బీసీల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ఆనందంతో ఉప్పొంగాయి. తమ కుటుంబాలకు కొండంత అండ దొరికిందని సంబరపడ్డాయి. బిడ్డల చదువుకు ఢోకా ఉండదని సంతోషం వ్యక్తం చేశాయి. ఏలూరు వేదికగా ఆదివారం జరిగిన బీసీ గర్జన సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సామాజికంగా వెనుకబడిన బీసీ వర్గాల కోసంకీలక ప్రకటన చేశారు. వారి భవిష్యత్‌కు, సంక్షేమానికి బాటలువేశారు. సమసమాజ స్థాపనతో ఆదర్శంగా ఉంటానని చాటిచెప్పారు.ఆయన ప్రకటన కొండంత భరోసానిస్తోంది. బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమ డిమాండ్లు, ఆకాంక్షలు నెరవేరే రోజులు దగ్గరపడ్డాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమిదీ
బీసీల అభ్యున్నతికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిం చిన వరాలతో వారిపట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలుపుతోంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న ప్రతి బీసీ మహిళకు రూ. 75 వేలు, ఉన్నత చదువులకు అవసరమయ్యే ప్రతి రూపాయి ప్రభుత్వమే భరించే పథకం, హాస్ట ల్ విద్యార్థులకు మెస్ చార్జీల కింద ఏడాదికి రూ. 20వేలు, పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి రూ. 15 వేలు తదితర పథకాలతో బీసీల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోనున్నారు. – డీఎన్ ఏలుమలై,వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్రప్రధాన కార్యదర్శి, పుత్తూరు)
బీసీలకు మహర్దశ
బీసీల అభ్యున్నతికి గతంలో ఎవరూ తీసుకోని సాహసోపేత నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. సభలో ప్రకటించిన హామీలన్నీ నెరవేర్చితే బీసీలకు మహర్దశ ఖాయం. సన్నిధి గొల్ల పదవిని శాశ్వతంగా గొల్లలకే కేటాయిం చాలనే హామీ అభినందనీయం. –టి.గోపాల్, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం
చట్టబద్ధత అభినందనీయం
బీసీల్లోని అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి చట్టబద్థత కల్పిస్తామని చె ప్పడం అభినందనీయం. బీసీల్లో కొందరికే సంక్షేమ ఫలాలు అందేటివి. జగన్ హామీలతో ప్రతి కులానికి సంక్షేమం జరుగుతుంది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.7 లక్షలు చనిపోయిన వారి కుటుం బానికి అందజేస్తామనడం అభినందనీయం. –వడ్లతంగాల్ బాలాజీ ప్రసాద్,వన్నెకుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షుడు
వినూత్నంగా అభివృద్ధి
బీసీ డిక్లరేషన్ ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై ఉన్న ప్రత్యేక చొరవ తేటతెల్లమైంది. గత ప్రభుత్వాలు ఏవీ చేయనన్ని అభివృద్ధి పథకాలు వినూత్నంగా తీసుకొస్తారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తాం.వెంకటరమణ,కామాటంపల్లె, పీలేరు.
మనోధైర్యం కలిగించారు
బీసీలకు జగన్ డిక్లరేషన్ ఇస్తామనడం ద్వారా మ నోధైర్యం కలిగింది. నావి ునేటడ్ పదవుల్లో, కాం ట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. ప్రతి బహుజను డు జగన్‌కు రుణపడి ఉంటాడు. అలాగే చట్టసభల్లో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం. –సంగీత,బీసీ సంక్షేమ సంఘం జిలా మహిళా అధ్యక్షురాలు
బిడ్డల చదువులకు భరోసా....
మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో బీసీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా తయారయ్యారు. నిర్వీర్యమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తూ బీసీ పిల్లల చదువులకు ఉచితంగా విద్యను అందించడమే కాకుండా సంవత్సరానికి రూ.20 వేలు మెస్‌చార్జీల కింద ఇస్తాననడం ప్రతి ఒక్కరిలోనూ భరోసా నింపింది.– రేపన ముని,వైఎస్సార్ సీపీ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఆర్థికాభివృద్ధికి హామీ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ గర్జన సభలో బీసీ కులాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా ప్రకటన చేశారు. వెనుకబడిన కులాల్లో ప్రతి కులానికీ కార్పొరేషన్, విద్య, ఉపాధి కల్పిస్తామని చెప్పడం సంతోషం. చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా 10 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించడం బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది. దొరస్వామి
కుటుంబాలు బాగుపడతాయ్
జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన 7 లక్షలు రూపాయ వైఎస్సార్ బీమాతో తెలుగు కు టుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. చేసిన అ ప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడితే కుటుంబ పెద్దగా వైఎస్సార్ బీమాను ప్రవేశ పెట్టి ఆదుకునే గొప్ప మనస్సు జగనన్నకే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలనే కాకుండా రైతులను బీమా పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించడంతో అన్ని వర్గాల కుటుంబాలు బాగుపడినట్ల–హేమచంద్రారెడ్డి,రైతు, సముదాయం.
Comments
Please login to add a commentAdd a comment