
సాక్షి, తూర్పు గోదావరి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బీసీల మనస్సుల్లో ఎప్పటికీ స్థానం సంపాదించలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. వెనుకబడిన తరగతులకు ఇవ్వాల్సింది పార్టీ పదవులు కాదని తెలిపిన ఆయన బాబు అధికారంలో ఉండగా ఎప్పుడైనా పేదలైన బీసీలను రాజ్యసభకు పంపిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10% అయినా ఇవ్వగలిగారా అని నిలదీశారు. వివిధ నామినేటెట్ పదవులలో బడుగు బలహీలన వర్గాలకు 50% రిజర్వేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని ప్రశంసించారు. (‘అమిత్ షా సానుకూలంగా స్పందించారు’)
‘ఇన్నాళ్ళు పల్లకి మోసే పనులు మాకు(బీసీలకు) పల్లకిలో కూర్చునేది మీరు. అందువల్లే ఇవాళ ప్రజలు టీడీపీని చీదరించుకున్నారు. ఒకేసారి బీసీలమైన నన్ను, మోపిదేవిని సీఎం జగన్ దేశంలోనే అత్యున్నతమైన రాజ్యసభకు పంపించారు. ఏపీలో బీసీ, ఎస్సీల సంక్షేమం కోసం రూ.42 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎంజగన్‌ది. బడ్జెట్‌లో మాకు ముఖ్యమంత్రి 20% నిధులు కేటాయించారంటే దేశంలోనే అది ఆల్ టైం రికార్డ్. చంద్రబాబుపైకి ఒక మాట చెబుతారు. లోపల భోజనం పెట్టేటప్పుడు దూరంగా గెంటేయడం వంటి పాలన చంద్రబాబు అందించారు. సీఎం జగన్ తన ఏడాది పాలనలో చెప్పినవి.. చెప్పని హామీలను అమలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అర్హులు కారని చంద్రబాబు అప్పటి న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు. అదేనా బీసీపై మీకు ఉన్న ప్రేమ. నమ్మినంతా కాలం బబీసీలు మిమ్మల్ని నమ్మారు. ఇక భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మే పరిస్ధితి లేదు’. అని తేల్చి చెప్పారు. (భారానికి, అధికారానికి తేడా తెలియదా?)
Comments
Please login to add a commentAdd a comment