‘బొజ్జా తారకం సేవలు మరువలేనివి’
Published Tue, Sep 20 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
నిర్మల్ టౌన్ : బొజ్జా తారకం సేవలు మరువలేనివని పలువురు నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని టీఎన్జీవో సంఘ భవనంలో మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బొజ్జాతారకం మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులపై ఆయన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తన కలంతో దళితులను చైతన్యవంతులను చేశారని పేర్కొన్నారు.
ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన బొజ్జాతారకం మనలో లేకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన మతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. టీఎన్జీవో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, అమర్‌నాథ్‌రెడ్డి, దళిత సంఘాల నాయకులు డి. రాములు, బొడ్డు లక్ష్మణ్, జగన్‌మోహన్, అంబకంటి ముత్తన్న, ప్రభాకర్, వై. సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement