సామాజికంగా వెనుకబడిన బీసీ వర్గాలపై అపారమైన ప్రేమను చాటుతూ.. వారి అభ్యున్నతి, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ. 15వేల కోట్లు రూపాయలు కేటాస్తాయిమని, ఐదేళ్లలో రూ. 75వేల కోట్లు బీసీలకు అందిస్తామని వైఎస్ జగన్ చరిత్రాత్మక ప్రకటన చేశారు.