సాక్షి, సంతమాగులూరు: తెలుగుదేశం పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయి. తమ సమస్యలపై బీసీలు ఎన్ని పోరాటాలు చేసినా వారి గోడు వినిపించుకోలేదు. ఈ క్రమంలో జగన్‌మోహనరెడ్డి బీసీ గర్జనలో తమ కోసం ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం ఇంతలా ఆలోచిస్తున్న జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు కృత నిశ్చయంతో ఉన్నారు.
బీసీ డిక్లరేషన్‌లో జగన్ హామీలు.
- వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని జగన్‌మోహనరెడ్డి హామీ ఇచ్చారు.
- ఆంధ్రప్రదేశ్‌లోని 31 బీసీ కులాలు కేంద్రం పరిధిలోని ఓబీసీ జాబితాలో చేర్చడానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
- ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం కొలువులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించడంతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
జగన్ వస్తే అన్ని వర్గాలకు ప్రయోజనం
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుంది. జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ వల్ల నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అందుబాటులోకి వస్తుంది. నవరత్నాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది.
ఎస్.హేమంత్, మేదరమెట్ల.
రాజకీయ ఎదుగుదలకు అవకాశం
సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగిన గుర్తింపు లభించడం లేదు. నామినేటెడ్ పోస్టుల్లో సరైన పదవులు అందకుండాపోతున్నాయి. జగనన్న ముఖ్యమంత్రి అయితే నామినేటేడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం మంచి పిరమాణం. మేము కూడా రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించారు. జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడం మన అందరి బాధ్యత.
కొడవళ్ళ హరిబాబు, తూర్పు కొప్పెరపాడు
ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి
నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిండం వల్ల ఆయా వర్గాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందని నమ్ముతున్నాం. బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 50 శాతం చట్టసభల్లో అవకాశ మంచి పరిణామం. జగనన్న వస్తేనే బీసీ, ఎస్టీ,ఎస్టీ మైనారిటీలకు మంచి ఫలితాలు అందుతాయి.
రామాంజనేయులు, అంబడిపూడి
వైఎస్సార్ సీపీతో బీసీలకు న్యాయం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. జగన్ ప్రకటించిన బీసీ సంక్షేమం పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో పాటుగా బీసీ సంక్షేమం కోసం ఏటా రూ.25 వేల కోట్లు మంజూరు చేస్తాననడం ఎంతో ఆనందంగా ఉంది. బీసీలు అందరూ వైఎస్సార్ సీపీ వెంటే ఉంటారు.
ఎం.రామకృష్ణ, మేదరమెట్ల
Comments
Please login to add a commentAdd a comment