నాడు తడ‘బడి’.. నేడు కొత్త ఒరవడి
సంస్కరణలతో అద్భుతంగా మారిన ప్రభుత్వ బడులు
44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు
విద్యార్థులకు నోట్ బుక్స్ నుంచి బెల్టు, బూట్లు అందజేత
ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన
మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్
టాయిలెట్లు కాంపౌండ్ వాల్‌తో కలిపి 12 రకాల వసతుల కల్పన
హైసూ్కల్స్‌లో 62 వేల ఐఎఫ్‌పీ స్క్రీన్లతో డిజిటల్ బోధన
ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు
8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో 9.53 లక్షల ట్యాబ్స్
మారిన కరిక్యులం.. విద్యార్థులకు 21వ శతాబ్దపు నైపుణ్యాలపై దృష్టి
అన్ని స్థాయిల్లోను యాక్టివిటీ బేస్డ్ పాఠ్యాంశాలతో పాఠ్య పుస్తకాల రూపకల్పన
ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు
విద్యార్థులకు ఐటీ కోర్సుల్లో శిక్షణకు స్కిల్ ఎక్సపర్ట్స్ నియామకం
43 లక్షల పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య
సర్కారు విద్యకు రూ.72,919 కోట్ల నిధులు
‘ఈ చిత్రంలో కనిపిస్తున్నది విజయనగరం శివారు జమ్మునారాయణపురానికి చెందిన అల్లం రామకృష్ణారెడ్డి కుటుంబం. భార్య ఉదయలక్షి్మ, ఇద్దరు కుమార్తెలు. తన పిల్లలను పెద్ద చదువులు చెప్పించి ప్రయోజకులను చేయాలన్నది ఆయన తపన. ప్రైవేటు సంస్థలో మెకానిక్‌గా పనిచేసే రామకృష్ణారెడ్డికి వచ్చే కొద్దిపాటి ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతుంది, పిల్లలను చదివించుకునేందుకు ఎన్నో ఆరి్థక కష్టాలు పడేవారు. వైఎస్ జగన్ సీఎం కాగానే వచి్చన అమ్మఒడితో తన పిల్లల చదువు కష్టాలు తీరిపోయాంటున్నారాయన. పెద్ద కుమార్తె హోషితారెడ్డి జగనన్న విద్యా దీవెన పథకంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతుండగా, చిన్న కుమార్తె రిషితారెడ్డి స్థానిక కస్పా మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పదో తరగతిలో 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది.
గతేడాది ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి పంపిన 10 మంది విద్యార్థుల బృందంలో రిషితారెడ్డి కూడా ఒకరు. ‘ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారనేదానికన్నా ఈ పరీక్షలో విజయం సాధిస్తే జగనన్నను కలిసే అవకాశం దొరుకుందని భావించి అర్హత పరీక్షను పట్టుదలతో రాశాను. ఆమెరికా వెళుతున్నాన్న ఆనందం కంటే.. ఇలాగైనా జగన్ సర్‌ను కలుస్తానన్న ఆనందమే ఎక్కువగా ఉంది’ అని రిషితారెడ్డి తన సంతోషాన్ని పంచుకుంది. తల్లి ఉదయలక్ష్మి మాట్లాడుతూ ‘చాలీచాలని ఆదాయంతో ఇద్దరు పిల్లల చదువులు ఎలా అని బెంగ పడేవాళ్లం.
జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ స్కూళ్లు చాలా బాగుపడ్డాయి. మా పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదువుకుని ఉన్నతంగా రాణించారు. రిషితా కూడా నూజివీడు ట్రీపుల్ ఐటీలోనే చేరింది’ అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మి దంపతులు. వీరే కాదు.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యలో వచి్చన మార్పులు, సంస్కరణలతో పిల్లలను అద్భుతంగా చదివించుకుంటున్న లక్షలాది మంది తల్లిదండ్రుల అభిప్రాయం కూడా ఇదే’.
నానాజీ అంకంరెడ్డి, సాక్షి, అమరావతి:
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఈ ప్రభుత్వం సర్కారు బడుల రూపురేఖలను మార్చేసింది. చదువుకునే ఆసక్తే అర్హతగా నిర్ణయించి, ప్రతి పేదింటి బిడ్డను ఉన్నత చదువులు చదివిస్తోంది. ప్రభుత్వ బడి అంటే పగిలిన గోడలు.. పెచ్చులూడే స్లాబులు, నేలబారు చదువులేనన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు చదువులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ బడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వరకు తీసుకెళ్లిన ఘనత దేశంలో ఏపీకి మాత్రమే దక్కింది. కార్పొరేట్ విద్యారంగం ఈర్ష పడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 12 రకాల సదుపాయాలు కలి్పంచారు.
నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్, 1,000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ఒక్క ఏపీలోనే సాధ్యమైంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌ను సైతం అమలు చేయనుంది. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది.
ప్రతి విద్యార్థి అంతర్జాతీయంగా ఎదిగేందుకు ఇంగ్లిష్ ల్యాబ్స్‌తో పాటు టోఫెల్ శిక్షణను అందిస్తోంది. గోరుముద్దతో వారంలో ఆరు రోజులు 16 రకాల వంటకాలతో పోషకాహారం అందిస్తోంది. బైలింగ్వుల్ టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లి‹Ùను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. ఏపీలోని విద్యా సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐక్యరాజ్య సమితిలో సైతం ప్రపంచ దేశాలు అభినందించాయి. ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఈ మార్పును అద్భుతమైన సంస్కరణగా కొనియాడుతున్నారు.
నాడు–నేడుతో బడులకు కొత్త సొబగులు
విద్యార్థులు చదివేందుకు అనువైన వాతావరణాన్ని కలి్పంచేలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 12 సదుపాలను కలి్పంచింది. నిరంత నీటి సరఫరాతో టాయిలెట్లు, తాగునీటి సరఫరా, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించి పాఠశాల వాతావరణాన్ని అభ్యసన కేంద్రాలుగా మార్చింది. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించి ప్రజలకు అంకితం చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు.
ప్రపంచ టెక్నాలజీపై విద్యార్థులకు శిక్షణ
విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది.
నాస్కామ్, జేఎన్‌టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా ప్రభుత్వం నియమించింది.
అంగన్వాడీ నుంచి పాఠ్యాంశాలు సంస్కరణ
మూస పద్ధతిలో సాగుతున్న పాఠాల బోధనను 2020–21 నుంచి మార్చింది. కొత్త పాఠ్యపుస్తకాల్లో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పొందుపరిచి, పౌండేషనల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసం క్లాస్‌రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్‌ను రూపొందించి అమలు చేస్తోంది. పీపీ–1, పీపీ–2 విధానం అమలు చేసేలా 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించింది. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు భారీగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్‌ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’పై ఇఫ్లూ, రివర్‌సైడ్ లెరి్నంగ్ సెంటర్ల నిపుణలతో శిక్షణనిచి్చంది.
జగనన్న ‘గోరుముద్ద’..ఇదో నూతన ఒరవడి
⇒ పేద పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే ‘గోరుముద్ద’ పథకాన్ని రూపొందించారు.
⇒ 45 వేల పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
⇒ విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం వడ్డన
⇒ సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూ చొప్పున 16 రకాల పదార్థాలు గోరుముద్దలో చేర్చారు.
⇒ ఏ రోజు ఏయే పదార్థాలు పెట్టాలో మెనూలో స్పష్టంగా పేర్కొన్నారు.
⇒ రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ అందజేత
⇒ ఉడికించిన గుడ్డు ఐదు రోజులు తప్పనిసరిగా
అందజేత
⇒ మారిన మెనూతో ప్రతిరోజు సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు.
⇒ మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు.
⇒ ప్రతి గురువారం బడి పిల్లలను ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి పరీక్షలు
⇒ రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలన.
⇒ గత ఐదేళ్లలో పాఠశాల విద్యార్థుల్లో దాదాపుగా తగ్గిపోయిన రక్తహీనత
⇒ గత ప్రభుత్వం 2014–2019 మధ్య పిల్లల భోజన ఖర్చు ఏడాది వ్యయం రూ.450 కోట్లే
⇒ అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది రూ.1,400 కోట్లకు పెంచింది.
⇒ వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
⇒ ఈ ఐదేళ్లల్లో గోరుముద్దకు రూ.6995.34 కోట్ల నిధులు ఖర్చు
సీబీఎస్‌ఈ బోధన, మండలానికో జూ.కాలేజీ
⇒ విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీపడేందుకు మొదటి విడతలో 1,000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధన ప్రారంభించింది.
⇒ హైసూ్కల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోను బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది.
⇒ 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు.
⇒ మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటరీ్మడియట్‌ను ప్రవేశపెట్టారు.
⇒ 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలు గరల్స్ జూనియర్ కళాశాలలుగా మార్పు
⇒ మొత్తంగా 679 మండలాల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలు అందుబాటులోకి ..
బాలికలు ‘స్వేచ్ఛ’గా ఎదిగేలా..
⇒ దేశంలో 23 శాతం బాలికలు రుతుక్రమ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడి
⇒ రాష్ట్రంలోనూ పాఠశాల స్థాయిలో అధిక డ్రాప్ అవుట్స్‌కు ఇదే కారణం
⇒ ఈ సమస్యలు, నివారణపై ప్రతి పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోలీసుల ద్వారా విద్యారి్థనులకు అవగాహన
⇒ డ్రాప్ అవుట్స్‌కు కారణంగా ఉన్న రుతుక్రమ ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో
‘స్వేచ్ఛ’ పథకం ప్రారంభం
⇒ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్ అందజేత
⇒ వీటికోసం ఏడాదికి 12 కోట్ల ఫ్యాడ్స్‌ను బాలికలకు ఉచితంగా అందజేత
⇒ గతంలో పట్టణాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రమే అరకొరగా టాయిలెట్లు
⇒ టాయిలెట్ల లేని చోట్ల కౌమర బాలికలు తమ చదువుకు స్వస్తి పలికేవారు.
⇒ మనబడి నాడు–నేడు ప్రాజెక్టుతో ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలోను టాయిలెట్ల నిర్మాణం
⇒ ప్రస్తుతం 49,293 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నీటి సఫరాతో టాయిలెట్లు అందుబాటులోకి వచి్చనట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు
⇒ 45,137 పాఠశాలల్లో బాలికలు ప్రత్యేక గది, టాయిలెట్లు ఉన్నట్టు ప్రకటన
⇒ ఫలితంగా బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడమే గాక చేరికలు పెరిగాయి.
⇒ 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో బాలికల సంఖ్య 18,80,591 మంది ఉంటే 2023–24లో 19,26,724 మందికి పెరిగింది. ⇒ డ్రాప్ అవుట్స్ కూడా 2018–19లో 16.37 శాతం నుంచి 2023–24 నాటికి 12 శాతానికి తగ్గిపోయింది.
‘డిజిటల్’లో దుమ్ము దులిపేలా బోధన
⇒ బ్లాక్ బోర్డులపై రాసే సుద్ద ముక్కలు సరఫరా లేక ఇబ్బంది పడిన ప్రభుత్వ బడిలో నేడు డిజిటల్ బోధన సాగుతోంది.
⇒ నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్‌తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్‌పీ)తో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు.
⇒ ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు.
⇒ నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందించడం గమనార్హం.
⇒ దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం
దేశ చరిత్రలో ఓ విప్లవం.
⇒ ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చి, ఇంటి వద్దా డిజిటల్ పాఠాలు నేర్చుకునే అవకాశం కలి్పంచింది.
⇒ డిజిటల్ పాఠాలను ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూస్తున్నారు.
⇒ ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్‌సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది.
⇒ విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
⇒ ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లి‹Ù, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను సునాయాసంగా
నివృత్తి చేస్తోంది.
సబ్జెక్టు టీచర్లు.. టోఫెల్ శిక్షణ
⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించింది.
⇒ అందుకోసం ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది.
⇒ ప్రాధమిక స్థాయి నుంచి ఇంగ్లి‹Ùపై పట్టు సాధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు యూఎస్‌ఏకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సరీ్వసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది.
⇒ఇందులో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణనిస్తున్నారు.
⇒ ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం.
⇒విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను
నియమించి ఉత్తమ శిక్షణనిస్తోంది.
⇒ఇందుకోసం అర్హత గల 25 వేల మందికి పైగా ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి హైసూ్కళ్లల్లో నియమించింది.
అమ్మ ఒడి నుంచి ఆణిముత్యాలు
⇒ విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలను అమలు
⇒మనబడి నాడు–నేడు’లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు కల్పించడంతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలోను మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు
⇒ రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు.
⇒ ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
⇒వారికి అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభం
⇒నవరత్నాల పథకంలో ఒకటి నుంచి ఇంటరీ్మడియట్ వరకు పిల్లలను బడికి పంపించే తల్లికి రూ.15 వేలు చొప్పున తొలిసారి 42,33,098 మంది ఖాతాల్లో రూ.6349.6 కోట్లు జమ
⇒ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే గాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారీకీ అమ్మ ఒడి అమలు చేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు రూ.26,067 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ
⇒విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది.
⇒ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటినవారి ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది.
⇒ 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందజేత
⇒ 2024 మార్చిలో విడుదలైన ఫలితాల్లోనూ దాదాపు 35 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలు, జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధన
Comments
Please login to add a commentAdd a comment