Dharamana prasada rao
-
వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం జగన్ తప్ప ఎవ్వరూ ఇవ్వలేదు
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్రం తర్వాత వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం జగన్ తప్ప మరెవ్వరూ ఇవ్వలేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం సీఎం జగన్ వల్ల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం అనంతరం ఈమేరకు మాట్లాడారు. 'ఈరోజు పేదరిక నిర్ములన కోసం సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన ఓట్ల కోసం కాదు మార్పు కోసం పని చేస్తున్నారు. పాలన లో అవినీతి ని నిర్ములించిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. విద్య, వైద్యంలో మార్పులు గొప్ప విప్లవం. జగన్ బటన్ నొక్కుతున్నారని కొందరు హాస్యంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ బటన్ వల్లనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమం అందుతోంది.' అని ధర్మాన అన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. -
మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు అన్నారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయని అధికారులు వివరించారు. డిసెంబర్-2022 వరకూ జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం. ఏపీలో వసూళ్లు 26.2 శాతం. తెలంగాణ(17.3శాతం), తమిళనాడు(24.9 శాతం), గుజరాత్(20.2శాతం) కన్నా మెరుగైన వసూళ్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు 2022 జనవరి నాటికి రూ. 26,360.28కోట్లు ఉంటే, 2023 జనవరి నాటికి రూ. 28,181.86 కోట్లు వసూళ్లు వచ్చాయని, గత ఏడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు. జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆదాయాలను కలిపిచూస్తే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ. 46,231 కోట్లు కాగా, రూ.43,206.03 కోట్లకు చేరుకున్నామని, దాదాపు 94శాతం లక్ష్యాన్ని సాధించినట్టుగా అధికారులు వెల్లడించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నాయని, విధానాలను సరళీకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. డేటా అనలిటిక్స్ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నాయన్న అధికారులు.. సిబ్బందికి శిక్షణ, వారి సమర్థతను మెరుగుపరుచుకుంటున్నామని తెలిపారు. టాక్స్ అసెస్మెంట్ను ఆటోమేటిక్ పద్ధతుల్లో అందించే వ్యవస్థను నిర్మించుకున్నామని, దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందిస్తున్నామని, డివిజన్ స్ధాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్ యూనిట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు పారదర్శకత పద్ధతులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్న సీఎం జగన్, తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు. గనులు-ఖనిజ శాఖలో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ రూ.3,649 కోట్ల ఆర్జన కాగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరు శాతం చేరుకున్నామని అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి రూ.2,220 కోట్ల ఆర్జన. నిర్దేశించుకున్న రూ.5వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంటామని, ఆపరేషన్‌లో లేని గనులను ఆపరేషన్లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యంగా రూ. 3,852.93 కోట్లు కాగా, రూ.3,657.89 కోట్లకు చేరుకున్నామని అధికారులు తెలిపారు. కోవిడ్ లాంటి పరిస్థితులు పూర్తిగా పోయి... పరిస్థితులు నెమ్మదిగా గాడిలో పడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, మూడు దశల్లో విక్రయానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామని అధికారుల వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి(ఎక్సైజ్ శాఖ) కె నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్‌రెడ్డి, అటవీపర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గనులు భూగర్భశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, రవాణాశాఖ కమిషనర్ పి ఎస్ ఆర్ ఆంజనేయలు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ ఎం గిరిజా శంకర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపి అటవీ అభివృద్ధి సంస్ధ సీజీఎం ఎం రేవతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ రామకృష్ణ, ఏపీ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డి, గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా?
-
ఆయన సభలకు మాత్రం ప్రజలు రావడం లేదు : ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో సునామీ సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జనవరి రెండో వారం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బలమైన పార్టీగా వైఎస్సార్సీపీ ఎదుగుతోందని... ఇటీవల వచ్చిన ఆరు సర్వేల్లో పార్టీ గెలుస్తుందని వచ్చిన నివేదికలే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందన్న ధర్మాన... ఎంత మంది అధికారులను రంగంలోకి దింపినా సీఎం చంద్రబాబు నాయుడు సభలకు మాత్రం ప్రజలు రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.... ఏపీలో శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అని సర్వేలు చెబుతున్నా చంద్రబాబు మాత్రం జిల్లాను పట్టించుకోవడం లేదని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులకు చంద్రబాబు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. దేశం మొత్తం తిరిగి రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయాయని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు... రాష్ట్ర ప్రజల బాగోగులను గాలికొదిలేశారని మండిపడ్డారు. రాజధాని భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియనివ్వకుండా చేయడం కోసం రహస్యంగా జీవోలు తీసుకువస్తున్నారని.. అయినా ప్రజలు బాబు ఎత్తుగడలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. మాకు ఆ అవసరం లేదు చంద్రబాబు ఆగడాలను అరికట్టాలంటే ప్రజలకు వైఎస్సార్సీపీ అండ అవసరం... కాబట్టి ఈసారి జల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే తెలంగాణ ఎన్నికలలో ఈసారి తాము పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమకు టీఆర్ఎస్ పార్టీ అవసరం ఉండదని..ప్రజలను దోపిడీ చేస్తున్న వారికే అనైతిక పొత్తుల అవసరం ఉంటుందని ఎద్దేవా చేశారు. -
కుట్ర కోణం దిశగా విచారణ జరగడం లేదు
-
కుట్రకోణం దిశగా విచారణ జరగడం లేదు: ధర్మాన
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన విచారణ కుట్రకోణ దిశగా జరగడం లేదని వైఎస్సార్పీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించేందుకు గురువారం వైస్సార్సీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై దాడి ఘటన అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించామన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గవర్నర్ డీజీపీతో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. హత్యాయత్నం జరిగిన అరగంటలోపే డీజీపీ తన అభిప్రాయాన్ని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం, డీజీపీల తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. హత్యాయత్నం వెనుక కుట్రదారులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. హత్యాయత్న ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ చేయాలని గవర్నర్‌ను కోరామని ధర్మాన తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు జరిపించండి -
రాజీనామాలు చేయకుంటే టీడీపీని క్షమించరు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు టీడీపీ కలిసిరావాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మాన మాట్లాడుతూ.. 2014 లో రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఏపీకి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హీమీలు అమలు చేయలేదన్నారు. బీజేపీ, టీడీపీలు నాలుగేళ్లుగా అధికారం పంచుకుని హామీలను విస్మరించారని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల తీరును హెచ్చరిస్తూ వైఎస్ఆర్సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తుంది. ఇటీవల కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఐదుగురు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలలో వీరోచిత పోరాటం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన మేరకు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి . ఆమరణ దీక్షలు ప్రారంభించారు. ఏడాది క్రితమే మా అధినేత ఈ నిర్ణయాన్ని ప్రకటించాంరని ధర్మాన గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, తన మంత్రి వర్గ సభ్యులు మసిపూసి మారడి కాయ చేస్తున్నారని విమర్శించారు. అంతేకాక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మేరకు ఎంపీలు రాజీనామా చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఆ ఐదుగురు ఎంపీలు ఆంధ్రులకు ప్రతినిధులు అయితే టీడీపీ ఎంపీలు ఈ విషయంలో ముందుకు రావడం లేదన్నారు. సంప్రదింపులకు, మభ్యపెట్టడానికి ఇది సమయం కాదు. రాజీనామాలు చేయటమే మన ముందున్నకర్తవ్యం. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది. మొత్తం 25 మంది ఏపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. ఢిల్లీలో రహస్య మంతనాలు తప్ప.. ఏపీ ప్రజల ఆకాంక్షను వివరించలేకపోయారు. ఇంకా అఖిలపక్షాన్ని పిలుస్తామని మభ్యపెట్టడం సరికాదు. చంద్రబాబు అవినీతిపై విచారణ జరుగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దోబుచులాటతో కాలయాపన చేయకండి’. అని ధర్మాన టీడీపీపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు పొరపాటును ఒప్పుకుని తన ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రాజీనామాలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని దోషులుగా నిలబెడతారని ఆయన హెచ్చరించారు. మన మందరం కలిసి బీజేపీపై పోరాటం చేద్దామని ధర్మాన పిలుపునిచ్చారు. -
వారిపై అనర్హత వేటు తప్పదు : ధర్మాన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేందరిపై చట్టప్రకారం అనర్హత వేటు తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం 2003లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేసిన విషయాన్ని గుర్తుకు చేశారు. ఆ చట్టప్రకారం పార్టీ ఫిరాయించినా ఎమ్మెల్యేందరిపై చర్యలు తప్పవన్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థలో విద్యార్థుల డిపాజిట్లు రూ.740 కోట్లు ఉన్నాయని అలాంటి విద్యాసంస్థలను చైతన్య సంస్ధలకు అప్పగించడం సరికాదన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ధర్మాన డిమాండ్ చేశారు. -
అధిష్టానానికి నివేదిక
వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు ధర్మాన సాక్షి, విశాఖపట్నం : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై క్రియాశీలకంగా పనిచేసిన వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకే సమీక్ష సమావేశం నిర్వహించినట్టు వైఎస్సార్ సీపీ నేత, త్రిసభ్య కమిటీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. వీటిపై ఓ నివేదిక రూపొందించి, పార్టీ అధిష్టానానికి విన్నవించనున్నట్టు వెల్లడించారు. వ్యవస్థాపరంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులపై విష ప్రచారమెక్కువగా జరిగిందన్నాన్నారు. కొత్త రాష్ట్రం, రాజధాని నిర్మాణంలో టీడీపీ అభూత కల్పనలతో మోసపుచ్చిందన్నారు. రైతు రుణ మాఫీ హామీ పనిచేసిందని అభిప్రాయపడ్డారు. విశాఖలో ఉత్తర భారత దేశానికి చెందినవారు ఓటర్లుగా భారీ స్థాయిలో ఉన్నారు. వారంతా మోడీవైపు మొగ్గు చూపారన్నారు. లోక్‌సభ ఎన్నికలతో కలిపి కాకుండా కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే నిర్వహించి ఉంటే ఫలితాలు ఆశాజనకంగా ఉండేవని ఎక్కువ మంది నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడినట్టు ధర్మాన తెలిపారు. సమావేశంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, వంశీకృష్ణ శ్రీనివాస్, తైనాల విజయ్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, కంపా హనోకు, పక్కి దివాకర్, గుడిమెట్ల రవిరెడ్డి, జోగినాయుడు పాల్గొన్నారు.