బీసీ సామాజికవర్గాలకు గత ఎన్నికల్లో కులాల వారీగా హామీలిస్తూ.. చంద్రబాబునాయుడు అన్ని వర్గాలను మోసం చేశారని, టీడీపీ పాలనలో బీసీలు వంచనకు గురయ్యారని వైఎస్సార్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఏలూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో మోపిదేవి మాట్లాడుతూ.. బీసీలకు పటిష్టమైన భద్రత కల్పించడానికి బీసీల సామాజిక పరిస్థితులపై వైఎస్ జగన్ క్షుణ్నంగా అధ్యయనం చేసి.. తెలుసుకున్నారని, బీసీల వర్గాలందరికీ జీవన భద్రత కల్పించేందుకు, వారిని అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఒక భరోసాను వైఎస్ జగన్ సభలో ఇవ్వబోతున్నారని మోపిదేవి తెలిపారు.