backward classes
-
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యా ఉద్యోగాల్లో అమలు చేసినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాతినిధ్యానికి నోచుకోని కులాలు, సంచార జాతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు డీఆర్డీఎస్ రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ కేవీ రావు, రిటైర్డ్ అడిషినల్ డీసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, ఎంబీసీ ప్రతినిధి మహేశ్ వినతిపత్రం సమర్పించారు. 35 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యంత వెనుబడిన కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. బీసీల్లోని 8 నుంచి 9 కులాలే రాజకీయాల్లో రిజర్వేషన్ల ఫలాలను మొత్తం అనుభవిస్తున్నాయని.. అత్యంత వెనుకబడిన వర్గాలకు కనీసం వార్డు మెంబర్ పదవులు కూడా ఇప్పటికీ దక్కడం లేదన్నారు. ఏబీసీడీ వర్గీకరణ అమలుతోనే రాజకీయాల్లో ఎంబీసీలకు ప్రాతినిధ్యం దక్కుతుందని వివరించారు.తెలంగాణలో 56 శాతం వరకు బీసీలు ఉన్నారని.. దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందన్నారు. కులగణన తర్వాత దాషామా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు. రాష్ట్రంలో 93 బీసీ కులాలు ఉండగా 90 శాతం రిజర్వేషన్లు 9 కులాలే దక్కించుకుంటున్నాయని, మిగతా 10 శాతం రిజర్వేషన్లను 15 కులాలకు చెందిన వారు దక్కించుకున్నారని వివరించారు. అత్యంత వెనుకబడిన బీసీ-ఏ కులాలకు, సంచార జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం శూన్యమని తెలిపారు. ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉండాలంటే ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడం ఒక్కటే మార్గమని నొక్కి చెప్పారు. ఎంబీసీల సామాజిక సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం ఎంతో కీలమని తేల్చిచెప్పారు.చదవండి: నిరుపయోగంగా 50 ఎకరాలు... నెరవేరని ప్రభుత్వ లక్ష్యం -
మరో వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: వెనుకబడిన వర్గాలకు టీడీపీ మరో వెన్నుపోటు పొడిచింది. ముగ్గురు బీసీ రాజ్యసభ సభ్యులు చేత చంద్రబాబు రాజీనామా చేయించారు. రాజ్యసభ అభ్యర్థులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, డిసెంబర్ 20న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య రాజీనామా చేయించగా.. మోపిదేవి, ఆర్. కృష్ణయ్యలకు ఆ స్థానాలు ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయించింది.డీల్ కుదుర్చుకున్న బీద మస్తాన్‌రావుకి మాత్రమే టీడీపీ రెన్యూవల్ చేయనుంది. మోపిదేవి, ఆర్ కృష్ణయ్య స్థానాలు బాగా డబ్బున్న వారికే ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. టీడీపీ రాజ్యసభ రేస్‌లో సానా సతీష్, గల్లా జయదేవ్, కిలారు రాజేష్, కంభంపాటి రామ్మోహన్, లింగమనేని రమేష్‌లు పోటీ పడుతుండగా, మూడు స్థానాల్లో ఒక రాజ్యసభ కోసం బీజేపీ పట్టుబడుతోంది.ఇదీ చదవండి: టీడీపీలో పదవుల నైరాశ్యం -
బీసీలకు స్వాతంత్య్ర ఫలాల్లో సమవాటా ఎప్పుడు?
దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిన చేతి వృత్తుల, కుల వృత్తులపై బతికే బీసీల అభ్యు న్నతే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం ఉంది. దేశా నికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లకు పైగా గడిచిపోయాయి. అయినా బీసీలు, ఎంబీసీలు తమకు న్యాయమైన వాటా దక్కాలనిఇంకా పోరాటం చేస్తూ ఉండాల్సి రావడం నిజంగా బాధా కరం. వారు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అట్ట డుగున ఉండడం మన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోడానికి ముందుకు రావడం కొంత ఆశాజనక అంశమే. అయితే అవి తమ చిత్త శుద్ధిని అమలులో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా; విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన... బీసీ లకు ఆ యా రంగాలలో సరైన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘బీసీ డెడికేటెడ్ కమిషన్’ నివే దిక ఇవ్వాల్సిన అవసరం ఉంది.రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా వారిసంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పదవుల్లో 33 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమే. దానితో పాటుగా బీసీ లను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం గొర్రెల పంపిణీ చేయడం, చేపల పెంపకానికి కృషి చేయడం, నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం, వందల సంఖ్యలో కొత్తగా బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ‘జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్’ను అందించడం, బీసీ కులాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేయడం... వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డిలో బీసీ వర్గాలకు చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యతో డిక్లరేషన్ ఇప్పించింది. ఆ డిక్లరేషన్‌కు కట్టుబడి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కూడా ఎన్నో విమర్శలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.ఎందుకంటే సర్వే పత్రాలు రోడ్లపై ప్రత్యక్షమవుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి బీసీల జనాభా లెక్కలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ కానీ, కాంగ్రెస్ పార్టీగా తాను తెలంగాణ ప్రజ లకు ఇచ్చిన హామీలను కానీ చిత్తశుద్ధితో అమలు చేయాలంటే అధికారంలో ఉన్న వారికి బడుగుల పట్ల ప్రేమ ఉండాలి. ఎన్నికల నినాదాలు ప్రభుత్వ విధానా లుగా మారాలి. హడావిడిగా జనాభా లెక్కలను సేకరించి చేతులు దులుపుకొనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయ కూడదు. రాజకీయ అధికారంతో సామాజిక, ఆర్థిక అసమా నతలు తొలగిపోతాయన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీలకు, వారి ఉప కులా లకు రాజకీయ అధికారంలో జనాభా నిష్పత్తి ప్రకారం వాటాను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు ఉండా లని డిమాండ్ చేస్తున్నాం.కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు జరుగు తున్న, జరిగిన బీసీ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉదాహరణగా తీసుకొని, అదే స్థాయిలో రాష్ట్రంలో బీసీలకు రాజకీయ వాటా దక్కే విధంగా రిజర్వే షన్లను ఖరారు చేసి అమలు చేయాలి. ఒక నెల కాల పరి మితికే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ స్వల్ప సమయం సరిపోకపోవచ్చు. బీసీ, బీసీ ఉప కులాల్లో కచ్చితమైన జనాభా గణాంకాలను వెలికి తీయడానికి కమిషన్‌కు కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ కాలపరిమితిని మరికొంత కాలం పాటు పొడిగించి, బీసీ కులాల కచ్చితమైన డేటా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి.డెడికేటెడ్ కమిషన్ కూడా అంతే చిత్తశుద్ధితో సమగ్రంగా అధ్యయనం చేసి ఎటువంటి లోపాలకూ తావు లేకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా తమ నివేది కను ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు సరైన న్యాయం జరగాలనే ఆకాంక్ష, చిత్తశుద్ధిని వ్యక్తం చేస్తూ డెడికేటెడ్ కమిషన్‌కు ‘తెలంగాణ జాగృతి సంస్థ’ తరఫున నివేదికను అందజేశాం. అన్ని కులాలు, తరగతులు, వర్గాలకు మధ్య ఉన్న తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామా జిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వా లను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రాతినిధ్యం లేని, లేదా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వివిధ కులాలకు, తరగతులకు అవకాశాలు కల్పించేందుకు అనేక మార్పులను, చర్యలను ప్రభుత్వాలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.తమ శ్రమను, మేధస్సును మానవ నాగరికతా వికా సానికి ధారపోసిన కులవృత్తుల వారు స్వాతంత్య్ర ఫలాల్లో సమవాటా పొందాలి. ఈ సమాజ నిర్మాణానికి తమ రక్త మాంసాలను కరిగించి వందల వేల సంవత్సరాలుగారంగులద్దిన చేతి వృత్తుల వారికి ఇప్పటికైనా చట్ట సభల్లో గళమెత్తే అవకాశం కల్పించాలి. ఊరికి నాలుగు దిక్కులా మన తాత ముత్తాతల కథాగానం చేసిన సంచార జాతులు కనీసం పంచాయతీ వార్డు మెంబర్ అయినా కాలేకపోతే స్వరాజ్యానికి అర్థమేముంది? ఇకనైనా మార్పు రావాలి. -కల్వకుంట్ల కవిత వ్యాసకర్త ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు -
Patna high court: రిజర్వేషన్ల పెంపు చెల్లదు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు పెంచుతూ 2023 నవంబర్‌లో ప్రభుత్వం తీసుకొచి్చన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 16ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితికా రాణి చెప్పారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తుది తీర్పు ఇచి్చందని వెల్లడించారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగం, ఉపాధి విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలి్పంచాలి. కుల గణన ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచినట్లు బిహార్ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. ఇంద్ర సహానీ కేసుతోపాటు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో కోటాను 50 శాతానికి మించి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పిందని గుర్తుచేశారు. 75 శాతానికి చేరిన రిజర్వేషన్లు బిహార్ ప్రభుత్వం కుల గణన నిర్వహించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ) 63 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానిపైగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రభుత్వం గతంలోనే ఈబీసీలకు 10 రిజర్వేషన్లు కలి్పంచింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదు కాబట్టి రిజర్వేషన్ చట్టాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 50 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాను 65 శాతానికి పెంచేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిహార్‌లో ఈబీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల జాబితా తొమ్మిదో షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు 1992లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిహార్ సర్కారు రిజర్వేషన్లు పెంచడాన్ని సవాలు చేస్తూ పలువురు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. -
బాబు.. వీటికి బదులేది? (పార్ట్-5)
‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు. లేస్తే మనిషిని కానన్నట్టుగానే. అందుకే... ఐదేళ్లుగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్రెడ్డి తన వల్ల మంచి జరిగి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయమని ధీమాగా చెబుతున్నారు. జగన్ అది చేశారా? ఇది చేశారా? అని పచ్చమంద నోరు పారేసుకునే ముందు.. ఒక్కసారి ఈ ప్రశ్నలకు జవాబు ఉందేమో చూసుకోండి! చిరుద్యోగులకు జీతాలు పెంచకుండా అవమాన పరిచిన మాట వాస్తవం కాదా బాబూ నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ స్వయంగా హెచ్చరించలేదా బాబూ? ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు జీతాలు పెంచమంటే వారి ఉద్యోమాలను అణిచేయలేదా బాబూ నీ హయాంలో నాయా బ్రాహ్మణులకు, రజకులకు, దర్జీలకు ఎందుకు పథకాల్లేవు బాబూ? ఇప్పుడు ఈ వర్గాలకు వైఎస్.జగన్ ఏడాదికి పది వేల రూపాయల చొప్పున సాయం అందిస్తుండం వాస్తవం కాదా బాబూ? చిరుద్యోగులకు వేతనాలు పెంపుదల ద్వారా సీఎం జగన్ ఆదుకోవడం నిజం కాదా బాబూ? అంగన్ వాడీ వర్కర్ల జీతాలు 2019 ఎన్నికల మూడు నెలల వరకూ రూ.౭వేలు ఉంటే, రూ.11,500కు పెంచారు. హెల్పర్ల జీతాలు రూ.4వేలు నుంచి రూ.7వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ? గ్రామ సంఘాల సహాయకులు, యానిమేటర్స్ జీతాలను రూ.2వేల నుంచి రూ.10వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ? మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12వేల నుంచి రూ.18వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ ఆశావర్కర్ల జీతాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ? గిరిజన సంక్షేమశాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ? పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల జీతాలు రూ.18వేల నుంచి రూ.21,300కు పెంచడం వాస్తవం కాదా బాబూ? పాఠశాల విద్యాశాఖలో కుక్ కం హెల్పర్లు రూ.వెయ్యి గౌరవ వేతనాన్ని రూ.3వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ? 108 సర్వీసుల డ్రైవర్ల జీతాలను రూ.13వేల నుంచి రూ.28వేలకు పెంచారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను రూ. 17,500 నుంచి రూ.20వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ? 104 డ్రైవర్ల జీతాలను రూ.26వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8వేల నుంచి రూ.16 వేలకు పెంచడం వాస్తవం కాదా బాబూ? చిరుద్యోగులను ఎవరు ఆదుకున్నారో? ఎవరు మోసం చేస్తారు చర్చకు సిద్దమా బాబూ? ఆర్టీసిని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘ కాలిక డిమాండ్ పై ఏం చేశారు? అమరావతి పరిధి లో చంద్ర బాబు, ఆయన బినామీల భూముల ధరలను అమాంతంగా పెంచుకోడానికి విజయవాడ వెస్ట్ బై పాస్ రోడ్డు (గొండి గొలను నుంచి కాజా టోల్ ప్లాజా వరకూ బై పాస్ రోడ్డు) ను నిర్మాణాన్ని ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేశారు కాదా... ? చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-4) చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-3) చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-2) చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-1) -
Supreme Court Of India: బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుంది
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు నిర్ణయించడం ప్రమాదకరమైన బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీలు, ఎస్టీల్లో ఉప వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా అనే అంశంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందజేసే క్రమంలో రాష్ట్రాలు ఇతరులను వదిలేయరాదని తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు సజాతీయ సమూహాలు అయినందున వీరిలో వెనుకబడిన, బలహీన కులాలకు కోటా కోసం వారిని మళ్లీ వర్గీకరించలేమంటూ 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. -
Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాట్నా: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల వారికి 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కనుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చదవండి: బీహార్ కులగణన: 34 శాతం మంది పేదలే.. నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ఆదాయం కాగా కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం జగన్ తప్ప ఎవ్వరూ ఇవ్వలేదు
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్రం తర్వాత వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం జగన్ తప్ప మరెవ్వరూ ఇవ్వలేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం సీఎం జగన్ వల్ల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం అనంతరం ఈమేరకు మాట్లాడారు. 'ఈరోజు పేదరిక నిర్ములన కోసం సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన ఓట్ల కోసం కాదు మార్పు కోసం పని చేస్తున్నారు. పాలన లో అవినీతి ని నిర్ములించిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. విద్య, వైద్యంలో మార్పులు గొప్ప విప్లవం. జగన్ బటన్ నొక్కుతున్నారని కొందరు హాస్యంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ బటన్ వల్లనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమం అందుతోంది.' అని ధర్మాన అన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. -
వెనకబడ్డ తరగతుల జడ్జిలు... హైకోర్టుల్లో 15 శాతమే
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో వెనుకబడిన తరగతులకు చెందినవారు కేవలం 15 శాతం మందే ఉన్నారని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీని నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ విషయాన్ని నివేదించింది. జడ్జిలను నియమించే అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియంకు కట్టబెట్టి 3 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ హైకోర్టుల్లో బీసీ జడ్జిల సంఖ్య పెరగడం లేదని స్పష్టంచేసింది. జడ్జిలుగా ఎవరిని నియమించాలన్నది కొలీజియమే తేలుస్తుందని గుర్తుచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను మాత్రమే ప్రభుత్వం ఆమోదించగలదని వెల్లడించింది. న్యాయస్థానాల్లో సామాజిక వైవిధ్యాన్ని ఇంకా సాధించలేకపోయామని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్‌అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలతోపాటు మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరచుగా కొలీజియంను కోరుతూనే ఉందని వివరించింది. 2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకూ హైకోర్టుల్లో 537 మందిని జడ్జిలుగా నియమించగా, వీరిలో 1.3 శాతం మంది ఎస్టీలు, 2.8 శాతం మంది ఎస్సీలు, 11 శాతం మంది ఓబీసీలు, 2.6 శాతం మైనారిటీలు ఉన్నారని తెలియజేసింది. -
ఇందుకే బీసీలు వైఎస్ జగన్ వెంట ఉంటారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు బీసీలపై ఎక్కడలేని ప్రేమ ఒలక బోస్తున్నాయి. 2019 ఎన్ని కల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు పొందడంలో బీసీలు ప్రముఖ పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా వారికి వందలాది నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వారి సంక్షేమానికి అత్యధికంగా నిధులు ఇచ్చారు. దీంతో బీసీలు శాశ్వతంగా జగన్ వెంట నడవడానికి సిద్ధమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీలను వైసీపీ నుంచి వేరు చేసి వారి మద్దతు పొందేందుకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన లాంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్టీఆర్ కాలంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన మంచిని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవడం విడ్డూరం. 2014లో బీసీ డిక్లరేషన్ విడుదల చేసి అధికారం లోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆ డిక్లరేషన్‌లోని అంశాలను పట్టించుకోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బీసీలు మద్దతు పలికారు. మరి ఇప్పుడు టీడీపీకి వారు ఓట్లెలా వేస్తారు? బీజేపీ కూడా ఇటీవల ఏపీలో బీసీలతో సామాజిక చైతన్య సభ నిర్వహించి బీసీలకు పలు హామీలు ఇచ్చింది. చట్టసభలలో తమకు రిజర్వేషన్లు కావాలనీ, దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కించాలనీ అనేక దశాబ్దాలుగా బీసీలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. స్వయంగా బీసీ అయిన ప్రధాన మంత్రి ఈ డిమాండ్లను పట్టించు కోవడం లేదు. ఏ ముఖంతో రాష్ట్ర బీజేపీ నాయకులు బీసీలను ఓట్లడుగుతారు? తనకు కులం అంటగట్ట వద్దని అంటూనే కాపుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. కాపులను బీసీలలో చేర్చే అంశంపై బీసీలు, కాపుల మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిణామాలతో బీసీలు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 83 వేల కోట్ల రూపాయలు నేరుగా బీసీల ఖాతాలలో వేయడం విశేషం. రాష్ట్రంలో ఉన్న 17 మంత్రి పదవులలో 11 మంత్రి పదవులు బీసీలకు కేటాయించారు. అదే విధంగా 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి 56 చైర్మన్లను కేబినెట్ హోదాతో నియమించడం, ఆ 56 కార్పొరేషన్లలో 732 మంది బీసీలను డైరెక్టర్లుగా నియమించడం తెలిసిందే. జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్లో 50 శాతం పైగా బీసీలకు కేటాయించడమూ నిజమే కదా. బీసీ ఉద్యమ నాయకులు ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గొంతును పార్లమెంట్లో బలంగా వినిపించే అవకాశాన్ని సృస్టించారు. ఇంత చేసిన జగన్ వెంట బీసీలు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. (క్లిక్ చేయండి: ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే!) - కైలసాని శివప్రసాద్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సామాజిక న్యాయంలో ఓ విప్లవం!
ఆంధ్రప్రదేశ్‌లో పునర్ వ్యవస్థీకరించిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పించడం చరిత్రాత్మకం. ఇది అత్యంత ధైర్యసాహసాలతో కూడిన చర్య. ఇది దేశ చరిత్రలో తొలి రికార్డు. 74 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ వర్గాలకు 50 శాతం మించి ఇవ్వలేదు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ముఖ్యమంత్రులు అయిన రాష్ట్రాలలో కూడా 50 శాతం మంత్రి పదవులు ఇచ్చే ధైర్యం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వీరోచితంగా ఈ వర్గాలకు జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో స్థానం కల్పించి, సామాజిక న్యాయానికి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో పునర్ వ్యవస్థీకరించిన 25 మంది మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మందికి అవకాశం కల్పించారు. ఇందులో బీసీలు 10 మంది, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీ, మైనారిటీల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ ఘట్టంతో బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ ఆప్తుడయ్యారు. దీని వలన బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఆయన పట్ల తిరుగులేని అభిమానం, మద్దతు పెరిగింది. ఇతర రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప చిత్తశుద్ధితో ఈ వర్గాల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి పాటుపడలేదని బీసీలు గుర్తించారు. అందుకే మెజారిటీ ప్రజలైన బహుజనులలో రోజు రోజుకూ జగన్‌పై క్రేజ్ పెరుగుతోంది. గత ఎన్నికలలో 50 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ఈ దఫా 60 శాతం ఓట్లతో 170 సీట్లకు పైగా గెలుస్తుంది అనడంలో అనుమానం లేదు. మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాశారు. వైఎస్సార్సీపీ రెండు సంవత్సరాల క్రితం రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టింది. దీనికి మద్దతుగా 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. విశేషం ఏమిటంటే, గత 74 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో ఈ బిల్లు పెట్టలేదు. చివరకు పార్లమెంటులో బీసీ పార్టీలుగా చలామణీ అవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, అప్నాదళ్, జనతాదళ్ లాంటి పార్టీలు కూడా ఈ బిల్లు పెట్టలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలను వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. అంతేగాక 56 బీసీ కులాల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్లలో పోస్టులు మొత్తం 100 శాతం బీసీలకు కేటాయిం చారు.193 కార్పొరేషన్లలో బీసీలకు 109 చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగింది. దీని మూలంగా బీసీ కులాల నాయకత్వం పెరిగింది. ఆ కులాలలో తరతరాలుగా పేరుకుపోయిన భావదాస్యం, బానిస ఆలోచనా విధానం పోయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే, దానికి పార్టీ పరంగా అదనంగా మరో 20 శాతం చేర్చి మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు ఇచ్చారు జగన్. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలవగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగానూ వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ గెలిస్తే, ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 12 పదవులను అంటే 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలు అధికార పార్టీకి దక్కితే వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం ఇచ్చారు. ఇది ఇలా ఉండగా, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేద కులాలు పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, వృత్తి విద్యల వరకు ఉచితంగా చదువుకోవాలనే మహత్తర ఆశయంతో అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థికీ 15 వేలు, కాలేజీ కోర్సులు చదివే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి కాలేజీ విద్యార్థికి సంవత్సరానికి 20 వేల స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఈ పథకాల వలన కూలీ నాలీ చేసుకొనేవారు ఉన్నత విద్య చదివే అవకాశం లభించింది. దీని వల్ల సమాజంలో సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేటాయించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీల అభివృద్ధికి 30 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆశ్చర్యపరిచారు. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలకు రూ.1,460 కోట్లు కేటాయిస్తే లోటు బడ్జెట్‌తో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీల సంక్షేమానికి రూ.30వేల కోట్లు కేటాయించడం చూసి దేశంలోని బీసీలందరూ ఆశ్చర్యపోయారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా బీసీలకు రూ.6 వేల కోట్లకు మించి కేటాయించలేదు. అలాగే బీసీ కులాలు అభివృద్ధి చెందడానికి ‘బీసీ సబ్ ప్లాన్’ ఏర్పాటుచేసి, అన్ని కులాల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చారు. బలహీన వర్గాలను పరిశ్రమల అధిపతులుగా చేయాలని, పెద్ద కాంట్రాక్టర్లుగా చేయాలనే చిత్తశుద్ధితో పారిశ్రామిక పాలసీ రూపొందించారు. రాష్ట్రంలో 196 మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 బీసీలకు ఇచ్చారు. 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే, అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే! వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో నాలుగు స్థానాలు దక్కితే, అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. మన దేశంలో మంత్రి పదవి, చైర్మన్ పదవి, ఇతర రాజకీయ పదవులు అంటే ఒక హోదా, ఒక సామాజిక గౌరవం అని ప్రజలు నమ్ముతారు. ఈ హోదాను, పదవిని, అధికారాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందించడానికే రిజర్వేషన్లు లేదా కోటా ఇవ్వాలి. తద్వారా దేశ పరిపాలనలో తాము కూడా భాగం అవుతున్నామన్న అభిప్రాయం ఈ వర్గాల్లో కలుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేనో, మంత్రో, చైర్మనో అయితే ఆ జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఆ కులస్థులు ‘మావాడు మంత్రి అయ్యాడు, చైర్మన్ అయ్యా’డనే భావంతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ భావన జాతి ఐక్యతకు, దేశ సమగ్రతకు ఉపయోగపడుతుంది. బలమైన సామాజిక, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కావాలంటే పటిష్ఠమైన, సమగ్రమైన రాజకీయ వ్యవస్థ ఉండాలి. భారతదేశంలో పటిష్ఠ మైన వ్యవస్థ నిర్మాణాన్ని కుల వివక్ష దెబ్బ కొడుతోంది. జాతి పరస్పరం సంఘర్షించుకొని వేలాది కులాలుగా చీలిపోయింది. ఇది జాతి ఐక్యత, సామాజిక సామరస్యం, మానవ వికాసానికి అవరోధంగా తయారైంది. సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో ఈ కుల వివక్ష తొలగాలంటే అన్ని రంగాలలో ముఖ్యంగా విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగం, పాలన రంగంలో ఈ కులాలకు ప్రాతినిధ్యం కల్పించడం చారిత్రక అవసరం. దేశంలో 56 శాతం జనాభా గల బీసీ కులాలను అభివృద్ధి చేయకుండా భారత్ అగ్రదేశంగా రూపొందదు. ఈ చారిత్రక అన్యాయాన్ని గుర్తించి వై.ఎస్.జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. - ఆర్. కృష్ణయ్య ధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం. మొబైల్: 90000 09164 . -
అన్నిటా అగ్రతాంబూలం.. రెండు ఎమ్మెల్సీ పదవులూ వారికే..
బీసీ లంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ అని సరికొత్త భాష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాటి చెప్పారు. తాజాగా ప్రకటించిన రెండు ఎమ్మెల్సీలు కూడా బీసీలకే కేటాయించి మరోసారి వైఎస్సార్సీపీ వెనుకబడిన వర్గాల పక్షపాతి అని నిరూపించారు. – సాక్షి, విశాఖపట్నం ఆ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు నిలిపి వేయడంతో కొరత పడిన 10 శాతం సీట్లను పార్టీ పరంగా కేటాయించాలని వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 వార్డుల్లో ఏకంగా 65 వార్డులను బీసీ వర్గాలకే కేటాయించి.. బీసీలకు సామాజిక న్యాయం అందించడంలో తానెంత ముందుంటానో నిరూపించారు. అదేవిధంగా బీసీలకు రిజర్వు చేసిన 9 జెడ్పీటీసీ స్థానాలతో పాటు మరో 10 జనరల్ స్థానాల్లో టికెట్లు కేటాయించారు. జీవీఎంసీ మేయర్ పదవిని కూడా బీసీ మహిళకు అప్పగించారు. ఇవే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లోనూ బీసీ లబ్ధిదారులే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల ప్రకటించిన వివిధ కార్పొరేషన్ల పదవుల్లోనూ వెనుకబడిన తరగతులకు అగ్రస్థానం కల్పించారు. తాజాగా ప్రకటించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో విశాఖకు కేటాయించిన రెండు సీట్లనూ బీసీలకే ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వంశీకృష్ణ శ్రీనివాస్ బీసీ (యాదవ) కాగా, వరుదు కల్యాణి కూడా బీసీ (వెలమ) కావడం గమనార్హం. జగనన్నకు కృతజ్ఞతలు పార్టీలో చేరినప్పటి నుంచి అనునిత్యం జగనన్న గుర్తింపునిస్తున్నారు. పార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు బాధ్యతాయుతమైన శాసన మండలి సభ్యుడిగా గుర్తింపునిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందనడానికి ఇదే నిదర్శనం. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ జగనన్న గుర్తింపునిస్తారు. ఎమ్మెల్సీ పదవిని బాధ్యతాయుతంగా నిర్వర్తించి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. ఈ అవకాశం కల్పించిన సీఎం జగనన్నకు, రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఇది నా అదృష్టం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కోసం కష్టపడిన వారిని ఎప్పుడూ విడిచి పెట్టరని మరోసారి నిరూపించారు. మిగిలిన పార్టీల్లో ఎవరు ఎంత డబ్బులిస్తే వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తుంటారు. కానీ.. వైఎస్ జగన్ మాత్రం పార్టీలో ఎంత కష్టపడ్డారో వారిని గుర్తించి పదవులు ఇస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక బీసీ మహిళకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా అదృష్టం. పదకొండేళ్లు జగనన్న వెంట నడిచాను. పార్టీ పదవుల్లో ఎన్నోసార్లు గుర్తింపు ఇచ్చారు. ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ అభ్యర్థి -
ఆటలో అరటిపండ్లే.. ‘ఆ ముగ్గురి’ని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టేసినట్టేనా!?
సాక్షి, విజయవాడ: నగర తెలుగుదేశం పార్టీలోని వెనుకబడిన తరగతుల్లో ముసలం మొదలైంది. విజయవాడ పార్లమెంటరీ పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిరువూరు నియోజకవర్గానికి చెందిన మునెయ్యను అధిష్టానం తాజాగా నియమించింది. ఈ పదవి కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణరావు, కార్పొరేషన్ ఎక్స్ అఫిషియో మెంబర్ ఫతావుల్లా పోటీపడ్డారు. పదవిని ఫతావుల్లాకు ఇవ్వాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) పట్టుపట్టగా.. బీసీ వర్గానికి చెందిన ఎరుబోతుకు దక్కాల్సిందేనని బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా భీష్మించుకున్నారు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా రమణరావు వైపు మొగ్గుచూపారు. ఎంపీ కేశినేనికి, అర్బన్ పార్టీలోని ముఖ్య నేతల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరడానికి ఈ పదవి నియామకం విషయంలో తలెత్తిన విభేదాలే కారణమని ముఖ్య నాయకులు గుర్తుచేస్తున్నారు. విజయవాడ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షునిగా మాజీ మంత్రి నెట్టెం రఘురాం నియామక సమయంలోనే పూర్తి కమిటీని వేయాలని అధిష్టానం భావించినప్పటికీ సాధ్యం కాలేదు. ఇరువర్గాలు భీష్మించుకోవడంతో ప్రధాన కార్యదర్శి పదవి నియామకాన్ని అప్పట్లో పక్కన పెట్టేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో మునెయ్య నియామకం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఫతావుల్లాను స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీగా అధిష్టానం నియమించింది. చదవండి: (టీడీపీ నేతల్లో అంతర్మథనం.. అడకత్తెరలో ‘ఆ ముగ్గురు’!) ఉద్దేశపూర్వకంగానేనా? ఇకపై చంద్రబాబు వైపే చూడనని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోయేదే లేదని తెగేసి చెప్పిన ఎంపీ కేశినేని చివరకు తన కేశినేని భవన్లో అధినేత చిత్రపటాన్ని తొలగించి ఆ స్థానంలో రతన్‌టాటా బొమ్మను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడం, ఉద్వేగభరితంగా ఉపన్యసించడం, రాష్ట్రపతిని కలవడానికి చంద్రబాబు బృందం ఢిల్లీ వెళ్లినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించడం గుర్తించాల్సిన పరిణామం. చంద్రబాబు అన్నివిధాలుగా ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధపడిన తర్వాతే కేశినేని పార్టీ కార్యాలయానికి వెళ్లారని, క్రియాశీలకంగా వ్యవహరించారని పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. అందులో భాగంగానే ఫతావుల్లాకు రాష్ట్రస్థాయి పదవి ఇవ్వడం, నగర నేతలు బొండా, బుద్ధా, మీరాలు ప్రతిపాదించిన రమణరావుకు మొండిచెయ్యి చూపడమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఎరుబోతుకు ఇవ్వని పక్షంలో నగరానికే చెందిన లుక్కా సాయిరాం గౌడ్, గోగుల రమణారావు, ఎన్సీ భానుసింగ్ తదితర వెనుకబడిన తరగతులకు చెందిన ముఖ్య నాయకులు పలువురు ఉన్నారు. వారిలో ఎవరికైనా ఇవ్వడానికి అధిష్టానం ఎందుకు ఆలోచించలేదోనని పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో 16 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో సగం ఓటర్లు నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లోనే ఉన్నారు. తక్కిన 8 లక్షల మంది ఓటర్లు నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నారు. పార్లమెంటరీ కమిటీలోని రెండు ముఖ్యమైన అధ్యక్ష, కార్యదర్శ పదవులు రూరల్ నియోజకవర్గాలైన జగ్గయ్యపేట (నెట్టెం రఘురాం), తిరువూరు(మునెయ్య)కు ఇవ్వడమంటే విజయవాడ నగరంలోని నేతలను పక్కన పెట్టినట్లేనని గుర్తుచేస్తున్నారు. పార్టీ పరంగా నగరంలోనే ఎక్కువ కార్యక్రమాలు, అవసరాలు కూడా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కేశినేని మాట చెల్లుబాటు కావడం మొదలైందని, ముగ్గురు సంగతి మరెలా ఉంటుందో వేచిచూడాల్సి ఉందని పార్టీలోని సీనియర్లు సెటైర్లు వేస్తుండం పరిశీలనాంశం. -
కులగణనలో ఓబీసీలను చేర్చొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులగణన–2021లో వెనకబడిన వర్గాలను చేర్చొద్దని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఓబీసీల వివరాల్లో కచి్చతత్వం లేదని తెలిపింది. 2021 కులగణనలో ఎస్సీ, ఎస్టీల లెక్కలను మాత్రమే సేకరించి, ఇతర కులాలను మినహాయించాలనేది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని తెలిపింది. రాష్ట్రంలో ఓబీసీల కులగణన కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పరిగణనలోకి తీసుకోవద్దంటూ కేంద్ర సామాజిక సాధికారత శాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ మేరకు పేర్కొంది. జనవరి 7, 2020న జారీ చేసిన నోటిఫికేషన్లో 2021 కులగణనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలను మాత్రమే చేర్చామని కేంద్రం తెలిపింది. 2021 కులగణనలో గ్రామీణ భారతంలోని వెనకబడిన వర్గాల సామాజిక–ఆర్థిక డాటాను పొందుపరచాలని సెన్సస్ విభాగానికి ఆదేశాలు ఇవ్వొద్దని, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 8లో పొందుపరిచిన విధాన నిర్ణయంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. ఓబీసీల కులగణన చేపట్టడానికి రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్‌కు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ఆదేశాలు లేవని తెలిపింది. కులగణనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులను హైకోర్టులు, సుప్రీంకోర్టు గతంలో కొట్టివేశాయని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం వద్ద ఉన్న మహారాష్ట్రలోని ఓబీసీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 90 రోజుల పరిమితి అమల్లోకి.. పిటిషన్ దాఖలుపై సడలింపు తీసేయాలని సుప్రీంకోర్టు నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్లు దాఖలు చేయడానికి గతంలో ఇచ్చిన సడలింపు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అక్టోబరు 1 నుంచి పిటిషన్ దాఖలుకు 90 రోజుల కాలపరిమితి అమల్లోకి వస్తుందని తెలిపింది. కరోనా నేపథ్యంలో సుమోటోగా ఇచి్చన సడలింపులు నిలిపివేయాలని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ నిర్ణయించింది. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు పేర్కొంది. మూడో వేవ్ పొంచి ఉందంటూ ఈ ఏడాది చివరి వరకూ సడలింపు ఇవ్వాలన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘మీరు నిరాశపడకండి. మూడో వేవ్‌ను ఆహ్వానించకండి’’ అని న్యాయవాదులనుద్దేశించి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. హైకోర్టుల తీర్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడానికి 90 రోజుల కాల పరిమితి అమల్లోకి తీసుకురావాలంటూ ఈ ఏడాది మార్చి 8న అటార్నీ జనరల్ కోర్టును కోరిన విషయం విదితమే. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశి్చమబెంగాల్ ఎన్నికలకు సంబంధించి దాఖలు చేసే పిటిషన్లకు కాలపరిమితి విధించాలని ఎన్నికల కమిషన్ కోరింది. లేదంటే రాబోయే ఎన్నికలకు ఈవీఎం, వీవీప్యాట్లు తిరిగి ఉపయోగించలేని పరిస్థితి వస్తుందని పేర్కొంది. -
ఏపీలో కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. అలాగే ఈ నెల 18న బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం చేపట్టనుంది. చదవండి: దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వెనుకబడిన కులాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వేగంగా లబ్దిదారులకు అందేలా ఈ కార్పొరేషన్లు సహకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ 56 కార్పోరేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేసింది. జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్‌లోనూ 13 మంది డైరెక్టర్లను నియమిస్తామని పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్ల పరిధిలో మిగతా ఉపకులాలకూ ప్రాతినిధ్యం వస్తుందని స్పష్టం చేసింది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ 2.71 కోట్ల మందికి లబ్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీలకు రూ. 33,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఇంత భారీగా బీసీల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేదు. బీసీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో సగం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. -
‘పల్లకి మోసే పనులు మాకు.. పల్లకిలో కూర్చునేది మీరు’
సాక్షి, తూర్పు గోదావరి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బీసీల మనస్సుల్లో ఎప్పటికీ స్థానం సంపాదించలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. వెనుకబడిన తరగతులకు ఇవ్వాల్సింది పార్టీ పదవులు కాదని తెలిపిన ఆయన బాబు అధికారంలో ఉండగా ఎప్పుడైనా పేదలైన బీసీలను రాజ్యసభకు పంపిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10% అయినా ఇవ్వగలిగారా అని నిలదీశారు. వివిధ నామినేటెట్ పదవులలో బడుగు బలహీలన వర్గాలకు 50% రిజర్వేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారని ప్రశంసించారు. (‘అమిత్ షా సానుకూలంగా స్పందించారు’) ‘ఇన్నాళ్ళు పల్లకి మోసే పనులు మాకు(బీసీలకు) పల్లకిలో కూర్చునేది మీరు. అందువల్లే ఇవాళ ప్రజలు టీడీపీని చీదరించుకున్నారు. ఒకేసారి బీసీలమైన నన్ను, మోపిదేవిని సీఎం జగన్ దేశంలోనే అత్యున్నతమైన రాజ్యసభకు పంపించారు. ఏపీలో బీసీ, ఎస్సీల సంక్షేమం కోసం రూ.42 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎంజగన్‌ది. బడ్జెట్లో మాకు ముఖ్యమంత్రి 20% నిధులు కేటాయించారంటే దేశంలోనే అది ఆల్ టైం రికార్డ్. చంద్రబాబుపైకి ఒక మాట చెబుతారు. లోపల భోజనం పెట్టేటప్పుడు దూరంగా గెంటేయడం వంటి పాలన చంద్రబాబు అందించారు. సీఎం జగన్ తన ఏడాది పాలనలో చెప్పినవి.. చెప్పని హామీలను అమలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అర్హులు కారని చంద్రబాబు అప్పటి న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు. అదేనా బీసీపై మీకు ఉన్న ప్రేమ. నమ్మినంతా కాలం బబీసీలు మిమ్మల్ని నమ్మారు. ఇక భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మే పరిస్ధితి లేదు’. అని తేల్చి చెప్పారు. (భారానికి, అధికారానికి తేడా తెలియదా?) -
వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాపై విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 175మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించి.. సంచలనం రేపింది. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాను విశ్లేషిస్తూ.. పలు ఆసక్తికర అంశాలు, సామాజిక సమీకరణలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల జాబితాలో బీసీలకు, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులకు, నమ్మకస్తులకు పెద్దపీట వేయడం చూడొచ్చు. అభ్యర్థుల జాబితాలో యువతకు కూడా సముచిత ప్రాధాన్యం లభించింది. అభ్యర్థుల్లో ఉన్నత చదువులు చదువుకున్నవారు పెద్దసంఖ్యలో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. వైఎస్సార్సీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయబోతున్న అభ్యర్థుల్లో తొమ్మిదిమంది ఆలిండియా సర్వీసులలో పనిచేసిన వారు కావడం గమనార్హం. అంతేకాకుండా సమాజంలో ఉన్నతమైన వైద్యవృత్తి అభ్యసించిన 15మంది డాక్టర్లు ఉన్నారు. ఇక, అభ్యర్థుల్లో పోస్ట్గ్రాడ్యుయేట్లు 41 మంది ఉండగా.. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు 139 మంది ఉన్నారు. యువతకు పెద్దపీట వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో యువతకు పెద్దపీట వేశారు. మొత్తం 175 మంది అభ్యర్థుల్లో 33 మంది 45 ఏళ్ల లోపువారే కావడం ఇందుకు నిదర్శన. 45 నుంచి 60 ఏళ్ల లోపు వారు 98 మంది ఉన్నారు. 60 ఏళ్లకు పైబడ్డవారు కేవలం 44 మంది ఉన్నారు. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 40 మందికి అవకాశం రాగా.. 119 మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీచేసిన వారు ఉన్నారు. మరో 24 మంది అభ్యర్థులు మాజీ ఎమ్మెల్సీలు కాగా.. వారిలో 12 మంది గతంలో మంత్రులుగా పనిచేసినవారు ఉన్నారు. మాజీ ఎంపీలైన వరప్రసాద్, అవంతి శ్రీనివాస్‌కు ఈసారి అసెంబ్లీ అభ్యర్థులుగా పార్టీ అవకాశం కల్పించింది. ఇక, 37 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్సీకి ఈసారి టికెట్ దక్కింది. సామాజిక సమీకరణలు.. బీసీలంటే సామాజికంగా వెనుకబడిన తరగతులు కాదు.. సమాజానికి వెన్నెముక కులాలు అని ఘనంగా ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ ఆ విషయాన్ని చాటిచెప్పారు. అభ్యర్థుల జాబితాలో బీసీలకు వైఎస్ జగన్ గణనీయమైన ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలకు 41 అసెంబ్లీ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాలు కేటాయించి.. ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో ఇచ్చిన వాగ్దానాన్ని వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. రాజమండ్రి స్థానాన్ని బీసీలకు కేటాయిస్తానని పాదయాత్రలోభాగంగా బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించిన వైఎస్ జగన్ ఆ మేరకు కూడా తన హామీని నిలబెట్టుకున్నారు. రాజమండ్రి నుంచి బీసీ అభ్యర్థికి (మంగన భరత్‌కు) అవకాశం కల్పించారు. ఇక, అభ్యర్థుల జాబితాలో మహిళలకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. ఏకంగా 15 మంది మహిళలకు ఈసారి టికెట్ ఇచ్చారు. ఇక, ఎస్సీలకు 29 స్థానాలకు, ఎస్టీలకు ఏడు స్థానాలను, మైనారిటీలకు ఐదు స్థానాలు కేటాయించి.. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ జగన్ సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..! -
ఎంబీసీలోకి మరో 35 కులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కేటగిరీలోకి మరో 35 కులాలను చేరుస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. జీవన స్థితిగతులు, సామాజిక నేపథ్యం, సంక్షేమం తదితరాలను దృష్టిలో పెట్టుకొని ఆ కులాలను ఎంబీసీ కేటగిరీ కింద చేర్చినట్లు పేర్కొంది. ఎంబీసీ యాక్ట్–2013 కింద వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి వెంకటేశం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ 35 కులాల్లో బాలసంతి/బాహుపురి, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటిపాపల, మొండిబండ/మొండివరు, వంశరాజ్/పిచ్చిగుంట్ల, పాముల, పర్ది, పంబలా, పెద్దమ్మవండ్లు/దేవరవండ్లు/ఎల్లమ్మవండ్లు/ముత్యాలమ్మవండ్లు/దమ్మాలి, వీరముష్టి/వీరబద్రీయ, గుడాలా, కంజారా–బట్ట, రెడ్డిక/కెంపర, మొండెపట్ట, నొక్కర్, పర్కిముగ్గుల, యాట, చొపేమరి, కైకడి, జోషినందివాలాస్, మందుల, కునపలి, పట్ర, పాల ఎక్రాయి/ఎకిల/వ్యాకుల/ఎకిరి/నాయినవారు/పాలేగారు/తొలగరి/కావలి/,రాజన్నలా/రాజన్నలు, బుక్కఅయ్యవారు, గొట్రాలా, కస్కిపడి/కస్కిపుడి, సిద్దుల, సికిల్‌గర్/సైకల్‌గర్, అనాథలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఈ కేటగిరీలో చేర్చారు. -
బీసీలకు ప్రభుత్వం పెద్దపీట
రఘునాథపాలెం: బంగారు తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ బీసీలకు, కుల వృత్తులకు పెద్దపీట వేశారని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వీవీపాలెంలో రూ.51 లక్షలతో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 48 ఏళ్లపాలనలో సాధించిన ప్రగతి కంటే తెలం గాణ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఎంతో సాధించిందని పేర్కొన్నారు. ప్రాంతం, కులం, మతం అనే తేడా లేకుండా అన్నిరంగాల్లో అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కుల వృత్తులకు ప్రాధ్యానమిస్తూ వారిని ఆర్థికంగా ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగానే గొర్రెల పెంపకంలో యాదవులకు రూ.75వేలు సబ్సిడీని తీసుకొచి్చనట్లు తెలిపారు. అంతా కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి సాధించవచ్చన్నదానికి వీవీపాలెం నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాన్ని తనకున్న అవకాశాల మేరకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న పశువుల వైద్యశాలను నిర్మించే విషయంలో తాను బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న గ్రామ పం చాయతీ భవనం వేగంగా పూర్తి చేయాలని కోరారు. గ్రామ సర్పంచ్ ఆవుల హేమలత, సొసైటీ చైర్మన్ రావెళ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో జెడ్పీటీసీ ఆజ్మీరా వీరునాయక్, వైస్‌ఎంపీపీ యరగర్ల పద్మ, ఉపసర్పంచ్ శంకర్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, యరగర్ల హనుమంతరావు, ఆవుల కోదండరాములు, జంగాల శ్రీను మాట్లాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మందడపు నరసింహారావు, ఆత్మచైర్మన్ మెంటం రామారావు, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీడీఓ ఏలూరి శ్రీనివాసరావు, రామోజీ, రమణ, కుతుంబాక నరేష్, యరగర్ల హనుమంతరావు, హెచ్ఎం శ్రీదేవి, నరసింహా రావు, పిన్ని కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పువ్వాడ పౌండేషన్, సునంద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 15 బల్లాలను ఎంపీ, ఎమ్మె ల్యే పంపిణీ చేశారు. పువ్వాడ ఫౌండేషన్ ద్వారా నోటు పుస్తకాలను అందించారు. -
‘బొజ్జా తారకం సేవలు మరువలేనివి’
నిర్మల్ టౌన్ : బొజ్జా తారకం సేవలు మరువలేనివని పలువురు నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని టీఎన్జీవో సంఘ భవనంలో మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బొజ్జాతారకం మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులపై ఆయన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తన కలంతో దళితులను చైతన్యవంతులను చేశారని పేర్కొన్నారు. ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన బొజ్జాతారకం మనలో లేకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన మతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. టీఎన్జీవో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, అమర్నాథ్రెడ్డి, దళిత సంఘాల నాయకులు డి. రాములు, బొడ్డు లక్ష్మణ్, జగన్మోహన్, అంబకంటి ముత్తన్న, ప్రభాకర్, వై. సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
బీసీ సంక్షేమంలోకి బీసీ, ఈబీసీ ‘కల్యాణలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులతో (బీసీలు) పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాలకు (ఈబీసీలు) చెందిన వారికి వర్తింపజేసే కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీ సంక్షేమశాఖ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీశాఖలు, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాన్ని మైనారిటీశాఖ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక స్థోమత లేని కారణంగా అమ్మాయిల పెళ్లిళ్లు జరిపించడంలో పేద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాల్లోని పేదలు కూడా తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో బీసీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీనిపై బీసీ సంక్షేమశాఖ కూడా గతంలోనే సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు. కాగా, బీసీలతో పాటు అన్నికులాల్లోని పేదలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో బీసీలకోసం ఈ పథకానికి రూ. 50 కోట్లు కేటాయించి, ముందుగా పదివేల మందికి ప్రయోజనం కల్పించనున్నారని సమాచారం. కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ (అగ్రకులాల పేదలతో సహా) ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ఈసీబీల్లో సుమారు 25వేలమంది వరకు లబ్ధికల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనున్నారని సమాచారం. తెల్ల రేషన్‌కార్డు ఉండడంతోపాటు పట్టణప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకుండా, గ్రామీణప్రాంతాల్లో రూ.లక్షన్నరకు లోబడి ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. -
వెనకయ్య సంతతి
జీవన కాలమ్ మనది ముందుకు పోతున్న దేశం. కాని మన దేశంలో దాదాపు అన్ని కులాల వారూ, వర్గాలవారూ వెనుకపడాలని ఉబలాటపడతారు. ఎవరు ముందుగా వెనుకపడతారో వారికి తాయిలాలు లభిస్తాయి. కొత్తగా వెనుకపడినవారిని అప్పుడే వెనుకబడినవారు వెనుకపడనివ్వరు. వాళ్లు మాలాగా వెనుకపడితే- వారు వెనుకపడడంలో ముందుంటారని -లోగడ వెనుకబడినవారి వాదం. దేశం ముందుకుపోతోంది. కులాల వెనుకపడాలని తోసుకువస్తున్నారు. హరియానాలో జాట్ సోదరులను నేను మనసారా అభినందిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడి, తాము వెనుకపడ్డామని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రభుత్వం వెనుకపడి- ఆ బాధలు పడలేక -ఎన్నోసార్లు తమ వెనుకబడినతనాన్ని రోడ్ల మీద నిరూపించారు. ప్రస్తుతం 34 వేల కోట్ల విధ్వంసం జరిగింది. 16 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఢిల్లీకి పాల సరఫరా నిలిచిపోయింది. నీటి సరఫరా దెబ్బతింది. ఆస్తులు తగలపడ్డాయి. అప్పుడుకాని ప్రభుత్వం కళ్లు తెరవలేదు. వెనుకబడినవారు ఇలా ముందుపడకపోతే తొక్క దళసరిగా ఉన్న పాలకవర్గం దిగిరాదని, వారిని దింపి నిరూపించిన ఘనత జాట్ సోదరులది. మొన్న కాపు సోదరులూ తాము వెనుకబడి ఉన్నామని చెప్పి చెప్పి విసిగి- ఆఖరికి కొన్ని రైల్వే బోగీలు, కొన్ని కార్లు, పోలీస్స్టేషన్లు తగలబడితే తప్ప పాలకవర్గం కళ్లు తెరవదని గుర్తించి - ఎట్టకేలకు తాము వెనుకబడి ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగారు. అయితే ఇదివరకే వెనుకబడిన వారు కాపు వర్గాల వారు వెనుకబడ రాదని అంటున్నారు. వారు వెనుక బడితే - ఇప్పటికే వెనుకబడిన తమ రాయితీలలో కోతలు వస్తాయని వారి భావన. పాలక వర్గానికి సమస్య అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చేయాలో రెండు సందర్భాలు ప్రస్తుతం చూశాం. అడగనిదే అమ్మయినా పెట్టదని సామెత. ప్రభుత్వాన్ని అడిగే పద్ధతి ఏమిటో ఈ మధ్య కొత్తగా వెనుకబడినవారు నిరూపించారు. ఈ దేశంలో ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. మన నాయకులూ, ఆయా వర్గాల వారూ ఆ నాయకుడికి నివాళులర్పిస్తారు. అంబేడ్కర్ వైతాళికుడు. visionary. ఈ దేశంలో తరతరాలుగా, శతాబ్దాలుగా అభివృద్ధి అవకాశాలు లేక కుంగిపోయిన వర్గాలకు మేలు జరగాలంటూనే ఆ నాయకుడు ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. వెనుకబడిన వారికి చేయూతనిస్తూనే ఒక విడత గడిచాక - సామర్థ్యంలో, ఉద్ధతిలో- అందరితోపాటు పోటీపడే అవకాశాన్ని కల్పించమన్నారు. నిస్సహాయత పరిస్థితులది. వ్యక్తులది కాదు. కులానిది కాదు. సామర్థ్యంలో ఎవరూ ఎవరికీ తీసిపోని విధంగా ఈ సమాజ పురోగతికి చెయ్యి కలపాలన్నదే ఆయన ఆశయం. ఇంతకీ వీరంతా వెనుకబడడానికి అగ్రవర్గాలే కారణం. పేదరికంలో, బొత్తిగా అభివృద్ధికి అవకాశం లేదంటూ ఈ మధ్య ‘మేమూ వెనకబడ్డాం’ అని బ్రాహ్మణులు నోరిప్పారు! ప్రభుత్వం వారి సంక్షేమానికి ఐ.వై.ఆర్.కృష్ణారావుగారితో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఎంత చెట్టుకి అంతగాలి. రకరకాల అవినీతుల్లో కూరుకుపోయిన ప్రభుత్వాలు కళ్లు తెరవాలంటే - కాళ్ల బేరానికి రావాలంటే - ఈ దేశంలో బోలెడన్ని రైల్వే బోగీలు, కార్లు, పోలీస్స్టేషన్లు, పాల సరఫరా కేంద్రాలు, జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, చచ్చిపోవడానికి మనుషులు - ఇన్ని ఉన్నాయని మరిచిపోకూడదు. దేశం ముందుకుపోతోందని ఈ ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. కాని వెనుకపడాలనుకుంటున్న వారు - ‘మేము వెనుకపడ్డాం బాబోయ్!’ అని ఎంత వెనుకపడినా పట్టించుకోవడంలేదు. ఇంతకు ముందు వెనుకపడినవారు కాళ్లకు అడ్డం పడుతున్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ప్రజలకి, పేపర్లు చదివేవారికి - జరిగిన విధ్వంసమే కనిపిస్తుంది కాని, వీరు ఎంత నిస్సహాయంగా వెనుకపడ్డారో కనిపించదు. కనుక- తప్పనిసరిగా కనిపించేలాగ చెయ్యాల్సిన రోజులొచ్చాయి. ఒకరి బాధలు మరొకరికి తెలియవు. తెలిసినా అర్థం చేసుకోరు. అప్పుడే వెనుకబడినవారికి వీరు వెనుకబడడం నచ్చలేదా? పీత కష్టాలు పీతవి. నాయకులకు తరతరాలుగా నష్టాలలో, కష్టాలలో ఇరుక్కున్న వెనుకబడినవారి ఇక్కట్లు అర్థంకావు. ఇందుకు రెండు రాష్ట్రాల్లో మార్గాలు చూపారు. ముఖ్యంగా జాట్ సోదరులకు నా అభినందనలు. ఇంతకీ విఘ్నేశ్వరుడికి ‘వెనకయ్య’ అనే పేరుంది. మనమంతా ఆయన సంతతి. గొల్లపూడి మారుతీరావు -
‘సంక్షేమం’పై అదనపు వేటు!
నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే.. కచ్చితంగా నాణ్యత తగ్గుతుంది. లక్ష్యసాధనా అంతంత మాత్రంగానే ఉంటుంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో సరిగ్గా ఇదే సీను కనిపిస్తోంది. నిర్దేశించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు లేకపోవడంతో ప్రతి ఒక్కరికీ అదనపు బాధ్యతలు అంటగట్టారు. దీంతో వారి పనితీరు మసకబారడంతోపాటు హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం గాల్లో దీపంగా మారింది. - ‘ఇన్చార్జి’లతో నెట్టుకొస్తున్న బీసీ సంక్షేమశాఖ - ఒక్కో అధికారికి రెండు మూడు ‘అదనపు బాధ్యతలు’ - వసతిగృహాల పర్యవేక్షణపై ప్రభావం - అస్తవ్యస్తంగా తయారైన సంక్షేమ హాస్టళ్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ వార్షిక బడ్జెట్ రూ.650 కోట్లకు పైమాటే. 47 పాఠశాల విద్యార్థి వసతి గృహాలు, 28 కాలేజీ విద్యార్థి వసతి గృహాలున్న ఈ శాఖ పరిధిలో లక్షలాది మంది విద్యార్థులకు యేటా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాలున్నాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న శాఖలో డివిజన్ స్థాయి అధికారులు.. వ సతి గృహ సంక్షేమాధికారులు.. ఇలా ఏ కేటగిరిలో చూసినా అదనపు బాధ్యులే కన్పిస్తున్నారు. చివరకు సిబ్బందిని పర్యవేక్షించే జిల్లా ఉన్నతాధికారి కూడా ‘ఇన్చార్జే’ కావడం గమనార్హం. రెండు డివిజన్లకు ఒక్కరే..! జిల్లా బీసీ సంక్షేమశాఖ పరిధిలో ఎనిమిది డివిజన్లున్నాయి. ప్రతి డివిజన్‌కు ఒక సహాయ సంక్షేమాధికారి (ఏబీసీడబ్ల్యూఓ) ఉంటారు. సంక్షేమ వసతిగృహాల పర్యవేక్షణతోపాటు కాలేజీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన, ఆమోదం, నిధుల మంజూరు బాధ్యతలు చూసుకోవాలి. ఇంతటి కీలక బాధ్యతలున్న డివిజన్ స్థాయి అధికారులకు కూడా అదనపు భారం తప్పలేదు. ఒక్కో అధికారి రెండేసి డివిజన్లను పర్యవేక్షిస్తున్నారు. ఘట్కేసర్ ఏబీసీడబ్ల్యూఓకు మేడ్చల్ అదనపు బాధ్యతలు చూసుకుంటున్నారు. అదేవిధంగా హయత్‌నగర్ ఏబీసీడబ్ల్యూఓ దిల్సుఖ్నగర్ బాధ్యతలనూ నెట్టుకొస్తున్నారు. వికారాబాద్ ఏబీసీడబ్ల్యూఓ చేవెళ్లకు ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. కూకట్పల్లి ఏబీసీడబ్ల్యూఓ తాండూరు డివిజన్ బాధ్యతల్ని కూడా చక్కబెడుతున్నారు. ఏబీసీడబ్ల్యూఓలపై అదనపు భారం పడడంతో.. పారదర్శకతపై సర్కారు చెబుతున్న మాటలకు పాతరేసినట్లవుతోంది. హాస్టళ్లలో ‘చతుర్విన్యాసం’.. డివిజన్ స్థాయిలో రెండేసి అదనపు బాధ్యతలుండగా.. వసతిగృహ స్థాయిలో ఈ బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఒక్కో వసతి గృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూఓ) ఏకంగా నాలుగు హాస్టళ్ల బాధ్యతలు చూసుకుంటున్నారు. వాస్తవానికి వసతిగృహ సంక్షేమాధికారి అదే హాస్టల్లో ఉంటూ పిల్లల బాగోగులు చూసుకోవాలి. కానీ సిబ్బంది లేరనే సాకుతో జిల్లాలో ఒక్కో హెచ్‌డబ్ల్యూఓకు నాలుగు హాస్టళ్ల బాధ్యతలు అప్పగించారు. హయత్‌నగర్‌లో పనిచేసే హెచ్‌డబ్ల్యూఓ తారామతిపేట్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం హాస్టళ్లను కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఘట్కేసర్ బాలుర వసతిగృహ అధికారి కూకట్పల్లి, మల్కాజిగిరి కాలేజీ విద్యార్థుల వసతిగృహా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇలా హాస్టల్ సంక్షేమాధికారులకు ఇష్టానుసారంగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో వసతిగృహాల పర్యవేక్షణ, విద్యార్థుల సంక్షేమ ఆగమ్యగోచరమవుతోంది. -
నిరుద్యోగులకు దశానిర్దేశం
కొత్తపేట(గుంటూరు) నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం(స్టడీ సర్కిల్) కృషి చేస్తోంది. వెనుకబడిన కులాలు, షెడ్యూలు కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థులకు వారి విద్యాభ్యాసం ముగిసిన తరువాత పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు మెరుగైన శిక్షణ అందిస్తోంది. 19 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవగాహన కల్పిస్తోంది. ఒక్కో ఉద్యోగానికి వెయ్యిమంది పోటీపడుతున్న ఈ తరుణంలో ఈ స్టడీ సర్కిల్ చేస్తున్న కృషి అభినందనీయం. ఇక్కడ 15 మంది అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు. రీజనింగ్, అర్ధమెటిక్, మాథ్స్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, కంప్యూటర్, మార్కెట్ రంగాలపై శిక్షణ ఇస్తున్నారు. ఎంసెట్, ఐసెట్, డీఈడీ, బీఈడీ, టీటీసీకు సంబంధించి ఇప్పటి వరకు 1,582 మంది శిక్షణ పొందారు. 3,720 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకోగా 539 మంది వివిధ ప్రభత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆధ్యాయన కేంద్రం డెరైక్టర్ సూర్యనారయణరావు తెలిపారు. వినడంతో పాటు ప్రాక్టీస్ చేయాలి.. శిక్షణ సమయంలో శ్రద్ధగా వినడంతోపాటు, ప్రాక్టీస్ తప్పనిసరిగా చేస్తే పోటీ పరీక్షలలో విజాయలను సొంతం చేసుకోవచ్చు. గతనెలలో జరిగిన బ్యాంక్ కోచింగ్ ఇక్కడే తీసుకున్నాను. ప్రస్తుతం ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) ఉద్యోగాలకు శిక్షణ తీసుకొంటున్నాను. - ఎం.గాయత్రి ఎంఏ బీఈడీ, అంకిరెడిపాలెం మెటీరియల్ అందజేస్తున్నారు.. మంచి శిక్షణతోపాటు ఇతర జిల్లా నుంచి మెటీరియల్ తెప్పించి అందజేస్తున్నారు. అంతేకాకుండా నెలకు రూ.750 స్టైఫండ్‌ను అందజేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు శిక్షణ తీసుకొంటున్నారు. - నరసింహారావు, డిగ్రీ, గుంటూరు -
చిన్న రాష్ట్రాలతోనే బడుగులకు రాజ్యాధికారం
ఎన్జీవోస్ కాలనీ: చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం లభిస్తుం దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సమ్య్యైవాదం పేరిట సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం బూటకమని, తెలంగాణ ప్రజలది న్యాయబద్ధమైన పోరాటమని తెలిపారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాదిగ పా ల్గొని మాట్లాడారు. సమైక్యాంధ్రతో పేద ప్ర జలకు ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. సీమాం ధ్రలో ఉంటున్న పేదలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఇప్పటి వరకు చూసి ఉండరని, అదే అక్కడి పెట్టుబడిదారులు విమానంలో గంట లో వచ్చి వెళ్తుంటారని తెలిపారు. సీమాంధ్రలోని పేదలు, మాదిగలు సమైక్యాంధ్రను కోరుకోవడంలేదని, ఈ విషయం అక్కడి నేతలకు కూడా తెలుసని చెప్పారు. ఎమ్మార్పీఎస్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఎప్పటినుంచో కోరుకుంటుందని, దీనిపై 2001లో హన్మకొండలో జరిగిన మహాసభలో ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు. సోమవారం రాత్రి జరిగిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో సమీక్ష, చర్చ జరిపామని, తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల ఏర్పాటు కావాలని సభ్యులందరం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఎమ్మార్పీఎస్ ఆయనకు మద్దతు తెలిపి అండగా నిలిచిందన్నారు. సీమాంధ్ర ప్రజలు ఆందోళనలు విరమించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుపై కేం ద్ర ప్రభుత్వం వేసిన అంటోని కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబందించిన కమిటీ మాత్రమేనని, దానిని తాము కలిసేది లేదని చెప్పారు. ముంబయిలో మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక లైంగిక దాడి జరుగడం అమానుషమన్నారు. అమ్మాయిలు, వివాహిత మహిళలపై జరుగుతున్న అరచాకాలను అరికట్టేం దుకు ప్రభుత్వం మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాయలసీమకు చెందిన దండు వీరయ్య, సీమాంధ్రకు చెందిన బ్రహ్మయ్య మాట్లాడు తూ తాము ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కోరుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యాతాకుల భాస్క ర్, పెద్దాడి ప్రకాశ్‌రావు, జెన్ని రమణ య్య, కోళ్ల వెంకటస్వామి, మన్మథరావు, మంద కుమార్, తిప్పారపు లక్ష్మణ్, పుట్ట రవి, బొడ్డు దయాకర్, నకిరకంటి యాకయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు.