
సాక్షి, ఏలూరు : విశ్వసనీయత, విధేయతకు మారుపేరు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజనీ అన్నారు. వైఎస్ జగన్ అంటేనే జనహోరు, జన జాతర అని... ఆయన పేరు వింటేనే చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన మహాసభలో ఆమె మాట్లాడుతూ.. బీసీలు అంటే బలహీన వర్గాలకు సంబంధించివారు కాదని బ్రహ్మ కమలాలు. బీసీలను ‘ఈసీ’ ( ఎలక్షన్ క్యాంపెయనర్లు)గా వాడుకుని, అనంతరం వారిని పట్టించుకోని చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీలను బెస్ట్ క్యాటగిరి అని అన్నారు. అలాగే మళ్లీ మనం బెస్ట్ క్యాటగిరిగా మారదాం.
ఇక చంద్రబాబు నాయుడు మాయల ఫకీరులా బీసీలకు మాయమాటలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన డ్యాష్ బోర్డు అయితే... ఆయన కుమారుడు నారా లోకేష్‌ది క్యాష్ బోర్డులాంటిది. క్యాష్ బోర్డు చూస్తేనే డ్యాష్ బోర్డు పనిచేస్తుంది. యథా రాజా తధా ప్రజాలా వాళ్ల అడుగు జాడల్లోనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా నడుస్తున్నారు. ఓ వైపు కరువు, తుఫాన్‌లతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ‘కరువుపై కబడ్డీ.... తుఫానుపై తొలి విజయం’ అంటూ ఎల్లో మీడియాతో పాటు సోషల్ మీడియాలో గప్పాలు కొడుతున్నారు’ అని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీసీ సోదర, సోదరీమణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిచించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని విడదల రజనీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment