విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అద్భుత ఆలోచనలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బీసీల వరపుత్రుడిగా మారిపోయారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రలో ఆయన చూసిన సమస్యలను గుండెలో పెట్టుకుని కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికే ఈ మహత్తర ఆలోచన చేశారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి బీసీ డిక్లరేషన్ దేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేదని, జగన్ సీఎం అయిన తర్వాత దీన్ని అమల్లోకి తీసుకొచ్చాక అన్ని రాష్ట్రాల ప్రజలు ఇలాంటి బీసీ డిక్లరేషన్ కావాలని అడుగుతారన్నారు. ఏలూరులో బీసీ డిక్లరేషన్ సభ తర్వాత రాష్ట్రంలో పండగ వాతావారణం కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏటా రూ.15వేల కోట్లు నిధులు ఇస్తామనడం అభినందనీయమన్నారు.
సీఎం అయిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తాననడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. బీసీలకు ఉద్యో గ, ఉపాధి అవకాశాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న హామీ ఓ సాహసోపేతమైన నిర్ణయమన్నా రు. దుస్తుల నుంచి తినే తిండి, ఉండే ఇళ్ల వరకు ఏది కావాలన్నా దానిలో బీసీల పాత్రే ఉంటుందని, అలాంటి వారికి సమాజంలో అందరితో సమానంగా ప్రాధాన్యత కల్పించాలనే పెద్దపీట వేశారని తెలి పారు. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు శా శ్వత ప్రాతిపదికన కమిషన్ వేసి సుప్రీంకోర్టు న్యా యమూర్తిని నియమిస్తామని చెప్పడం సంతోషదాయకమన్నారు. తెలంగాణలో ఓబీసీలో కొనసాగుతున్న బీసీ కులాలను యథా విధిగా బీసీల్లో కొనసాగించాలని కేసీఆర్‌ను కోరుతామని చెప్పడం కూ డా తమకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. చిరువ్యాపారులకు, కులవృత్తిదారులకు గుర్తింపుకార్డులిచ్చి ఏటా పెట్టుబడి రుణాలిస్తామనడం జగన్‌లో ఉన్న మంచిపాలనా చతురతకు నిదర్శనమన్నారు. నా మినేటెడ్ పనుల్లో 50 శాతం బీసీలకే ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం కూడా ఆనందం కలిగించిందన్నారు. అన్నదాత సుఖీభవా అంటూ రైతు రుణమాఫీయే ఇప్పటివరకు సర్కారు పూర్తిచేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఓట్లు మాత్రమే వారికి కావాలి..
చంద్రబాబునాయుడు బీసీల ఓట్లు వేయించుకుని వదిలేయడం తప్ప సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోలేదని గుర్తు చేశారు. నిత్యం సభలు, సమావేశాల్లో తాను బీసీల పక్షపాతినని చెప్పుకోవడమే తప్ప చేసిన పనులేవీ లేవని దుయ్యబట్టారు. వైఎస్సార్ నిరుపేదలు చదువుకో వాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెడితే చంద్రబాబు మాత్రం ఆ ఫీజులు చెల్లించడానికి కూ డా ఒప్పుకోవడం లేదని అన్నారు. జగన్ ప్రకటిం చిన బీసీల డిక్లరేషన్‌పై టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని, చేతనైతే బీసీలకు న్యాయం చేయాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అనేక చోట్ల పునాది రాళ్లు వేసేస్తే ఓట్లు పడవన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. సమావేశంలో సురంగి మోహనరావు, బొనిగి రమణమూర్తి, మార్పు ధర్మారావు, చల్లా రవికుమార్, పాలిశెట్టి మధుబాబు, మార్పు మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment