
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్రం తర్వాత వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం జగన్ తప్ప మరెవ్వరూ ఇవ్వలేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం సీఎం జగన్ వల్ల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం అనంతరం ఈమేరకు మాట్లాడారు.
'ఈరోజు పేదరిక నిర్ములన కోసం సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన ఓట్ల కోసం కాదు మార్పు కోసం పని చేస్తున్నారు. పాలన లో అవినీతి ని నిర్ములించిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. విద్య, వైద్యంలో మార్పులు గొప్ప విప్లవం. జగన్ బటన్ నొక్కుతున్నారని కొందరు హాస్యంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ బటన్ వల్లనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమం అందుతోంది.' అని ధర్మాన అన్నారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..