నిరుద్యోగులకు దశానిర్దేశం
కొత్తపేట(గుంటూరు)
నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం(స్టడీ సర్కిల్) కృషి చేస్తోంది. వెనుకబడిన కులాలు, షెడ్యూలు కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థులకు వారి విద్యాభ్యాసం ముగిసిన తరువాత పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు మెరుగైన శిక్షణ అందిస్తోంది. 19 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవగాహన కల్పిస్తోంది. ఒక్కో ఉద్యోగానికి వెయ్యిమంది పోటీపడుతున్న ఈ తరుణంలో ఈ స్టడీ సర్కిల్ చేస్తున్న కృషి అభినందనీయం.
ఇక్కడ 15 మంది అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు. రీజనింగ్, అర్ధమెటిక్, మాథ్స్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, కంప్యూటర్, మార్కెట్ రంగాలపై శిక్షణ ఇస్తున్నారు. ఎంసెట్, ఐసెట్, డీఈడీ, బీఈడీ, టీటీసీకు సంబంధించి ఇప్పటి వరకు 1,582 మంది శిక్షణ పొందారు. 3,720 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకోగా 539 మంది వివిధ ప్రభత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆధ్యాయన కేంద్రం డెరైక్టర్ సూర్యనారయణరావు తెలిపారు.
వినడంతో పాటు ప్రాక్టీస్ చేయాలి..
శిక్షణ సమయంలో శ్రద్ధగా వినడంతోపాటు, ప్రాక్టీస్ తప్పనిసరిగా చేస్తే పోటీ పరీక్షలలో విజాయలను సొంతం చేసుకోవచ్చు. గతనెలలో జరిగిన బ్యాంక్ కోచింగ్ ఇక్కడే తీసుకున్నాను. ప్రస్తుతం ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) ఉద్యోగాలకు శిక్షణ తీసుకొంటున్నాను.
- ఎం.గాయత్రి ఎంఏ బీఈడీ, అంకిరెడిపాలెం
మెటీరియల్ అందజేస్తున్నారు..
మంచి శిక్షణతోపాటు ఇతర జిల్లా నుంచి మెటీరియల్ తెప్పించి అందజేస్తున్నారు. అంతేకాకుండా నెలకు రూ.750 స్టైఫండ్‌ను అందజేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు శిక్షణ తీసుకొంటున్నారు.
- నరసింహారావు, డిగ్రీ, గుంటూరు