకుని గుప్పుమని పొగ వదులుతున్న నూకాలుని ఆశ్చర్యంగా చూస్తూ రేవంత్ ‘నిప్పు నోట్లో పెట్టుకుంటే నాలుక కాలదా?’ అని అడిగాడు ‘మొదట్లో అలమాటు లేనప్పుడు కాలేది. ఇప్పుడు కాదు. జీవితంనాగే. తొలినాళ్లలో కట్టాలు, కన్నీళ్లకు కుమిలిపోయేవాణ్ణి. ఇప్పుడు అయే జీవితం అయిపోనాయి’ చెప్పాడు. నూకాలు మాట్లాడే తీరు, అతని నిర్మలమైన మనసు రేవంత్‌ను ఆకట్టుకోసాగాయి. ‘బాబూ.. నాదో పెశ్న’ బుర్ర గోక్కుంటూ అడిగాడు నూకాలు. ‘అడుగు’ వెంటనే కాలుస్తున్న చుట్టను సముద్రంలోకి విసిరేశాడు నూకాలు. నీళ్ళు పుక్కిలించి ఉమ్మేస్తూ.. ‘అయ్యా! వయసు దాసుకునేందుకు డబ్బున్నోళ్ళు రేతిరేదో మందు తాగుతారంట కదా!’ అతని అమాయకత్వానికి రేవంత్ నవ్వాడు. ‘అయ్యా! మీరలా దొరబాబులా నగుతోంటే పున్నమిరేతిరి సెంద్రుడిలా ధగధగనాడిపోతన్నారు. అనాగే ఎప్పుడు నవ్వుతుండాల’ ప్రేమపూర్వకంగా చెప్పాడు నూకాలు. ఆ మాట వినగానే రేవంత్‌కు వాళ్లమ్మ గుర్తొచ్చింది. ‘మేం తాగేదానికి పేరేదైనా మత్తు మాత్రం ఒకటే నూకాలు’ అంటూ జవాబు చెప్పాడు నూకాలు ప్రశ్నకు. ‘మాదేముంది బాబు గోర్నమెంట్ సరకు. కడుపులోకెళ్లి గడబిడ సేత్తాది. ఓ పాలి ఏటయినాదంటే.. మా గంగ నిండు సులాలు. నాను పీకలదాకా తాగి ఒంటి మీద దేసనేక సారా దుక్నంలోనే సచ్చినోడిలా పడున్నాను. ఎవరో పోకిరీ నాయళ్ళు పాకలకి నిప్పెట్టారు. మా గుడిసెలు బుగై్గపోనాయి. మా గంగ ఆ అగ్గిలో బూడిదై పోయేదే, మా ఓబులేసుగాడు పానమడ్డమేసి రచ్చించాడు. నేకపోతే నాను అనాధ అయిపోను గదేటి’ చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు. ‘అవునా?’ అశ్చర్యంగా చూశాడు రేవంత్. ‘అప్పుడు నాకు సానా సిగ్గేసినాది. సచ్చిపోవాలనిపించింది. భూమ్మీద నూకలున్న గంగ గురుతొచ్చి ఆగిపోనాను. అప్పుడే, నా ఇంటిది సేతిలో సెయ్యసి పెమానం తీసుకున్నాది’ ‘తాగుడు మానేయమందా?’ ‘నేదయ్యా! తాగమన్నాది. రోజుకు రెండు గుక్కలు, అయి కూడా ఇంటి కాడే తాగమన్నాది. అప్పటి నుంచి ఈ సెనం దాకా నాను బైట తాగనేదు. ఇంటికాడే ఒక గలేసు లేదంటే మరోటి అంతే’ నూకాలు చెప్పాడు. ‘అంటే గంగ నిన్ను గుప్పిట్లో పెట్టుకుందన్నమాట’ నవ్వుతూ అన్నాడు రేవంత్. ‘కాదయ్యా నా పేనాన్ని కాపాడి నెత్తిన పాలోసినాది. ఇంటిని బుగ్గి సేసే మంటనాపి, గడప కాడ దీపం పెట్టినాది. అయేల్లు్నంచి రేతిరి రెండు సుక్కలేసి, మా గంగెట్టిన బువ్వ తిని తొంగుంటాను. తెల్లారితే నా వలతో సంద్రం కాడుంటా’ చెపుతోంటే నూకాలు కళ్ళలో కాంతిని గమనించాడు రేవంత్. చొక్కా లేకుండా నిక్కరేసుకుని చేతిలో గుడ్డసంచి పట్టుకొని పదేళ్ల కుర్రాడొచ్చాడు అక్కడికి.. ‘ఓరయ్యా! అమ్మ నీ కాడాకి పోయి పైసలు తెమ్మన్నాది. బద్రం కొట్లో సరుకులు కావాలంట’ అంటూ. నడుం దగ్గర వేలాడుతున్న బుట్టలోంచి ఏభై రూపాయల కాగితం పిల్లాడిచేతిలో పెట్టాడు నూకాలు. బుట్టలోంచి కొరమీను తీసి పిల్లాడి చేతికిచ్చి ‘ఒరేయి అబ్బి! ఇది అమ్మకిచ్చి మసాలా దట్టించి కూర సేయమను’ అని రేవంత్ వైపు తిరిగి ‘ఈడు నా కొడుకు బాబు. అదిగో ఆ దీపం అగుపడుతోందే అదే మా గుడిసె. నా పెళ్లానికి నానంటే సానా ఇష్టమండి. ఎంత పొద్దుగూకినా నాను పోయేదాకా ముద్ద ముట్టదు. ఇప్పటికే పొద్దుపోనాది. రండయ్యా, మాతో కలో, గంజో తాగుదురుగాని’ అభ్యర్థించాడు నూకాలు. ‘వద్దులే నూకాలు నేనింటికి వెళ్లిపోతా’ అన్నాడు రేవంత్ మోహమాటంగా. ‘మిమ్మల్ని నాను ఒగ్గను. మీ బుర్రనోకి సెడ్డ ఆలోసనొచ్చినాది. అది పురుగులా దొలిసేత్తది. మిమ్మల్ని ఇడిసే పసత్తినేదు’ చనువుగా రేవంత్ చెయ్యి పట్టుకుని ఇంటి వైపు అడుగులేశాడు నూకాలు. ఆ అభిమానానికి అడ్డుచెప్పలేక పోయాడు రేవంత్. అది ఒకటే గదున్న పాక. అందులోనే తడక అడ్డుతో వంటిల్లు. కుచేలుడు కృష్ణుడిని ఆహ్వానించినట్లు రేవంత్‌కు సాదర స్వాగతం పలికాడు నూకాలు. గంగని పరిచయం చేశాడు. ‘ఏందీ.. అయ్యగారికి మంచి కొరమీను కూరసేసి ఉడుకన్నం ఎట్టు. ఈలోగా సానం సేత్తారు’ అంటూ హడావిడి చేశాడు. పాత ట్రంక్ పెట్టెలోంచి తెల్లటి పంచె తీసి ‘అయ్యా! ఇది కొత్త పంచి. పోయిన సంకురేతిరికి కొన్నాను. ఇంతవరకు మడత కూడా ఇప్పనేదు’ అంటూ రేవంత్ భుజమ్మీదేశాడు. వారించడం ఇష్టం లేక మౌనంగా నాపరాళ్ళు వేసిన తడకల స్నానాలగదిలోకి వెళ్లాడు రేవంత్. స్నానం చేసి కొత్త పంచె కట్టుకుని ఆరుబయట వేసిన నులకమంచం మీద మఠం వేసుకుని యోగిలా కూర్చున్నాడు రేవంత్. సముద్రకెరటాల మీద కదులుతున్న చంద్రుడు ఊయల ఊగుతున్న వెన్నెల బాలుడులా ఉన్నాడు. చేతికున్న బంగారు బ్రేస్లెట్ తీసి తలగడ కింద పెట్టాడు. వేడి అన్నం మీద ఘుమఘుమలాడే కొరమీను కూర వేసి ఆవిర్లు కక్కుతున్న పళ్ళెం చేతికందించాడు నూకాలు. మంచి ఆకలి మీదున్నాడేమో లొట్టలేసుకుంటూ తిన్నాడు రేవంత్. రెండురోజుల్లో విదేశీ యాత్ర ముగించుకుని వచ్చేయనున్న భార్య, పిల్లలు మనసులో మెదిలారు. ఇల్లు గుర్తొచ్చింది. ‘అయ్యా.. సిగరెట్టు’ అంటూ సిగరెట్ పాకెట్ ఇచ్చాడు నూకాలు. అది తను కాల్చే బ్రాండ్. అనుమానం, ఆశ్చర్యం ఆపుకోలేక ‘నూకాలూ.. నీదగ్గర ఈ బ్రాండ్..’ అంటూ ఆగాడు రేవంత్. ‘మీరు సంద్రం కాడ ఇసిరేసినాదే. దమ్ముగొట్టండి, మారంజుగుంటది’ ‘వద్దులే. నీ జేబులో చుట్ట ఇవ్వు’ ఇచ్చాడు నూకాలు. చుట్ట నోట్లో పెట్టుకుని వెలిగించి గట్టిగా దమ్ములాగాడు రేవంత్. చుట్ట ఘాటుకి ఊపిరాడక దగ్గు వచ్చింది. కంగారు పడిపోయాడు నూకాలు. మరుక్షణం తేరుకున్న రేవంత్ నెమ్మదిగా దమ్ములాగి పొగ వదిలాడు. సముద్రపు గాలి చల్లగా వచ్చి ప్రేమగా తాకుతోంది. ‘అయ్యా! నానో మాటాడగనా?’ గుప్పుగుప్పుమని పొగ వదులుతూ అడగమన్నట్లు సైగ చేశాడు రేవంత్. ‘వలలో పడ్డ సేపలు ఎట్టాగైన సంద్రంలోపడి బతకడానికి తెగ గింజేసుకుంతాయి. మరి మడిసెంటీ? భగమంతుడు ఇచ్చిన పేనాలు తీసేసుకుంతనంతాడు. ఇది శానా ఇసిత్రంగుంది’ అడిగాడు నూకాలు అమాయకంగా మొహం పెడుతూ. రేవంత్ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అక్కడల్లుకున్న నిశ్శబ్దం వల్ల దూరంగా ఎగసిపడుతున్న సముద్రపు కెరటాల హోరు స్పష్టంగా వినిస్తోంది. ‘మీరు సూత్తే సదువుకున్న దొరబాబులా ఉన్నారు. భగమంతుడు మీబోటి మారాజుల్ని పుట్టించి.. ఈడకు పంపినడంటే ఎంతో మంది ఆకలి తీర్చడానికని నాను సత్తేపెమానికంగా నమ్ముతాను. ఆ పని సగానీకే ఆపేసి ఎల్లిపోతననడం నాయమా సెప్పండి’ అన్నాడు నిలదీస్తున్నట్టుగా. నిర్వేదంగా నవ్వాడు రేవంత్ ‘అలా నగబాకండి. మీరు నగుతొంటే జాబిలెలుగు సూశాను. ఈ నవ్వు నచ్చనేదు’ నిర్మొహమాటంగా చెప్పాడు నూకాలు. ‘నూకాలూ.. నాకుండే కష్టాలు నాకుంటాయిగా?’ ‘ఎంత సెట్టుకు అంత గాలని తెలుసు. సమస్యలకి సావు సమాధానమా? సచ్చిపోతే కట్టాలకు దూరంగా లగేత్తచ్చు. అవి మనల్ని నమ్ముకున్నోళ్ల బతుక్కి సుట్టుకుంటాయి. ఆళ్లని పీక్కుతింటాయి. ఇంటోల్ల పేనానికి మన కట్టాల్ని ఒగ్గేత్తే అది నాయమా? ధర్మమా? సార్ధమే అవుద్ది. మనోళ్లని మనమే అన్నేయం సేసినట్టు అవుద్ది. మీరు బాగా సదుకున్న బాబులు మీకు సెప్పే గేనమ్ లేనోడ్ని’ ‘నా ఆలోచనకు రాని జీవితసత్యాన్ని చెప్పావు’ నూకాల్ని అభినందించాడు రేవంత్. ‘మా బతుకులే సూడండి ఈ పూట కూడు తింటాం. రేపటికి గుప్పెడు మెతుకుల కోసం ఎతుకులాడతాం. అది ఎలా సంపాదించాలనేది పెద్ద పెశ్న. మా ఆడోల్లకి ఆకరి ముద్ద గొంతులోకి దిగుతోంటే.. తెల్లారితే పసోళ్ల ఆకలి ఎలా తీర్సాలని ఆలోసిత్తారు. అది మా బతుకు. ఏ పూటకాపూట కూడు ఎట్టా వత్తాదో ఆలోసించాలి’ ‘నీకు రేపు ఎలా బతకాలి.. నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను ఎలా బతికించాలనేది ప్రశ్న. కాని నా ప్రపంచం వేరు. మోసగించేవాళ్ళను దాటుకుని ఆస్తిని ఎలా కాపాడుకోవాలి.. చుట్టూ ఉన్న తోడేళ్లనుంచి ఎలా రక్షించుకోవాలి.. తోడుగా ఉంటూనే ప్రాణాలు తీసే పులులుంటాయి. నీడనిచ్చిన చెట్టును నరికే గొడ్డళ్లుంటాయి. నమ్మకద్రోహం చేసే నయవంచకులు ఉంటారు. వాళ్లనుంచి ఎలా బైటపడాలనే ఆలోచనే’ కాస్త ఆవేశంగా చెప్పాడు రేవంత్. ‘అవునయ్యా! నమ్మినోడ్నే కదా మోసం సేసీది. మా బతుకులే సూడండి. తూర్పున సూరీడు కంటే ముందే లెగిసి సెమటోడిసి నాలుగు సేపలు పడితే మధ్యలో కొంతమంది అయినకాడికి ఆటిని ఏసుకుపోతారు. మా సెమట సుక్క దోసుకోడం మోసంకదా. ఆళ్ళని పుట్టించిన భగమంతుడే సత్తూ బతకమని మమ్మల్ని, మమ్మల్ని సంపి పెరగమని ఆళ్ళనీ పుట్టిచ్చాడు’ అంటూ ఒక్క ఒక్కక్షణం ఆగి.. మొహం తుండుగుడ్డతో తుడుచుకుని ‘మాకు బతుకిచ్చిన దేముడే బతికినంతకాలం సత్తూ బతకమని మమల్ని మోసం సేసాడు. ఇంకెవరికి సేప్పుకోవాల! ఇందాక మనం వత్తోంటే ఒడ్డుకాడున్న మరపడవల గురించి అడిగినారు గుర్తుందా! నిజం సెప్పాలంటే అయి మాయే. కాని మాకు దాని మీద హక్కు నేదు. అప్పు కట్టే బాద్దెత మాత్రం ఉంది. మేం వాళ్ళ సేతుల్లో మోసపోయామని తెలుసు. కాని అడిగే దైర్నం నేదు’ అన్నాడు నూకాలు. ‘అదేమిటి?’ ‘ఆదంతే. వలలకోసం ఎప్పుడో పదో, పరకో అప్పిచ్చారు. అప్పు తీసుకున్న పాపానికి పట్టిన సేపలు అల్ల పాదాల కాడ పెట్టాల. ఆళ్ళ దయ మీద బతకాల. ఇట్టమైతే బిచ్చమేత్తారు. నేకపోతే సీ కొడతారు. వలల కోసం యేసిన యేలిముద్రలతో కొన్నవే ఆ మరపడవలు. అప్పు తీర్సే మరమనుషులం మేం. అప్పు మా పేర ఉంటది. మమల్ని ఆడించే తాళం ఆల్ల కాడుంటాది. ఇంతకన్నా ఈ పెపంచకంలో దగా ఉంటాదా? అన్నేయమని ఎదిరిత్తే సంద్రం ఒడ్డు మీద సచ్చి శవాలై తేల్తాం. మాకు పెళ్ళాంబిడ్డలు కావాలి. మా పెళ్లాంబిడ్డలకి మేం కావాలి. అందుకు మా నోరు మూసుకుని మనుషులమై కూడా మూగ పీనుగుల్లా బతుకుతున్నాం’ గుండెల్లో దాచుకున్న బాధను బైట పెట్టాడు నూకాలు. జరుగుతున్న దోపిడీ వింటూంటే రేవంత్ రక్తం సలసల పొంగింది. వీళ్ళకు సాయం చేయాలని మనసులోనే నిర్ణయించుకున్నాడు. వాళ్ళకు జరిగిన మోసం ముందు తనకి జరిగిన మోసం ఎంతో చిన్నదనే విషయం అర్థమయింది. ఎవరో చేసిన మోసానికి తనని తాను శిక్షించుకోవడం ఎంత తప్పో అర్థమయింది. అన్యాయానికి ఎదురొడ్డి పోరాడాలనుకున్నాడు. కళ్ళు తెరిపించిన నూకాలికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ‘అయినా బాబు నాకు తెలకడుగుతాను.. మీకు మోసం జరిగినదంటే పోలీసోళ్ళకి సెప్పచ్చుగా! మీ దగ్గర డబ్బు ఉంది. మీ మాటకు పోలీసుల కాడ ఇలువుంటది. అయ్యా.. మా గొడంతా సెప్పి మిమల్ని ఇసిగించనేదు కదా.. చెమించండి. బాగా పొద్దు పోయింది. ఇక పండుకోండి’ అంటూ నిద్రకి ఏర్పాటు చేశాడు నూకాలు. ∙∙ తెల్లారింది. తెల్లారిపోవలసిన రేవంత్ జీవితం కొత్త సూర్యోదయాన్ని చూసింది. రెహమాన్ మాట విన్పిస్తోంది. ఇక్కడకి రెహమాన్ ఎలా వచ్చాడు.. రేవంత్‌కి ఆశ్చర్యం వేసింది. వెంటనే ‘రెహమాన్! నువ్వు.. ఇక్కడ?’ అడిగాడు. ‘మీ కోసమే సార్’ ‘నా కోసమా? నేను ఇక్కడున్నానని నీకు ఎలా తెలిసింది?’ ఊహించని ప్రశ్నకు రెహమాన్ సమాధానం చెప్పడానికి తడబడుతున్నాడు. ‘అయ్యా.. నాను సెపుతాను. తమరు ఏదో అఘాయిత్తం సేత్తారేమోనని నాకు చెప్పింది ఇతగాడే. అతగాడి మాట మీదే మీ వెనకమాల నానొచ్చాను. మీరు రేతిరి నాతో గుడిసెకాడకి వచ్చే వరకు రెహమాన్ సంద్రం కాడే ఉన్నాడు’ ‘రేవంత్ బాబు! మీరు ఎయిర్ పోర్ట్‌లో దింపమన్న గెస్టుల మాటల్ని బట్టి కంపెనీని ఎవరో మోసం చేస్తున్నారని అర్థమైంది. మనుషులకు విలువిచ్చే మీరు నమ్మినవాళ్ళ ఉచ్చులో పడ్డారని గ్రహించాను. చిన్నప్పట్నుంచి మీ సున్నితమైన మనస్తత్వం తెలుసు. అందుకేనేమో మీరు వెళ్లమన్నా వెళ్లలేకపోయాను. నా దేవుడ్ని రక్షించుకునేందుకు నూకాలు.. అల్లా పంపిన దేవదూతలా కనిపించాడు’ ఆ మాట చెపుతుంటే రెహమాన్ మొహంలో సంతృప్తి కనబడింది. రెహమాన్ మాటలకు రేవంత్ కళ్లు చెమ్మతో తడిశాయి. నమ్ముకున్న బంధువులు టెండర్లలో పోటీ కంపెనీతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచారు. కంపెనీ కీలకరహస్యాలు బైటకు చేరేశారు. నూకాలు మాటలకి, రెహమాన్ అభిమానానికి చలించిపోయాడు. రేవంత్‌లో సడలిన ఆత్మవిశ్వాసం, చిగురించింది. ‘నూకాలూ.. రేపు రెహమాన్ వస్తాడు. అతనితో కలిసి మా ఇంటికి రా’ చెప్పాడు రేవంత్. ‘చెమించండి బాబూ.. మీ అంత గొప్పోళ్ళ లోగిలికి రాలేను’ రెండు చేతులు జోడిస్తూ నూకాలు. ‘నాకు బతుకంటే అర్థం చెప్పావు. నేను ఋణం తీర్చుకోవాలిగా’ ‘తిరిగి చెల్లించడానికి ఇది అప్పు కాదయ్యా. కట్టంలో ఉన్న మడిసికి సాటిమడిసి సేసే మాట సాయం. ఇలువలకి కొలతలు ఉండవు. పైనున్న భగమంతుడే సూసి మెచ్చాలి’ నూకాలు ఆత్మాభిమానానికి అబ్బురపడి అభివాదం చేస్తూ కారు ఎక్కాడు రేవంత్. నూకాలు కొడుకు నులకమంచం మీద దుప్పటి దులుపుతూంటే బంగారు బ్రేస్లేట్ కింద పడింది. ‘అయ్యా! ఇది బాబుగారి గొలుసు’ అంటూ ఆ గొలుసును చేత్తో పట్టుకుని కారు ఆపమని అరచుకుంటూ కారు వెనుకే పరిగెత్తాడు నూకాలు నిజాయతీకి వారసుడు. -పెమ్మరాజు విజయ్ -
స్వయం శిక్షణ
నేడు మారుతున్న కాలానికనుగుణంగా పురోభివృద్ధితో పాటు సమాజంలో పగ, వైరం, ద్వేషం, అసూయ, అల్పబుద్ధి, హింస పెరిగి పోతున్నాయి. నైతిక స్వభావంలో లోపం ఏర్పడడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అభ్యుదయాత్మకమైన మనోవైఖరి అలవరచుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. నిశ్చయాత్మకంగా ఉండే లక్షణం అలవడినపుడు కష్టాలు ఎదురైనా మనస్సు అదుపు తప్పదు. ఈ క్రమంలో... పరిస్థితులకు భయపడని వాడు తనకు తాను మిత్రుడవుతాడు. స్వయంశిక్షణ అంటే తన ఆలోచనలను, తన అధీనంలో ఉంచుకోవడం. ఇది ఒక వ్యక్తికి నిశ్చయాత్మకంగా ఆలోచించే శక్తినిస్తుంది. స్వయంశిక్షణ మనస్సును అన్ని రకాలైన బలహీనతల నుంచి రక్షించి జీవితానికి ఒక ప్రత్యేక విలువనూ, యోగ్యతనూ ఇస్తుంది. నైతిక ప్రమాణాలను విశ్వాసంతో క్రమబద్ధంగా అనుష్టించడం ద్వారా విశ్వాసం పెరిగి పరిణితి లభిస్తుంది. ఈ విశ్వాసం పెరగాలంటే క్రమశిక్షణ అనేది అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. క్రమశిక్షణ అనేది ఏదో కొన్ని విషయాలల్లో కాకుండా అన్నింటిలోనూ అలవరచుకోవాలి. ఒక ఇనుప కడ్డీని అయస్కాంతంగా మారిస్తే, అది దాని బరువు కన్నా 12 రెట్లు అధికంగా ఉన్న బరువును ఎత్తగలదు. అయితే అది దాని అయస్కాంత శక్తిని కోల్పోతే మాత్రం ఒక చిన్న గుండు సూదిని కూడా ఎత్తలేదు. మనిషి మనస్సు కూడా అంతే. నిశ్చయాత్మకంగా, నిర్మలంగా, నిలకడగా ఉంటే మనిషి పరిస్థితులను తన అ«ధీనంలో ఉంచుకుని అద్భుతాలు చెయ్యగలడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వారందరికీ గుర్తింపు రావడానికి కారణం వ్యతిరేక భావాలను అధిగమించే శక్తి. నిశ్చయాత్మకంగా ఉండడమేనని, వారు తమ మనస్సును నిశ్చయాత్మక భావనలతో నింపి ఉంచడం వల్లనే ఆ స్థాయికి వెళ్ళారని అవగతం చేసుకోవాలి. మనిషి స్వప్రయత్నం తో తనను తాను ఉద్ధరించుకోవాలని, తనను తాను కించపరచుకోకుండా ఉండాలని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడికి తెలియ చేశాడు. మనిషి తనకు తానే శత్రువు, అలాగే, తనకు తానే మిత్రుడు కూడా. ప్రపంచం పట్ల, తమ పట్ల సానుకూలమైన, నిర్మాణాత్మకమైన, నిర్మలమైన స్నేహ వైఖరిని అలవరచుకుని తమకు తామే మిత్రులవ్వాలి. వ్యతిరేక భావాలతో వ్యతిరేక చర్యలు చేపట్టేవారికి బతుకు వ్యర్థం అవుతుంది. దీనికి మన నిత్య జీవితంలో కనిపించే చీమలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. తమను ఎవరైనా ఆపినా, లేక వాటి మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినా చీమలు ఆగవు. అడ్డంగా ఉన్న దాని మీదకు ఎక్కి దానిని దాటుతాయి. లేదంటే మరో మార్గంలో ముందుకు వెళతాయి. కానీ అవి ఆగవు. అంటే దీనివల్ల చేపట్టిన పని పూర్తయ్యే వరకు లక్ష్యాన్ని సాధించే వరకూ ఆగకూడదని నిగూఢం గా చీమలు మనకు తెలియ చేస్తున్నాయి. అలాగే, చీమలు వేసవి కాలంలో శీతాకాలం గురించే ఆలోచిస్తాయి. చలి కాలానికి కావల్సిన ఆహారాన్ని కూడా అవి వేసవిలోనూ సేకరిస్తాయి. అంతేకాదు రుతువుల్లోని మార్పులకు అవి అసంతృప్తి ప్రకటించవు. సముద్రపుటొడ్డున ఇసుకలో సూర్యరశ్మిలో ఆనందిస్తున్నట్టే, ఈత కొట్టడానికి దిగే ముందు సముద్రపు అడుగునుండే బండరాళ్ళ గురించి ఆలోచించాలి. అందువల్ల ఎప్పుడూ ఆచరణాత్మకంగా ఉండాలి, నిశ్చయాత్మకంగా ఆలోచించాలని తెలుసుకోవాలి. చీమ శీతాకాలం గురించి ఆలోచిస్తూనే, ఎంతోకాలం అది ఉండదని, త్వరలోనే దానినుంచి బయటపడతామని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. అలాగే మనిషి కూడా ఎల్లపుడూ కష్టాల గురించి ఆలోచించకుండా నిశ్చయాత్మకంగా ఆలోచించాలి. ఎందుకంటే చీకటి తరువాత వెలుతురు కూడా వస్తుందని గుర్తెరిగి మసలుకోవాలి. జీవితం పట్ల ఆసక్తి, నిశ్చయాత్మక మనో వైఖ రుల వల్ల ప్రతిబంధకాలను సైతం అధిగమించవచ్చు. మానవ దేహాన్ని, మనస్సును కావల్సిన విధంగా మలచుకోవచ్చు. అంకిత భావం, క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసం, నిశ్చయాత్మక మనో వైఖరి, కష్టపడి పనిచేయడం అనేవి మానవ మేధకు ప్రోత్సాహానిస్తాయి. అలాగే, అపరాధ భావం, వైరం, విచారం లాంటి వ్యతిరేక భావాల్ని తొలగించుకుని ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత, స్వయంశిక్షణ లాంటి విశిష్ట గుణాలు అభివృద్ధి చేసుకుంటే జీవితం నందనవనం అవుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరిలోనూ నమ్మశక్యం కానంతటి దక్షత, కౌశలం, దివ్యసంపద ఉన్నాయి. అయినా వాటిని చాలా మంది గుర్తించడం లేదు. అందువల్ల మన గురించి మనం స్వయంగా తెలుసుకోవడానికి మానసికంగా మనల్ని మనం శోధించి, పరిశీలించుకోవాలి. దీనివల్ల మనకు కీడు జరగదు. దీనికి కావల్సింది స్వయంశిక్షణ. గొప్ప పరిశోధనలూ, జీవితంలోని అన్ని రంగాల్లోనూ పరిపూర్ణ విజయ సాధకులకూ వెనుక ఉన్న రహస్యం ఇదే. వారంతా స్వయం శిక్షణ అలవరచుకోవడమే. ఆరోగ్యకర ఆహారాన్ని స్వీకరించడం, యోగాసనాలు, తదితర వ్యాయామాల ద్వారా శారీరక క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే జీవశక్తుల్ని ప్రాణాయామం ద్వారా నియంత్రించి శ్వాస పీల్చడంలో క్రమశిక్షణను అలవరచుకోవచ్చు. వ్యర్థ ప్రసంగాలతో కాలాన్ని, శక్తిని వృథా చేయకుండా మౌనంగా ఉండడం మాటలాడడంలో క్రమశిక్షణ ను తెలుపుతుంది. అలాగే గ్రంథపఠనం ద్వారా ఆలోచనలు, భావనలు పవిత్రం చేసుకోవడం ద్వారా భావనల్లో క్రమశిక్షణ అలవడుతుంది. ప్రార్థనలు, తీవ్రమైన జప ధ్యానాలు చేయడం ద్వారా వివేచన కలిగి అంతర్గత స్వభావంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. దారంపోగు ఒక్కటిగా ఉన్నపుడు చాలా బలహీనంగా ఉంటుంది. అయితే అలాంటి ఎన్నో దారం పోగులను కలిపి తాడుగా పేనినట్లయితే ఆ తాడు ఏనుగును కూడా బంధించగలదు. అలాగే నిశ్చయాత్మకమైన భావనలు అనే బలవర్ధకమైన నియమిత ఆహారాన్ని మన మనస్సులలోకి ఎక్కించాలి. అప్పుడే మనం యోగ్యులుగా పరిణితి చెందుతాం. వ్యతిరేక భావనల్ని అధిగమించడంలో స్వయం శిక్షణ బాగా తోడ్పడుతుంది. కష్టాలను, ఆపదలనూ ఎదుర్కొనేందుకు దృఢమైన విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ప్రోది చేసుకోవడానికి క్రమ శిక్షణ ఆ క్రమశిక్షణ ద్వారా స్వీయ శిక్షణ అలవడుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అలాగే, మనలో పేరుకుపోయిన వ్యతిరేక భావాల్ని సహజమైన క్రమశిక్షణ ద్వారా తొలగించడం సాధ్యమేనన్న విషయాన్ని గుర్తించి మసలుకోవాలి. – దాసరి దుర్గా ప్రసాద్ -
ఇమ్రాన్ ఖాన్.. భారత్‌కు వెళ్లిపోండి
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరుగు దేశం భారత్‌ను మరోసారి ఆకాశానికి ఎత్తేసిన వేళ.. ప్రతిపక్ష నేత మరయమ్ నవాజ్ విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఈ స్థాయిలో కన్నీళ్లు ఏడ్చే వ్యక్తిని చూడడం ఇదే తొలిసారంటూ వ్యాఖ్యానించిన ఆమె.. ఇమ్రాన్ ఖాన్ పాక్ విడిచి భారత్‌కు వెళ్లిపోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురైన మరయమ్ నవాజ్ షరీఫ్.. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు. అంతగా ప్రేమ ఉంటే భారత్‌కి వెళ్లిపోవాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు సూచించారామె. ‘అధికారం పోతుందని ఇలా మాట్లాడే వ్యక్తిని చూడడం ఇదే. సొంత పార్టీనే ఆయన్ని ఛీ కొడుతోంది ఇప్పుడు. భారత్‌పై అంత ప్రేమ ఉంటే.. పాక్‌ను వీడి అక్కడికే వెళ్లిపొండి’ అంటూ మరయమ్ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ఖుద్దర్ ఖామ్(ఆత్మగౌరవం) వ్యాఖ్యలు.. అవిశ్వాసం వేళ ఆయనపై రాజకీయ విమర్శలకు తావిచ్చింది. భారతీయులు ఆత్మగౌరవం ఉన్నవాళ్లని, పాక్ ప్రజలు భారత్‌ను చూసి నేర్చుకోవాలని మాట్లాడాడు. రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా.. ఏ మహాశక్తికి లొంగకుండా భారత్ పటిష్టంగా ఉందని, పాక్‌ను మాత్రం విదేశీ శక్తులు ఓ టిష్యూ పేపర్లా చూస్తున్నాయంటూ వ్యాఖ్యానించాడు. అయితే.. కశ్మీర్ అంశం, ఆరెస్సెస్ సిద్ధాంతాల విషయంలో మాత్రం తనకి కొంత అసంతృప్తి ఉందని, బహుశా ఆ కారణం వల్లనే రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు లేకుండా పోయాయంటూ జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు ఇమ్రాన్ ఖాన్. చదవండి: భారత్‌ను ఏ మహాశక్తి శాసించలేదు-ఖాన్ -
‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్ ఆవేదన
లక్నో: రెండు రోజుల క్రితం లక్నోకు చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్ డ్రైవర్ తనను ఢీకొన్నాడని.. అతడిని కొట్టింది. ఇక సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ కెమరా ఫుటేజ్‌లో సదరు యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదు. ఈ వీడియో చూసిన జనం.. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తనకు జరిగిన అవమానం మాటేంటి.. పోయిన పరువు మళ్లీ తిరిగి వస్తుందా అని క్యాబ్ డ్రైవర్ ప్రశ్నిస్తున్నాడు. అసలు ఇంతకు ఆ రోజు ఏం జరిగిందో క్యాబ్ డ్రైవర్ మాటల్లోనే.. క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటిలానే నేను ఆ రోజు క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ.. అలంబాగ్ నహరియా చౌరహా సిగ్నల్ వద్ద వేచి ఉన్నాను. ఇంతలో సదరు మహిళ రోడ్డు మీద అజాగ్రత్తగా నడుస్తూ కనిపించింది. దాంతో నేను నెమ్మదిగా వెళ్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి ఆమె వెనక్కి వచ్చి నాపై దాడి చేసింది. మొబైల్ విసిరికొట్టింది’’ అని తెలిపాడు. ‘‘కాసేపటికి అక్కడ జనాలు మూగడంతో సమస్య మరింత పెద్దదయ్యింది. నా మాట ఎవరు వినిపించుకోలేదు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఈ ఘటనలో నా కారు డామేజ్ అయ్యింది. మొత్తం మీద నాకు 60 వేల రూపాయల నష్టం వాటిల్లింది. వీటన్నింటికి మించి నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది.. పరువు పోయింది. నా తప్పు లేకున్నా పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. వీటన్నింటిని తిరిగి సరిచేయగలా.. నా పరువు తెచ్చివ్వగలరా’’ అని ప్రశ్నిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ ఫుటేజ్ చూసిన నెటిజనులు సదరు యువతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ తప్పు లేకుండానే క్యాబ్ డ్రైవర్ని అవమానించారు.. తప్పు చేసిన యువతిని వదిలేయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
ప్రధాని అంటే గౌరవం ఉంది
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు ప్రధానమంత్రి అంటే గౌరవం ఉందని, అదే సమయంలో, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విషయంలోనూ వారు స్థిరంగా ఉన్నారని రైతు నేతలు, అన్నదమ్ములు నరేశ్ తికాయత్, రాకేశ్ తికాయత్ ఆదివారం స్పష్టం చేశారు. రైతులతో చర్చలకు తమ ప్రభుత్వం ఒక ఫోన్‌కాల్ దూరంలోనే ఉందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యపై వారు స్పందిస్తూ.. ఈ సమస్యకు ఒక మధ్యేమార్గ పరిష్కారం వెతకడానికి ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనేందుకు రైతులు సిద్ధంగానే ఉన్నారన్నారు. సమస్యకు గౌరవప్రదమైన పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉందని, అయితే, ఒత్తిళ్ల మధ్య చర్చలు సాధ్యం కావని బీకేయూ ప్రధాన కార్యదర్శి రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. అదేసమయంలో, ప్రభుత్వం, పార్లమెంటు తమ ముందు లొంగిపోవాలని కూడా రైతులు కోరుకోవడం లేదన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడాలంటే ముందు అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయాలన్నది ఒక ప్రత్యామ్నాయ సూచన అని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయత్ పేర్కొన్నారు. ‘చర్చలు జరగాల్సిందే. పరిష్కారం సాధించాల్సిందే. రైతుల డిమాండ్లు అంగీకరించాలి. అయితే, మధ్యేమార్గ పరిష్కారంగా.. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు సాగు చట్టాల అమలును నిలిపేస్తామని హామీ ఇవ్వాలి. అలా ఇస్తే, మేం కూడా రైతులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాం’ అని నరేశ్ తికాయత్ సూచించారు. సాగు చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేస్తామన్న ప్రతిపాదనకు కేంద్రం కట్టుబడే ఉందని ప్రధాని శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు చోటు చేసుకున్న హింసను తికాయత్ సోదరులు ఖండించారు. అది ఉద్యమ వ్యతిరేకుల కుట్ర అని ఆరోపించారు. ‘అన్నిటికన్నా త్రివర్ణ పతాకం అత్యున్నతమైనది. జాతీయ జెండాను అవమానించడం ఎట్టి పరిస్థితుల్లో సహించం’ అని స్పష్టం చేశారు. ఘాజీపూర్‌కు తరలివస్తున్న రైతులు ఢిల్లీ– మీరట్ హైవేపై ఉన్న ఘాజీపూర్ వద్దకు రైతులు తరలివస్తున్నారు. ఈ కేంద్రం నుంచి రైతాంగ ఉద్యమానికి బీకేయూ నేత రాకేశ్ తికాయత్ నేతృత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌ల నుంచి తరలి వస్తున్న రైతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఘాజీపూర్ వద్ద భద్రత బలగాలను భారీగా మోహరించారు. మూడు అంచెల్లో ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘాజీపూర్ కేంద్రం వద్ద రైతులు శనివారం రాత్రంతా జానపద పాటలకు, దేశభక్తి గీతాలకు నృత్యాలు చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ఉద్యమానికి గుర్జర్ల మద్దతు ఉంటుందని గుర్జర్ల నేత మదన్ భయ్యా తెలిపారు. అలాగే, రైతు ఉద్యమానికి మద్దతుగా ఉత్తర ప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌లో ఆదివారం జరిగిన మూడో ‘సర్వ్ ఖాప్ మహా పంచాయత్’కు వేల సంఖ్యలో రైతులు హాజరయ్యారు. శుక్రవారం ముజఫర్ నగర్లో, మథురలో శనివారం ఈ మహా పంచాయత్ జరిగింది. -
కేసీఆర్ ఆత్మగౌరవ నినాదం
సాక్షి, కొంగకలాన్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నారు. ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కొంగకలాన్‌లో ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలన్నీ ఇక్కడే జరగాలని ఆకాంక్షించారు. ‘ఢిల్లీకి గులాములుగా ఉందామని కొన్ని పార్టీలు అంటున్నాయి. తెలంగాణ సంబంధించిన నిర్ణయాలు ఇక్కడ జరగాలా? ఢిల్లీలో జరగాలా? ఢిల్లీకి గులాం, చెంచాగిరి చేసుకుందామా? ఆలోచన చెయ్యండి.. తెలంగాణ జాతి ఒక్కటిగా ఉండాలి. ఢిల్లీకి గులాంగిరి వద్ద’ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీకి గులాంగిరి చేసే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి పార్టీలు ఢిల్లీ గుమ్మం దగ్గర పడిగాపులు కాసి ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకుంటాయని ఎద్దేవా చేశారు. ప్రతీప శక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయని ధ్వజమెత్తారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని, తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రాజకీయ నిర్ణయాల పట్ల ఆచితూచి స్పందించారు. త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. -
ఆత్మాభిమానికి పెద్దమ్మ
రెక్కలు ముక్కలు చేసుకుని సాయంత్రానికి నాలుగు రాళ్లు చేతిలో పడితే.. ఆ డబ్బుతో వండివార్చిన పచ్చడి మెతుకులైనా పరమాన్నం తిన్నట్లే ఉంటుంది. ఈ మనసు ఎందరికుంటుంది? అన్ని అవయవాలూ బాగున్నా.. రోడ్ల వెంట చేయి చాస్తున్న మనుషులు నిత్యం తారసపడుతుంటారు. ఇదే సమయంలో ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులకూ ఇవే రోడ్లు ఆశ్రయం. ఊరికే డబ్బు వస్తుందంటే ఎవరికి చేదు అనుకుంటాం. కానీ 90 ఏళ్లు పైబడిన ఆ అవ్వకు తనది కాని ఒక్క రూపాయి కూడా పాముతో సమానం. అయినవాళ్లకు ఆమె అక్కరకు రానిదైనా.. జానెడు పొట్ట నింపుకునేందుకు అనాథగా రోడ్డెక్కింది. ఉంటే తింటుంది. లేదంటే పస్తులుంటుంది. ఎవరైనా జాలిపడి పదో పరకో ఇవ్వజూపితే తాను బిచ్చగత్తెను కాదని నవ్వుతూ చెబుతుంది. తాను చేయగలిగిన పని చెబితే చేస్తానని.. ఆ తర్వాత మీరు ఇవ్వదలిచిన డబ్బు ఇవ్వండని ముందుకు కదులుతుంది. ఎండ లేదు.. వాన లేదు.. చలిగాలికీ బెదరదు.. ఫుట్‌పాత్‌పైనే బతుకీడుస్తున్న ఈ చెన్నమ్మ ఆత్మాభిమానానికి పెద్దమ్మే మరి. గార్లదిన్నె మండలం రంగనాథపురానికి చెందిన చెన్నమ్మకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అవసాన దశలో ఉన్న చెన్నమ్మను వారు భారమనుకున్నారేమో.. పదేళ్ల క్రితం నిర్దయగా వదిలేశారు. అప్పటి వరకు ఎంతో పరువుగా బతికిన ఊళ్లో ఆమె ఇమడలేకపోయింది. ఉన్న ఊరు వదిలేసి అనంతపురానికి చేరుకుంది. బతికేందుకు రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఓ కర్రను ఊతంగా పట్టుకుని నడుస్తూ.. రోడ్డు పక్కన పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ గుత్తిరోడ్డులోని ఓ గుజరీలో విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఆకలిదప్పికలు తీర్చుకుంటోంది. ఎవరైనా జాలితో అన్నమో.. డబ్బో ఇచ్చేందుకు ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరిస్తుంది. తనకు చేతనైనా పనిచేసిపెడతానని, అప్పుడే తనకు ఆ డబ్బు ఇవ్వాలని సూచిస్తోంది. ఇదిగో.. టీ తాగు చచ్చే వరకూ ఒకరిపై ఆధారపడకుండా తన రెక్కల కష్టంపైనే జీవిస్తానంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న చెన్నమ్మను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. చివరకు తనకు వస్తున్న పింఛన్‌ను బిడ్డలు లాక్కెళుతున్నా.. ఆమె నోరు మెదపడం లేదు. ఇదంతా తన ఖర్మ అంటూ కర్మసిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటుంది. కొసమెరుపేమిటంటే.. తనను ఫొటోలు తీస్తుండగా గమనించిన ఆమె ఎందుకు అంటూ ఆరా తీసింది. ‘ఎండలో చాలా కష్టపడుతున్నావు నాయనా.. ఇదిగో ఈ డబ్బు తీసుకుని టీ తాగు’ అంటూ ఓ ఐదు రూపాయలు తీసి ఇవ్వజూపినప్పుడు కెమెరా కళ్లు చెమ్మగిల్లాయి. అనంతపురంలోని గుత్తి రోడ్డులో చెత్తకుండి నుంచి వ్యర్థాలు ఏరుకుంటూ.. సేకరించిన వ్యర్థాలను గుజరీ షాపులో వేస్తున్న చెన్నమ్మ -
దళితులకు కావాల్సింది ఆత్మగౌరవం
రాజమహేంద్రవరం కల్చరల్: దళితులకు కావాల్సింది ఆత్మగౌరవమే కాని, మతం కాదని కుసుమ ధర్మన్న చాటారని బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి కె. ఆశాజ్యోతి పేర్కొన్నారు. ‘దళితులు– వర్తమానం–కుసుమ ధర్మన్న’ అనే సదస్సులో ఆమె ప్రసంగించారు. ఆంగ్లేయుల పాలనకన్నా, నల్ల దొరలపాలనలోని కష్టాలు కుసుమ ధర్మన్నను కదిలించాయని ఆమె పేర్కొన్నారు. మొదట్లో ఆయనపై గాంధీ ప్రభావం ఉన్నప్పటికీ, అనంతరం కాలంలో అంబేడ్కర్ అనుయాయిగా మారారన్నారు. మహాభారతాన్ని సంకరజాతుల ఆధిపత్యయుద్ధమని వర్ణించిన ఏకైక కవి కుసుమ ధర్మన్న అని ఆమె పేర్కొన్నారు. మరో సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ మనం ప్రత్యామ్నాయ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ప్రాణహిత కవి సన్నిధానం నరసింహ శర్మ మాట్లాడుతూ1870–1880 నాటి పత్రికలు కూడా కొన్ని గ్రంథాలయాలలో లభ్యమవుతున్న నేపధ్యంలో కుసుమ ధర్మన్న సంపాదకత్వంలో వెలువడిన పత్రికలు లభ్యం కాకపోవడం శోచనీయమన్నారు. మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ కసుమ«ధర్మన్నను జాతీయకవిగా గుర్తించాలన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణ మాట్లాడుతూ నన్నయ విశ్వవిద్యాలయంలో కుసుమ ధర్మన్న పీఠాన్ని ఏర్పాటు చేయాలని, గోదావరి గట్టున ఆయన శిలావిగ్రహం నెలకొల్పాలని కోరారు. కీర్తిపురస్కార గ్రహీత డాక్టర్ గూటం స్వామి, డాక్టర్ పుట్లహేమలత తదితరులు ప్రసంగించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
ఆత్మగౌరవం..అధికారం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : ఆత్మగౌరవం.. రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలంతా ఒక్కటై ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందంటూ బీసీ డిక్లరేషన్ చాటిచెప్పింది. 2014 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా రాజ్యాధికారంలో బీసీలు తమ భాగస్వామ్యాన్ని దక్కించుకునేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగాలంటూ తేల్చిచెప్పింది. విప్లవాల పురిటిగడ్డగా ఖ్యాతిగాంచిన ఓరుగల్లు.. బీసీ డిక్లరేషన్‌ను దేశం ముందుంచింది. అన్ని రంగాల్లోనూ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై వివిధ రంగాల్లోని నిపుణులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు చర్చించి ఈ డిక్లరేషన్ రూపొందించారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ఈ డిక్లరేషన్‌ను వెల్లడించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ అభివృద్ధే ఎజెండాగా.. బీసీల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధే ఎజెండాగా డిక్లరేషన్‌ను ప్రతిపాదించారు. సభకు హాజరైన రాజకీయ పక్షాల నేతలు దేవేందర్‌గౌడ్, కె.కేశవరావు, మధుయాష్కీ, ఈటెల రాజేందర్, గుండు సుధారాణి, దాస్యం వినయభాస్కర్, మొలుగూరి భిక్షపతి, బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగంగౌడ్, పూల రవీందర్ డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు. కాంగ్రెస్, టీ డీపీ, టీఆర్ఎస్, బీజేపీ తదితర రాజకీయ పక్షాలకు చెందిన బీసీ నేతలు ఈ ఆత్మగౌరవ సభ సాక్షిగా ఒక్కటిగా నిలిచారు. అన్ని రంగాల్లోనూ నిర్లక్ష్యం డిక్లరే షన్ అవసరం, ఆవశ్యకత గురించి అకాడమీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్(ఏబీసీడీఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీమనోహర్ క్లుప్తంగా వివరించారు. రాజ్యంగంలో పొందుపరిచిన హక్కులు, ప్రణాళిక సంఘం రూపొందించిన నిబంధనల మేరకు జిల్లా, రాష్ట్రం, దేశం సరాసరి ఆదాయాల ప్రాతిపదికన గణాంకాల ఆధారంగా ఈ డిక్లరేషన్‌ను రూపొందించినట్లు వివరించారు. జనాభాలో 56శాతంగా ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో కనీస భాగస్వామ్యం లేక పోవడం బాధాకరమన్నారు. వీరి అభివృద్ధికి కాలేల్కర్, మండల్ తదితర కమిషన్లు వేసినప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. పార్టీలు, ప్రభుత్వాలు ఈ డిక్లరేషన్‌ను హెచ్చరికగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. 144 కులాలున్నప్పటికీ జనాభా దామాషా ప్రకారం ఏ రంగంలోనూ సముచిత స్థానం దక్కలేదన్నారు. రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. వనరుల పునఃపంపిణీ, సమన్యాయం, హక్కులు, స్వేచ్ఛ, నిర్ణయాధికారం, భాగస్వామ్యం, సాధికారత లభించాల్సి ఉందన్నారు. దీన్ని సాధించేందుకు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కుల సంఘాల భారీ ర్యాలీ సభ ప్రారంభానికి ముందు జిల్లావ్యాప్తంగా బీసీ కుల సంఘాలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నేత, గీత, వడ్డెర, స్వర్ణకార, కమ్మరి, వడ్రంగి, పద్మశాలి, మేదరి, రజక, కటిక, కాపు, పెరిక సంఘాలతో పాటు వ్యవసాయ మార్కెట్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి పొన్నాల, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే వినయ్ పాల్గొన్నారు. సభలో ప్రొఫెసర్లు వి.రవీందర్, పి.నరేందర్, డాక్టర్ బండాప్రకాష్, డాక్టర్ సంగని మల్లేశ్వర్, తిరునహరి శేషు, కోలా జనార్దన్‌గౌడ్, చింతం ప్రవీణ్, దిడ్డి కుమారస్వామి, పులిసారంగపాణి, ప్రభంజన్‌యాదవ్, బీఎస్ రాములుతో పాటు కుల, ప్రజా సంఘాల నాయకులు చొల్లే టి కృష్ణమాచారి, తాళ్ల సంపత్‌కుమార్, బి.యాదగిరి, చిర్రరాజు, మిర్యాల్‌కార్ దేవేందర్, ప్రతాపగిరి రాజయ్య, పి.అశోక్, జి. రాంచందర్, ఓదెల చందర్రావు, పి.సాంబరాజు, బి.రామకృష్ణ, గుండు ప్రభాకర్, విజయ్‌కుమార్, జంగయ్య, పాక ఓంప్రకాష్, మిరిదొడ్డి శ్రీధర్, నర్సయ్య, కేదారి యాదవ్, నరేందర్, గట్టయ్య, కె.రవి, ులసంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి మీకు రాజ్యసభలో ఏ పదవి కావలని ప్రధాని మన్మోహన్సింగ్ నన్ను అడిగితే బీసీలకు సంబంధించిన కమిటీలో సభ్యత్వం కావాలని చెప్పా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల శాతం ఏడుశాతమే. 27శాతం రిజర్వేషన్లు ఉంటే ఏడుశాతం ఉద్యోగాల్లో మాత్రమేబీసీలున్నారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తే ఆయన మౌనం వహించారు. బీసీల్లో ఉన్నత విద్య అభ్యసించాల్సిన వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 67ఏళ్లకు తిండికోసం బిల్లు పెట్టడం అసమర్థ నాయకత్వానికి నిదర్శనం. బలహీనవర్గాల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగువేలమంది చనిపోతే అందులో బీసీలే అధికం. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో బీసీలు త్యాగాలు చేస్తుంటే నాయకత్వం మాత్రం అగ్రకులాల చేతుల్లో ఉంది. ఇక త్యాగాలు చేయాలో.. నాయకత్వం వహించాలో బీసీ నాయకులే తేల్చుకోవాలి. ప్రపంచీకరణతో కులవృత్తులు సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. ఇవి మరుగున పడకుండా ఉండేందుకు ఏం చేయాలో ప్రొఫెసర్లు ఆలోచించాలి. దేశంలో అపార వనరులున్నా.. కష్టజీవు ఆకలిచావులకు కారణం ఏమిటో గమనించాలి. బీసీలకు.. టీడీపీ వంద సీట్లు ఇస్తామని ప్రకటించింది. వారు రాజకీయంగా ఎదగడానికి స్థానికసంస్థల్లో ఎన్టీ రామారావు రిజర్వేషన్లు కల్పించారన్నారు. బీసీ కార్పొరేషన్‌కు పదివేలకోట్ల రూపాయలు కేటాయిస్తామని టీడీపీ ప్రకటించింది. రాజ్యాధికారం కోసం బీసీలంతా ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. - టి.దేవేందర్‌గౌడ్, రాజ్యసభ ప్లోర్ లీడర్