చిన్న రాష్ట్రాలతోనే బడుగులకు రాజ్యాధికారం
Published Wed, Aug 28 2013 6:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
ఎన్జీవోస్ కాలనీ: చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం లభిస్తుం దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సమ్య్యైవాదం పేరిట సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం బూటకమని, తెలంగాణ ప్రజలది న్యాయబద్ధమైన పోరాటమని తెలిపారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాదిగ పా ల్గొని మాట్లాడారు. సమైక్యాంధ్రతో పేద ప్ర జలకు ఒరిగేది ఏమీ లేదని చెప్పారు.
సీమాం ధ్రలో ఉంటున్న పేదలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఇప్పటి వరకు చూసి ఉండరని, అదే అక్కడి పెట్టుబడిదారులు విమానంలో గంట లో వచ్చి వెళ్తుంటారని తెలిపారు. సీమాంధ్రలోని పేదలు, మాదిగలు సమైక్యాంధ్రను కోరుకోవడంలేదని, ఈ విషయం అక్కడి నేతలకు కూడా తెలుసని చెప్పారు. ఎమ్మార్పీఎస్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఎప్పటినుంచో కోరుకుంటుందని, దీనిపై 2001లో హన్మకొండలో జరిగిన మహాసభలో ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు. సోమవారం రాత్రి జరిగిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో సమీక్ష, చర్చ జరిపామని, తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల ఏర్పాటు కావాలని సభ్యులందరం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఎమ్మార్పీఎస్ ఆయనకు మద్దతు తెలిపి అండగా నిలిచిందన్నారు. సీమాంధ్ర ప్రజలు ఆందోళనలు విరమించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుపై కేం ద్ర ప్రభుత్వం వేసిన అంటోని కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబందించిన కమిటీ మాత్రమేనని, దానిని తాము కలిసేది లేదని చెప్పారు. ముంబయిలో మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక లైంగిక దాడి జరుగడం అమానుషమన్నారు.
అమ్మాయిలు, వివాహిత మహిళలపై జరుగుతున్న అరచాకాలను అరికట్టేం దుకు ప్రభుత్వం మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాయలసీమకు చెందిన దండు వీరయ్య, సీమాంధ్రకు చెందిన బ్రహ్మయ్య మాట్లాడు తూ తాము ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కోరుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యాతాకుల భాస్క ర్, పెద్దాడి ప్రకాశ్‌రావు, జెన్ని రమణ య్య, కోళ్ల వెంకటస్వామి, మన్మథరావు, మంద కుమార్, తిప్పారపు లక్ష్మణ్, పుట్ట రవి, బొడ్డు దయాకర్, నకిరకంటి యాకయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement