మరో వెన్నుపోటు | Chandrababu Naidu Backstabbing To The Backward Classes | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మరో వెన్నుపోటు

Published Wed, Nov 27 2024 10:21 AM | Last Updated on Wed, Nov 27 2024 2:42 PM

Chandrababu Naidu Backstabbing To The Backward Classes

సాక్షి, విజయవాడ: వెనుకబడిన వర్గాలకు టీడీపీ మరో వెన్నుపోటు పొడిచింది. ముగ్గురు బీసీ రాజ్యసభ సభ్యులు చేత చంద్రబాబు రాజీనామా చేయించారు. రాజ్యసభ అభ్యర్థులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, డిసెంబర్ 20న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, ఆర్‌. కృష్ణయ్య రాజీనామా చేయించగా.. మోపిదేవి, ఆర్‌. కృష్ణయ్యలకు ఆ స్థానాలు ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయించింది.

డీల్ కుదుర్చుకున్న బీద మస్తాన్‌రావుకి మాత్రమే టీడీపీ రెన్యూవల్ చేయనుంది. మోపిదేవి, ఆర్ కృష్ణయ్య స్థానాలు బాగా డబ్బున్న వారికే ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. టీడీపీ రాజ్యసభ రేస్‌లో సానా సతీష్, గల్లా జయదేవ్, కిలారు రాజేష్, కంభంపాటి రామ్మోహన్, లింగమనేని రమేష్‌లు పోటీ పడుతుండగా, మూడు స్థానాల్లో ఒక రాజ్యసభ కోసం బీజేపీ పట్టుబడుతోంది.

ఇదీ చదవండి: టీడీపీలో పదవుల నైరాశ్యం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement