దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిన చేతి వృత్తుల, కుల వృత్తులపై బతికే బీసీల అభ్యు న్నతే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం ఉంది. దేశా నికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లకు పైగా గడిచిపోయాయి. అయినా బీసీలు, ఎంబీసీలు తమకు న్యాయమైన వాటా దక్కాలనిఇంకా పోరాటం చేస్తూ ఉండాల్సి రావడం నిజంగా బాధా కరం. వారు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అట్ట డుగున ఉండడం మన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోడానికి ముందుకు రావడం కొంత ఆశాజనక అంశమే. అయితే అవి తమ చిత్త శుద్ధిని అమలులో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా; విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన... బీసీ లకు ఆ యా రంగాలలో సరైన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘బీసీ డెడికేటెడ్ కమిషన్’ నివే దిక ఇవ్వాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా వారిసంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పదవుల్లో 33 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమే. దానితో పాటుగా బీసీ లను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం గొర్రెల పంపిణీ చేయడం, చేపల పెంపకానికి కృషి చేయడం, నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం, వందల సంఖ్యలో కొత్తగా బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ‘జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్’ను అందించడం, బీసీ కులాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేయడం... వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డిలో బీసీ వర్గాలకు చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యతో డిక్లరేషన్ ఇప్పించింది. ఆ డిక్లరేషన్‌కు కట్టుబడి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కూడా ఎన్నో విమర్శలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఎందుకంటే సర్వే పత్రాలు రోడ్లపై ప్రత్యక్షమవుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి బీసీల జనాభా లెక్కలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ కానీ, కాంగ్రెస్ పార్టీగా తాను తెలంగాణ ప్రజ లకు ఇచ్చిన హామీలను కానీ చిత్తశుద్ధితో అమలు చేయాలంటే అధికారంలో ఉన్న వారికి బడుగుల పట్ల ప్రేమ ఉండాలి. ఎన్నికల నినాదాలు ప్రభుత్వ విధానా లుగా మారాలి. హడావిడిగా జనాభా లెక్కలను సేకరించి చేతులు దులుపుకొనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయ కూడదు.
రాజకీయ అధికారంతో సామాజిక, ఆర్థిక అసమా నతలు తొలగిపోతాయన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీలకు, వారి ఉప కులా లకు రాజకీయ అధికారంలో జనాభా నిష్పత్తి ప్రకారం వాటాను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు ఉండా లని డిమాండ్ చేస్తున్నాం.
కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు జరుగు తున్న, జరిగిన బీసీ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉదాహరణగా తీసుకొని, అదే స్థాయిలో రాష్ట్రంలో బీసీలకు రాజకీయ వాటా దక్కే విధంగా రిజర్వే షన్లను ఖరారు చేసి అమలు చేయాలి. ఒక నెల కాల పరి మితికే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ స్వల్ప సమయం సరిపోకపోవచ్చు. బీసీ, బీసీ ఉప కులాల్లో కచ్చితమైన జనాభా గణాంకాలను వెలికి తీయడానికి కమిషన్‌కు కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ కాలపరిమితిని మరికొంత కాలం పాటు పొడిగించి, బీసీ కులాల కచ్చితమైన డేటా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి.
డెడికేటెడ్ కమిషన్ కూడా అంతే చిత్తశుద్ధితో సమగ్రంగా అధ్యయనం చేసి ఎటువంటి లోపాలకూ తావు లేకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా తమ నివేది కను ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు సరైన న్యాయం జరగాలనే ఆకాంక్ష, చిత్తశుద్ధిని వ్యక్తం చేస్తూ డెడికేటెడ్ కమిషన్‌కు ‘తెలంగాణ జాగృతి సంస్థ’ తరఫున నివేదికను అందజేశాం.
అన్ని కులాలు, తరగతులు, వర్గాలకు మధ్య ఉన్న తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామా జిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వా లను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రాతినిధ్యం లేని, లేదా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వివిధ కులాలకు, తరగతులకు అవకాశాలు కల్పించేందుకు అనేక మార్పులను, చర్యలను ప్రభుత్వాలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.
తమ శ్రమను, మేధస్సును మానవ నాగరికతా వికా సానికి ధారపోసిన కులవృత్తుల వారు స్వాతంత్య్ర ఫలాల్లో సమవాటా పొందాలి. ఈ సమాజ నిర్మాణానికి తమ రక్త మాంసాలను కరిగించి వందల వేల సంవత్సరాలుగారంగులద్దిన చేతి వృత్తుల వారికి ఇప్పటికైనా చట్ట సభల్లో గళమెత్తే అవకాశం కల్పించాలి. ఊరికి నాలుగు దిక్కులా మన తాత ముత్తాతల కథాగానం చేసిన సంచార జాతులు కనీసం పంచాయతీ వార్డు మెంబర్ అయినా కాలేకపోతే స్వరాజ్యానికి అర్థమేముంది? ఇకనైనా మార్పు రావాలి.
-కల్వకుంట్ల కవిత వ్యాసకర్త ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment