Competitive exams
-
కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా!
‘వంద శాతం జాబ్ గ్యారెంటీ’, ‘100 శాతం సెలెక్షన్’ వంటి అసత్య ప్రకటనలతో, అబద్ధాలతో అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచి్చంది. ఇలాంటి మోసపూరిత, తప్పుడు ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలు తప్పుడు హామీలు ఇవ్వకుండా చర్యలు చేపట్టింది. మోసపూరిత హామీలతో అభ్యర్థులను ఏమార్చవద్దని వాటిని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. – సాక్షి, ఏపీ,సెంట్రల్ డెస్క్ఈ ఏడాది 6,980 ఫిర్యాదులు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ)కు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్లు మభ్యపెట్టడం, తక్కువే సీట్లే ఉన్నాయని.. త్వరపడకపోతే సీట్లు అయిపోతాయని అభ్యర్థులపై ఒత్తిడి తేవడం, గతంలో వచి్చన ర్యాంకుల ఆధారంగా ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, తప్పుడు, మోసపూరిత హామీలు ఇవ్వడం వంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఇలా 2021–22లో 4,815, 2022–23లో 5,351, 2023–24లో 16,276, ఈ ఏడాది ఇప్పటివరకు 6,980 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కోచింగ్ సంస్థలకు సీసీపీఏ 54 నోటీసులు పంపింది. వీటికి రూ.54.60 లక్షలు జరిమానా కింద విధించింది. 2023 సెపె్టంబర్ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రూ.1.15 కోట్లను విద్యార్థులకు పరిహారంగా ఇప్పించింది.తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థలపై కఠిన చర్యలు ఉండాలితప్పుడు ర్యాంకుల ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాటికి జరిమానాలు విధించడం వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదు. యావజ్జీవ శిక్షకు తగ్గకుండా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై చర్యలు ఉండాలి. అలాగే తమ సంస్థల్లో శిక్షణ తీసుకున్నట్టు చెప్పాలని ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు డబ్బులు ఇస్తాయి. క్లాస్ రూం కోచింగ్ ఒకరి వద్ద, ఆన్లైన్ కోచింగ్ ఇంకొకరి వద్ద, మెటీరియల్/బుక్స్ మరొకరి వద్ద తీసుకున్నామంటూ ఆయా సంస్థల డబ్బులకు ఆశపడి అబద్ధాలు చెప్పే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాల డబ్బులకు ఆశపడి అనేక కో చింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నామని చెబితే వా రిపై చర్యలు తీసుకోవాలి.మీడియా కూడా తప్పు డు ప్రకటనల పట్ల జాగరూకతతో ఉండాలి. గతంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల హా ల్టికెట్లను పరిశీలించాకే వారి గురించి ప్రచురించేవి. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరించాలి. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే అసలు నిజాలు తెలుస్తాయి. – కె.లలిత్ కుమార్, జేఈఈ కోచింగ్ నిపుణులు, ఎడ్యుగ్రామ్360.కామ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట.. కోచింగ్ కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థుల వద్ద కొంత సమాచారాన్ని దాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. అయితే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నష్టపోకుండా తాజా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్రం వెల్లడించింది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. తమ మార్గదర్శకాలు అభ్యర్థులకు గైడెన్స్, విద్యాపరమైన మద్దతు, ట్యూటరింగ్, స్టడీ ప్రోగ్రామ్స్, విద్యకు సంబంధించిన ప్రకటనలకు వర్తిస్తాయని స్పష్టతనిచి్చంది. కౌన్సెలింగ్, థియేటర్ ఆర్ట్స్, క్రీడలు, డ్యాన్స్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలకు వర్తించవని తెలిపింది. కోచింగ్ సంస్థలకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని వివరించింది. కోచింగ్ సెంటర్లు ఖచ్చితత్వంలో వ్యవహరించడం ద్వారా అభ్యర్థుల హక్కులను గౌరవించాలని పేర్కొంది. 50 మంది కంటే ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేసంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది.కేంద్రం మార్గదర్శకాలు ఇవి..» కోర్సు–వ్యవధి, అధ్యాపకుల వివరాలు, ఫీజులు–వాపసు (రిఫండ్) విధానాలు, ఎంపిక, పరీక్ష ఫలితాలు లేదా ఉద్యోగ నియామకం లేదా జీతం పెరుగుదలకు సంబంధించి మోసపూరిత హామీలను, ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వకూడదు.» ఉద్యోగాలకు ఎంపికైన లేదా ర్యాంకులు సాధించిన అభ్యర్థుల రాతపూర్వక అనుమతి లేకుండా వారి పేర్లు, ఫొటోలు లేదా ఇతర సమాచారాన్ని శిక్షణ సంస్థలు ఉపయోగించకూడదు. అలాగే వారి సమాచారాన్ని సురక్షితంగా ఉంచాలి.» సివిల్స్ రాసే అభ్యర్థుల్లో కొందరు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వారే సొంతంగా సిద్ధమవుతారు. ఇంటర్వ్యూకు మాత్రమే శిక్షణ తీసుకుంటారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ముందుగానే స్పష్టతనివ్వాలి. » అభ్యర్థులకు వారి కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించాలి. వారి అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. » అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా తమ సేవలు, వనరులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి వివరించాలి.» తాము అందిస్తున్న కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వంటి సంస్థల గుర్తింపు ఉందని నిర్ధారించాలి. » చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే శిక్షణ కేంద్రాలను నడపాలి. » విద్యార్థులు లేదా అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, ఇతర సౌకర్యాలను శిక్షణ కేంద్రాలు కల్పించాలి. » కోర్సులు, కాలపరిమితి, అధ్యాపకుల అర్హతలు, ఫీజు, రిఫండ్ విధానాలు, ఫలితాలు, జాబ్ గ్యారెంటీ వంటి అంశాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు. » విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ‘కొన్ని సీట్లే మిగిలి ఉన్నాయి’ వంటి ప్రకటనలు ఇవ్వడం నిషిద్ధం. » కోచింగ్ సెంటర్లకు ప్రచారం కల్పించే ముందు ఎండార్సర్లు వాటి ప్రకటనలను ధ్రువీకరించుకోవాలి. » కోచింగ్ సెంటర్ల తరఫున ప్రచారం చేసే సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు వారు చేసే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. » తప్పుడు ప్రకటనలు చేసినా, తప్పుదోవ పట్టించేలా ప్రకటనల్లో నటించినా కోచింగ్ సెంటర్లతోపాటు ప్రచారకర్తలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. » ఇప్పటిదాకా.. ఏవైనా షరతులు ఉంటే చిన్నగా ‘‘స్టార్’’ గుర్తు పెట్టి.. ప్రకటన చివర్లో కనిపించీ, కనిపించకుండా వాటిని చూపించేవారు. ఇకపై ఇలా కుదరదు. ఏవైనా షరతులు ఉంటే ప్రకటన ఏ ఫాంట్ సైజులో ఉంటే అదే సైజులో షరతులను కూడా ప్రచురించాలి. » తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కోచింగ్ సెంటర్లు కచి్చతంగా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఏపీలోనూ ‘కోటా ఫ్యాక్టరీ’లు
సాక్షి, అమరావతి: ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల శిక్షణకు రాజస్థాన్‌లోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి ఇల్లూ ఓ శిక్షణ సంస్థే. కోటా ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ తీసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అనే ప్రచారం బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఇతరులకు తెలియదు. శిక్షణ కోసం కోటా వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక గతేడాది 26 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. వీరంతా 17–19 ఏళ్ల వయసువారే. ఇక సివిల్స్ శిక్షణకు బ్రాండ్ సిటీ లాంటి ఢిల్లీలో ఇటీవల ఓ పేరొందిన స్టడీ సర్కిల్‌ను వరద ముంచెత్తడంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇంటర్, పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఇదే తరహా ఒత్తిడి నెలకొంది.పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థకోచింగ్ సెంటర్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తేనుంది. శిక్షణ సంస్థలపై పర్యవేక్షణకు 12 మంది అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతత్వంలో పాఠశాల, వైద్య, సాంకేతిక విద్య కార్యదర్శులు, డీజీపీ సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండుసార్లు వరకు జరిమానా, ఆ తరువాత సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. విద్యార్థి శిక్షణ మధ్యలో మానేస్తే దామాషా ప్రకారం ఫీజు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం అనంతరం ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడం, సాధారణ పాఠశాలల్లో చేరిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.బలవన్మరణాలు..విశాఖ పీఎం పాలెంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఈ ఏడాది జనవరిలో 9వ తరగతి చదివే ఓ విద్యార్థికి టెన్త్ పాఠ్యాంశాలు బోధిస్తూ టెస్టుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీల సందర్భంగా రికార్డులు సమర్పించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు 2021లో ఏపీలో 523 మంది విద్యార్థులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014 తరువాత 57 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై మార్కులు, ర్యాంకుల ఒత్తిడి పెరగడంతో అంచనాలను అందుకోలేక సగటున వారానికి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల వేధింపులను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ‘‘కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు–2024’’ పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
అలా మార్చేస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా విధానంలో మార్పులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చడం పక్కన బెడితే, కొన్ని చాప్టర్లు తీసివేయడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని విద్యావేత్తలు అంటున్నారు. పురాతన చరిత్ర స్థానంలో క్లాసికల్ హిస్టరీని తేవాలని తాజాగా జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీన్ని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు స్వాగతించడం లేదు. ఇప్పటికే రాష్ట్రాల పరిధిలో స్థానిక అంశాలతో సిలబస్ ఉంది. వీటిని పరిగణనలోనికి తీసుకుని సిలబస్‌లో మార్పులు చేస్తేనే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వేర్వేరు సిలబస్‌లతో ఇబ్బందులు ప్రపంచీకరణ ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రం వేర్వేరు సిలబస్‌లు అమలు చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదన విద్యావేత్తల నుంచి విన్పిస్తోంది. మారిన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా రాష్ట్రాల్లోని సిలబస్‌లో మార్పులు తేవాలనే అంశంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. పోటీ పరీక్షలుసవాలే.. ఎన్సీఈఆర్టీ సూచించిన మార్పుల్లో అనేక అంశాలున్నాయి. క్లాసికల్ హిస్టరీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటోంది. ప్రాచీన చరిత్రను ఎత్తివేయడమే సమంజసమని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులను తీసివేయాలనే ప్రతిపాదన రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మొఘల్ సామ్రాజ్యం, గాందీజీ హత్య, ప్రజాస్వామ్యం–రాజకీయ పారీ్టలు అనే చాప్టర్స్‌ను ఎన్సీఈఆర్టీ అనవసరమైనవిగా చెబుతోంది. పాత చరిత్రలో విజయాలకన్నా, అపజయాల గురించే ఎక్కువగా ఉందనేది ఎన్సీఈఆర్టీ అభిప్రాయం. అయితే ఇవి రాష్ట్రాల పరిధిలో ఇప్పటికీ బోధనాంశాలుగా కొనసాగుతున్నాయి. పోటీ పరీక్షల్లోనూ వీటిలోంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఎడ్‌సెట్, లాసెట్, గ్రూప్స్, వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఆర్ట్స్’ విద్యార్థులు వీటిని చదవాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ చదివే వాళ్ళకు ఈ చాప్టర్లు చదివే వీలుండదు. దాంతో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో విద్యార్థులకు నష్టం కల్గించే వీలుందని నిపుణులు అంటున్నారు. సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్ధులకు... సైన్స్‌లో డార్విన్ సిద్ధాంతాన్ని కేంద్ర విద్యా సంస్థ ఎత్తివేయాలని ప్రతిపాదించింది. మానవ పరిణామ క్రమాన్ని సహేతుకంగా నిరూపించే సిద్ధాంతాన్ని ఎన్సీఈఆర్టీ కమిటీ విభేదించినట్టు తెలుస్తోంది. దీంతో పాటే పైథాగరస్ సిద్ధాంతానికి స్వస్తి పలకాలని సూచి స్తోంది. దీనివల్ల కూడా సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్థులు రాష్ట్రాల్లోని పోటీ పరీక్షలకు హాజరవ్వడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కేంద్ర స్థాయిలో నిర్వహించే పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఇస్తారు. రాష్ట్ర బోర్డు పరిధిలో ఉండే విద్యార్థులు కొత్త చాప్టర్స్ చదివే వీలుండదు. వాళ్లు చదివిన పురాతన భారత చరిత్ర వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని పలువురు అంటున్నారు. అన్ని రాష్ట్రాలనూ పరిగణనలోకి తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానంలో వస్తున్న మార్పులను ఆకళింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా విద్యార్థి విద్యా విధానంలోనే స్కిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ దిశగా పాఠ్యాంశాలు ఉండటం మంచిది. అయితే, మార్పు జరిగేటప్పుడు రాష్ట్రాల పరిధిలోని విద్యా విధానాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. లేనిపక్షంలో అనేక మంది విద్యార్థులు రెండు సిలబస్‌లతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) వక్రీకరణ సరికాదు చరిత్రను వక్రీకరించే విధానం ఎన్సీఈఆర్టీ సిఫార్సుల్లో బోధపడుతోంది. ప్రాచీన చరిత్రను తీసివేయాలనే ధోరణి మంచిది కాదు. చరిత్ర తెలుసుకుంటేనే ప్రతిభ పెరుగుతుంది. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా చరిత్రను పాఠ్యాంశాల్లో జోడిస్తే ప్రతికూల ఫలితాలొస్తాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేర్వేరు సిలబస్‌లు వల్ల కూడా నష్టం జరుగుతుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
జేఈఈ మెయిన్స్ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీ ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ కాలంలో 4 దఫాలుగా నిర్వహించిన ఈ పరీక్షను 2024– 25లో మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. తొలి విడతను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య చేపట్టాలని నిర్ణయించింది. రెండో దఫా జేఈఈ మెయిన్స్ ను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్య నిర్వహించబోతున్నట్టు వెల్లడించింది. దీంతో పాటే మే 5న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ), మే 15–31 తేదీల మధ్య కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), మార్చి 11–28 మధ్య సీయూఈటీ–పీజీ, జూన్ 10–21 మధ్య యూజీసీ–నెట్ పరీక్షలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారంగానే ఉంటాయని పేర్కొంది. అయితే, సమగ్ర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. 2021 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్ష కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. గత ఏడాది మాత్రం జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. అయితే, తేదీల ఖరారులో మాత్రం ఆలస్యమైంది. ఈ సంవత్సరం కోవిడ్ కన్నా ముందు మాదిరిగానే మూడు నెలల ముందే తేదీలను వెల్లడించారు. మెయిన్స్ దరఖాస్తులు పెరిగేనా? కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో జేఈఈ మెయిన్స్ రాసే వారి సంఖ్య ప్రతీ సంవత్సరం తగ్గుతోంది. ఈ స్థానంలో రాష్ట్ర ఎంసెట్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2014లో జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. 2023లో మాత్రం ఈ సంఖ్య 11 లక్షలకు పెరిగింది. కోవిడ్ సమయంలో టెన్త్ పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. రాష్ట్రంలో ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలుంటే, 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. కాగా, గత రెండేళ్లుగా రాష్ట్రంలో హాస్టళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, జేఈఈపై దృష్టి పెడుతున్న వారి సంఖ్య పెరగడంతో ఈ సంవత్సరం కూడా జేఈఈ రాసే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
నిరుద్యోగుల జీవితాలతో ఆటలు వద్దు
పంజగుట్ట: ఉద్యోగ, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇది సీఎంకు తగదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే దాదాపు 15 పేపర్లు లీక్ అయ్యాయని ధ్వజమెత్తారు. ఇప్పటికీ లీకేజీ అసలు బాధ్యులను గుర్తించలేదన్నారు. ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారు కాబట్టే విషయాన్ని బయటకు రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యార్థులు, పలు పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ‘గ్రూప్ 2 వాయుదాకై నిరుద్యోగుల విన్నపం’ పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ గురుకుల టీచర్ల పరీక్షల నిర్వహణలోనూ లోపాలున్నాయన్నారు. దీనివల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు ఆదివారం వరకు వేచి ఉండి అప్పటికీ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే అన్ని లైబ్రరీల్లో, యూనివర్సిటీల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్నారు. -
ఇకపై పరీక్షల్లో కాపీకొట్టి పట్టుబడితే జైలుకే..
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ గురువారం రోజున సంచలనాత్మక బిల్లును ఆమోదించింది. ఇకపై పరీక్షల్లో కాపీ కొట్టి పట్టుబడితే 10 కోట్లు జరిమానాతో పాటు జీవిత కాలం జైలు శిక్ష కూడా విధించేలా చట్టాన్ని రూపొందించి అమలు చేయనుంది. ఏమిటీ బిల్లు.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అలాంగిర్ అలాం ఈ బిల్లును ప్రవేశపెట్టగా దీనిపై సుదీర్ఘంగా చర్చ కూడా సాగింది. ఇకపై ఎవరైనా పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడితే వారికి 10 కోట్లు జరిమానా తోపాటు జీవితకాలం ఖైదు చేసే విధంగా చట్టాన్ని రూపొందించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేయడాన్ని క్షమించరాని నేరంగా పరిగణిస్తూ నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. అనర్హులకు చెక్.. ఆయా నియామకాలకు సంబంధించి జరిగే కాంపిటీటివ్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం ద్వారా పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేసేవారికి కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్టయ్యింది. ఇంతకాలం పరీక్షల నిర్వహణలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న లొసుగులను సద్వినియోగం చేసుకుంటూ గతంలో కొందరు అభ్యర్థులు పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారని, అందుకే ఈ తరహా కఠిన చట్టాలను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. మరోపక్క బీజేపీ పార్టీ ఎప్పటిలాగే దీన్నొక క్రూరమైన చట్టంగా వర్ణించింది. సీఎం కామెంట్.. దీనిపై స్వయంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలను ఎలా తయారు చేస్తోందో అందరూ చూస్తున్నారని.. ఇలాంటి చట్టం చేయడం ఇదే మొదటిసారి కాదని, మరికొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే జైలు శిక్షను కూడా కుదిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాదిపాటు.. రెండోసారి పట్టుబడితే మూడేళ్లపాటు ఉండేలా సవరణలు చేశారు. ఇది కూడా చదవండి: విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. -
పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!
గాంధీనగర్: పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలను కట్టడి చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా, ఏ అధికార హోదాలో ఉన్నవారైనా సరే ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించేలా కొత్త రూల్ తెచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లు 'ది గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్)- 2023'ను గుజరాత్ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ఈ ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం గమనార్హం. ఈ కొత్త రూల్ ప్రకారం పేపర్ లీక్ వ్యహారంతో సంబంధం ఉన్న వారు, దోషులను రెండేళ్ల పాటు ఎలాంటి పోటీ పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తారు. అలాగే ఏదైనా సంస్థ పేపర్ లీక్‌కు పాల్పడితే జీవితకాలం నిషేధిస్తారు. అవసరమైతే వారి అస్తులను విక్రయించి పరీక్ష ఖర్చులను వసూలు చేస్తారు. అయితే ఈ నిబంధనలు పోటీ పరీక్షలకు మాత్రమే వర్తిస్తాయి. 10, 12వ తరగతి, యూనివర్సిటీ పరీక్షలకు వర్తించవు. పేపర్ లీక్ అయిన కారణంగా ఈ ఏడాది జనవరిలో పంచాయత్ జూనియర్ క్లర్క్ రిక్రూట్మెంట్ పరీక్షను గుజరాత్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రశ్నాపత్రాల ముద్రణకు ఇంఛార్జ్‌గా ఉన్న హైదరాబాద్ వాసి జీత్ నాయక్ సహా 15 మందిని నిందితులుగా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. చదవండి: రణరంగంగా అమృత్సర్.. బారికేడ్లు తోసుకుని తల్వార్లతో పోలీస్ స్టేషన్‌కు! -
అకడమిక్ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఎంతో తేడా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ కొలువుల జాతర సాగుతోంది. ప్రభుత్వం దాదాపు 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు మొదలుకొని.. డిగ్రీ, ఆపై చదువుకున్న వారిలో మెజారిటీ నిరుద్యోగుల దృష్టి ఈ ఉద్యోగాలపైనే ఉంది. సహజంగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కసరత్తు ప్రారంభించడం పరిపాటిగా కనిపిస్తుంది. దరఖాస్తు అనంతరం పోటీకి సన్నద్ధమై.. పరీక్ష తేదీ నాటికి సిద్ధంగా ఉంటే సరిపోతుంది. ఆమేరకు నియామక సంస్థలు సైతం సమయాన్ని ఇస్తాయి. అయితే ఆ వ్యవధిలో ప్రిపేర్ కావడమంటే అకడమిక్ పరీక్షలకు సిద్ధమైనట్లు కాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.ముక్తేశ్వర్రావు సూచిస్తున్నారు. అకడమిక్ పరీక్షలకు కేవలం విషయాన్ని చదివి రాస్తే సరిపోతుందని, కానీ పోటీ పరీక్షల్లో మాత్రం ప్రతి విషయాన్ని లోతుగా చదివి, ఆకళింపు చేసుకుంటేనే విజయం సాధిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆయన ‘సాక్షి’తో పలు అంశాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... సివిల్ సర్వెంట్‌కు... సివిల్ సర్వెంట్ అంటే కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉద్యోగం. ఇక రాష్ట్రస్థాయిలో గ్రూప్–1 ఉద్యోగం ఉత్తమమైంది. వీటికి ఎంతో విశిష్టత ఉంటుంది. అధికారం, చట్టం, నిధులు, స్వీయ నిర్ణయానికి ప్రాధాన్యత ఉండటంతో సమాజానికి మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థలో మార్పులు తేవాలంటే ఇలాంటి ఉద్యోగాలతో సాధ్యమవుతుంది. అంతటి ఉన్నత ఉద్యోగం పొందాలంటే ఎంతో సాధన అవసరం. స్వీయ దృక్పథం ఉండాలి... ఒక అంశాన్ని చదివినప్పుడు దానిపై స్వీయ దృక్పథం ఉండాలి. మనకంటూ ఒక వ్యూ పాయింట్ ఉంటేనే దానిపై పరిశీలన చేయగలం. అలా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలి, లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడే ఆ అంశంపై మనకు పట్టు పెరుగుతుంది. ఇందుకు ఎక్కువ పుస్తకాలు చదవాలి. ఆ రోజుల్లో నేను రోజుకు కనీసం పది నుంచి పన్నెండు సంపాదకీయాలు చదివే వాడిని. శ్రద్ధతో ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. వ్యక్తీకరణ కీలకం... సివిల్స్, గ్రూప్స్‌లో రాత పరీక్షలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ పరీక్షలకు వ్యక్తీకరణ అనేది కీలకం. ఒక అంశం చదివిన తర్వాత దాన్ని అర్థవంతంగా వ్యక్తీకరించాలి. అందుకు సరైన భాష, పదప్రయోగం వాడాలి. ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడాలనే అవగాహన ఉంటేనే వ్యక్తీకరణ సులభమవుతుంది. విషయ పరిజ్ఞానంతోపాటు సమాజం పట్ల అవగాహన ఉండాలి. అందుకోసం సమాజాన్ని చదవాలి. వార్తాపత్రికలతోపాటు సామాజిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలి. ప్రతి అంశాన్ని లోతుగా చదవడం నేర్చుకుంటే దానిపై అవగాహన పెరుగుతుంది. వీలుంటే నిపుణులతో ఆయా అంశాలపై చర్చిస్తే మంచి ఫలితం ఉంటుంది. తెలుగు అకాడమీ పుస్తకాలు బాగు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే మంచి ఫలితం ఉంటుంది. జాతీయ అంశాలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాలున్నాయి. పోటీ పరీక్షల్లో విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. అది మనకు నచి్చన భాషలో సన్నద్ధం కావొచ్చు. మాతృభాషలో అయితే తక్కువ వ్యవధిలో ఎక్కువ పుస్తకాలు చదవడంతోపాటు సిలబస్ పూర్తిచేసే వీలుంటుంది. ఆ తర్వాత అవసరం ఉన్న భాషలోకి దాన్ని వినియోగించుకోవాలి. బహుముఖకోణం... ఒక అంశాన్ని మనం పరిశీలించే తీరును బట్టి అవగాహనకు వస్తాం. అలా ప్రతి అంశానికి బహుముఖ కోణాలుంటాయి. నేను ఒకసారి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న సమయంలో తీవ్ర కరువు పరిస్థితులు వచ్చాయి. అప్పుడు వికారాబాద్ ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లాను. అక్కడి మెజార్టీ మహిళలు తాగునీటి సౌకర్యం కలి్పంచాలని కోరగా... ఇతర పనులు చేసుకునే పురుషులు మాత్రం మంచి రోడ్డు వేయాలని అడిగారు. కరువు పరిస్థితుల్లో కూడా ఒక్కోక్కరి డిమాండ్ ఒక్కోలా ఉంది. అంటే మహిళలు ఇంటి పనులు చూసుకుంటారు కాబట్టి తాగునీరు అడిగితే, పనులు చేసుకునే వారు మెరుగైన రవాణా కోసం రోడ్లు అడిగారు. ఇలా ఒక్కో అంశానికి అనేక కోణాలు ఉంటాయి. అలా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. -
రోజుకు పది గంటలు చదివితే ఉద్యోగం ఖాయం
వరంగల్: యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే రోజుకు పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి చదవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. వరంగల్ కమిషనరేట్ శిక్షణ కేంద్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం కోచింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తరుణ్ జోషి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది సెంటర్లలో శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పీజేఆర్ కోచింగ్ సెంటర్‌కు చెందిన నిపుణులైన అధ్యాపకులతో కోచింగ్ ఇచ్చా మని, ప్రతి విద్యార్థికి రూ.2 వేల విలువైన స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యువత శిక్షణ కాలం అనుభవాలను అధికారులతో పంచుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీలు శ్రీనివాస్, జితేందర్‌రెడ్డి, గిరికుమార్, ఇన్స్పెక్టర్లు రాఘవేం దర్, శ్రీనివాస్, రవికుమార్, రమేశ్, పీజేఆర్ కో చింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పట్టు సాధిస్తేనే మెట్టెక్కేది... లక్ష్యం నెరవేరాలంటే పట్టు తప్పనిసరి
సాక్షి హైదరాబాద్: సర్కారు ఉద్యోగం నిరుద్యోగుల కల. ఆ స్వప్నం సాకారం కావాలంటే పట్టుదల తప్పనిసరి. చదవడం.. సమీక్షించుకోవడం.. పట్టు సాధించడం ఇవే ప్రభుత్వ ఉద్యోగానికి తొలిమెట్టు. ఈ మెట్టు ఎక్కడానికి ప్రణాళిక అవసరం. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భర్తీ చేస్తున్న గ్రూప్–1, 2, ఉపాధ్యాయ, పోలీసు, ఇతర శాఖల పోస్టుల సాధనలో పైచేయి సాధించడానికి అభ్యర్థులు సంసిద్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణులు సూచనలు అందిస్తున్నారు. సిలబస్ ముఖ్యం.. పరీక్ష ఏదైనా సిలబస్‌ను ఔపోసన పట్టాలని.. సిలబస్ ప్రామాణిక పత్రంగా పెట్టుకొని సన్నద్ధం కావాలని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు రాయబోయే పరీక్ష సిలబస్, పరీక్ష స్వరూపాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గత పరీక్ష ప్రశ్న పత్రాలు పరిశీలించి, వాటిపై కసరత్తు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయి. ‘తెలంగాణ’కు ప్రాధాన్యం రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోటీ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సిలబస్‌లో మార్పులు చేసింది. పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రాంత రాజకీయ–సామాజిక చరిత్రకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ సిలబస్ రూపొందించారు. తెలంగాణ చారి త్రక నేపథ్యం మొదలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు చోటుచేసుకున్న అనేక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమం, నక్సలిజం, రాష్ట్ర ఏర్పాటులో వివిధ రాజకీయ పార్టీల పాత్ర, టీఆర్ఎస్ ఏర్పా టు మొదలైన అంశాలపై కూడా పట్టు సాధించాలి. జనరల్ స్టడీస్‌పై పట్టు రాబోతున్న ఉద్యోగ పరీక్షల్లో ‘జనరల్ స్టడీస్’ ప్రతి పరీక్షలోనూ కనిపించే సబ్జెక్ట్. జీఎస్‌పై పట్టు సాధిస్తే గ్రూప్ –1 నుంచి మొదలు పంచాయతీ సెక్రటరీ పోస్టుల వరకు సగం సన్నద్ధత లభించినట్లే. అభ్యర్థులు తాము రాయబోయే పరీక్షల సిలబస్‌లో జీఎస్‌కు ఎలాంటి సిలబస్ ఇచ్చారో ఒకసారి క్షుణ్నంగా పరిశీలించి ప్రామాణిక పుస్తకాలు ఎంచుకొని సన్నద్ధమవ్వాలి. పాలిటీ, ఎకానమీ, చరిత్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ మొదలైన జనరల్ స్టడీస్ సబ్జెక్టులకు సమకాలీన అంశాలను జోడిస్తూ చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక పుస్తకాల ఎంపికలోనూ జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో లభించే ప్రతి పుస్తకం కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలు, ఏదైనా ప్రముఖ రచయితల పుస్తకాలు సేకరించుకొని చదువుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు ఏదైనా ఒక్కటే పుస్తకాన్ని పలుమార్లు రివిజన్ చేయడం మేలు. ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో కొన్ని చానల్స్ ఉచితంగా పోటీ పరీక్షల సిలబస్‌ను బోధిస్తున్నాయి. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి పోటీ పరీక్ష ఏదైనా సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, గత ప్రశ్నపత్రాలు చూడాలి. ముఖ్యంగా పోలీసు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి. కానిస్టేబుల్, ఎస్సైలకు ప్రిలిమ్స్ వరకు సిలబస్ కామన్‌గా ఉంటుంది కాబట్టి ఒకేసారి సన్నద్ధమవ్వచ్చు. ప్రధాన పరీక్ష సిలబస్ కూడా ఒకేలా కనిపిస్తున్నా మరింత లోతుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈవెంట్స్‌లో మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను సులువుగా దక్కించుకోవచ్చు. – రాజశేఖర్, ఐరైజ్ ఫౌండర్ పీవీ స్మారక గ్రంథాలయంలో ప్రిపేర్ కండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీలో పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయంలో ఉద్యోగార్థులు చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ, కమిటీ చైర్పర్సన్ వాణీదేవి తెలిపారు. కమిటీ ప్రాంగణంలోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇక్కడి గ్రంథాలయంలో అవసరమైన సమాచారం, పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంథాలయంలో చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పీవీ స్మారక గ్రంథాలయం తెరిచి ఉంటుందని ఆమె తెలిపారు. సమావేశంలో సురభి సోలార్ ఎనర్జీ కేంద్రం డైరెక్టర్ శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణీదేవి -
లేటెస్ట్ టెక్నాలజీతో.. సరికొత్త లుక్‌లో ఎడ్యుకేషన్.సాక్షి.కామ్
సాక్షి, ఎడ్యుకేషన్: విద్యార్థులు, అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు, ఉద్యోగాన్వేషణకులకు శుభవార్త. విద్యా ప్రపంచంలో విశేష ఆదరణ కలిగిన education.sakshi.com (sakshieducation.com) వెబ్సైట్ సరికొత్త హంగులతో మీ ముందుకు వచ్చింది. నూతన సాంకేతికతతో వెబ్సైట్ రూపకల్పన జరిగింది. ఈ వెబ్సైట్లో కేంద్ర, రాష్ట్ర పోటీపరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, బిట్‌బ్యాంక్, స్టడీ మెటీరియల్, గైడెన్స్, జీకేతో పాటుగా కరెంట్ అఫైర్స్(తెలుగు మీడియం&ఇంగ్లీషు మీడియం) అందుబాటులో ఉన్నాయి. అలాగే పది, ఇంటర్ విద్యార్థులకు ఉపయోగపడే సిలబస్, స్టడీ మెటీరియల్, ఈ–బుక్స్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, కేరిర్ గైడెన్స్ కథనాలు ఉన్నాయి. తాజా ఉద్యోగ సమాచారం, విద్యా సంబంధిత సమాచారం, కరెంట్ ఆఫైర్స్, ఆన్లైన్ టెస్టులు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాలు, స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్, వీడియోలు, ప్రాక్టీస్ టెస్టులతోపాటు ఈ–బుక్‌లు కూడా నూతన వెబ్సైట్లో ఉన్నాయి. కావాల్సిన సమాచారాన్ని కేటగిరి వైజ్ ఎంపిక చేసుకుని తెలుసుకునే సౌలభ్యం ఉంది. నాణ్యమైన విద్యా సంబంధిత కంటెంట్‌ను అందించడమే education.sakshi.com లక్ష్యం. మీ బంగారు భవిష్యత్‌కు ఎడ్యుకేషన్.సాక్షి తోడుగా ఉంటుంది సగౌరవంగా చెప్పగలం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న సాక్షి ఎడ్యుకేషన్ వీక్షకులకు కృతజ్ఞతలు..ఇలాగే ఇకపై మరింత ఎక్కువగా ఆదిస్తారని కోరుకుంటున్నాం. -
ప్రాంతీయ భాషల్లోనే పోటీ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం నిర్వహించే అన్ని పరీక్షలను 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం లోక్‌సభలో జీరో అవర్ సందర్భంగా జాతీయస్థాయి పోటీ పరీక్షలను తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరుతూ నోటీస్ ఇచ్చారు. హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల హిందీయేతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను సీజీటీఎంఎస్ఈలో చేర్చాలి: నామా కోవిడ్ కారణంగా నష్టపోయిన ప్రైవేటు విద్యాసంస్థలను ఆదుకోవడానికి క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) పథకంలో చేర్చాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఆదుకోవాలని కోరుతూ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖరాశారు. రైతులను శిక్షించడం న్యాయమా?: సురేశ్‌రెడ్డి కాలుష్యానికి కారణమంటూ రైతులను శిక్షించడం ఎంతవరకు న్యాయమని టీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పరిసరాల్లో వాయు నాణ్యత యాజమాన్య కమిషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ‘ఈ బిల్లులోని క్లాజ్ 15ను కేంద్రం పునః పరిశీలించాలి. కాలుష్య నివేదికలు పరిశీలిస్తే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వరి, ఇతర పంటల గడ్డి కాల్చివేత వల్ల కారణమైన కాలు ష్యం వాటా కేవలం 4 శాతమే. గతంలో సెప్టెంబరులో పంట చేతికి రావడంతో వీచే గాలి వాయు కాలుష్యాన్ని నివారించేది. వాతావరణ మార్పుల వల్ల పంటల కాలం కూడా మారింది’ అన్నారు. ఖాయితా లంబాడీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలి: బండ ప్రకాశ్ ఖాయితా లంబాడీ, బోయలను ఎస్టీ జాబితాలో చే ర్చాలని టీఆర్ఎస్ కేంద్రా న్ని కోరింది. రాజ్యాంగ సవరణ (షెడ్యూల్డ్ తెగలు) బిల్లు–2021పై జరిగిన చర్చలో ఎంపీ బండ ప్రకాశ్ కేంద్రానికి విన్నవించారు. ‘ఖాయితా లంబాడీలను, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తెలంగాణలో చెల్లప్ప కమిషన్ ఏర్పాటైంది. ఆ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి సానుకూల నివేదికిచ్చింది. వీటిని అమలు చేయాలని శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి పంపి మూడేళ్లయింది’ అని తెలిపారు. -
ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం ఎలా?
మీరు డీగ్రీ పాసయ్యారా? ప్రభుత్వ ఉద్యోగం మీ కల? మీ కల నేరవేర్చుకుందాం అంటే కరోనా అడ్డుగా ఉందా! అయితే అచీవర్స్ అకాడమీలో చేరండి. కరోనా కాలంలో కూడా కాంపీటేటివ్కు ప్రీపేర్ అయ్యి మీ ప్రభుత్వ ఉద్యోగ కలను నెరవేర్చుకోండి! అయితే డీగ్రీ అయిపోయిన విద్యార్థులంతా తాను గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగం సాధించాలని కలలు కంటారు. కానీ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో అది అంత సాధ్యం కాదు. సరైనా ప్రణాళిక, అంకితభావం ఉంటే అది సుసాధ్యం అవుతుంది. అయితే చాలా మంది ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు చదువుతున్నప్పటికీ వారికి ఫలితం సున్నా. అయితే ఈ క్రింద 7 సుత్రాలను పాటిస్తే పోటీ పరీక్షల్లో విజయం మీదే అని చెబుతున్నారు అచీవర్స్ అకాడమీ నిపుణులు. ఏపీఎస్సీ, టీఎస్‌పీఎస్‌స్సీ పోటీ పరీక్షలకు సిద్దమవడానికి మీరు పాటించాల్సిన ఈ 7 సిద్దాంతాలను అచీవర్స్ అకాడమీ వారు మీ కోసం అందించారు. అవేంటో తెలుకుందాం రండి! ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షలలో విజయం సాధించడం ఎలా? 1. మీరు ఏం చదువుకున్నారని కాదు, డిగ్రీపాస్ అయితే చాలు. మీరు చేయాల్సిందల్లా మొదటగా ఏ ఉద్యోగానికి వెళ్లాలనుకుంటున్నారో మీకు మీరు ఓ స్పష్టత తెచ్చుకోవాలి. నేను ఏ ఉద్యోగానికివెళ్తున్నాను? నోటిఫికేషన్ ఏవిధంగా పడింది? ఉద్యోగంపేరేంటి? ఇలా పూర్తిగా స్పష్టతతో ఉండాలి. 2. దానికిసంబందించిన సిలబస్‌ను పూర్తిగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సిలబస్‌పై పట్టు సాదించాలి. 3. ఆ సిలబస్‌కు తగ్గట్టుగా సరైన పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. 4. తరువాత దీనికి సంబంధించిన ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ప్రముఖ కోచింగ్ సెంటర్ల గురించి తెలుసుకోవాలి. ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి అనే దాని గురించి మొదట స్పష్టమైన అవగాహన ఉండాలి. APPSC Group 2 Online Coaching కావాలంటే Achievers Academy లాంటి కోచింగ్ సెంటర్లో చేరవచ్చు. 5. వీటన్నింటితో పాటు సిలబస్ గురించిన సమాచారాన్ని మైక్రోషీట్‌లో రెడీచేసుకోవాలి. మనకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయన్నది తెలుసుకోవాలని, మరీ ముఖ్యంగా అందులోని సిలబస్ ఏంటి? అనే దానిపై మైక్రోషీట్ రెడీచేసుకోవాలి. ఈ మైక్రోషీట్తో నెల రోజు టైం టెబుల్‌ను సిద్దం చేసుకోండి. మీరు చదివే పోటీ పరీక్షలో ఉన్న సబ్జెక్స్ ఏంటో, ఎన్ని ఉన్నాయో వాటన్నింటిని మైక్రోషీట్‌లో రాసుకుంటే సిలబసపై తెలుసుకోవడం సులభతరం అవుతుంది. ఈ ప్రకారం 1వ తేదీ ఎన్నిపాఠాలు చదవాలి? అనేది నిర్ణయించుకోవాలి. ఉదాహారణకు 1వ తేదీన హిస్టరీలో రెండు పాఠాలు, ఎకనామిక్స్‌లో రెండు పాఠాలు ఇలా రాసుకుని ఆ రోజు ఎన్ని పాఠాలు పూర్తి చెయ్యాలో షీట్‌పై వేసుకునే టైంటేబుల్‌నే మైక్రోషీట్ అని పిలుస్తాం. అయితే సబ్జెక్టుపై మాత్రమే పట్టు సాధించినంత మాత్రాన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మార్కులు సాధించలేము. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్లోను పట్టు సాధించాలి. దీనికోసం ఎక్కువ రోజులు కెటాయించకుండా కేవలం 10 రోజుల్లో సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా మీ మైక్రో షీట్‌ను తయారు చేసుకోండి. మొత్తం 10 రోజులలో సబ్జెక్ట్స్ అన్ని పూర్తిగా చదవాలి. దీనిని ఫాస్ట్ రౌండ్ అని పిలుస్తాం. మరల 11 వ రోజు నుంచి 20వ రోజు వరకు దానిపై సెకండ్ రౌండ్ మొదలు పెట్టాలి. ఇలా నెలకు మూడు రౌండ్లు పూర్తవుతాయి. ఇలా 50 రోజులలో 5 రౌండ్లు చదవాలి. అప్పడే సిలబస్ మీద పట్టు వస్తుంది. 6. ఆన్లైన్లో మోడల్ పేపర్స్ అభ్యమౌవుతాయి. సాధ్యమైనన్ని ఎక్కువ పేపర్లను మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కవ పేపర్లు ప్రాక్టీస్ చేయ్యడం ద్వారా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7. చివరి భాగం విజయమే. కాంపిటేటివ్ పరీక్షలలో ఈ ఏడూ సూత్రాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూపాటించాలి. ఇలా పాటించి అతితక్కువ సమయంలోనే అంటే 50 రోజులల్లోనే మీరు ఈ ప్రణాళికను పట్టుదలతో చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే కొంత కాంపీటేటివ్కు ఎన్ని గంటలు చదవాలని కొంతమంది అడుగుతుంటారు. మీకు సబ్జేక్ట్పై పట్టులేకుండా ఎన్ని గంటలు చదివినా అది వృధా అవుతుంది. కాబట్టి ఎన్ని గంటలు చదవాలి అనేది ముఖ్యం కాదు. చదివిన కొద్ది పేపు సబ్జెక్ట్‌పై పట్టు వచ్చేలా చదవాలి. కాబట్టి పై సుత్రాలను పాటిస్టూ నిబద్ధతతో చదివితే మీరు కోరుకున్న ప్రభుత్వం మీ సొంతం అవుతుంది. ఇక త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అంతేగాక ఇదే సిలబస్ కూడా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, యూపీఎస్సీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ పరీక్షలకైనా మీరు పాటించాల్సిన సిద్దాంతాలు మాత్రమే ఇవే. పై 7 సూత్రాలను పాటిస్తూ చదివితే కాంపీటేటివ్లో తప్పకుండా విజయం సాధిస్తారు. చదువు అనేది ఎవరిసొత్తు కాదు, అది పేదవాడైన, ధనవంతుడైన ఒకేలాగా చదవాలి. కష్టపడితే తప్పకుండ విజయం వస్తుంది. విజయంసాదించాలి అంటే మొదటమనకు కావాల్సింది ఏంటంటే హార్డ్‌వర్క్. ఎవరూ కష్టపడుతారో వాళ్లదే తప్పని సరిగా విజయం అవుతుంది. చాలామంది విజయం ఏవిధంగా సాదించాలి? ఏ కోచింగ్ సెంటర్లలో చేరాలి.. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏమి చెయ్యాలి అని సందేహంలో ఉంటారు. అలాంటి వారికి సమాధానం అచీవర్స్ అకాడమీ మీ సందేహాలను తీర్చి మీమ్మల్ని కాంపిటేటివ్లో మందడుగు వేసేలా చేస్తుంది. అచీవర్స్ అకాడమీ ఆఫ్‌లైన్, ఆన్లైన్లోను క్లాస్‌లు నిర్వహిస్తోంది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలలోని వారికి కూడా అందుబాటులో ఉంచేందుకు అతి తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా సెంట్రల్ స్థాయిలోని ప్రముఖులచే క్లాస్‌లు చెప్పించడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు ఆలస్యం చేయకుండా అచీవర్స్ అకాడమీ చేరీ మీ ప్రభుత్వం ఉద్యోగం కలను నెరవేర్చుకోండి. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
జనగామ అర్బన్ : పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, గ్రూపు–4 పోటీ పరీక్షల కోసం అర్హులైన వారికి 60 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీసీపీ మల్లారెడ్డి, డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ, పోలీస్‌శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘వారధి’ సంస్థ కరీంనగర్ సహకారంతో సుమారు 400 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను సదరు సంస్థ భరిస్తుందని తెలిపారు. శిక్షణార్థులకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థల ప్రతినిధులు తరగతులు బోధిస్తారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఆయా మండలాల్లోని పోలీస్ స్టేషన్‌న్లలో ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని తమ పేర్లను నమోదు చేసుకుని, వెంటనే అర్హత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ పొందవచ్చునని తెలిపారు. అదేవిధంగా వీఆర్వో, గ్రూపు–4 పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని చాకలి అయిలమ్మ జిల్లా సమాఖ్యలో ఈనెల 22 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి కోరారు. ఈనెల 24న యశ్వాంతాపూర్ గ్రామ శివారులోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం కానిస్టేబుల్స్ అభ్యర్థులకు, మధ్యాహ్నం వీఆర్వో, గ్రూపు–4 అభ్యర్థులకు అర్హత పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు కూడా ఉచిత శిక్షణ అని అనుకోవద్దని, ప్రమాణాలు పాటించి నిష్ణాతులైన వారిచే బోధించనున్న తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే పీహెచ్సీ (వికలాంగ) అభ్యర్థులకు వసతి కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో మాలతి, ఏసీపీ బాపురెడ్డి, డీఆర్డీఓ కార్యాలయ అధికారి రాజేంద్రప్రసాద్, ఈజీఎస్ ప్రతినిధులు, ఆయా మండలాల పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
కశింకోట (అనకాపల్లి): ఏపీ బాలయోగి గురుకుల కళాశాలల్లో ఇంటర్మీ డియట్ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఆసక్తి గల వారికి పబ్లిక్ పరీక్షల అనంతరం ఎంసెట్, నీట్, బిట్స్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త ఆర్.డి.వి.చంద్రశేఖర్ వెల్ల ్లడించారు. తాళ్లపాలెం ఏపీ బాలయోగి బాలికల గురుకుల కళాశాలలో బుధవారం సాయంత్రం మాట్లాడారు. పరీక్షల అనంతరం స్వల్ప కాలికంగా 40 రోజులపాటు ఆయా పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నామని, ఇందుకు జిల్లాలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజును భరిస్తుందన్నారు. గురుకులంలో చదివిన విద్యార్థులు ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందడానికి కేరీర్ గైడెన్స్ ఇస్తున్నామన్నారు. జిల్లాలోని 11 బాల బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి వర్చువల్ తరగతులను కూడా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రారంభిస్తామన్నారు. దీనివల్ల ఆన్లైన్ ద్వారా విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి, అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8,9,10 తరగతులకు వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తాళ్లపాలెంతోపాటు రెండు గురుకులాల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో మూడు గురుకులాల్లో ఏర్పాటు చేయడానికి భవనాలు సమకూర్చి వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి అవకాశం కలుగుతుందన్నారు. టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముగిసిన రోబోటిక్ శిక్షణ కశింకోట మండలంలోని ఏపీ బాలయోగి గురుకులంలో మూడు రోజులపాటు జిల్లాలోని విద్యార్థులకు నిర్వహించిన రోబోటిక్ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు చంద్రశేఖరరావు ప్రతిభా ధ్రువపత్రాలను అందజేశారు. -
జనారణ్యం
కథ చంద్రశేఖర్ ఇండ్ల ‘‘జాగ్రత్తరోయ్ లక్ష రూపాయలు తీసుకెల్తున్నావ్...’’ అంటూ ఇంకో అరగంట తిన్నాడు యజమాని. ఇంటికి వ్రేలాడదీసిన గుమ్మడికాయ పూర్తిగా కుళ్లిపోయి కంపు కొడుతోంది ఆ ఇంట్లో. చెట్లన్నీ మౌనం పాటిస్తున్నట్లు తలలు దించుకున్నాయ్, ఆ ఇంటిముందు. కోడి కుయ్యాల్సిన టైంలో కుక్కబోరున ఏడుస్తోంది, ఆ వీధిలో.ఆ అరుపుల అలారంతో కళ్ళు తెరిచాడు మోహన్. రక్తపుముద్దలా తూర్పున వేలాడుతున్నాడు సూర్యుడు, రాత్రి ఆయనది ఇరాక్‌లో డ్యూటీ అయ్యుంటుంది. మోహన్‌కి ఇంకొంచెం సేపు పడుకోవాలనుంది... కాని హైదరాబాద్ వెళ్ళాల్సిన పనుంది. అతను కుర్రోడేం కాదు నలభై ఆరేళ్ళ వయసుంది. హైదరాబాద్ పక్కనే కదా అనే తాత్సారమూ ఉంది. ఒళ్లిరుసుకున్నాడు, బాత్రూంకెళ్ళాడు, బయటకొచ్చి గబాగబా రెడీ అయ్యాడు. టీ పెట్టమని భార్యను లేపుదాం అనుకున్నాడు - లేపలేదు, మొదటిసారి. పక్కరూంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతున్న కొడుకు దగ్గరకు వెళ్ళాడు, ‘‘చదువుకుంటున్నావా’’ అన్నాడు, వెనుకనుంచి వెళ్లి కొడుకు తలమీద ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ. కొడుకు చిన్నోడేం కాదు ఇరవై నాలుగేళ్ల యువకుడు. ‘‘బ్యాంకుకు సంబంధించిన పోస్టులు పడ్డాయి నాన్నా, ఇప్పుడు కూడా మంచి ఇన్స్టిట్యూట్లో చేరకపోతే ఉద్యోగం రావడం కష్టం’’ అన్నాడు, ఆ కొత్త స్పర్శ తాలూకు భయంలోంచి, సందిగ్ధంలోంచి, అనుమానంలోంచి బయటకు రావడానికి. ‘‘రేపే చేరుదువు గాని, నేనూ మూడు నెలల నుంచి ఒక ప్లాటు పని మీద తిరుగుతున్నాను కదా, ఈ రోజు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్, మన కమీషన్ లక్ష రూపాయలు, మంచి కాలేజ్‌లో చేరుదువుగాన్లే చదువుకో’’ అంటూ ఆ రోజులో మొదటిసారి నవ్వాడు మోహన్. కొడుకుకి ఆ నవ్వు నచ్చింది.అమ్మను లేపుతానుండు అంటూ ఇంట్లోకెళ్లబోయాడు కొడుకు. ‘‘వద్దొద్దులే నిద్రపోనివ్వు. దాన్ని డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు? తలనొప్పి అని రాత్రంతా నిద్రపోలేదు పాపం’’ అన్నాడు బండిని స్టార్ట్ చేస్తూ. కానీ ఈ రోజు రాత్రి మోహన్ తన కుటుంబాన్నంతా డిస్టర్బ్ చెయ్యబోతున్నాడన్న విషయం ఈ కథ రాస్తున్న నాకు మాత్రమే తెలుసు. పోయొస్తా అనలేదు, ‘‘పోతున్న’’ అన్నాడు బండెక్కి కిక్క్ కొట్టి. డర్రర్ ర్ ర్... మని శబ్దం; కొడుకు గుండెల్లో, తల్లి చెవుల్లో. ఆ శబ్దం ఇంటి చుట్టూ ఆవరించివున్న నిశ్శబ్దంలో కలిసిపోయింది. ‘‘నేను ఎదురు రాకుండా కాలు బయటపెట్టడు, చెప్పకుండానే పోయాడేంటి మీ నాన్న’’ కొడుకు నడిగింది గబగబా బయటికొచ్చిన సులోచన, మొగుడు పోయిన రోడ్డునే చూస్తూ. జుయ్యియ్యి మని ఒక పేడ పురుగు కుళ్లిపోయిన గుమ్మడికాయ చుట్టూ తిరుగుతోంది. ఈగను వెంటాడుతున్న బల్లి ఒకటి మోహన్ ఫొటోపై కదలకుండా నుంచుంది సరిగ్గా తలమీద. హైదరాబాద్. పార్క్‌లో ఏదో అలికిడి అయినట్టుంటే లిప్పుల్లాకుల్లోంచి బయటకొచ్చిందో కుర్రజంట. ‘‘హ్యాపీ... బర్డే... టూ... యూ...’’ అన్నాడు, చెవి మీద ముద్దు పెడుతూ అమ్మాయితో. ‘‘థ్యాంక్స్’’ అంది ఇంకో ముద్దు ఎక్స్పెక్ట్ చేస్తూ. ‘‘కళ్ళు మూసుకో నీకో గిఫ్ట్ ఇస్తా’’ అన్నాడు బ్యాగు జిప్పు ఓపెన్ చేస్తూ. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకొని కళ్ళు మూసుకుంది, ఆ కళ్ళల్లో చీకటి దేనికైనా తెగించమంటుంది. తను అనుకున్నట్టే మొదట ముద్దు పెట్టాడు- వెంటనే ఆమె చేతిలో ఒక బాక్స్ పెట్టాడు. కళ్ళు తెరవమన్నాడు, తెరిచింది- కళ్ళని, ఆ బాక్స్‌ని. ‘‘సెల్ ఫోనా’’ గుండె జల్లు మంది ఆ పదహారేళ్ళ అమ్మాయికి. ‘‘నచ్చిందా’’ అన్నాడు. ‘‘నచ్చింది, కానీ మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు’’ ‘‘తెలిస్తేనే కదా చంపేసేది, పగలంతా నేను నీ పక్కనే కాలేజ్‌లో ఉంటాను కాబట్టి ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చెయ్, అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక స్విచ్ ఆన్ చెయ్. నువ్వు రింగివ్వు చాలు- నేను ఫోన్ చేస్తా, ముందు నువ్వే హలో అను తరువాతే నేను, ఎలా వుంది ప్లాను’’ అన్నాడు సెల్ఫోన్లో నంబరు ఫీడ్ చేస్తూ. అది విని స్వర్గంలో వున్న దేవదాసు, పార్వతి ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు, మనం ఈ కాలంలో పుడితే బాగుండేదని. సరిగ్గా ఆ పార్క్ దగ్గరకు వచ్చే సరికి మోహన్ని లారీ గుద్దింది, ముందు పళ్ళు ఊడిపోయాయి. నోటి నిండా రక్తం, కళ్ళు మూతలు పడుతున్నాయ్, బలవంతంగా కళ్ళు తెరిచాడు, కల... పగటి కల. గట్టిగా నిట్టూర్పు విడిచాడు బండి పక్కన పార్క్ చేస్తూ. సిగిరెట్ ముట్టించాడు. ‘ఈ రోజు అది ఎదురురాకపోయే సరికి ఏదోలా ఉంది’ అనుకున్నాడు. ఫోన్ చేసాడు కొడుక్కి. ఫోన్ కలవలేదు. ఏదీ కలవదు మనుషుల్ని కలవర పెట్టాలనుకున్నప్పుడు. ‘‘సరే బయలుదేరదాం’’ అంది సర్దుకుంటూ ఆ పదహారేళ్ళ యువతి. ‘‘అప్పుడే వెళ్తావా’’ అన్నాడు. ‘‘మనల్ని ఎవరో చూస్తున్నట్లుంది’’ అంది. ‘‘ఎవరూ’’ గుబురు పక్కకొచ్చి చూసాడు, సిగిరెట్ తాగుతున్న మోహన్ని. ‘‘అవునవును ఇంకో చోటికెళ్దాం పద’’ సలహా ఇచ్చాడు. ఇద్దరూ కదిలారు. ఆ అమ్మాయే మోహన్ చావుకు కారణమవుతుందన్న విషయం నాకు తెలుసు. పాపం మోహన్‌కు గాని ఆ అమ్మాయికి గాని ఆ విషయం తెలియకపోవడమే విధి. హైదరాబాద్‌లోనే మధ్యాహ్నం. రెండ్రోజులనుండి ఏడుస్తూనే ఉంది తను. ‘నవమాసాలు మోసి కనింది చంపడానికా’ తనను తనే ప్రశ్నించుకుంది, బక్కపలచని ఇరవై నాలుగేళ్ళ యువతి. ఇల్లంతా పేదరికపు కంపు. ‘‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ ముదనష్టపుది మూడోది’’ అన్నాడో మగాడు, ఆ యువతి మొగుడు, ఆ మూడురోజుల పసికందు పాలిట యముడు, స్వయానా తండ్రి. ‘‘నీకు దండం పెడతా వద్దు’’ అంది తను. ‘‘అయితే మిగతా ఇద్దర్ని కూడా తీసుకొని మీ ఇంటికి బయల్దేరు’’ అన్నాడు, ఆ చిన్న పిల్లల్ని మూడు వీర్యపు చుక్కల్లా చూస్తూ. చూస్తూ చూస్తూ పసికందును చంపలేదు- మొగుడ్ని కాదనుకొని బ్రతకలేదు, కొన్ని జీవితాలు అంతే అస్తవ్యస్తం. ఈ రాత్రే ఆ పసికందును ఒదులుకోవాలనుకుంది, పాపను గుండెలకు హత్తుకుంది, చివరి చూపు చూసింది, క్షమాపణ వేడుకుంది. ఆ కసాయి తండ్రికి తెలియదు తను చావదని, తనను కాపాడేవాడున్నాడని, తన చావును అతను తీసుకొని అమరుడవుతాడని. సరిగ్గా నేనిలా చెబుతున్నప్పుడే మధ్యాహ్నం హోటల్లో అన్నం తింటున్న మోహన్‌కి పొరబోయింది, ‘ఎవరో తలచుకుంటున్నట్లున్నారు’ అనుకొని నీళ్ళు తాగాడు. ఆ నీళ్ళ ధార గొంతులోకి జారుతోంది- సూర్యుడు కొండల్లోకి జారినట్టు. ఇంకెవరు తలచుకుంటారు మోహన్ని మృత్యువు కాక. హైదరాబాద్‌లోనే రాత్రయింది. ‘‘పెంటనా కొడుకులు పని చేయించుకునేటప్పుడు బాగానే చేయించుకుంటారు, డబ్బులివ్వబోయే సరికి తెగులు మొదలయ్యిద్ది’’ తిట్టుకుంటూ సెల్‌ఫోన్ తీసాడు మోహన్ ఇంటికి ఫోన్ చెయ్యడానికి, ఆలస్యమవుతుందని చెప్పడానికి. సెల్ స్విచ్చాఫ్, ఖర్మంటే అదే. ‘‘ఈ నా కొడుకులు బార్ లోంచి బయటకొచ్చేలోపు చాలా టైం అయ్యేలా ఉంది, ఇదంతా అది ఎదుర్రాకపోవడం వల్లే జరిగింది’’ అనుకుంటున్నప్పుడు అక్కడ సులోచన కూడా అదే అనుకుంటూ ఉండడం వారిద్దరి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. కరెక్టుగా రాత్రి 11:30కు లక్ష రూపాయలు అందాయి, కళ్ళలో నీళ్ళు తిరిగాయి మోహన్‌కి. గొంతెమ్మ కోరికలు గుర్తుకు రాలేదు, కొడుకు గుర్తొచ్చాడు. బార్ గుర్తుకురాలేదు, భార్య గుర్తొచ్చింది. మిడిల్ క్లాస్ మెంటాల్టీ. ‘ఇన్ని డబ్బులు చూస్తే గుండాగి చచ్చిద్ది’ అనుకున్నాడు, డబ్బులు లెక్కపెడుతూ తన భార్యను ఊహించుకుంటూ. ‘‘జాగ్రత్తరోయ్ లక్ష రూపాయలు తీసుకెళ్తున్నావ్, అసలే దొంగనాకొడుకులెక్కువ హైదరాబాద్‌లో’’ అంటూ ఇంకో అరగంట తిన్నాడు యజమాని. ‘మూడు నెలలు కష్టపడిన సొమ్ము, దొంగలపాలు కాకూడదు’ అనుకున్నాడు, డబ్బుని రెండు సగాలు చేశాడు, సగం లోపలి జేబులో, సగం బండి జేబులో పెట్టాడు, సగం పోతే సగమైనా మిగులుతాయని. మిడిల్ క్లాస్ ఐడియా. మోహన్‌కి తెలియదు ఆ డబ్బులు దొంగలు కన్నెత్తి కూడా చూడరని. అసలు దొంగలు అనే వాళ్ళే మోహన్‌కి ఎదురుకారని. హైదరాబాద్‌లోనే అర్ధరాత్రి. జనారణ్యమంతా దుప్పట్లో దూరి నిద్రపోతున్నట్టు నటిస్తోంది. మేమున్నాం నిద్రపొండంటూ పోలీస్ పెట్రోలింగ్ హారన్లు అభయం ఇస్తున్నట్లు మోగుతున్నాయ్. నిద్రొస్తదేమోనని రైలు సందడి చేసుకుంటూ పట్టాల మీద పరిగెడుతోంది. హైదరాబాద్ చివరి కాలనీ, దాటితే ఏడు కిలోమీటర్లలో మోహన్ ఇల్లు. క్షేమంగానే ఉన్నాడు మోహన్ ఆ పొత్తిగుడ్డల్లో చుట్టి దారిపక్కన పడేసివున్న మూడురోజుల పసికందు ఏడుపు విననంతవరకు. ఆ పసికందు, మగ అహంకారపు మాట విని కడుపుతీపిని చంపుకున్న తల్లి కూతురు. ఎవరి ప్రేమకూ నోచుకోని ఆ పిల్లను వీధికుక్క కళ్ళార్పకుండా చూస్తోంది. వదిలేసి వెళ్దామనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు, వద్దనుకుంటూనే బండాపాడు, చూసాడు, చేతుల్లోకి తీసుకున్నాడు. ‘నన్ను కాపాడే వాడొచ్చాడ్రా’ అనుకుందేమో ఆ పిల్ల ఏడుపాపింది. వీధి కుక్క కోపంగా చూస్తోంది ఇద్దర్నీ. చుట్టూ చూసాడు నిశ్శబ్దపు శ్మశానంలో సమాధుల్లా ఉన్నాయి ఇళ్లన్నీ అక్కడ. ఆ పాపెవరో ఆ ఇంటి వాళ్ళని అడుగుదాం అనుకున్నాడు. ఎదురుగా ఉన్న ఇంటిదగ్గరకు వెళ్ళాడు, తలుపుకొట్టాడు తియ్యలేదు, కాలింగ్‌బెల్ నొక్కాడు మోగలేదు. ఇంకో ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా ఆ ఇంటి మీదే, అర్ధరాత్రి అమ్మానాన్నకి తెలియకుండా, పార్క్‌లో బర్త్ డే గిఫ్టుగా ప్రియుడిచ్చిన ఫోన్లో మాట్లాడుతున్న పదహారేళ్ళ అమ్మాయి మోహన్ని చూసింది, భయపడింది. ‘‘దొంగా దొంగా’’ అని పెద్దగా అరిచింది. మోహన్‌కి దొంగెవరో అర్థంకాలేదు. ఆ అరుపులు విని, కడుపునిండా తిని హాయిగా పడుకునివున్న పెంపుడు కుక్క భౌభౌమని అరుస్తూ దాని డ్యూటీ అది చేసింది. ఈలోగా నలుగురు కుర్రాళ్ళు విక్కెట్లు, క్రికెట్ బ్యాట్లు తీసుకుని మోహన్ మీద పడ్డారు. అతడెవరో చెప్పనిస్తేగా! మోహన్ మూతి మీద వికెట్ దెబ్బ పడింది. పళ్ళు విరిగాయ్. రక్తం నోరంతా. ఇంకో దెబ్బ మోకాలి మీద, తలమీద. అరిచాడు, కూలబడ్డాడు. కొడుకు గుర్తొచ్చాడు, భార్య గుర్తొచ్చింది, ఈ విషయం తెలిస్తే అది గుండె పగిలి చచ్చిపోద్దీ అనుకున్నాడు. ఇదంతా అది ఎదుర్రాక పోవడం వల్లే అనుకున్నాడు, ఏడుపొచ్చింది, కన్నీళ్లు రాలేదు, రక్తం వచ్చింది చెవుల్లోంచి.మోహన్ని కొట్టద్దని కాబోలు మూడు రోజుల పసికందు గుక్కపట్టి ఏడ్చింది. ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా వున్న ముసలిదాన్ని చంపి బంగారం తీసుకెళ్ళిన కసాయివాడనుకొని, ఒంటరిగా వెళ్తున్న ఆడవాళ్ళ మెళ్ళో పుస్తెల తాడు తెంపుకెళ్ళే చైన్ స్నాచర్ అనుకొని, ఇళ్ళముందు నిలబెట్టున్న బండ్లను తీసుకెళ్ళే దొంగోడనుకొని... పోలీసులొచ్చారు చివర్లో- చనిపోయాడని నిర్ధారించడానికి. ‘‘ఏమయ్యా అతను దొంగోడైనా ఒక మనిషే కదంటయ్యా, కొట్టి చంపేశారు! ఏం మనుషులయ్యా బాబు మీరు అన్నాడు’’ ‘‘చచ్చిపోతాడనుకోలేదండి’’ గొణిగాడో కుర్రాడు గుంపులోంచి. అంతమంది హంతకుల మధ్య ఒక మానవత్వమున్న మనిషి చెయ్యని తప్పుకు నెత్తురు ముద్దలా మారిపోయినా, అతని కళ్ళు మాత్రం తెరుచుకొని తెల్లగా ప్రశాంతంగా జనాలు మర్చిపోయిన శాంతిని గుర్తుచేస్తూ. ఆ గుంపులో ఉన్న ఒక కుర్రాడు బండి కవర్లోవున్న యాభై వేలు తీసుకుని జేబులో దాచుకున్న విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇవేమీ తెలియని మూడు రోజుల పసికందు ప్రశాంతంగా నిద్రపోతోంది పోలీసు వ్యాన్‌లో. ఆ అమ్మాయే మోహన్ చావుకు కారణమవుతుందన్న విషయం నాకు తెలుసు. పాపం మోహన్‌కు గాని ఆ అమ్మాయికి గాని ఆ విషయం తెలియకపోవడమే విధి. -
వారసత్వ నగరంగా వారణాసి..
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ దేశాలు పర్యటించారు. బ్రిక్స్, ఐరాస సర్వసభ్య సమావేశం తదితర కీలక సదస్సుల్లో పాల్గొన్నారు. పలు దేశాలతో ముఖ్యమైన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం పోటీ పరీక్షల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రధాని పర్యటనలకు సంబంధించిన వివరాలను సంక్షిప్తంగా అందజేస్తున్నాం.. ప్రధాని విదేశీ పర్యటనలు భూటాన్: నరేంద్రమోడీ 2014 మే 26న భారత ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిపిన తొలి అధికారిక విదేశీ పర్యటన భూటాన్. ఆయన జూన్ 15, 16 తేదీల్లో భారత పొరుగు దేశమైన భూటాన్‌లో పర్యటించారు. ప్రధానితో పాటు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ కూడా భూటాన్ పర్యటించారు. నరేంద్రమోడీ తన తొలి పర్యటనకు భూటాన్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం పొరుగు దేశాలతో సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రపంచానికి తెలియజేయడం. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే భారత ప్రధానికి పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. భారత్ సహాయంతో నిర్మించిన సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని భూటాన్ రాజధాని థింపూలో నరేంద్రమోడీ ప్రారంభించారు. జూన్ 16న భూటాన్ పార్లమెంటు ఉభయసభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్, భూటాన్ ఉమ్మడి ప్రాజెక్టు అయిన 600 మెగావాట్ల కోలోంగ్చూ జల విద్యుత్ కేంద్రానికి మోడీ శంకుస్థాపన చేశారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్‌గ్వెల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ టోబ్గేతో భారత ప్రధాని సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. భూటాన్‌లో డిజిటల్ గ్రంథాలయాన్ని నెలకొల్పడానికి అవసరమైన సహాయం భారత్ చేస్తుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను నరేంద్ర మోడీ బీ2బీగా అభివర్ణించారు. బీ2బీ అంటే భారత్ టు భూటాన్ సంబంధాలు. బ్రెజిల్: జూలై 15, 16 తేదీల్లో బ్రెజిల్‌లోని ఫోర్తలేజా నగరంలో బ్రిక్స్ కూటమి ఆరో శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇది నరేంద్రమోడీకి రెండో విదేశీ పర్యటన, తొలి అంతర్జాతీయ సదస్సు. బ్రిక్స్ సదస్సులో నరేంద్రమోడీతోపాటు బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా పాల్గొన్నారు. ఈ సదస్సులో బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బ్యాంకు ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘై నగరంలో నెలకొల్పనున్నారు. ఈ బ్యాంకు తొలి అధ్యక్షుడు భారతీయుడై ఉంటాడు. పదవీకాలం ఆరేళ్లు. భారత్ తర్వాత అధ్యక్ష పదవి బ్రెజిల్, రష్యా దేశాలకు వరుసగా దక్కుతాయి. బ్యాంకు బోర్డ ఆఫ్ గవర్నర్ల తొలి అధ్యక్ష పదవి రష్యాకు లభించింది. బ్రిక్స్ దేశాల నాయకులు బ్యాంకుతో పాటు అత్యవసర నిల్వల వ్యవస్థ (కంటింజెంట్ రిజర్వ అరేంజ్మెంట్)ను 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ధ్రవ్యనిధుల్లో తక్షణ సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో విడిగా 80 నిమిషాలపాటు సమావేశమయ్యారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మోడీ సూచించారు. భారతదేశంలో మౌలికరంగంలో చైనా పెట్టుబడుల్ని భారత ప్రధాని ఆహ్వానించారు. కైలాస్ మానస సరోవర్ యాత్రకు మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలని మోడీ కోరారు. నవంబర్‌లో చైనాలో నిర్వహించనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) సదస్సుకు హాజరు కావాలని జీ జిన్‌పింగ్ మోడీని ఆహ్వానించారు. భారత్‌కు అపెక్‌లో సభ్యత్వం లేదు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)లోనూ భారత్ కీలకపాత్ర పోషించాలని చైనా అధ్యక్షుడు కోరారు. భారతదేశానికి ఈ సంస్థలో పరిశీలక హోదా మాత్రమే ఉన్పప్పటికీ అదనపు బాధ్యతలు స్వీకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఫోర్తలేజాలో బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం భారత ప్రధాని బ్రెజిల్ రాజధాని బ్రెజీలియా చేరుకున్నారు. అక్కడ బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రౌసెఫ్‌తో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు, ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకుగాను బ్రెజిల్ అధ్యక్షురాలిని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమెను భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. భారత్, బ్రెజిల్ దేశాల మధ్య పర్యావరణ, అంతరిక్ష రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. నేపాల్: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 3, 4 తేదీల్లో నేపాల్‌లో పర్యటించారు. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నేపాల్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. 1997లో అప్పటి ప్రధాని ఇంద్రకుమార్ గుజ్రాల్ నేపాల్‌లో పర్యటించారు. తన పర్యటనలో మోడీ నేపాల్ అధ్యక్షుడు రాంబరన్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలాతో సమావేశమయ్యారు. నేపాల్ పార్లమెంట్ రాజ్యాంగ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నేపాల్‌కు మనదేశం బిలియన్ డాలర్ల రుణసాయాన్ని అందజేస్తుందని ప్రకటించారు. నేపాల్‌లో భారత్ సహాయంతో నిర్మించ తలపెట్టిన పంచేశ్వర్ ప్రాజెక్టుకు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. నేపాల్ అభివృద్ధి కోసం మోడీ ‘హిట్ (ఏఐఖీ) ఫార్ములా’ను ప్రకటించారు. హిట్ అంటే హైవేస్, ఇన్ఫర్మేషన్ వేస్, ట్రాన్సమిషన్ వేస్. ఈ మూడింటి అభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని పశుపతినాథ ఆలయాన్ని మోడీ సందర్శించి పూజలు నిర్వహించారు. జపాన్: 2014 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 మధ్య ఐదురోజులపాటు భారత ప్రధాని జపాన్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. క్యోటో నగరం నుంచి తన పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యోటోలా వారణాసిని వారసత్వ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. క్యోటోలోని టోజీ బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని జపాన్ ప్రకటించింది. వీటిని మౌలిక వసతులు, స్మార్‌టసిటీలు, గంగానది ప్రక్షాళన తదితరాల కోసం ఉపయోగించనున్నారు. భారత్‌లో బుల్లెట్ ట్రెయిన్లను ప్రవేశ పెట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని జపాన్ అందిస్తుంది. దీంట్లో భాగంగా మొదటి బుల్లెట్ రైలును అహ్మదాబాద్, ముంబై నగరాల మధ్య ప్రవేశపెడ్తారు. రక్షణ, పరిశుభ్రమైన ఇంధనశక్తి, రహదారులు, ఆరోగ్యం, మహిళా సంక్షేమం.. మొత్తం ఐదు ఒప్పందాలపై జపాన్, భారత్ సంతకాలు చేశాయి. 1998లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత జపాన్ ఆరు సంస్థలపై నిషేధాన్ని విధించింది. మోడీ పర్యటన సందర్భంగా ఈ నిషేధాన్ని తొలగించారు. ఈ సంస్థల్లో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కూడా ఉంది. భారత్, జపాన్ మధ్య పౌర, అణు, సహకార ఒప్పందంపై చర్చలను వేగవంతం చేసి త్వరలో అణు ఒప్పందం కుదిరేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అమెరికా: భారత ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబరు 26 నుంచి 30 వరకు అయిదు రోజులపాటు అమెరికాలో పర్యటించారు. సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సహకారానికి పిలుపునిచ్చారు. మధ్య ఆసియాలో చెలరేగిపోతున్న ఉగ్రవాద సంస్థలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన ప్రసంగంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని మోడీ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఐక్యరాజ్యసమితి వచ్చే ఏడాదికి 70 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ అంతర్జాతీయ సంస్థలో సంస్కరణలు అత్యవసరమని మోడీ పేర్కొన్నారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స, చైనా దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉంది. ప్రపంచంలో వివిధ కూటములు ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. జీ-8, జీ-20 కూటములుగా కాకుండా జీ- ఆల్గా అన్నిదేశాలు కలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు. ఐరాస సర్వసభ్య సమావేశంలోనే ఆయన విడిగా సార్క దేశాధినేతలతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 28న న్యూయార్కలోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో సమావేశమైన 20,000 మందికి పైగా ప్రవాస భారతీయులనుద్దేశించి నరేంద్రమోడీ ప్రసంగించారు. భారత సంతతి వ్యక్తులకు (పర్సన్స ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) జీవితకాల వీసాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్‌యోజన, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సహకారాన్ని అందించాలని ప్రవాస భారతీయులు కోరారు. అంగారకయానం విజయవంతం కావడాన్ని ప్రస్తావించారు. సెప్టెబర్ 30న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల నేతల ద్వైపాక్షిక సమావేశం వాషింగ్టన్లో జరిగింది. ఇరు దేశాలు వివిధ రంగాల్లో సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. అణుఒప్పందం అమలులో ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలనే అంగీకారానికి వచ్చారు. లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా, హక్కానీ వంటి ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సంస్థలకు అందుతున్న ఆర్థిక, వ్యూహాత్మక సహాయాలను నిలిపివేసే దిశగా కృషి చేయాలని సంకల్పించారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్లపాటు పొడిగించాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు. బరాక్ ఒబామా, నరేంద్రమోడీ ‘చలే సాథ్ సాథ్’ అనే దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. మాదిరి ప్రశ్నలు 1. భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ జరిపిన తొలి విదేశీ పర్యటన? 1) నేపాల్ 2) బ్రెజిల్ 3) జపాన్ 4) భూటాన్ 2. జపాన్‌లోని ఏ నగరంలా వారణాసిని వారసత్వ నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు? 1) టోక్యో 2) క్యోటో 3) యొకోహోమా 4) ఒసాకా 3. భారత ప్రధాని 2014లో ఏ దేశంలో రెండు అధికారిక పర్యటనలు చేశారు? 1) భూటాన్ 2) జపాన్ 3) నేపాల్ 4) ఆస్ట్రేలియా 4. నరేంద్ర మోడీ ప్రసంగించిన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఏ దేశంలో ఉంది? 1) ఆస్ట్రేలియా 2) ఫిజీ 3) జపాన్ 4) అమెరికా 5. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీపీ) ప్రధాన కార్యాలయాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేస్తారు? 1) ఫోర్తలేజా 2) జొహన్నెస్బర్గ 3) షాంఘై 4) బీజింగ్ 6. కోలోంగ్చూ జలవిద్యుత్ కేంద్రానికి నరేంద్ర మోడీ ఏ దేశంలో శంకుస్థాపన చేశారు? 1) నేపాల్ 2) జపాన్ 3) భూటాన్ 4) శ్రీలంక 7. మహాత్మాగాంధీ కంచు విగ్రహాన్ని భారత ప్రధాని ఏ నగరంలో ఆవిష్కరించారు? 1) కాన్బెర్రా 2) బ్రిస్బేన్ 3) సిడ్నీ 4) కెయిర్న్స 8. ఏ దేశంలో నిర్వహించిన తూర్పు ఆసియా సదస్సులో నరేంద్ర మోడీ పాల్గొన్నారు? 1) సింగపూర్ 2) ఫిలిప్పైన్‌స 3) థాయిలాండ్ 4) మయన్మార్ 9. నరేంద్ర మోడీకి ముందు నేపాల్‌లో 1997లో పర్యటించిన భారత ప్రధాని? 1) దేవెగౌడ 2) అటల్ బిహారీ వాజ్‌పేయి 3) ఐ.కె. గుజ్రాల్ 4) విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 10. భారత్ ‘చలే సాథ్ సాథ్’ అనే దార్శనిక పత్రాన్ని ఏ దేశంతో కలిసి విడుదల చేసింది? 1) అమెరికా 2) జపాన్ 3) ఫిజీ 4) నేపాల్ సమాధానాలు 1) 4; 2) 2; 3) 3; 4) 4; 5) 3; 6) 3; 7) 2; 8) 4; 9) 3; 10) 1. ఎన్.విజయేందర్‌రెడ్డి సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. -
నిరుద్యోగులకు దశానిర్దేశం
కొత్తపేట(గుంటూరు) నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం(స్టడీ సర్కిల్) కృషి చేస్తోంది. వెనుకబడిన కులాలు, షెడ్యూలు కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థులకు వారి విద్యాభ్యాసం ముగిసిన తరువాత పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు మెరుగైన శిక్షణ అందిస్తోంది. 19 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవగాహన కల్పిస్తోంది. ఒక్కో ఉద్యోగానికి వెయ్యిమంది పోటీపడుతున్న ఈ తరుణంలో ఈ స్టడీ సర్కిల్ చేస్తున్న కృషి అభినందనీయం. ఇక్కడ 15 మంది అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు. రీజనింగ్, అర్ధమెటిక్, మాథ్స్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, కంప్యూటర్, మార్కెట్ రంగాలపై శిక్షణ ఇస్తున్నారు. ఎంసెట్, ఐసెట్, డీఈడీ, బీఈడీ, టీటీసీకు సంబంధించి ఇప్పటి వరకు 1,582 మంది శిక్షణ పొందారు. 3,720 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకోగా 539 మంది వివిధ ప్రభత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆధ్యాయన కేంద్రం డెరైక్టర్ సూర్యనారయణరావు తెలిపారు. వినడంతో పాటు ప్రాక్టీస్ చేయాలి.. శిక్షణ సమయంలో శ్రద్ధగా వినడంతోపాటు, ప్రాక్టీస్ తప్పనిసరిగా చేస్తే పోటీ పరీక్షలలో విజాయలను సొంతం చేసుకోవచ్చు. గతనెలలో జరిగిన బ్యాంక్ కోచింగ్ ఇక్కడే తీసుకున్నాను. ప్రస్తుతం ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) ఉద్యోగాలకు శిక్షణ తీసుకొంటున్నాను. - ఎం.గాయత్రి ఎంఏ బీఈడీ, అంకిరెడిపాలెం మెటీరియల్ అందజేస్తున్నారు.. మంచి శిక్షణతోపాటు ఇతర జిల్లా నుంచి మెటీరియల్ తెప్పించి అందజేస్తున్నారు. అంతేకాకుండా నెలకు రూ.750 స్టైఫండ్‌ను అందజేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు శిక్షణ తీసుకొంటున్నారు. - నరసింహారావు, డిగ్రీ, గుంటూరు -
ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ఎలా?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ఎలా చేయాలో తెలపండి. - పి.సుమ, సంతోష్‌నగర్ ఆర్బీఐ 506 అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రకటన విడుదల చేసింది. ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ www.rbi.org.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజుకు చివరి తేదీ ఆగస్టు 6 కాగా, ఆఫ్‌లైన్‌లో చివరి తేదీ ఆగస్టు 11. రాత పరీక్షను ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ నాలుగో వారంలో నిర్వహించనున్నారు. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ముందు అభ్యర్థి తన ఫొటోగ్రాఫ్, సంతకాన్ని స్కాన్ చేయించుకోవాలి. ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఈ-మెయిల్ ఐడీ ఉండాలి. పరీక్షకు సంబంధించిన వివరాలు, కాల్ లెటర్ తదితరాలను ఆర్బీఐ ఈ-మెయిల్ ద్వారానే అభ్యర్థులకు పంపుతుంది. ఆర్బీఐ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత‘రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్’ లింక్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్’ లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థి తనకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అందులో పొందుపరచాలి. అభ్యర్థి పేరు, తండ్రి/ భర్త పేరు, పుట్టినతేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, పరీక్ష కేంద్రం, విద్యార్హతలు లాంటి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. స్పెల్లింగ్ ఏ మాత్రం తేడా ఉన్నా అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం ఉంటుంది. అన్ని వివరాలు పొందుపరిచాక, ఒకసారి పూర్తిగా పరిశీలించుకొని ‘ఫైనల్ సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఈ బటన్‌పై క్లిక్ చేశాక ఎలాంటి మార్పులు చేయడానికి ఆస్కారం ఉండదు. ఆ తర్వాత స్క్రీన్‌పై రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ కనిపిస్తాయి. వాటిని రాసి పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌లను అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ల రూపంలోనూ తెలియజేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు ప్రతిని ప్రింటవుట్ తీసుకొని భద్రపరుచుకోవాలి. ఫీజుల చెల్లింపు: మాస్టర్/ వీసా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత ఒక ఇ-రిసీప్ట్ జనరేట్ అవుతుంది. అభ్యర్థులు దీన్ని ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష ఫీజును ఆఫ్‌లైన్ విధానంలో ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా చెల్లించవచ్చు. అవి: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసంపూర్తిగా నింపిన దరఖాస్తులు, ఫొటో, సంతకం సరిగాలేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం. ఇన్పుట్స్: ఎన్.విజయేందర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ జనరల్ నాల్డెజ్ -
చిలకలు వాలిన చెట్టు
పోటీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల్లా బాల్యం ఎప్పుడో దూరమైపోయింది. డాలర్ల వేటలో దాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా టైమ్ లేకపోయింది. మళ్లీ పిల్లల రూపంలో బాధ్యతొచ్చిపడితే గానీ.. తోటి పిల్లలతో పోటీపడి ఇసుక గూళ్లు కట్టిన జ్ఞాపకం, నాన్న డైరీ చింపి వాన నీటిలో కాగితపు పడవలతో పాటూ ఈదులాడిన స్మృతి.. సాయంత్రం పూట నాన్నమ్మ చేతి గోరుముద్దలు తింటూ ఆమె చేతిలోనే నిద్రపోయిన పసితనం.. ఒక్కసారిగా గిర్రుమని కళ్లముందరకొచ్చిపడతాయి. అవేవీ అందుబాటులో లేని ఈ జనరేషన్లో పిల్లలను ఆడించడమే కష్టమవుతోంది మోడరన్ పేరెంట్స్‌కి. అలాంటి వారి కోసమే ఈ ‘జింబోరీ’ స్కూల్. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ టెంపుల్ దగ్గరగా ఉన్న ఈ స్కూల్‌ను శని, ఆదివారాల్లో చూస్తే చిలకలు వాలిన చె ట్టులా ఉంటుంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు పసి పిల్లలైపోయే వీకెండ్ స్కూల్ జింబోరీ. ఆడుకోవడమెలాగో, పిల్లలకు అన్ని విషయాలపై అవగాహన కల్పించడమెలాగో.. ఆటల ద్వారా తల్లిదండ్రులకు చెబుతారిక్కడ. వారంలో ఐదురోజులు ఉద్యోగాలకు అంకితమైపోయిన తల్లిదండ్రులు శని, ఆదివారాల్లో తమ పిల్లలతో పాటే వచ్చి నేర్చుకుంటారు. పాలు పట్టడం దగ్గర నుంచి పిల్లల కోసం ప్రత్యేకంగా వంటలెలా చేయాలి, ఎలాంటి బట్టలు వేయాలి? ఎలాంటి బొమ్మలైతే బాగా ఆడుకుంటారు? పిల్లలకు ఆడుతూనే అన్నీ నేర్పించడం ఎలా? చదివించడమెలా? అనే అంశాలను నేర్పిస్తారు. కంఫర్ట్స్ కోసం పరుగులు పెడుతూ పిల్లల కోసం సమయం వెచ్చించలేకపోతున్న తల్లిదండ్రులకు పిల్లలతో అనుబంధం పెంచుకోవడమెలాగో చెబుతారు. ఇప్పటికే పిల్లలు ఉన్నట్టయితే తల్లిదండ్రులు ఆ పిల్లలను కూడా తీసుకొని ఫ్యామిలీగా కూడా క్లాసులకు అటెండ్ అవ్వొచ్చు. దీనివల్ల పెద్ద పిల్లలకు తమ చిట్టి చెల్లితోనో, తమ్ముడితోనో ఎలా మెలగాలి అనే విషయాలను కూడా చెబుతారు. ఈ యాక్టివిటీస్ అన్నీ ఆటలు, సంగీతం, కళల చుట్టూనే ఉంటాయి. ఇక ఇసుకగూళ్ల వంటి ఆటలు, మట్టితో సంబంధమున్న క్లేఆర్ట్ వంటి కళలు కూడా నేర్పిస్తారు. తమ సుతిమెత్తని చేతులతో అందమైన ఆకృతులు చేసిన పిల్లలకు బహుమతులు కూడా ఇస్తారు. ఇక వారం రోజులు పిల్లలకు కొత్తగా ఉండటం కోసం రోజుకోరకంగా రంగురంగు బొమ్మలతో గదులను తీర్చిదిద్దుతారు. ‘పిల్లల ఆలోచనలకు అనుగుణంగా వారి ఊహల ప్రపంచంలోకే వెళ్లి తల్లిదండ్రులు కూడా పిల్లలైపోయి ఆడుకోవాలన్నదే మా కాన్సెప్ట్. అలా తల్లిదండ్రుల సపోర్ట్, అనుబంధం ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. దానివల్ల పిల్లల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ యాక్టివిటీస్ ద్వారా తల్లిదండ్రులు తమ చిల్డ్రన్ ఎలా ఎదుగుతున్నారనే విషయాన్ని చాలా దగ్గరగా తెలుసుకోగలుగుతారు’ అంటున్నారు జింబోరీ మేనేజర్ నిఖిత. ..: శిరీష చల్లపల్లి -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గ్రూప్ 1,2, సివిల్స్
గ్రూప్ 1,2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో ఎన్నికల సంస్కరణల గురించిన ప్రశ్నలు వస్తున్నాయా? ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది? - ఎస్.శ్రీకాంత్, ఖైరతాబాద్ ‘భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు’ అనే అంశం ప్రతి పోటీ పరీక్షలోనూ కీలకమే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా సివిల్స్ అభ్యర్థులు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ రూపకల్పన, దాని విధులు, ఎన్నికల ప్రక్రియ, ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణలు, చేసిన రాజ్యాంగ సవరణలు లాంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు ఎన్నికల ప్రధాన అధికారికి సంబంధించిన కింది ప్రశ్నను పరిశీలించండి. ప్రశ్న: ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించేది?(సివిల్స్-1994) 1. రాష్ట్రపతి మాత్రమే 2. భారత ప్రధాన న్యాయమూర్తి 3. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా 4. పదవీకాలం ముగియక ముందే తొలగించే అవకాశం లేదు సమాధానం: 3 వివరణ: 324వ అధికరణ ప్రకారం భారత రాష్ర్టపతి నియమించే ఎన్నికల ప్రధాన అధికారిని తొలగించాలంటే పార్లమెంట్లో 2/3వ వంతు మెజార్టీతో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర కమిషనర్లను తొలగించే సందర్భంలో ప్రధాన కమిషనర్‌ను కొలీజియంగా సంప్రదించిన కేంద్ర క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు. అదే విధంగా పార్లమెంట్ సభ్యుల అనర్హతకు సంబంధించిన కింది ప్రశ్నను పరిశీలించండి. ప్రశ్న: పార్లమెంట్ సభ్యుల అనర్హతను నిర్ణయించేది?(సివిల్స్ - 1979) 1. ఎన్నికల కమిషనర్ 2.భారత పార్లమెంట్ 3. రాష్ర్టపతి 4. సుప్రీంకోర్టు సమాధానం: 3 రాజ్యాంగంలోని 103వ అధికరణ ప్రకారం పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం కేవలం రాష్ట్రపతికే ఉంటుంది. ఉదాహరణకు రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న జయాబచ్చన్‌ను అప్పటి రాష్ట్రపతి ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి అనర్హురాలిగా ప్రకటించారు. అందుకు కారణం... ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉండడంతో పాటు ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. అందుకుగాను ఆమె పదివేల రూపాయల గౌరవ వేతనంతో పాటు ఆ సంస్థ లక్నోలో కల్పించిన ఉచిత నివాస భవనాన్ని కూడా ఉపయోగించుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో భారత ఎన్నికల చరిత్రలో ఇంకేమైనా ఉన్నాయో పరిశీలించి ఆయా సంఘటనలన్నింటినీ క్రోడీకరించుకోవాలి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్నీ భిన్న కోణాల్లో అధ్యయనం చేయాలి. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, ఎన్నికల సంఘం వెబ్‌సైట్స్ ద్వారా సమకూర్చుకోవాలి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరమా? అవసరమైతే ఎలాంటి సంస్కరణలు చేపట్టాలి? వాటి వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి? లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా ఎన్నికల సంస్కరణల గురించి మరింత లోతైన అధ్యయనానికి కింది పుస్తకాలు ఉపయోగపడతాయి. 1.ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా - శాంతి భూషణ్ 2. జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఎలక్టోరల్ పాలిటిక్స్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ - ఎ.ఎల్. అహుజా 3. ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా - బి.వెంకటేష్ కుమార్ ఇన్పుట్స్: డాక్టర్ జి.ప్రభాకర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. ఎస్బీఐ పీఓ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలపండి? - బి.రాగసుధ, అల్వాల్ ఎస్బీఐ పీవో పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో సాధారణంగా కాంప్రహెన్షన్ టెస్ట్; కామన్ ఎర్రర్స్; ఫిల్లింగ్ ద బ్లాంక్స్; జంబుల్డ్ సెంటెన్స్; జంబుల్డ్ వర్డ్స్; స్పెల్లింగ్ ఎర్రర్స్; ఫ్రేజ్ మీనింగ్; ఫ్రేజ్ రీప్లేస్మెంట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. వీటిలో అధిక వెయిటేజీ అంటే దాదాపు 25 నుంచి 30 శాతం ప్రశ్నలు కాంప్రెహెన్షన్ నుంచే వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లిష్ విభాగంలో రాణించాలంటే గ్రామర్, వొకాబ్యులరీ మీద పట్టు తప్పనిసరి. స్పాటింగ్ ద ఎర్రర్స్ విభాగంలో విజయానికి గ్రామర్ నైపుణ్యమే మార్గం. సబ్జెక్ట్, వెర్బ్ ఒకదానికొకటి సమన్వయం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించేలా చదవాలి. గ్రామర్‌పై పట్టుకోసం నిరంతర అధ్యయనమే ప్రధాన ఆయుధం. స్పీడ్ రీడింగ్ కూడా ఇంగ్లిష్‌లో రాణించడానికి దోహదపడుతుంది. వేగం నిమిషానికి 200 నుంచి 250 పదాలు చదివే విధంగా ఉండాలి. అంతేకాకుండా డిస్క్రిప్టివ్ పరీక్షలో కూడా ఇంగ్లిష్‌కే పెద్దపీట వేశారు. ఇందులో లెటర్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, ఎస్సే రైటింగ్ వంటి అంశాలను చేర్చడం వల్ల ఇంగ్లిష్‌లో పూర్తి పట్టు సాధించడం తప్పనిసరి. ఇందుకోసం అభ్యర్థులు సెంటెన్స్ ఫార్మేషన్; వొకాబ్యులరీ; టెన్సెస్‌పై అవగాహన పొందాలి. రిఫరెన్స్ బుక్స్: ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ -హరిమోహన్ ప్రసాద్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ - ఎ.కె. కపూర్ ఇన్పుట్స్: కె.వి.జ్ఞానకుమార్, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్‌లో తెలుగు సాహిత్యం
సివిల్స్‌లో తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా తీసుకునే వాళ్లు అత్యధిక మార్కులు సాధించాలంటే ఏయే అంశాలను నేర్చుకోవాలి? రెఫరెన్స్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? - పి.అరవింద్ కుమార్, ఉప్పల్ పోటీ పరీక్షల్లో కెమిస్ట్రీ ప్రాధాన్యం ఎంత మేరకు ఉంటుంది? ఏయే పాఠ్యాంశాలు ముఖ్యమైనవి? - కె.స్పందన, అంబర్‌పేట తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంచుకున్న వాళ్లు అత్యధిక మార్కులు సాధించాలంటే వ్యాఖ్యానాలపై పట్టు పెంచుకోవాలి. ఎందుకంటే మొత్తం 250 మార్కుల్లో 100 మార్కులకు వ్యాఖ్యానాలు అడుగుతారు. ఈ మార్కులే అభ్యర్థి ర్యాంకును నిర్ణయిస్తాయి. కాబట్టి అభ్యర్థులు పేపర్-2లోని రసము, ధ్వని, వక్రోక్తి లాంటి సౌందర్య సంబంధ అంశాలను ఔపోసాన పట్టాలి. పాఠ్యగ్రంథాలను ప్రత్యక్షంగా చదివి ఉండడం అనివార్యం అని యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అభ్యర్థులు రాసిన వ్యాసరూప సమాధానాలు, వ్యాఖ్యానాల్లో పాఠ్య గ్రంథాలు చదివారనే విషయం ప్రతిబింబించాలి. పేపర్లో ప్రస్తుతం ఛాయిస్‌లు ఇవ్వడం లేదు. మారిన పేపర్ విధానంతో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. గత పరీక్షల్లో అడగని ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నారు. అభ్యర్థులు ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని అధ్యయనం కొనసాగించాలి. ఉదాహరణకు సోమిదమ్మ పాత్ర చిత్రణ(గుణనిధి కథ) గురించి 2012 సివిల్స్‌లో అడిగారు. ఈ ప్రశ్నను అప్పటి వరకు నిర్వహించిన ఏ పరీక్షలోనూ అడగలేదు. సిలబస్‌లో ఉన్న ఎనిమిది కాన్సెప్ట్‌ల్లో నాలుగు ప్రాచీన, నాలుగు ఆధునిక సాహిత్యానికి సంబంధించినవి. ఇవే కాకుండా మరో 5 నుంచి 6 కళాసౌందర్య అంశాలపై పట్టు సాధించాలి. పాఠ్యగ్రంథాలనే ప్రామాణికంగా తీసుకోవాలి. రిఫరెన్స్ పుస్తకాలు: 1. తెలుగు సాహిత్య సమీక్ష (రెండ సంపుటాలు) - జి.నాగయ్య 2. తెలుగు భాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి 3. తెలుగు భాషా చరిత్ర - వెలమల సిమ్మన్న ఇన్పుట్స్: డాక్టర్ పాతూరి నాగరాజు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ తెలుగు సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 లాంటి పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ విభాగంలో రసాయన శాస్త్రం ఒక ముఖ్యమైన విభాగం. గత నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే రసాయనశాస్త్రం నుంచి ఆరు నుంచి పది ప్రశ్నలు వస్తుండడాన్ని గమనించవచ్చు. వివిధ పాలీమర్లు, ఔషధాలు, పర్యావరణ రసాయనశాస్త్రం, ఆమ్లాలు-క్షారాలు, లోహశాస్త్రం, వివిధ మూలకాల ఉపయోగాలు, హానికర ప్రభావాలు, కేంద్రక రసాయన శాస్త్రం మొదలైన అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయనశాస్త్రం, వివిధ రసాయన పదార్థాల ఫార్మూలాలు వాటి ఉపయోగాలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటి అంశాలను రిపీటెడ్‌గా చదవాలి. ఈ పాఠ్యాంశాల్లోంచి ఇస్తున్న ప్రశ్నలను గమనిస్తే ఫండమెంటల్స్ పైనే ఎక్కువగా అడగడాన్ని మనం గమనించొచ్చు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుంది. ఇక మూడోది కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అంశాలతో ఇమిడి ఉన్న రసాయన శాస్త్రం. ఉదాహరణకు బాక్సైట్ మైనింగ్‌పై చర్చ జరుగుతున్నప్పుడు ఆ ధాతువు నుంచి సంగ్రహించే లోహం ఏది? అని అడిగారు. కాబట్టి హైస్కూల్ స్థాయి పాఠ్యపుస్తకాలతో పాటు పత్రికల్లో వచ్చే విషయ సంబంధిత వ్యాసాలు, సమకాలీన అంశాలకు సంబంధించిన అంశాలు దృష్టిలో ఉంచుకుని చదివితే రసాయన శాస్త్రంలోని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇన్పుట్స్: డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ, హన్మకొండ. -
పాఠశాలలో ఉచిత విద్య అమలు చేయాలా ?
SBI Pos, Clerks - Reasoning Statement and Assumptions Give Answer: 1. If only Assumption I is implicit 2. If only Assumption II is implicit 3. If Either Assumption I or Ass-umption II is implicit 4. If Neither Assumption I nor Ass-umption II is implicit 5. If Both Assumptions I and II are implicit 1. Statement: It is not always true that adoption of sophisticated technology increases production and efficiency. Assumptions: I. Adoption of sophisticated technology is not a difficult thing to achieve. II. Production and efficiency can be increased by getting rid of sophisticated technology. Ans: 4 2. Statement: The State government has asked the management of all the private schools to take consent of the parents before increasing the school fees. Assumptions: I. The management of majority of the private schools may call the parents for discussion regarding fee hike. II. Majority of the parents may not agree for any hike of school fees. Ans: 1 3. Statement: Local administration made elaborate security arrangement and alerted the local hospitals to be in readiness during the ensuring festival days. Assumptions: I. A very large number of devotees may assemble in the city during the festival days. II. Security personnel may not be able to control the crowd. Ans: 1 4. Statement: Some days you settle down peacefully with your morning coffee. Then you open the papers and the adrenaline picks in. Assumption: I. Coffee and papers are an integral part of the common man's life. II. On some days the papers carry sensational news. Ans: 2 5. Statement: "Traffic police will be provided with alcometers to identify drunken drivers"- Police Chief. Assumptions: I. So, Many accidents take place everyday because of drunken drivers. II. Alcometer is a machine which can identify the drunken persons easily. Ans: 5 Statement and Arguments Give answer: 1. If only Argument I is "Strong" 2. If only Argument II is "Strong" 3. If Either Argument I or II is "Strong" 4. If Neither Argument I nor II is "Strong" 5. If Both I and II are "Strong" 1. Statement: Should India send its troops to a foreign country, for constructive purpose, without a UN resolution. Arguments: I. Yes, it will bring accolades from all over the world and will strengthen the claim for candidature for permanent membership of the UN. II. No, India is already facing many troubles. Ans:1 Statement: Should the maintenance of all the roads in the big cities be handed over to private organisations against a fixed amount to be paid by the residents? Arguments: I. No, this is not all practicable. II. Yes, this practice is adopted in many foreign countries. Ans: 4 3. Statement: Should the sole evidence of rape victims be supposed enough to prove the guilt? Arguments: I. Yes, rape is a heinous offence II. No, the move will increase the chances of conviction innocent persons Ans: 3 4. Statement: Should MLAs and MPs be allowed to change parties? Arguments: I. Yes, every individual in democratic set up is free to leave or join any party any time. II. No, they should remain faithful to the party which nominated them as it's candidate. Ans: 5 5. Statement: Should India change its course from the economic reform process and look inward for all round economic development? Arguments: I. No, there is no way to look backward after having started the process. II. Yes, this will benefit India in the long run as the reform process borrowed from western countries will adver-sely affect our economy. Ans: 4 6. Statement: Should school education be made free in India? Arguments: I. Yes, this is the only way to improve the level of literacy. II. No, it would add to the already burden on the exchequer. Ans: 2 7. Statement: Should government close down loss making public sector enterprises? Arguments: I. No. all employees will lose their job, security and earning what would they do? II. Yes. In a competitive world the rule is 'survival of the fittest'. Ans: 1 8. Statement: Should import duty on all the electronic goods be dispensed with? Arguments: I. No. This will considerably reduce the income of the government and will adversely affect the development activities. II. No. The local manufacturers will not be able to complete with the foreign manufacturers, who are technologically for superior. Ans: 2 9. Statement: Should high chimneys be installed in industries? Arguments: I. Yes. It reduces pollution at ground level. II. No. It increases pollution in upper atmosphere. Ans: 1 10. Statement: Should new universities be established in India? Arguments: I. No. We have still not achieved the target for literacy. II. No. we will have to face the problem of unemployed but highly qualified people. Ans: 5 Statement - Course of Action 1. Statement: Many medical and engineering graduates are taking up jobs in administrative services and in Banks. Course of Action: I. All the professionals should be advised to refrain from taking up such jobs. II. The Government should app-oint a committee to find out the reasons for these professionals taking up such jobs and to suggest remedial measures. Ans: 2 2. Statement: Mr. X, an active member of the union, often insults his superiors in the office with his rude behaviour. Course of Acton: I. He should be transferred to some other department. II. The matter should be referred to the union. Ans: 4 3. Statement: Some serious blunders were detected in the accounts section of a factory. Course of Acton: I. An efficient team of auditors should be appointed to check the accounts. II. A show cause notice should be issued to all the employees involved in the irregularity. Ans: 5 4. Statement: Four districts in state a have been experiencing severe drought for the last three years resulting into exodus of people from these districts. Course of Action: I. The government should immediately start food for work program in the district to put a halt to the Exodus. II. The government should make effort to provide drinking /potable water to these districts. Ans: 5 5. Statement: Majority of the students in many schools do not pass in the final examination. Course of Action: I. These schools should be closed down as these have become unproductive. II. The teachers of these schools should immediately be retrenched. Ans: 4 6. Statement: Many sports persons today are more attracted by the glamour than by the sport they pursue. Course of Action: I. Sports persons should not be permitted to act as model or band ambassadors. II. Sports persons should be paid higher compensation for their achievements in sport. Ans: 4 7. Statement: Indian Airlines is running in loss. Course of Action: I. It should be privatised. II. It must curb the expenditure by removing concessions in the fare to MPs, bureaucrats and airline officers. Ans: 2 8. Statement: People in the logically were agitated as more than thirty people died in a building collapse. Course of Action: I. Government should immediately announce compensations for the affected families. II. Authorities should take a stringent action against builders tending to compromise over quality of material used. Ans: 5