
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : 40 లక్షల బీసీ కుటుంబాల్లో విద్యతో వెలుగు నింపిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీసీ సోదరులంతా అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన మహాసభలో ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, బీసీలందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబును నమ్మే ప్రసక్తే లేదన్నారు. 2019 ఎన్నికల్లో బీసీ సోదురులంతా ఒక తాటిపైకి వచ్చి జగనన్నకు అండగా ఉండి సీఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు.
టీడీపీవాళ్లు మాట్లాడితే తాటతీస్తాం అంటున్నారని, తాటతీసేది ఎవరో 2019 ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. 139 బీసీ కులాల సంక్షేమం గురించి ఈ సభ ద్వార వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీసీలైనా, మైనార్టీలైనా, ఎస్సీలైనా వైఎస్సార్‌సీపీకే మద్దతుంటుందన్నారు. తెలుగు దేశాన్ని తొక్కుదాం.. జగనన్నకు అండగా ఉందామన్నారు. అస్తమించే సూర్యుడు చంద్రబాబైతే.. మన జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడు వైఎస్ జగనని, చీకటి నింపే నాయకుడు చంద్రబాబును తరిమికొడదామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment