న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు నిర్ణయించడం ప్రమాదకరమైన బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్‌సీలు, ఎస్‌టీల్లో ఉప వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా అనే అంశంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ధర్మాసనం..అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందజేసే క్రమంలో రాష్ట్రాలు ఇతరులను వదిలేయరాదని తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు సజాతీయ సమూహాలు అయినందున వీరిలో వెనుకబడిన, బలహీన కులాలకు కోటా కోసం వారిని మళ్లీ వర్గీకరించలేమంటూ 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment