bc declaration
-
BC Declaration బీసీలకు అభయ‘హస్తం’
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణలో కాంగ్రెస్ (congress) ప్రభుత్వం చరి త్రాత్మకమైన కులగణన పూర్తి చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైంది. కులగణనను శాస్త్రీయంగా పూర్తిచేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభు త్వాన్ని అభినందించాల్సింది పోయి... ప్రతిపక్షాలు దిగజారుడుతనంతో విమర్శలు కొనసాగించడం బాధాకరం. జనాభాలో సగంపైగా ఉన్న బీసీలకు సమ న్యాయం జరగాలనే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... తొలుత తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీనిపై ముందడుగు వేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే 2023 నవంబర్‌లో కామారెడ్డి బహిరంగ సభలోకాంగ్రెస్ ‘బీసీ డిక్లరేషన్’ (BC Declaration) ప్రకటించింది. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో కులగణన చేపడుతామని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన అంశాన్ని చేపట్టి పూర్తి చేసింది. రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీ జనాభా ఉందని నిర్ధారణ కావడంతో బీసీలకు న్యాయం చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపుల్ల లేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ వివరాలను కేసీఆర్ సర్కార్ ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో బీసీ జనాభా 56 శాతానికి పైగా ఉందంటే, తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా శాసనం చేసేందుకు అనేక చట్టపరమైన ప్రక్రియలుంటాయి. దీనికి సమయం పట్టే అవకాశం ఉండడంతో కాలయాపన జరగకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రక టించినట్టు బీఆర్ఎస్, బీజేపీలు కూడా 42 శాతం బీసీలకు టికెట్లిస్తాయా అని ప్రశ్నిస్తే ఆ పార్టీలు సరైన రీతిలో స్పందించకుండా అసలు విషయాన్ని దారి మళ్లిస్తున్నాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించింది బీఆర్ఎస్. ఇప్పుడు అది నిరాధార ఆరోపణలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJ)P)దేశంలో జనగణన చేపట్టకుండా తాత్సారం చేస్తోంది. తక్షణమే జనగణన నిర్వహించి, అందులో భాగంగా కులగణన కూడా చేపట్టి జనాభా ప్రాతిపదికన సంబంధిత సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనుశాస్త్ర ధర్మాన్ని అనుసరిస్తూ, రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్‌నే అవమా నిస్తున్న బీజేపీ నుండి సామాజిక న్యాయం ఆశించడం అత్యాశే అవుతుంది. బీజేపీవారు దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారు.దేశంలో జనగణన, కులగణన చేపట్టాలని సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ కోరుతుంటే వారి కులాలను ప్రస్తావించి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ముస్లింలను బీసీ సామాజికవర్గంలో ఎలా చేరుస్తారనీ, వారికి రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారనీ బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారు. ముస్లింలలో వెనుకబడిన వారు లేరా? బీజేపీ వారి మోడల్‌గా చెప్పుకునే గుజరాత్లో ఓబీసీ ముస్లింలుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదా? తెలంగాణ ప్రభుత్వం కులగణన నివేదిక అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఈ అంశాన్ని స్వాగతిస్తుంటే, ఆ పార్టీలో మరికొందరు కులగణన తప్పుడు లెక్కలంటూ వ్యాఖ్యానించడడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనం. బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను విఫలం చేయడానికి ప్రతి పక్షాలు పన్నుతున్న కుట్రలను వెనుకబడిన తరగతుల ప్రజలు గమనించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం ప్రధాని మోదీని ఒప్పించ గలరా? ఇందుకోసం బీఆర్ఎస్ కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. 2023 ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన బీజేపీ... ఎన్నికల సమయానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన బండి సంజ య్‌ను తొలగించి, ఆయన స్థానంలో ఓసీ వర్గీయుడైన కిషన్‌రెడ్డిని నియమించింది. తెలంగాణకు ముఖ్య మంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే అందలమెక్కారు. ఈ రెండు పార్టీలకు భిన్నంగా సామాజిక న్యాయం పాటిస్తూ కాంగ్రెస్... బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కాంగ్రెస్‌తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, బీసీ లకు కాంగ్రెస్సే అభయహస్తం ఇవ్వగలదని కుల గణనతో మరోసారి నిరూపితమైంది. ప్రతిపక్షాలు కీలకమైన విషయాలను పక్కదారి పట్టిస్తే రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గం సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం. -బి. మహేశ్ కుమార్ గౌడ్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
బీసీ డిక్లరేషన్ హామీలు ఎటు పోయాయి?: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హన్మకొండ: బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి?ఎటు పోయాయి? అంటూ కాంగ్రెస్ సర్కార్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఆదివారం ఆయన హన్మకొండలో మాట్లాడుతూ.. ఏడాది కింద ఇదే రోజు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ పేరిట చాలా వాగ్ధానాలు ఇచ్చారు. కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు ఉన్న పథకాలు తీసేసింది.’’ అని మండిపడ్డారు.‘‘కాంగ్రెస్ పార్టీ బీసీలకు వెన్నుపోటు పొడిచింది. బీసీ బంధుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాతర వేసింది. కుల గణన కోసం ఇళ్లకు వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని అడుగుతుంటే అధికారులు నీళ్లు నములుతున్నారు. అడ్డమైనా హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బీసీ ఓట్ల కోసం.. కులగణనతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీసింది. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు. బీసీ డిక్లరేషన్‌తో కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తుంది. మహారాష్ట్రలో సీఎం రేవంత్ తెలంగాణకు 500 బోనస్ ఇచ్చామంటూ బోగస్ మాటలు మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడదాం’’ అని కేటీఆర్ చెప్పారు.ఇదీ చదవండి: ఈ గందరగోళమేంటి ‘సర్వే’శా! -
కులగణన ఆరంభమయ్యేది ఎప్పుడు?
గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ ప్రకటించాక, రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతారనీ, స్థానిక సంస్థలలో 42 శాతం ప్రజాప్రాతినిధ్యం లభిస్తుందనీ, బీసీల సమగ్రాభివృద్ధికి అవకాశం ఉంటుందనీ నమ్మారు. మెజారిటీ బీసీలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. కానీ, రేవంత్ ప్రభుత్వం తన జీ.ఓ.ల ద్వారా ప్రజల్లోగందరగోళం సృష్టిస్తోంది. జీ.ఓ. 199లో బీసీ కమిషన్ బీసీ జన గణనను చేపట్టి, స్థానిక సంస్థలలో వారి రిజర్వేషన్లను నిర్ణయించడం జరుగుతుందని స్పష్టంగా పేర్కొంది. కాని జీ.ఓ. 26లో మొత్తం కులగణన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేన్ని నమ్మాలి?దేశంలో, రాష్ట్రంలో మెజారిటీ జనాభా వెనుకబడిన తరగతుల వారిదే. రాష్ట్రంలో ఈ వర్గాల జనాభా 56 శాతం. బీసీ జాబితాలోని ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులలో 130 కులాలు ఉన్నాయి. బీసీలు భిన్నమైన సంప్రదా యాలు, ఆచారాలు, కళారూపాలు, కులదైవాలు కలిగి ఉండి తమవైన ప్రత్యేకతలు సంతరించుకుని ఉన్నారు. ఇప్పటికీ అనేక సామాజిక కులాలు, జాతులు ఆధునిక అభివృద్ధికి నోచుకోలేక పోయాయి. వీరిని వర్తమాన ప్రగతిలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు సంకల్పశుద్ధితో, నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం కృషిచేయాలి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలలోని సంచార, అర్ధసంచార, విముక్త జాతులు, కులాలు ఏ అభివృద్ధికీ నోచుకోకుండా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టితో వీరిని ప్రగతి పథంలోకి తీసుకు రావడానికి చేసిన కృషి శూన్యమే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గడిచిన పదేళ్లలో కొంతమేరకు గురుకుల పాఠశాలల ద్వారా చదువుకోవడానికి ఈ వర్గాలకు అవకాశం లభించింది. అయితే గత ప్రభుత్వం ఆశించిన మేరకు అండదండలు ఇవ్వలేదనే కారణంగా, ఈసారి బీసీలు కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డారు. అయితే రేవంత్ ప్రభుత్వం కూడా గత పాలకులకన్నా మరింత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం పట్ల బీసీలు ఆందోళన చెందుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ ప్రకటించాక, రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితు లయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతారనీ, స్థానిక సంస్థలలో 42 శాతం ప్రజాప్రాతినిధ్యం లభిస్తుందనీ, బీసీల సమగ్రాభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలులోకి వస్తాయనీ సంపూర్ణంగా నమ్మారు. మెజారిటీ బీసీలు ఓట్లు వేసికాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. అనుకున్నట్లు గానే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. తమకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరతాయని బీసీలు కొంతకాలం వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. కాగా ప్రభుత్వం ఎంతకీ ఉదాసీన వైఖరిని వీడక పోవడంతో ఉద్యమబాట పట్టక తప్పలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కుల సర్వే (కులగణన)కు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తదను గుణంగా మార్చి 15న జీఓఎంఎస్ నం. 26ను విడుదల చేసింది.కాగా గడిచిన 6 నెలలుగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం తన వైపు నుండి ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టలేదు. తిరిగి బీసీసంఘాలు తీవ్రంగా ఉద్యమాలు మొదలుపెట్టాయి. ఆమరణ నిరా హార దీక్షల స్థాయికి ఉద్యమాల తీవ్రత పెరిగింది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఉలుకూ, పలుకు లేకపోవడం పట్ల బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అనే విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే మిక్కిలి అనుభవంతో, క్రియాశీలంగా పని చేస్తున్న డా‘‘ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నేతృత్వంలోని బీసీ కమిషన్ గడువు ఆగస్టు 31తో ముగిసింది. సర్వత్రా ఈ కమిషన్ గడువును పెంపుదల చేస్తారని భావించారు. అలాగే కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించడం లాంటి కీలక అంశాలను త్వరితగతిన చేయడానికి సహకరిస్తుందని అనుకున్నారు. కాగాఅందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురితో బీసీ కమి షన్‌కు కొత్త పాలకమండలిని నియమించింది ప్రభుత్వం. దీంతో మళ్లీ కథ మొదటి కొచ్చినట్టయ్యింది. 6 నెలలు పొడిగిస్తే సులభంగా అయ్యే పనిని, కొత్త పాలకమండలిని వేసి మళ్లీ కొత్తగా పని మొదలు పెట్టడం అనేది కేవలం సమయాన్ని వృధా చేయడమే. బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలిగించడానికే కుట్ర జరుగుతున్నదని బీసీలు చేస్తున్న ఆరోపణలు నిజమని భావించడం తప్పేమీ కాదు.బలహీన వర్గాలు చాలా కాలంగా తాము చేస్తున్న డిమాండ్ కులగణన నిర్వహించాలన్నది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినందుకే, ఆ పార్టీకి అండగా నిలబడ్డారు. అయితే కేవలం జీ.ఓ. ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ కార్యక్రమాన్ని అంకితభావంతో, చిత్తశుద్ధితో పూర్తిచేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. కానీ అలా రావడంలేదు. దీన్ని బట్టి రేవంత్ ప్రభుత్వం ఈ వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో లేదనే రీతిలో వ్యవహరిస్తోందన్న సామాజిక వేత్తల అభిప్రాయాలు నిజమే అని నమ్మాల్సి వస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక నెలరోజుల పాటు పూర్తి సమ యాన్ని కేటాయిస్తే, కులగణనను సమర్థమంతంగా పూర్తిచేయవచ్చు. కానీ అలాంటి చర్యల దిశగా ప్రభుత్వం కృషి చేయడం లేదు. ఇటీవల బీసీ కమిషన్‌కు కొత్త పాలకమండలిని నియమిస్తూ జారీచేసిన జీ.ఓ. 199లో... ఈ కమిషన్ బీసీ జన గణనను చేపట్టి, స్థానిక సంస్థలలో వారి రిజర్వేషన్లను నిర్ణయించడం జరుగుతుందని స్పష్టంగాపేర్కొంది. ఇది మరొక వివాదానికి దారి తీస్తోంది. జీ.ఓ. 26లో మొత్తం కులగణన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేన్ని నమ్మాలి? ఈ కారణంగా ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటివి, ప్రత్యేకంగా న్యాయ నిపుణుల సలహాలతో ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వం ఆదరాబదరాగా ఇచ్చిన జీ.ఓ. మరింత గందరగోళానికి దారి తీస్తున్నదని న్యాయ నిపుణులు అంటున్నారు. బీసీ గణన, కులగణన అనేవి పూర్తిగా వేరు వేరు ప్రక్రియలు అనే స్పష్టత ప్రభుత్వానికి లేనట్లు అర్థమవుతోంది. బీసీల గణన అంటే... కేవలం బీసీ కులాలకు సంబంధించినటువంటి వివరాలను, గణాంకాలను సేకరించడం. కులగణన అనగా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల, వర్గాల సమాచారాన్ని సేకరించడం. కులగణన చేయడం వలన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సమాచారాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసి విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశంఉంటుంది. కేవలం బీసీ గణన చేయడం ద్వారా బీసీలలో ఉన్న తారతమ్యాల వివరాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. దాని వలన పెద్దగా ఉపయోగం లేదు.అందువలన కులగణన లేదా కుల సర్వే పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన అనివార్యతను ప్రభుత్వం గమనించి ఆ దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. బీసీ గణన, కులగణన అంటూ ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేయడం మంచిది కాదు. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరితో ప్రభుత్వం యావత్ కులగణనకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. న్యాయపరంగా పరిశీలించినప్పుడు కులగణన లేదా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సామాజిక, ఆర్థిక కుల సర్వే... స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ వాటాను నిర్ణయించడానికి అత్యంత ఆవశ్యకమైనది. దీనికి సంబంధించి రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ క్రింద ప్రత్యేకంగా నిపుణులతో కూడిన ‘డెడికేటెడ్ కమిషన్’లను నియమించాలి. సమగ్రంగా అధ్యయనం చేయించాలి. ఆ కమిషన్లు ఇచ్చే సిఫారసులు, నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించి డా‘‘ కె. కృష్ణమూర్తి, వికాస్ కిషన్‌రావు గవాలి లాంటి కీలక కేసులలో గౌరవ సుప్రీంకోర్టురాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా మార్గదర్శకాలను సూచించాయి. ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఉత్తర్వులను జారీచేయడం, సముచితం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.- వ్యాసకర్త రాజ్యసభ సభ్యుడు,జాతీయ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు- ఆర్. కృష్ణయ్య -
బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట రూ. 20 వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్ పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు. వచ్చే బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీలకు మండలానికో అంతర్జాతీయ స్థాయి గురుకులాల ఏర్పాటు వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరో మూడేళ్లలో జరగనున్న పూలే ద్విశతాద్ది ఉత్సవాల నాటికి హైదరాబాద్‌లో ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ మేరకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, బీసీలకు ఇచి్చన హామీలను నోటి మాటలకు పరిమితం చేయకుండా కాంగ్రెస్ ఆచరించి చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం బీసీల అభివృద్ధి, సంక్షేమంతోపాటు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారికి రాజకీయ అవకాశాల కోసం బీఆర్ఎస్ మాత్రమే పాటుపడుతోందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు ఇవ్వడంతోపాటు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించామని చెప్పారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో బీసీల అభ్యున్నతిని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించి చూపామని.. ఫూలే ఆలోచనా విధానంలో భాగంగా వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేశామని వివరించారు. నేత, యాదవ, ముదిరాజ్, గౌడ సామాజికవర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టామని... అత్యంత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్‌పై బడుగు, బలహీనవర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని ఎమ్మెల్సీ మధుసూధనాచారి అన్నారు. గత పదేళ్లలో సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. -
YSRCP.. జయహో ‘బీసీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 58 నెలలుగా సమాజానికి వెన్నెముకగా బీసీలను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి 48 శాసనసభ, 11 లోక్‌సభ స్థానాలు వెరసి మొత్తం 59 స్థానాలు కేటాయించి వారికి పెద్దపీట వేశారు. తద్వారా తన భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆయన సుస్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 శాసనసభ, 48 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో బీసీలకు ఎవరూ అవకాశం ఇచ్చిన దాఖలాల్లేవు. ఉత్తరప్రదేశ్‌లో బీసీ నేత అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా సీఎం జగన్ ఇచ్చిన రీతిలో బీసీలకు అవకాశం ఇవ్వలేదని.. దేశ చరిత్రలో ఇదో రికార్డు అని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ ఆయన అధికారంలోకి వచ్చాక అమలుచేయకుండా తమను వంచించారని బీసీలు రగలిపోతున్నారు. అదే వైఎస్ జగన్ గత ఎన్నికలకు ముందు 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో తమకు చెప్పిన దానికంటే అధికంగా చేస్తుండడంపై బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా.. బీసీలు కూడా తమను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్కున చేర్చుకున్న సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలకు తరలివచ్చిన జనసందోహం ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు వైఎస్సార్సీపీ వెంట నడుస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని వారు స్పష్టంచేస్తున్నారు. మొత్తం మీద శాసనసభ, లోక్‌సభ స్థానాలు కలిపి గత ఎన్నికల కంటే ఇప్పుడు అదనంగా 11 స్థానాలను సీఎం జగన్ తమకు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అవమానించి, అవహేళన చేసిన బాబు.. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇస్తామని.. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఏటా రూ.పది వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని.. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలను మాఫీ చేస్తానని అందులో ప్రకటించారు. కానీ.. 2014 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనే బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారి సబ్‌ప్లాన్‌కు పాతరేశారు. అలాగే, ఐదేళ్లలో బీసీ సబ్‌ప్లాన్ ద్వారా రూ.50 వేల కోట్ల వరకు ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి.. అందులో సగం కూడా ఖర్చుచేయలేదు. పైగా.. మంత్రివర్గంలో వారికి సముచిత స్థానం కల్పించని చంద్రబాబు.. 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అంతేకాక.. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారంటూ వారిని అవహేళన చేశారు. ఇచ్చిన హామీలు అమలుచేయాలని అడిగిన బీసీలను తాటతీస్తా.. తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తమపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్న చంద్రబాబు.. ఇప్పటిదాకా ఖరారు చేసిన 128 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 24 స్థానాలనే తమకు కేటాయించడంపై బీసీలు భగ్గుమంటున్నారు. ఇచ్చిన మాటకంటే అధికంగా.. ఇక గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో వారికిచ్చిన మాట కంటే గత 58 నెలలుగా అధికంగానే న్యాయం చేశారు. ఉదా.. ► గత ఎన్నికల్లో 41 శాసనసభ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాల్లో బీసీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించిన జగన్.. అధికారంలోకి వచ్చాక కేబినెట్లో ఆ వర్గాలకు చెందిన 11 మందికి మంత్రి పదవులిచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతోపాటు ప్రధానమైన రెవెన్యూ, విద్యా, పౌరసరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధానమైన శాఖలను ఆ వర్గాలకే అప్పగించి పరిపాలనలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశమిచ్చారు. ► ఈ వర్గాలకే చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్ శాసనమండలిలో సైతం సింహభాగం పదవులు వారికే ఇచ్చారు. ► ఇక స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి దక్కిన 13 జెడ్పీ చైర్మన్ పదవులకుగాను ఆరు బీసీలకే ఇచ్చారు. ► 84 మున్సిపల్ చైర్మన్ పదవులకుగానూ 44 వారికే కేటాయించారు. 14 కార్పొరేషన్ల మేయర్ పదవులకుగానూ తొమ్మిది బీసీలకే దక్కేలా చేశారు. ► అలాగే, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు. ► మరోవైపు.. గత 58 నెలలుగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.1.23 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.50 వేల కోట్లు వెరసి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనాన్ని బీసీలకు చేకూర్చారు. దీంతో.. రాజకీయ, ఆర్థిక, విద్యా, మహిళా సాధికారత ద్వారా బీసీలు సామాజిక సాధికారతను సాధించారు. -
బాబు జిమ్మిక్కులు నమ్మం
సాక్షి, అమరావతి: ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటక బోడి మల్లన్న అన్నట్లుగా.. ఎన్నికల్లో అవకాశవాదంతో వ్యవహరించే చంద్రబాబును నమ్మేదిలేదని బీసీలు కుండబద్దలు కొడుతున్నారు. ఎన్నికలు వచ్చి న ప్రతిసారి బీసీలే టీడీపీకి వెన్నెముక అని వారిని మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను కరివేపాకులా తీసిపారేస్తున్నాడని మండిపడుతున్నారు. 2014 ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తమను మోసగించిన తీరును బీసీ నేతలు గుర్తుచేస్తున్నారు. అలాగే, 2019 ఎన్నికల ముందు కూడా బీసీలకు 119 హామీలను ఇచ్చి న చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క హామీనీ సరిగ్గా అమలుచేయలేదన్నారు. ఇక 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరిన బీసీలను ‘ఏం తమాషాలు చేస్తున్నారా.. పిచ్చాటలు ఆడారంటే మీ తోకలు కత్తిరిస్తా.. మీ తాట తీస్తా’.. అంటూ వేలు చూపించి బెదిరించడంతోపాటు మత్స్యకారులపై కేసులు పెట్టిన చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయేదిలేదని బీసీ నేతలు స్పష్టంచేస్తున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు కనీసం సగం సీట్లు కూడా ఇవ్వకుండా దగా చేసిన తీరును వారు మరిచిపోలేదు. ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తానని అప్పట్లో హామీ ఇచ్చి న చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. నిధుల కేటాయింపులో దగా చేయడమే కాకుండా పదవుల కేటాయింపులోను చంద్రబాబు బీసీలను తీవ్రమోసం చేశాడని వాపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెనుకబడిన తరగతులను మరోమారు బురిడీ కొట్టించేందుకు ఆయన చేస్తున్న జిమ్మిక్కులను నమ్మేదిలేదని తెగేసి చెబుతున్నారు. జగన్‌ను చూసి బాబు నేర్చుకోవాలి రాజకీయాల్లో 42 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు యువకుడైన సీఎం జగన్‌ను చూసి చాలా నేర్చుకోవాలి. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి ప్రజలను ఆదుకుని అండగా నిలవాలనే మనస్సు ఉండాలి. అటువంటి మంచి మనస్సు జగన్‌కు ఉంది. చంద్రబాబుకు పేదల గురించి ఆలోచించే మనస్సు ఏ కోశానా లేదు. చంద్రబాబు సంక్షేమ పథకాలకు తన సొంత సొమ్ము ఇచ్చి నట్లు ఫీలవుతాడు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు మేలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదం. 2014లో చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎంతమేరకు అమలు చేశారో? గమనిస్తే చాలు ఆయన చిత్తశుద్ధి తెలిసిపోతుంది. తాజాగా టీడీపీ ప్రకటించిన డిక్లరేషన్‌లో ఎట్రాసిటీ యాక్ట్ తప్ప మిగతావన్నీ ప్రస్తుతం సీఎం జగన్ అమలుచేస్తున్నవే. సామాజిక న్యాయం అమలులో సీఎం జగన్‌కు ఎవరూ సాటిరారు. – డాక్టర్ ఎన్వీ రావు, జాతీయ అధ్యక్షుడు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నయవంచకులు బాబు.. పవన్‌లను నమ్మం చంద్రబాబు, పవన్‌లు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ నేతి బీర చందంగా ఉంది. గత డిక్లరేషన్‌నే అటకెక్కించిన నయవంచక బాబు, పవన్ఇప్పుడు మళ్లీ డిక్లరేషన్ అంటే బీసీలు నమ్మరు. వారి పట్ల బాబు, పవన్‌లకు చిత్తశుద్ధిలేదని తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్లు తేటతెల్లం చేస్తున్నాయి. అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే ఆశయాలు, ఆలోచనలను అమలుచేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్. గతంలో బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది చెప్పినట్లుగా అమలుచేసి చూపించిన సీఎం జగన్ రాష్ట్రంలోని బీసీలను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేయించి బాబు ద్రోహం చేస్తే.. అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన సీఎం జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుచేశారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వారి ఉన్నతికి సీఎం జగన్ చర్యలు చేపట్టారు. – చింతపల్లి గురుప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ కులాల జేఏసీ -
జైహో బీసీ..ఛీ పో చంద్రం..కాళ్ళ బేరానికి పచ్చ బ్యాచ్..
-
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా కేసులు వేసింది బాబే
-
చంద్రబాబు బీసీ ద్రోహి
-
మసి‘బీసీ’ నవ్వులపాలు దిక్కుమాలినబీసీ డిక్లరేషన్
బీసీ డిక్లరేషన్ సభలో తాను అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లలో చంద్రబాబు చేస్తానన్న ఖర్చు రూ. 1.50 లక్షల కోట్లు.. గత ఐదేళ్లలో బీసీల కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఖర్చు రూ. 1.76 లక్షల కోట్లు బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా చూసిన చంద్రబాబు ‘బ్యాక్ బోన్’ అంటూ జగన్ ప్రభుత్వ స్లోగన్‌ను కాపీ కొట్టారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. ‘బ్యాక్ బోన్’ అంటూ గత ఐదేళ్లలో వారికి అన్ని రంగాల్లో జగన్ అగ్రప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ అయినా.. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేస్తామని హామీలిస్తుంది. కానీ నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడంలోసిద్ధహస్తుడైన చంద్రబాబు మాత్రం బీసీలకు అంతకంటే తక్కువ ఖర్చు చేస్తానని చెప్పి నవ్వుల పాలయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కాపీ కొట్టి డిక్లరేషన్ అంటూ విడుదల చేయడం ఆ పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు కాపీల్లో మచ్చుకు కొన్ని బీసీ కార్పొరేషన్లు.. కుల ధ్రువీకరణ పత్రాలు.. కుల గణన.. పెన్షన్లు –సాక్షి, అమరావతి మళ్లీ మోసం చేసేందుకు బాబు రెడీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇంతవరకు 1.78 లక్షల కోట్లను బీసీలకు ఇచ్చారు. అందులో డీబీటీ(డైరక్ట్ టు బెనిఫి షియర్) ద్వారా నేరుగా బీసీల బ్యాంక్ అకౌంట్లలోకి 1,27,730 కోట్లను వివిధ పథకాల ద్వారా జమ చేశారు. మరో రూ.50,657 కోట్లు నాన్–డీబీటీ కింద ఆ వర్గాలకు అందించారు. మొత్తం కలిపి రూ.1,78,387 కోట్లను బీసీలకు ఇచ్చారు. అయితే బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు మంగళవారం జరిగిన సభలో గొప్పగా చెప్పారు. అంటే వైఎస్ జగన్ ఇచ్చిన దాని కంటే తగ్గించి చేస్తామని బీసీ డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో కలిసి హామీ ఇవ్వడం విశేషం. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ వైఎస్ జగన్ ఇప్పటికే అమలు చేస్తున్నారు. నిజానికి ఇదే డిక్లరేషన్‌ను గతంలోనూ ప్రకటించిన చంద్రబాబు అమలు చేయకుండా బీసీలను మోసం చేశారు. మళ్లీ వారిని మోసం చేసేందుకు కొత్త బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. ఇంటికే కుల ధ్రువీకరణ పత్రాలు కనిపించలేదా? శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని గొప్పగా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇస్తున్న కుల ధ్రువీకరణ పత్రాలు శాశ్వతమైనవే. వైఎస్ జగన్ దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడంతో రెవెన్యూ శాఖ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తోంది. అది తెలిసి కూడా బీసీలకు చేయడానికి ఏం హామీలు లేవన్నట్లు కాపీ కొట్టారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు హామీ ఇస్తూనూ ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ హామీలో బీసీలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. గత ఐదేళ్లుగా వలంటీర్లతో ఇంటికే పెన్షన్ అందిస్తుండగా.. చంద్రబాబు మాత్రం ఇప్పుడు కొత్త బిచ్చగాడిలా వలంటీర్లతో ఇంటికే పెన్షన్ అందిస్తామని చెప్పడం కొసమెరుపు. 2012 బీసీ డిక్లరేషన్ ఏమైంది బాబూ! ♦ బీసీ డిక్లరేషన్ పేరుతో గతంలో వందకు పైగా ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు. ♦ 2012లో 19 ప్రధాన హామీలతోపాటు చేతి వృత్తులు, కులాల వారీగా మొత్తం 119 హామీలిస్తూ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయలేదు. డిక్లరేషన్ అమలు పేరుతో ఏకంగా 56 కమిటీలు వేసి కాలయాపన చేశారు. కత్తెరలు, ఇస్త్రీ పెట్లెలు ఇచ్చి అదే ఆదరణ అంటూ డబ్బాలు కొట్టుకున్నారు. చివరికి దాన్ని ఒక కుంభకోణంగా మార్చారు. ఇప్పుడు ఆ కుంభకోణాన్ని మళ్లీ తీసుకువస్తానని ప్రకటించడం విశేషం. ♦ బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇస్తానని డిక్లరేషన్‌లో ప్రకటించిన చంద్రబాబు 2014లో సగం సీట్లు కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 43 సీట్లతో సరిపెట్టాడు. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో కేవలం 18 సీట్లు బీసీలకు కేటాయించి వంచన చేశాడు. ♦ రూ.10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తానన్న చంద్రబాబు ఆ హామీ గాలికి వదిలేశారు. ఐదేళ్లలో రూ.50 కోట్లు సబ్‌ప్లాన్‌కు కేటాయించాల్సి ఉండగా అందులో సగం నిధులు కూడా కేటాయించలేదు. చివరికీ స్లోగన్ కూడా కాపీనే.. టీడీపీ బీసీ డిక్లరేషన్ రూపకల్పన మొక్కుబడి తంతు అని చంద్రబాబు నిరూపించుకున్నారు. ఈ డిక్లరేషన్ కోసం కనీసం ఒక స్లోగన్‌ను కూడా చంద్రబాబు, టీడీపీ ఇవ్వలేకపోయింది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల క్రితం ఇచ్చిన ‘బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్’ అనే స్లోగన్‌ను కాపీ కొట్టి తమ డిక్లరేషన్‌లో పెట్టుకోవడం బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్న నిర్లిప్తత, భావ దార్రిద్యాన్ని తేటతెల్లం చేసింది. బీసీల పార్టీ అని డబ్బా కొట్టుకుంటూ కనీసం వారి ఒక కొత్త స్లోగన్ కూడా చెప్పలేని స్థితిలో చంద్రబాబు, ఆయన పరివారం ఉంది. కొత్తగా మళ్లీ కార్పొరేషన్లా? జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటికే 139 కులాలకు 56 కార్పొరేషన్లను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. మళ్లీ తాను వస్తే ఏర్పాటు చేస్తానని డిక్లరేషన్‌లో చెప్పడం మోసగించడమేనని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్లను ఎందుకు ఏర్పాటు చేయలేదు? మళ్లీ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తామని ఎందుకు చెబుతున్నారు? ఇది మోసం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. 2014లో కులగణన ఎందుకు చేయలేదు? చట్టబద్ధంగా కుల గణన చేస్తామని చంద్రబాబు డిక్లరేషన్‌లో డబ్బా కొట్టుకున్నారు. గతంలో ఇచ్చిన ఆ హామీ ఏమైంది. అధికారంలోకి వచ్చాక దాన్ని బుట్టదాఖలు చేశారు. వైఎస్ జగన్ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అంతేకాదు రాష్ట్రంలో ఇప్పటికే కుల గణన ప్రారంభించారు. అన్నీ జగన్ అమలు చేస్తున్న పథకాలే.. బాబు కాపీ నేతన్నలను ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు మోసం చేస్తే సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న నేస్తంతో ఏటా రూ.24 వేలు సాయంతోపాటు పెన్షన్ వయో పరిమితి కుదించి అర్హులందరికీ రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నారు. బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించి సీఎం జగన్ చరిత్ర సృష్టించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. వంచనలో వస్తాద్ ♦ చేనేత రంగానికి 25 హామీలు గుప్పించి ఒక్కటీ నెరవేర్చలేదు. రుణాలు మాఫీ చేస్తానని.. కమిటీతో చేతులు దులిపేసుకున్నారు. చేనేత కారి్మకులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ఏటా రూ.వెయ్యి కోట్ల మాటే మరిచారు. ♦ ప్రమాదవశాత్తు మరణించిన వృత్తి పనివారికి పరిహారం.. చేతి, కుల వృత్తుల సమాఖ్యలను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో అనుసంధానం చేసి ఆదుకుంటామమన్న హామీ గాల్లో కలిపేశారు. ♦ గీత కార్మికులకు ఏడు హామీలిచ్చి మోసం చేశారు. బెల్టుషాపులు తొలగించి గీత వృత్తిని ఆదుకుంటామని, హైబ్రిడ్ విత్తనాలు సరఫరా చేసి గీత చెట్లను పెంచేలలా ప్రోత్సహిస్తామని, తాటితోపుల పెంపకానికి భూమిని కేటాయిస్తామని ఇచ్చిన హామీని, అన్ని కులాలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. -
మడతబెట్టిన హామీలకు డిక్లరేషన్ రూపం.. 'బీసీల కోసం మరో వేషం'
బాబూ ఈ మాటలు మరిచావా? బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక.. ఇది బీసీల పార్టీ.. బీసీల ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ పార్టీ పనిచేస్తుంది. – ఇవి ఎన్నికల ముందు బాబు మాయ మాటలు. కట్ చేస్తే.. ఏం తమాషాలు చేస్తున్నారా.. పిచ్చాటలు ఆడారంటే మీ తోకలు కత్తిరిస్తా.. మీ తాట తీస్తా.. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రానిచ్చారు. – ఇది అధికారంలోకి వచ్చాక బీసీలపై బాబు శివాలు. సాక్షి, అమరావతి: బీసీ డిక్లరేషన్ సభలో తాను అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లలో చంద్రబాబు చేస్తానన్న ఖర్చు రూ. 1.50 లక్షల కోట్లు.. గత ఐదేళ్లలో బీసీల కోసం సీఎం వైఎస్ జగన్ చేసిన ఖర్చు రూ. 1.76 లక్షల కోట్లు. బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా చూసిన చంద్రబాబు ‘బ్యాక్ బోన్’ అంటూ జగన్ ప్రభుత్వ స్లోగన్‌ను కాపీ కొట్టారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. ‘బ్యాక్ బోన్’ అంటూ గత ఐదేళ్లలో వారికి అన్ని రంగాల్లో జగన్ అగ్రప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ అయినా.. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేస్తామని హామీలిస్తుంది. కానీ నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు మాత్రం బీసీలకు అంతకంటే తక్కువ ఖర్చు చేస్తానని చెప్పి నవ్వుల పాలయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కాపీ కొట్టి డిక్లరేషన్ అంటూ విడుదల చేయడం ఆ పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు కాపీల్లో మచ్చుకు కొన్ని బీసీ కార్పొరేషన్లు.. కుల ధ్రువీకరణ పత్రాలు.. కుల గణన.. పెన్షన్లు.. మళ్లీ మోసం చేసేందుకు బాబు రెడీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇంతవరకు 1.78 లక్షల కోట్లను బీసీలకు ఇచ్చారు. అందులో డీబీటీ(డైరక్ట్ టు బెనిఫిషియర్) ద్వారా నేరుగా బీసీల బ్యాంక్ అకౌంట్లలోకి 1,27,730 కోట్లను వివిధ పథకాల ద్వారా జమ చేశారు. మరో రూ.50,657 కోట్లు నాన్–డీబీటీ కింద ఆ వర్గాలకు అందించారు. మొత్తం కలిపి రూ.1,78,387 కోట్లను బీసీలకు ఇచ్చారు. అయితే బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు మంగళవారం జరిగిన సభలో గొప్పగా చెప్పారు. అంటే వైఎస్ జగన్ ఇచ్చిన దాని కంటే తగ్గించి చేస్తామని బీసీ డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో కలిసి హామీ ఇవ్వడం విశేషం. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ వైఎస్ జగన్ ఇప్పటికే అమలు చేస్తున్నారు. నిజానికి ఇదే డిక్లరేషన్‌ను గతంలోనూ ప్రకటించిన చంద్రబాబు అమలు చేయకుండా బీసీలను మోసం చేశారు. మళ్లీ వారిని మోసం చేసేందుకు కొత్త బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. చివరికీ స్లోగన్ కూడా కాపీనే.. టీడీపీ బీసీ డిక్లరేషన్ రూపకల్పన మొక్కుబడి తంతు అని చంద్రబాబు నిరూపించుకున్నారు. ఈ డిక్లరేషన్ కోసం కనీసం ఒక స్లోగన్‌ను కూడా చంద్రబాబు, టీడీపీ ఇవ్వలేకపోయింది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల క్రితం ఇచ్చిన ‘బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్’ అనే స్లోగన్‌ను కాపీ కొట్టి తమ డిక్లరేషన్‌లో పెట్టుకోవడం బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్న నిర్లిప్తత, భావ దారిద్య్రాన్ని తేటతెల్లం చేసింది. బీసీల పార్టీ అని డబ్బా కొట్టుకుంటూ కనీసం వారి ఒక కొత్త స్లోగన్ కూడా చెప్పలేని స్థితిలో చంద్రబాబు, ఆయన పరివారం ఉంది. కొత్తగా మళ్లీ కార్పొరేషన్లా? జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటికే 139 కులాలకు 56 కార్పొరేషన్లను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. మళ్లీ తాను వస్తే ఏర్పాటు చేస్తానని డిక్లరేషన్‌లో చెప్పడం మోసగించడమేనని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్లను ఎందుకు ఏర్పాటు చేయలేదు? మళ్లీ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తామని ఎందుకు చెబుతున్నారు? ఇది మోసం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. 2014లో కులగణన ఎందుకు చేయలేదు? చట్టబద్ధంగా కుల గణన చేస్తామని చంద్రబాబు డిక్లరేషన్‌లో డబ్బా కొట్టుకున్నారు. గతంలో ఇచ్చిన ఆ హామీ ఏమైంది. అధికారంలోకి వచ్చాక దాన్ని బుట్టదాఖలు చేశారు. వైఎస్ జగన్ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అంతేకాదు రాష్ట్రంలో ఇప్పటికే కుల గణన ప్రారంభించారు. ఇంటికే కుల ధ్రువీకరణ పత్రాలు కనిపించలేదా? శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని గొప్పగా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇస్తున్న కుల ధ్రువీకరణ పత్రాలు శాశ్వతమైనవే. వైఎస్ జగన్ దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడంతో రెవెన్యూ శాఖ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తోంది. అది తెలిసి కూడా బీసీలకు చేయడానికి ఏం హామీలు లేవన్నట్లు కాపీ కొట్టారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు హామీ ఇస్తూనూ ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ హామీలో బీసీలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. గత ఐదేళ్లుగా వలంటీర్లతో ఇంటికే పెన్షన్ అందిస్తుండగా.. చంద్రబాబు మాత్రం ఇప్పుడు కొత్త బిచ్చగాడిలా వలంటీర్లతో ఇంటికే పెన్షన్ అందిస్తామని చెప్పడం కొసమెరుపు. అన్నీ జగన్ అమలు చేస్తున్న పథకాలే.. బాబు కాపీ నేతన్నలను ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు మోసం చేస్తే సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న నేస్తంతో ఏటా రూ.24 వేలు సాయంతోపాటు పెన్షన్ వయో పరిమితి కుదించి అర్హులందరికీ రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నారు. బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించి సీఎం జగన్ చరిత్ర సృష్టించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. 2012 బీసీ డిక్లరేషన్ ఏమైంది బాబూ! బీసీ డిక్లరేషన్ పేరుతో గతంలో వందకు పైగా ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు. ► 2012లో 19 ప్రధాన హామీలతోపాటు చేతి వృత్తులు, కులాల వారీగా మొత్తం 119 హామీలిస్తూ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయలేదు. డిక్లరేషన్ అమలు పేరుతో ఏకంగా 56 కమిటీలు వేసి కాలయాపన చేశారు. కత్తెరలు, ఇస్త్రీ పెట్లెలు ఇచ్చి అదే ఆదరణ అంటూ డబ్బాలు కొట్టుకున్నారు. చివరికి దాన్ని ఒక కుంభకోణంగా మార్చారు. ఇప్పుడు ఆ కుంభకోణాన్ని మళ్లీ తీసుకువస్తానని ప్రకటించడం విశేషం. ► బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇస్తానని డిక్లరేషన్‌లో ప్రకటించిన చంద్రబాబు 2014లో సగం సీట్లు కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 43 సీట్లతో సరిపెట్టాడు. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో కేవలం 18 సీట్లు బీసీలకు కేటాయించి వంచన చేశాడు. ► రూ.10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తానన్న చంద్రబాబు ఆ హామీ గాలికి వదిలేశారు. ఐదేళ్లలో రూ.50 కోట్లు సబ్‌ప్లాన్‌కు కేటాయించాల్సి ఉండగా అందులో సగం నిధులు కూడా కేటాయించలేదు. చేనేత రంగానికి చేసింది శూన్యం... చేనేత రంగానికి 25 హామీలు గుప్పించి ఒక్కటీ నెరవేర్చలేదు. రుణాలు మాఫీ చేస్తానని.. కమిటీతో చేతులు దులిపేసుకున్నారు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ఏటా రూ.వెయ్యి కోట్ల మాటే మరిచారు. నేత బజార్ల ఏర్పాటు, జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ముడి సరుకుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాల అభివృద్ధి, జిల్లాకు చేనేత పార్కు వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. చేనేత కారి్మకుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు, వృద్ధాశ్రమాల ఏర్పాటు నీటిముటలయ్యాయి. చేతి వృత్తుల వారికీ చెయ్యిచ్చారు 2014 ఎన్నికల్లో చేతి వృత్తులవారికి విద్యుత్తు రాయితీ హామీ ఇచ్చిన అమలు చేయపోగా, 2019 ఎన్నికల ముందు కమిటీ వేస్తున్నట్లు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన వృత్తి పనివారికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. లక్ష ఆర్థిక సాయాన్ని నెల రోజుల్లోనే ఇస్తామని చెప్పి మోసగించారు. చేతి, కుల వృత్తుల సమాఖ్యలను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో అనుసంధానం చేసి ఆదుకుంటామమన్న హామీ గాల్లో కలిపేశారు. కులాలకు హామీల గతీ అంతే.. గీత కార్మీకులకు ఏడు హామీలిచ్చి మోసం చేశారు. బెల్టుషాపులు తొలగించి గీత వృత్తిని ఆదుకుంటామని, హైబ్రిడ్ విత్తనాలు సరఫరా చేసి గీత చెట్లను పెంచేలలా ప్రోత్సహిస్తామని, తాటితోపుల పెంపకానికి భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎక్సైజ్ నుంచి కల్లు వృత్తిని తప్పిస్తామనే హామీల అమలుకు కనీస ప్రయత్నం చేయలేదు. మత్స్యకారులకు ఆరు, గొర్రెల కాపరులకు ఏడు, రజకులకు ఏడు, నాయీ బ్రాహ్మణులకు ఆరు చొప్పున హామీలిచ్చారు. ముదిరాజ్, వడ్డెర, స్వర్ణకారులు, మేదర్లు, కుమ్మరి, కమ్మరి, కంచరులు, వడ్రంగి, శిల్పులు, దూదేకుల, మేర్, తాపీ పనివార్లు, గాండ్ల, ఉప్పర, పూసల, అరె కటిక, కురుబ, గవర, కళింగ కోమట్లు, వాల్మీకి (బోయ), పద్మశాలి, నాగవంశం, మజ్జాలు వంటి వారి కోసం ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. -
ఇప్పటివరకు బీసీలకు బాబు ఏం చేసాడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా..?
-
బీసీలకు చంద్రబాబు మోసాలు
-
బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు
-
బీసీ డిక్లరేషన్...బాబు దొంగ మిషన్
-
బీసీ డిక్లరేషన్ పేరిట బాబు, పవన్ మరో మోసం
సాక్షి, అమరావతి: బీసీ డిక్లరేషన్ అబద్ధాల వీరులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మరో మోసానికి తెర తీశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు–బ్యాక్ బోన్ క్లాసులనే వైఎస్సార్సీపీని కాపీ కొట్టారని ధ్వజమెత్తారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం ప్రకటన జారీ చేశారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్‌లో చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు 143 వాగ్దానాలిచ్చిన టీడీపీ అందులో ఒకటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్, బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు సహా పలు కల్లబొల్లి హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం ప్రజలు బాబు, పవన్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు ఎలాంటి విలువ లేదన్నారు. 40 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో బీసీల్ని బాగా వాడుకుని చివరికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెల కులాలుగా అవమానించే సంస్కృతి నుంచి బయటపడలేదన్నారు. రూ.2.55 లక్షల కోట్ల జమ గడచిన 57 నెలల పాలనలో తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు జమ చేసిందని మంత్రులు చెల్లుబోయిన, జోగి రమేష్ గుర్తు చేశారు. అందులో బీసీలకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.1.71 లక్షల కోట్ల మేర మేలు చేశామన్నారు. బాబు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల మేర మేలు చేస్తామంటున్నారని, ఈ లెక్కన పరిశీలిస్తే తమ ప్రభుత్వం చేసిన దానికంటే రూ.25 వేల కోట్లు తక్కువే చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. 2014లో బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తానని, చివరకు రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి బాబు దగా చేశారన్నారు. నిరుపేదలైన బీసీల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు పంపిణీపై కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. బీసీలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందన్న ఘనుడు బాబు అన్నారు. బీసీ అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఇస్తున్న చేయూత వంటి పథకం 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన బాబు ఏ ఒక్క రోజైనా అమలు చేశారా అని నిలదీశారు. -
BC Declaration: వెన్నుదన్నుగా నిలిచిన సీఎం జగన్
-
సాధికార 'బలగం'
సాక్షి, అమరావతి: బీసీ డిక్లరేషన్ పేరుతో ఆ వర్గాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అవహేళన చేస్తే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చెప్పిన దాని కంటే మిన్నగా మేలు చేస్తూ సామాజిక, రాజకీయ, విద్యా సాధికారతతో బలహీన వర్గాలను సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్ది సమున్నత గౌరవం కల్పిస్తున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు బీసీలను దారుణంగా వంచించిన చంద్రబాబు–పవన్ కళ్యాణ్ ద్వయం ఎన్నికల భయంతో మరోసారి బీసీ డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెర తీసిందని స్పష్టం చేస్తున్నారు. బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనివ్వడంతోపాటు రాజ్యాధికారంలో సింహభాగం వాటా కల్పించడం, అమ్మ ఒడి, విద్యాదీవెన లాంటి పథకాల ద్వారా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ సాధికారత సాధించేలా ముఖ్యమంత్రి జగన్ బాటలు వేశారని విశ్లేషిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డీబీటీ రూపంలో గత 58 నెలల్లో రూ.2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో బీసీ వర్గాలకే రూ.1,22,451.82 కోట్లు అందించడం ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. డీబీటీ, నాన్ డీబీటీతో కలిపి పేదలకు మొత్తం రూ.4,38,102.91 కోట్లను అందించగా అందులో బీసీ వర్గాలకే రూ.1,73,109.21 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టి అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చి పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహించడంతోపాటు విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా బీసీ బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93 శాతం మందికి విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుండగా వీరిలో బీసీ విద్యార్థులే అత్యధికంగా లబ్ధి పొందుతుండటం గమనార్హం. గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజుల బకాయిలు, మధ్యాహ్న భోజనం బిల్లులు కలిపి దాదాపు రూ.2,165 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించి పిల్లల చదువులకు అండగా నిలిచింది. అటు చదువుల వ్యయాన్ని భరిస్తూనే మరోవైపు భోజనం, వసతి ఖర్చుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటోంది. నాడు – నేడుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు ధీటుగా అందుతున్న ఇంగ్లీషు మీడియం చదువులతో బీసీ విద్యార్థులు గరిష్టంగా ప్రయోజనం పొందగలుగుతున్నారు. సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన ద్వారా విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే నైపుణ్యాలతో రాణించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజ్యాధికారంలో సమున్నత వాటా ► 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లను సాధించి 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలలో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గాన్ని 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు సీఎం జగన్ స్థానం కల్పించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం లాంటి కీలక శాఖలను బీసీలకే అప్పగించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించారు. 2014–19 మధ్య చంద్రబాబు తన మంత్రివర్గంలో కేవలం 8 పదవులు మాత్రమే బీసీలకు ఇవ్వడం గమనార్హం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు. టీడీపీ హయాంలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. ► సీఎం జగన్ శాసనమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 29 పదవులు (69 శాతం) ఇవ్వగా 2014–19 మధ్య చంద్రబాబు ఆ వర్గాలకు కేవలం 18 పదవులే (37 శాతం) ఇచ్చారు. స్థానిక సంస్థల్లో పెద్దపీట ► స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు టీడీపీ నేతలను పురిగొల్పడంతో 24 శాతానికి తగ్గిపోయింది. అయితే రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ దాన్ని ఆచరించి చూపి పదవులు ఇచ్చారు. ► జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే ఒక్క బీసీలకే 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులు (46 శాతం) కేటాయించారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే అందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. ► 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా తొమ్మిది చోట్ల మేయర్ పదవులు(64 శాతం) బీసీలకు ఇచ్చారు. ► 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ కైవశం చేసుకోగా చైర్పర్సన్ పదవులు బీసీలకు 44 (53 శాతం) ఇచ్చారు. చట్టం చేసి మరీ ‘నామినేటెడ్’ ► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వు చేస్తూ సీఎం జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకే ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకే (42 శాతం) ఇచ్చారు. బీసీలకు బాబు వెన్నుపోటు చంద్రబాబు వలస వెళ్లి దశాబ్దాలుగా తిష్ట వేసిన కుప్పంలో బీసీల జనాభానే అత్యధికం. తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో 1983 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు 1989లో కుప్పం వలస వెళ్లి రాజకీయంగా బీసీలకు అన్యాయం చేశారు. తండ్రి బాటలోనే నారా లోకేష్ కూడా నడుస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలే అధికం. 2019లో బీసీ నేతకు వెన్నుపోటు పొడిచి ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ దారుణ పరాజయం పాలయ్యారు. వెన్నుదన్నుగా నిలిచిన సీఎం జగన్ బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసి చూపించిన సీఎం జగన్ బలహీన వర్గాలను వెన్నుముఖ వర్గాలుగా తీర్చిదిద్దారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై టీడీపీ కోర్టుకెక్కితే అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన సీఎం జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌తోపాటు డైరెక్టరేట్, ఆర్థిక సహకార సంస్థను కూడా ఏర్పాటు చేశారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు నియమించి బీసీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించి సీఎం జగన్ చరిత్ర సృష్టించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. కుల గణన కోసం బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో సీఎం జగన్ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. కుల గణనపై చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేస్తే సీఎం జగన్ చిత్తశుద్ధితో కుల గణన చేపట్టడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ అడగకుండానే ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని తెచ్చి బీమా వర్తింప చేయడంతో గీత కార్మికులకు నిజమైన భరోసా లభించింది. చేనేత కార్మికుల పెన్షన్ రూ.వెయ్యి చేస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు లబ్ధిదారులను కుదించి మోసం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న నేస్తంతో ఏటా రూ.24 వేలు సాయంతోపాటు పెన్షన్ వయో పరిమితిని కుదించి అర్హులందరికీ రూ.3 వేలు పెన్షన్ అందిస్తూ చేనేత కుటుంబాలను ఆదుకుంటున్నారు. -
అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారు: సిద్ధరామయ్య
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి డబ్బుతో ప్రజలను కొనేందుకు చూస్తున్నారు. కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి ఓడించడం ఖాయం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను సాగనంపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ కామారెడ్డి సభలో సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ-డీలో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేరుస్తామని, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఐదేళ్లలో బీసీల అభ్యున్నతి కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తాం. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం. స్థానిక సంస్థల్లో 23 శాతం, రిజర్వేషన్‌ను 42 శాతం పెంచుతాం. 50 ఏళ్లు దాటిన నేత కార్మికులకు పెన్షన్ అందిస్తాం’’ అని సిద్ధరామయ్య వెల్లడించారు. చదవండి: బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత కేసీఆర్‌కు రేవంత్ సవాల్ ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుపై ఈడీ, సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ రేవంత్‌రెడ్డి..కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి ప్రజలు సిద్ధం అయ్యారు. సచివాలయం ముందు లింబయ్య అనే కామారెడ్డి రైతు ట్రాన్స్ ఫార్మర్ కు ఉరేసుకొని చనిపోయారు. కేసీఆర్ కొనాపూర్ బిడ్డ అంటున్నారు.. మరి ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు ఆదుకొలేదు. కామారెడ్డి బంగారు తునక అంటున్నారు.. గజ్వేల్ నుంచి ఎందుకు వస్తున్నారు.అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మకు బంగారు గాజులు అంటే నమ్మడానికి కామారెడ్డి ప్రజలు అమాయకులు కాదు’’ అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘కుట్రతో కామారెడ్డి భూముల కోసం ఇక్కడికి వస్తున్నారు కేసీఆర్. మాస్టర్ ప్లాన్ రద్దు అంటున్నారు.. మీ ప్రభుత్వమే రద్దు అయ్యింది. మీ కుటుంబం కోసమేనా 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది. కేసీఆర్‌ను ఓడించేందుకే, పార్టీ ఆదేశం మేరకే కామారెడ్డికి వచ్చాను. బూచోడు వస్తున్నాడు. మీ భూములు లాక్కుంటారు.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కనిపించడు వినిపించడు.. కామారెడ్డి నియోజక వర్గంలో 3 లక్షల 60 వేల ఎకరాలకు వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ద్వారా గోదావరి జలాలు అందాలంటే కాంగ్రెస్ గెలవాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
బీసీ కోటాతో పాగా..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక వ్యవస్థలో సింహభాగం వాటా ఉన్న బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ కులాల వారిని ఆకట్టుకునేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సామాజిక వర్గాల వారీగా డిక్లరే షన్లు ప్రకటించి, మేనిఫెస్టోలో ఆయా డిక్లరేషన్ల లోని హామీలను పొందుపరిచే ఆలోచనలో ఉన్న హస్తం పార్టీ.. బీసీల కోసం ఏం చేయాలన్న దానిపై ముమ్మర కసరత్తు జరుపుతోంది. కొన్ని ప్రతిపాద నలపై పార్టీలో ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం వచ్చిందని, ఈ మేరకు బీసీ డిక్లరేషన్ ఎజెండా ఖరారైందని సమాచారం. ఇందులో భాగంగా జనా భా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. కులగణన కోసం జాతీయ స్థాయిలో పార్టీ మద్దతు లభించినందున, ఆయా కులాల జనాభా లెక్కల మేరకు వారికి రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పాలని నిర్ణయించింది. టికెట్ల కేటాయింపులో గతానికి భిన్నంగా.. కనీసం 34 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా, 50 వరకు టికెట్లు ఇస్తామని భరోసా ఇవ్వనుంది. లోక్‌సభలో కనీసం రెండు అసెంబ్లీలు వారికే.. బీసీ నేతలకు టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. 2014 ఎన్నికల్లో 31 స్థానాలను కేటాయించగా, 2018లో పొత్తుల కారణంగా అది 25కు తగ్గింది. అదే సమయంలో 2018 ఎన్నికల్లో ఓసీలకు 41, ఎస్సీలకు 17, ఎస్టీలకు 10, మైనార్టీ లకు 7 స్థానాలను కేటాయించింది. అయితే ఈ ఎన్నికల్లో బీసీ నేతలు కొందరికి ఆఖరి క్షణంలో సీట్లు కేటాయించడంతో సానుకూల ఫలితాలను రాబట్టడంలో విఫలమయ్యింది. కాగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రతి లోక్‌సభ స్థానంలో కనీసం రెండు సీట్లు బీసీ నేతలకు ఇస్తామనే హామీని బీసీ డిక్లరేషన్‌లో చేర్చనుంది. అయితే ఈ 34 స్థానాలకే పరిమితం కాదని, అవకాశాలు, సమీకరణలను బట్టి ఆ సంఖ్య 50 వరకు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల మాదిరి ఆఖరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలున్నంత ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని వారు స్పష్టం చేస్తుండటం గమనార్హం. జీవితాలకు స్థిరత్వం కల్పించే దిశలో.. తాము అధికారంలోకి వస్తే బీసీ కులాలకు ఆర్థికంగా సాయం చేస్తామనే హామీని కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే ఏదో కొంత నగదు ఇచ్చి చేతులు దులుపుకోకుండా.. బీసీ వర్గాలకు చెందిన వారు, ముఖ్యంగా కుల వృత్తుల వారు వారి వారి జీవితాల్లో స్థిరపడి ఆత్మగౌరవంతో బతికే విధంగా చేయూతనిచ్చే పథకాలకు రూపకల్పన చేసి, బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించనుంది. ఇక బీసీల్లో బాగా వెనుకబడిన (ఎంబీసీ) కులాలు, సంచార జాతులను గుర్తించి వారికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీసీలకు పార్టీ పదవులు, సీట్ల కేటాయింపులో తగినంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అధికారం దక్కుతుందని పలుమార్లు రుజువయ్యిందని.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కూడా ఆ సూత్రాన్ని అనుసరించేనన్న అభిప్రాయానికి కాంగ్రెస్ నేతలు వచ్చారు. మా పార్టీకి ఆ స్పృహ ఉంది.. బలహీన వర్గాలకు న్యాయం చేస్తామంటూ ఎన్నికలకు ముందు ప్రకటనలు చేయడమే కాదు. వాటి అమలు కోసం చర్యలు తీసుకుంటాం. బీసీల అభివృద్ధికి మేం కట్టుబడి ఉంటాం. మేం అధికారంలోకి వచ్చాక వారికి ఏ ఇబ్బంది వచ్చినా జవాబుదారీతనంతో వ్యవహరిస్తాం. లక్ష రూపాయలు ఇచ్చి కొట్లాడుకోండని చెప్పం. వారు ఆత్మగౌరవంతో బతికే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడింది సామాజిక కోణంలోననే స్పృహ మా పార్టీకి ఉంది. – పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ బీసీ ముఖ్య నేత, మాజీ ఎంపీ -
ఇందుకే బీసీలు వైఎస్ జగన్ వెంట ఉంటారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు బీసీలపై ఎక్కడలేని ప్రేమ ఒలక బోస్తున్నాయి. 2019 ఎన్ని కల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు పొందడంలో బీసీలు ప్రముఖ పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా వారికి వందలాది నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వారి సంక్షేమానికి అత్యధికంగా నిధులు ఇచ్చారు. దీంతో బీసీలు శాశ్వతంగా జగన్ వెంట నడవడానికి సిద్ధమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీలను వైసీపీ నుంచి వేరు చేసి వారి మద్దతు పొందేందుకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన లాంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్టీఆర్ కాలంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన మంచిని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవడం విడ్డూరం. 2014లో బీసీ డిక్లరేషన్ విడుదల చేసి అధికారం లోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆ డిక్లరేషన్‌లోని అంశాలను పట్టించుకోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బీసీలు మద్దతు పలికారు. మరి ఇప్పుడు టీడీపీకి వారు ఓట్లెలా వేస్తారు? బీజేపీ కూడా ఇటీవల ఏపీలో బీసీలతో సామాజిక చైతన్య సభ నిర్వహించి బీసీలకు పలు హామీలు ఇచ్చింది. చట్టసభలలో తమకు రిజర్వేషన్లు కావాలనీ, దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కించాలనీ అనేక దశాబ్దాలుగా బీసీలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. స్వయంగా బీసీ అయిన ప్రధాన మంత్రి ఈ డిమాండ్లను పట్టించు కోవడం లేదు. ఏ ముఖంతో రాష్ట్ర బీజేపీ నాయకులు బీసీలను ఓట్లడుగుతారు? తనకు కులం అంటగట్ట వద్దని అంటూనే కాపుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. కాపులను బీసీలలో చేర్చే అంశంపై బీసీలు, కాపుల మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిణామాలతో బీసీలు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 83 వేల కోట్ల రూపాయలు నేరుగా బీసీల ఖాతాలలో వేయడం విశేషం. రాష్ట్రంలో ఉన్న 17 మంత్రి పదవులలో 11 మంత్రి పదవులు బీసీలకు కేటాయించారు. అదే విధంగా 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి 56 చైర్మన్లను కేబినెట్ హోదాతో నియమించడం, ఆ 56 కార్పొరేషన్లలో 732 మంది బీసీలను డైరెక్టర్లుగా నియమించడం తెలిసిందే. జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్లో 50 శాతం పైగా బీసీలకు కేటాయించడమూ నిజమే కదా. బీసీ ఉద్యమ నాయకులు ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గొంతును పార్లమెంట్లో బలంగా వినిపించే అవకాశాన్ని సృస్టించారు. ఇంత చేసిన జగన్ వెంట బీసీలు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. (క్లిక్ చేయండి: ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే!) - కైలసాని శివప్రసాద్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బీసీల అభివృద్ధి విధాన ప్రకటన చేయాలి: కృష్ణయ్య
కాచిగూడ (హైదరాబాద్): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీసీల అభివృద్ధి కోసం బీసీ డిక్లరేషన్ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శుక్రవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి పట్ల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి పార్టీ విధాన ప్రకటన చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బీసీ వ్యతిరేక ప్రభుత్వమని పేరుందని, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య విన్నవించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు, లాల్‌కృష్ణ, కోల జనార్దన్, రవీందర్, చంద్రశేఖర్, జయంతిగౌడ్, వంశీకృష, విజయ, రజిత, మహేశ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు భరోసా..
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్.. అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి తన ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే వారి అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు ఏకంగా రూ.15,061.64 కోట్లు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో బీసీలకు కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో బీసీలకు ఏటా రూ.15,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75,000 కోట్లు బీసీ ఉప ప్రణాళికకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు ప్రస్తుత తొలి బడ్జెట్లోనే బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061.64 కోట్లు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం కోసం వినియోగించుకుంది తప్ప వారి అభ్యున్నతి, సంక్షేమం గురించి పట్టించుకోలేదు. కాగా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2019–20 వార్షిక బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు సమగ్రాభివృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. ఇందుకోసం మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా రూ.15,061.64 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. బీసీ ఉప ప్రణాళికలో కేటాయించిన నిధులతో బీసీ వర్గాలు వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. ఈ నిధులతో వెనుకబడిన వర్గాల నివాస ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. బీసీ కమిషన్‌ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు పునర్ నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని బడ్జెట్లో స్పష్టం చేసింది. ప్రమాదవశాత్తు మరణించిన బీసీ కులాలకు చెందిన వారికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షల సాయం అందించనుంది. నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు మంచి రోజులు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10,000 వరకు నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఆదాయ మద్ధతును ఇవ్వాలని నిర్ణయించినట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. ఇందు వల్ల వారి యంత్రాలను ఆధునికీకరించుకుని, అధిక ఆదాయం ఆర్జించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల వ్యయంతో సుమారు 23,000 మంది నాయీ బ్రాహ్మణులకు, 1,92,000 మంది రజకులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. దర్జీలకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయల చొప్పున ఆదాయ మద్దతును ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 29 బీసీ కులాల కార్పొరేషన్లకు రూ.3,964.05 కోట్లు ప్రస్తుతం అమల్లో ఉన్న బీసీ కులాలకు చెందిన 29 కార్పొరేషన్లకు ఈ బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికలో భాగంగా రూ.3964.05 కోట్లు కేటాయించారు. ఈ 29 కులాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వీరి జీవనోపాధి కోసం వివిధ పథకాల కింద ఆర్థిక సాయం చేయనున్నారు. సబ్సిడీలతో పాటు ఆర్థిక సాయం అందించనున్నారు. చేనేత కుటుంబాలకు చేయూత చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేశారు. ప్రతి చేనేతకారుడి కుటుంబానికి రూ.24 వేల చొప్పున వైఎస్సార్ పేరుతో ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సాయం చేనేత కార్మికులు తమ పరికరాలను ఆధునికీకరించుకుని మర మగ్గాల ఉత్పత్తులతో పోటీపడేందుకు ఉపయోగపడనుంది. చేనేత కార్మికులు గౌరవప్రదమైన ఆదాయం ఆర్జించడానికి అవసరమైన మార్కెటింగ్ సహాయాన్ని ఇతర సబ్సిడీలను కూడా ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. వధువులకు వైఎస్సార్ పెళ్లి కానుక బీసీ గర్జన, మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తొలి బడ్జెట్లోనే బీసీ వర్గాలకు పెళ్లి కానుకను తీసుకువచ్చారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద రూ.300 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద బీసీ కులాలకు చెందిన వధువులకు రూ. 50,000 చొప్పున వివాహ కానుక ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరంలో 75 వేల మంది బీసీ వధువులు ప్రయోజనం పొందనున్నారు. కాగా.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు వచ్చే సంవత్సరం నుంచి వైఎస్సార్ చేయూత కింద ప్రయోజనాలు పొందనున్నారు. వీరికి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ.75 వేలు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, ఇతర ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ ఏడాదిలోనే లబ్ధిదారులను గుర్తించేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో సంబంధిత కార్పొరేషన్ల ద్వారా అర్హులందరికీ దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. బీసీ విద్యార్థులకు అన్ని విధాల అండ రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్లో రూ.2,218.14 కోట్లు కేటాయించారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు కేటాయించ లేదు. చదువుకునే వయసు పిల్లలందరూ విద్యా సంస్థల్లోనే ఉండాలనే లక్ష్యంతో జగనన్న అమ్మ ఒడి పథకం కింద బీసీ వర్గాల వారికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఈ పథకం కింద బీసీ వర్గాలకు చెందిన పిల్లలను బడికి పంపిస్తే వారి తల్లులకు ఏటా రూ.15,000 ఇచ్చేందుకు బీసీ ఉప ప్రణాళికలో రూ.1294.73 కోట్లు కేటాయించారు. ఆటో డ్రైవర్లకు రూ.400 కోట్లు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు జిల్లాల్లో ఆటో డ్రైవర్లు ఆయన్ను కలిసి వారి ఇబ్బందులను, ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సొంతంగా ఆటో కలిగి నడుపుకుంటున్న డ్రైవర్లందరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే తన తొలి బడ్జెట్లోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అదించేందుకు ఏకంగా రూ.400 కోట్లు కేటాయించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బడ్జెట్లో కేటాయింపులు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్‌తో ప్రతి కులానికీ భరోసా మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా వెనుకబడిన తరగతుల్లోని కులాల కోసం ప్రభుత్వం 139 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తుందని బడ్జెట్లో ప్రకటించారు. ఈ కార్పొరేషన్లు వివిధ బీసీ ఉప–సామాజిక వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధికి సహాయం అందిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లను సంస్కరించాక వైఎస్సార్ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజకీయ అభ్యున్నతి కోసం దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర నామినేటెడ్ పోస్టుల విషయంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం తీసుకురావని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వం నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో ఈ వర్గాల ఆర్థిక ఔన్నత్యం కోసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని బడ్జెట్ స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో బీసీల సంక్షేమం కోసం పేర్కొన్న భాగం. ఈ హామీలన్నింటినీ నెరవేర్చేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించారు. ► 7.82 లక్షల బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,218.14 కోట్లు ► ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి అందించనున్న సాయం రూ.24,000 ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు -
బీసీ డిక్లరేషన్‌పై చిత్తశుద్ధిని చాటుకున్నారు
-
మీ విధానం ఆదర్శనీయం
సాక్షి, అమరావతి: ‘మీ విధానాలు, ఆలోచనలు ఆదర్శనీయం... చరిత్రాత్మకం... విప్లవాత్మకం...’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు పలికారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేయాలని భావిస్తున్నట్లు శనివారం వైఎస్సార్ ఎల్పీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మాట్లాడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీ ఆలోచనలు విప్లవాత్మకం: బొత్స తొలుత పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కొంత ఉద్వేగానికి లోనయ్యారు. మీ ఆలోచనా విధానాలు విప్లవాత్మకమైనవని గద్గద స్వరంతో పేర్కొన్నారు. వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన తాను మీ హయాంలో ఎమ్మెల్యేగా ఉండటం ఎంతో సంతృప్తిని ఇస్తోందంటూ వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పరిపాలన ప్రజలకు అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. పార్టీకి ఇంత భారీ విజయం లభిస్తుందని తాను ఊహించలేదని అయితే మీరు మాత్రం ఈ విజయాన్ని ఊహించారని వ్యక్తిగత చర్చల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వారికి ప్రాధాన్యం కల్పించండి: కరణం ధర్మశ్రీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే వారికి తదుపరి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించేలా చూడాలని కరణం ధర్మశ్రీ కోరారు. ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా నాడు చంద్రబాబు చేసిన దుర్మార్గాలపై విచారణ జరిపించి అవినీతిని ప్రజల దృష్టికి తేవాలని సూచించామన్నారు. అయితే వైఎస్సార్ పెద్దమనసుతో ‘ప్రజలే చంద్రబాబును శిక్షించారు పోనీలే.. ’ అన్నారని చెప్పారు. తరువాత దాని పర్యవసానం ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సర్కారు దుర్మార్గాలపై ఒక కమిషన్ వేసి దర్యాప్తు జరిపి శిక్షించాలని కోరారు. పదవులొద్దు.. మీరు సీఎంగా ఉంటే చాలు: రాచమల్లు తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన అభిమతం అని రాచమల్లు ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి కావాలని ఏనాడూ లేదని, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే చాలని చెప్పారు. పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ వారం రోజులుగా సాగుతున్న నూతన పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. మీరు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే పార్టీ విజయం కోసం కృషి చేసిన క్షేత్ర స్థాయి కార్యకర్తలపై దృష్టి పెట్టాలని వై.వెంకటరామిరెడ్డి కోరారు. మంత్రులైన వారు ఎమ్మెల్యేలను పట్టించుకునేలా చూడాలని వై.సాయిప్రసాద్‌రెడ్డి కోరారు. కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ తన భర్తను హత్య చేసినపుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ధైర్యం తమకు ఎంతో భరోసా ఇచ్చిందని, ఆయన విజ్ఞప్తి ప్రకారమే తనను ప్రత్తికొండ ప్రజలు భారీ ఆధిక్యతతో గెలిపించారన్నారు. జీవితాంతం జగన్ వెంటే ఉంటానన్నారు. కొలుసు పార్థసారథి మాట్లాడుతూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని వైఎస్ జగన్ చెప్పిన మాట ఆ వర్గాల్లో ఎంతో విశ్వాసాన్ని పాదుగొల్పిందన్నారు. వారం రోజులుగా సాగుతున్న పాలన రాష్ట్ర ప్రజల్లోకి మంచి సంకేతాలు పంపిందన్నారు. బలహీనవర్గాల పట్ల జగన్ చిత్తశుద్ధి ఆయన్ను అంబేడ్కర్, పూలే సరసన నిలబెడుతుందని కొనియాడారు. రివర్స్ టెండరింగ్ విధానంపై విద్యావంతుల్లో సానుకూలమైన చర్చ జరుగుతోందన్నారు. జగన్ కృషి తామందరినీ గెలిపించినందున యావత్ శాసనసభాపక్షం ఒక తీర్మానం ఆమోదించాలని కోరారు. మాటకు కట్టుబడ్డారు: ధర్మాన మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. మీ నిర్ణయాలను పూర్తిగా సమర్థిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేసేవారిని ఆదరించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. కొత్త విధానాలు, సంస్కరణలు తలపెట్టినపుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సి ఉంటుందని అయితే ప్రస్తుతం పార్టీ తరఫున వాణిని వినిపించే అధికార ప్రతినిధులు అంత చక్కగా వాదనలు వినిపించలేక పోతున్నారని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల విషయంలో ప్రక్షాళన అవసరమని, గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా కక్షపూరిత వాతావరణం లేకుండా మార్పులు తేవాలని సూచించారు. అధికారం నుంచి నిష్క్రమిస్తూ రూ.30 వేల కోట్లను తగలేసిన పెద్దమనిషి దుర్మార్గంగా వ్యవహరించారని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. 70 శాతం ఓట్లు లక్ష్యం కావాలి: కోటంరెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ దాదాపు 50 శాతం ఓట్లను సాధించడం ఓ చరిత్రని, ఈ స్థాయిలో ప్రధాని మోదీకి కూడా ఓట్లు రాలేదని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 70 శాతం ఓట్లను సాధించడం లక్ష్యం కావాలన్నారు. తనకు వైఎస్ జగన్ 2010లో పరిచయం అయినపుడే ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన నాయకత్వం లభించబోతోందని అంచనా వేశానని, నేడు అదే నిజమైందన్నారు. ముఖ్యమంత్రి అంటే జగన్‌లా ఉండాలి అనే విధంగా రాష్ట్రాన్ని పాలిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఈ సమావేశంలో హఫీజ్‌ఖాన్, ఆదిమూలపు సురేష్, కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, కొటారు అబ్బయ్య చౌదరి, విడదల రజని తదితరులు మాట్లాడారు. -
‘వికారి’లో సంక్షేమ షికారు
సాక్షి నెట్వర్క్, శ్రీకాకుళం: వికారిలో సంక్షేమం షికారు చేయనుంది. వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్‌తో నూతన ఏడాదిలో అంతా మంచే జరుగుతుందని బడుగులు ఆశ పడుతున్నారు. ఆర్థికంగా చేయూతనిస్తూ, గౌరవాన్ని పెంచుతూ, హోదాను మరో ఎత్తుకు తీసుకెళ్తూ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు పెడతామని చెప్పడంతో పాటు, నామినేటెడ్ పోస్టుల్లో తగు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పడం, దేవాలయాల్లోని బోర్డుల్లో ఇప్పటివరకు చోటు లేని వారికి సముచిత స్థానమిస్తామని చెప్పడం వంటివి సామాన్యులకు చేరువయ్యాయి. నూతన ఏడాదిలో మంచి జరగాలంటే ఈ డిక్లరేషన్ కచ్చితంగా అమలు జరిగి తీరాలని సిక్కోలు వాసులు కోరుతున్నారు. ఎనభై నాలుగు శాతం మందికి ప్రయోజనం జిల్లాలో బీసీల కులాల వారు 84 శాతం మంది ఉన్నారు. ప్రస్తుత జనాభాలో బీసీలు దాదాపు పాతిక లక్షల మందికిపైనే ఉన్నారు. బీసీ కులాల్లో ఎక్కువగా తూర్పుకాపు, కళింగ, వెలమ కులస్తులు ఉన్నారు. తర్వాత మత్స్యకార, యాదవ కులస్తులు ఉన్నారు. జిల్లాను దశాబ్ధాలుగా టీడీపీ ఏలుతోంది. కానీ ఈ కులాలను ఓట్లు వేయించుకోవడానికి తప్ప ఇంకెందులోనూ పట్టించుకోలేదు. అన్ని కులాలకు ఎదిగే అవకాశం ఉన్నా, ఆ దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ డిక్లరేషన్‌తో అన్ని కులాల్లో ఉన్న వారికి ప్రాణమొచ్చింది. తమకోసం ఓ నాయకుడు పని చేస్తున్నాడనే ధైర్యమిచ్చింది. బీసీ సబ్‌ప్లాన్ అమలైతే ఇక ఏ కులంలోనూ వెనుకబాటు అన్నదే ఉండదు. ఎప్పుడూ ఓటు బ్యాంకుగానేనా..? చంద్రబాబు బీసీలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూశారన్నది జగమెరిగిన సత్యం. అందుకు సిక్కోలు జిల్లా కూడా ఓ సాక్ష్యం. ఎన్నికలు వస్తున్నాయంటే గానీ బాబుకు కులాల సంక్షేమం గుర్తురాదు. బీసీలకు శాశ్వత ప్రయోజనం కలిగించే ఏ ఒక్క పనినీ ఆయన చేయలేదన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. గడిచిన ఎన్నికల్లో బీసీ ఓట్లకు గాలం వేసేందుకు వందలాదిగా హామీలు కురిపించారు. అధికారం దక్కాక మాటలన్నీ మర్చిపోయారు. అవి గుర్తు చేసినందుకే మత్స్యకారులపై ఆగ్రహోదగ్రులయ్యారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, ఆ హామీని గుర్తు చేసినందుకే చంద్రబాబు తిట్టిన విషయాన్ని మత్స్యకారులెవ్వరూ అంత తొందరగా మర్చిపోలేరు. మభ్య పెట్టడమే పని.. జనాలు చూస్తున్నట్లు ఓ పని మొదలుపెట్టడం, జనం కనిపెట్టడం లేదని తెలిసి ఆ పనిని ఆపెయ్యడం. ఇదీ టీడీపీ తీరు. జనాలు సైతం మభ్యపడేంతలా ఆయన ప్రచార తీరు ఉంటుంది. బీసీ సబ్‌ప్లాన్ విషయంలోనూ ఆయన చేసినది ఇదే. రాష్ట్ర బడ్జెట్లో 25 శాతం బీసీలకు కేటాయిస్తామని ఎప్పుడో హామీనిచ్చారు. కేంద్ర నిధుల్లోనూ పాతిక శాతం బీసీ సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. కానీ ఆ హామీలు నిలబెట్టుకోలేదు. జిల్లాలో ఎంతో మంది చేతివృత్తులు, కుల వృత్తుల వారు ఉన్నారు. నాలు గేళ్ల కాలంలో వారి సాధకబాధకాలు పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నాయనగా.. ఆదరణ పేరుతో మళ్లీ దగా చేసేందుకు సిద్ధపడ్డారు. నాలుగేళ్ల నిర్లక్ష్యాన్ని మర్చిపోయేందుకు తాయిలాలు ఇచ్చినట్లు పరికరాలు అందించారు. అందులోనూ జన్మభూమి కమిటీ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారు. బీసీలకు ఎనలేని మేలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏటా రూ.15వేల కోట్ల వంతున ఐదేళ్లకు రూ.75 వేల కోట్లు ఇస్తామని జగన్ ప్రకటించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు తొలి శాసనసభలోనే చట్టభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకారం మన జిల్లాకు ఏటా వెయ్యికోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిధులు గానీ వస్తే జిల్లాలో సామాన్యుల బతుకులన్నీ బాగుపడతాయి. అర్హత ఉంటే చాలు ఎలాంటి వివక్ష చూపకుండా రుణం అందుతుంది. నిధులు ఆ మేరకు ఉంటే బీసీ ప్రాంతాల రూపురేఖలే మారిపోతాయి. జనానికి ప్రయోజనమిది.. ♦ చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.10 వేల వరకు రుణం. ♦ నాయీ బ్రాహ్మణులకు షాపునకు ఏటా రూ.10 వేల సాయం. ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం. బోర్డు మెంబర్లలో వారికి చోటు. ♦ సంచార జాతుల వారికి స్థిర నివాసం ♦ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10వేలు భృతి. ప్రమాదానికి గురై చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా. కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్. డీజిల్ సబ్సిడీ. ♦ యాదవులకు గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6వేలు నష్ట పరిహారం. తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కు సన్నిధి గొల్లలకే ఇచ్చి, వంశపారంపర్య హక్కులు కల్పించడం. ♦ ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగం పనులు బీసీలకే. నామినేటెడ్ పదవుల్లోనూ వాటా. ♦ అన్ని కులాలకు కార్పొరేషన్లు. ♦ 45–60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు రూ.75వేల సాయం. ♦ మూడో వంతు నిధులు బీసీల అభివృద్ధికే. ♦ వైఎస్సార్ బీమా సాయం రూ.7లక్షలు యాదవుల కష్టాల తీరుతాయి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే యాదవుల సంక్షేమానికి పాటుపడతామని జగన్ ప్రకటించారు. యాదవులు అన్నివిధాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు, ప్రమాదాలు వల్ల గొర్రెలు, మేకలు చనిపోతే ఒక దానికి రూ.5 వేలు, ప్రమాదవశాత్తు యాదవులు చనిపోతే రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జగన్ ప్రకటించడం సంతోషంగా ఉంది. – పిన్నింటి సింహాద్రి, యాదవ కులస్తుడు, మురపాక గ్రామం, లావేరు మండలం. జగన్ ప్రకటన చాలా బాగుంది జగనన్న సీఎం అయితే యాదవ కుటుంబా లకు బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై రుణాలు, అర్హులైన వారికి పార్టీలతో సంబం ధం లేకుండా పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం యాదవులు వృత్తి గిట్టుబా టు కాక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. యాదవుల కోసం జగన్ చేసిన ప్రకటన చాలా బాగుంది. – కోరాడ వల్లప్పడు, యాదవ కులస్తుడు, తామాడ గ్రామం, లావేరు మండలం మేలు జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల పశువులు చనిపో యి యాదవ కుటుంబాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. వారిని ఎవరూ ఆదుకోవడం లేదు. జగన్ మాత్రమే మా గురించి ఆలోచించారు. జగన్ వల్ల యాదవులకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. – పి.బాలకృష్ణ, యాదవ సంఘం నాయకుడు, ఎనభై నాలుగు శాతం మందికి ప్రయోజనం బీసీ డిక్లరేషన్‌తో ఉపాధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో ఉద్యోగ అవకాశాలు పెరిగి యువతకు ఉపాధి దొరుకుతుం ది. అలాగే రుణాలు కూడా సులువుగా పొందవచ్చు. చట్టసభల్లో బీసీలకు సముచిత స్థానం దొరుకుతుంది. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జగన్‌కు ఓ అవకాశం ఇవ్వాలి. - కలిపిల్లి సింహాచలం, వీరఘట్టం మంగళసూత్రాల నిర్ణయం హర్షణీయం విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సీటు కేటా యిస్తామనడం, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, తిరుపతి తిరుమల దేవస్థానానికి మంగళసూత్రాలు విశ్వబ్రాహ్మణులు చేసేలా చట్టం తీసుకువస్తాననడం సంతోషం. ఇవి అమలైతే చాలా బాగుంటుంది. – దేవరకొండ షణ్ముఖాచారి, పలాస నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, పలాస మండలం -
బీసీలకు బూస్ట్.. నామినేటెడ్ పోస్ట్
సాక్షి, సంతమాగులూరు: తెలుగుదేశం పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయి. తమ సమస్యలపై బీసీలు ఎన్ని పోరాటాలు చేసినా వారి గోడు వినిపించుకోలేదు. ఈ క్రమంలో జగన్మోహనరెడ్డి బీసీ గర్జనలో తమ కోసం ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం ఇంతలా ఆలోచిస్తున్న జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు కృత నిశ్చయంతో ఉన్నారు. బీసీ డిక్లరేషన్‌లో జగన్ హామీలు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని 31 బీసీ కులాలు కేంద్రం పరిధిలోని ఓబీసీ జాబితాలో చేర్చడానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం కొలువులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించడంతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ వస్తే అన్ని వర్గాలకు ప్రయోజనం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుంది. జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ వల్ల నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అందుబాటులోకి వస్తుంది. నవరత్నాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది. ఎస్.హేమంత్, మేదరమెట్ల. రాజకీయ ఎదుగుదలకు అవకాశం సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగిన గుర్తింపు లభించడం లేదు. నామినేటెడ్ పోస్టుల్లో సరైన పదవులు అందకుండాపోతున్నాయి. జగనన్న ముఖ్యమంత్రి అయితే నామినేటేడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం మంచి పిరమాణం. మేము కూడా రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించారు. జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడం మన అందరి బాధ్యత. కొడవళ్ళ హరిబాబు, తూర్పు కొప్పెరపాడు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిండం వల్ల ఆయా వర్గాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందని నమ్ముతున్నాం. బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 50 శాతం చట్టసభల్లో అవకాశ మంచి పరిణామం. జగనన్న వస్తేనే బీసీ, ఎస్టీ,ఎస్టీ మైనారిటీలకు మంచి ఫలితాలు అందుతాయి. రామాంజనేయులు, అంబడిపూడి వైఎస్సార్ సీపీతో బీసీలకు న్యాయం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. జగన్ ప్రకటించిన బీసీ సంక్షేమం పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో పాటుగా బీసీ సంక్షేమం కోసం ఏటా రూ.25 వేల కోట్లు మంజూరు చేస్తాననడం ఎంతో ఆనందంగా ఉంది. బీసీలు అందరూ వైఎస్సార్ సీపీ వెంటే ఉంటారు. ఎం.రామకృష్ణ, మేదరమెట్ల -
కుమ్మరి కుండలో వరాల ధార
సాక్షి, గుంటూరు : సమాజంలో మనిషి అవసరాలను తెలుసుకొంటూ, వారికి కావాల్సిన వస్తువులకు రూపం ఇచ్చేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా కుమ్మర్ల కుల వృత్తిలో ఆటుపోట్లు తప్పడం లేదు. మట్టి నుంచి తమ చేతుల్లో ప్రాణంపోసుకున్న వస్తువులను కాల్చేందుకు అవసరమైన బొగ్గు వరకు అన్నింటి ధరలు పెరగడంతో వచ్చే ఆదాయం సరిపోక, వృత్తిని నమ్ముకోలేక.. ఇతర రంగాలకు మళ్లలేక సతమతమవుతున్నారు ఒకప్పుడు మట్టి కుండలకు విపరీతమైన ఆదరణ ఉండేది. రానురానూ వాటికి ఆదరణ తగ్గిపోతోంది. కుండను తయారు చేయటానికి గంట సమయమే పట్టినా, వాటిని వేడిచేసి ఆరబెట్టడం ఒక పెద్ద ప్రక్రియ. ఇప్పుడు దీపావళి, కార్తీకమాసంలో మినహా ప్రమిదలకు డిమాండ్ ఉండటంలేదు. మార్కెట్లో కుండలు అమ్ముకొనే పరిస్థితి లేకపోవటంతో వచ్చిన ధరకు టోకు వ్యాపారులకు ఇచ్చేస్తున్నారు. కొందరు గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. రోజుకు రూ.300లకు మించి ఆదాయం రావడంలేదని వాపోతున్నారు. వైఎస్ జగన్ హామీతో చిగురించిన ఆశలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో కుమ్మర్లకు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటితో కుమ్మర్ల జీవితాల్లో ఆశలు చిగురించాయి. కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నామినేటెడ్ పోస్టులతోపాటు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఐదు సంవత్సరాలలో రూ.75 వేల లబ్ధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిపై జిల్లాలోని 33 వేల కుమ్మర్ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హామీలు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కుమ్మర్లను ఓటు బ్యాంకుగా వాడుకొని వారికి ఇచ్చిన హామీలను విస్మరించింది. శాలివాహన కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తామని, కుమ్మర్లు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించి, సొంతగా విక్రయాలు జరుపుకొనేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, వృత్తి దార్లకు గుర్తింపు కార్డులు, విద్యార్థులకు రుణాలు, విదేశాల్లో చదువుకునే అవకాశం.. ఇలా ఎన్నో హామీలు గుప్పించింది. అయితే ఏ ఒక్కటీ అమలుకు నోచలేదు. ఆదరణ పథకం కింద కూడా ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదని కుమ్మర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు : 92,000 కుమ్మర్ల కుటుంబాలు : 32,500 కుమ్మర్ల జనాభా : 1,28,000 వృత్తి మీద ఆధారపడి జీవించేవారు : 9,000 వృత్తిపై రోజు వారి ఆదాయం : రూ.300 కుండలకు ఆదరణ లేదు గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కుండలకు ఆదరణ కూడా లేదు. అన్ని విధాలుగా రేట్లు పెరిగిపోయాయి. గతంలో రైతుల పొలాల్లో ఉచితంగానే మట్టి తవ్వుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రూ.3 వేలు ఇవ్వాల్సి వస్తోంది. నమ్ముకొన్న వృత్తిని వదులుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కండలు తయారు చేయాల్సి వస్తోంది. – కొల్లిపాక అంజయ్య, మంగళగిరిపాడు సాహసోపేత నిర్ణయం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకొంది సాహసోపేత నిర్ణయం. బీసీ డిక్లరేషన్ వల్ల ఉన్నతంగా చదువుకోవాలనే విద్యార్థులకు కార్పొరేషన్ నుంచి సాయం అందటమే కాకుండా విదేశాల్లో విద్యనభ్యసించే వారికి బ్యాంకుల నుంచి రుణాలు పొందటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం బీసీల గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అది ఒక్క జగన్‌కే సాధ్యం. – డి.సాంబశివరావు, మంగళగిరిపాడు -
చెప్పులు, చొక్కా లేకుండా ప్రచారం
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిన మోసాలకు నిరసనగా కాళ్లకు చెప్పులు లేకుండా, చొక్కా లేకుండా, గుండు గీయించుకుని వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు. బీసీలపై జగన్‌కున్న ప్రేమ, బీసీ డిక్లరేషన్‌లో ఆయన ప్రకటించిన నిర్ణయాలు నచ్చి జగన్‌కు అండగా నిలుస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు, ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన మిరియం శ్రీనివాసులు జిల్లా అంతటా వినూత్నంగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. బీసీలను చంద్రబాబు వంచించారని, జిల్లాలో ఒక్క ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి జగన్ సీఎం అయ్యేంత వరకు జిల్లా అంతటా ప్రచారం చేస్తానన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ఎండగడుతూ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు అన్ని గ్రామాలు తిరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి బీసీ ఇంటికి వెళ్లి జగన్ బీసీ కోసం చేస్తున్న కార్యక్రమాలు, అన్ని పదవుల్లో రిజర్వేషన్ కల్పించడం, బీసీ నిధులకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. -
వెనుకబడిన కులాలకూ వెన్నుపోటు
సాక్షి, చీరాల (ప్రకాశం): బీసీలు ఎన్నికల్లో పోటీచేసేందుకు పనికిరారా? టీడీపీ వారిని ఓటు బ్యాంకుగానే చూస్తోందా? జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన టీడీపీ ఒక్క బీసీ నేతకు కూడా అవకాశం కల్పించకపోవడంతో ఆ పార్టీ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతపై సర్వత్రా చర్చ నడుస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు హయాంలో బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించి సీట్లు కేటాయించారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబునాయుడు లాగేసుకున్నప్పటి నుంచి పార్టీలో బీసీల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. చివరకు అత్యధికంగా బీసీలు ఉన్న ప్రకాశం జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా బీసీలకు దక్కని దుస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ బీసీలది అని వల్లె వేసే చంద్రబాబు బెత్తెడు చోటు కూడా లేకుండా చేయడంపై ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్టీఆర్ హయాంలో జిల్లాకు చెందిన చిమాటా సాంబు, మారుబోయిన మాలకొండయ్య, పాలేటి రామారావు లాంటి యాదవ సామాజిక వర్గ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారు. పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతికి వచ్చాక యాదవ సామాజికవర్గంపై చిన్నచూపు చూడటం మెదలుపెట్టారు. అందుకు 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా యాదవ సామాజికవర్గానికి కేటాయించకపోవడమే నిదర్శనం. ఓట్లు కావాలి.. కానీ సీట్లివ్వరా ? జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 17 లక్షల మంది బీసీలు ఉండగా వారిలో 4 లక్షల మందికి పైగా యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు. జిల్లాలో కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల, ఒంగోలు నియోజవర్గాల్లో యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే సామర్థ్యం వారికి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క యాదవ నేతకు కూడా రాజకీయ ప్రాధ్యాన్యత కల్పించకపోవడంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం శ్రమించిన తమను కరివేపాకులా తీసేయడం దారుణమని యాదవ సామాజికవర్గీయులు అంటున్నారు. బీసీలకు వెన్నుదన్నుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా యాదవులకు అన్ని జిల్లాలో సముచిత స్థానం కల్పించింది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రాధాన్యత కల్పించింది. కనిగిరి నియోజకవర్గం నుంచి 2014తో పాటు 2019లో కూడా అసెంబ్లీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్‌కు అవకాశం కల్పించింది. గతంతో జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా యాదవ సామాజికవర్గానికి చెందిన నూకసాని బాలాజీకి అవకాశం కల్పించింది. కానీ ఆయన టీడీపీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరారు. బీసీలు బాబు వెంట లేరు చీరాల అసెంబ్లీ సీటు తమకే ఇవ్వాలని బీసీలు చంద్రబాబును కోరితే.. వారిని హెచ్చరిస్తూ ‘మూడుసార్లు బీసీలకు ఇస్తే మీరు గెలిచారా.. ఓసీలపై బీసీలను నిలబెడితే బీసీలు ఎలా గెలుస్తారు’ అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే బీసీలు టీడీపీ వైపు లేరని అర్థమవుతోంది. బీసీ డిక్లరేషన్ ద్వారా అన్ని కులాలకు న్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. కనిగిరి సీటును యాదవులకు కేటాయించడం బీసీలపై జగన్‌కు ఉన్న నమ్మకమన్నారు. – చిమటా సాంబు, మాజీ ఎంపీ జగన్ బీసీ డిక్లరేషన్‌పై నమ్మకముంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీలు అభివృద్ధి చెందుతారన్న విశ్వాసం కలుగుతోంది. బీసీలకు ఏటా రూ.15 వేల కోట్లతో సబ్‌ప్లాన్ అమలు చేస్తానని హామీ ఇచ్చారు. 139 కార్పొరేషన్ల ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానన్నారు. చిరు వ్యాపారులు, కులవృత్తిదారులకు వడ్డీలేని రుణం ఇస్తామన్న హామీ, రాజకీయ ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో సగం కేటాయింపు ద్వారా బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంది. వైఎస్సార్‌లానే ఆయన కొడుకు జగన్ కూడా ఇచ్చిన మాట మీద నిలబడతాడని మేము నమ్ముతున్నాం. – కేవీఎస్ కొండయ్య, బీసీ సంఘం నాయకుడు, గిద్దలూరు ఆదరణ పేరుతో బీసీలకు బిస్కెట్ వేశారు బీసీ కార్పొరేషన్‌కు తక్కువ నిధులు కేటాయించి అవి కూడా మంజూరు చేయలేదు. సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేటికీ అందించలేదు. కుల వృత్తిదారులకు వస్తువులు పంపిణీ చేస్తున్నామని ఎన్నికల ముందు హడావుడి చేసి 5 శాతం మందికి మాత్రమే ఇచ్చారు. రూ.లక్ష సబ్సిడీ ఇవ్వాల్సిన స్థానంలో రూ.10 వేల వస్తువులు ఇచ్చి ఆదరణ పేరుతో బీసీలకు బిస్కెట్ వేసేందుకు ప్రయత్నించారు. బీసీల అభ్యన్నతిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. జిల్లాలో టీడీపీ బీసీలకు ఒక్క ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. – ఎన్.రవికుమార్‌యాదవ్, ఎంపీపీ, అర్ధవీడు -
బీసీ డిక్లరేషన్.. వైఎస్ జగన్‌కు కృతఙ్ఞతలు
-
వట్టి మాటలు కాదు.. గట్టి మేలు కోసం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారంలో ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సందర్భంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్.. బీసీల సర్వతోముఖాభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని, నిజాయితీని చాటి చెప్పిందని ఆయా వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల తరబడి చంద్రబాబు హయాంలో ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర వివక్షకు గురైన తమకు వైఎస్ జగన్ హామీలు ఎంతో స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయని వారు పేర్కొంటున్నారు. పలు కీలక అంశాలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పడం ద్వారా తనవి వట్టి మాటలు కాదని, గట్టి మేలు తలపెట్టే చర్యలని జగన్ తమకు గట్టి భరోసా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, రాజకీయ సాధికారతతోపాటు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఇస్తానని చెప్పడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపైందని చెబుతున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ ట్రస్టు బోర్డులు, కార్పొరేషన్లు, పలురకాల కమిటీల్లో తమ వర్గాలకు పదవులు దక్కుతాయని బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తానని జగన్ చెప్పడం ఆ వర్గాల్లో ఆనందాన్ని కలిగించింది. ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీర్లు, డాక్టర్లుగా చేస్తే.. ఆయన తనయుడు రెండు అడుగులు ముందుకు వేసి మమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలన్న ఆలోచన చేశారని ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని అంటున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నామినేషన్‌పై వర్కులు, కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించినట్లేనని బీసీ నేతలు అంటున్నారు. జగన్ చిత్తశుద్ధికి, కార్యదక్షతకు ముగ్ధులైన బీసీలు రాష్ట్రవ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇన్నేళ్లు గుర్తింపునకు సైతం రాని కులాలను ఆయన పరిగణనలోకి తీసుకోవడం విప్లవాత్మక చర్య అని బీసీ సంఘాల నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బీసీ డిక్లరేషన్ ద్వారా జగన్ సమాజ గతిని చక్కగా అంచనా వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అంటూ ఇంతకాలం చెప్పుకొంటూ వచ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమను నిరాదరించారని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు తాము గుర్తుకు వస్తామని, దశాబ్దాల తరబడి ఆయన చేతిలో మోసపోతూనే ఉన్నామని ఆవేదన చెందుతున్నాయి. కొండంత అండగా.. సంక్షేమంతోపాటు బీసీల ఆర్థిక, రాజకీయ సాధికారతకు కొండంత అండగా డిక్లరేషన్ ఉందని ఆయా వర్గాల ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సభ ప్రారంభంలోనే వైఎస్ జగన్ బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదని, ఈ జాతికి వెన్నెముక అని వారి ప్రాధాన్యమెలాంటిదో అందరికీ తేటతెల్లం చేశారు. బీసీల అభివృద్ధికి ఏటా రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చుచేస్తామని ఆయన చేసిన ప్రకటన వారిలో ఆనందాన్ని నింపింది. ఆ నిధులు దారిమళ్లకుండా ఉండేందుకు ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించడమే కాకుండా దాన్ని పక్కాగా అమలు చేస్తానని భరోసా ఇచ్చారు. బీసీలలో కులాల వారీగా, జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ నిధులు అందేలా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ చొప్పున 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొనడం బీసీల పట్ల ఆయనకున్న ప్రేమకు తార్కాణం. ‘చంద్రబాబు ఐదేళ్లపాటు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీలను కాపీ కొడుతున్నారు’ అని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పడం ఆ వర్గాలను చంద్రబాబు ఎంత నిర్లక్ష్యానికి గురిచేశారో తెలుస్తోంది. శాశ్వత గృహవసతి లేక, ఉపాధి అవకాశాలు కానరాక తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంచార జాతులకు ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు శాశ్వత గృహవసతిని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీతో ఆయా కులాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమను ఇప్పటివరకు ఈ తరహాలో గుర్తించినవారు లేరని, జగన్ మాత్రమే తమ బాధలను మనసుపెట్టి చూశారని వారు ఆనందంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. బీసీల రాజకీయ సాధికారతకు మార్గం.. డిక్లరేషన్ వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు రాజకీయ సాధికారిత చేకూరుతుందని బీసీ వర్గాల నేతలు అంటున్నారు. ఇప్పటివరకు టీడీపీ నేతలు బీసీలను రాజకీయంగా పైకి తెస్తున్నామని మాయమాటలు చెబుతూ వచ్చారని, ఉన్నత రాజకీయ పదవుల్లో తమ అనుయాయులకు చంద్రబాబు పెద్దపీట వేస్తూ బీసీలను చిన్నచూపు చూశారని గుర్తుచేసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మొదలు కిందిస్థాయి వరకు బీసీలకు టీడీపీలో అడుగడుగునా అనేక అవమానాలు ఎదురయ్యాయని పేర్కొంటున్నారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరడానికి వచ్చిన మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులు, తదితర బీసీ వర్గాలను చంద్రబాబు ఎలా దూషించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారని గుర్తు చేస్తున్నారు. అదే వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో అంశాలు బీసీలను రాజకీయంగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేలా ఉన్నాయని బీసీ నేతలు చెబుతున్నారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇస్తానని చెప్పడం ఆ వర్గాల రాజకీయ సాధికారతకు దోహదం చేస్తుందని ఉత్తరాంధ్రకు చెందిన బీసీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. ఇవేకాకుండా ఆయా కులాలు తమ కులాన్ని ఎస్సీ, ఎస్టీలలో చేర్చాలని కోరుతున్నాయి. ఈ డిమాండ్లను చిత్తశుద్ధితో పరిష్కరించకుండా చంద్రబాబు ఇన్నేళ్లూ మోసం చేస్తూ వచ్చారు. ఎలాంటి శాస్త్రీయవిధానం లేకుండా అసెంబ్లీలో తీర్మానాలు చేయించి మసిపూసి మారేడుకాయ చేస్తూ వచ్చారు. జగన్ దీనిపై పూర్తి స్పష్టతను డిక్లరేషన్ ద్వారా ఇచ్చారని బీసీ నేతలు చెబుతున్నారు. బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేస్తానని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పూర్తి పారదర్శకతతో పనిచేసేలా చేస్తామని జగన్ చెప్పారని, దీని ద్వారా తమ కలలు నెరవేరేందుకు అవకాశముందని అంటున్నారు. సంక్షేమంతో బీసీలకు వెన్నుదన్ను వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో అనేక సంక్షేమ కార్యక్రమాలు నభూతో నభవిష్యతిగా ఉన్నాయని ఆయా వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పలు ఉన్నత విద్యాకోర్సుల ఫీజులు లక్షల్లో ఉన్నా ప్రభుత్వం కేవలం రూ.35 వేలే ఇస్తుండడంతో ప్రతి విద్యార్థి చదువు పూర్తయ్యేసరికి రూ.3 లక్షలకు పైగా అప్పులు చేయాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రతి విద్యార్థి ఉన్నత చదువుకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందని, వసతి, భోజన ఖర్చులకు ఏటా రూ.20 వేలు అందిస్తోందని ప్రకటించడం ఆయా వర్గాలకు కొండంత ధైర్యాన్ని అందించింది. ప్రతి తల్లి తన పిల్లల్ని బడికి పంపిస్తే ఏటా రూ.15 వేల సహాయం అందించడం బీసీల్లో విద్యాభివృద్ధికి బాటలు వేస్తుందని రాయలసీమకు చెందిన బీసీ నేత ఒకరు విశ్లేషించారు. సర్టిఫికెట్లకు, ఇతర చిన్నచిన్న అవసరాలకు అధికారుల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా వాటిని అందించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించడం కూడా ఆ వర్గాలకు మేలు చేస్తుందన్నది సుస్పష్టం. 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద నాలుగు విడతల్లో రూ.75 వేలు చెల్లించడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించినట్లవుతుందని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకునే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఐడీ కార్డులు ఇవ్వడంతోపాటు వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సున్నా వడ్డీకి రూ.10 వేలు ఇచ్చేలా చేస్తామనడం వారిలో ఆశలు మొలకెత్తించింది. సెలూన్లు నడిపే నాయీబ్రాహ్మణులకు ఏటా రూ.10 వేల సాయం, మత్స్యకారులకు వేటనిషేధ సమయంలో రూ.10 వేల సాయం, వేటలో ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల పరిహారం, సంచార జాతులకు ఇళ్ల నిర్మాణం, గురుకులాల ఏర్పాటు, సహకార డెయిరీకి పాలుపోసే వారికి అదనంగా లీటరుకు రూ.4 చెల్లింపు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6 వేల సాయం వంటి డిక్లరేషన్‌లోని అంశాలు పరిశీలిస్తే బీసీల్లో అన్ని కులాల వారికీ న్యాయం చేకూర్చేవిగా ఉన్నాయని బీసీ వర్గాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతిమంగా రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నిరుపేదలు మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రూ.7 లక్షలు ఇవ్వాలన్న నిర్ణయం ఆయా కుటుంబాలకు కొండంత ఆసరాగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సాయం అప్పుల వారి చేతుల్లోకి పోకుండా కేవలం ఆ కుటుంబానికి మాత్రమే అందేలా ప్రత్యేక చట్టాన్ని తెస్తామని జగన్ చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని బీసీ నేతలు అంటున్నారు. -
‘బీసీలు తలెత్తుకునే విధంగా జగన్ పాలన’
సాక్షి, రాయచోటి(వైఎస్సార్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’ చారిత్రాత్మకమని ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీలు భారతీయ సంస్కృతి ప్రతిరూపాలని అభివర్ణించారు. వారి అభివృద్ధికి 50 శాతం చట్టబద్ధత కల్పించడమనేది అభినందనీయమన్నారు. బీసీలు తలెత్తుకొనే విధంగా వైఎస్ జగన్ పాలన ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం రాయచోటిలో బీసీ డిక్లరేషన్‌పై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సర్కిల్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ కార్యదర్శి విజయభాస్కర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లను, బోయలను ఎస్టీలోకి తీసుకవస్తామన్నారు. వైఎస్సార్ సీపీ ఇచ్చిన ప్రతీ హామీని తప్పక నెరవేర్చుతుందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్, హామీలు ప్రకటించినందుకే బాబు హడావుడిగా పలు కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ ముస్లిం వైఎస్సార్ సీపీ పక్షానే తిరుపతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే బీసీ వర్గాల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భూమన మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని.. అంతకంటే రెట్టింపు మేలు జగన్ పాలనలో జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతీ ముస్లిం వైఎస్సార్ సీపీ పక్షానే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. -
బీసీ డిక్లరేషన్.. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వేదికగా ప్రకటించిన డిక్లరేషన్‌తో బీసీలకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ‘గర్జన’ సభలో జగన్ ఇచ్చిన హామీలు వారికి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చాయి. జగనన్నతోనే బీసీలకు లాభం జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు సంబరాలు జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అవనిగడ్డలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు డిక్లరేషన ప్రకటించడంపై అవనిగడ్డ నియోజకవర్గం బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అవనిగడ్డ సెంటర్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్, బాబుకడవ కొల్లు నరసింహారావు, రేపల్లి శ్రీనివాస్, సింహాద్రి వెంకటేశ్వర్ రావు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానలు, బీసీ సంఘాల నేతలు, తదితరలు పాల్గొన్నారు. నూజివీడులో.. బీసీలకు డిక్లరేషన్ ప్రకటించి, వరాలు ప్రకటించడంపై జిల్లా బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నూజివీడు మండలం సుంకొల్లులో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు పార్వతీపురంలో.. బీసీ గర్జన సభలో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీల పట్ల పార్వతీపురం బీసీ సంఘాల నేతలు, వైఎస్సార్ సీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దివంగత ప్రజానేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు, వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. కురుపాంలో.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో బీసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు పాల్గొన్నారు. గజపతినగరంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు సభలో బీసీలకు ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేస్తూ దివంగత ప్రజా నాయకుడు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో.. బీసీ డిక్లరేషన్‌ను స్వాగతిస్తూ జగదాంబ జంక్షన్‌లోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ రమణ మూర్తి, ఆ పార్టీ నాయకులు జాన్ వెస్లీ, కొండా రాజీవ్ గాంధీ, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ డిక్లరేషన్.. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు
-
వైఎస్ జగన్ నిర్ణయం చరిత్రాత్మకం : బొత్స
సాక్షి, విశాఖపట్నం : సంచార కులాల పిల్లల కోసం రెసెడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం చరిత్రాత్మకమని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బీసీల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా తమ అధినేత అన్నివర్గాల ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారని, బీసీల జీవన ప్రమాణలు పెంచే దిశగా డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్ ఉందన్నారు. బీసీలంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు.. భారత్ కల్చరని జగన్ చెప్పారని, ఈ డిక్లరేషన్‌పై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు ఇప్పుడు బీసీ సబ్‌ప్లాన్ పెట్టారని, ఎంత బడ్జెట్ కేటాయించారో కూడా చెప్పలేదన్నారు. పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని జగన్ చెప్పారని, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించేలా చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అన్నిరకాలుగా బీసీలకు మేలు జరిగిందని తెలిపారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలను ఎవరు నమ్మొద్దని, వచ్చే ఎన్నికల్లో తగిన బద్ధి చెప్పాలని బొత్స పిలుపునిచ్చారు. -
హృదయాలను హత్తుకున్న బీసీ డిక్లరేషన్
ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్సీపీ బీసీ గర్జనలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీల హృదయాలను హత్తుకుంది. ప్రతి బీసీ కుటుంబం రాజకీయంగా ఎదగడమే కాకుండా, ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి కృషి చేస్తానని ఇచ్చిన హామీతో సభ చప్పట్లతో మారుమోగింది. 139 కార్పొరేషన్లు పెట్టి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటామని, ప్రతి కులానికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడంతో బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతి హామీకి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంటుందని స్పష్టంగా చెప్పడంతో సభ కరతాళధ్వనులతో మారుమోగింది. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు ఎలా మోసం చేశారో జగన్ వివరించారు. అటువంటి నాయకుడు మనకు అవసరమా? అని ప్రజలను అడగ్గా వద్దూ.. వద్దూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. సభలో జగన్ ఇచ్చిన హామీలు అందరి మనస్సులను తాకాయి. ఐదేళ్లలో బీసీల కోసం రూ.75 వేల కోట్లు ఖర్చుచేస్తానని ప్రకటించడం వారి ఆనందం రెట్టింపైంది. బీసీలకు భరోసా, భద్రత కల్పిస్తామన్నారు. పలు బీసీ కులాల గ్రూపుల్లో మార్పులుచేర్పులు చేస్తానని, సామాజికవర్గాల్లో మార్పులు చేస్తానని చంద్రబాబు చెప్పి చేయలేకపోయిన వైనాన్ని వివరించారు. (జగన్ అనే నేను.. మీ బిడ్డగా..) బీసీ సబ్‌ప్లాన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపే విషయంలో జరిగిన మోసాన్ని తెలిపారు. ఇటువంటి బిల్లులు పెట్టేటప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. శాస్త్రీయంగా చేయగలిగింది చేస్తానని, నీతిగా, నిజాయితీగా నిజం చెబుతున్నానని చెప్పినప్పుడు బీసీల మంచి స్పందన లభించింది. పాదయాత్రలో ఎంతో మంది బీసీలు తమ కష్టాలు, బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మనస్సు కలిచివేసేదని, అవన్నీ చూసిన తర్వాతే బీసీలకు ఎంతవరకైనా చేయాలనే ఆలోచన వచ్చినట్లు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పిల్లలను స్కూలుకు పంపిస్తే ప్రతి తల్లికీ రూ.15 వేలు ఇస్తానని చెప్పినప్పుడు తల్లుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు తాను ప్రకటించిన పథకాలను కాపీ కొట్టి ప్రకటించుకుంటున్నారని, ఏవేవి కాపీ కొట్టాడో వైఎస్ జగన్ సభలో వివరించారు. చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడంతో చప్పట్లు మారుమోగాయి. (వెనుకబడిన తరగతులే దేశానికి వెన్నెముక) 31 బీసీ కులాలు ఓబీసీలోకి రాకపోవడంతో కేంద్రంలో విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఈ విషయమై ఇంతకాలం బీజేపీతో కాపురం చేసిన వ్యక్తి కేంద్రానికి ఉత్తరమైనా రాయలేదన్నారు. బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారికి 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని ఇచ్చిన హామీ బీసీల్లోకి చొచ్చుకుపోయింది. ఇప్పటివరకు బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదనుకుంటున్నామని, జగనన్నతో అది సాధ్యమవుతుందని సభకు వచ్చిన ప్రజలు చెప్పుకున్నారు. మత్స్యకారులకు, చేనేతలకు, కార్మికులకు, యాదవులకు, పాల రైతులకు ఇచ్చిన హామీలు వారిని ఆకర్షించాయి. సంచార జాతులకు ఇళ్లు కట్టించి, ఉపాధి కూడా చూపిస్తామని చెప్పిన వ్యక్తి ఇప్పటివరకు జగన్ ఒక్కరేనని చెప్పవచ్చు. ప్రత్యేకించి వారి పిల్లలకు గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 32 బీసీ కులాలను తెలంగాణలో ఓసీలుగా పరిగణిస్తున్నారని, అధికారంలోకి రాగానే కేసీఆర్‌తో మాట్లాడి 32 కులాలను బీసీలుగా గుర్తించే బాధ్యత తీసుకుంటానని వారిలో ఆనందం నింపారు. -
బీసీల్లో రెట్టించిన ఉత్సాహం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పటివరకూ రాష్ట్ర చరిత్రలో ఎవరూ ప్రకటించని విధంగా వరాలు కురిపించిన జగన్‌కు బీసీలు జేజేలు పలికారు. రాష్ట్రంలో అన్ని దారులు ఏలూరు వైపేనా అన్నంతగా బీసీలు బీసీగర్జనకు తరలివచ్చారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్ని జిల్లాల నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు ఉత్తుంగ తరంగమై పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. దీంతో బీసీ గర్జన విజయవంతమైంది. వైఎస్ జగన్ ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికే ప్రాంగణం మొత్తం నిండిపోవడమే కాకుండా సభాస్థలికి రెండువైపులా సుమారు ఆరేడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో చాలామంది కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి వచ్చింది. ‘జగన్ అనే నేను’ అంటూ జగన్ ప్రస్తావించగానే సభలో సీఎం, సీఎం అంటూ నినాదాలతో సభ హోరెత్తింది. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని వాగ్దానాలను ప్రజల్లో ఎండగట్టడమే కాకుండా తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. బీసీల సంక్షేమానికి ఏటా రూ.15 వేల కోట్లు వెచ్చిస్తామని, తొలి ఏడాదిలోనే బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. బీసీ కులాలకు మొత్తం 139 కార్పొరేషన్లు ప్రకటిస్తానని, కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ప్రకటించినప్పుడు బీసీల నుంచి మంచి స్పందన లభించింది. బీసీ కులాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమైంది. ప్రైవేటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పనుల్లో, నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు, బీసీలకు వర్తింప చేస్తామని చెప్పినప్పుడు సభ హోరెత్తింది. బీసీలంటే బలహీన వర్గాలు కాదని బ్యాక్‌బోన్ (వెన్నెముక)గా మారుస్తామని ప్రకటించడంతో బీసీల నుంచి మంచి స్పందన లభించింది. వచ్చే ఎమ్మెల్సీ సీటును జంగా కృష్ణమూర్తికి ఇస్తామని ప్రకటించారు. తన ప్రసంగంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే తాను చేయదలచుకున్న పనులను వివరించడం పట్ల సభికుల్లో మంచి స్పందన వ్యక్తమైంది. అమర వీరులకు నివాళి సభ ప్రారంభానికి ముందు జమ్ముకాశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన అమర జవానులకు సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. తొలుత మహాత్మా జ్యోతీబా పూలే, సావిత్రీబాయి పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సభలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, వైఎస్సార్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, ఆళ్ల నాని, తలశిల రఘురామ్, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు, విడుదల రజని, నర్సిగౌడ్, ఉషాచరణ్, మేకా శేషుబాబు, కారుమూరి నాగేశ్వరరావు, జయరాములు, అనిల్‌కుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, బీసీ విభాగం నేతలు పాల్గొన్నారు. వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం విమానాశ్రయం (గన్నవరం): ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఏలూరులో బీసీ గర్జనలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన జగన్‌ను పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మహ్మద్ ముస్తాఫా, ఎమ్మెల్సీలు ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి, మచిలీపట్నం పార్లమెంటరీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, రాష్ట్ర అధికార ప్రతినిధులు పేర్ని నాని, జోగి రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి, గుంటూరు, విజయవాడ నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్త నందిగం సురేష్, నియోజకవర్గ సమన్వయకర్తలు యార్లగడ్డ వెంకట్రావు, సింహాద్రి రమేష్‌బాబు, కైలే అనిల్‌కుమార్, అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ సమీపంలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు. తొలుత బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆయనను కలిసి కొద్దిసేపు చర్చించారు. బీసీ సంఘ నాయకులు జగన్‌కు గొర్రె పిల్లను బహూకరించారు. అదేవిధంగా పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా వెంకటప్రతాప్ అప్పారావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నరసరావుపేట, రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గని భరత్‌రామ్, పార్టీ రాష్ట్ర నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నియోజకవర్గ సమన్వయకర్తలు కాసు మహేష్‌రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, బత్తిన ట్రాన్స్‌పోర్టు అధినేత బత్తిన రాము తదితరులు కలిశారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా ఏలూరు వెళ్లారు. కాగా, ఏలూరులో బీసీ గర్జన బహిరంగ సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా ఆయన రాత్రి 7.40 గంటలకు గన్నవరం చేరుకున్నారు. అనంతరం 7.55కు విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆళ్ల నాని, యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావు, కైలే జ్ఞానమణి తదితరులు వీడ్కోలు పలికారు. -
వెనుకబడిన తరగతులే దేశానికి వెన్నెముక
బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మీరు భారతదేశం కల్చర్‌ను వేలాది సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులు. మీరంతా వెనుకబడ్డ కులాలు కాదు, మీరు మన జాతికి వెన్నుముక లాంటి కులాలు. మనం వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి తినే ఆహారం, ఉపయోగించే ప్రతి పనిముట్టు, నివసించే ఇల్లు, ప్రయాణించే బండి, నీరు తాగే గ్లాస్ నుంచి అన్నం తినే కంచం వరకు, మన ఇంటి పెరట్లో తవ్విన బావి నుంచి ఇంటికి ఉపయోగించిన ఇటుక వరకు, మన బట్టలకు పట్టిన మకిలిని వదిలించడం దగ్గర నుంచి మన వెంట్రులకు సంస్కారం నేర్పడం వరకు.. ఇలా మన ప్రతి అణువులో వేల సంవత్సరాల పాటు బీసీ కులాల పాత్ర ఎంతటి గొప్పదో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏలూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వెనుకబడిన తరగతులకు మాయమాటలు చెప్పిదే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్లుగా వారిని దారుణంగా వంచిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం ఏలూరులో ‘బీసీ గర్జన’ సభలో మాట్లాడారు. బీసీల ముఖాల్లో వెలుగులు చూడాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్నివేళలా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. త్వరలో జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దక్కబోయే ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవిని బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తికి కట్టబెడతామని ప్రకటించారు. జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మీరు భారతదేశం కల్చర్‌ను వేలాది సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులు. మీరంతా వెనుకబడ్డ కులాలు కాదు, మీరు మన జాతికి వెన్నుముక లాంటి కులాలు. మనం వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి తినే ఆహారం, ఉపయోగించే ప్రతి పనిముట్టు, నివసించే ఇల్లు, ప్రయాణించే బండి, నీరు తాగే గ్లాస్ నుంచి అన్నం తినే కంచం వరకు, మన ఇంటి పెరట్లో తవ్విన బావి నుంచి ఇంటికి ఉపయోగించిన ఇటుక వరకు, మన బట్టలకు పట్టిన మకిలిని వదిలించడం దగ్గర నుంచి మన వెంట్రుకలకు సంస్కారం నేర్పడం వరకు.. ఇలా చెప్పుకుంటే పోతే మన ప్రతి అణువులో వేల సంవత్సరాల పాటు బీసీ కులాల పాత్ర ఎంతటి గొప్పదో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి బీసీ సోదరుడికి మనం రుణపడి ఉండాల్సిందే. భారతీయ నాగరికతలో కనిపించే శిల్పం, అగ్గిపెట్టెలో పట్టే చీర, మంగళకరమైన సన్నాయి.. ఏది చూసినా, ఏది విన్నా ఇదంతా మన బీసీల గొప్పతనమే. గర్వంగా తలెత్తుకుని జీవించాలి నాగరికతకు నడకలు నేర్పిన బీసీల బతుకులు ఇప్పుడు ఎలా ఉన్నాయో మనసుతో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వీరి బతుకుల్లో మార్పు తీసుకురావడానికి మనం ఏం చేయగలుగుతామో ఆలోచించాలి. అభివృద్ధి, ఆదాయం పరంగా మన సమాజంలో ఈనాటికీ చాలామంది వెనుకబడి ఉన్నారు. బడుగులు, బలహీనులు ఈ ప్రపంచంలో గర్వంగా తలెత్తుకుని జీవించాలంటే ఉన్నతమైన చదువులు నేర్చుకోవాలి. పదవుల్లో వారికి వాటా కావాలి. చంద్రబాబు దగా చేశాడు 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో, ప్రణాళిక అంటూ ఒక పుస్తకం చూపించాడు. ఇందులో బీసీ కులాలకు సంబంధించిన 119 వాగ్దానాలు చేశాడు. వాటిలో ఒక్కటైనా సక్రమంగా అమలు చేసిన పాపానపోలేదు. రాష్ట్రంలో 2.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే చాలు బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం వస్తుందని తెలిసినా ఆ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆయనకు మనసు రాలేదు. రాష్ట్రంలో ఏది చూసినా కాంట్రాక్టు అంటాడు, ఔట్సోర్సింగ్ అంటాడు. వాటిలో రిజర్వేషన్లు ఉండవు. అంటే బీసీలను చంద్రబాబు దగా చేశాడు. బీసీల అభివృద్ధి కోసం ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో అక్షరాలా రూ.50 వేల కోట్లు ఇస్తానన్న ఈ పెద్దమనిషి చివరకు రూ.18 వేల కోట్లు మాత్రమే ఇచ్చి దారుణంగా మోసం చేశాడు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరు గారుస్తోంది. ఇవాళ మన పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకోవాలంటే అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆస్తులు ఆమ్ముకోవాల్సి వస్తోంది. అరకొరగా ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కూడా చంద్రబాబు బకాయిలు పెట్టాడు. మొత్తం రూ.2,200 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ కోర్సులు పూర్తి చేసినా పట్టాలు తీసుకోలేని పరిస్థితి దాపురించిందని చంద్రబాబు నాయుడి పాంప్లెట్ పేపర్లోనే వచ్చింది. కొత్త భూకేటాయింపుల సంగతి దేవుడెరుగు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల నుంచి ఎన్ని లక్షల ఎకరాల భూములు లాక్కున్నాడో అడగండి. బలహీన వర్గాల నుంచి వేలాది ఎకరాల భూములు లాక్కోవడానికి నీకు మనసెలా వచ్చింది చంద్రబాబూ అని నిలదీయండి. బీసీలను ప్రోత్సహించాలి రాజ్యాంగపరమైన పదవులు బీసీలకు ఎప్పుడో ఒకసారి వస్తాయి. అవి లక్ష మందిలో ఏ ఒక్కరికో రావొచ్చు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వెనుకబడిన తరగతులను ప్రోత్సహించాలి. చేతనైతే సాయం చేయాలి. కానీ, చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? ఇద్దరు బీసీలకు హైకోర్టు జడ్జీలుగా అవకాశం వస్తే వారిని అసమర్థులుగా, అవినీతిపరులుగా చిత్రీకరించి ఆ పదవులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను జస్టిస్ ఈశ్వరయ్య మీడియాకు చూపిస్తూ చంద్రబాబు నైజం గురించి చెప్పారు. చంద్రబాబుకు బీసీలపై ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం. బీసీల పట్ల తాను చేసింది తప్పు అని చంద్రబాబు ఈ రోజుకీ ఒప్పుకోవడం లేదు. వైఎస్సార్సీపీకి ఒక్క అవకాశం ఇవ్వండి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కింద కాదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే పరిస్థితి నుంచి బ్యాక్‌బోన్ క్లాస్‌గా తీసుకువస్తామని హామీ ఇస్తున్నా. బీసీలను కరివేపాకుల్లా వాడుకున్న చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఓడించండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశమివ్వండి. నవరత్నాల గురించి ఇంతకు ముందు చెప్పా. ఆ నవరత్నాలతో పేదవారి జీవితాలు మారుతాయని గట్టిగా నమ్ముతున్నా. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికీ తీసుకొస్తా. ప్రతిపేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తా. అది జరగాలంటే మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి’’ అని జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
జగన్ అనే నేను.. మీ బిడ్డగా..
ఏలూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తరతరాలుగా నిరాదరణకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, అభివృద్ధే తన ఏకైక ధ్యేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలుగెత్తి చాటారు. ఆయా వర్గాల తలరాతలను మార్చేలా పలు కీలక పథకాలను ప్రకటించారు. బడుగుల బాగు కోసం తాను రెండు అడుగులు ముందుకేస్తున్నానని ఉద్ఘాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీ గర్జన’లో పలు కీలక పథకాలను ప్రకటించారు. తాము అధికారంలో వస్తే.. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిఏటా రూ.15,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామని చెప్పారు. ఐదేళ్లలో రూ.75,000 కోట్లు వ్యయం చేస్తామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్లో మూడో వంతు నిధులను బీసీల అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్‌బోన్ క్లాస్‌గా మారుస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. బీసీలు గర్వంగా తలెత్తుకుని జీవించాలని ఆకాంక్షించారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో, నియామకాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు.. ఇస్తామని పేర్కొన్నారు. బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలన చూశాం. మార్పును కోరుతూ ఈ రోజు బీసీ గర్జన నిర్వహించుకుంటున్నాం. దాదాపు 14 నెలలు.. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. రాష్ట్రంలోని ప్రతిమూలకూ నడిచా. పాదయాత్ర మొదలు కాకముందే మన రాష్ట్రంలోని బీసీ నాయకులతో జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ అధ్యయన కమిటీ వేశాం. ఒకవైపు పాదయాత్ర చేస్తూనే, రాష్ట్రం మొత్తం పర్యటించాలని ఈ కమిటీని కోరాం. పాదయాత్రలో దారిపొడవునా బీసీల సమస్యలను తెలుసుకుంటూ వచ్చా. మరోవైపు మన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రమంతటా తిరిగారు. ప్రతిఒక్కరితో మమేకమయ్యారు. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేశారు. పాదయాత్ర సందర్భంగా బీసీల సమస్యలు నేరుగా నాకు తెలిశాయి. మన పార్టీ నాయకులతో కూడిన కమిటీ బీసీల సమస్యలపై లోతుగా అధ్యయనం చేసింది. వారి నివేదికను నాకు అందజేశారు. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని, ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వులు చూడాలనే సంకల్పంతో ఈ రోజు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తాం రేపు మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనే నేను, మీ అందరి బిడ్డను.. మీ కోసం ఏం చేస్తానో ఇవాళ చెబుతా. చంద్రబాబు ఐదేళ్లలో బీసీల కోసం సంవత్సరానికి కనీసం రూ.4 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కానీ, మన ప్రభుత్వం వచ్చాక బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిఏటా రూ.15,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామని చెబుతున్నా. అంటే ఐదేళ్లలో రూ.75,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తానని హామీ ఇస్తున్నా. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తాం. చంద్రబాబు బీసీలను వెక్కిరిస్తూ, తన హయాంలో రాని ఆరో బడ్జెట్లో పెట్టిన బిల్లు స్థానంలో.. మన ప్రభుత్వం వచ్చాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర సబ్‌ప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని హామీ ఇస్తున్నా. మూడో వంతు నిధులను బీసీల అభివృద్ధికే కేటాయిస్తాం. కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కార్పొరేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో 1,000 మంది ఉంటే, కేవలం ఐదుగురికి మాత్రమే రుణాలు ఇస్తున్నారు. అది కూడా లంచాలు తీసుకుంటారు, జన్మభూమి కమిటీ సిఫార్సులంటారు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెబుతున్నాం. అక్కాచెల్లెమ్మలకు ‘వైఎస్సార్ చేయూత’ నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, చేనేతలకు, మత్స్యకారులకు, బోయలకు, వాల్మీకులకు, కురబలకు, అగ్నికుల, వన్నెకుల క్షత్రియులకు, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, యాదవ, గౌడ, బలిజ, శెట్టి బలిజ, సూర్య బలిజ, వడ్డెర, దూదేకుల, తూర్పు కాపు, కొప్పుల వెలమ, పోలినాటి వెలమ, కళింగ వెలమ, కాళింగ, గాండ్ల, మేదర, సగర, ముదిరాజ్, భట్రాజు, జంగం, శిష్టకరణం, రెడ్డిక, వీరశివ, వడ్డీలు, షేక్‌లు తదితర బీసీ కులాలకు 139 కార్పొరేషన్లు పెడతానని హామీ ఇస్తున్నా. తాము నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన ఏ ఒక్క సామాజికవర్గంలోనూ లేకుండా అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అరకొర నిధులివ్వడం కాదు, ఆ కులంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు ఉన్న ప్రతి అక్కాచెల్లెమ్మల చేతుల్లో రూ.75,000 పెడతాం. ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదు, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. గ్రామ వాలంటీరే వారి దగ్గరికి వెళ్లి నేరుగా డబ్బులిస్తాడు. వైఎస్సార్ చేయూత అనే పథకాన్ని అమలు చేస్తాం. నాలుగు విడతలుగా డబ్బులిస్తాం. ఆ డబ్బును ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేస్తున్నా. అందరికీ న్యాయం జరిగేలా నిధులిస్తాం.. కార్పొరేషన్లకు ఇంతే ఇస్తామంటూ కత్తిరించే కార్యక్రమం చేయం. ఆ కార్పొరేషన్లో ఆ కులం జనాభా ఎంతైతే ఉంటుందో ఆ మేరకు అందరికీ న్యాయం జరిగేలా మొత్తం నిధులిస్తాం. బీసీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు ఇంకో విషయం కూడా చెబుతున్నా. మహానేత వైఎస్సార్ ఒక విషయం చెబుతూ ఉండేవారు. ఒక ఇంట్లో ఒకరు ఇంజనీర్ అయితే, ఒక ఇంట్లో ఒకరు డాక్టర్ అయితే, ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్ అయితే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని నాన్న ఎప్పుడూ అంటుండేవారు. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని చెబుతున్నా. పేదల కోసం ఆయన ఒకడుగు ముందుకేశారు, జగన్ రెండు అడుగులు ముందుకేస్తాడని హామీ ఇస్తున్నా. మీ పిల్లలను ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం. ఎంతవరకైనా చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు. నేను ఇస్తానని మాట ఇస్తున్నా. పిల్లలను ఉచితంగా చదివిస్తా. అంతేకాదు ఆ చదువుల కోసం పిల్లలు హాస్టళ్లలో ఉండాలి. ఆ హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ చార్జీల కోసం సంవత్సరానికి కనీసం రూ.15,000 ఖర్చవుతుంది. ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులున్నారు. ప్రతి తల్లికి, తండ్రికి చెబుతున్నా. పిల్లలను చదివించడమే కాదు. హాస్టళ్లలో ఉన్నందుకు, మెస్ చార్జీల కోసం సంవత్సరానికి రూ.20,000 ఇస్తాం. పునాదులు గట్టిగా ఉంటేనే మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కాగలుగుతారు. ఈ పిల్లలు బడులకు పోతే.. వారు ఇంజనీర్లు, డాక్టర్లు అయితేనే మన బతుకులు మారుతాయి. మన తలరాతలు మారుతాయి. ప్రతి తల్లికీ చెబుతున్నా. చెయ్యాల్సిందల్లా మీ పిల్లలను బడులకు పంపించడమే. బడులకు పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15,000 ఇస్తానని హామీ ఇస్తున్నా. బీసీలకు రావాల్సిన హక్కు రావడం లేదు ఈరోజు బీసీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కులం సర్టిఫికెట్ల నుంచి మొదలు పెడితే గ్రూపుల మార్పిడి వరకు వాళ్లకున్న సమస్యలు వాళ్లకున్నాయి. చంద్రబాబు వంటి మనిషిని చూసినప్పుడు ఆ సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఎంబీసీల జాబితాగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌ను ప్రకటించారు. అందులో 32 కులాలను పెట్టారు. ఆ 32 కులాలను ఎంబీసీలుగా పెట్టి ఎంత దారుణంగా చేశారంటే... ఎంత చిత్తశుద్ధి లేకుండా చేశారంటే... ఎంత హేతుబద్ధత లేకుండా చేశారంటే రేపు ఎవరైనా కోర్టుకు వెళితే మొత్తం వ్యవహారమే రద్దయ్యే పరిస్థితి వచ్చింది. ఇంతటి దారుణంగా బీసీ కులాల పరిస్థితి ఉంది. కులం సర్టిఫికెట్ రాదు. దానికోసం చంద్రబాబు చుట్టూ తిరగాలి. బీసీలకు రావాల్సిన హక్కు వారికి రావడం లేదు. జన్మభూమి కమిటీల నుంచి మొదలు పెడితే ఎవరెవరికో లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తానని హామీ ఇస్తున్నా. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటి మాదిరిగా కాకుండా, మూడేళ్లకే దాని కాలపరిమితి ముగిసిపోయేలా కాకుండా నిరంతరం బీసీ కమిషన్ పనిచేసేలా దాన్ని చట్టబద్ధం చేస్తాం. దాని పరిధిని విస్తరిస్తాం. బీసీల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు బీసీ కమిషన్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా. సమస్యల పరిష్కారానికి బీసీ కమిషన్ బీసీలలో సామాజికవర్గ మార్పులు కోరుతూ అనేక కులాలు ఉన్నాయి. సగర, కృష్ణ బలిజ, పూసల, గవర, పద్మశాలి, నాగవంశం వంటి వారు బీసీలలోనే ‘ఎ’గా గుర్తించాలని కోరుతున్నారు. మేదర, వాల్మీకి, కురబ, వడ్డెర, మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తించాలని అడుగుతున్నారు. రజక, గాండ్ల, మేదరులు, ఆరెకటికలు ఎస్సీలుగా గుర్తించమని వేడుకుంటున్నారు. నేనొక్కటే చెబుతున్నా. ఇవన్నీ కూడా రాజకీయ స్వార్థం కోసం ఒక కులాన్ని ఇష్టమొచ్చినట్లుగా ఇంకొకదానిలో పెట్టడం, ఇంకొక కులాన్ని తమ ఇష్టమొచ్చినట్లుగా తగ్గించడం, తీసేయడం... ఇవన్నీ చేయడం నిజంగా ఎటువంటి స్టడీ, హేతుబద్ధత లేకుండా, ఎటువంటి కమిటీ లేకుండా, ఎటువంటి రికమెండేషన్ లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో ఇష్టమొచ్చినట్లుగా మార్పులు చేయడం, చేయలేనివి కూడా చేస్తానని చెప్పడం నిజంగా ధర్మమేనా అని అడుగుతున్నా. ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాను. పారదర్శకత తీసుకువస్తా. ఈ కులాల డిమాండ్లను, వారి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని పారదర్శకంగా, పక్షపాతానికి తావులేకుండా వారందరి విజ్ఞప్తులను బీసీ కమిషన్‌కు అప్పగిస్తాం. పారదర్శకంగా, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా వారి సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా రాజకీయ పరిధిలోకి రాకుండా చేస్తాం. రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం నిజంగా ఏ కులం ఎక్కడ ఉండాలి అన్నది వాళ్లవాళ్ల రికమెండేషన్ల ప్రకారం అమలయ్యేలా చేస్తాం. ఈ బీసీ కమిషన్ పరిధిలో రాని అంశాలున్నాయి. ఎస్సీలుగా, ఎస్టీలుగా చేసే అంశాలున్నాయి. వీటిని కూడా ఏ రకమైన రికమెండేషన్లు లేకుండా రాష్ట్రంలోని పరిస్థితులు చెప్పకుండా, పక్క రాష్ట్రాల్లోని పరిస్థితులు చెప్పకుండా కేవలం ప్రజలను మోసం చేసేందుకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని చెప్పి మోసం చేస్తున్నారు. అది సరైంది కాదు. వారి పరిస్థితులు ఏమిటి? చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పరిస్థితి ఏమిటి? వీళ్లెందుకు ఈ డిమాండ్ అడుగుతున్నారు? వీరి డిమాండ్లలో న్యాయం ఎంతున్నదన్నది అధ్యయనం చేసి వాళ్లకు పక్క రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే అడుగుతున్నారని ఆ రిపోర్టుల్లో పెట్టి ఆ రిపోర్టుల ఆధారంగా చేసి, ఆ తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. కొన్ని కొన్ని రాష్ట్రం పరిధిలో ఉంటాయి. ఎస్సీలుగా, ఎస్టీలుగా చేయడం వంటివి కొన్ని రాష్ట్రం పరిధిలో ఉండవు. కానీ, రాష్ట్రం రికమెండ్ చేసి కేంద్రానికి పంపుతుంది. ఆ రికమెండ్ చేసేదాంట్లో శాస్త్రీయత తీసుకొని వచ్చి, రికమెండ్ చేసి మా పరిధిలో ఉన్న ప్రయత్నం కచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నా. ఓట్ల కోసం కాదు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం లేదు. అబద్ధాలు, మోసాలు ధర్మం కాదని భావిస్తున్నా. కాబట్టే నీతిగా నిజాయితీగా ఉన్నానని చెబుతున్నా. ఆదివారం ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో ప్రసంగిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్. వేదికపై బీసీ నేతలు ఒక్కసారైనా కేంద్రానికి లేఖ రాశారా? చంద్రబాబు చిత్తశుద్ధి లేకుండా పరిపాలన సాగిస్తున్నారని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెబుతా. ఆంధ్రప్రదేశ్‌లో 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీలోని జాబితాలో లేకపోవడం వల్ల ఆ కులాల వారు కేంద్ర ప్రభుత్వంలోని విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందలేకపోతున్నారు. చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేశారు. ఇద్దరు ఎంపీలను బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రులుగా పెట్టారు. నాలుగు సంవత్సరాలు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? ఆంధ్ర రాష్ట్రంలోని 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోతే కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని అధ్వానపు వ్యక్తి ఈ చంద్రబాబు. జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్న సందర్భంగా చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ నేతలు, ప్రజలు చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణం నా పాదయాత్రలో చూశాను. చాలామంది పేదవారు ఫుట్‌పాత్ పక్కన సరుకులు అమ్ముకొంటున్న పరిస్థితి చూశాను. వారు రోజుకు రూ.4 వడ్డీకి, రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఒకరు రూ.1,000, మరొకరు రూ.2,000, వేరొకరు రూ.5,000 అప్పులు తెచ్చుకుంటూ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఇటువంటి వారందరికీ గుర్తింపు(ఐడీ) కార్డు ఇస్తా. ఐడీ కార్డు ఇవ్వడమే కాదు. వీరందరికీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు సున్నా వడ్డీకే రూ.10,000 ఇస్తామని హామీ ఇస్తున్నా. మత్స్యకారుల బతుకుల్లో చిరునవ్వులు చూడాలి ఇదివరకే చెప్పాను. పాదయాత్రలో కొన్నికొన్ని కులాలకు మాట ఇచ్చా. ఇవాళ బీసీ డిక్లరేషన్‌లో భాగంగా ఆయా కులాలకు చెప్పిన మాటలను మళ్లీ క్లుప్తంగా చెబుతా. షాపున్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ప్రతి షాపునకు సంవత్సరానికి రూ.10,000 ఇస్తామని హామీ ఇస్తున్నా. సంచార జాతుల వారిని గుర్తిస్తామన్నా. వారంతా స్థిరంగా ఒకచోట ఉండడానికి నివాసముండే విధంగా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పా. వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాదు. తగిన ఉపాధి కూడా కల్పిస్తామని హామీ ఇస్తున్నా. వారి పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. పాదయాత్రలో మత్స్యకార సోదరులకు మాట ఇచ్చా. వేట నిషేధ సమయంలో రూ.4,000 కూడా ఇవ్వడం లేదన్నా.. అది కూడా అందడం లేదన్నా అని నాకు చెప్పారు. వారికి మాట ఇచ్చా. వేట నిషేధ సమయంలో రూ.4,000 కాదు, రూ.10,000 ఇస్తామని మాట ఇచ్చా. వారి బతుకుల్లో చిరునవ్వులు చూడాలి. వారికి ఏమీ జరగకూడదు. కానీ, పొరపాటున వారికి ఏమైనా జరిగితే వారి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని కూడా నేను హామీ ఇచ్చా. ఈ ప్రభుత్వం కొత్త బోట్లను రిజిస్ట్రేషన్ చేయడం లేదన్నా అని వారు చెప్పారు. డీజిల్ సబ్సిడీ సొమ్ము ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని, కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి అని చెప్పారు. ఆ మత్స్యకార సోదరులందరికీ మాట చెప్పా. కొత్త బోట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తాం. పాతబోట్లను గుర్తిస్తాం. డీజిల్ సబ్సిడీని పాత కొత్తబోట్లకు తేడా లేకుండా పెంచుతాం. డీజిల్ పట్టేటప్పుడే ఆ సబ్సిడీని కూడా ఇస్తామని మాట ఇచ్చా. మెకనైజ్డ్ బోట్లు, ఫైబర్‌బోట్లు ఇలా అన్నింటికీ నిబంధనలు అడ్డుపెట్టకుండా ఇస్తామని హామీ ఇచ్చా. ఆ 32 కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తా.. రాష్ట్రం విడిపోయిన తరువాత పక్కన తెలంగాణ రాష్ట్రంలోని 32 కులాలను వారు బీసీ జాబితాలో గుర్తించలేదని చెప్పి అక్కడ కూడా బీసీ జాబితాలో చేర్పించేలా చేయాలని చాలామంది నన్ను పాదయాత్రలో అడిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు ఇంటికి వచ్చారు. చంద్రబాబు శాలువాలు కప్పి కేసీఆర్‌కు భోజనాలు పెట్టారు. కానీ, ఇప్పుడు కేసీఆర్‌కు ఈ 32 బీసీ కులాల గురించి చెప్పాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదు. హరికృష్ణ చనిపోయినప్పడు శవం పక్కన పెట్టుకొని కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు. కానీ, తెలంగాణలోని 32 కులాలు కేంద్రంలోని బీసీ జాబితాలో లేవు, వాటిని చేర్చండి అని చంద్రబాబు నోట్లోనుంచి ఒక్కమాట కూడా రాలేదు. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక కేసీఆర్‌తో నేను మాట్లాడుతా. ఆ 32 కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం చేస్తానని మాట ఇస్తున్నా. బీసీలు రాజకీయంగా ఎదగాలి బీసీల కోసం ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాం. బీసీలు ఎదగాలి. పేదవారు ఎదగాలి. రాజకీయంగా ఎదగాలి. పదవుల్లో ఉండాలి. రాజకీయంగా వీరి ఎదుగుదల కోసం, పదవుల్లో వీరు ఉండడం కోసం గవర్నమెంట్ పరిధిలో ఉన్న అన్నింటిలోనూ మార్కెట్ కమిటీల్లో కావచ్చు, ఛైర్మన్లలో కావచ్చు, కమిటీలలో కావచ్చు, ట్రస్టు బోర్డులు కావచ్చు, ట్రస్టు బోర్డు ఛైర్మన్లు కావచ్చు, ట్రస్టు బోర్డుల్లో సభ్యులు కావచ్చు. గుడులు కావచ్చు, గోపురాలు కావచ్చు. కార్పొరేషన్ పదవులు కావచ్చు. ఇలా గవర్నమెంటు పరిధిలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. ఈ మేరకు మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే చట్టం తీసుకొస్తాం. నామినేటెడ్ పదవులే కాదు, నామినేషన్ కింద ఇచ్చే పనుల్లో 50 శాతం పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందేలా చట్టం తీసుకొస్తాం.. ప్రభుత్వ పనుల్లో 50 శాతం బడుగులకే.. ఇంకా ఒక్క అడుగు ముందుకేస్తున్నాం. ప్రభుత్వ కాంట్రాక్టు సర్వీసులున్నాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నిజంగా పేదరికంలో అల్లాడుతున్న వర్గాలు. వీళ్ల బతుకులు మారాలి. ఆర్థికంగా స్థితిమంతులు కావాలి. ఆర్థికంగా కొద్దో గొప్పో సంపాదించుకొనే పరిస్థితుల్లోకి రావాలి. ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి మొదలుపెడితే... గవర్నమెంట్ కార్లను బాడుగకు తీసుకోవడం, గుళ్లలో, హాస్పిటళ్లలో, స్కూళ్లల్లో ఇలా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టుల కింద సంపాదించుకొనే చిన్నచిన్న పనులు ఎక్కడైనా కూడా.. గవర్నమెంటులో సంపాదించుకొనే మార్గమేదైనా ఉంటే కాంట్రాక్టుకో, ఔట్సోర్సింగ్కో ఇప్పించుకొని సంపాదించుకొనేలా ఉండి ఉంటే వాటన్నింటిలోనూ 50 శాతం పనులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకు వచ్చేలా చట్టం తీసుకొస్తామని హామీ ఇస్తున్నా. గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6,000 చేనేత అక్కాచెల్లెమ్మలకు మాట చెప్పా. వారింటికి వెళ్లి భరోసా ఇచ్చా. ఇంట్లో మగ్గం ఉండి చేనేతతోనే జీవితం గడుపుతున్న ప్రతి అక్కాచెల్లెమ్మకు పెట్టుబడి రాయితీ కింద రూ.2,000 నెలనెలా ఇస్తామని హామీ ఇచ్చా. ఇవన్నీ కూడా మనం నవరత్నాల్లో ప్రకటించిన పథకాలకు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చా. సహకార డెయిరీలకు పాలుపోస్తే చాలు అదనంగా లీటరుకు రూ.4 సబ్సిడీ కింద ఇస్తామని హామీ ఇచ్చా. యాదవ సోదరులకు చెప్పా. గొర్రెలున్నాయి. మేకలున్నాయి. కానీ చెవులకు పోగులు లేవని, చనిపోతే ఇన్సూరెన్సు రావడం లేదు. ప్రతి యాదవ సోదరుడికి చెప్పా. గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6,000 వచ్చేటట్టుగా చేస్తానని చెప్పా. అంతేకాదు తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కు ఆ సన్నిధి గొల్లలకే ఇస్తామని, వారికి వంశపారంపర్య హక్కులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చా. అంతేకాదు ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం ఇచ్చేట్టుగా చేస్తానని హామీ ఇస్తున్నా. ఈ ప్రధాన ఆలయాల్లో మన బతుకుల గురించి ఆలోచన చేసేందుకు బోర్డు మెంబర్ల కింద నాయీబ్రాహ్మణులను, యాదవులను కూడా పెడతామని హామీ ఇస్తున్నా. చిట్టచివరగా ఇది జరగకూడదని ఆశిస్తున్నా. కానీ, పొరపాటున ఏ పేదవాడైనా, ఏ రైతన్న అయినా చనిపోతే ఆయా కుటుంబాల బతుకులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఎవరైనా చనిపోతే అప్పుల వాళ్లు మరుసటి రోజే ఇంటికి వస్తారు. చనిపోయారని కూడా కనికరించరు. మా డబ్బులు కట్టండి అంటూ విపరీతమైన హింసపెడతారు. పేదవాడు బతకలేని పరిస్థితి. ఈరోజు ప్రతి పేదవాడికి చెబుతున్నా. పొరపాటున ఆ పేదవాడు ఆత్మహత్య చేసుకున్నా, పొరపాటున అకాల మరణానికి గురైనా, ఆ పేదవాడు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, రైతన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా ఇంతకు ముందు రైతన్నలకు రూ.5 లక్షలని చెప్పా. అది కూడా మార్పు చేస్తున్నా. పొరపాటున ఇటువంటి దుర్ఘటన జరిగితే వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం కింద రూ.7 లక్షలు ఇస్తామని హామీ వాగ్దానం చేస్తున్నా. అంతే కాదు చట్టాన్ని తీసుకువస్తాం. ఎవరైనా అప్పుల వాళ్లు వచ్చి ఆత్మహత్య చేసుకున్న వారి మీదికి వస్తే... మా అప్పులు తీర్చాలని బలవంతంగా వారి మీద పడితే... ఆ పేద కుటుంబ సభ్యుడికి ఇచ్చే సొమ్ము అది గవర్నమెంట్ సొమ్ము. ఆడపడుచుకు సాయం కింద ఇస్తున్నాం. ఆ డబ్బు మీద బాధిత కుటుంబ సభ్యులకు తప్ప ఏ ఒక్కరికీ హక్కులేదని చట్టాన్ని తీసుకొస్తాం’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఐదేళ్లలో బీసీలకు 75వేల కోట్లు కేటాయిస్తాం
-
బీసీ జీవితాలను మార్చే వరాల వెల్లువ
సాక్షి, ఏలూరు: సామాజికంగా వెనుకబడిన బీసీ వర్గాలపై అపారమైన ప్రేమను చాటుతూ.. వారి అభ్యున్నతి, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో రూ. 15వేల కోట్లు రూపాయలు కేటాస్తాయిమని, ఐదేళ్లలో రూ. 75వేల కోట్లు బీసీలకు అందిస్తామని వైఎస్ జగన్ చరిత్రాత్మక ప్రకటన చేశారు. బీసీలకు ప్రతి ఏడాది రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. గత ఐదేళ్లలో రూ. 60వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ. 18వేల కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. ఏలూరులో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభ బీసీ గర్జనలో ఆయన బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తూ.. పలు కీలక ప్రకటనలు చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే సమగ్ర బీసీ సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. బీసీ వర్గాల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్ చేయూత కింద రూ. 75వేలు ప్రతి ఏడాది నేరుగా అందజేస్తామని ప్రకటించారు. గ్రామ వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వైఎస్సార్ చేయూత కింద డబ్బును పంపిణీ చేస్తారని వెల్లడించారు. పేదవాడి సంక్షేమం కోసం రెండడుగులు ముందుకేస్తా.. ‘పేదవాడి సంక్షేమం కోసం దివంగత నేత, నాన్న వైఎస్సార్ ఒక్క అడుగు ముందుకువేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తాను. మీ పిల్లలను కలెక్టర్, డాక్టర్, ఇంజినీర్ ఏదైనా చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా చదివిస్తాం. హాస్టల్లో ఉండి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20వేలు ఇస్తాం. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ. 15వేలు ఇస్తాం’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బీసీ కమిషన్ పనిచేసేలా చట్టబద్ధత కల్పిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. కులం సర్టిఫికెట్లు, గ్రూపుల మార్పిడి, ఎంబీసీలతోపాటు బీసీల సమస్యలు పరిష్కరించేందుకు బీసీ కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. బీసీ ఉపకులాల్లో ఉన్న డిమాండ్లను వారి ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ కమిషన్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం ధర్మం కాదని అన్నారు. రాష్ట్రంలోని 31 బీసీ కులాలు కేంద్రం పరిధిలోని ఓబీసీ జాబితాలో లేవని, అయినా నాలుగున్నరేళ్లు కేంద్రంలో బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ఈ కులాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి 32 కులాలను బీసీ జాబితాలో చేర్పిస్తామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేసి.. రూ. 10వేల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు. షాపులున్న ప్రతి నాయి బ్రాహ్మణులకు ఉచితంగా ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామన్నారు. సంచార జాతులకు ఉచితంగా ఇల్లు, ఉపాధి కల్పిస్తామని, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10వేలు ఇస్తామని, ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామన్నారు. మత్స్యాకారులకు ఇచ్చే డీజిల్‌పై సబ్సిడీ పెంచుతామన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత మహిళకు ప్రతి నెలా రూ.2 వేలిస్తామని హామీ ఇచ్చారు. సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 అదనంగా చెల్లిస్తామన్నారు. ప్రధాన ఆలయాల్లో నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం అందజేస్తామన్నారు. ఆలయాల్లో బోర్డు మెంబర్లుగా నాయి బ్రాహ్మణులు, యాదవులకు చోటు కల్పిస్తామని తెలిపారు. పేదవాడు ప్రమాదవశాత్తు చనిపోతే వైఎస్ఆర్ బీమా కింద రూ.7లక్షలు అందజేస్తామన్నారు. అప్పుల వాళ్లు ఆ కుటుంబాన్ని వేధించకుండా అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వం ఆడపడుచుకు ఇచ్చిన కట్నంగా ఆ డబ్బును అందిస్తామన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, తాము చేసిన మంచి పనులు చెప్పుకుని ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓటు అడుగుతామని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. -
‘బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా’..
సాక్షి, పశ్చిమ గోదావరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉండబోతోందని వైఎస్సార్ సీపీ బీసీ నేతలు వ్యాఖ్యానించారు. శనివారం ఏలూరు బీసీ గర్జన ప్రాంగణం వద్ద వైఎస్సార్ సీపీ బీసీ నేతలు పార్థసారధి, జంగా కృష్ణమూర్తి, కారుమూరి నాగేశ్వర రావు, మేకా శేషుబాబు, నరేశ్ గౌడ్లు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ సీపీ కమిటీని నియమించిందని తెలిపారు. సంవత్సరంన్నర ముందుగానే కమిటీ బీసీల జీవన స్ధితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేసిందన్నారు. సంచార జాతులకి కూడా మేలు చేసే విధంగా వైఎస్సార్ సీపీ నిర్ణయాలు ఉంటాయన్నారు. బీసీలకు మేలు చేయడానికి వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని మండిపడ్డారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బీసీలకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు బీసీలకు అరకొర తాయిలాలు ప్రకటించి మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. 14 బీసీ కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసినా సరైన విధానాలు లేవని చెప్పారు. చంద్రబాబు మళ్లీ బీసీలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్దితో వైఎస్ జగన్ ఉన్నారన్నారు. బీసీల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ కృతనిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఆదివారం జరగబోయే బహిరంగ సభలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. చంద్రబాబుకు బీసీలపై ప్రేమ లేదన్నారు. బీసీలు ఎవరు కలిసి ఏమీ అడిగినా చంద్రబాబు తోక కత్తిరిస్తానంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. బీసీలు మాకు వెన్నెముక అంటూ ప్రతీ ఎన్నికలలో చంద్రబాబు మాయ చేస్తున్నారు. చంద్రబాబు మాయలను ఈసారి బీసీలు నమ్మే పరిస్ధితి లేదు. వైఎస్సార్ సీపీ బీసీ గర్జన సభను పరిశీలన చేయాలని రాష్ట్రంలోని బీసీలకు సూచన. ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజమండ్రిలో జయహో బీసీ అంటూ చంద్రబాబు మరో మోసానికి తెరలేపారు. బీసీలను అవమానించింది చంద్రబాబు కాదా. నాయీ బ్రాహ్మణులతో పాటు బీసీ కులాలను తోలు తీస్తా అన్నది చంద్రబాబు కాదా. ‘ఎస్సీలలో ఎవరు పుట్టాలని కోరుకుంటారు’ అని చంద్రబాబు అవమానించలేదా. రాష్ట్రంలో ఇసుక సంపదను దోచుకున్నారు. వైఎస్ జగన్ ద్వారా బీసీల భవిష్యత్ మారబోతోంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో బీసీలకు సంక్షేమ పధకాలు అందాయి. బీసీలకు మేలు చేయాలన్న వైఎస్సార్ ఆలోచనల మాదిరే నేడు వైఎస్ జగన్ ఆలోచనలున్నాయి. రాజకీయంగా, సామాజికంగా , ఆర్ధికంగా బలహీన వర్గాలను ప్రోత్సహించాలనే ఆలోచన వైఎస్సార్ సీపీది. రాబోయే కాలంలో బీసీలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు. బీసీ కుల వృత్తులను కూడా కార్పోరేట్లకు తాకట్టు పెడుతున్న వ్యక్తి చంద్రబాబ’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎవరు.. ఇంకెవరు?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతులకు చేయూతనందించి అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడుగడుగునా అవమానిస్తూ అణగదొక్కుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు మాయ మాటలతో మభ్యపుచ్చి ఇప్పుడు ఎన్నికలు ముంచుకు రావడంతో బీసీలే తమ దేవుళ్లంటూ కొంగ జపం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సమయంలో బీసీలకు ఎన్టీఆర్ రాజకీయంగా ప్రాధాన్యం కల్పించినా దొడ్డిదారిన టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు మాత్రం వారిని ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారనేది పరిశీలకుల నిశ్చితాభిప్రాయం. చంద్రబాబు గత తొమ్మిదిన్నరేళ్ల పాలనను చూసినా, ఇప్పుడు అధికారంలో ఉండగా జరుగుతున్న పరిణామాలను గమనించినా బీసీలను ఆయన నయవంచనకు గురి చేశారనేది స్పష్టమవుతుంది. 1 హైకోర్టు జడ్జిలుగా పనిచేసేందుకు బీసీలు పనికిరారంటూ ఒక ముఖ్యమంత్రి కొలీజియానికి లేఖ రాశారని జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ ఆరోపించారు.. ఆ ముఖ్యమంత్రి ఎవరు? 2 తన సమకాలికుడైన ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిగా వ్యవహరిస్తున్న సీనియర్ బీసీ నేతను సంబంధిత శాఖ వ్యవహారాల్లో పూర్తిగా దూరం పెట్టిన సీఎం ఎవరు? 3 దేవదాయ శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న బీసీ వర్గానికి చెందిన మంత్రిని అమరావతిలో వెంకన్న ఆలయం శంకుస్థాపనకు పిలవవద్దని చెప్పిన సీఎం ఎవరు? 4 తనకు మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను వేలెత్తి చూపించి బెదిరిస్తూ సెక్రటేరియట్లో కాలుపెట్టనివ్వబోనంటూ ఆగ్రహోదగ్రుడైన సీఎం ఎవరు? 5 తమను ఎస్సీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని విశాఖలో ఆందోళన చేసిన మత్స్యకారులను భయపెడుతూ తమాషాలు చేస్తున్నారా, మీ సంగతి చూస్తా.. అని హెచ్చరించిన సీఎం ఎవరు? 6 చేపల వేటపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టింది, గల్లంతైన జాలర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎవరు? 7 అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్‌ను అమలు చేస్తానని చెప్పి ఎగ్గొట్టిన సీఎం ఎవరు? వైఎస్సార్ వెలిగించిన చదువుల దీపం.. కనీస చదువులు కూడా పూర్తి చేయకుండానే డ్రాపౌట్లుగా మిగిలిపోతున్న నిరుపేద బీసీ విద్యార్థులను హైస్కూలు గడప దాటించి వృత్తి విద్యా కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించిన బ్రహ్మాస్త్రం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్. ఇంట్లో చదువుల దీపం వెలిగితేనే ఆ కుటుంబంలో వెలుగులు వెదజల్లుతాయనేది వాస్తవం. దీన్ని గ్రహించినందువల్లే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారు. పూరి గుడిసెలో తల దాచుకునే పేద కుటుంబం కూడా ఫీజుల పథకం వల్లే తమ బిడ్డలను ఇంజనీర్లు, డాక్టర్లుగా చూడగలిగింది. గ్రామీణ పేద విద్యార్థులకు సైతం ట్రిపుల్ ఐటీల్లో చదివే భాగ్యం దక్కింది. అలాంటి అద్భుత పథకాన్ని సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రీయింబర్స్ బకాయిలు విడుదల చేయకుండా దెబ్బ తీసి నీరుగార్చారు. నీరుగార్చేసిన నిర్వాకం బాబుదే.. పేద వర్గాలకు చెందిన పలువురు ఉన్నత ఉద్యోగాలు, గౌరవనీయమైన వృత్తుల్లో స్థిరపడేలా తీర్చిదిద్దిన ఘనత వైఎస్సార్ తెచ్చిన ఫీజుల పథకానిదే. పేద కుటుంబాల జీవన విధానంలో సానుకూల మార్పులతోపాటు సమాజంలో మన్ననలు పొందే స్థితికి వైఎస్సార్ తీసుకురాగలిగారు. ఈ తరహా ఆలోచనలను సీఎం చంద్రబాబు ఏమాత్రం చేయలేకపోగా నిరుపేద విద్యార్థులకు వరం లాంటి ఫీజుల పథకాన్ని నీరుగార్చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తూ ర్యాంకుల ప్రాతిపదికను తెచ్చి సాంకేతిక, ఉన్నత చదువుల వైపు బీసీ విద్యార్థులు కన్నెత్తి చూడకుండా కట్టడి చేశారని ఆయా సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ‘2014 నుంచి ఇప్పటివరకు ఏటా ఫీజు రీయింబర్స్ బకాయిలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పూర్తి ఫీజులు చెల్లించనిదే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదంటూ కళాశాలలు యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాయి. ఫలితంగా వేలాది మంది బీసీ, ఇతర పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరలేకపోతున్నారు. హాస్టల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లను పెంచాలని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నా నాలుగున్నరేళ్లుగా ఆలకించలేదు’ అని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకుడు లెనిన్, ఎస్ఎఫ్ఐ నాయకుడు రాము పేర్కొన్నారు. బకాయిలు రూ.500 కోట్లు వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజుల పథకాన్ని వంద శాతం అమలు చేయాలని ఆయన మృతి చెందిన తర్వాత ధర్నా చేసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక మాత్రం నిర్వీర్యం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూ.500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. ఆధార్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చదువుకునేందుకు వేల మంది విద్యార్థులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. గీత కార్మికులకు కల్లే దిక్కంటున్న బాబు: ధర్మాన ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద కుటుంబాలకు చెందినవారు ఉన్నత ఉద్యోగాల్లో కొనసాగుతుంటే సమాజంలో కచ్చితంగా ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వారి జీవన విధానంలో అన్నివిధాలా మార్పు ఉంటుంది. ఈ తరహా మార్పును ఆశించే వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలను తెచ్చారు. చంద్రబాబు తీరు ఇందుకు పూర్తి భిన్నం. తాటి చెట్టు ఎక్కేవాడు తాటిచెట్టు ఎక్కుతూనే ఉండాలి. కల్లు గీతపైనే ఆధారపడి జీవించాలి. పోగులు నేసేవాడు పోగులు నేస్తుండాలి. డోలు, సన్నాయి, క్షురక వృత్తిదారులు ఆ పనులకే పరిమితం కావాలి. ఎదుగుబొదుగూ లేకా మగ్గిపోతుండాలి. ఆదరణ పేరుతో నాసిరకం వస్తువులు విదిలించడం తప్ప బీసీలకు చంద్రబాబు చేసింది ఏముంది?’ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. గత నాలుగున్నరేళ్లలో టీడీపీ తరపున రాజ్యసభకు పంపిన వారిలో ఎవరెవరు ఉన్నారో, ఇతర పదవుల నియామకాలను పరిశీలిస్తే బీసీల పట్ల చంద్రబాబు డొల్లతనం బట్టబయలవుతుందన్నారు. ఎన్నికల జపమే తప్ప... ఎన్నికల ముంగిట బీసీల జపం చేస్తున్న సీఎం చంద్రబాబు తన పాలనలో వారిని పట్టించుకోకపోగా తీవ్ర అవమానాలకు గురి చేశారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో బీసీలకిచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కదాన్ని పరిపూర్ణంగా అమలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. బీసీలను మోసగించేందుకు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు 120కిపైగా హామీలను ప్రకటించి అనంతరం వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీ కుటుంబాలకు ఐదేళ్లుగా ఎలాంటి న్యాయం జరగలేదు. మైనింగ్‌పై బీసీలకు హక్కులు కల్పిస్తామని చెప్పి ఇసుక, ఇటుకను కూడా టీడీపీ నేతల చేతుల్లోనే పెట్టారు. కుమ్మరులను కనీసం చెరువుల్లో మట్టిని కూడా తవ్వుకోనివ్వకుండా అమ్ముకొని సొమ్ము చేసుకున్న ఘనత టీడీపీ నేతలకే దక్కింది. బీసీలకు జగన్ హామీతో ఉలిక్కిపడ్డ బాబు బీసీలకిచ్చిన హామీలు అమలు చేయపోగా వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతుండటం గమనార్హం. పాదయాత్రలో పేదల కష్టాలను చూసి చలించిన వైఎస్ జగన్ బీసీ అధ్యయన వేదిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నివేదిక రాగానే బీసీ గర్జన నిర్వహించి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు హడావుడిగా జయహో బీసీ కార్యక్రమానికి తెర తీసినట్లు పేర్కొంటున్నారు. బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామని, అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించగా... జయహో బీసీ సదస్సులో చంద్రబాబు వాటినే ప్రకటించడంపై బీసీ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం కోసం వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటుబిల్లు ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లో అది చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆదరణ–2 పేరుతో ఆర్భాటం.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇన్నేళ్ల పాటు ఆదరణ పథకం గురించి పట్టించుకోకుండా కొద్ది నెలల క్రితమే ఆదరణ–2 పేరుతో రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఉప్పర్లు, వడ్డెరలు, కమ్మరులకు కంటితుడుపుగా కొద్ది పనిముట్లు ఇచ్చి వాటినే గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. ఈ పథకానికి 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 2 లక్షల మందికే పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం గమనార్హం. మత్స్యకారుల డీజిల్ సబ్సిడీకి ఎగనామం టీడీపీ సర్కారు మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టింది. వారు వేటాడిన చేపలకు మార్కెటింగ్ సౌకర్యం, కనీసం నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ సదుపాయం కూడా కల్పించలేదు. వేటకు వెళ్లి గల్లంతైన జాలర్ల కుటుంబాలకు ఏళ్లు గడిచినా పరిహారమివ్వలేదు. శ్రీకాకుళం జిల్లాలోనే 80 మందికిపైగా మత్స్యకారులు గల్లంతు కాగా ఇప్పటివరకూ పరిహారం అందలేదు. రాష్ట్రంలో తీరం ప్రాంతం విస్తారంగా ఉన్నా గుజరాత్ తదితర రాష్ట్రాలకు మత్స్యకారులు వలస వెళ్లి చిక్కుకుపోయి పాకిస్థాన్ జైళ్లలో మగ్గాల్సిన దుస్థితిని కల్పించారు. నేతన్నలకు వెయ్యి కోట్ల ప్రత్యేక నిధి ఏది? చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ అమలుకు నోచుకోలేదు. చేనేత కార్మికుల రుణాలన్నింటినీ మాఫీ చేసి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పిన బాబు నాలుగున్నరేళ్లలో ఆ ఊసే ఎత్తలేదు. చేనేతలకు ఇస్తున్న సబ్సిడీని రూ.600 నుంచి వెయ్యికి పెంచుతామని చెప్పి పట్టించుకోలేదు. ఆప్కో రిబేటు కింద చేనేతలకు చెల్లించాల్సిన సబ్సిడీ సొమ్మును ఇవ్వకుండా వారిని అప్పుల పాలు చేశారు. బీసీ వర్గాలకు చెందిన 11 ఫెడరేషన్లకు అరకొర నిధులిచ్చి సవాలక్ష ఆంక్షలు పెట్టడంతో రుణాలు అందక అల్లాడే దుస్థితి నెలకొంది. కాపు కార్పొరేషన్ తరహాలో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా బీసీలకు వ్యక్తిగత రుణాలు సులభంగా మంజూరు చేయాలని కోరుతున్నా ఆలకించడం లేదు. ఈ ఫెడరేషన్లను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో అనుసంధానం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆ వర్గం నేతలు వాపోతున్నారు. న్యాయస్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన జడ్జిలు నియమితులు కాకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు కొలిజీయంకు నివేదిక పంపిన చరిత్ర చంద్రబాబుదని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య వెల్లడించడాన్ని బట్టి బీసీల పట్ల బాబుకు ఏమాత్రం ప్రేమ ఉందో బోధపడుతోంది. కులాలకిచ్చిన హామీలు గాలికి.. రజకులు, గాండ్లను ఎస్సీలుగా మారుస్తామని, సగర్లను బీసీ–డీ నుంచి ఏలోకి, పూసల బీసీ–డి నుంచి ఏలోకి, ఆరెకటికలను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని, కురుబ–కురువలను బీసీ–డి నుంచి ఎస్టీలుగా మారుస్తామని, గవరలను బీసీ–డి నుంచి బీసీ–ఏగా, పద్మశాలీలను బీసీ–బీ నుంచి బీసీ–ఏలోకి, నాగ వంశస్తులను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి, మజ్జులను బీసీ–డీలోకి, విశాఖ కాపులను తూర్పు కాపులుగా గుర్తిస్తామని పలు కులాలకిచ్చిన హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు. మరోసారి అధికారమిస్తే ఇవన్నీ చేస్తామని కొత్తగా హామీ ఇవ్వడం పట్ల సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. బీసీలకు కనీస గుర్తింపు లేదు... రాష్ట్రంలో బీసీలు 52 శాతంతో 139 కులాల్లో 2.5 కోట్ల మందికిపైగా ఉన్నప్పటికీ వారికి కనీస ప్రాధాన్యం దక్కడం లేదని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచే వారి నైజాన్ని గుర్తించామన్నారు. చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదనేందుకు ఎంబీసీ కార్పొరేషన్ ఒక ఉదాహరణ అని జోగి రమేష్ పేర్కొన్నారు. 32 కులాలతో ఎంబీసీ కార్పొరేషన్ అని ప్రకటించి ఇంతవరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. పేదల అవసరాలపై జగన్‌కు స్పష్టమైన అవగాహన.. పేదల విషయంలో ఎంత దయార్ధ్ర హృదయుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి మెలిగారో అంతకన్నా మిన్నగా వైఎస్ జగన్ ఉంటారనేది తమ సంపూర్ణ విశ్వాసమని వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు జంగా కృష్ణమూర్తి, కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ‘పేదలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు అందరితో నీరాజనాలు అందుకున్నాయి. వాటిని మెరుగ్గా తీర్చిదిద్దడంతోపాటు ప్రజామోద పథకాల రూపకల్పనకు జగన్ శ్రీకారం చుట్టారు. పేదల ప్రతి సమస్యను ఆయన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. వాటన్నింటిపైనా అధ్యయనం చేయాలని కమిటీని నియమించి అన్ని ప్రాంతాలకు పంపారు. నివేదిక రూపొందించి సమీక్షించారు. పేదల అవసరాలపై ఆయన స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రజాశీర్వాదంతో అధికారంలోకి రాగానే వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తారు. తండ్రికి మించిన తనయుడని ప్రజల చేత జగన్ అనిపించుకుంటారు’ అని వారు చెప్పారు. మిగిలిన మంత్రులూ ఉత్సవ విగ్రహాలే మంత్రివర్గం, పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి కూడాచంద్రబాబు చేతిలో అవమానాలు తప్పలేదు. సొంత జిల్లాలో యనమల మాట చెల్లుబాటు కాకుండా చేశారు. అన్నవరం దేవస్థానం ఈఓగా యనమల తాను చెప్పిన వారిని నియమించుకోలేని పరిస్థితి ఉందంటే ఆయనకు ప్రభుత్వంలో ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న కళా వెంకట్రావు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మరో బీసీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నా అధికారాలన్నీ చంద్రబాబు, ఆయన తనయుడి చేతుల్లోనే ఉన్నాయి. బీసీ మంత్రి పితాని సత్యనారాయణ తన సొంత జిల్లాలోనే పని చేయించుకునే పరిస్థితి లేదు. బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో చాలామందిది ఇదే పరిస్థితి. కృష్ణా జిల్లాలోని 17 మార్కెట్ కమిటీ ఛైర్మన్లలో 14 చోట్ల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడాన్ని బట్టి బీసీలకు లెక్కలేనన్ని పదవులిచ్చామని చెప్పుకుంటున్న ప్రకటనలో వాస్తవం ఎంత ఉందో తేటతెల్లమవుతోంది. వైఎస్ హయాంలో బీసీలైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకట రమణ, కేపీ సారథి వంటి నేతలు ప్రధాన శాఖలు నిర్వహించి కీలకంగా వ్యవహరించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ గాలికి.. తాము అధికారంలోకి వస్తే బీసీల తలరాతలు మార్చేస్తామంటూ 2012లో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌ను గద్దెనెక్కాక చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఈ డిక్లరేషన్‌ను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఆ తరువాత ఆ సంగతే గాలికి వదిలేశారు. నాలుగున్నరేళ్లుగా దీన్ని పట్టించుకోకుండా తీరిగ్గా ఇప్పుడు జయహో బీసీ సదస్సులో బీసీ డిక్లరేషన్‌కు చట్టబద్ధత తెస్తామంటూ మరోసారి హామీ గుప్పించడం గమనార్హం. అధికారంలో ఉండగా ఏమాత్రం పట్టించుకోకుండా మరోసారి తమకు అవకాశం కల్పిస్తే అమలు చేస్తామంటూ మాయమాటలు చెప్పడం ఆయనకే చెల్లిందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు రూ.పది వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెడతామని ఘనంగా ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టకపోగా కేటాయింపులను సైతం ఖర్చు చేసిన పాపాన పోలేదు. బీసీ డిక్లరేషన్ ప్రకారం దామాషా పద్ధతిలో బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని చెప్పిన మాటను తుంగలో తొక్కి కనీసం అందులో సగం స్థానాలను కూడా ఇవ్వలేదు. వైఎస్ హయాంలోనే 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం... దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయించడంతోపాటు 2008 ఆగస్టు 29వ తేదీన అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించడం గమనార్హం. బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఉంటే రాజ్యాధికారం వారికి చేరువవుతుందని అప్పట్లోనే చెప్పారు. ఇక రజక, వడ్డెర, వాల్మీకి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని జాతీయ ఎస్టీ కమిషన్‌కు నివేదించాలని వైఎస్ మంత్రి వర్గం అప్పట్లోనే నిర్ణయం తీసుకుంది. అయితే ఒక కులాన్ని ఒక వర్గం నుంచి మరో వర్గంలోకి మార్చే అధికారం రాష్ట్రానికి లేనందున కేంద్రం పరిధిలోనే చేయాలని నిర్ణయించారు. ఆరె, ఆరెవాళ్లు, ఆరోళ్లు, బొందిలి, ఆరె మరాఠి, మరాఠ (బ్రాహ్మణేతర), అరకలిస్, సురభి నాటకాళ్లవాళ్లు, నీలి రాజన్నల, రాజన్నలు, బారె, బార్య, మరార్, తంబోలి, మాలి కులాలను బీసీల జాబితాలో చేర్చేందుకు బీసీ కమిషన్ చేసిన సిఫార్సులకు వైఎస్సార్ ప్రభుత్వం అప్పట్లోనే ఆమోదం తెలిపింది. రెవెన్యూ మంత్రికి తెలియకుండా భూ కేటాయింపులు! రాజకీయాల్లో చంద్రబాబు సమకాలీకుడు, పార్టీలో సీనియర్ నేత, బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధికారాలకు చంద్రబాబు కోత వేశారు. రెవెన్యూ శాఖలో ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ అధికారాలను ఆయనకు కాకుండా తన ఆధీనంలోని జీఏడీకి అప్పగించారు. భూముల కేటాయింపులను కూడా ఆ శాఖను పర్యవేక్షించే కేఈతో సంబంధం లేకుండా అప్పగించేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు తీసుకున్నా కేఈకి తెలియకుండా తనకు సన్నిహితుడైన మంత్రి నారాయణతో ఆ పని చక్కబెట్టుకున్నారు. భూములు కేటాయించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో రెవెన్యూమంత్రికి స్థానం లేకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబుదే. -
‘ఫిబ్రవరి 17న వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్’
సాక్షి, విజయవాడ : ఐదేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు నాయుడు చేసిందేమి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీసీల జీవితాలు దుర్భర పరిస్థితిలో ఉన్నాయన్నారు. బీసీలకు న్యాయం చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏడాదిన్నర క్రితమే బీసీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. బీసీల పరిస్థితిపై కమిటీ అధ్యయనం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాలతో సమావేశమై నివేదిక రూపొందించామని తెలిపారు. ఫిబ్రవరి 17న ఏలూరులో జరిగే బీసీ గర్జనలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. బీసీలు ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదు : జంగా ఐదేళ్లుగా బీసీలను గాలికొదిలేసిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోజయహో బీసీ అంటూ మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. చంద్రబాబు పాలనలో బీసీల జీవితాలు దుర్భర పరిస్థితికి వచ్చాయని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో బీసీలకు చంద్రబాబు చేసిందేమి లేదన్నారు. చంద్రబాబు బీసీలపై చేసే వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీసీలు ఎవరూ చంద్రబాబుని నమ్మడం లేదన్నారు. వైఎస్ జగన్ మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రమంతా పర్యటించి సమస్యలను గుర్తించిదని, వాటి పరిష్కారం కొరకు వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. బీసీ కులాలన్ని ఏకమై చంద్రబాబుకు బుద్ది చెప్పాలని కోరారు. -
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్
ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనేందుకు జిల్లాకు బుధవారం వచ్చిన ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు. బీసీల పరిస్థితిని అంచనా వేసేందుకు ఓ అధ్యయన కమిటీ వేశారనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సామాజిక వర్గాలు, కులాలు స్థితిగతులు, జీవన ప్రమాణాలు తదితర అంశాలపై ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు నాడు వైఎస్ హయాంలోనే న్యాయం జరిగిందనీ, మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బీసీ సామాజిక వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుందే తప్ప వారికి ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు బీసీలకోసం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని మండిపడ్డారు. ఇస్త్రీ పెట్టెలు, సైకిళ్లు అంటూ తాత్కాలిక ప్రయోజనాలే తప్ప బీసీ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు శాశ్వత పథకాలు అమలు చేయలేదని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే బీసీ సామాజిక వర్గాలకు విద్య, వైద్యం, రాజకీయంగా అన్ని రంగాల్లోను ప్రాధాన్యం కల్పించే దిశగా చర్యలు చేపడతారని వివరించారు. -
నమ్మించి మోసం చేశారు
ఒంగోలు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో బీసీలు అడుగడుగునా దగా పడ్డారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అందుకే బీసీల సంపూర్ణ అభివృద్ధిని కాంక్షిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టారు. బీసీలలో ఉన్న అన్ని కులాల స్థితిగతులను అధ్యయనం చేసి ఆ కులాలన్నింటినీ ఐక్యం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు’ అని వైఎస్సార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి వివరించారు. స్థానిక ఏ1 ఫంక్షన్‌హాలులో బుధవారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ బీసీ అధ్యయన వేదిక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కేవలం చంద్రబాబు ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసి బీసీలు దగాపడ్డారని పేర్కొన్నారు. 2012లోనే బీసీ డిక్లరేషన్‌లో 126 హామీలను పొందుపరిచి 2014 ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు.. వాటిని ఏమాత్రం అమలు చేయకపోవడంతో బీసీలంతా అభివృద్ధి, సంక్షేమానికి పూర్తిగా దూరమయ్యారని తెలిపారు. ఈ స్థితిలో బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలంటే ముందుగా వారి స్థితిగతులను అధ్యయనం చేయడమే మంచిదనే ఉద్దేశంతో బీసీల అధ్యయనానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. తాము ఒక పార్టీ తరఫున అధ్యయనం చేస్తున్నప్పటికీ పార్టీలకు అతీతంగా కదలివచ్చి అభిప్రాయాలు చెబుతున్న వారందరికీ కృష్ణమూర్తి కృతజ్ఞతలు ప్రకటించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ భావిస్తున్న దశలో ఎన్టీఆర్ ముందుకు వచ్చి బీసీలకు అండగా నిలిచారని, ఆయన ముఖ్యమంత్రి కాగానే బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషిచేశారని పేర్కొన్నారు. అదే నమ్మకంతో 2014లో చంద్రబాబుకు ఓట్లేసిన బీసీలు నేడు భగ్గుమంటున్నారని తెలిపారు. 100 సీట్లు, ఏటా పదివేల కోట్లు అన్న చంద్రబాబు.. నాలుగున్నర సంవత్సరాల పాలనలో కేవలం 14 నుంచి 15 వేల కోట్లు కూడా బీసీలకు కేటాయించలేదని, తద్వారా బడ్జెట్లో రూ.30 వేల కోట్ల మేర బీసీలకు అన్యాయం జరిగిందని జంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలని, చంద్రబాబులాగా ఆచరణ సాధ్యంకాని హామీలు కాకుండా కచ్చితంగా అమలు చేసే హామీలివ్వాలనే ఉద్దేశంతో జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. ఆ హామీలను బీసీ డిక్లరేషన్‌లో పొందుపరచాలని నిర్ణయించారని జంగా పేర్కొన్నారు. దానిలో భాగంగా బీసీ అధ్యయన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. బీసీలకు ఏం చేశారో చెప్పండి : టీడీపీని నిలదీసిన బాలినేని బీసీల కోసం నాలుగున్నరేళ్లుగా ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీని నిలదీశారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే, దానికి కూడా చంద్రబాబు తూట్లు పొడిచాడని మండిపడ్డారు. తాను 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉండి ఏనాడూ రుణాల దరఖాస్తులపై సంతకాలు చేయలేదని, అర్హులకు యథావిధిగా రుణాలు ఇచ్చేవారని తెలిపారు. కానీ, ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే సంతకాలు చేస్తేనే అర్హత ఉన్నా..లేకున్నా రుణం వస్తుందన్నారు. దీనివల్ల అర్హులకు కాకుండా టీడీపీ వర్గీయులకే రుణాలు అందుతున్నాయన్నారు. స్థానిక ఒగ్గులకుంటలో 3 ఎకరాల స్థలాన్ని తన హయాంలో రజకులకు కేటాయిస్తే.. దానిని రద్దు చేయాలని ప్రస్తుతం టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై అవసరమైతే కోర్టుకువెళ్లయినా రజకులకు అండగా ఉంటామని బాలినేని స్పష్టం చేశారు. బీసీలు పారిశ్రామికంగా ఎదగాలి : ఒంగోలు మాజీ ఎంపీ వైవీ బీసీల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా బీసీలకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌కు తాను సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నానన్నారు. రజకులను ఎస్సీలలో చేర్చాలని రెండేళ్ల క్రితం పార్లమెంట్లో కూడా మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీసీలపై చంద్రబాబు తీరు దుర్మార్గం : సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు న్యాయం కోసం కోర్టుకెళ్లిన నాయీ బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దుర్మార్గమని, దీన్ని ప్రతి బీసీ నేత గుర్తుంచుకోవాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బీసీ మహిళా కార్పొరేషన్, బీసీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక వనరులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి : మార్కాపురం ఎమ్మెల్యే జంకె బీసీలకు జరిగిన అన్యాయాలను గమనించి చేయిచేయి కలిపి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బీసీల సంక్షేమానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలన్నారు. వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ మాట్లాడుతూ బీసీలంతా ఐకమత్యంగా ఉంటే శాసనసభలో, శాసనమండలిలో తప్పక ప్రాధాన్యత ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సీటు ఎవరికి ఇచ్చినా గెలిపించుకునేందుకు ఐక్యం కావాలన్నారు. జగన్మోహన్రెడ్డికి బీసీలంటే ఎంతో మక్కువని పేర్కొంటూ పలు ఉదాహరణలు వివరించారు. మాజీ ఎంపీ చిమటా సాంబు మాట్లాడుతూ పార్టీల విషయానికొస్తే జిల్లాలో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది వైఎస్సార్ సీపీనే అని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సైతం బీసీలకే కట్టబెట్టేందుకు సిద్ధపడిన ఘనత వైఎస్సార్ సీపీకి ఉందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి ఆనాడు ఎన్టీఆర్ పట్ల చూపించిన విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల కనబరచాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు కటారి శంకర్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పేరుకు ఫెడరేషన్లు ఏర్పాటు చేసినా రుణాలు మాత్రం పొందలేని పరిస్థితి నెలకొందన్నారు. సవాలక్ష ఆంక్షలతో, అడుగడుగునా అధికార పార్టీ కార్యకర్తలు అడ్డం తగులుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కాలేజీ, హాస్టళ్లను వైఎస్సార్ ఏర్పాటు చేస్తే.. వాటిలో కనీసం విద్యార్థులు ఉండి చదువుకోలేని పరిస్థితులను టీడీపీ సృష్టించడం దారుణమన్నారు. సదస్సులో వైఎస్సార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య, తొండమల్ల పుల్లయ్య, వినుకొండ సుబ్బారావు, పలు సామాజిక వర్గాల నాయకులు పాల్గొని తమ డిమాండ్లను కమిటీ ముందు ఉంచారు. -
‘దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ డిక్లరేషన్’
సాక్షి, నెల్లూరు : దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ డిక్లరేషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారని ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. బీసీ డిక్లరేషన్, వెనుకబడిన తరగతులలోని అన్ని వర్గాల కుటుంబాలలో వెలుగులు నింపబోతుందని పేర్కొన్నారు. బీసీల పురోగతి కోసం వైఎస్ జగన్ సదస్సులు నిర్వహించి, వారి సూచనలు, సలహాలతో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించబోతున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేసి మోసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ విధంగా మోసం చేయకుండా బీసీ డిక్లరేషన్ అమలు చేసి జననేత చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు బీసీలకు ప్రకటించిన పదివేల కోట్ల ప్రత్యేక బడ్జేట్ అమలు చేశాడా అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అంతేకాక బీసీలకు సబ్‌ప్లాన్ ప్రవేశ పెడతానని చంద్రబాబు చెప్పి మోసం చేశారని వారు ధ్వజమెత్తారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు తప్ప.. వాళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. -
మంత్రుల గోబెల్స్ ప్రచారం..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రులు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బీసీలకు అన్యాయం జరిగిందనే గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనని.. బీసీలకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కులవృత్తి చేసుకునే వారిని నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని అన్నారు. బీసీలకు సమాజంలో గౌరవప్రదమైన జీవనం లేకుండా చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌దేనని కృష్ణమూర్తి గుర్తుచేశారు. బీసీ డిక్లరేషన్ ఏమైందంటూ ప్రశ్నించిన ఆయన దీనిపై యనమల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బడ్జెట్ నిధులు, సబ్ ప్లాన్‌కి చట్టబద్ధత, బీసీలకు ఇస్తామన్న నామినేటెడ్ పోస్టులు ఎక్కడంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తుంటే ఎందుకు నోరు మోదపడం లేదంటూ కాల్వ, యనమల తీరుపై విరుచుకుపడ్డారు. టీటీడీ చైర్మన్ పదవి యనమల వియ్యంకుడుకి ఇస్తే మొత్తం బీసీలకు న్యాయం చేసినట్లా అని ప్రశ్నించారు. టీడీపీ హయంలో బీసీలకు ఏం చేశారో చెప్పలేని మీరు.. బీసీలు టీడీపీ వెంటే ఉంటారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
బీసీలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు
-
‘బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం’
సాక్షి, విజయవాడ: బీసీలకు సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్కహామీని చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివారని, బీసీల అభ్యున్నతికి వైఎస్ జగన్ పాటుపడతారని చెప్పారు. బీసీలోని అన్ని కులాలకు జగన్ న్యాయం చేస్తారని అన్నారు. అన్ని బీసీ వర్గాలకు న్యాయం చేసేలా వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్ ఉంటుందని తెలిపారు. వైఎస్ జగన్ పాదయాత్ర బీసీ వర్గాలకు భరోసాయాత్రగా సాగుతోందన్నారు. బీసీ డిక్లరేషన్ ఎలా ఉండాలనే దానిపై బీసీ మేధావులు, ప్రజాసంఘాలతో తమ పార్టీ బీసీ అధ్యయన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని.. అందరి అభిప్రాయాలు సేకరించి నివేదికను జగన్‌ను అందజేస్తామని తెలిపారు. -
బీసీ సంక్షేమ సంఘం ‘బీసీ డిక్లరేషన్’
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన కులాల సమగ్రాభివృద్ధికి బీసీ ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ అంశాల్లో జనాభా ప్రాతిపాదికన ప్రాధాన్యత కల్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొంది. బీసీ ప్రణాళిక కోసం ప్రభు త్వం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలతో బీసీ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 రోజులుగా వివిధ అంశాలపై చర్చలు జరుపుతూ ప్రణాళిక తయారీలో కమిటీ బీజీ అయింది. ఈ నేపథ్యంలో బీసీ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం సరికొత్తగా నివేదిక రూపొందించింది. బీసీల అభివృద్ధికి రాజకీయ పాలసీ అవసరమని బీసీ సంక్షేమ సంఘం పేర్కొంది. 22 అంశాలతో రాజకీయ పాలసీని తయారు చేసింది. బీసీ సంక్షేమ సంఘంతోపాటు అనుబంధ సంఘాల ప్రతినిధు లు, మేధావుల ఆలోచనలతో 68 అంశాలతో కూడి న నివేదిక రూపొందించినట్లు తెలిపారు. ఈ నివేదికను రెండ్రోజుల్లో సీఎం కేసీఆర్‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రూపొందించిన నివేదికలోని పలు అంశాలు ఇవీ... రాజకీయ విధానం: రూ.20 వేల కోట్లతో బీసీ ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేయాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అన్ని పార్టీలు 50% టిక్కెట్లు ఇవ్వాలి. విద్య, ఉద్యోగాల్లో 52% రిజర్వేషన్ల అమలుతోపాటు క్రీమీలేయర్ తొలగించాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 32 నుంచి 52 శాతానికి పెంచాలి. నామినేటెడ్ పోస్టుల్లోనూ 50% కేటాయించాలి. ప్రభుత్వ శాఖల్లోని లూప్‌లైన్ పోస్టులు కాకుండా ఉన్నత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి, గురుకులాల కార్యదర్శి పోస్టులు బీసీలకే కేటాయించాలి. ఇందులోనే పారిశ్రామిక పాలసీని ప్రత్యేకంగా రూపొందించాలి. కాంట్రాక్టుల్లో డిపాజిట్ లేకుండా 50 శాతం కోటా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టు తీసుకురావాలి. తొలగించిన 26 కులాలను తిరిగి బీసీల్లో కలపాలి. ఆర్థిక విధానం: బీసీ ఆర్థిక విధానాన్ని 23 అంశాలతో రూపొందించారు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.5 వేల కోట్లు కేటాయించాలి. కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి ఖర్చు చేయాలి. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్లు పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ఆరె కటిక, మున్నూరుకాపు, పెరిక ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలి. అన్ని ఫెడరేషన్లకు పాలక మండళ్లను సకాలంలో నియమించాలి. ఫెడరేషన్ల ద్వారా గ్రూపు రుణాల స్థానంలో వ్యక్తిగత రుణాలే ఇవ్వాలి. ఉద్యోగ, ఉపాధి పాలసీ: ఇందులో ఆరు అంశాలను పొందుపర్చారు. పూర్తి వసతులతో జిల్లాకో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలి. సివిల్స్‌తోపాటు గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు 10 బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలి. కాలేజీ విద్యార్థులకు స్టడీ సర్కిళ్ల ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్, కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యా పాలసీ: ఇందులో 17 అంశాలను పొందుపర్చారు. బీసీ విద్యార్థులకు ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు విడుదల చేయాలి. ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీల్లో చదివే బీసీ విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి. అడ్మిషన్ల సమస్య లేకుండా అదనంగా 80 కాలేజీ హాస్టళ్లను తెరవాలి. ప్రతి నియోజకవర్గంలో బాల, బాలికల గురుకులాలు ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది 119 ఏర్పాటు చేసినప్పటికీ జనాభా ప్రాతిపదికన అవి చాలకపోవడంతో వచ్చే ఏడాది మరో 119 గురుకులాలు తెరవాలి. పూర్తిస్థాయిలో బోధన సిబ్బందిని నియమించి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. పోటీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీ విద్యార్థుల వయస్సును సమం చేస్తూ అవకాశం కల్పించాలి. -
బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో బీసీలకు సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్సార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ అధ్యయన కమిటీ సభ్యుల మొదటి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ... బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, గ్రామాల్లో బీసీలను బానిసలుగా మార్చేసారని విమర్శించారు. బీసీలకు టీడీపీ అన్నిరకాలుగా అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో బీసీల సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. బీసీలకు న్యాయం చెయ్యాలన్న వైఎస్ జగన్ ఆదేశాలతో అధ్యయన కమిటీ రాష్ట్ర పర్యటనకు వెళుతోందని వెల్లడించారు. అధ్యయనం అనంతరం అధినేత జగన్‌కు నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు. నివేదిక ఆధారంగా బీసీ గర్జనలో వైఎస్ జగన్ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. -
కేసీఆర్‌ది ఓట్ల రాజకీయం: వీహెచ్
హైదరాబాద్ : బీసీ డిక్లరేషన్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ సెంటిమెంట్ వర్క్ ఔట్ కాదని సీఎంకు తెలిసిందని అందుకే బీసీ డిక్లరేషన్ అందుకున్నారని అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేసీఆర్ చేతులు దులుపుకుంటారని ఆరోపించారు. 50 శాతం రిజర్వేషన్లు మించారదని కేంద్రం చెబుతోందని తెలిపారు. క్రిమిలేయర్ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేసీఆర్ తన సామాజిక వర్గానికే పెద్ద పీట వేసుకున్నారని విమర్శించారు. కేబినేట్లో నలుగురు మంత్రులు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారని వెల్లడించారు. 2019 ఎన్నికల కోసమే కేసీఆర్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏమీ లేదని, కేసీఆర్ మాటలను ప్రజలెవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్‌కి బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు. -
వాటాలో సగం దక్కాల్సిందే..!
హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సగ భాగం వాటా దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాలు–బీసీ కుల సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బీసీ డిమాండ్లపై చర్చించి నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 65 బీసీ కుల సంఘాల అధ్యక్షులు, 20 బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ర్యాంకుతో నిమిత్తం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇతర సామాజిక వర్గాలతో సమానంగా మంజూరు చేయాలని, బ్యాంకులతో నిమిత్తం లేకుండా వంద శాతం సబ్సిడీతో ప్రతి బీసీ కుటుంబానికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించడానికి వెంటనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో బీసీ భవన్‌కు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించి నిర్మించాలని, బీసీ ఫెడరేషన్లను కొనసాగించి ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. మార్చిలో బహిరంగ సభ బీసీల శక్తిని ప్రదర్శించడానికి మార్చిలో పది లక్షల మందితో హైదరాబాద్‌లో బహిరంగ సభను నిర్వహించాలని సమావేశం తీర్మానించినట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మొల్ల జయంతి, భగీర«థ మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని, మొల్ల, సర్దార్ సర్వాయి పాపన్న, భగీరథ మహర్షి, జ్యోతిబాపూలే, దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నేతలు గణేష్‌చారి, ఏఎల్ మల్లయ్య, అయిలి వెంకన్న, గోగికార్ సుధాకర్, బంగారు నర్సింహ్మ సగర, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వాటాలో సగం దక్కాల్సిందే..!
హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సగ భాగం వాటా దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాలు–బీసీ కుల సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బీసీ డిమాండ్లపై చర్చించి నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 65 బీసీ కుల సంఘాల అధ్యక్షులు, 20 బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ర్యాంకుతో నిమిత్తం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇతర సామాజిక వర్గాలతో సమానంగా మంజూరు చేయాలని, బ్యాంకులతో నిమిత్తం లేకుండా వంద శాతం సబ్సిడీతో ప్రతి బీసీ కుటుంబానికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించడానికి వెంటనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో బీసీ భవన్‌కు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించి నిర్మించాలని, బీసీ ఫెడరేషన్లను కొనసాగించి ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. మార్చిలో బహిరంగ సభ బీసీల శక్తిని ప్రదర్శించడానికి మార్చిలో పది లక్షల మందితో హైదరాబాద్‌లో బహిరంగ సభను నిర్వహించాలని సమావేశం తీర్మానించినట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మొల్ల జయంతి, భగీర«థ మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని, మొల్ల, సర్దార్ సర్వాయి పాపన్న, భగీరథ మహర్షి, జ్యోతిబాపూలే, దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నేతలు గణేష్‌చారి, ఏఎల్ మల్లయ్య, అయిలి వెంకన్న, గోగికార్ సుధాకర్, బంగారు నర్సింహ్మ సగర, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం
(ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరు నవ్వులు చూడటమే నా ధ్యేయం. పాదయాత్ర పూర్తయ్యాక బీసీగర్జన చేపట్టి అక్కడే బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం. ప్రతికులానికి ఏం చేస్తా మో తెలియజేస్తాం. మనం అధికారంలోకి వచ్చాక బీసీల్ని అన్నివిధాలా ఆదుకుంటాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ఏడోరోజు సోమవారం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో కాన గూడూరులో బీసీ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ వారి విజ్ఞప్తులు, సలహాలు స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పేరుకే బాబుకు బీసీలపై ప్రేమ.. బీసీల అభ్యున్నతికి మీరందరూ సలహాలు, సూచనలు ఇవ్వండి. మనందరి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిపాలనకు భిన్నంగా ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వులు చూడటమే లక్ష్యంగా పనిచేస్తా. వైఎస్సార్ సువర్ణయుగాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చు కుంటే.. నాన్నగారి పాలనలో గొర్రెలు, మేకల చెవులకు కూపన్లు కట్టేవాళ్లు. ఏ గొర్రె చనిపోయినా పూర్తి ఇన్సూరెన్స్ వచ్చేది. కానీ, బాబు హయాంలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా? అని అడుగుతున్నా. (లేదు లేదు అంటూ ప్రజల నుంచి సమా ధానం వినిపించింది). ఈ నాలుగేళ్లలో ఒక్క ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేకపోయారు. జీవ నోపాధి కోల్పోయిన వారి జీవితాల గురించి ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చేయట్లేదు. పేరుకు మాత్రమే బాబుకు బీసీల మీద ప్రేమ. నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలిచ్చేసి బీసీల మీద ప్రేమ ఇంతే అంటున్నారు. ఫీజు ఎంతైనా సరే.. మేము చెల్లిస్తాం బీసీలపై ప్రేమ అంటే ఏంటో వైఎస్సార్ చూపించారు. ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే.. ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ లాంటి పెద్ద చదువులు చదవాలని నాన్నగారు కలలుకన్నారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేశారు. కానీ, ఇప్పుడు కాలేజీ ఫీజులు లక్ష దాటితే.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ. 35వేలు మాత్రమే చెల్లిస్తోంది. అది కూడా ఏడాది తర్వాత చెల్లిస్తే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఫీజులిమ్మంటే ‘తల్లిదండ్రులు ఇళ్లు అమ్ముకుని కట్టుకుంటారులే’అని చంద్రబాబు చులకనగా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి. పేదరికం పోవాలంటే ప్రతి బీసీ కుటుంబంలో పిల్లలు పెద్ద చదువులు చదవాలి. ఫీజు ఎంతైనా సరే ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ లాంటి పెద్ద చదువులు నేను చదివిస్తా. అంతేకాదు, పిల్లల భోజన, వసతి సదుపాయాలకోసం అదనంగా రూ. 20 వేలు ఇస్తాం. ఇద్దరేసి పిల్లల్ని బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు అమ్మఒడి పథకం కింద రూ.15వేలు అందజేస్తాం. ఇది ఒక్కటే కాదు... ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 45 ఏళ్లకే పింఛను ఇవ్వబోతున్నాం. బీసీ కమిటీ... బీసీ గర్జన... ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడటమే నా లక్ష్యం. అందుకోసం మరో రెండుమూడు రోజుల్లో బీసీ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ ప్రతీ నియోజకవర్గంలో పర్యటించి ప్రజల నుంచి సలహాలు స్వీకరించి నివేదిక ఇస్తుంది. పాదయాత్ర పూర్తయ్యాక ఆ నివేదిక ఆధారంగా బీసీ గర్జన ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం. అక్కడే ప్రతి కులానికి ఏం చేయబోతున్నామో స్పష్టంగా చెప్తాం. నా మనస్సులో ఇవాళ్టికి ప్రధానంగా మూడు కార్యక్రమాలు ఉన్నాయి. పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేయడంతోపాటు అదనంగా మరో రూ. 20 వేలు ఇవ్వడం.. అమ్మ ఒడి పథకం, 45 ఏళ్లకే పింఛన్. ఇంకా ఏమైనా ఉంటే దారిపొడవునా సూచనలు, సలహాలు ఇవ్వండి తప్పకుండా తీసుకుంటా. -
బీసీలందరినీ ఏకం చేద్దాం
-
బీసీలందరినీ ఏకం చేద్దాం
చంద్రబాబు దృష్టిలో బీసీలకు మేలు చేయడమంటే వారికి ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇవ్వడమే. ఆయన అన్ని కులాల వారిని మోసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి బీసీ విద్యార్థి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో సంతోషంగా ఉన్నత చదువులు చదువుకున్నాడు. బీసీలకు వైఎస్ చేసినంత మేలు ఎవ్వరూ చేయలేదు. ఆ విషయాన్ని మనం బీసీలకు వివరించాలి. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయకుండా, అన్ని కులాల వారిని దారుణంగా వంచించిన చంద్రబాబు.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని మోసం చేశారు. ఈ మోసానికి వ్యతిరేకంగా బీసీలందరూ ఏకమై తమ సత్తా చాటాలి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపినిచ్చారు. బీసీలకు న్యాయం జరిగిందంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లోనేనని, ఆ రోజుల్లో బీసీ విద్యార్థులందరూ వారికిష్టం వచ్చిన కోర్సులో చేరి సంతృప్తిగా చదువుకున్నారని చెప్పారు. ఫీజురీయింబర్స్ మెంట్ పథకం కింద ప్రభుత్వమే వారి ఫీజును భరించిందని తెలిపారు. బీసీ నేతలు ఈ విషయాలను ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని బీసీ వర్గాలకు వివరించి వారిని చైతన్య పరచాలని చెప్పారు. సోమవారం తొలిసారిగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ బీసీ ముఖ్య నేతల సమావేశంలో 13 జిల్లాల నుంచి వచ్చిన వారితో వైఎస్ జగన్ మూడు గంటల పాటు ముఖాముఖి మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు, ఏడు నెలల పాటు నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి వైఎస్ హయాంలో జరిగిన మేలును, చంద్రబాబు చేసిన మోసాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే అభిప్రాయాలు, బీసీల అభ్యున్నతికి ఏం చేస్తే బాగుంటుందో ఆ అంశాలన్నింటినీ క్రోడీకరిం చాలని, ఆ తర్వాత పార్టీ తరఫున ‘బీసీ గర్జన’ నిర్వహిస్తామని వెల్లడించారు. అందులో ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటిస్తామని, అందులో ఏదైతే చెబుతామో అవే అంశాలు వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మాదిరిగా మాటల్లో చెప్పేదొకటి, చేసేది మరొకటిగా ఉండబోదన్నారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎన్నికల నాటికి ఇప్పుడు ప్రకటించే మేనిఫెస్టోను చూపి.. వాటిని అమలు చేశామని బీసీలకు చెబుతామని చెప్పారు. బీసీల పట్ల చంద్రబాబు ప్రదర్శిస్తున్న వివక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి తెలియజెప్పి వారందరినీ ఒక తాటిపైకి తీసుకు రావాలని కోరారు. జగన్ తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే.. బీసీ వర్గాల్లో మనోధైర్యం నింపుదాం ‘‘బీసీ వర్గాల ప్రజలతో మమేకమై వారి నుంచే వివరాలను తీసుకోవడంతో పాటు చంద్రబాబు చేసిన అన్యాయాలను వివరించాలి. మనం అధికారంలోకి వస్తే ఏవిధంగా బీసీల జీవితాలు బాగు పడతాయో చెప్పాలి. వారి నుంచి కూడా సలహాలు తీసుకోవాలి. నా పాదయాత్ర పూర్తయ్యే సమయానికి అందరం కలసి బీసీ గర్జన నిర్వహిద్దాం. ఆ గర్జనలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ప్రతి కులానికి ప్రాతినిధ్యం కల్పిద్దాం. చంద్రబాబు మాదిరిగా బీసీ డిక్లరేషన్ చేసి మోసం చేసినట్లుగా మనం చేయం. అందుకు భిన్నంగా మనం ప్రకటించే డిక్లరేషన్‌ను అమలు చేద్దాం. ఈ క్రమంలోనే మీ (బీసీ నేతలు) అందరినీ పిలిచి ఇప్పుడు సూచనలు, సలహాలు అడుగుతున్నాను. పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలందరూ కలిసి కమిటీగా ఏర్పాటై.. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామాన్ని పర్యటించేందుకు వీలుగా ఒక కార్యాచరణను రూపొందిస్తారు. ఇలా గ్రామాలకు వెళ్లినప్పుడు బీసీ వర్గాల్లో మనోధైర్యం నింపాలి. చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను వివరిస్తూ.. ఏరకంగా ఆయన బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చేసుకుని వాడుకున్నాడో.. రిజర్వేషన్, గర్జన అంటూ ఎలా మోసం చేశాడో వివరించాలి. 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నారు తాను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికి నాలుగు బడ్జెట్లు పూర్తయినా మాట నిలబెట్టుకున్నది లేదు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు సబ్‌ప్లాన్‌కు ఇవ్వాల్సి ఉండగా 2014 – 15లో రూ.2,054 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015 – 16లో రూ.3,195 కోట్లు కేటాయించి ఇందులో కేవలం రూ 2,595 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 2016 – 17లో రూ.5,103 కోట్లు కేటాయించి రూ.4,335 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ రకంగా చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిందేమిటో, చేస్తున్నదేమిటో బీసీలకు వివరించాలి. మోసం చేశాడనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ సీఎం కాక మునుపు బీసీలు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉండేవారో అందరికీ తెలుసు. ఒక బీసీ విద్యార్థి ప్రస్తుతం ఇంజనీరింగ్ చదవాలంటే లక్ష రూపాయలపైనే అవుతుంది. ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇస్తున్నది కేవలం రూ.35 వేలు మాత్రమే. అది కూడా ఏడాది తర్వాత ఇస్తున్నారు. మిగిలిన రూ.65 వేలు ఇల్లమ్మి కట్టుకోమని నిర్దాక్షిణ్యంగా మాట్లాడు తున్నారు. వైఎస్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్లే పేదలు పెద్ద చదువులు చదువుకున్నారు. ఆయన మృతి చెందిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. నేడు ధర్మవరానికి జగన్ అనంతపురం: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. దాదాపు 37 రోజులుగా అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారమిక్కడికి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో బయల్దేరి.. రోడ్డుమార్గంలో ఆయన ధర్మవరం చేరుకుంటారు. మార్గంమధ్యలో రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండల పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను జగన్ పరిశీలిస్తారు. ఈ వివరాలను రాజంపేట ఎంపీ, పార్టీ జిల్లా ఇన్చార్జి మిథున్‌రెడ్డి సోమవారం అనంతపురంలో మీడియాకు వెల్లడించారు. చేనేత కార్మికులను తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్లో చంద్రబాబు మేనిఫెస్టో మాయం జగనన్న వస్తేనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని అందరికీ చెప్పండి. వైఎస్ పథకాలను గుర్తు చేస్తూ ముందుకెళ్లండి. వైఎస్ హయాంలో దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కడితే రాష్ట్రంలో 13 జిల్లాల్లోనే 24 లక్షల ఇళ్లు కట్టారని గుర్తు చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టి చరిత్ర సృష్టించారు. ఈ వాళ ఇçళ్ల పరిస్థితి ఏమిటో ఒకసారి వివరించండి. ఆ నాడు పేదలు ఆరోగ్య శ్రీ భరోసాతో వైద్యం కోసం ఆందోళన లేకుండా ఆసుపత్రికి ఎలా వెళ్లారో గుర్తు చేయండి. అప్పట్లో 108, 104 పథకాలు ఎలా కొనసాగాయో.. నేడు వాటి పరిస్థితి ఏమిటో చెప్పాలి. రాజన్న రాజ్యం మళ్లీ వస్తేనే అవన్నీ అందుతాయని గుర్తు చేయండి. చంద్రబాబు మేనిఫెస్టోలో ఏమేమో చేస్తానని చెప్పి కులాలను ఏవిధంగా వాడుకున్నారో గుర్తు చేయండి. ప్రస్తుతం చంద్రబాబు మేనిఫెస్టో కంప్యూటర్లో (ఆ పార్టీ వెబ్సైట్లో) కన్పించడం లేదు. తన మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయి కాబట్టే మేనిఫెస్టోను కంప్యూటర్లో పెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. హామీ అమలు సాధ్యమవుతుందో కాదో కూడా చూడకుండా ఎలా బీసీలను వంచించారో కూడా చెప్పండి. ఉదాహరణకు రజక, కురుబ, కురుమ తదితర కులాలను ఎస్సీ.. బోయ/వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పి, ఆ తర్వాత కేవలం రెకమెండ్ చేసి కేంద్రానికి పంపుతానంటున్నాడు. రజకులు 15 రాష్ట్రాలో ఎస్సీల జాబితాలో ఉన్నారు. మన రాష్ట్రంలో మాత్రం ఎస్సీలుగా రెకమెండ్ చేస్తానన్నారు. ఇలా గాండ్ల, ఉప్పర, సగర చివరకు అన్ని కులాలనూ వదల్లేదు. మార్పు కోసం ఊరూరూ తిరగండి ప్రతి చేనేత కుటుంబానికి రుణాలు మాఫీ అని, ప్రతి కుటుంబానికి రూ.1.50 లక్షలతో ఇల్లు నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు రుణాలు మాఫీ కాక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రతి ఊరికి తీసుకెళ్లి ఆయన చేసిన మోసాలను, అబద్ధాలు, అన్యాయాలను వివరించండి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని మోసపూరితంగా మాట్లాడితే అతని కాలర్ పట్టుకొనే పరిస్థితి వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుంటుందని చెప్పండి. ఈ మార్పునకు శ్రీకారం చుట్టాలని మీరంతా ప్రతి ఊరికి వెళ్లండి. ఆ తర్వాత మనం నిర్వహించే బీసీ గర్జనలో ప్రకటించే డిక్లరేషన్ తర్వాత రూపొందించే మన మేనిఫెస్టో బాబు లాగా ఉతుత్తి మేనిఫెస్టో కానేకాదు అని చెప్పండి. పాదయాత్ర జరుగుతున్నప్పు డు గ్రామాలకు వెళ్లి బడుగు, బలహీన వర్గాల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపండి. మనం ఉన్నామని వారికి భరోసా ఇవ్వండి. వైఎస్ చేసిన మంచిని గుర్తు చేస్తూ చైతన్యవం తులను చేయండి. ఐదేళ్ల తర్వాత మన పరిపాలన చూసి ప్రతి అంశాన్నీ చేయగలిగామని చెప్పే దిశగా మీరంద రూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. అందరూ సవ్యసాచులై ముందుకెళ్లాలని కోరుతున్నా’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఈ సమావేశం వేదికపై పార్టీ బీసీ విభా గం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కె.పార్థసా రథి, పిల్లి సుభాష్ చంద్రబోస్, తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు పి.అనిల్ కుమార్ యాదవ్, బూడి ముత్యా లనాయుడు, గుమ్మనూరు జయరాం ఆసీనులయ్యారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కృష్ణా జిల్లా ఇన్చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
బీసీ డిక్లరేషన్‌పై నేడు వైఎస్సార్సీపీ నేతల చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘బీసీ డిక్లరేషన్’ను రూపొందించబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలోని బీసీల స్థితిగతులు, వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో బీసీ ముఖ్య నేతల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటయ్యాక తొలిసారిగా విస్తృతస్థాయిలో జరుగుతున్న ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి పార్టీకి చెందిన బీసీ ముఖ్య నేతల్ని ఆహ్వానించారు. ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశమున్న ఈ సమావేశంలో వైఎస్ జగన్ నేతలందరి అభిప్రాయాలు, సూచనలను తీసుకుంటారు. ఆయా జిల్లాల్లో స్థానికంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, బీసీల విషయంలో పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరు, ఇలా అనేక అంశాలపై కూలంకుషంగా చర్చిస్తారని సమాచారం. సమావేశంలో నేతలు వ్యక్తపరిచే అభిప్రాయాలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిని క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో మరిన్ని దఫాలు సంప్రదింపులు జరిపి.. సమగ్రంగా రూపకల్పన చేశాక తగిన సమయంలో పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్’ను చేస్తారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్‌తోపాటుగా పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా పాల్గొంటున్నారు. -
బీసీ డిక్లరేషన్ అమలుచేయాలి
నెల్లూరు(బృందావనం): రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ‘బీసీ డిక్లరేషన్’ అమలు చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం అధికారంలో లేని సమయంలో టీడీపీ బీసీలకు డిక్లరేషన్‌తోపాటు 120 వాగ్దానాలు చేసిందన్నారు. అయితే అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని పాలకులు మరిచిపోయారన్నారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్, నామినేటెడ్ పోస్టుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, ఇప్పుడున్న 25 శాతం బీసీ రిజర్వేషన్లును 33 శాతానికి పెంచుతామని, స్థానిక సంస్థల్లో బీసీలకు ఇప్పడున్న 34 శాతం రిజర్వేషన్లును 50 శాతానికి పెంచుతామని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పిస్తామని చెప్పినట్లు డాక్టర్ గంగాధర్ వివరించారు. బీసీ డిక్లరేషన్ డిమాండ్ చేస్తూ డిసెంబరు మొదటివారంలో రాష్ట్ర రాజధాని విజయవాడలో 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. 2017జనవరి మూడోవారంలో విజయవాడలో రెండులక్షల మందితో బీసీ ప్రభంజనమ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకట్ల రఘురామ్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కల్యాణ్‌కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట కె.మురళీమోహన్, రాజు పాల్గొన్నారు. -
బీసీలపై చిన్నచూపు
కర్నూలు(అర్బన్): ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బీసీలను పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. గత ఏడాది కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బీసీల ఆర్థిక చేయూతకు మంగళం పాడింది. ఈ క్రమంలోనే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇంతవరకు బీసీ కార్పొరేషన్లకు నయాపైసా విదల్చ లేదు సరికదా, కనీసం మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు ఏడాదిన్నర కాలంగా బీసీలు ఎదురుచూస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1627 మంది జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చినా వారికి ఇంతవరకు సబ్సిడీ విడుదల కాకపోవడం గమనార్హం. ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు మార్గదర్శకాలను విడుదలచేసిన ప్రభుత్వం బీసీ రుణాలపై ఎలాంటి మార్గదర్శకాలు వెల్లడించలేదు. దీనిపై బీసీ వర్గాలు ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది విడుదల కాని సబ్సిడీ రూ.826.918 లక్షలు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల వారికి మార్జిన్ మనీ పథకం కింద 3968 మందికి 1085.30 లక్షలు, మున్సిపల్ ప్రాంతాల వారికి రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద 893 మందికి రూ.243.45 లక్షలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించి దరఖాస్తులను స్వీకరించారు. వీరిలో 1834 మంది గ్రామీణ ప్రాంతాల వారికి రూ.655.458 లక్షలు, 359 మంది మున్సిపల్ ప్రాంతాల వారికి రూ.171.450 లక్షలు సబ్సిడీ విడుదల చేసేందుకు ప్రొసీడింగ్స్‌ను అందించారు. ప్రొసీడింగ్స్ అందుకున్న వారిలో 1402 మంది గ్రామీణ ప్రాంతాల వారు, 225 మంది మున్సిపల్ ప్రాంతాల వారు జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతా నెంబర్లను అప్పట్లోనే అందించారు. అయితే వారికి నేటి వరకు నయాపైసా సబ్సిడీ విడుదల కాలేదు. పేరు మారినా ఫలితం సున్నా.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ అభ్యుదయ యోజన పథకం పేరులో రాజీవ్‌ను తీసివేసి బీసీ అభ్యుదయ యోజనగా మార్చినా, బీసీ కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ఈ పథకం కింద 1211 మంది బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు 50 శాతం సబ్సిడీతో 3.3250 కోట్లు, 8193 మంది గ్రామీణ ప్రాంతాల వారికి రూ.22. 5036 కోట్లు సబ్సిడీ అందించేందుకు వార్షిక ప్రణాళికలు రూపొందించారు. ఇంతవరకు మార్గదర్శకాలు మాత్రం విడుదల చేయకపోవడం బీసీ వర్గాలను కలచివేస్తోంది. రుణం కోసం ఏడాదిగా తిరుగుత్నా టైలరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం గత ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నాను. ఇంతవరకు రుణం అందలేదు. ఇప్పటికైనా రుణాలను విడుదల చేస్తే నాలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుంది. - టీ.శేఖర్, చిత్తారివీధి, కర్నూలు కొత్త రుణాలు ఎప్పుడు ఇస్తారో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలపై నేటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అసలు ఈ ఏడాది రుణాలు ఇస్తారో, లేదో ప్రభుత్వం తెలియజేయూలి. రుణాలు ఇస్తే పేదలకు సాపడినట్లవుతుంది. - ఈ.విజయ్‌గౌడ్, కుమ్మరవీధి, కర్నూలు -
బీసీ సీఎం కృష్ణయ్యే!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్న ఆర్. కృష్ణయ్యను తెలంగాణ రాష్ట్రానికి సీఎం చేస్తేనే బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు నేతలు కోరారు. బీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు, కుల సంఘాల నేతల విస్తృతస్థాయి సమావేశం గురువారం నగరంలోని ఓ హోట ల్లో జరిగింది. బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ కె. ఆల్మెన్ రాజు అధ్యక్షతన ఈ సమావేశంలో, టీడీపీ పరిస్థితి దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్రంలో కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే 60 నుంచి 80 శాతం బీసీల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని నేతలు వ్యాఖ్యానించారు. అలాగే బీసీ సంఘాల నాయకులను అసెంబ్లీకి పంపాలని సూచించారు. ఆర్.కృష్ణయ్య సీఎం అయితే సామాజిక తెలంగాణ సాధించినట్లవుతుందని పేర్కొన్నారు. సీమాంధ్రలో కూడా చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవిని బీసీలకే ఇవ్వాలని ఆ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు డిమాండ్ చేశారు. మిగతా పార్టీలు కూడా బీసీలకే సీఎం పదవి ఇస్తామని ప్రకటన చేస్తే వారికే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇందుకోసం అన్ని పార్టీలకు రెండు రోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లేదంటే టీడీపీకి బహిరంగంగా మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. టీడీపీ ఓడిపోయే పార్టీ ఎలా అవుతుంది? : కృష్ణయ్య బీసీని సీఎం చేస్తానని చంద్రబాబు చెప్పగానే, ఓడిపోయే పార్టీ టీడీపీ.. బీసీని సీఎం చేస్తానంటోందని విమర్శలు చేయడం వారిని కించపరచడమేనని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. తెలంగాణలో 60 నుంచి 80 శాతం మంది ఉన్న బీసీలు ఓడిపోతారా అని ప్రశ్నించారు. విలువలు లేని రాజకీయాలు ఇక ముందు సాగవని అన్నారు. తెలంగాణ దొరలు బీసీలు సీఎం కావడాన్ని తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఈ వాదన తెస్తున్నారని విమర్శించారు. రాజ్యసభలో ఎంపీగా గెలవడానికి అవసరమైన బలం లేకపోయినా టీఆర్ఎస్ బీసీ అభ్యర్థి కేశవరావును నిలబెడితే గెలవలేదా అని సోదాహరణంగా చెప్పుకొచ్చారు. కాగా మీ డిమాండ్ బీసీ వ్యక్తి సీఎం కావాలనా..? లేక కృష్ణయ్య సీఎం కావాలనా? అని విలేకరులు ప్రశ్నించగా, సమావేశానికి వచ్చిన వారంతా కృష్ణయ్య సీఎం అని నినాదాలు చేయగా, కృష్ణయ్య మాత్రం బీసీ అభ్యర్థి సీఎం కావాలని చెప్పారు. టీడీపీలో ఎప్పుడు చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది అందరితో సంప్రదించిన తరువాత వెల్లడిస్తానని ప్రకటించారు. రెండు రోజుల్లో రాజకీయరంగ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జు కృష్ణ, హన్మంతరావు, టీడీపీ కార్పొరేటర్ చంద్రమౌళి, చక్రదారి యాదవ్, నరేందర్ రావు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నవసమాజమే బీసీ ఉద్యమ లక్ష్యం: కృష్ణయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడి నవసమాజాన్ని నిర్మించడమే బీసీ ఉద్య మ లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు నేతృత్వంలో ఆదివారమిక్కడ నిర్వహించిన సభలో కృష్ణయ్య మాట్లాడారు. ‘‘దొరల ఆహంకారం అణచాలంటే బీసీలంతా ఐక్యతతో రాజ్యాధికారం దక్కించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, అన్ని పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని, లేకుంటే ఆయా పార్టీలను రాను న్న ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. ‘బీసీ సీఎం’పై వైఖరి చెప్పాలి రాష్ట్రం లోని 4.5 కోట్ల మంది బీసీల ప్రగాఢ ఆకాంక్ష అయిన ‘బీసీ ముఖ్యమంత్రి’ పదవి అగ్రకుల పార్టీల అణచివేత కారణంగా వారికి ఇంతవరకు దక్కకుండా పోయిందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘బీసీ సీఎం’ అంశంపై కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు వారం రోజుల్లోగా విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ భవన్లో జరిగిన 26 కుల సంఘాలు, 15 బీసీ సంఘాల రాజకీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బీసీలకు 50శాతం సీట్లు కేటాయించాలి: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50శాతం సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీ బిళ్లును ప్రవేశపెట్టాలని, రాజకీయ పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని కోరారు. సోమవారం సచివాలయంలో కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని పార్టీలన్నీ బీసీలకు 150 శాసనసభ, 22 పార్లమెంటు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించాలన్నారు. యూపీఏ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, పదేళ్ల పాలనలో జాతీయ బీసీ కమిషన్‌కు ఒక్క రాజ్యాంగ హక్కు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. దేశ జనాభాలో 54శాతం ఉన్న బీసీలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం 7శాతం మాత్రమే ఉన్నారని, 60 ఏళ్ల స్వాతంత్య్రంలో బీసీలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిళ్లును ప్రవేశపెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలకు టికెట్లు ఆమ్ముకునే పార్టీలకు తగిన బుద్ధిచెప్తామన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ఈనెల 31 సమావేశం ఏర్పాటు చేయనున్నామని, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం పాల్గొనాలని కృష్ణయ్య ఆహ్వానించారు. -
ఆత్మగౌరవం..అధికారం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : ఆత్మగౌరవం.. రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలంతా ఒక్కటై ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందంటూ బీసీ డిక్లరేషన్ చాటిచెప్పింది. 2014 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా రాజ్యాధికారంలో బీసీలు తమ భాగస్వామ్యాన్ని దక్కించుకునేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగాలంటూ తేల్చిచెప్పింది. విప్లవాల పురిటిగడ్డగా ఖ్యాతిగాంచిన ఓరుగల్లు.. బీసీ డిక్లరేషన్‌ను దేశం ముందుంచింది. అన్ని రంగాల్లోనూ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై వివిధ రంగాల్లోని నిపుణులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు చర్చించి ఈ డిక్లరేషన్ రూపొందించారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ఈ డిక్లరేషన్‌ను వెల్లడించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ అభివృద్ధే ఎజెండాగా.. బీసీల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధే ఎజెండాగా డిక్లరేషన్‌ను ప్రతిపాదించారు. సభకు హాజరైన రాజకీయ పక్షాల నేతలు దేవేందర్‌గౌడ్, కె.కేశవరావు, మధుయాష్కీ, ఈటెల రాజేందర్, గుండు సుధారాణి, దాస్యం వినయభాస్కర్, మొలుగూరి భిక్షపతి, బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగంగౌడ్, పూల రవీందర్ డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు. కాంగ్రెస్, టీ డీపీ, టీఆర్ఎస్, బీజేపీ తదితర రాజకీయ పక్షాలకు చెందిన బీసీ నేతలు ఈ ఆత్మగౌరవ సభ సాక్షిగా ఒక్కటిగా నిలిచారు. అన్ని రంగాల్లోనూ నిర్లక్ష్యం డిక్లరే షన్ అవసరం, ఆవశ్యకత గురించి అకాడమీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్(ఏబీసీడీఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీమనోహర్ క్లుప్తంగా వివరించారు. రాజ్యంగంలో పొందుపరిచిన హక్కులు, ప్రణాళిక సంఘం రూపొందించిన నిబంధనల మేరకు జిల్లా, రాష్ట్రం, దేశం సరాసరి ఆదాయాల ప్రాతిపదికన గణాంకాల ఆధారంగా ఈ డిక్లరేషన్‌ను రూపొందించినట్లు వివరించారు. జనాభాలో 56శాతంగా ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో కనీస భాగస్వామ్యం లేక పోవడం బాధాకరమన్నారు. వీరి అభివృద్ధికి కాలేల్కర్, మండల్ తదితర కమిషన్లు వేసినప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. పార్టీలు, ప్రభుత్వాలు ఈ డిక్లరేషన్‌ను హెచ్చరికగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. 144 కులాలున్నప్పటికీ జనాభా దామాషా ప్రకారం ఏ రంగంలోనూ సముచిత స్థానం దక్కలేదన్నారు. రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. వనరుల పునఃపంపిణీ, సమన్యాయం, హక్కులు, స్వేచ్ఛ, నిర్ణయాధికారం, భాగస్వామ్యం, సాధికారత లభించాల్సి ఉందన్నారు. దీన్ని సాధించేందుకు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కుల సంఘాల భారీ ర్యాలీ సభ ప్రారంభానికి ముందు జిల్లావ్యాప్తంగా బీసీ కుల సంఘాలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నేత, గీత, వడ్డెర, స్వర్ణకార, కమ్మరి, వడ్రంగి, పద్మశాలి, మేదరి, రజక, కటిక, కాపు, పెరిక సంఘాలతో పాటు వ్యవసాయ మార్కెట్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి పొన్నాల, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే వినయ్ పాల్గొన్నారు. సభలో ప్రొఫెసర్లు వి.రవీందర్, పి.నరేందర్, డాక్టర్ బండాప్రకాష్, డాక్టర్ సంగని మల్లేశ్వర్, తిరునహరి శేషు, కోలా జనార్దన్‌గౌడ్, చింతం ప్రవీణ్, దిడ్డి కుమారస్వామి, పులిసారంగపాణి, ప్రభంజన్‌యాదవ్, బీఎస్ రాములుతో పాటు కుల, ప్రజా సంఘాల నాయకులు చొల్లే టి కృష్ణమాచారి, తాళ్ల సంపత్‌కుమార్, బి.యాదగిరి, చిర్రరాజు, మిర్యాల్‌కార్ దేవేందర్, ప్రతాపగిరి రాజయ్య, పి.అశోక్, జి. రాంచందర్, ఓదెల చందర్రావు, పి.సాంబరాజు, బి.రామకృష్ణ, గుండు ప్రభాకర్, విజయ్‌కుమార్, జంగయ్య, పాక ఓంప్రకాష్, మిరిదొడ్డి శ్రీధర్, నర్సయ్య, కేదారి యాదవ్, నరేందర్, గట్టయ్య, కె.రవి, ులసంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి మీకు రాజ్యసభలో ఏ పదవి కావలని ప్రధాని మన్మోహన్సింగ్ నన్ను అడిగితే బీసీలకు సంబంధించిన కమిటీలో సభ్యత్వం కావాలని చెప్పా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల శాతం ఏడుశాతమే. 27శాతం రిజర్వేషన్లు ఉంటే ఏడుశాతం ఉద్యోగాల్లో మాత్రమేబీసీలున్నారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తే ఆయన మౌనం వహించారు. బీసీల్లో ఉన్నత విద్య అభ్యసించాల్సిన వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 67ఏళ్లకు తిండికోసం బిల్లు పెట్టడం అసమర్థ నాయకత్వానికి నిదర్శనం. బలహీనవర్గాల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగువేలమంది చనిపోతే అందులో బీసీలే అధికం. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో బీసీలు త్యాగాలు చేస్తుంటే నాయకత్వం మాత్రం అగ్రకులాల చేతుల్లో ఉంది. ఇక త్యాగాలు చేయాలో.. నాయకత్వం వహించాలో బీసీ నాయకులే తేల్చుకోవాలి. ప్రపంచీకరణతో కులవృత్తులు సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. ఇవి మరుగున పడకుండా ఉండేందుకు ఏం చేయాలో ప్రొఫెసర్లు ఆలోచించాలి. దేశంలో అపార వనరులున్నా.. కష్టజీవు ఆకలిచావులకు కారణం ఏమిటో గమనించాలి. బీసీలకు.. టీడీపీ వంద సీట్లు ఇస్తామని ప్రకటించింది. వారు రాజకీయంగా ఎదగడానికి స్థానికసంస్థల్లో ఎన్టీ రామారావు రిజర్వేషన్లు కల్పించారన్నారు. బీసీ కార్పొరేషన్‌కు పదివేలకోట్ల రూపాయలు కేటాయిస్తామని టీడీపీ ప్రకటించింది. రాజ్యాధికారం కోసం బీసీలంతా ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. - టి.దేవేందర్‌గౌడ్, రాజ్యసభ ప్లోర్ లీడర్