ఊరూరా స్పష్టమైన మార్పు.. నాడు–నేడుతో స్కూళ్లు కళకళ
రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకేలు, అండగా రైతు భరోసా
ధైర్యాన్నిస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీ, మద్దతు ధర, నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు
సచివాలయ, వలంటీర్ వ్యవస్థతో ఉన్న ఊళ్లోనే చకచకా పనులు
ఆరోగ్య శ్రీ, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌తో ఆరోగ్యానికి కొండంత అండ
చేయూత, ఆసరాతో సొంత కాళ్లపై నిలబడ్డ మహిళలు
పేదల చదువులకు ధైర్యాన్నిస్తున్న అమ్మ ఒడి,గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియం
కళ్లెదుటే పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణంతో తీర ప్రాంతంలో విస్తారంగా ఉపాధి
టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు, మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్‌లు క్యూ
వివిధ రంగాల అభివృద్ధితో గత 59 నెలల్లో 58.22 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి
రాష్ట్రంలో గత ఐదేళ్లలో 5.3 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గిన నిరుద్యోగం
దేశంలో సులభతర వాణిజ్యంలో ఏటా నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న రాష్ట్రం
బాబు హయాంలో 11.77 శాతం ఉన్న పేదరికం ఇప్పుడు 4.19 శాతానికి తగ్గుముఖం
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ, నీతి ఆయోగ్ నివేదికలే ఇందుకు సాక్ష్యం
చంద్రబాబు అధోగతిపాలు చేసిన రాష్ట్రాన్నితన సుపరిపాలనతో పునరి్నరి్మస్తున్న సీఎం జగన్
ఐదేళ్లూ అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడి చంద్రబాబు సర్కార్ అధోగతిపాలు చేసిన రాష్ట్రాన్ని.. గత 59 నెలలుగా విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు.. సుపరిపాలనతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ, నీతి ఆయోగ్ నివేదికలే అందుకు నిదర్శనం.
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాల పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు దారిద్య్రం నుంచి బయట పడుతున్నారు.
రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు సర్కార్ హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. రాష్ట్ర తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,51,173లు ఉంటే.. సీఎం జగన్ హయాంలో 2022–23 నాటికి రూ.2,19,518కు పెరిగింది. కేంద్రం జీడీపీలో రాష్ట వాటా చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో 4.82 శాతానికి పెరిగింది.
సీఎంజగన్ అధికారంలోకి వచి్చనప్పటి నుంచి సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఎగుమతుల్లో రాష్ట్రం చంద్రబాబు హయాంలో తొమ్మిదో స్థానంలో నిలిస్తే.. సీఎం జగన్ హయాంలో ఐదో స్థానానికి చేరుకుంది. పరిశ్రమల స్థాపన కోసం చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు వస్తే.. సీఎం జగన్ హయాంలో ఏటా సగటున రూ.14,896 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎంఎస్‌ఎంఈలు చంద్రబాబు హయాంలో 1.9 లక్షలు ఉంటే.. సీఎం జగన్ హయాంలో ఏడు లక్షలకు చేరుకున్నాయి.
పాపారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతుండటంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. రాష్ట్రంలో పీఎఫ్ ఖాతాలు చంద్రబాబు హయాంలో 44.85 లక్షలు ఉంటే.. సీఎం జగన్ హయాంలో 2022–23 నాటికి 60.73 లక్షలకు పెరిగాయి. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉంటే.. ఇప్పుడు అది 4.2 శాతానికి తగ్గింది.
రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన సీఎం జగన్ విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. దాంతో వ్యవసాయాభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోంది. దేశంలో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17–18 శాతం ఉంటే.. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 36 శాతం ఉంది. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరాకు ఏటా సగటున రూ.8,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఉచిత పంటల బీమా, ఆర్బీకేలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని నీతి ఆయోగ్ అభినందించింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజ గ్రూపులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. అచ్యుతాపురం వద్ద జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్, అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, లారస్ ల్యాబ్, విజయనగరంలో శారదా మెటల్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బలభద్రపురంలోగ్రాసిమ్ ఇండస్ట్రీస్, కాకినాడలో లూఫిస్ ఫార్మా, గుంటూరు జిల్లాలో ఐటీసీ స్పైసెస్ పార్కు, పిడుగురాళ్ల వద్ద శ్రీ సిమెంట్స్, నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ, క్రిభ్‌కో ఇథనాల్, గ్రీన్‌ల్యామ్ సొల్యూషన్స్, గోకుల్ ఆగ్రో ప్రారంభం అయ్యాయి. చిత్తూరులో బ్లూస్టార్, డైకిన్, హావెల్స్, యాంబర్, ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్స్, టీసీఎల్, వైఎస్సార్ జిల్లాలో డిక్సన్, సెంచురీ ప్లైవుడ్స్, బిర్లా గార్మెంట్స్, కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ వంటి భారీ పెట్టుబడులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment