గ్రూప్– 2 పరీక్షలు వాయిదా వేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్న కోదండరామ్ తదితరులు
పంజగుట్ట: ఉద్యోగ, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇది సీఎంకు తగదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే దాదాపు 15 పేపర్లు లీక్ అయ్యాయని ధ్వజమెత్తారు. ఇప్పటికీ లీకేజీ అసలు బాధ్యులను గుర్తించలేదన్నారు. ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారు కాబట్టే విషయాన్ని బయటకు రాకుండా చూస్తున్నారని ఆరోపించారు.
శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యార్థులు, పలు పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ‘గ్రూప్ 2 వాయుదాకై నిరుద్యోగుల విన్నపం’ పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్, బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ గురుకుల టీచర్ల పరీక్షల నిర్వహణలోనూ లోపాలున్నాయన్నారు. దీనివల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు ఆదివారం వరకు వేచి ఉండి అప్పటికీ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే అన్ని లైబ్రరీల్లో, యూనివర్సిటీల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment