YSRCP BC Conference
-
రాష్ట్ర నలుమూలల నుంచి మహాసభకు హాజరవుతున్న బీసీలు
-
‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు’
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరని మరోసారి నిరూపించారు. బీసీని అయిన నన్ను ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్సీని చేశారు నన్ను. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసే బాధ్యత ఇచ్చారు. బీసీలను ఆదుకోవడానికి ఏం చేయాలో అధ్యయనం చేయమన్నారు. బీసీలకు ఎవ్వరూ ఇవ్వనటువంటి డిక్లరేషన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారు. అంతేకాదు బీసీ గర్జనలోనే వైఎస్సార్ సీపీకి వచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీని ఇచ్చారు. ఇది బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.’ అని అన్నారు. నామినేషన్ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ముస్తఫా, ఆదిమూలం సురేష్, మేక ప్రతాప్ అప్పారావు, కంబల జోగులు, రక్షణ నిధి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జంకే వెంకట రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీల వరపుత్రుడు వైఎస్ జగన్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అద్భుత ఆలోచనలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల వరపుత్రుడిగా మారిపోయారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రలో ఆయన చూసిన సమస్యలను గుండెలో పెట్టుకుని కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికే ఈ మహత్తర ఆలోచన చేశారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి బీసీ డిక్లరేషన్ దేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేదని, జగన్ సీఎం అయిన తర్వాత దీన్ని అమల్లోకి తీసుకొచ్చాక అన్ని రాష్ట్రాల ప్రజలు ఇలాంటి బీసీ డిక్లరేషన్ కావాలని అడుగుతారన్నారు. ఏలూరులో బీసీ డిక్లరేషన్ సభ తర్వాత రాష్ట్రంలో పండగ వాతావారణం కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏటా రూ.15వేల కోట్లు నిధులు ఇస్తామనడం అభినందనీయమన్నారు. సీఎం అయిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తాననడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. బీసీలకు ఉద్యో గ, ఉపాధి అవకాశాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న హామీ ఓ సాహసోపేతమైన నిర్ణయమన్నా రు. దుస్తుల నుంచి తినే తిండి, ఉండే ఇళ్ల వరకు ఏది కావాలన్నా దానిలో బీసీల పాత్రే ఉంటుందని, అలాంటి వారికి సమాజంలో అందరితో సమానంగా ప్రాధాన్యత కల్పించాలనే పెద్దపీట వేశారని తెలి పారు. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు శా శ్వత ప్రాతిపదికన కమిషన్ వేసి సుప్రీంకోర్టు న్యా యమూర్తిని నియమిస్తామని చెప్పడం సంతోషదాయకమన్నారు. తెలంగాణలో ఓబీసీలో కొనసాగుతున్న బీసీ కులాలను యథా విధిగా బీసీల్లో కొనసాగించాలని కేసీఆర్‌ను కోరుతామని చెప్పడం కూ డా తమకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. చిరువ్యాపారులకు, కులవృత్తిదారులకు గుర్తింపుకార్డులిచ్చి ఏటా పెట్టుబడి రుణాలిస్తామనడం జగన్‌లో ఉన్న మంచిపాలనా చతురతకు నిదర్శనమన్నారు. నా మినేటెడ్ పనుల్లో 50 శాతం బీసీలకే ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం కూడా ఆనందం కలిగించిందన్నారు. అన్నదాత సుఖీభవా అంటూ రైతు రుణమాఫీయే ఇప్పటివరకు సర్కారు పూర్తిచేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్లు మాత్రమే వారికి కావాలి.. చంద్రబాబునాయుడు బీసీల ఓట్లు వేయించుకుని వదిలేయడం తప్ప సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోలేదని గుర్తు చేశారు. నిత్యం సభలు, సమావేశాల్లో తాను బీసీల పక్షపాతినని చెప్పుకోవడమే తప్ప చేసిన పనులేవీ లేవని దుయ్యబట్టారు. వైఎస్సార్ నిరుపేదలు చదువుకో వాలని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే చంద్రబాబు మాత్రం ఆ ఫీజులు చెల్లించడానికి కూ డా ఒప్పుకోవడం లేదని అన్నారు. జగన్ ప్రకటిం చిన బీసీల డిక్లరేషన్‌పై టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని, చేతనైతే బీసీలకు న్యాయం చేయాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అనేక చోట్ల పునాది రాళ్లు వేసేస్తే ఓట్లు పడవన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. సమావేశంలో సురంగి మోహనరావు, బొనిగి రమణమూర్తి, మార్పు ధర్మారావు, చల్లా రవికుమార్, పాలిశెట్టి మధుబాబు, మార్పు మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు అండ
సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ : బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదు..మన జాతికి వెన్నెముక కులాలు’ ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టుగానే డిక్లరేషన్‌లో బీసీ ఉపకులాలన్నింటికీ పెద్ద పీట వేశారు. అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయింపులపై స్పష్టత బీసీల అభ్యున్నతికి దోహదపడే విధంగా డిక్లరేషన్ ఉందని అభివర్ణిస్తున్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా అమలు చేస్తారని, బడుగుల జీవితాలను మార్చుతారని ఆశిస్తున్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బీసీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. ఆయన మరణానంతరం బీసీల్ని పట్టించుకునే నాయకుడు కరువయ్యారు. వైఎస్సార్ ఉన్నంత కాలం కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా ఫీజు రియింబర్స్‌మెంట్, అందరికీ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, కార్పొరేషన్ రుణాలు...ఇలా అన్ని రకాలుగా బీసీలను ఆదుకున్న ఘనత వైఎస్‌కే దక్కిందని...ఆ తర్వాత పాలకులు గాలికొదిలేశారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో బీసీలను ఆదుకునేందుకు మళ్లీ వైఎస్ వారసత్వంగా, వారి ఆశయ సాధన దిశగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి సమగ్ర అధ్యయనం చేసి, కులాల వారీగా ఆదుకునేందుకు దోహదపడేలా డిక్లరేషన్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక...దాదాపు ఐదేళ్లుగా అధికారంలో ఉండి బీసీలకు ఇచ్చిన 119 హామీల్లో ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయకుండా ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను కాపీ కొడుతూ, వాటినే తమ హామీలుగా చెప్పుకోవడాన్ని బీసీ వర్గాలు తప్పు పడుతున్నాయి. 40 ఏళ్ల అనుభవం గల నాయకుడికి సొంత ఆలోచనలు రాలేదంటే బీసీలపై ఆయనకు చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతుందని బీసీలు చెబుతున్నారు. జిల్లాలో 19 నియోజక వర్గాల్లోనూ బీసీల ప్రభావం ఉంది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు విషయంలో చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో బీసీలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మళ్లీ పలు హామీలు ఇచ్చినా బీసీలు నమ్మడం లేదు. మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తారన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్‌పై నమ్మకం పెట్టుకున్నారు. దీంతో బీసీలు వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తున్నారు. కార్పొరేషన్లతోఎంతో ప్రయోజనం వెనుకబడిన తరగతుల వారిని ఆదుకోవాలంటే వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఉండాలన్న ఉద్దేశంతో బీసీ వర్గంలోని 139 కులాలకు కార్పొరేషన్లు ప్రకటించారు. కేవలం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వదిలేయడమే కాకుండా సమృద్ధిగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. వీరందరికీ న్యాయం చేయాలన్న ఆశయంతో బీసీలకు ప్రతి ఏడాది రూ.15 వేల కోట్లు ఖర్చుపెట్టాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు బీసీల కోసం కేటాయిస్తున్నారు. దీంతో జిల్లాలో ఉన్న 32 లక్షల బీసీలు లబ్ధి పొందనున్నారు. 8 లక్షల మందిబీసీ విద్యార్థులకు ఊరట బీసీ విద్యార్థుల ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ జగన్ ప్రకటించారు. దీనివల్ల ఐఏఎస్, ఐపీఎస్ ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంసీఎ, ఎంబీఎ తదితర ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంది. దాదాపు ప్రభుత్వమే వారి చదువుల బాధ్యత తీసుకున్నట్టు అవుతుంది. అంతటితో ఆగకుండా హాస్టల్లో చదివే విద్యార్థులకు ఏటా రూ. 20వేలు మెస్ చార్జీల కింద కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వైఎస్ జగన్ ప్రకటించడంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. వైఎస్ జగన్ ప్రకటనతో జిల్లాలో 8 లక్షల మంది బీసీ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. డెయిరీలకుపాలు పోస్తే రూ.4 అదనం డెయిరీలకు పాలు పోసే పాడి రైతులకు మంచి రోజులు రానున్నాయి. ఒక్కో లీటర్‌కి అదనంగా రూ.4 ఇవ్వనున్నట్టు జగన్ ప్రకటించారు. జిల్లాలో రైతులు 6 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో 6 లక్షల 47 వేలు పాడి గేదెలు , 4 లక్షల 56 వేల పాడి ఆవులున్నాయి. వాటి ద్వారా రోజుకి 32 లక్షల 87 వేల 670 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 16 లక్షల 43 వేల 835 లీటర్ల మేర డెయిరీలకు పాలు పోస్తున్నారు. ఈ లెక్కన రోజుకి 66 లక్షల చొప్పున నెలకి రూ.20 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుంది. ‘వైఎస్సార్చేయూత’తోమహిళలకు ఊరట :కుల వృత్తిని చేపడితేనే పూట గడిచే పరిస్థితిబీసీ మహిళలది. ఈ పరిస్థితుల్లో మహిళలకు ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు అందిస్తే తప్ప స్వావలంబన సాధించ లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి మహిళకు రూ.75 వేలు చొప్పున, నాలుగు విడతలుగా అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించడంతో వారి కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. -
వైఎస్ జగన్ నిర్ణయం చరిత్రాత్మకం : బొత్స
సాక్షి, విశాఖపట్నం : సంచార కులాల పిల్లల కోసం రెసెడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం చరిత్రాత్మకమని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బీసీల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా తమ అధినేత అన్నివర్గాల ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారని, బీసీల జీవన ప్రమాణలు పెంచే దిశగా డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్ ఉందన్నారు. బీసీలంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు.. భారత్ కల్చరని జగన్ చెప్పారని, ఈ డిక్లరేషన్‌పై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు ఇప్పుడు బీసీ సబ్‌ప్లాన్ పెట్టారని, ఎంత బడ్జెట్ కేటాయించారో కూడా చెప్పలేదన్నారు. పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని జగన్ చెప్పారని, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించేలా చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అన్నిరకాలుగా బీసీలకు మేలు జరిగిందని తెలిపారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలను ఎవరు నమ్మొద్దని, వచ్చే ఎన్నికల్లో తగిన బద్ధి చెప్పాలని బొత్స పిలుపునిచ్చారు. -
చంద్రబాబు అలా అంటే జనం నవ్వుతారు..
సాక్షి, నెల్లూరు : బీసీ గర్జనతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సభ గ్రాండ్ సక్సెస్‌తో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి లోనై ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. సభకు జనం రాలేదని, అట్టర్ ఫ్లాఫ్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అలా అంటే జనాలు నవ్వుతారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు మద్దతుగా బీసీలంతా సిద్ధంగా ఉన్నారని, 2019లో జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయితేనే టీడీపీ హయాంలో దగాపడ్డ బీసీ సోదరులంతా లాభపడుతారన్నారు. గత 40 ఏళ్లుగా టీడీపీ.. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదన్నారు. వారి జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదని మండిపడ్డారు. ఐదేళ్లలో కేవలం రూ. 18వేల కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు బీసీలను మోసం చేశారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బీసీల స్థితిగతులను మారుస్తామని, ఏడాదికి రూ.15 వేల కోట్ల చొప్పున మొత్తం ఐదేళ్లలో రూ. 75వేల కోట్లను బీసీల సంక్షేమానికి ఖర్చు చేస్తామని నిన్నటి సభలో తమ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారని తెలిపారు. బీసీల్లోని ప్రతికులంతో రాజకీయం చేసిన టీడీపీ గత ఐదేళ్లలో ఏ ఒక్క కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేయలేదని, కానీ జగన్ అధికారంలోకి వస్తే 139 ఉపకులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారని గుర్తు చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, అధికారంలోకి రాగానే ఈ పథకానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారనీ, జడ్జిలుగా బీసీలు పనికి రారని లేఖలు రాశారన్నారు. నామినేటడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే అవకాశం కల్పించేలా చట్టబద్దత చేస్తామని, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. చదవండి: బీసీ జీవితాలను మార్చే వరాల వెల్లువ -
చంద్రబాబు అలా అంటే జనం నవ్వుతారు..
-
నాడు మాట ఇచ్చారు.. నేడు మాట నిలబెట్టుకున్నారు..
-
బీసీలకు భరోసా
బీసీల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ఆనందంతో ఉప్పొంగాయి. తమ కుటుంబాలకు కొండంత అండ దొరికిందని సంబరపడ్డాయి. బిడ్డల చదువుకు ఢోకా ఉండదని సంతోషం వ్యక్తం చేశాయి. ఏలూరు వేదికగా ఆదివారం జరిగిన బీసీ గర్జన సభలో ప్రతిపక్ష నేత వైఎస్జగన్మోహన్రెడ్డి సామాజికంగా వెనుకబడిన బీసీ వర్గాల కోసంకీలక ప్రకటన చేశారు. వారి భవిష్యత్‌కు, సంక్షేమానికి బాటలువేశారు. సమసమాజ స్థాపనతో ఆదర్శంగా ఉంటానని చాటిచెప్పారు.ఆయన ప్రకటన కొండంత భరోసానిస్తోంది. బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమ డిమాండ్లు, ఆకాంక్షలు నెరవేరే రోజులు దగ్గరపడ్డాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమిదీ బీసీల అభ్యున్నతికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటిం చిన వరాలతో వారిపట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలుపుతోంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న ప్రతి బీసీ మహిళకు రూ. 75 వేలు, ఉన్నత చదువులకు అవసరమయ్యే ప్రతి రూపాయి ప్రభుత్వమే భరించే పథకం, హాస్ట ల్ విద్యార్థులకు మెస్ చార్జీల కింద ఏడాదికి రూ. 20వేలు, పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి రూ. 15 వేలు తదితర పథకాలతో బీసీల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోనున్నారు. – డీఎన్ ఏలుమలై,వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్రప్రధాన కార్యదర్శి, పుత్తూరు) బీసీలకు మహర్దశ బీసీల అభ్యున్నతికి గతంలో ఎవరూ తీసుకోని సాహసోపేత నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. సభలో ప్రకటించిన హామీలన్నీ నెరవేర్చితే బీసీలకు మహర్దశ ఖాయం. సన్నిధి గొల్ల పదవిని శాశ్వతంగా గొల్లలకే కేటాయిం చాలనే హామీ అభినందనీయం. –టి.గోపాల్, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం చట్టబద్ధత అభినందనీయం బీసీల్లోని అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి చట్టబద్థత కల్పిస్తామని చె ప్పడం అభినందనీయం. బీసీల్లో కొందరికే సంక్షేమ ఫలాలు అందేటివి. జగన్ హామీలతో ప్రతి కులానికి సంక్షేమం జరుగుతుంది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.7 లక్షలు చనిపోయిన వారి కుటుం బానికి అందజేస్తామనడం అభినందనీయం. –వడ్లతంగాల్ బాలాజీ ప్రసాద్,వన్నెకుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షుడు వినూత్నంగా అభివృద్ధి బీసీ డిక్లరేషన్ ద్వారా జగన్మోహన్రెడ్డికి బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై ఉన్న ప్రత్యేక చొరవ తేటతెల్లమైంది. గత ప్రభుత్వాలు ఏవీ చేయనన్ని అభివృద్ధి పథకాలు వినూత్నంగా తీసుకొస్తారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తాం.వెంకటరమణ,కామాటంపల్లె, పీలేరు. మనోధైర్యం కలిగించారు బీసీలకు జగన్ డిక్లరేషన్ ఇస్తామనడం ద్వారా మ నోధైర్యం కలిగింది. నావి ునేటడ్ పదవుల్లో, కాం ట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. ప్రతి బహుజను డు జగన్‌కు రుణపడి ఉంటాడు. అలాగే చట్టసభల్లో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం. –సంగీత,బీసీ సంక్షేమ సంఘం జిలా మహిళా అధ్యక్షురాలు బిడ్డల చదువులకు భరోసా.... మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో బీసీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా తయారయ్యారు. నిర్వీర్యమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తూ బీసీ పిల్లల చదువులకు ఉచితంగా విద్యను అందించడమే కాకుండా సంవత్సరానికి రూ.20 వేలు మెస్‌చార్జీల కింద ఇస్తాననడం ప్రతి ఒక్కరిలోనూ భరోసా నింపింది.– రేపన ముని,వైఎస్సార్ సీపీ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్థికాభివృద్ధికి హామీ వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ గర్జన సభలో బీసీ కులాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా ప్రకటన చేశారు. వెనుకబడిన కులాల్లో ప్రతి కులానికీ కార్పొరేషన్, విద్య, ఉపాధి కల్పిస్తామని చెప్పడం సంతోషం. చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా 10 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించడం బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది. దొరస్వామి కుటుంబాలు బాగుపడతాయ్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన 7 లక్షలు రూపాయ వైఎస్సార్ బీమాతో తెలుగు కు టుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. చేసిన అ ప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడితే కుటుంబ పెద్దగా వైఎస్సార్ బీమాను ప్రవేశ పెట్టి ఆదుకునే గొప్ప మనస్సు జగనన్నకే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలనే కాకుండా రైతులను బీమా పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించడంతో అన్ని వర్గాల కుటుంబాలు బాగుపడినట్ల–హేమచంద్రారెడ్డి,రైతు, సముదాయం. -
బీసీల సిక్కోలుకు.. జగన్ వరాల మూట!
బీసీ డిక్లరేషన్... ప్రకటించడంలోనే కాదు అధికారంలోకి వస్తే ఏవిధంగా సాకారం చేస్తామో విస్పష్టంగా చెప్పారు రాష్ట్ర విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఏలూరు వేదికగా ఆదివారం జరిగిన ‘బీసీ గర్జన’ ఇందుకు వేదికైంది. ఆర్థికంగా, సామాజికంగానే గాకుండా విద్యా ఉద్యోగాల్లోనూ వెనుకబడిన బీసీలకు ఆయన ఇచ్చిన వరాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీసీల్లో నూతన ఉత్సాహం నింపాయి. అన్ని విధాలా అభివృద్ధి సాధించడానికి, తమ కులం ఉనికిని కాపాడుకోవడానికి ఏవిధమైన చర్యలు ఉండాలో బీసీలు కోరుకున్నట్లే జగన్ వరాల మూట అందించారు. ఇవి అమలైతే బీసీ జనాభా అత్యధికంగా ఉన్న సిక్కోలుకే పెద్దపీట దక్కుతుంది! సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా సిక్కోలు జిల్లా మాత్రం అభివృద్ధిలో అట్టడుగునే ఉండిపోయింది. ఉపాధి, ఉద్యోగాలు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకే కాదు ఇతర రాష్ట్రాలకే వలస పోవడమనేది సర్వసాధారణమైపోయింది. ఇలాంటి పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి 2004 సంవత్సరంలో డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత చురుగ్గా చర్యలు చేపట్టారు. 2009లో ఆయన అకాల మరణం చెందేవరకూ అమలు చేసిన సంక్షేమ పథకాలు మిగతా రాష్టాలకూ స్ఫూర్తిగా నిలిచాయి. తద్వారా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు బీసీల జపమే తప్ప పురోగతికి తీసుకున్న చర్యలు నానాటికీ తీసికట్టుగా మారాయి! కులాల మధ్య అసమానతలు పెరిగాయి. దీంతో పలు బీసీ కుల సంఘాలు తమ హక్కుల కోసం గొంతెత్తాయి. మత్స్యకారులు, రజకులు, కల్లుగీత కార్మికులు, యాదవులు, నాయీ బ్రాహ్మణులు... ఇలా పలు సంఘాల వారు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు తీర్చాలంటూ మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునే వేడుకున్నారు. కానీ మత్స్యకారులనేమో ‘ఎక్కువ చేస్తే తాటతీస్తా!’ అని, నాయీ బ్రాహ్మణులనేమో ‘తమాషాలు చేస్తున్నారా? తోక కత్తిరిస్తా’ అని బెదిరించిన ఘటనలూ ఉన్నాయి! ఇలాంటి నేపథ్యంలో జిల్లాలోగత ఏడాది నవంబర్ 25వ తేదీన ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుపెట్టారు. జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో యాత్ర ముగిసినంత వరకూ పలువురు బీసీలను ఆయన కలిశారు. వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. అలాగే వివిధ బీసీ సంఘాల నాయకులు కూడా వినతిపత్రాలు అందించారు. వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీసీల ఉద్ధరణకు ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టనున్నదీ స్పష్టం చేస్తూ ఆదివారం ‘బీసీ డిక్లరేషన్’ను ప్రకటించారు. సిక్కోలుకే అగ్రభాగం... జిల్లాలోని మొత్తం జనాభాలో బీసీలు 80 శాతం పైమాటే! మెజార్టీ సామాజిక వర్గాలైన తూర్పుకాపు, పోలినాటి వెలమ, కొప్పుల వెలమ, కాళింగ, యాదవ, మత్స్యకారులు, రెడ్డిక, కళింగ వైశ్యులు, శిష్ట కరణాలే గాకుండా కమ్మరి, కుమ్మరి, రజక, నాయీబ్రాహ్మణ, పద్మశాలీ, శ్రీశైయన... ఇలా దాదాపు 73 కులాల వారు బీసీలుగానే ఉన్నారు. జిల్లాలో బీసీల జనాభా సుమారు 20 లక్షల మంది ఉన్నారు. జగన్ ప్రకటించిన ‘బీసీ డిక్లరేషన్’ అమలు ద్వారా ఎక్కువగా మేలు జరిగేది జిల్లా వాసులకేన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా వరాలతో బీసీల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తోంది. పలువురు నాయకులు హర్షం ప్రకటిస్తున్నారు. ♦ బీసీలకు సంబంధించిన అభివృద్ధి పథకాలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.15,000 కోట్లు ఇవ్వనున్నారు. దీంతో బీసీలు ఎక్కువగా ఉన్న సిక్కోలు జిల్లాకు కనీసం రూ.150 కోట్లు వరకూ ప్రయోజనం చేకూరుతుంది. ♦ జిల్లాలో ఇప్పటివరకూ బీసీల్లో ఏ కులానికీ ప్రత్యేకంగా కార్పొరేషన్ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తద్వారా జిల్లాలోనున్న 73 బీసీ కులాలకు ఈ కార్పొరేషన్లు అందుబాటులోకి వస్తాయి. వాటితో సంక్షేమ రుణాలు ప్రతి కులానికీ చేరుతాయి. ♦ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ పథకంతో జిల్లాలో సుమారు 3 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయం అందుతుంది. ♦ ఇప్పటికే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా లక్షల మంది బీసీ విద్యార్థులు లబ్ధి పొందారు. తండ్రి ఒరవడిని కొనసాగిస్తూ జగన్ కూడా భరోసా ఇచ్చారు. విద్యాభ్యాసానికయ్యే మొత్తం ఖర్చును భరించడమే గాక అదనంగా ఏడాదికి రూ.20 వేలు హాస్టల్ ఖర్చు నిమిత్తం ప్రతి బీసీ విద్యార్థికీ అందించనున్నారు. తద్వారా జిల్లాలో 1.20 లక్షల మంది బీసీ విద్యార్థులకు భరోసా లభించనుంది. ♦ ప్రతి కుటుంబం నుంచి పిల్లలను బడికి పంపిస్తే ఆ కుటుంబంలో తల్లి పేరిట రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో వేస్తామని జగన్ ప్రకటించారు. తమ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల తమ పిల్లలను బడికి పంపలేనివారు ఎక్కువ మంది బీసీలే. ఇలాంటి సుమారు 3.50 లక్షల బీసీ కుటుంబాలకు చేయూత అందుతుంది. ♦ జిల్లాలో ఎరుకల, సగర, పూసల తదితర సంచార జాతుల వారు దాదాపు 5 వేల కుటుంబాల వరకూ ఉన్నారు. వారికి స్థిర నివాసం కల్పించడంతో పాటు పిల్లలకు ప్రత్యేక గురుకులం ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ♦ మత్స్యకార కుటుంబాలు జిల్లాలో 1.10 లక్షల వరకూ ఉన్నాయి. సముద్ర తీరం వెంబడి ఉన్న 11 మండలాల్లోని 110 గ్రామాల్లో మత్స్యకార జనాభా అత్యధికంగా ఉంది. సముద్రంలో వేట నిషేధ సమయంలో ప్రస్తుతం రూ.4 వేలు మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. దీన్ని రూ.10 వేలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అంతేకాదు బోటు కొనుగోలుకు, బోటుకయ్యే డీజిల్‌కు భారీగా రాయితీ ఇస్తామన్నారు. ♦ చేనేత కుటుంబాలు జిల్లాలో పది వేల వరకూ ఉన్నాయి. వారిలో వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నవారికి నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ♦ యాదవుల జనాభా జిల్లాలో రెండు లక్షల వరకూ ఉన్నారు. వారి సన్నిధికి వారసత్వ హక్కులు కల్పిస్తామని, అలాగే గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6 వేల చొప్పున బీమా పరిహారం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ♦ నామినేటెడ్ పదవులు జిల్లాకు అరకొర మాత్రమే దక్కుతున్నాయి. అలాగాకుండా నామినేటెడ్ పదవుల్లో సగం కోటా బీసీలకు వస్తుంది. జీవితాలే మారిపోతాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏలూరు బీసీ గర్జన సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాష్ట్రంలో బీసీ వర్గాల జీవితాలే మారిపోతాయి. 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసు గల వారికి రూ.75 వేలు ఉచితంగా అందిస్తామనడంలో బీసీల్లో ఉత్కంఠ నెలకుంటోంది. బీసీ విద్యార్థుల చదువులకు రూ. 20 వేలు ఉచితంగా ఇస్తాననడం విద్యార్థులకు ఆసరాగా ఉంటుంది. చిరు వ్యాపారులకు ఇచ్చే రూ. 10 వేలు వడ్డీ లేకుండా ఎంతో తోడ్పడుతుంది.– తమ్మినేని సీతారాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు సంపూర్ణ న్యాయం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాష్ట్రంలోని బీసీ వర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగే అవకాశం ఏర్పడింది. అన్ని వర్గాలకు వరాల జల్లు కురిపించడం అభినందనీయం. రాష్ట్ర బడ్జెట్లో మూడోవంతు బీసీలకు ఖర్చు చేస్తామని ప్రకటించడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.–పిరియా సాయిరాజ్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఇచ్ఛాపురం అన్నివర్గాలను ఆదుకునే కార్యచరణ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్నుభారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు లేని విధి విధానాలు రూపకల్పన చేయడం ఆనందదాయకం. అన్ని రకాల చేతివృత్తుల వారికి న్యాయం జరిగేలా ఉంది. 31 కార్పొరేషన్లకు తెరతీయడం చరిత్ర సృష్టించడమే. మత్స్యకారులకు రూ.10 వేలు వేట నిషేధం ప్రకటన, మరణించిన వారికి రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా, సబ్సిడి డీజిల్, బోట్లు ఇలా అందరికి న్యాయం చేయడంపై ధన్యవాదాలు తెలుపుతున్నాం.– డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, పలాస బీసీలకు మేలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు అన్ని విధాలా మేలు చేకూరే విధంగా చర్యలు చేపడతామని జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్హణీయం. మడమ తిప్పని నాయకుడుగా వెలుగొందుతున్న జగన్ ఏలూరు సభలో ప్రకటించిన విధంగా అన్ని వర్గాల బీసీలకు ఆదుకుంటారు. ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టి వారి అభివృద్ధికి దోహదపడతారు. ఇందులో సందేహం లేదు. అన్ని వర్గాల బీసీలకు మేలు చేకూరే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటాయి. – ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్త, నరసన్నపేట చరిత్రలో నిలిచిపోయే రోజు టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది. ఎన్నికల ముందు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి హడావుడి సృష్టిస్తోంది. బీసీ కార్పొరేషన్ రుణాలు సైతం జన్మభూమి కమిటీల జోక్యంతో అందజేశారు. రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చరిత్రలో నిలిచిపోయే రోజు. రూ. 15,000 కోట్లు కేటాయింపు, సబ్ ప్లాన్ అమలు, చదువులకు కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపులు, చిరు వ్యాపారులు, కుల వృత్తులకు ప్రోత్సాహం వంటివి బీసీ కులాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. బీసీలకు సంపూర్ణ న్యాయం జరగుతుంది.– గొర్లె కిరణ్‌కుమార్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎచ్చెర్ల బీసీ వర్గాలకు జగనన్న ఎంతో ప్రాధాన్యత కల్పించారు బీసీ గర్జనలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బీసీ వర్గాలకు ఎం తో ప్రాధాన్యత కల్పించారు. బీసీ వర్గాల అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కల్పిం చని విధంగా వరాల జల్లు కురిపించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 15 వేల కోట్లు కేటాయించడం.. తొలి అసెంబ్లీలో సబ్‌ప్లాన్ చట్టం చేస్తామని చెప్పడం బీసీ వర్గాలకు సంతోషాన్నిచ్చింది. బీసీ జాబితాలో ఉన్న ప్రతి వర్గానికి మేలు జరిగేలా జగనన్న ప్రణాళిక రూపొం దించారు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త,టెక్కలి నియోజకవర్గం -
నూతనోత్తేజం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వేదికగా ప్రకటించిన డిక్లరేషన్ బీసీలకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ‘గర్జన’ సభలో జగన్ ఇచ్చిన హామీలు వారికి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చాయి. దీంతో జిల్లాలో 32 లక్షలకు పైగా ఉన్న బీసీల్లో కొత్త ఆశలు చిగురించాయి. వైఎస్ కుటుంబం మాట ఇస్తే నిలబడుతుందని, తమ బతుకులకు జగన్ భరోసా ఇచ్చారని బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఏలూరులో ఆదివారం జరిగిన బీసీ గర్జనకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచీ వేలాదిగా ప్రజలు తరలివెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీలతో పాటు తటస్తులు కూడా అధిక సంఖ్యలో ప్రత్యేకంగా బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసుకుని వెళ్లారు. ఆ వాహనాలకు ముఖ్య నేతలు జెండా ఊపారు. దీంతో ఆదివారం ఎక్కడా చూసినా ఒకటే సందడి. తండోపతండాలుగా వెళ్లిన జనంతో దారి పొడవునా రద్దీ ఏర్పడింది. వెల్లువలా తరలి వెళ్లిన బీసీల్లో సమరోత్సాహం కనిపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం చెబుతారో, ఏం ప్రకటిస్తారోనని ఆసక్తితో పయనమయ్యారు. వారి ఆశలు అడియాసలు కానివిధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన బీసీ డిక్లరేషన్ ఆ వర్గాలను సంతృప్తిపరచింది. బీసీ గర్జన సభలో పార్టీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు జిల్లా తరఫున ప్రసంగించారు. తేలిపోయిన టీడీపీ జయహో బీసీ సదస్సు గతంలో ఏన్నడూ లేనివిధంగా రాజమహేంద్రవరంలో జయహో బీసీ సదస్సు నిర్వహించామని, ఇప్పటివరకూ అంత జనాలు రాలేదని టీడీపీ నేతలు చంకలు గుద్దుకున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఆ సభలో చంద్రబాబు ప్రసంగం ప్రారంభించేసరికే జనాలు గుంపులుగా వెళ్లిపోయారు. ఆ ప్రాంగణంలో కుర్చీలు దాదాపు ఖాళీ అయిపోయాయి. అయినప్పటికీ బీసీలు తమ వెంటే ఉన్నారని, కనీవినీ ఎరుగని రీతిలో సభ జరిగిందని టీడీపీ నేతలు సంబరపడ్డారు. తటస్తులైన బీసీ నేతలను పిలవకుండా ఎంతసేపూ టీడీపీ నేతల భజనతో కానిచ్చేసి అదే తమ గొప్పతనంగా చెప్పుకున్నారు. కానీ ఏలూరు వేదికగా జరిగిన బీసీ గర్జన ఆద్యంతం కిక్కిరిసిపోయి కనిపించింది. తటస్తులైన ఆర్.కృష్ణయ్య లాంటి బీసీ నేతలు వచ్చి వైఎస్సార్ సీపీకి ఉన్న చిత్తశుద్ధిని వివరించడం ఆ వర్గాల్లో పార్టీ పట్ల నమ్మకం కలిగించింది. టీడీపీ జయహో బీసీ సభకు, వైఎస్సార్ సీపీ బీసీ గర్జనకు పోలికే లేదని, ఏలూరు వచ్చిన జనాల్లో సగం కూడా రాజమహేంద్రవరం రాలేదని పలువురు చర్చించుకోవడం కనిపించింది. సంతోషంలో బీసీ ఉప కులాలు బీసీ గర్జనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన డిక్లరేషన్‌లో ఉప కులాలన్ని ంటికీ చోటు దక్కింది. అందరికీ ప్రాధాన్యం కల్పిస్తూ హామీలివ్వడమే కాకుండా, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారికేం చేస్తారో జగన్ ప్రత్యేకించి చెప్పారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ తమను పూర్తిగా విస్మరించిందని, కానీ వైఎస్సార్ సీపీ బీసీ డిక్లరేషన్‌లో తమను ప్రత్యేకంగా చూడటం ఆనందాన్నిచ్చిందని పలువురు బీసీ నేతలు బాహాటంగానే చెప్పారు. -
జగన్ అనే నేను మీ వెన్నుదన్ను
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: వైఎసాŠస్ర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరులో ఆదివారం నిర్వహించిన బీసీ గర్జన విజయవంతమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బీసీలు సర్కారు కుటిల రాజకీయాలపై గర్జించారు. జగన్ వెంటే తామంటూ నినదించారు. ఎండనూ లెక్కచేయక.. సముద్రం ఉప్పొంగిందా.. నేల ఈనిందా అన్నట్టు లక్షలాది మంది ప్రజలు బీసీ గర్జనకు తరలివచ్చారు. ఏలూరులోని సభా ప్రాంగణానికి చేరే దారులన్నీ జన ప్రవాహంతో పోటెత్తాయి. జోతి రావుపూలే సభా ప్రాంగణం జగన్నామస్మరణతో మార్మోగింది. బీసీ వర్గాలు, యువత, మహిళలు, రైతులు, ఆఖరికి వృద్ధులు, వికలాంగులు సైతం వ్యయప్రయాసలకోర్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేం దుకు.. ఆయన మాటలు వినేందుకు ఉవ్విళ్లూరారు. రోడ్లు ట్రాఫిక్‌తో స్తంభించినా.. పొలాల్లో పడి పరుగులు తీసుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ నేతలు ఊహించినదానికంటే అనూహ్య స్పందన వచ్చింది. మధ్యాహ్నం నుంచే జగన్ ప్రసంగం వినేందుకు సభాప్రాంగణంలో ప్రజలు వేచిఉన్నారు. జగన్ అనే నేను.. జగన్ అనే నేను...బీసీలకు ఏమి చేస్తానంటే...అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కాబోయే సీఎం...జగన్ అంటూ యువత కేరింతలు కొట్టారు. ప్రసంగం అడుగడుగునా.. హర్షధ్వానాలు తెలిపారు. టీడీపీ నేతలపై జగన్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నప్పుడల్లా.. చేతులూపుతూ సంఘీభావం తెలిపారు. బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నప్పుడు ఒక్కొక్క అంశానికి ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ.. ఈలలు వేస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.. తమను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయటమే తప్ప .. బీసీ అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన టీడీపీతో పోల్చుకుంటూ..ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే నడవాలనే సంకల్పం వారిలో కనిపించింది. రాజకీయంగానూ అధిక ప్రాధాన్యత ఇవ్వటంపైనా బీసీ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బీసీ గర్జన విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. అనూహ్యంగా బీసీ గర్జనకు ప్రజలు తరలిరావడంతో పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇది పార్టీలో ఊపు తెచ్చింది. ధైర్యంగా దూసుకుపోయేందుకు ఇంధనంగా మారింది. ఇదిలా ఉంటే గర్జన విజయవంతంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బీసీ డిక్లరేషన్ ఇలా.. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని వెల్లడించారు. ♦ బీసీల సంక్షేమానికి ఏటా రూ.15 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. ♦ బీసీ సబ్‌ప్లానుకు చట్టబద్ధత కల్పించటంతోపాటు మొదటి బడ్జెట్ లో సమగ్ర బీసీ చట్టాన్ని తీసుకుచ్చి మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. ♦ కార్పొరేషన్ల వ్యవవ్థను ప్రక్షాళన చేయటంతోపాటు అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్ వెల్లడించారు. ♦ రజకులు, చేనేత, మత్స్యకారులు, బోయలు, వాల్మీకులు, అగ్నికుల క్షత్రియులు, శాలివాహన,. దూదేకుల కొప్పుల వెలమ, శెట్టి బలిజ, గాండ్ల, ముదిరాజ్, భట్రాజు వంటి బీసీ కులాలకు మొత్తం 139 కార్పొరేషన్లు ప్రారం భిస్తామని చెప్పారు. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసే ప్రసక్తే ఉండదన్నారు. ♦ 45–60 ఏళ్ల వయసు కలిగిన ప్రతి మహిళకు రూ. 75 వేలు చేయూత పథకం ద్వారా నాలుగు విడతలుగా అందజేస్తామని పేర్కొన్నారు. ♦ బీసీ విద్యార్థుల విద్య కోసం రూ. 20 వేలు, బీసీ పిల్లలను బడికి పంపితే ఏటా రూ.15 వేలు అందజేస్తామన్నారు. ♦ బీసీ కమిషన్ ఏర్పాటు చేయటమే కాకుండా కమిషన్ సిఫార్సులను పక్కాగా అమలు చేస్తామని జగన్ చెప్పారు. ♦ పలు కులాలను ఎస్సీ, ఎస్టీలుగా మార్చే విషయాన్ని పరిగణిస్తామని పేర్కొన్నారు. ♦ ప్రైవేటు కాంట్రాక్టు పనులు, అవుట్ సోర్సింగ్ పనులు 50 శాతం ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు, బీసీలకే వర్తించేలా కొత్త చట్టం తెస్తామని జగన్ చెప్పారు. ♦ బీసీలతో రాజకీయంగా బలపడటానికి నామినేటెడ్ పదవుల నియామకం చేపడతామన్నారు. కమిటీల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకే ప్రాతినిధ్యం కల్పిస్తామని, నామినేటెడ్ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు బీసీలకే కేటాయిస్తామని చెప్పారు. ♦ నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు ఏటా రూ. 10 వేల సాయం, సంచార జాతులకు ఉచితంగా ఇళ్లే కాదు ఉపాధి సదుపాయం, ప్రత్యేక గురుకుల పాఠశాలల ఏర్పాటు, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10 వేలు, వేటకు వెళ్ళి చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, చేనేతలకు నెలనెలా రూ.2వేలు పెట్టుబడి నిధి, యాదవుల గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6 వేలు, బ్రాహ్మణులకు కనీస వేతనం వంటి హామీలు ఇచ్చారు. ఆలయ ట్రస్టీలుగా యాదవులు, నాయీ బ్రాహ్మణులను నియమిస్తామని పేర్కొన్నారు. -
బెదిరింపులకూ లొంగని బీసీలు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ చేపట్టిన బీసీ గర్జనకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు చేసిన కుటిల యత్నాలు విఫలమయ్యాయి. వారి బెది రింపులకు బీసీలు లొంగలేదు. స్వచ్ఛం దంగా బీసీ గర్జన సభకు తరలివచ్చారు. డ్వాక్రా చెక్కులు రద్దు చేస్తామంటూ బెదిరింపులు ఏలూరులో బీసీ గర్జన మహాసభకు బీసీ వర్గాలు, ప్రజలు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. మహిళలను ఏకంగా డ్వాక్రా చెక్కులు రద్దు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. తెల్లవారితే మహిళలు ఎక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బీసీ గర్జన సభకు వెళ్ళిపోతారనే భయంతో శనివారం రాత్రికి రాత్రే మహిళలను పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బలవంతంగా తరలించారు. ఏలూరు నగరంలో అయితే ఏకంగా ప్రతి డివిజన్‌కూ ఆర్సీసీ బస్సులను ఏర్పాటు చేసి ఉదయాన్నే మహిళలు, జనాన్ని బలవంతంగా బస్సులు ఎక్కించారు. ఇలా ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 138 ఆర్టీసీ బస్సుల్లో ప్రజలను పోలవరం తరలించారు. కొందరు మహిళలు తాము బీసీ గర్జన సభకు వెళ్ళాలని టీడీపీ నేతలకు చెప్పటంతో.. డ్వాక్రా చెక్కులను రద్దు చేస్తామని, మీకు ఇతర పథకాలేవీ రాకుండా చేసేస్తామంటూ హెచ్చరించినట్టు పలువురు బాధితులు చెబుతున్నారు. చాలామంది ఆ బెదిరింపులకు లొంగలేదు. స్వచ్ఛందంగా బీసీ గర్జనకు తరలివచ్చారు. కొందరు చేసేది లేక శాపనార్థాలు పెట్టి బస్సుల్లో పోలవరం వెళ్లినట్టు సమాచారం. ఇలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ మహిళలను బలవంతంగా పోలవరం సందర్శనకు తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నియంత్రణలో ఘోర వైఫల్యం బీసీ గర్జన సభ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పోలీసులు గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు సభా ప్రాంగణం, సభకు వచ్చే దారుల్లో ట్రాఫిక్ నియంత్రణ విషయాల్లో విఫలమయ్యారు. బీసీ గర్జన రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. అయితే ట్రాఫిక్‌ను మళ్ళించటం, నియంత్రించటంలో మాత్రం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సభకు వెళ్ళేందుకు మధ్యాహ్నం వచ్చిన బస్సులు, కార్లు, ఇతర వాహనాలను సభ ప్రాంగణానికి చాలా దూరంలోనే నిలిపివేయటం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకపోవటంతో అసలు సభ వద్దకు రావటానికే అవకాశం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులోని మినీ బైపాస్, జాతీయ రహదారిపైనా సభకు వచ్చే వాహనాలను అడ్డుకోవటంతో వేలాదిమంది సభకు రాలేకపోయామని బాధపడుతున్నారు. ఇక మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే వట్లూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి విజయవాడ వైపు ఆర్టీసీ బస్సులు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వటంతో సభ జరుగుతున్న రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. ఆఖరికి మోటారుసైకిల్ కూడా అటుగా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్ ప్రసంగం సాయంత్రం 6 గంటలకు ముగిసినా... రాత్రి 11 గంటల సమయంలోనూ కలపర్రు టోల్గేట్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికుల్లో సభపై వ్యతిరేకత రావాలనే ఈ విధంగా పాలకులు ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
బీసీల్లో మహోదయం
జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు ఓ భరోసా లభించింది. వైఎస్సార్ స్వర్ణయుగంరాబోతుంది.. మళ్లీ రాజన్నపాలన చూడబోతున్నాం.. మాకు మంచిరోజులు రాబోతున్నాయ్..అంటూ బీసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు గడ్డపై బీసీ గర్జన సభలో వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు ఆ సామాజిక వర్గీయుల్లో ఎనలేని ఆత్మస్థైర్యాన్ని నింపాయి. గడిచిన ఐదేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వారిలో భవిష్యత్‌పై ఆశలు చిగురింప చేశాయి. ఆరు నూరైనా ఈసారి వైఎస్సార్సీపీనే గెలిపించుకుంటాం..జగనన్నను సీఎం చేసుకుంటాం అంటూ వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలను అన్ని విధాలా ఆదుకుంటామని 119 హామీలను గుప్పించారు. ఏటా రూ.10 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. కానీ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారు. చివరకు ఎన్నికల ముందు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేందుకు ఆదరణ–2 అంటూ తెరపైకి తీసుకొచ్చి వందల కోట్లు కమీషన్ల రూపంలో దండుకుని అధికార టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. తమ పట్ల చూపేది కపట ప్రేమని గ్రహించిన బీసీలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే తమ బతుకులకు భరోసా లభిస్తుందని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఏలూరులో జరిగిన సభలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీ సామాజిక వర్గాల్లో కొండంత ధైర్యాన్నిచ్చింది. బీసీలకు ఏటా రూ.15 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్ తీసుకొస్తామని.. తొలి çసమావేశాల్లోనే దానికి చట్టబద్ధత కల్పిస్తామని.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని.. గ్రూపుల మార్పిడితో సహా బీసీల సమస్యల పరిష్కార బాధ్యతలను ఆ కమిషన్‌కు అప్పగిస్తామని ఇచ్చిన హామీ బీసీ వర్గాల్లో స్థైర్యాన్ని నింపింది. జిల్లాలో సగానికిపైగా బీసీలే.. జిల్లా జనాభా 46.50 లక్షలుండగా, వారిలో 22 లక్షల మంది మహిళలున్నారు. మొత్తం జనాభాలో సగం మంది బీసీలే. జిల్లాలో ప్రధానంగా యాదవ, వెలమ, గవర, మత్స్యకార, శెట్టిబలిజ, పద్మశాలి, రజక, కాళింగ, నాగరాజు,నాగవంశం, నెయ్యల, తెలగ వంటి గుర్తింపు కలిగే స్థాయిలో జనాభా ఉన్న వారు 35కు పైగా బీసీ సామాజికవర్గాల వారు ఉన్నాయి. వీటిలో మేజర్ జనాభా యాదవ, వెలమ, గవర, మత్స్యకార సామాజిక వర్గీయులు. యాదవ సామాజిక వర్గీయులు నాలుగున్నర లక్షల మంది ఉండగా, వెలమ సామాజిక వర్గీయులు 4 లక్షల మంది ఉన్నారు. ఇక గవర్లు రెండున్నర లక్షల మంది, మత్స్య కారులు రెండులక్షల మంది, మిగిలిన సామాజిక వర్గీయుల్లో శెట్టిబలిజ, పద్మశాలిలుండగా, 50 వేల లోపు జనాభాతో మిగిలిన సామాజిక వర్గీయు లున్నారు. 12 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు లబ్ధి సహకార రంగంలో డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకు లీటర్‌కు రూ.4లు సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. బీసీల్లో అత్యధికులు రైతులే. వారిలో పాడిపై ఆధారపడి జీవిస్తున్నవారు జిల్లాలో దాదాపు 12 లక్షల మంది పాల ఉత్పత్తిదారులున్నారు. విశాఖ డెయిరీతో పాటు హెరిటేజ్, తిరుమల తదితర డైరీలున్నాయి. రైతులకు లీటర్‌కు రూ.21 నుంచి రూ.25లకు ముట్టజెబుతున్న డెయిరీలు.. ఆ పాల నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా లీటర్‌కు రూ.200 వరకు సంపాదిస్తున్నారు. కానీ పాల ఉత్పత్తిదారులకు మాత్రం ఏటా అప్పులే మిగులుతున్నాయి. జిల్లాలోని పాల ఉత్పత్తిదారులకు లీటర్ పాలకు రూ.4 సబ్సిడీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఆధీనంలో రైతుల భాగస్వామ్యంతో నడిచే పాలడెయిరీలను ప్రతి జిల్లాకు తీసుకొస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీ వల్ల జిల్లాలో పాల ఉత్పత్తిదారులంతా లబ్ధి పొందనున్నారు. జిల్లాలో ప్రతి రోజు 8.50 లక్షల లీటర్ల పాలు పోస్తుంటారు. ఆ మేరకు రైతులకు రూ.34 లక్షల మేర లబ్ధి చేకూరనుంది. యాదవులకు కొండంత అండ యాదవ సామాజిక వర్గీయులు నాలుగున్నర లక్షల మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వీరిలో మూడోవంతు జనాభా గొర్రెలు, మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 2.53 లక్షల గొర్రెలు, 3.24 లక్షల మేకలు ఉన్నాయి. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాల్లో కనీసం 20 నుంచి 30 శాతం చనిపోతున్నాయి. వాటికి ఎలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడంతో యాదవులు అప్పులఊబిలో కూరుకుపోతున్నారు. బీసీ డిక్లరేషన్‌లో చనిపోయే గొర్రెలు, మేకలకు రూ.6 వేల ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చేస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీ వారిలో కొండంత భరోసానిచ్చింది. అంతేకాదు యాదవులను కూడా ఆలయ బోర్డుల్లో సభ్యులుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. 18 వేల మంది నాయీబ్రాహ్మణులకు లబ్ధి సెలూన్ షాపు ఉన్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి సున్నా వడ్డీకే రూ.10 వేలు ఇస్తామని బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చారు. ఆ మేరకు నాయీ బ్రాహ్మణులకు 18 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. అదే విధంగా ఆటోలు, టాక్సీలు సొంతంగా నడిపే వారిలో అత్యధికులు బీసీలే. వారికి ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన ప్రకటన ద్వారా సుమారు రూ.10 కోట్లకు పైగా లబ్ధి పొందనున్నారు. విశాఖ జిల్లాలో దేవాదాయశాఖ çపరిధిలో 976 ఆలయాలు ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే ఈ ఆలయాల్లో ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని నియమిస్తామని హామీ ఇచ్చారు. చేనేతలకు తీరనున్న చింత జిల్లాలో పద్మశాలి, దేవాంగ తదితర చేనేత సామాజిక వర్గీయులు సుమారు లక్ష మంది వరకు ఉన్నారు. జిల్లాలో మగ్గాలు పదివేలకు పైగా ఉన్నాయి. వీరికి కనీస చేయూతనిచ్చే నాథుడే కరువయ్యాడు. వైఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ లబ్ధి తప్ప ఆ తర్వాత వీరికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదనే చెప్పాలి. అలాంటి వీరికి బీసీ డిక్లరేషన్‌లో వైఎస్ జగన్ ప్రకటించిన హామీ కొండంత భరోసానిచ్చింది. మగ్గం ఉన్న ప్రతిమత్స్యకార మహిళకు ప్రతి నెలా పెట్టుబడి రాయితీ కింద రూ.2వేలు ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు మగ్గాలున్న చేనేతలందరికి మేలు జరుగనుంది. జీవనోపాధికి భరోసా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీలోనే కాదు.. నామినేషన్ పదవుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయిస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అణగారిన బీసీ వర్గాలకు తమకు రానున్నది నిజంగా సువర్ణయుగమేనని సంబరపడుతున్నారు. వైఎస్సార్ చేయూతతో 15 లక్షల మందికి లబ్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45 ఏళ్లు నిండిన మహిళలకు నాలుగు విడతల్లో రూ.75వేలు ఉచితంగా అందించేందుకు ప్రకటించిన వైఎస్సార్ చేయూత పథకం ఆయా వర్గాల్లో పట్టరాని ఆనందం నింపింది. ఈ పథకాన్ని విశాఖ జిల్లాలోనే వైఎస్ జగన్ ప్రకటించారు. జిల్లాలో బీసీలు 26 లక్షల మంది, ఎస్టీలు 6.50 లక్షల మంది, ఎస్సీలు 4 లక్షల మంది, మైనారిటీలు లక్ష మంది ఉన్నారు. ఇందులో సుమారు 15 లక్షల మంది మహిళలు ఉంటారు. వీరికి నాలుగేళ్లలో ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.10 వేల కోట్లకు పైగా లబ్ధి జరగనుంది. -
వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు న్యాయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/గన్నవరం: వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ద్వారానే బీసీలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శాశ్వతంగా అభివృద్ధి చెందాలన్నా, జీవితాల్లో వెలుగులు నిండాలన్నా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే ఐదేళ్లపాటు బీసీలకు పండుగ వాతావరణం ఉంటుందన్నారు. ఆదివారం గన్నవరంలోనూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలోనూ కృష్ణయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. తాను బీసీ తీవ్రవాదినని, అటువంటి తనను గర్జనకు పిలిచారంటేనే జగన్‌కు బీసీల పట్ల ఎంత నిబద్ధత ఉందో తెలుస్తుందన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనను సమావేశాలకు పిలిచి బీసీల డిమాండ్లు ఏమిటో తెలుసుకునేవారని గుర్తుచేసుకున్నారు. బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించేవారని తెలిపారు. వైఎస్సార్ బీసీల సమస్యలు పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ వేసి ఎన్ని కోట్లు ఖర్చయినా బీసీల డిమాండ్లు నెరవేర్చాలని ఆదేశించేవారన్నారు. ఆయన కారణంగానే గుడిసెల్లో ఉండే పేదల పిల్లలు సైతం డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారన్నారు. బీసీలకు లబ్ధి చేకూర్చింది వైఎస్సార్ మాత్రమేనన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు అమలు చేయాలని, గురుకుల పాఠశాలలు, బాలికలు, బాలుర హాస్టళ్లు ఏర్పాటు చేయాలనే పలు డిమాండ్లతో అమరణ నిరాహార దీక్ష చేయాలని తాను సంకల్పిస్తే తనను ఒక్క గంట కూడా దీక్ష చేయనీయకుండా అన్ని డిమాండ్లను ఆమోదించారన్నారు. ఆయన హయాంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. తన 40 ఏళ్ల ఉద్యమ చరిత్రలో వైఎస్సార్ లాంటి నాయకుడిని చూడలేదని తెలిపారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం యువనేత జగన్ ముందుకు వచ్చారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. వైఎస్సార్ బీసీలకు చదువు ఇచ్చారని, జగన్ అధికారంలో వాటా ఇస్తానని చెబుతున్నారని ఈ నేపథ్యంలో బీసీలు చైతన్యం తెచ్చుకోవాలన్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే చట్టసభల్లో రిజర్వేషన్ సాధ్యం అవుతుందన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దు చంద్రబాబు బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రలోభాలకు బీసీలు లొంగవద్దన్నారు. టీడీపీ ఎంపీలు ఒక్కసారి కూడా పార్లమెంట్లో బీసీల హక్కుల గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు ప్రధాని మోదీని 40 సార్లకు పైగా కలిశారని, అయితే ఒక్కసారైనా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని అడగలేదన్నారు. బీసీలు చేస్తున్న పోరాటానికి స్పందించి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పారు. కాగా, ఆర్.కృష్ణయ్య ఏలూరులో బీసీ గర్జన సభకు వెళ్లేముందు కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల అతిథి గృహంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. కులాలను దూషించడం చంద్రబాబుకే సాధ్యమైంది.. వైఎస్సార్ సుపరిపాలన మళ్లీ అందించేందుకే ఆయన తనయుడు వైఎస్ జగన్ వైఎస్సార్సీపీని స్థాపించారు. ప్రజలంతా వైఎస్ పాలనను.. జగన్ ద్వారా కోరుకుంటున్నారు. ప్రతి బీసీ సోదరుడూ వైఎస్సార్సీపీకి అండగా నిలబడాల్సిన తరుణం వచ్చింది. చంద్రబాబు అధికారంలోకొచ్చాక ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన దాఖలాల్లేవు. కేంద్రంలో బీజేపీతో అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బీసీకి కూడా మంత్రి పదవి ఇప్పించలేదు. ఒక సీఎం ఒక కులాన్ని ధూషించిన ఘటన దేశంలో ఎక్కడా లేదు.. అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది. అధికారంలోకి రాగానే బీసీల అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ అమలు చేయనున్న కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా ప్రకటించడం బీసీలంతా హర్షించాల్సిన విషయం. సుమారు 16 నెలల పాటు అధ్యయన కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి వైఎస్ జగన్‌కు నివేదిక అందించింది. ప్రజల మేలు కోరే జగన్.. మనకు నాయకత్వం వహిస్తానంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. జగన్‌కు జై కొట్టి ముఖ్యమంత్రిని చేద్దాం. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి బీసీలంతా జగన్‌కు అండగా నిలుద్దాం నలభై లక్షల బీసీ కుటుంబాల్లో విద్య ద్వారా వెలుగులు నింపిన మహోన్నతుడు వైఎస్సార్. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి యావత్ బీసీ వర్గమంతా అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది. బీసీలంతా ఒక్కతాటిపైకొచ్చి జగన్‌ను సీఎం చేసుకోవాలి. తరచూ బీసీలను కించపరిచే చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే.. బీసీల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. – అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే ఇది ఎన్నికల హామీ కాదు.. అమలు చేసే వాగ్దానం బీసీ డిక్లరేషన్.. ఎన్నికల ముందు ఇచ్చే హామీ కాదు.. కచ్చితంగా అమలు చేసే వాగ్దానం. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు బీసీలకు 110 హామీలిచ్చారు. అధికారంలోకొచ్చాక ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇచ్చిన ప్రతి మాటనూ అమలు చేయాలన్న సంకల్పంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆర్థిక నిపుణులతోనూ, బీసీ నాయకులతో చర్చించి అమలు సాధ్యమయ్యేవే బీసీ డిక్లరేషన్‌లో పొందుపర్చారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారు. కానీ చంద్రబాబు ఈ పథకాన్ని తుంగలో తొక్కారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఫీజురీయింబర్స్‌మెంట్ పథకానికి వైఎస్ జగన్ పూర్వ వైభవాన్ని తెస్తారు. – పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పాలన అంటే ఎలా ఉండాలో వైఎస్సార్‌ని చూసి నేర్చుకోండి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగన్మోహన్యాదవ్, జగన్మోహన్గౌడ్, జగన్మోహన్వర్మలా ఆలోచిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. వారి సమస్యలేంటి? ఏం చేస్తే అవి పరిష్కారమవుతాయని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు తన పాలనలో బీసీలకు కార్పొరేషన్ల గురించి ఏనాడూ ఆలోచించలేదు. అసలు నీదేం పాలన చంద్రబాబూ? పాలన అంటే ఎలా ఉండాలో దివంగత వైఎస్సార్‌ను చూసి నేర్చుకో. కేవలం ఇద్దరు ముగ్గురు ఇంజినీర్లు మాత్రమే ఉన్న గ్రామంలో నేడు ఇంటికో ఇంజినీర్, గ్రాడ్యుయేట్, ఊరికి నలుగురైదుగురు డాక్టర్లున్నారంటే అది వైఎస్ పుణ్యమే. బీసీ గర్జన ఓట్ల కోసం పెట్టింది కాదు.. ఏడాదిన్నర కిందటే బీసీల సమస్యలపై జగన్.. అధ్యయన కమిటీని వేశారు. చనిపోయాక ఇచ్చే చంద్రన్న బీమా కావాలో, ప్రాణాలను కాపాడే ఆరోగ్యశ్రీ కావాలో ఆలోచించుకుని జగన్‌కు మద్దతు తెలపండి. – కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు బీసీలందరూ ఈసడించుకునేలా చంద్రబాబు ప్రభుత్వ పనితీరు ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని నాయీబ్రాహ్మణులు చంద్రబాబును వేడుకుంటే.. మీ తోకలు కత్తిరిస్తానంటూ అహంకారంగా మాట్లాడారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారు. ఆ హామీని అమలు చేయాలని నిరసన తెలియజేస్తే.. తాట తీస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. రానున్న రోజుల్లో బీసీల చేతిలో చంద్రబాబుకు గుణపాఠం తప్పదు. ఫెడరేషన్ పేరుతో యాదవులను మభ్యపెట్టి వారికి ఏం చేశారు? బోయ, విశ్వబ్రాహ్మణ, కమ్మరి, కుమ్మరి, రజక తదితర కులాలను చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారు. ఈ అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటానని వైఎస్ జగన్ ఎప్పుడో ప్రకటించారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వారిని ముందుకు తీసుకెళ్లేందుకు జగన్ దృఢ సంకల్పంతో ఉన్నారు. – తమ్మినేని సీతారామ్, మాజీ మంత్రి బీసీల సంక్షేమానికి జగన్ కృషి చేస్తారు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.35 వేలకు మించి చంద్రబాబు సర్కారు ఇవ్వడం లేదు. వైఎస్సార్ హయాంలో మొత్తం ఫీజును రీయింబర్స్ చేశారు. బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి.. వారికి ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపై పరిశీలన చేసేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి బీసీ కులాల స్థితిగతుల్ని క్షుణ్ణంగా పరిశీలించింది. బీసీల సంక్షేమానికి జగన్ కృషి చేస్తారని విశ్వసిస్తున్నాం. – నర్సయ్యగౌడ్, మాజీ మంత్రి బీసీల బంగారు భవిత కోసమే డిక్లరేషన్ పాదయాత్రలో బీసీల కష్టాలు తెలుసుకున్న వైఎస్ జగన్.. వారి బంగారు భవిత కోసం డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు. అగ్నికుల క్షత్రియ సామాజికవర్గంలోని 14 ఉపకులాలను ప్రాంతాలవారీగా విడగొట్టి ఒక్కో ప్రాంతానికి కార్పొరేషన్ ఏర్పాటుచేసి.. టీడీపీ కుల రాజకీయం చేస్తోంది. మత్స్యకారులను ఎస్టీల్లో, రజకులను ఎస్సీల్లో చేరుస్తానని చంద్రబాబు మోసం చేశారు. మళ్లీ ఎన్నికల వస్తున్న నేపథ్యంలో కుల రిజర్వేషన్ల పేరుతో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీల స్థితిగతులను మార్చి వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు వైఎస్ ముందుకొస్తున్నారు. అధికార టీడీపీ ఆగడాలను మనం చూస్తూనే ఉన్నాం. బీసీ సామాజిక వర్గాలను ఆ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో బీసీలు ఒక్కసారి మననం చేసుకోవాలి. నాటి రాజన్న పాలనకోసం వైఎస్ జగన్‌ను సీఎం చేసుకుందాం. – మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రి వైఎస్ జగన్‌తోనే బీసీల జీవితాల్లో వెలుగులు బీసీలను తెలుగుదేశంపార్టీ అణగదొక్కుతోంది. ఈ పాలనలో ఏ ఒక్క బీసీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప.. వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేసిన దాఖలాల్లేవు. బీసీల బతుకుల్లో వెలుగులు రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి. బీసీల ఐక్యతను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా బీసీల అభ్యున్నతికి కృషిచేస్తానంటూ.. కమీషన్లు నొక్కేసి.. వారిని అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. – జి.జయరాములు, ఎమ్మెల్సీ బాబు గుండెల్లో గుబులు రాజన్న బిడ్డ కోసం వచ్చిన బీసీ జన సంద్రాన్ని చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో గుబులు పుడుతోంది. ఒక పక్క తుపానులు, మరో పక్క వర్షాభావంతో కరువు తాండవిస్తుంటే.. చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా కరువుపై దరువు.. అంటాడు. మాయల ఫకీరు మాదిరిగా బీసీల విషయంలో చంద్రబాబు తీరు ఉంది. వైఎస్ హయాంలో బీసీలంటే.. బెస్ట్ కేటగిరిగా చూసేవారు.. టీడీపీ హయాంలో బిలో కేటగిరిగా మార్చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుంది. ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు డ్యాష్‌బోర్డు అయితే లోకేశ్ క్యాష్‌బోర్డు. డ్యాష్‌బోర్డు పనిచేస్తేనే క్యాష్ బోర్డు కదిలే స్థితిలో ఉంది. ఇటువంటి పార్టీని సాగనంపేందుకు ప్రతి ఒక్క బీసీ పనిచేయాలి. – విడుదల రజని, వైఎస్సార్సీపీ నేత బీసీలకు మేలు చేయాలనుకుంటున్న వైఎస్ జగన్‌ను సీఎం చేద్దాం పాదయాత్ర చేస్తూ బీసీల కష్టాలను దగ్గరుండి గమనించిన వైఎస్ జగన్.. వారు ఒక శక్తిగా ఎదగడానికి ప్రణాళికలు రచించారు. కులవృత్తులు అంతరించిపోకుండా రూ.75 వేలు ఇచ్చి ఆర్థిక స్వావలంబన చేకూర్చాలని చూస్తున్నారు. నవరత్నాల ద్వారా బీసీలకు మేలు జరుగుతుంది. వెనుకబడిన కులాలను ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నదే వైఎస్ జగన్ ధ్యేయం. బీసీలంతా ఐక్యంగా ఉండి మనకు మేలు చేయాలనుకుంటున్న వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న చంద్రబాబుకు ఓటుతో గుణపాఠం చెబుదాం. – ఉషా చరణ్, కళ్యాణదుర్గం సమన్వయకర్త రాష్ట్రాన్ని దోచుకుతింటున్న బాబును సాగనంపుదాం బీసీల భుజాలపైకెక్కి చంద్రబాబు రాక్షస తాండవం చేస్తున్నారు. యువతను, మహిళలను, రైతులను.. ఇలా అన్ని వర్గాలవారినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలు, రైతులను నిలువునా ముంచారు. రెండు నెలలకు వచ్చే కరెంటు బిల్లును నెల నెలా ఇస్తూ ప్రజలకు షాక్ ఇచ్చారు. ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్న చంద్రబాబును బీసీలు సాగనంపాలి. – కారుమూరి నాగేశ్వరరావు, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కుల వృత్తులను నిర్వీర్యం చేసిన బాబు పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు తెలుసుకున్న జగన్.. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండి కూడా జంగా కృష్ణమూర్తి నాయకత్వంలో బీసీ అధ్యయన కమిటీ వేయడం ఒక్క జగన్మోహన్రెడ్డికే సాధ్యమైంది. అన్ని పార్లమెంటరీ డివిజన్ల లోనూ సమావేశాలు పెట్టి 139 కులాలకు సంబంధించిన వినతులు స్వీకరించి.. బీసీల అభ్యున్నతికి డిక్లరేషన్ ప్రకటించారు. కులవృత్తులన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేసి.. కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేలా కుట్రలు పన్నుతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే బలహీనవర్గాలకు మేలు జరుగుతుంది. – మేకా శేషుబాబు -
హృదయాలను హత్తుకున్న బీసీ డిక్లరేషన్
ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్సీపీ బీసీ గర్జనలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీల హృదయాలను హత్తుకుంది. ప్రతి బీసీ కుటుంబం రాజకీయంగా ఎదగడమే కాకుండా, ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి కృషి చేస్తానని ఇచ్చిన హామీతో సభ చప్పట్లతో మారుమోగింది. 139 కార్పొరేషన్లు పెట్టి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటామని, ప్రతి కులానికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడంతో బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతి హామీకి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంటుందని స్పష్టంగా చెప్పడంతో సభ కరతాళధ్వనులతో మారుమోగింది. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు ఎలా మోసం చేశారో జగన్ వివరించారు. అటువంటి నాయకుడు మనకు అవసరమా? అని ప్రజలను అడగ్గా వద్దూ.. వద్దూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. సభలో జగన్ ఇచ్చిన హామీలు అందరి మనస్సులను తాకాయి. ఐదేళ్లలో బీసీల కోసం రూ.75 వేల కోట్లు ఖర్చుచేస్తానని ప్రకటించడం వారి ఆనందం రెట్టింపైంది. బీసీలకు భరోసా, భద్రత కల్పిస్తామన్నారు. పలు బీసీ కులాల గ్రూపుల్లో మార్పులుచేర్పులు చేస్తానని, సామాజికవర్గాల్లో మార్పులు చేస్తానని చంద్రబాబు చెప్పి చేయలేకపోయిన వైనాన్ని వివరించారు. (జగన్ అనే నేను.. మీ బిడ్డగా..) బీసీ సబ్‌ప్లాన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపే విషయంలో జరిగిన మోసాన్ని తెలిపారు. ఇటువంటి బిల్లులు పెట్టేటప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. శాస్త్రీయంగా చేయగలిగింది చేస్తానని, నీతిగా, నిజాయితీగా నిజం చెబుతున్నానని చెప్పినప్పుడు బీసీల మంచి స్పందన లభించింది. పాదయాత్రలో ఎంతో మంది బీసీలు తమ కష్టాలు, బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మనస్సు కలిచివేసేదని, అవన్నీ చూసిన తర్వాతే బీసీలకు ఎంతవరకైనా చేయాలనే ఆలోచన వచ్చినట్లు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పిల్లలను స్కూలుకు పంపిస్తే ప్రతి తల్లికీ రూ.15 వేలు ఇస్తానని చెప్పినప్పుడు తల్లుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు తాను ప్రకటించిన పథకాలను కాపీ కొట్టి ప్రకటించుకుంటున్నారని, ఏవేవి కాపీ కొట్టాడో వైఎస్ జగన్ సభలో వివరించారు. చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడంతో చప్పట్లు మారుమోగాయి. (వెనుకబడిన తరగతులే దేశానికి వెన్నెముక) 31 బీసీ కులాలు ఓబీసీలోకి రాకపోవడంతో కేంద్రంలో విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఈ విషయమై ఇంతకాలం బీజేపీతో కాపురం చేసిన వ్యక్తి కేంద్రానికి ఉత్తరమైనా రాయలేదన్నారు. బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారికి 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని ఇచ్చిన హామీ బీసీల్లోకి చొచ్చుకుపోయింది. ఇప్పటివరకు బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదనుకుంటున్నామని, జగనన్నతో అది సాధ్యమవుతుందని సభకు వచ్చిన ప్రజలు చెప్పుకున్నారు. మత్స్యకారులకు, చేనేతలకు, కార్మికులకు, యాదవులకు, పాల రైతులకు ఇచ్చిన హామీలు వారిని ఆకర్షించాయి. సంచార జాతులకు ఇళ్లు కట్టించి, ఉపాధి కూడా చూపిస్తామని చెప్పిన వ్యక్తి ఇప్పటివరకు జగన్ ఒక్కరేనని చెప్పవచ్చు. ప్రత్యేకించి వారి పిల్లలకు గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 32 బీసీ కులాలను తెలంగాణలో ఓసీలుగా పరిగణిస్తున్నారని, అధికారంలోకి రాగానే కేసీఆర్‌తో మాట్లాడి 32 కులాలను బీసీలుగా గుర్తించే బాధ్యత తీసుకుంటానని వారిలో ఆనందం నింపారు. -
వెనుకబడిన తరగతులే దేశానికి వెన్నెముక
బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మీరు భారతదేశం కల్చర్‌ను వేలాది సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులు. మీరంతా వెనుకబడ్డ కులాలు కాదు, మీరు మన జాతికి వెన్నుముక లాంటి కులాలు. మనం వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి తినే ఆహారం, ఉపయోగించే ప్రతి పనిముట్టు, నివసించే ఇల్లు, ప్రయాణించే బండి, నీరు తాగే గ్లాస్ నుంచి అన్నం తినే కంచం వరకు, మన ఇంటి పెరట్లో తవ్విన బావి నుంచి ఇంటికి ఉపయోగించిన ఇటుక వరకు, మన బట్టలకు పట్టిన మకిలిని వదిలించడం దగ్గర నుంచి మన వెంట్రులకు సంస్కారం నేర్పడం వరకు.. ఇలా మన ప్రతి అణువులో వేల సంవత్సరాల పాటు బీసీ కులాల పాత్ర ఎంతటి గొప్పదో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏలూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వెనుకబడిన తరగతులకు మాయమాటలు చెప్పిదే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్లుగా వారిని దారుణంగా వంచిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం ఏలూరులో ‘బీసీ గర్జన’ సభలో మాట్లాడారు. బీసీల ముఖాల్లో వెలుగులు చూడాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్నివేళలా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. త్వరలో జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దక్కబోయే ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవిని బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తికి కట్టబెడతామని ప్రకటించారు. జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మీరు భారతదేశం కల్చర్‌ను వేలాది సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులు. మీరంతా వెనుకబడ్డ కులాలు కాదు, మీరు మన జాతికి వెన్నుముక లాంటి కులాలు. మనం వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి తినే ఆహారం, ఉపయోగించే ప్రతి పనిముట్టు, నివసించే ఇల్లు, ప్రయాణించే బండి, నీరు తాగే గ్లాస్ నుంచి అన్నం తినే కంచం వరకు, మన ఇంటి పెరట్లో తవ్విన బావి నుంచి ఇంటికి ఉపయోగించిన ఇటుక వరకు, మన బట్టలకు పట్టిన మకిలిని వదిలించడం దగ్గర నుంచి మన వెంట్రుకలకు సంస్కారం నేర్పడం వరకు.. ఇలా చెప్పుకుంటే పోతే మన ప్రతి అణువులో వేల సంవత్సరాల పాటు బీసీ కులాల పాత్ర ఎంతటి గొప్పదో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి బీసీ సోదరుడికి మనం రుణపడి ఉండాల్సిందే. భారతీయ నాగరికతలో కనిపించే శిల్పం, అగ్గిపెట్టెలో పట్టే చీర, మంగళకరమైన సన్నాయి.. ఏది చూసినా, ఏది విన్నా ఇదంతా మన బీసీల గొప్పతనమే. గర్వంగా తలెత్తుకుని జీవించాలి నాగరికతకు నడకలు నేర్పిన బీసీల బతుకులు ఇప్పుడు ఎలా ఉన్నాయో మనసుతో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వీరి బతుకుల్లో మార్పు తీసుకురావడానికి మనం ఏం చేయగలుగుతామో ఆలోచించాలి. అభివృద్ధి, ఆదాయం పరంగా మన సమాజంలో ఈనాటికీ చాలామంది వెనుకబడి ఉన్నారు. బడుగులు, బలహీనులు ఈ ప్రపంచంలో గర్వంగా తలెత్తుకుని జీవించాలంటే ఉన్నతమైన చదువులు నేర్చుకోవాలి. పదవుల్లో వారికి వాటా కావాలి. చంద్రబాబు దగా చేశాడు 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో, ప్రణాళిక అంటూ ఒక పుస్తకం చూపించాడు. ఇందులో బీసీ కులాలకు సంబంధించిన 119 వాగ్దానాలు చేశాడు. వాటిలో ఒక్కటైనా సక్రమంగా అమలు చేసిన పాపానపోలేదు. రాష్ట్రంలో 2.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే చాలు బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం వస్తుందని తెలిసినా ఆ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆయనకు మనసు రాలేదు. రాష్ట్రంలో ఏది చూసినా కాంట్రాక్టు అంటాడు, ఔట్సోర్సింగ్ అంటాడు. వాటిలో రిజర్వేషన్లు ఉండవు. అంటే బీసీలను చంద్రబాబు దగా చేశాడు. బీసీల అభివృద్ధి కోసం ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో అక్షరాలా రూ.50 వేల కోట్లు ఇస్తానన్న ఈ పెద్దమనిషి చివరకు రూ.18 వేల కోట్లు మాత్రమే ఇచ్చి దారుణంగా మోసం చేశాడు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరు గారుస్తోంది. ఇవాళ మన పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకోవాలంటే అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆస్తులు ఆమ్ముకోవాల్సి వస్తోంది. అరకొరగా ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కూడా చంద్రబాబు బకాయిలు పెట్టాడు. మొత్తం రూ.2,200 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ కోర్సులు పూర్తి చేసినా పట్టాలు తీసుకోలేని పరిస్థితి దాపురించిందని చంద్రబాబు నాయుడి పాంప్లెట్ పేపర్లోనే వచ్చింది. కొత్త భూకేటాయింపుల సంగతి దేవుడెరుగు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల నుంచి ఎన్ని లక్షల ఎకరాల భూములు లాక్కున్నాడో అడగండి. బలహీన వర్గాల నుంచి వేలాది ఎకరాల భూములు లాక్కోవడానికి నీకు మనసెలా వచ్చింది చంద్రబాబూ అని నిలదీయండి. బీసీలను ప్రోత్సహించాలి రాజ్యాంగపరమైన పదవులు బీసీలకు ఎప్పుడో ఒకసారి వస్తాయి. అవి లక్ష మందిలో ఏ ఒక్కరికో రావొచ్చు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వెనుకబడిన తరగతులను ప్రోత్సహించాలి. చేతనైతే సాయం చేయాలి. కానీ, చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? ఇద్దరు బీసీలకు హైకోర్టు జడ్జీలుగా అవకాశం వస్తే వారిని అసమర్థులుగా, అవినీతిపరులుగా చిత్రీకరించి ఆ పదవులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను జస్టిస్ ఈశ్వరయ్య మీడియాకు చూపిస్తూ చంద్రబాబు నైజం గురించి చెప్పారు. చంద్రబాబుకు బీసీలపై ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం. బీసీల పట్ల తాను చేసింది తప్పు అని చంద్రబాబు ఈ రోజుకీ ఒప్పుకోవడం లేదు. వైఎస్సార్సీపీకి ఒక్క అవకాశం ఇవ్వండి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కింద కాదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే పరిస్థితి నుంచి బ్యాక్‌బోన్ క్లాస్‌గా తీసుకువస్తామని హామీ ఇస్తున్నా. బీసీలను కరివేపాకుల్లా వాడుకున్న చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఓడించండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశమివ్వండి. నవరత్నాల గురించి ఇంతకు ముందు చెప్పా. ఆ నవరత్నాలతో పేదవారి జీవితాలు మారుతాయని గట్టిగా నమ్ముతున్నా. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికీ తీసుకొస్తా. ప్రతిపేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తా. అది జరగాలంటే మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి’’ అని జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
జగన్ అనే నేను.. మీ బిడ్డగా..
ఏలూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తరతరాలుగా నిరాదరణకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, అభివృద్ధే తన ఏకైక ధ్యేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలుగెత్తి చాటారు. ఆయా వర్గాల తలరాతలను మార్చేలా పలు కీలక పథకాలను ప్రకటించారు. బడుగుల బాగు కోసం తాను రెండు అడుగులు ముందుకేస్తున్నానని ఉద్ఘాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీ గర్జన’లో పలు కీలక పథకాలను ప్రకటించారు. తాము అధికారంలో వస్తే.. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిఏటా రూ.15,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామని చెప్పారు. ఐదేళ్లలో రూ.75,000 కోట్లు వ్యయం చేస్తామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్లో మూడో వంతు నిధులను బీసీల అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్‌బోన్ క్లాస్‌గా మారుస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. బీసీలు గర్వంగా తలెత్తుకుని జీవించాలని ఆకాంక్షించారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో, నియామకాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు.. ఇస్తామని పేర్కొన్నారు. బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలన చూశాం. మార్పును కోరుతూ ఈ రోజు బీసీ గర్జన నిర్వహించుకుంటున్నాం. దాదాపు 14 నెలలు.. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. రాష్ట్రంలోని ప్రతిమూలకూ నడిచా. పాదయాత్ర మొదలు కాకముందే మన రాష్ట్రంలోని బీసీ నాయకులతో జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ అధ్యయన కమిటీ వేశాం. ఒకవైపు పాదయాత్ర చేస్తూనే, రాష్ట్రం మొత్తం పర్యటించాలని ఈ కమిటీని కోరాం. పాదయాత్రలో దారిపొడవునా బీసీల సమస్యలను తెలుసుకుంటూ వచ్చా. మరోవైపు మన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రమంతటా తిరిగారు. ప్రతిఒక్కరితో మమేకమయ్యారు. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేశారు. పాదయాత్ర సందర్భంగా బీసీల సమస్యలు నేరుగా నాకు తెలిశాయి. మన పార్టీ నాయకులతో కూడిన కమిటీ బీసీల సమస్యలపై లోతుగా అధ్యయనం చేసింది. వారి నివేదికను నాకు అందజేశారు. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని, ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వులు చూడాలనే సంకల్పంతో ఈ రోజు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తాం రేపు మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనే నేను, మీ అందరి బిడ్డను.. మీ కోసం ఏం చేస్తానో ఇవాళ చెబుతా. చంద్రబాబు ఐదేళ్లలో బీసీల కోసం సంవత్సరానికి కనీసం రూ.4 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కానీ, మన ప్రభుత్వం వచ్చాక బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిఏటా రూ.15,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామని చెబుతున్నా. అంటే ఐదేళ్లలో రూ.75,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తానని హామీ ఇస్తున్నా. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తాం. చంద్రబాబు బీసీలను వెక్కిరిస్తూ, తన హయాంలో రాని ఆరో బడ్జెట్లో పెట్టిన బిల్లు స్థానంలో.. మన ప్రభుత్వం వచ్చాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర సబ్‌ప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని హామీ ఇస్తున్నా. మూడో వంతు నిధులను బీసీల అభివృద్ధికే కేటాయిస్తాం. కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కార్పొరేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో 1,000 మంది ఉంటే, కేవలం ఐదుగురికి మాత్రమే రుణాలు ఇస్తున్నారు. అది కూడా లంచాలు తీసుకుంటారు, జన్మభూమి కమిటీ సిఫార్సులంటారు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెబుతున్నాం. అక్కాచెల్లెమ్మలకు ‘వైఎస్సార్ చేయూత’ నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, చేనేతలకు, మత్స్యకారులకు, బోయలకు, వాల్మీకులకు, కురబలకు, అగ్నికుల, వన్నెకుల క్షత్రియులకు, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, యాదవ, గౌడ, బలిజ, శెట్టి బలిజ, సూర్య బలిజ, వడ్డెర, దూదేకుల, తూర్పు కాపు, కొప్పుల వెలమ, పోలినాటి వెలమ, కళింగ వెలమ, కాళింగ, గాండ్ల, మేదర, సగర, ముదిరాజ్, భట్రాజు, జంగం, శిష్టకరణం, రెడ్డిక, వీరశివ, వడ్డీలు, షేక్‌లు తదితర బీసీ కులాలకు 139 కార్పొరేషన్లు పెడతానని హామీ ఇస్తున్నా. తాము నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన ఏ ఒక్క సామాజికవర్గంలోనూ లేకుండా అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అరకొర నిధులివ్వడం కాదు, ఆ కులంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు ఉన్న ప్రతి అక్కాచెల్లెమ్మల చేతుల్లో రూ.75,000 పెడతాం. ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదు, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. గ్రామ వాలంటీరే వారి దగ్గరికి వెళ్లి నేరుగా డబ్బులిస్తాడు. వైఎస్సార్ చేయూత అనే పథకాన్ని అమలు చేస్తాం. నాలుగు విడతలుగా డబ్బులిస్తాం. ఆ డబ్బును ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేస్తున్నా. అందరికీ న్యాయం జరిగేలా నిధులిస్తాం.. కార్పొరేషన్లకు ఇంతే ఇస్తామంటూ కత్తిరించే కార్యక్రమం చేయం. ఆ కార్పొరేషన్లో ఆ కులం జనాభా ఎంతైతే ఉంటుందో ఆ మేరకు అందరికీ న్యాయం జరిగేలా మొత్తం నిధులిస్తాం. బీసీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు ఇంకో విషయం కూడా చెబుతున్నా. మహానేత వైఎస్సార్ ఒక విషయం చెబుతూ ఉండేవారు. ఒక ఇంట్లో ఒకరు ఇంజనీర్ అయితే, ఒక ఇంట్లో ఒకరు డాక్టర్ అయితే, ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్ అయితే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని నాన్న ఎప్పుడూ అంటుండేవారు. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని చెబుతున్నా. పేదల కోసం ఆయన ఒకడుగు ముందుకేశారు, జగన్ రెండు అడుగులు ముందుకేస్తాడని హామీ ఇస్తున్నా. మీ పిల్లలను ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం. ఎంతవరకైనా చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు. నేను ఇస్తానని మాట ఇస్తున్నా. పిల్లలను ఉచితంగా చదివిస్తా. అంతేకాదు ఆ చదువుల కోసం పిల్లలు హాస్టళ్లలో ఉండాలి. ఆ హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ చార్జీల కోసం సంవత్సరానికి కనీసం రూ.15,000 ఖర్చవుతుంది. ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులున్నారు. ప్రతి తల్లికి, తండ్రికి చెబుతున్నా. పిల్లలను చదివించడమే కాదు. హాస్టళ్లలో ఉన్నందుకు, మెస్ చార్జీల కోసం సంవత్సరానికి రూ.20,000 ఇస్తాం. పునాదులు గట్టిగా ఉంటేనే మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కాగలుగుతారు. ఈ పిల్లలు బడులకు పోతే.. వారు ఇంజనీర్లు, డాక్టర్లు అయితేనే మన బతుకులు మారుతాయి. మన తలరాతలు మారుతాయి. ప్రతి తల్లికీ చెబుతున్నా. చెయ్యాల్సిందల్లా మీ పిల్లలను బడులకు పంపించడమే. బడులకు పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15,000 ఇస్తానని హామీ ఇస్తున్నా. బీసీలకు రావాల్సిన హక్కు రావడం లేదు ఈరోజు బీసీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కులం సర్టిఫికెట్ల నుంచి మొదలు పెడితే గ్రూపుల మార్పిడి వరకు వాళ్లకున్న సమస్యలు వాళ్లకున్నాయి. చంద్రబాబు వంటి మనిషిని చూసినప్పుడు ఆ సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఎంబీసీల జాబితాగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌ను ప్రకటించారు. అందులో 32 కులాలను పెట్టారు. ఆ 32 కులాలను ఎంబీసీలుగా పెట్టి ఎంత దారుణంగా చేశారంటే... ఎంత చిత్తశుద్ధి లేకుండా చేశారంటే... ఎంత హేతుబద్ధత లేకుండా చేశారంటే రేపు ఎవరైనా కోర్టుకు వెళితే మొత్తం వ్యవహారమే రద్దయ్యే పరిస్థితి వచ్చింది. ఇంతటి దారుణంగా బీసీ కులాల పరిస్థితి ఉంది. కులం సర్టిఫికెట్ రాదు. దానికోసం చంద్రబాబు చుట్టూ తిరగాలి. బీసీలకు రావాల్సిన హక్కు వారికి రావడం లేదు. జన్మభూమి కమిటీల నుంచి మొదలు పెడితే ఎవరెవరికో లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తానని హామీ ఇస్తున్నా. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటి మాదిరిగా కాకుండా, మూడేళ్లకే దాని కాలపరిమితి ముగిసిపోయేలా కాకుండా నిరంతరం బీసీ కమిషన్ పనిచేసేలా దాన్ని చట్టబద్ధం చేస్తాం. దాని పరిధిని విస్తరిస్తాం. బీసీల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు బీసీ కమిషన్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా. సమస్యల పరిష్కారానికి బీసీ కమిషన్ బీసీలలో సామాజికవర్గ మార్పులు కోరుతూ అనేక కులాలు ఉన్నాయి. సగర, కృష్ణ బలిజ, పూసల, గవర, పద్మశాలి, నాగవంశం వంటి వారు బీసీలలోనే ‘ఎ’గా గుర్తించాలని కోరుతున్నారు. మేదర, వాల్మీకి, కురబ, వడ్డెర, మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తించాలని అడుగుతున్నారు. రజక, గాండ్ల, మేదరులు, ఆరెకటికలు ఎస్సీలుగా గుర్తించమని వేడుకుంటున్నారు. నేనొక్కటే చెబుతున్నా. ఇవన్నీ కూడా రాజకీయ స్వార్థం కోసం ఒక కులాన్ని ఇష్టమొచ్చినట్లుగా ఇంకొకదానిలో పెట్టడం, ఇంకొక కులాన్ని తమ ఇష్టమొచ్చినట్లుగా తగ్గించడం, తీసేయడం... ఇవన్నీ చేయడం నిజంగా ఎటువంటి స్టడీ, హేతుబద్ధత లేకుండా, ఎటువంటి కమిటీ లేకుండా, ఎటువంటి రికమెండేషన్ లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో ఇష్టమొచ్చినట్లుగా మార్పులు చేయడం, చేయలేనివి కూడా చేస్తానని చెప్పడం నిజంగా ధర్మమేనా అని అడుగుతున్నా. ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాను. పారదర్శకత తీసుకువస్తా. ఈ కులాల డిమాండ్లను, వారి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని పారదర్శకంగా, పక్షపాతానికి తావులేకుండా వారందరి విజ్ఞప్తులను బీసీ కమిషన్‌కు అప్పగిస్తాం. పారదర్శకంగా, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా వారి సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా రాజకీయ పరిధిలోకి రాకుండా చేస్తాం. రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం నిజంగా ఏ కులం ఎక్కడ ఉండాలి అన్నది వాళ్లవాళ్ల రికమెండేషన్ల ప్రకారం అమలయ్యేలా చేస్తాం. ఈ బీసీ కమిషన్ పరిధిలో రాని అంశాలున్నాయి. ఎస్సీలుగా, ఎస్టీలుగా చేసే అంశాలున్నాయి. వీటిని కూడా ఏ రకమైన రికమెండేషన్లు లేకుండా రాష్ట్రంలోని పరిస్థితులు చెప్పకుండా, పక్క రాష్ట్రాల్లోని పరిస్థితులు చెప్పకుండా కేవలం ప్రజలను మోసం చేసేందుకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని చెప్పి మోసం చేస్తున్నారు. అది సరైంది కాదు. వారి పరిస్థితులు ఏమిటి? చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పరిస్థితి ఏమిటి? వీళ్లెందుకు ఈ డిమాండ్ అడుగుతున్నారు? వీరి డిమాండ్లలో న్యాయం ఎంతున్నదన్నది అధ్యయనం చేసి వాళ్లకు పక్క రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే అడుగుతున్నారని ఆ రిపోర్టుల్లో పెట్టి ఆ రిపోర్టుల ఆధారంగా చేసి, ఆ తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. కొన్ని కొన్ని రాష్ట్రం పరిధిలో ఉంటాయి. ఎస్సీలుగా, ఎస్టీలుగా చేయడం వంటివి కొన్ని రాష్ట్రం పరిధిలో ఉండవు. కానీ, రాష్ట్రం రికమెండ్ చేసి కేంద్రానికి పంపుతుంది. ఆ రికమెండ్ చేసేదాంట్లో శాస్త్రీయత తీసుకొని వచ్చి, రికమెండ్ చేసి మా పరిధిలో ఉన్న ప్రయత్నం కచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నా. ఓట్ల కోసం కాదు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం లేదు. అబద్ధాలు, మోసాలు ధర్మం కాదని భావిస్తున్నా. కాబట్టే నీతిగా నిజాయితీగా ఉన్నానని చెబుతున్నా. ఆదివారం ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో ప్రసంగిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్. వేదికపై బీసీ నేతలు ఒక్కసారైనా కేంద్రానికి లేఖ రాశారా? చంద్రబాబు చిత్తశుద్ధి లేకుండా పరిపాలన సాగిస్తున్నారని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెబుతా. ఆంధ్రప్రదేశ్‌లో 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీలోని జాబితాలో లేకపోవడం వల్ల ఆ కులాల వారు కేంద్ర ప్రభుత్వంలోని విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందలేకపోతున్నారు. చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేశారు. ఇద్దరు ఎంపీలను బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రులుగా పెట్టారు. నాలుగు సంవత్సరాలు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? ఆంధ్ర రాష్ట్రంలోని 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోతే కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని అధ్వానపు వ్యక్తి ఈ చంద్రబాబు. జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్న సందర్భంగా చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ నేతలు, ప్రజలు చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణం నా పాదయాత్రలో చూశాను. చాలామంది పేదవారు ఫుట్‌పాత్ పక్కన సరుకులు అమ్ముకొంటున్న పరిస్థితి చూశాను. వారు రోజుకు రూ.4 వడ్డీకి, రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఒకరు రూ.1,000, మరొకరు రూ.2,000, వేరొకరు రూ.5,000 అప్పులు తెచ్చుకుంటూ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఇటువంటి వారందరికీ గుర్తింపు(ఐడీ) కార్డు ఇస్తా. ఐడీ కార్డు ఇవ్వడమే కాదు. వీరందరికీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు సున్నా వడ్డీకే రూ.10,000 ఇస్తామని హామీ ఇస్తున్నా. మత్స్యకారుల బతుకుల్లో చిరునవ్వులు చూడాలి ఇదివరకే చెప్పాను. పాదయాత్రలో కొన్నికొన్ని కులాలకు మాట ఇచ్చా. ఇవాళ బీసీ డిక్లరేషన్‌లో భాగంగా ఆయా కులాలకు చెప్పిన మాటలను మళ్లీ క్లుప్తంగా చెబుతా. షాపున్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ప్రతి షాపునకు సంవత్సరానికి రూ.10,000 ఇస్తామని హామీ ఇస్తున్నా. సంచార జాతుల వారిని గుర్తిస్తామన్నా. వారంతా స్థిరంగా ఒకచోట ఉండడానికి నివాసముండే విధంగా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పా. వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాదు. తగిన ఉపాధి కూడా కల్పిస్తామని హామీ ఇస్తున్నా. వారి పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. పాదయాత్రలో మత్స్యకార సోదరులకు మాట ఇచ్చా. వేట నిషేధ సమయంలో రూ.4,000 కూడా ఇవ్వడం లేదన్నా.. అది కూడా అందడం లేదన్నా అని నాకు చెప్పారు. వారికి మాట ఇచ్చా. వేట నిషేధ సమయంలో రూ.4,000 కాదు, రూ.10,000 ఇస్తామని మాట ఇచ్చా. వారి బతుకుల్లో చిరునవ్వులు చూడాలి. వారికి ఏమీ జరగకూడదు. కానీ, పొరపాటున వారికి ఏమైనా జరిగితే వారి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని కూడా నేను హామీ ఇచ్చా. ఈ ప్రభుత్వం కొత్త బోట్లను రిజిస్ట్రేషన్ చేయడం లేదన్నా అని వారు చెప్పారు. డీజిల్ సబ్సిడీ సొమ్ము ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని, కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి అని చెప్పారు. ఆ మత్స్యకార సోదరులందరికీ మాట చెప్పా. కొత్త బోట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తాం. పాతబోట్లను గుర్తిస్తాం. డీజిల్ సబ్సిడీని పాత కొత్తబోట్లకు తేడా లేకుండా పెంచుతాం. డీజిల్ పట్టేటప్పుడే ఆ సబ్సిడీని కూడా ఇస్తామని మాట ఇచ్చా. మెకనైజ్డ్ బోట్లు, ఫైబర్‌బోట్లు ఇలా అన్నింటికీ నిబంధనలు అడ్డుపెట్టకుండా ఇస్తామని హామీ ఇచ్చా. ఆ 32 కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తా.. రాష్ట్రం విడిపోయిన తరువాత పక్కన తెలంగాణ రాష్ట్రంలోని 32 కులాలను వారు బీసీ జాబితాలో గుర్తించలేదని చెప్పి అక్కడ కూడా బీసీ జాబితాలో చేర్పించేలా చేయాలని చాలామంది నన్ను పాదయాత్రలో అడిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు ఇంటికి వచ్చారు. చంద్రబాబు శాలువాలు కప్పి కేసీఆర్‌కు భోజనాలు పెట్టారు. కానీ, ఇప్పుడు కేసీఆర్‌కు ఈ 32 బీసీ కులాల గురించి చెప్పాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదు. హరికృష్ణ చనిపోయినప్పడు శవం పక్కన పెట్టుకొని కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు. కానీ, తెలంగాణలోని 32 కులాలు కేంద్రంలోని బీసీ జాబితాలో లేవు, వాటిని చేర్చండి అని చంద్రబాబు నోట్లోనుంచి ఒక్కమాట కూడా రాలేదు. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక కేసీఆర్‌తో నేను మాట్లాడుతా. ఆ 32 కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం చేస్తానని మాట ఇస్తున్నా. బీసీలు రాజకీయంగా ఎదగాలి బీసీల కోసం ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాం. బీసీలు ఎదగాలి. పేదవారు ఎదగాలి. రాజకీయంగా ఎదగాలి. పదవుల్లో ఉండాలి. రాజకీయంగా వీరి ఎదుగుదల కోసం, పదవుల్లో వీరు ఉండడం కోసం గవర్నమెంట్ పరిధిలో ఉన్న అన్నింటిలోనూ మార్కెట్ కమిటీల్లో కావచ్చు, ఛైర్మన్లలో కావచ్చు, కమిటీలలో కావచ్చు, ట్రస్టు బోర్డులు కావచ్చు, ట్రస్టు బోర్డు ఛైర్మన్లు కావచ్చు, ట్రస్టు బోర్డుల్లో సభ్యులు కావచ్చు. గుడులు కావచ్చు, గోపురాలు కావచ్చు. కార్పొరేషన్ పదవులు కావచ్చు. ఇలా గవర్నమెంటు పరిధిలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. ఈ మేరకు మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే చట్టం తీసుకొస్తాం. నామినేటెడ్ పదవులే కాదు, నామినేషన్ కింద ఇచ్చే పనుల్లో 50 శాతం పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందేలా చట్టం తీసుకొస్తాం.. ప్రభుత్వ పనుల్లో 50 శాతం బడుగులకే.. ఇంకా ఒక్క అడుగు ముందుకేస్తున్నాం. ప్రభుత్వ కాంట్రాక్టు సర్వీసులున్నాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నిజంగా పేదరికంలో అల్లాడుతున్న వర్గాలు. వీళ్ల బతుకులు మారాలి. ఆర్థికంగా స్థితిమంతులు కావాలి. ఆర్థికంగా కొద్దో గొప్పో సంపాదించుకొనే పరిస్థితుల్లోకి రావాలి. ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి మొదలుపెడితే... గవర్నమెంట్ కార్లను బాడుగకు తీసుకోవడం, గుళ్లలో, హాస్పిటళ్లలో, స్కూళ్లల్లో ఇలా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టుల కింద సంపాదించుకొనే చిన్నచిన్న పనులు ఎక్కడైనా కూడా.. గవర్నమెంటులో సంపాదించుకొనే మార్గమేదైనా ఉంటే కాంట్రాక్టుకో, ఔట్సోర్సింగ్కో ఇప్పించుకొని సంపాదించుకొనేలా ఉండి ఉంటే వాటన్నింటిలోనూ 50 శాతం పనులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకు వచ్చేలా చట్టం తీసుకొస్తామని హామీ ఇస్తున్నా. గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6,000 చేనేత అక్కాచెల్లెమ్మలకు మాట చెప్పా. వారింటికి వెళ్లి భరోసా ఇచ్చా. ఇంట్లో మగ్గం ఉండి చేనేతతోనే జీవితం గడుపుతున్న ప్రతి అక్కాచెల్లెమ్మకు పెట్టుబడి రాయితీ కింద రూ.2,000 నెలనెలా ఇస్తామని హామీ ఇచ్చా. ఇవన్నీ కూడా మనం నవరత్నాల్లో ప్రకటించిన పథకాలకు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చా. సహకార డెయిరీలకు పాలుపోస్తే చాలు అదనంగా లీటరుకు రూ.4 సబ్సిడీ కింద ఇస్తామని హామీ ఇచ్చా. యాదవ సోదరులకు చెప్పా. గొర్రెలున్నాయి. మేకలున్నాయి. కానీ చెవులకు పోగులు లేవని, చనిపోతే ఇన్సూరెన్సు రావడం లేదు. ప్రతి యాదవ సోదరుడికి చెప్పా. గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6,000 వచ్చేటట్టుగా చేస్తానని చెప్పా. అంతేకాదు తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కు ఆ సన్నిధి గొల్లలకే ఇస్తామని, వారికి వంశపారంపర్య హక్కులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చా. అంతేకాదు ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం ఇచ్చేట్టుగా చేస్తానని హామీ ఇస్తున్నా. ఈ ప్రధాన ఆలయాల్లో మన బతుకుల గురించి ఆలోచన చేసేందుకు బోర్డు మెంబర్ల కింద నాయీబ్రాహ్మణులను, యాదవులను కూడా పెడతామని హామీ ఇస్తున్నా. చిట్టచివరగా ఇది జరగకూడదని ఆశిస్తున్నా. కానీ, పొరపాటున ఏ పేదవాడైనా, ఏ రైతన్న అయినా చనిపోతే ఆయా కుటుంబాల బతుకులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఎవరైనా చనిపోతే అప్పుల వాళ్లు మరుసటి రోజే ఇంటికి వస్తారు. చనిపోయారని కూడా కనికరించరు. మా డబ్బులు కట్టండి అంటూ విపరీతమైన హింసపెడతారు. పేదవాడు బతకలేని పరిస్థితి. ఈరోజు ప్రతి పేదవాడికి చెబుతున్నా. పొరపాటున ఆ పేదవాడు ఆత్మహత్య చేసుకున్నా, పొరపాటున అకాల మరణానికి గురైనా, ఆ పేదవాడు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, రైతన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా ఇంతకు ముందు రైతన్నలకు రూ.5 లక్షలని చెప్పా. అది కూడా మార్పు చేస్తున్నా. పొరపాటున ఇటువంటి దుర్ఘటన జరిగితే వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం కింద రూ.7 లక్షలు ఇస్తామని హామీ వాగ్దానం చేస్తున్నా. అంతే కాదు చట్టాన్ని తీసుకువస్తాం. ఎవరైనా అప్పుల వాళ్లు వచ్చి ఆత్మహత్య చేసుకున్న వారి మీదికి వస్తే... మా అప్పులు తీర్చాలని బలవంతంగా వారి మీద పడితే... ఆ పేద కుటుంబ సభ్యుడికి ఇచ్చే సొమ్ము అది గవర్నమెంట్ సొమ్ము. ఆడపడుచుకు సాయం కింద ఇస్తున్నాం. ఆ డబ్బు మీద బాధిత కుటుంబ సభ్యులకు తప్ప ఏ ఒక్కరికీ హక్కులేదని చట్టాన్ని తీసుకొస్తాం’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఏలూరులో భారీగా ట్రాఫిక్‌జాం
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు హనుమాన్ జంక్షన్ వద్ద నాలుగు గంటలుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వైఎస్ జగన్ తలపెట్టిన బీసీ బహిరంగ సభ తర్వాత పోలీసులు పత్తా లేకుండా పోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కసారిగా బస్సులు, ఇతర వాహనాలు బయటకు రావడంతో రోడ్లు క్రిక్కిరిసిపోయాయి. వాహనాలు ముందుకు కదలడం కష్టమైపోయింది. కలపర్రు టోల్గేట్ వద్ద టోల్‌ఫీజు వసూలుతో మరింతగా ఇబ్బందులు తలెత్తాయి. -
ఏలూరు బీసీ గర్జన సభలో వైఎస్ జగన్
-
ఐదేళ్లలో బీసీలకు 75వేల కోట్లు కేటాయిస్తాం
-
బీసీ జీవితాలను మార్చే వరాల వెల్లువ
సాక్షి, ఏలూరు: సామాజికంగా వెనుకబడిన బీసీ వర్గాలపై అపారమైన ప్రేమను చాటుతూ.. వారి అభ్యున్నతి, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో రూ. 15వేల కోట్లు రూపాయలు కేటాస్తాయిమని, ఐదేళ్లలో రూ. 75వేల కోట్లు బీసీలకు అందిస్తామని వైఎస్ జగన్ చరిత్రాత్మక ప్రకటన చేశారు. బీసీలకు ప్రతి ఏడాది రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. గత ఐదేళ్లలో రూ. 60వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ. 18వేల కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. ఏలూరులో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభ బీసీ గర్జనలో ఆయన బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తూ.. పలు కీలక ప్రకటనలు చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే సమగ్ర బీసీ సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. బీసీ వర్గాల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్ చేయూత కింద రూ. 75వేలు ప్రతి ఏడాది నేరుగా అందజేస్తామని ప్రకటించారు. గ్రామ వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వైఎస్సార్ చేయూత కింద డబ్బును పంపిణీ చేస్తారని వెల్లడించారు. పేదవాడి సంక్షేమం కోసం రెండడుగులు ముందుకేస్తా.. ‘పేదవాడి సంక్షేమం కోసం దివంగత నేత, నాన్న వైఎస్సార్ ఒక్క అడుగు ముందుకువేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తాను. మీ పిల్లలను కలెక్టర్, డాక్టర్, ఇంజినీర్ ఏదైనా చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా చదివిస్తాం. హాస్టల్లో ఉండి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20వేలు ఇస్తాం. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ. 15వేలు ఇస్తాం’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బీసీ కమిషన్ పనిచేసేలా చట్టబద్ధత కల్పిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. కులం సర్టిఫికెట్లు, గ్రూపుల మార్పిడి, ఎంబీసీలతోపాటు బీసీల సమస్యలు పరిష్కరించేందుకు బీసీ కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. బీసీ ఉపకులాల్లో ఉన్న డిమాండ్లను వారి ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ కమిషన్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం ధర్మం కాదని అన్నారు. రాష్ట్రంలోని 31 బీసీ కులాలు కేంద్రం పరిధిలోని ఓబీసీ జాబితాలో లేవని, అయినా నాలుగున్నరేళ్లు కేంద్రంలో బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ఈ కులాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి 32 కులాలను బీసీ జాబితాలో చేర్పిస్తామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేసి.. రూ. 10వేల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు. షాపులున్న ప్రతి నాయి బ్రాహ్మణులకు ఉచితంగా ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామన్నారు. సంచార జాతులకు ఉచితంగా ఇల్లు, ఉపాధి కల్పిస్తామని, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10వేలు ఇస్తామని, ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామన్నారు. మత్స్యాకారులకు ఇచ్చే డీజిల్‌పై సబ్సిడీ పెంచుతామన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత మహిళకు ప్రతి నెలా రూ.2 వేలిస్తామని హామీ ఇచ్చారు. సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 అదనంగా చెల్లిస్తామన్నారు. ప్రధాన ఆలయాల్లో నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం అందజేస్తామన్నారు. ఆలయాల్లో బోర్డు మెంబర్లుగా నాయి బ్రాహ్మణులు, యాదవులకు చోటు కల్పిస్తామని తెలిపారు. పేదవాడు ప్రమాదవశాత్తు చనిపోతే వైఎస్ఆర్ బీమా కింద రూ.7లక్షలు అందజేస్తామన్నారు. అప్పుల వాళ్లు ఆ కుటుంబాన్ని వేధించకుండా అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వం ఆడపడుచుకు ఇచ్చిన కట్నంగా ఆ డబ్బును అందిస్తామన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, తాము చేసిన మంచి పనులు చెప్పుకుని ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓటు అడుగుతామని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. -
బీసీలంటే భారతీయ సంస్కృతి : వైఎస్ జగన్
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, భారతీయ సంస్కృతని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. బీసీలంటే వెనుకబడ్డ కులాలు కాదని.. మన జాతికి వెన్నుముకలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ గర్జన మహాసభలో ఆయన ఆశేష బీసీ జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘బలహీన వర్గాల అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలను చూస్తా ఉంటే.. ఈ రోజు నిజంగా కురుక్షేత్రం చివరి రోజు అన్నట్లుగా ఉంది. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశాం. మార్పులను కోరుతూ ఈ రోజు బీసీ గర్జనను నిర్వహించుకుంటున్నాం. 14 నెలలపాటు.. సుమారు 3600 కిలోమీట్లరు పైగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాను. పాదయాత్ర ముందే పార్టీ బీసీ కమిటీలు వేసి రాష్ట్రం మొత్తం పర్యటించమన్నాను. ఒకవైపు నా పాదయాత్ర జరుగుతుండగా.. మరో వైపు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో బీసీ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. పాదయాత్రలో ఓవైపు నేను బీసీ సమస్యలు తెలుసుకుంటుండగా.. మరోవైపు మన పార్టీ కమిటీ కూడా బీసీలందరితో మమేకమైంది. వారి సమస్యలు తెలుసుకొని అధ్యయనం చేసింది. సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేసి.. నివేదికను నాకు అందజేసింది. రేపొద్దున ఆ దేవుడి ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. పేదవాడి జీవితంలో వెలుగులు నింపడానికి, ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వును చూడటానికి ఏం చేయబోతున్నామో చెప్పడానికే ఈ బీసీ గర్జనకు పిలుపునిచ్చాం. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లు కారు.. భారత దేశ కల్చర్‌ను నిలబెట్టిన గొప్పవారు. వెనుకబడ్డ కులాలు కాదు.. మన జాతికి వెన్నుముకలు. వేసుకునే దుస్తులు నుంచి తినే ఆహారం వరకు.. ఉపయోగించే పనిముట్టు.. కట్టుకునే ఇల్లు, మనం అన్నం తినే కంచం వరకు మన బట్టలకు పట్టిన మకిలిని వదిలించడం. మన జుట్టుకు సంస్కారం నేర్పిన బీసీలకు రుణపడి ఉన్నాం. మన నాగరికతను కాపాడిన వ్యక్తులు బీసీలే. బడుగులు, బలహీనులు తలెత్తుకుని నిలబడాలంటే.. మంచి చదువు, పెట్టుబడులు, అధికారంలో చోటు కావాలి. గ్రామాలల్లో ఇప్పటి తరం వారు చేసుకుంటున్న పనులు లాభసాటిగా ఉండాలి. వారు వచ్చే తరాన్నైనా ప్రపంచానికి గొప్పగా పరిచయం చేయాలి. ఆ వాగ్ధానాలకు దిక్కేలేదు.. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు 119 వాగ్ధానాలతో బీసీ డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్‌కు దిక్కులేకుండా పోయింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ప్రతి ఏడాది 10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ పెడతామని హామీ ఇచ్చారు. బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టి అమలుకు చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టి అమలుకు చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానాల్లో మార్పులు తెస్తామన్నారు. వెనుకబడిన తరగతులు రిజర్వేషన్లు 33 శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. 2 లక్షల 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి బాబుకు మనసు రాలేదు. ఆధార్‌తో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు. చేనేతల అభివృద్ధికి వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు మళ్లీ బీసీ డిక్లరేషన్ అంటున్నారు. దివంగత మహానేత వైఎస్ హయాంలో 100 శాతం ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బాబు నీరుగార్చారు. చంద్రబాబు హయాంలో ముష్టివేసినట్టు రూ. 30 వేల రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. దీంతో పేదపిల్లలు చదవుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బులు ఇవ్వడం లేదు.. కాలేజీలు పట్టాలు.. బాబు ఐదేళ్ల పాలనలో రూ. 2,200 కోట్లు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ పూర్తి చేసినా రూ. 4,500 మందికి పట్టాలు రాని పరిస్థతి ఉంది. ఇంజనీరింగ్ కాలేజీల్లోను ఇదే పరిస్థితి. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు.. కాలేజీలు పట్టాలు ఇవ్వడం లేదు. విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రతి కులాన్ని మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని వాటిపై హామీలిచ్చి మోసం చేశారు. ప్రతికులంలోను వాళ్ల ఆకాంక్షలను రెచ్చగొట్టి మోసం చేయడం ధర్మమేనా? ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు బీసీలకు కార్పొరేషన్లు అంటున్నారు. తన హయాంలోకి రాని బడ్జెట్లో కార్పొరేషన్లకు నిధులు కేటాయించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో కార్పొరేషన్ల ఏర్పాటు చేయలేదు. వడ్డీలకు సరిపోని విధంగా రైతులకు రుణమాఫీ ఇచ్చారు. ఎన్నికల కోసం అన్నదాత సుఖీభవ అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఇస్తున్నారు. అమరావతిలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల భూములు లాక్కున్నారు? రాజధాని పేరుతో వేల ఎకరాల బలహీన వర్గాల భూములు లాక్కున్నారు. బీసీలే వెన్నెముక అంటారు కానీ, బీసీలకు తమ పార్టీ వెన్నెముక అని చెప్పరు. చంద్రబాబు బీసీలను కరివేపాకుల్లా వాడుకుంటున్నారు. ఇద్దరు బీసీలకు హైకోర్టు జడ్జిలుగా అవకాశం వస్తే.. బీసీలు అసమర్థులని చంద్రబాబు హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించమంటే తోలు తీస్తా ఖబడ్దార్ అంటారు. న్యాయం చేయమని అడిగితే తోక జాడిస్తే కత్తిరిస్తా అని బెదిరిస్తారు. బీసీలపై చంద్రబాబు నైజం ఇదే. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు వైఎస్ జగన్ చెప్పిన పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొడుతున్నారు.’ అని ఐదేళ్ల పాలనలో చంద్రబాబు బీసీలను ఎలా మోసం చేశారో వైఎస్ జగన్ వివరించారు. అనంతరం తాను అధికారంలోకి వస్తే బీసీల జీవితాల్లో వెలుగునింపాడానికి చేయబోయే పనులు ఏంటో తెలియజేస్తూ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. (చదవండి: వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్) -
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్
-
మాట తప్పని వీరుడు జగన్: ఆర్.కృష్ణయ్య
సాక్షి, ఏలూరు : మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు. బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారు. బీసీలకు ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తామని మాట ఇచ్చి చేసి చూపించారు. బీసీల కోసం నాడు నా పోరాటాలకు వైఎస్సార్ స్పందించారు. బీసీల కోసం కమిటీ కూడా వేశారు. బీసీలకు ఏదైనా చేసిన నాయకుడు ఉన్నారంటే వైఎస్సార్ అనే చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆ చలవ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. గురుకుల పాఠశాలలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. బీసీలు అభివృద్ధి కోసం నాడు వైఎస్సార్ పదేపదే తాపత్రయపడ్డారు. అదేవిధంగా తండ్రి అడుగు జాడల్లో జగన్ నడుస్తున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ల అమలు కోసం ఏ ఒక్క పార్టీ కూడా స్పందించలేదు. పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే హామీ ఇచ్చారు. పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్లపై పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డితో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ సీపీదే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. అప్పుడే రీయింబర్స్మెంట్ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. నేను 40సార్లు ప్రధానమంత్రిని కలిశానన్న చంద్రబాబు నాయుడు ఒక్కసారి అయినా బీసీల కోసం మాట్లాడారా?. సెంటిమెంట్లు, డబ్బులు, ప్రలోభాలు, క్షణికావేశాలకు బీసీలు లొంగిపోవద్దు. కచ్చితంగా వైఎస్ జగన్‌కే ఓటు వేయండి. మాట ఇస్తే తప్పని వ్యక్తి వైఎస్ జగన్. డిమాండ్లు పెడతానన్న భయంతోనే టీడీపీ బీసీ సభకు నన్ను పిలవలేదు. వైఎస్ జగన్ మీ డిమాండ్లు చెప్పాలని నన్ను ఆహ్వానించారు. -
వైఎస్ జగన్‌కు బీసీ ఫెడరేషన్ వినతిపత్రం
-
ఊసరవెల్లి సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తున్నారు
-
ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా?
-
గర్జన సభతో మిగిలిన బాక్సులూ బద్దలైపోతాయి
సాక్షి, ఏలూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో బాబుల బాక్సులు బద్దలైపోయాయని, ఇంకేమైనా మిగిలి ఉంటే బీసీ గర్జన సభతో అవి కూడా పగిలిపోతాయని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఏలూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో పార్థసారథి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రత్యేక హోదా రాకుండా మోసాలు చేశారని, ఆ మోసాల నుంచి తప్పించుకునేందుకు పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బీసీల అభివృద్ధి కోసమే బీసీ గర్జన సభను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్ల ఎంతోమంది బీసీలు అభివృద్ధి చెందారని, వైఎస్సార్ వల్ల బీసీల్లోనూ ప్రతి ఇంట్లో డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని గుర్తు చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో బీసీలు తలెత్తుకొని బతకగలరని, బీసీల హక్కులు కాపాడాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆ పాలనను మళ్లీ రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ పాలనలో ప్రజలు ఆత్మాభిమానంతో జీవించారన్నారు. ప్రజలందరూ సామాజిక గౌరవాన్ని పొందేవిధంగా వైఎస్ఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారన్నారు. ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా? చంద్రబాబు పాలనలో ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా? అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే.. చంద్రబాబు బీసీలను దూషించారని గుర్తు చేశారు. ఏలూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని ధర్మాన స్పష్టం చేశారు. గ్రామగ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల పథకం గురించి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ధర్మాన సూచించారు. బీసీలంతా వైఎస్ జగన్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. -
అమర జవాన్లకు వైఎస్ జగన్ నివాళి
-
అమర జవాన్లకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, ఏలూరు : పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన అమర జవాన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రద్ధాంజలి ఘటించింది. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటగా అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకుముందు సభా వేదికపై జ్యోతిరావు పూలే, సాయిత్రీబాయి పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గన్నవరం నుంచి ఏలూరుకు రోడ్డు మార్గంలో చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. బీసీ గర్జన సభకు ఆర్.కృష్ణయ్య వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ గర్జన సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. బీసీ గర్జన వేదికపై ఆయన కూడా ఆశీనులయ్యారు. వైఎస్ జగన్‌కు బీసీ ఫెడరేషన్ వినతిపత్రం బీసీల సమస్యలపై బీసీ ఫెడరేషన్ ఆల్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య తరఫున ఆయన ప్రతినిది గూడురి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏలూరు సభా వేదికపై వైఎస్ జగన్‌ను కలిసిన బీసీ ఫెడరేషన్ ప్రతినిధులు.. పలు సమస్యలు, సలహాలతో కూడిన అర్జీని అందజేశారు. బీసీలకు అండగా ఉంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. -
బీసీలను మోసం చేసిన బాబును నమ్మే ప్రసక్తే లేదు
-
బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
-
‘టీడీపీని తొక్కుదాం.. అన్నకు అండగా ఉందాం’
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : 40 లక్షల బీసీ కుటుంబాల్లో విద్యతో వెలుగు నింపిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీసీ సోదరులంతా అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన మహాసభలో ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, బీసీలందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబును నమ్మే ప్రసక్తే లేదన్నారు. 2019 ఎన్నికల్లో బీసీ సోదురులంతా ఒక తాటిపైకి వచ్చి జగనన్నకు అండగా ఉండి సీఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు. టీడీపీవాళ్లు మాట్లాడితే తాటతీస్తాం అంటున్నారని, తాటతీసేది ఎవరో 2019 ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. 139 బీసీ కులాల సంక్షేమం గురించి ఈ సభ ద్వార వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీసీలైనా, మైనార్టీలైనా, ఎస్సీలైనా వైఎస్సార్సీపీకే మద్దతుంటుందన్నారు. తెలుగు దేశాన్ని తొక్కుదాం.. జగనన్నకు అండగా ఉందామన్నారు. అస్తమించే సూర్యుడు చంద్రబాబైతే.. మన జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడు వైఎస్ జగనని, చీకటి నింపే నాయకుడు చంద్రబాబును తరిమికొడదామని పిలుపునిచ్చారు. -
టీడీపీ పాలనలో బీసీలు వంచనకు గురయ్యారు
-
చరిత్ర తెలియని చరిత్ర హీనుడు చంద్రబాబు
-
బీసీల దశదిశ మార్చేలా ‘బీసీ డిక్లరేషన్’
-
విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్: రజనీ
-
విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్: రజనీ
సాక్షి, ఏలూరు : విశ్వసనీయత, విధేయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజనీ అన్నారు. వైఎస్ జగన్ అంటేనే జనహోరు, జన జాతర అని... ఆయన పేరు వింటేనే చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన మహాసభలో ఆమె మాట్లాడుతూ.. బీసీలు అంటే బలహీన వర్గాలకు సంబంధించివారు కాదని బ్రహ్మ కమలాలు. బీసీలను ‘ఈసీ’ ( ఎలక్షన్ క్యాంపెయనర్లు)గా వాడుకుని, అనంతరం వారిని పట్టించుకోని చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీలను బెస్ట్ క్యాటగిరి అని అన్నారు. అలాగే మళ్లీ మనం బెస్ట్ క్యాటగిరిగా మారదాం. ఇక చంద్రబాబు నాయుడు మాయల ఫకీరులా బీసీలకు మాయమాటలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన డ్యాష్ బోర్డు అయితే... ఆయన కుమారుడు నారా లోకేష్‌ది క్యాష్ బోర్డులాంటిది. క్యాష్ బోర్డు చూస్తేనే డ్యాష్ బోర్డు పనిచేస్తుంది. యథా రాజా తధా ప్రజాలా వాళ్ల అడుగు జాడల్లోనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా నడుస్తున్నారు. ఓ వైపు కరువు, తుఫాన్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ‘కరువుపై కబడ్డీ.... తుఫానుపై తొలి విజయం’ అంటూ ఎల్లో మీడియాతో పాటు సోషల్ మీడియాలో గప్పాలు కొడుతున్నారు’ అని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీసీ సోదర, సోదరీమణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిచించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని విడదల రజనీ పిలుపునిచ్చారు. -
చరిత్ర తెలియని చరిత్ర హీనుడు చంద్రబాబు
సాక్షి, ఏలూరు: బీసీల గురించి, బీసీల చరిత్ర గురించి తెలియని చరిత్రహీనుడు చంద్రబాబునాయుడు అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రామాయణ, భారత, భాగవత పురాణాల్లో బీసీలకు గొప్ప చరిత్ర ఉందని, అలాంటి బీసీలను నోటికొచ్చినట్టు మాట్లాడే చంద్రబాబు లాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని అన్నారు. ఏలూరులో ఆదివారం వైఎస్సార్సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో తమ్మినేని సీతారాం మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ చంద్రబాబును కలిసేందుకు నాయి బ్రాహ్మణులు వెళితే.. వారి తోకలను కత్తిరిస్తానని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, నాయి బ్రాహ్మణుల చేతిలో కత్తెర ఉంటుందని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గుండుకొట్టి పంపిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తమను ఎస్టీల్లో చేర్చాల్సిందిగా కోరుతూ ఆందోళన చేసిన మత్స్యకారులను తాట తీస్తామని చంద్రబాబు హెచ్చరించారని, మత్స్యకారులు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని పసిఫిక్ సముద్రంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. యాదవ, కురవా, బోయల సామాజిక వర్గాలను సైతం చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లిస్తున్నారని, ఆగస్టు నెలనాటికి పోస్టు డేటెడ్ చెక్కులు ఇచ్చి మహిళలను మభ్యపెడుతున్నారని, ఆగస్టు నాటికి చంద్రబాబు ప్రభుత్వం ఫసిపిక్ మహా సముద్రంలో కలిసిపోతుందని అన్నారు. జనాభా ప్రాతిపదికగా బీసీలందరికీ న్యాయం చేసేందుకు, వారి సంక్షేమానికి పాటుపడేందుకు, బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు వైఎస్ జగన్ గొప్ప బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించబోతున్నారని తెలిపారు. బీసీలు వంచనకు గురయ్యారు.. బీసీ సామాజికవర్గాలకు గత ఎన్నికల్లో కులాల వారీగా హామీలిస్తూ.. చంద్రబాబునాయుడు అన్ని వర్గాలను మోసం చేశారని, టీడీపీ పాలనలో బీసీలు వంచనకు గురయ్యారని వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఏలూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో మోపిదేవి మాట్లాడుతూ.. బీసీలకు పటిష్టమైన భద్రత కల్పించడానికి బీసీల సామాజిక పరిస్థితులపై వైఎస్ జగన్ క్షుణ్నంగా అధ్యయనం చేసి.. తెలుసుకున్నారని, బీసీల వర్గాలందరికీ జీవన భద్రత కల్పించేందుకు, వారిని అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఒక భరోసాను వైఎస్ జగన్ సభలో ఇవ్వబోతున్నారని మోపిదేవి తెలిపారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఒక్కో సామాజిక వర్గ బలహీనతలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్సీపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు అండగా ఉంటూ.. మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. వైఎస్సార్సీపీ నేత మేకా శేషుబాబు మాట్లాడుతూ.. బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే సభలు పెట్టి చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. -
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన చంద్రబాబుకు గుణపాఠం తప్పదు
-
బీసీల దశదిశ మార్చేలా ‘బీసీ డిక్లరేషన్’
సాక్షి, ఏలూరు : బీసీల దశదిశ మార్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘బీసీ డిక్లరేషన్’ ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఇచ్చిన మాట తప్పని నైజం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానిదని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన మహాసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. ‘ మహానేత వైఎస్ఆర్ హయంలో ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట తప్పని తత్వం వైఎస్ఆర్ కుటుంబానిది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో అన్ని వర్గాలు ఉన్నత చదువులు కొనసాగించేలా వైఎస్సార్ ఆ పథకం ప్రవేశపెట్టారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గం. ఈ విషయాన్ని వైఎస్సార్ గుర్తించే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించాలి. ఇక తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో సుమారు 110 హామీలు ఇచ్చినా, అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అమలుకానీ హామీలతో చంద్రబాబు బీసీలను మోసం చేశారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మరోసారి చంద్రబాబు బీసీల మభ్యపెడుతున్నారు. ప్రస్తుతం కుల వృత్తులన్నీ మరుగునపడుతున్నాయి. ఎస్సీ కమిషన్‌కు ఉండే అధికారాలే బీసీ కమిషన్‌కు కూడా ఉండాలి. నామమాత్రపు బీసీ కమిషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వెనుకబడిన కులాల జనగణన జరిగితేనే బీసీలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు హయాంలో వెనకబడిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకబడిన 40 కులాలకు ఏం చేసిందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
బీసీలను దూషించిన బాబుకు గుణపాఠం తప్పదు
సాక్షి, ఏలూరు: ఎన్నికలు వస్తుండటంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బీసీలు గుర్తుకొస్తున్నారని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన బీసీలను వాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని హేలాపురి టౌన్షిప్ పక్కనే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంలో వైఎస్సార్సీపీ చేపట్టిన కీలకమైన ‘బీసీ గర్జన’ సభ ప్రారంభమైంది. ఈ సభలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీల పట్ల చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న దమననీతిని ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే బీసీలను చంద్రబాబు దూషించారని దుయ్యబట్టారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన చంద్రబాబుకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. బీసీలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. -
‘చారిత్రాత్మక సదస్సు.. ఇదే మొదటిసారి’
-
‘చారిత్రాత్మక సదస్సు.. ఇదే మొదటిసారి’
సాక్షి, పశ్చిమ గోదావరి: ఈ రోజు ఏలూరులో జరగబోయే బీసీ గర్జన సదస్సు చారిత్రాత్మకమైనదని, ఓ రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించటం ఇదే మొదటిసారని వైఎస్సార్ సీపీ బీసీ నేతలు వ్యాఖ్యానించారు. బీసీ గర్జన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ బీసీ నేతలు బాల సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బర్రి శంకర్, మండల కన్వీనర్లు దొంగ మురళి, కర్రి ఏసు, బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే న్యాయం జరుగుతుందని, చంద్రబాబునాయుడు ఇచ్చే తాయిలాలకు బీసీలు ఎవరూ మోసపోరన్నారు. వైఎస్ జగన్‌ను బీసీలు ఎవరూ ఈ విషయంలో మరిచిపోరని పేర్కొన్నారు. బీసీ గర్జనలో పాల్గొనడానికి నరసాపురం నియోజకవర్గం నుంచి ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో 4000 వేల మంది బీసీ సోదరులు 60 బస్సులు, 100 కారులలో బయలు దేరారు. -
బీసీలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే
-
గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, గన్నవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముస్తాఫా, పార్టీ నేతలు కె.పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యార్లగడ్డ వెంకట్రావు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు ఉన్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నేడు బీసీ గర్జన సభ జరగనుంది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. గన్నవరం నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా ఏలూరు వెళతారు. వైఎస్ జగన్‌ను కలిసిన 1998 డీఎస్సీ అభ్యర్థులు మరోవైపు గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌ను 1998 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. నాలుగువేల మందికి పైగా అభ్యర్థులు వుండగా కేవలం 36మందికే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తిప్పించుకున్న ప్రభుత్వం చివరకు తమకు మొండి చేయి చూపించిందని డీఎస్సీ అభ్యర్థులు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వివరించారు. డీఎస్సీ అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించిన ఆయన వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని తెలిపారు. -
దేశంలో తొలిసారి బీసీ అధ్యయన కమిటీ
సాక్షి, ఏలూరు: దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా బీసీల సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యయన కమిటీని వేసిందని ఆ పార్టీనేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ కులస్తుని స్థితిగతుల వివరాలను కమిటీ తీసుకుందని, ఈ వివరాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందచేసినట్లు ఆయన వెల్లడించారు. ఏలూరులో నేడు వైఎస్సార్సీపీ బీసీ గర్జన సభ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్సార్ హయాంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆయన గుర్తుచేశారు. బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య వంటి అంశాల్లో పైకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. బీసీల అభివృద్ధిపై వైఎస్ జగన్ అంకితభావంతో పనిచేస్తున్నారని మజ్జి శ్రినివాసరావు పేర్కొన్నారు. -
‘రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం’
సాక్షి, ఏలూరు : రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేయించి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, బీసీల అభ్యున్నతికి తాము ఏం చేయబోతున్నామో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్ రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం అని ఆ పార్టీ నేత బొత్సా సత్యనారాయణ అన్నారు. ఏలూరు నగరంలో ఆదివారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బీసీ సామాజి కవర్గాల ప్రజలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున బీసీ గర్జన మహాసభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మహాసభ ప్రాంగణం వద్ద బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల వేళ మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. బీసీలు ఆర్థికంగా ఎదగాలంటే వైఎస్ జగన్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడివి ఓటు బ్యాంక్ రాజకీయాలని, నాలుగేళ్లుగా ఆయనకు బీసీలు గుర్తుకు రాలేదా అని బొత్సా సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ వల్లే సాధ్యం వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఎన్నికల వేళ బీసీ కులాలకు ఏదో మేలు చేస్తామని, ఆయన మాయమాటలు చెబుతున్నారన్నారు. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా అని సూటిగా ప్రశ్నించారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో బీసీలకు ఎంతో మేలు జరిగిందని, మరోసారి బీసీలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్ వల్లే సాధ్యమని వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. -
బీసీ గర్జనకు.. భారీగా తరలివస్తున్న జనం!
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : టీడీపీ సర్కారు పాలనా వైఫల్యాలు, తమకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించడంపై నిలదీసేందుకు ఏలూరులో నేడు ఏర్పాటు చేసిన బీసీ గర్జనలో పాల్గొనేందుకు బీసీ సంఘాలు, కార్యకర్తలు తండోపతండాలుగా బయలు దేరారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నియోజక వర్గ సమన్వయ కర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు వంద బస్సులు, వంద కార్లతో ర్యాలీగా బయల్దేరారు. బీసీ సంఘ నాయకులు వేండ్ర వెంకటస్వామి, కామన నాగేశ్వరరావు, తిరుమాని ఏడు కొండలు, కొల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో తణుకు నియోజక వర్గం నుంచి మూడు మండలాల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు బీసీ గర్జనకు బయల్దేరారు. సభకు వెళ్తున్న అభిమానులకు తణుకు వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ కారుమూరి ఆహార పానియాలను ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిగూడెం వైస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బీసీ సోదరులు వేలాది తరలి వెళ్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి దాదాపుగా 150 బస్సులు, వంద కార్లతో బీసీ గర్జనకు బయల్దేరారు. ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర మండలాల నుంచి ఆచంట కన్వీనర్ చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఆధ్వర్యంలో 200 బస్సుల్లో గర్జనకు బీసీ సోదరులు బయల్దేరారు. విజయవాడ నుంచి బీసీ గర్జనకు బీసీలు భారీ సంఖ్యలో బయల్దేరారు. పిఠాపురం వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు జెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ ఛలో ఏలూరు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. -
బీసీ డిక్లరేషన్‌పై సర్వత్రా ఉత్కంఠ
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : వైఎస్సార్ సీపీ బీసీ గర్జనకు ఏలూరు నగరం ముస్తాబైంది. సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హేలాపురి టౌన్షిప్ పక్కనే భారీస్థాయిలో బీసీ గర్జన మహాసభ జరగనుంది. ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేయించి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, బీసీల అభ్యున్నతికి తాము ఏం చేయబోతున్నామో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. దీంతో బీసీ గర్జన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఏలూరు నుంచే వైఎస్ జగన్ ఎన్నికల సమరంలోకి దూకుతూ ప్రచార పర్వాన్ని ప్రారంభించబోతున్నారు. దీంతో ఏలూరు బీసీ గర్జన మహాసభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఈ సభకు తరలిరానుండడంతో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు గంటల కొద్దీ నిలబడి ఇబ్బందులు పడకుండా కూర్చునేందుకు కుర్చీలు సైతంభారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే ప్రజల కోసం ఎల్సీడీలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ నేతల పరిశీలన ఏలూరులో జరిగే బీసీ గర్జన మహాసభ పనులను పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొలుసు పార్థసారధి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, తలశిల రఘురాం, జంగా కృష్ణమూర్తి, నర్సయ్య గౌడ్, మేకా శేషుబాబు, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పరిశీలించారు. గర్జన సభ వేదిక నిర్మాణం పనులు, ప్రాంగణంలో ఏర్పాట్లు తదితర అంశా లను పర్యవేక్షించారు. జిల్లా నేతలు ఘంటా ప్రసాదరావు, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, నెరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, మంచెం మైబాబు తదితర పార్టీ నేతలు ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రేణుల్లో ఉత్సాహం బీసీ గర్జన కోసం పార్టీ నేతలు, శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే గర్జన సభ ప్రాంగణానికి ఇరువైపులా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.బీసీ వర్గాలతో పాటు ముఖ్యంగా యువత ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌పై ఉత్కంఠ రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గంలోని 146 కులాలకు సంబంధించి, వారి అభ్యున్నతికి కీలకంగా మారే బీసీ డిక్లరేషన్‌ను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించనుండడంతో ఆ వర్గాల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ అభివృద్ధి, సంక్షేమానికి జగన్ ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు అమలు చేయబోతున్నారు, విధి విధానాలు ఎలా ఉంటాయనే అంశాలపై చర్చ సాగుతోంది. మూడు దశాబ్దాల కాలంలో ఏ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవటంతో వైఎస్ జగన్ ప్రకటించే డిక్లరేషన్‌కు అధిక ప్రాముఖ్యత ఏర్పడింది. -
బీసీలకు వరాల హామీ
వైఎస్సార్ సీపీ అధ్యక్షులువైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకుబాసటగా నిలిచారు. ప్రజాసంకల్పయాత్రలో ఇప్పటికే బీసీలకు ఎన్నో హామీలిచ్చారు. వెనుకబడిన తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల అధ్యయనానికి ఇప్పటికే పార్టీ తరఫున అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదించిన అంశాల ఆధారంగా బీసీలఅభ్యున్నతికి ఏలూరు బీసీ గర్జనలో మరిన్ని వరాలు ప్రకటించనున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీసీలకు రాజ్యాధికారం ఇచ్చామని గొప్పలకు పోవడమే తప్ప ఇప్పటివరకు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు బీసీలకు చేసిం దేమీ లేదు. బీసీలు కులవృత్తులకు ఉపయోగించే నాసిరకం పరికరాలను అందించి చేతులు దులుపుకున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేశారు. బీసీలకులవృత్తులను ప్రోత్సహించడమే కాదు.. వారికి ఉన్నత విద్య, ఉన్నత కొలువులు పొందేందుకు వీలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల సామాన్య బీసీ విద్యార్థులకు సహితం ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో చదువుకునే అవకాశం దక్కింది. ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్న భావన బీసీల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన బీసీలకు వరాలు ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ స్థానాన్ని బీసీలకే కేటాయిస్తామని చెప్పిన జగన్మోహన్రెడ్డి మాట నిలబెట్టుకుంటూ మార్గాని భరత్‌ను సమన్వయకర్తగా నియమించారు. కొల్లేరు వాసులు తమ సమస్య పరిష్కరించుకోవడానికి దోహదపడే విధంగా కొల్లేరు వాసికి ఎమ్మెల్సీ ఇస్తా నని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లో ఏఏ కులాలను ఏబీసీడీ గ్రూపుల్లో పెట్టాలన్న అంశంపై అధ్యయనం చేసేం దుకు సబ్ కమిటీ వేయిస్తామని ప్రకటించారు. ప్రతి కులాన్ని క్షుణ్ణంగా అ«ధ్యయనం చేసిన తర్వాతే ఆయా కులాల పరిస్థితులను బట్టి ఏబీసీడీల్లో చేర్చుతామన్నారు. నేరుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కని బీసీ కులాలకు ఎమ్మెల్సీ కేటాయిస్తామని ప్రకటించారు. అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని చేసిన జగన్ చేసిన ప్రకటనతో బీసీ వర్గాల్లో ఆశలు చిగురిం చాయి. అతిరాస కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ హయాంలో బీసీల అభ్యున్నతికి చేసిన కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బీసీలకు ఉన్నత విద్య, మెరుగైన ఆరోగ్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. వైఎస్సార్ కులవృత్తులను ప్రోత్సహించడమే కాకుండా వారికి ఉన్నత విద్య, ఉన్నత కొలువులు పొందేందుకు వీలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో ఇంజినీరింగ్, మెడికల్ వంటి అత్యున్నత చదువులకు సంబంధించి ఫీజు పూర్తిగా రీయింబర్స్మెంట్ జరిగేది. ఎటువంటి ఆంక్షలు ఉండేవి కాదు. వందల మంది బీసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే కల నెరవేరింది. తరువాత కాలంలో ఇంజినీరింగ్ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరగడం వల్ల లబ్ధిపొందే బీసీ విద్యార్థుల సంఖ్య రెట్టింపయ్యింది. వైఎస్సార్ తరువాత ముఖ్యమంత్రులుగా చేసిన వారు ఈ పథకాలను కొనసాగించాల్సి రావడం వల్ల వేలాదిమంది లబ్ధిపొందారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గ్రహణం ప్రస్తుతం రీయింబర్స్మెంట్ పథకానికి చంద్రబాబు సర్కార్ గ్రహణం పట్టించింది. మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా రూ.30 వేల వరకు మాత్రమే కళాశాలలకు చెల్లిస్తోంది. మిగిలిన ఫీజును విద్యార్థులు కట్టుకోవాల్సి వస్తోంది. బీసీల ఉపకార వేతనాలను అవసరమైన స్థాయిలో పెంచింది కూడా వైఎస్సార్ మాత్రమే. బీసీ సంక్షేమ వసతిగృహాలను నిర్మించడం, ఉన్నవాటిని ఆధునికీకరించడం పెద్ద ఎత్తున సాగింది కూడా వైఎస్సార్ హయాంలోనే. ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎక్కువ లబ్ధిపొందింది కూడా బీసీలే. కొల్లేరు ప్రాంత ప్రజల నాయకుడుకి ఎమ్మెల్సీ కేటాయిస్తానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రకటన పట్ల కొల్లేరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ హామీతో అసెంబ్లీలో కొల్లేరు ప్రజల గళం వినిపించే అవకాశం వస్తుందని వారు ఆశగా ఉన్నారు. కొల్లేరులో జిరాయితీ భూములు పేదలకు అందిస్తానని జగన్ ఇచ్చిన హామీ పట్ల కూడా కొల్లేరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీ గర్జన ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది తద్వారా బీసీ సామాజిక వర్గీయులందరికీ ఈ సభలో జగన్మోహన్రెడ్డి భరోసా ఇస్తారని బీసీలు ఆకాంక్షిస్తున్నారు. -
బాటలన్నీ అటువైపే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే కోలాహలం. దారులన్నీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైపే దారి తీస్తున్నాయి. తమ సమస్యలపై గళమెత్తుతున్న బీసీలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రాంగణంలో ఆదివారం నిర్వహిస్తున్న ‘బీసీ గర్జన’ సభ దిశగా కదులుతున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ సంక్షేమం కోసం ఏ ప్రకటనలు చేస్తారోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ ప్రకటించనివిధంగా జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమకు మంచి రోజులు వస్తాయన్న కొండంత విశ్వాసం ప్రకటిస్తున్నారు. చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం జిల్లా జనాభా 56 లక్షలు కాగా, ఇందులో బీసీలు 32.60 లక్షల మంది ఉన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తమకు 115కి పైగా హామీలిచ్చి, ఏ ఒక్కటీ అమలు చేయలేదని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీసీల్లో రజకులను, నాయీ బ్రాహ్మణులను, బోయిలను, మత్స్యకారులను, ఇతర కులాలను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చుతామని, గాండ్లు, సగర, పూసల, కురబ, బోయ, పద్మశాలి తదితర కులాలను బీసీ–డి నుంచి బీసీ–ఎకు మార్చుతామని చెప్పి, తర్వాత మోసం చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడచినా ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా, వాటిని అమలు చేయాలని అడిగిన మత్స్యకారులపైన, నాయీ బ్రాహ్మణులతోపాటు ఇతర కుల సంఘాల నాయకులపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చూపుడువేలెత్తి మరీ భయపెట్టారు. గత ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తానని ప్రకటించారు. దీని ప్రకారం నాలుగున్నరేళ్లలో రూ.40 వేల కోట్ల నిధులివ్వాల్సి ఉండగా కేవలం రూ.7 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. టీడీపీ వంచనకివిగో ఉదాహరణలు ♦ జిల్లాలో ఆదరణ పథకం కోసం 80 వేల దరఖాస్తులు రాగా 15,210 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చారు. ♦ జిల్లాలో 82,584 మంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.269 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, రూ.87.73 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ♦ బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ నిధులు రూ.46.12 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రూ.30.02 కోట్లు మాత్రమే ఇచ్చారు. ♦ జిల్లాలో ఒకప్పుడు 44 బీసీ హాస్టళ్లు ఉండగా, దశలవారీగా 15 మూసేశారు. దీంతో వేలాదిగా బీసీ విద్యార్థులు అర్ధాంతరంగా తమ చదువుకు స్వస్తి చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమను పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం కావడంతో కంటితుడుపు చర్యలతో హడావుడి చేస్తున్నారని బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. ఈసారి చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. నూతనోత్సాహంతో ‘బీసీ గర్జన’కు.. టీడీపీ చేసిన, చేస్తున్న మోసాన్ని గ్రహించిన బీసీలు ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో నిర్వహిస్తున్న ‘బీసీ గర్జన’ వారిలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. వెనుకబడిన వర్గాల్లోని ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వారి సమస్యలపై పాదయాత్రలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఈమేరకు హామీ ఇచ్చారు. శెట్టిబలిజ, ఈడిగ, గౌడ, శ్రీశయన, యాదవ, కురుబ, మత్స్యకార, అగ్నికుల క్షత్రియ, వన్నికుల క్షత్రియ, తూర్పుకాపు, కొప్పుల వెలమ, కళింగ, గవర, గాండ్ల, చేనేత కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తామని వెల్లడించారు. బీసీల్లోని వివిధ కులవృత్తుల వారికి నిర్దేశిత యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక పింఛన్లు, ఇళ్లు, ఇతరత్రా సాయంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. హామీలివ్వడమే కాదు ప్రమాణపూర్వకంగా అమలు చేసే ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించనున్నారు. కొన్ని నెలలుగా బీసీ సమస్యలపై అధ్యయనంపై చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ బీసీ డిక్లరేషన్ రూపొందించారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఇచ్చిన హామీలు బీసీలకు ఎంతో నమ్మకం కలిగించాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని ఇప్పటికే పలు బీసీ సంఘాలు ప్రకటించాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తమకు ఎంతో మేలు జరిగిందని, ఆయన ఆశయ సాధన కోసం పరితపిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పకుండా తమకు మరింత మేలు చేస్తారని బీసీలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు బీసీ గర్జనకు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. బస్సులు, ఇతర వాహనాలపై ఏలూరుకు వేలాదిగా పయనమవుతున్నారు. ఏలూరు బీసీ గర్జన సభ మరో చరిత్రకు నాంది పలుకుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. -
దగాపడ్డ బీసీ గళాల ‘గర్జన’ నేడే
సాక్షి, అమరావతి, ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐదేళ్ల ప్రజా కంటక టీడీపీ సర్కారు పాలనా వైఫల్యాలు, తమకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించడంపై నిలదీసేందుకు బీసీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఆదివారం ఏలూరులో వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న కీలకమైన ‘బీసీ గర్జన ఇందుకు వేదిక కానుంది. తమ ప్రభుత్వం కొలువుతీరగానే బలహీన వర్గాల సంక్షేమానికి చేపట్టే చర్యలను వివరిస్తూ ‘బీసీ డిక్లరేషన్’ ద్వారా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన భరోసా ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. బీసీలకు కంటితుడుపు చర్యలా కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చే పథకాలు కాకుండా వారు నిజమైన అభివృద్ధి చెందేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహించేలా డిక్లరేషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఏడాదిన్నర క్రితమే కమిటీని నియమించిన జగన్ బీసీల్లో వివిధ కులాల స్థితిగతులు, వెలుగులోకి రాని కొన్ని కులాల ఈతి బాధలపై క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు వైఎస్ జగన్ సుమారు ఏడాదిన్నర క్రితమే బీసీ అధ్యయన కమిటీని నియమించారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా విసృతంగా పర్యటించి బీసీ వర్గాల సమస్యలేమిటో వారి నుంచే స్వయంగా తెలుసుకుంది. బీసీ వర్గాల్లో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలతో విపులంగా చర్చలు జరిపింది. జిల్లాలవారీగా వెలుగులోకి వచ్చిన కొత్త సమస్యలను క్రోడీకరించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలిచ్చి మోసగించడంతో బీసీల పరిస్థితి ఎలా దిగజారిందో వివరిస్తూ కమిటీ ఈ ఏడాది జనవరి 28వ తేదీన జగన్‌కు సమగ్ర నివేదిక సమర్పించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు రైతులు, మహిళలకు రుణాల్లో రాయితీలు లాంటి అనేక పథకాలతో బీసీలకు మేలు జరిగింది. ఇప్పుడు ఆ పథకాలకు టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుండటంతో బీసీలకు తీరని నష్టం కలుగుతోందనే అంశాన్ని అధ్యయన కమిటీ జగన్ దృష్టికి తెచ్చింది. మరోవైపు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వివిధ కుల సంఘాల ప్రతినిధులు, చేతి వృత్తుల ప్రతినిధులు జగన్‌ను నేరుగా కలుసుకుని తమ కష్టాలను విన్నవించుకున్నారు. వారి కష్టాలను ప్రతిపక్ష నేత స్వయంగా తెలుసుకున్న నేపథ్యంలో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించడంతోపాటు వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి చిత్తశుద్ధితో నిరంతరం కృషి చేస్తామని గర్జన ద్వారా భరోసా కల్పించనున్నారు. హామీలపై ప్రశ్నిస్తే కన్నెర్ర బీసీలను ఓటు బ్యాంకుగా భావిస్తూ దీర్ఘకాలం పాటు వారిని టీడీపీ మోసగించింది. తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే పలు సందర్భాల్లో వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎస్సీల జాబితాలో చేరుస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరిన మత్స్యకారులపై విశాఖలో ముఖ్యమంత్రి మండిపడ్డారు. ‘ఏం తమాషాగా ఉందా? నాకు గుర్తులేదా? ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలియదా?’ అంటూ కన్నెర్ర చేశారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని ఉద్యమించిన పాతపాటి అంజిబాబును టీడీపీలో చేర్చుకుని నోరెత్తకుండా చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు తాత్కాలిక సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను వేలుతో బెదిరిస్తూ తమాషాలు చేస్తున్నారా? తోకలు కట్ చేస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఐదున్నర లక్షల మందికి నిరాదరణే! ఆదరణ పథకం కింద బీసీ కులాలకు చెందిన 7,67,137 మంది దరఖాస్తు చేసుకోగా సర్కారు ఇప్పటి వరకు రెండు లక్షల మందికి కూడా వస్తువులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అరకొరగా ఇచ్చినవి కూడా నాసిరకం కావడంతో మర్నాడే పనికిరాకుండా పోయాయి. చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. రుణమాఫీపై నేతన్నలను నిలువునా మోసం చేసింది. రూ.111 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటే రూ.75 కోట్లతో సరిపెట్టి చేతులు దులుకొంది. చేనేతలకు ఆరోగ్య బీమా అందిస్తామన్న హామీని నాలుగున్నర ఏళ్ల పాటు పట్టించుకోలేదు. వీవర్స్ క్రెడిట్ పథకాన్ని గాలికి వదిలేసింది. చేనేత బట్టలు కొనుగోలు చేయడంలో ఆప్కో విఫలమైంది. సబ్‌ప్లాన్... మభ్యపెట్టే ప్లాన్ అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కింద రాష్ట్రంలో 99 లక్షల మంది ఉండగా వారిని ఆదుకుంటామని చెప్పిన టీడీపీ సర్కారు కేవలం రూ.వంద కోట్లు కేటాయించి సరిపుచ్చింది. ఇక హడావుడిగా ప్రవేశపెట్టిన బీసీ సబ్‌ప్లాన్ బిల్లు సరిగా లేదని స్వయంగా స్వపక్ష ఎమ్మెల్యేలు, మంత్రులే ఆక్షేపించినా పట్టించుకోకుండా బలహీన వర్గాలను మభ్యపెట్టే యత్నం చేసింది. జనాభా ప్రాతిపదికన సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాల్సి ఉండగా సరైన విధానం లేకుండా 1/3 నిధులు ఇస్తామంటూ ఓ కాగితంపై రాసిన వ్యాక్యాలను అసెంబ్లీలో మంత్రి చదివి వినిపించారు. ఫీజుల పథకానికి ఐదు లక్షల మంది దూరం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు అర్హులైన బీసీ విద్యార్థులు 10,10,145 మంది ఉన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజుల పథకం లక్షల మంది పేద విద్యార్థులకు చదువుల వెలుగును పంచింది. ఇలాంటి పథకాన్ని టీడీపీ సర్కారు నీరుగార్చింది. 2018–19లో 1,73,492 మంది బీసీ విద్యార్థులకు ఇంతవరకు ఫీజులు చెల్లించలేదు. 3,25,811 మందికి మాత్రం కొద్ది మొత్తం విదిల్చింది. దాదాపు ఐదు లక్షల మంది బీసీ విద్యార్థులకు ఫీజుల పథకం అమలు కాలేదు. 2018–19లో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు కలిపి బీసీ విద్యార్థులకు రూ.882.74 కోట్లు దాకా ప్రభుత్వం బకాయి పడింది. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారా? బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ కేంద్ర న్యాయశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడం బలహీన వర్గాల పట్ల ఆయన చిన్నచూపును రుజువు చేస్తోంది. బీసీలకు బాబు నెరవేర్చని హామీలు – రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, మార్కెటింగ్ కమిటీల నామినేటెడ్ పదవుల నియామకాల్లో బీసీలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. – యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, పాలక మండళ్లలో 33 1/3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని నెరవేర్చలేదు. – బీసీల జనాభా గణన చేయించి వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పి చేతులెత్తేశారు. – వెనుకబడిన తరగతులు ఎదుర్కొంటున్న జీవనోపాదుల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రణాళికా వ్యయంలో ఏటా 25 శాతం నిధులు బీసీ ఉపప్రణాళిక కింద కేటాయిస్తామన్న హామీని పట్టించుకోలేదు. – కేంద్రంలో కూడా 25 శాతం నిధులతో ఉపప్రణాళిక కోసం కృషి చేస్తామన్న హామీ ఊసే లేదు. – విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 33 1/3 శాతానికి పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించారు. – కాంగ్రెస్ హయాంలో అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)కు కార్పొరేషన్ ఏర్పాటుకు కసరత్తు జరిగితే దాన్ని అమలు చేసేందుకు టీడీపీకి నాలుగున్నరేళ్ల సమయం చాలలేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చట్టసభల్లో ప్రాతినిథ్యం లేని కులాలకు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ఎంబీసీ కార్పొరేషన్‌కు గోవిందరెడ్డిని చైర్మన్‌గా నియమించారు. – బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, అదనపు సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. – ఆధార్‌తో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని ఇచ్చిన హామీని అటకెక్కించారు. నాణ్యమైన విద్య, స్కాలర్షిప్లు, హాస్టల్ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్న హాస్టళ్లనే రద్దు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కింది. – స్కాలర్‌షిప్‌ల కోసం బీసీల ఆదాయ పరిమితిని రూ.లక్ష నుంచి రూ. 2.50 లక్షలకు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. – కుల వృత్తులు, చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు అన్ని సౌకర్యాలతో ‘వృత్తి సముదాయాలు’ ఏర్పాటు చేస్తామన్న హామీని మరిచారు. – వాల్మీకి/బోయ, వడ్డెర, రజకుల సామాజిక హోదాలో మార్పులు తెస్తామన్న హామీ నెరవేర్చలేదు. – బీసీ కుల వృత్తులపై విధించిన వృత్తిపన్ను, సేవల పన్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారు. – చేనేతలకు రూ. 1,000 కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ఏటా రూ. 1,000 కోట్లు కేటాయిస్తామన్న హామీ నెరవేరలేదు. – రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత చేనేత బజార్లు ఏర్పాటు చేస్తామన్న హామీని విస్మరించారు. – వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరంలలో ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామన్న చెప్పి ఆ ఊసే మరిచారు. – జనతా వస్త్రాల పునరుద్ధరణ పథకాన్ని అటకెక్కించారు. – మూతపడిన చేనేత సంఘాల పునరుద్ధరణ, బకాయిల రద్దు, మూలధన సాయంతోపాటు 50 శాతం సబ్సిడీతో మగ్గాలు సరఫరా చేస్తామన్న హామీ అమలు కాలేదు. – చేనేత పరిశ్రమల ఆధునికీకరణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరలేదు. – హైబ్రిడ్ విత్తనాలను సరఫరా చేసి కల్లు గీత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్న సర్కార్ రాజధాని ప్రాంతంలో ఉన్న తాడిచెట్లను పూర్తిగా తొలగించి గీత కార్మికుల పొట్ట కొట్టింది. – సముద్ర తీరంలోని భూములను మత్స్యకారులకు కేటాయిస్తామన్న హామీ నెరవేరలేదు. – రైతు బజార్ల మాదిరిగా మేకలు, గొర్రెల విక్రయ బజార్లు ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చలేదు. – గొర్రెల మేత కోసం ఆయా గ్రామాల్లో భూముల కేటాయింపు హామీ నెరవేరలేదు. – డోలు, సన్నాయి తదితర వాయిద్య కళాకారులకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చ లేదు. – జైళ్లు, ఆస్పత్రులు, దేవస్థానాల్లో క్షురకులు, దేవాలయాల్లో వాయిద్య కళాకారుల ఉద్యోగాలను నాయీ బ్రాహ్మణులతో భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చలేదు. – అధునాతన క్షౌ రశాలల నిర్వహణకు శిక్షణ, 50 శాతం సబ్సిడీతో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. ఏలూరులో బీసీ గర్జనకు సర్వం సిద్ధం వైఎస్సార్ సీపీ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్న ‘బీసీ గర్జన’ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభమవుతుంది. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని హేలాపురి టౌన్షిప్ పక్కనే జరిగే సభ ప్రాంతానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంగా నామకరణం చేశారు. వాహనాల పార్కింగ్ కోసం నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని బీసీ నేతలను ఇప్పటికే ఈ సమావేశానికి ఆహ్వానించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ సభకు తాను హాజరవుతున్నట్లు ప్రకటించారు. సభ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, నేతలు కారుమూరి నాగేశ్వరరావు, మేకా శేషుబాబు, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, నర్సయ్య గౌడ్, చిల్లపల్లి మోహనరావు తదితరులు శనివారం పరిశీలించారు. -
బీసీల అభివృద్ధితోనే రాష్ట్ర పునర్నిర్మాణం
మన సమాజం బాగుపడాలంటే సమాజంలో సగభాగమైన బీసీలు అన్ని రంగాల్లో స్థిరపడి నిలబడగలగాలి. ఏ సమాజమైనా బాగుపడాలంటే ఉత్పత్తి శక్తులతో సంపదలు సృష్టింపచేసి, తిరిగి ఆ సంపదను వాళ్లకే పంచి పెట్టాలి. ఇక్కడ ఉత్పత్తి శక్తులంటే బీసీలు, ఈ బీసీల బతుకులలో, జీవన విధానంలో సమగ్రమైన మార్పు రావాలి. తెలుగు సమాజం రెండు రాష్ట్రాలుగా విభజింపబడిన తర్వాత ఏపీలో బీసీల జీవనంలో వచ్చిన మార్పు ఏమిటి? అన్న సందర్భం వచ్చింది. అమరావతి సాక్షిగా ఈ 55 నెలల పాలనలో బీసీ బతుకులలో వచ్చిన మార్పు ఏమీలేదు. తెచ్చిన మార్పు కూడా ఏమీలేదు. పునాది నుంచి చూస్తే బీసీలలో అట్టడుగున ఉన్నవారిని పైకి తీసుకువచ్చే పనిమొదలు కావాలి. కానీ, అది ఇప్పటికీ జరగటం లేదు. బీసీలు మరింత వెనుకబడిన ఎంబీసీల స్థితి దారుణంగా ఉంది. అభివృద్ధి ఫలాలు కొందరికే అందుతున్నాయి. అవి అందరికీ అందించాలి. ప్రపంచీకరణ ప్రభావం వలన అనేక కులవృత్తుల చేతులు విరిగిపోయాయి. కొన్ని కులవృత్తులు నడుస్తున్నప్పటికీ ఈ వృత్తులకు ఆధునీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవటం వలన దెబ్బతింటున్నారు. బతుకుపైన బీసీలకు భరోసా కలిగించాలి. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెలమగ్గం, శరీర కష్టం స్ఫురింపచేసే రంపం, కొడవలి, నాగలి సమస్త వృత్తుల సమస్త చిహ్నాలను శ్రీశ్రీ తన కవితా చిహ్నాలుగా చేసుకుని పలవరిం చారు. సరిగ్గా పాలకులు కూడా తమ పాలనా చిహ్నాలుగా బీసీల జీవితాలను మార్చటమే ధ్యేయంగా ముందుకుసాగాలి. బాబు 55 నెలల పాలనను చూశాక అది ఆయనవల్ల కాదని తేలిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో వైస్సార్సీపీ అధినేత జగనన్న ఏపీలో అన్ని రంగాలలో మార్పు రావాలని, ప్రధానంగా ఉత్పత్తి శక్తులైన బీసీల జీవితాలు బాగుపడాలని తపన పడుతున్నారు. అందుకోసం ఆలోచిస్తున్నారు, పథక రచనలు చేస్తున్నారు. బీసీ బతుకులకు భరోసా కల్పించేందుకు ఎంత సాహసం చేయ టానికైనా సిద్ధపడుతున్న జగనన్ననే బడుగు జనులు అర్థం చేసుకుంటున్నారు. బీసీలంటే ప్రభు త్వ పథకాలు కాదని, వారి జీవన విధానాన్ని పరిపూర్ణంగా మార్చటానికి జగన్ ముందుకొస్తున్నారు. బీసీల జీవితాల్లో మార్పు రావాలంటే విద్యా, వైద్య రంగాలు రెండూ వీరికి అందుబాటులోకి రావాలి. చదువులేకపోతే పరిణామ క్రమం లేదు. వైద్యరంగం ద్వారా ప్రతి ఒక్క పేదకు, బహుజనావళికి ఉచితంగా వైద్యం అందాలి. ఈ రెండు పనులు చేయటమే లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో బీసీల చదువుల కోసం రీయింబర్స్మెంట్ పథకాన్ని చేపట్టారు. అదే విధంగా వైఎస్ జగన్ ఏపీలో ఏ రాజకీయపార్టీ ఆలోచించని విధంగా, ఒక నూతన శకానికి నాంది పలికేందుకు రాష్ట్ర జనాభాలో సగభాగంగావున్న వెనుక బడిన తరగతుల, అత్యంత వెనుకబడిన తరగతుల, సంచారజాతులలో వెలుగు నింపాలని, వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా పురోభివృద్ధికి చేయూతనివ్వాలని, అధికారానికి రాకముందే రాష్ట్రంలో బీసీల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి అధ్యయన కమిటీని వేయటం బీసీ వర్గాలు హర్షిస్తున్నాయి. ఈ నేప«థ్యంలో బీసీ అధ్యయన కమిటి కన్వీనర్‌గా బాధ్యతలు తీసు కుని రాష్ట్రంలో బీసీల జీవన విధానాన్ని అధ్యయనం చేసే అవకాశం కలగటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. బీసీల గురించి లోతుగా తెలుసుకునేందుకు ఈ కమిటి ద్వారా క్షేత్రస్థాయికి వెళ్ళేందుకు జగనన్న నాకు అవకాశం కల్పించారు. క్షేత్రస్థాయిలో బీసీలకు సంబంధించిన విషయాలపై అవగాహన చేసుకుని వారికి అండగా నిలవడమే ధ్యేయంగా జగన్ అడుగులు వేయడంతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర నూతనశకానికి నాంది కాబోతుంది. స్వాతంత్య్రం అనంతరం ప్రపంచ మేధావి, శ్రమ జీవుల పక్షపాతి బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మహాత్మాజ్యోతిబాపూలే ఆలోచనల ధారలో అంబేడ్కర్ బహుజనం గురించి లోతుగా ఆలోచించి రాజ్యాంగ రచనను కొనసాగించారు. స్వాతంత్య్రం వచ్చి 72 సం‘‘లు అయినప్పటికి కూడా ఆశించిన మేరకు వెనుకబడిన వర్గాల, నిమ్నజాతుల యొక్క జీవన ప్రమాణాలలో మార్పురాలేదు. వర్ణ, కుల, లింగ వివక్షత కొనసాగుతూనే వుంది. సమాజంలో ఒక అభద్రతాభావం, రాజకీయ అనిశ్చితస్థితి, వైషమ్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అసమానతల గోడలను కూల్చకుండా అభివృద్ధి సాధ్యం కాదని వై.ఎస్ బాటలో జగన్ బీసీ పథక రచనలను రూపొందించారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక రాజ్యం కొనసాగుతోంది. అప్రజాస్వామిక పాలకవర్గ విధానాలు, రోజురోజుకు బడుగు, బలహీనుల జీవితాలను దిగజారుస్తున్నాయి. అధికారకాంక్ష, సంపాదనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ కుళ్ళిన వ్యవస్థను బాగుచేయాలంటే బహుజన పక్షపాతి అయిన జగనన్నే ముందుండాలని ఆ వర్గాలు కోరుకుంటున్నాయి. బహుజన వర్గాలకు విశ్వాసం, నమ్మకం కలిగించటమే కాదు వారికి అండగా నిలబడవలసిన సమయమిది. ఆ పనిని జగన్ తన భుజస్కందాలపై వేసుకున్నారు. అన్నివర్గాల ప్రజల జీవన విధానాలు తెలుసుకొని, అలుపెరగని యోధుడుగా నిరంతర శ్రామికుడిగా వెలుగొందుతున్న జగనన్న నాయ కత్వం ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాలకు, ముఖ్యంగా తాడిత, పీడిత ప్రజానీకానికి న్యాయం జరుగుతుం దని ఆ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. రాష్ట్రంలోని అన్ని రంగాలతో పోల్చుకొని చూస్తే బీసీల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది.బీసీల అభివృద్ధిలో తారతమ్యాలున్నాయి. మైదాన, మెట్ట, దిగువ, కొండప్రాంతాలు, నగర, మహానగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బీసీలలో ఊహించనంత వ్యత్యాసం ఉంది. ఇంకా బీసీలలో గుర్తింపు లభించని కులాలున్నాయి. కులంపేరు తెలియని అభాగ్యులున్నారు. వీరిని గుర్తించి బీసీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉంది. సంచారజాతుల పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి. పెద్దనాయకుల పిల్లలు అమెరికా పోయి చదువుకోవడం గొప్పతనం కాదని, ఆర్థికంగా, బలహీనంగా ఉన్న పిల్లలు చదువులో ఎదిగి దేశదేశాల్లో స్థిరపడాలని జగన్ ఆలోచిస్తూ బీసీ డిక్లరేషన్ని తయారుచేస్తున్నారు. ప్రతిభ కొన్ని వర్గాల సొత్తుకాదని అది అందరిలో ఉంటుందని, బీసీలలో వున్న ప్రతిభను వెలికితీయడానికి వారికి విద్యారంగంలో ఎన్నో అండదండలు అందించవల్సి ఉందని జగన్ ప్రతిపాదిస్తున్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా దేశవ్యాపితంగా ఈ విషయంపై అన్ని పార్టీలను ఏకం చేసి నిలబడతానని జగనన్న మాటిచ్చాడు. బీసీ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్న దశలో పల్లెకన్నీరు పెడుతున్న దశను చూసి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వీరి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలకు మరింత కొనసాగింపుగా, బీసీల ప్రామాణికమైన అభివృద్ధికి అండదండలుగా నిలవాలి. ఆ పని చేయగలిగిన శక్తివంతులెవ్వరో బీసీలకు తెలుసు. అందుకే బీసీలు జగన్ పాదయాత్రలో అడుగడుగునా అండదండలతో నిలిచారు. వారి కన్నీళ్లను, కష్టాలను దగ్గరకెళ్లి ఆయన చూశారు. బీసీలు శిరసెత్తుకుని నిలబడగలిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చెందినట్లుగా భావించాలి. నవసమాజ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు బీసీలే, ఊరుకు ప్రాణం బీసీలే, వ్యవస్థకు ప్రాణం బీసీలే. వీరి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి. బీసీలకు అండగా, వారికి గుండెదండుగా జగన్ నిలబడతారన్న నమ్మకముంది. బీసీలు నమ్మకంపై నమ్మకం వున్నవారు. బీసీలకు అండగా నిలిచే శక్తులను బీసీలే కాపాడుకుంటారు. నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి జగన్‌కు అండగా బీసీలు చీమలదండులా కదలివస్తారు. బహుజన తాత్త్వికతతో నిర్మించబోయే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తలావొకచేయి వేసి నిలుద్దాం. జగనన్న మార్గంలో బహుజనపథాన్ని నిర్మిస్తూ ముందుకు సాగుదాం. పదండి. (నేడు ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ సందర్భంగా) వ్యాసకర్త : జంగా కృష్ణమూర్తి, బీసీ అధ్యయన కమిటీ కన్వీనర్ -
బీసీలకు బాబు చేసిందేమీ లేదు: పెద్దిరెడ్డి
-
బీసీల అభివృద్ధికి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు..
ఏలూరు: బీసీల స్థితిగతులను స్వయంగా తన పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ తెలుసుకున్నారని, వారు అన్నివిధాలా అభివృద్ధి చెందడానికే రేపు(ఆదివారం) బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారని, రేపు(ఆదివారం) బీసీలకు సువర్ణ దినమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే బీసీ గర్జన బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, పార్థసారధి, జంగా కృష్ణ మూర్తి, కారుమూరి నాగేశ్వర రావు, మేకా శేషు బాబు తదితరులు పరిశీలించారు. అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. నాడు బీసీలకు మేలు చేసిన మహానేత వైఎస్సార్ అని, ఆయన అడుగుజాడల్లోనే వైఎస్సార్ తనయుడిగా వైఎస్ జగన్ బీసీలకు మరింత మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాల ద్వారా వైఎస్సార్, బీసీలకు మేలు చేశారని అన్నారు. బీసీల అభివృద్ధి పట్ల వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. బీసీలకు బాబు చేసిందేమీ లేదు: పెద్దిరెడ్డి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు ఏమీ మేలు చేయలేదని వైఎస్ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు బీసీలను ఆదుకునే కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదని చెప్పారు. బీసీలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందని తెలిపారు. వైఎస్సార్ కులమతాలకతీతంగా తన పథకాలు అమలు చేశారని, వైఎస్సార్ పథకాలతో ఎక్కువ మేలు జరిగింది బీసీలకేనని వెల్లడించారు. రేపటి సభలో వైఎస్ జగన్ చేయబోయే బీసీ డిక్లరేషన్‌తో బీసీలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
రేపు వైఎస్సార్సీపీ బీసీ గర్జన
సాక్షి, అమరావతి : ఎన్నో ఏళ్లుగా..సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధికి నోచుకోక కునారిల్లుతున్న వెనుకబడిన వర్గాల సర్వతోముఖాభివృద్ధి సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం బీసీ గర్జన జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్న కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ వర్గాల ప్రజలు తరలి రానున్నారు. ‘ఛలో ఏలూరు’ నినాదంతో బీసీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసాలపై రాష్ట్రంలోని బీసీలు రగిలి పోతున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరచిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసగించిన వైనంపై ప్రస్తుతం ఆ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీసీలను అవసరాలకు ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప ఆచరణలో చేసిందేమీ లేదని ఆ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక 2019 ఎన్నికలు రాబోతున్న తరుణంలో పాత హామీలను అమలు చేయక పోగా.. మళ్లీ కొత్తగా మోసాలు చేసేందుకు చంద్రబాబు ముందుకొస్తున్న వైనంపై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అనేకమార్లు గళం విప్పింది. 2014లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్నో సార్లు కోరింది. అయితే ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు మాటలతో కాలక్షేపం చేస్తున్న టీడీపీ వైఖరిని ఎండగట్టడంతో పాటుగా.. 2019లో తాము అధికారంలోకి వస్తే బీసీల అభ్యున్నతికి ఏం చేయబోతామో తెలియ జేసి ఆ వర్గాలకు భరోసా కల్పించడానికే బీసీ గర్జనను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసి వాటి శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ముందు చూపుతో జగన్ సుమారు ఏడాదిన్నర క్రితమే పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సాధ్యమైనంత వరకు అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి బీసీ వర్గాల స్థితిగతులనూ కమిటీ తెలుసుకుంది. ఈ క్రమంలో సుమారు 136 కులాల వారితో చర్చించి..వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత అవగాహన పెంచుకున్నామని జంగా కృష్ణమూర్తి తెలిపారు. కాగా, కమిటీ ఓ సమగ్ర నివేదిక రూపొందించి ఈ ఏడాది జనవరి 28న జగన్‌కు సమర్పించింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతికే డిక్లరేషన్.. అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే దివారం జరిగే ఏలూరు బీసీ గర్జన సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘బీసీ డిక్లరేషన్’ను ప్రకటించబోతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం చేపట్టే చర్యలను డిక్లరేషన్‌లో పొందుపరిచారు. టీడీపీ హయాంలో బీసీల జీవన విధానంలో ఎలాంటి మార్పు లేని విషయాన్ని గర్జనలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. బీసీలపై గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను నివారించడానికి తీసుకునే ప్రత్యేక చర్యలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. సంప్రదాయకంగా కుల వృత్తులపై ఆధారపడే వారి పరిరక్షణ, వారు నిలదొక్కుకునే విధంగా ప్రోత్సాహకాలు, విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆర్థికంగా బీసీలు ఎదగడానికి వీలుగా పారిశ్రామికరంగంలో వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి బీసీ డిక్లరేషన్‌లో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయమై కూడా జగన్ ఈ సందర్భంగా ఒక విస్పష్టమైన ప్రకటన చేయబోతున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. భారీ ఏర్పాట్లు.. ఏలూరు పరిసరాల్లోని సర్ సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హేలాపురి సమీపంలోని సువిశాలమైన మైదానంలో బీసీ గర్జన వేదికను నిర్మించి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ గర్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మాజీఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, కంతేటి సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో సహా పలువురు వేదిక ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.