చంద్రబాబు పాలనలో ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా? అని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే.. చంద్రబాబు బీసీలను దూషించారని గుర్తు చేశారు. ఏలూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని ధర్మాన స్పష్టం చేశారు.